యుఏఈ గోల్డెన్ వీసాలకు మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్‌లు ఎంపికయ్యారు. యూఏఈ గోల్డెన్ వీసా ప్రకటించినట్లు స్వయంగా మోహలాల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. యుఏఈ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటులకు గౌరవప్రదమైన గుర్తింపును ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, సంజయ్ దత్‌లకు ఈ వీసాను ఇచ్చిన సంగతి తెలిసిందే.
గోల్డెన్ వీసా, 2019 లో యుఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ వీసా ద్వారా అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకోవచ్చు. అంతేగాక ఎలాంటి జాతీయ స్పాన్సర్స్ లేకుండానే 10 సంవత్సరాల పాటు అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. ఈ వీసా గడువు పూర్తి కాగానే ఆటోమెటిక్‌గా రెన్యూవల్ అవుతుంది. ఇప్పటికే ఈ వీసా మోహాన్ లాల్ అందుకోగానే త్వరలోనే మమ్ముట్టి యూఏఈలో తీసుకోనున్నారు.
My grateful thanks to H E Mohamed Ali Al Shorafa Al Hammadi for bestowing upon me the Golden Visa for the UAE. Am indeed honoured. My gratitude also goes out to Mr @Yusuffali_MA for facilitating this.@AbuDhabiDED pic.twitter.com/Wo5Jd8AaJX
— Mohanlal (@Mohanlal) August 23, 2021
Comments
Please login to add a commentAdd a comment