Golden Visa
-
‘గోల్డెన్ వీసా’ నిబంధనలు!
విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఇండోనేషియా ప్రత్యేక వీసా ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ‘గోల్డెన్ వీసా’ను అందుకోవాలంటే ఇన్వెస్టర్లు కనీసం 3,50,000 డాలర్ల(రూ.2.9 కోట్లు) నుంచి 50 మిలియన్ డాలర్లు(రూ.410 కోట్లు) వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నిబంధనలను అనుసరించి ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు ఈ వీసా చెల్లుబాటు అవుతుందని ఇండోనేషియా ప్రభుత్వం పేర్కొంది.ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న ఇండోనేషియా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఐదేళ్లు, పదేళ్ల కాలపరిమితికిగాను ‘గోల్డెన్ వీసా’లను ప్రవేశపెట్టింది. ఐదేళ్ల వీసా పొందడానికి వ్యక్తిగత పెట్టుబడిదారులు ఆ దేశంలో కనీసం 2.5 మిలియన్ డాలర్ల(రూ.20 కోట్లు)తో కంపెనీని స్థాపించాలి. పదేళ్ల వీసా కోసం 5 మిలియన్ డాలర్లతో(రూ.40 కోట్లు) సంస్థ ప్రారంభించాలి. కంపెనీ స్థాపించడానికి ఆసక్తి లేని వారు ఐదేళ్ల కోసం 3,50,000 డాలర్లు(రూ.2.9 కోట్లు), పదేళ్లకోసం రూ.5.8 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. ఈ నిధులను ఇండోనేషియా ప్రభుత్వ బాండ్లు, పబ్లిక్ కంపెనీ స్టాక్‌లు లేదా డిపాజిట్‌ల్లో పెట్టుబడి పెట్టాలి.కార్పొరేట్ ఇన్వెస్టర్లు మాత్రం ఐదు సంవత్సరాల వీసా పొందేందుకు 25 మిలియన్ డాలర్లు(రూ.205 కోట్లు), పదేళ్ల కోసం 50 మిలియన్ డాలర్ల(రూ.410 కోట్లు) పెట్టుబడి పెట్టాలి. ఇదే తరహా వీసా పథకాలను గతంలో కెనడా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాలు అందించాయి. కానీ ఈ పథకాలు సమర్థవంతంగా ఉద్యోగాలను సృష్టించలేవని, ఊహాజనిత ప్రయోజనాల కోసం మాత్రమే ఉంటాయని ఆయా దేశాలు నిర్ధారించాయి.ఇదీ చదవండి: భారమవుతున్న విద్యారుణాలు!ఇండోనేషియా ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి గత సంవత్సరం ట్రయల్ దశ ప్రారంభించింది. దాదాపు 300 మంది దరఖాస్తుదారులకు గోల్డెన్ వీసాలు మంజూరు చేసింది. దీని ద్వారా 123 మిలియన్ డాలర్ల(రూ.1,029 కోట్లు) పెట్టుబడులు సమకూరాయి. ఇండోనేషియా సంతతికి చెందిన విదేశీ పౌరులకు ప్రత్యేక హోదాను మంజూరు చేయాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆ దేశంలో పెట్టుబడి పెట్టాలనుకునే భారత్‌లోని కార్పొరేట్లు ఈ పథకాన్ని పరిశీలించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. భారత్‌లోనూ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్యక్రమం అమలులో ఉంది. దీని ప్రకారం భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు ఇండియాలో తాత్కాలికంగా నివసించడానికి, స్థానికంగా పని చేయడానికి, ప్రయాణించడానికి అనుమతులున్నాయి. -
మంచు విష్ణుకు గోల్డెన్ వీసా
టాలీవుడ్ హీరో మంచు విష్ణు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసా అందకున్నారు. కళలు, క్రియేటివిటీ పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ (దుబాయ్) ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంది. దీని ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు లేకుడా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు వీలు కలుగుతుంది.ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ యూఏఈ గోల్డెన్ విసా అందుకున్నారు. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్‌లో మంచు విష్ణు చేరారు. 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందిన రజనీకాంత్, షారుక్ ఖాన్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్, సునీల్ దత్, సంజయ్ దత్,మోనీ రాయ్,బోనీ కపూర్, మమ్ముట్టి, టొవినో థామస్ వంటి స్టార్స్‌కు ఈ వీసా లభించింది.2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు యూఏఈ ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనానికి ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసాకు 10, 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్ అవుతుంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. -
మెగాస్టార్ చిరంజీవికి గోల్డెన్ వీసా
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసాను అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్‌లో చిరంజీవి చేరారు. గోల్డెన్ వీసా అంటే..విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన విదేశీ పౌరులకు యూఏఈ ప్రభుత్వం జారీ చేసేదే గోల్డెన్ వీసా. దీన్ని గరిష్టంగా పదేళ్ల కాలపరిమితికి అందిస్తారు. గోల్డెన్ వీసా వల్ల యూఏఈలో దీర్ఘకాల నివాసానికి వీలవుతుంది. వందశాతం ఓనర్‌షిప్‌తో సొంతంగా వ్యాపారాలు చేసుకోవడం సాధ్యమవుతుంది. -
చిరంజీవికి అరుదైన గౌరవం.. మెగా కోడలు తర్వాత!
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. చిరుకు దుబాయ్ ప్రభుత్వం ఆయనకు గోల్డెన్ వీసాను అందించింది. ఇప్పటికే వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తోంది. ఈ వీసాతో దుబాయ్‌లో పదేళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా నివాసం ఉండేందుకు అనమతి లభిస్తుంది. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాలు అందిస్తోంది.అయితే ఇప్పటికే ఈ వీసా అందుకున్న వారిలో తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి అగ్రహీరోలు కూడా ఉన్నారు. తాజాగా మెగాస్టార్ సైతం వారి సరసన చేరనున్నారు. అయితే మెగాస్టార్ కంటే ముందే మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. చిరుకంటే ముందుగా రామ్ చరణ్ భార్య, ఆయన కోడలు ఉపాసన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గోల్డెన్ వీసాను అందుకున్నారు. తాజాగా ఈ వీసాను చిరంజీవికి ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార్ ఫేమ్, వశిష్ట డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. Megastar @KChiruTweets has been awarded the Golden Visa by the UAE (Dubai) government, facilitated by Emirates First!✨#Chiranjeevi #Vishwambhara #TeluguFilmNagar pic.twitter.com/ND4DOVrvDk— Telugu FilmNagar (@telugufilmnagar) May 27, 2024 -
రజనీకాంత్‌కు గోల్డెన్ వీసా.. స్నేహితుడి వల్లే ఈ గౌరవం దక్కిందంటూ..
సౌత్ ఇండియా స్టార్ హీరో రజనీకాంత్‌కు మరో గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం వివిధ రంగాల్లో పేరు పొందిన వారిని సత్కరించేందుకు గోల్డెన్ వీసాను అందిస్తోంది. భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. తాజాగా ఆ జాబితాలో రజనీకాంత్ చేరారు. యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా 10 ఏళ్ల కాలపరిమితో ఉంటుంది.2019లో యూఏఈ ప్రభుత్వం ఈ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ వీసాను చాలామంది భారతీయ ప్రముఖలకు యూఏఈ అందించి గౌరవించింది. ఇప్పుడు రజనీకాంత్‌ను కూడా ఆ ప్రభుత్వం గోల్డెన్ వీసాతో గౌరవించింది. వీసా పొందిన అనంతరం ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వేట్టైయాన్ సినిమాలో నటిస్తున్న రజనీకాంత్ వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లారు. ఈ సందర్భంగా అబుదాబిలో జరిగిన ఓ కార్యక్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆయనకు ఈ గోల్డెన్ వీసాను అందించడం విశేషం. ఈ సందర్భంగా రజనీకాంత్ తనకు గోల్డెన్ వీసా మంజూరు చేసినందుకు దుబాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. యూఏఈ ప్రభుత్వంతో పాటు తన స్నేహితుడు లులూ గ్రూప్ అధినేత యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వల్లే ఇది సాధ్యమైనట్లు రజనీ తెలిపారు. పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, నటులు వంటి వారికి గోల్డెన్ వీసా ఇస్తారు. 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఈ వీసా పొందిని వారందరూ పూర్తి ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు.ఇప్పటికే గోల్డెన్ వీసా పొందిన ప్రముఖులుభారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్న జాబితా ఇదే.. షారుక్ ఖాన్, అల్లు అర్జున్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్, సంజయ్ దత్,ఊర్వశి రౌతేలా, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్, మమ్ముట్టి,మీరా జాస్మిన్, టొవినో థామస్,విజయ్ సేతుపతి,కమల్ హాసన్, విక్రమ్, యువన్ శంకర్ రాజా,టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, సునీల్ షెట్టి, బోనీ కపూర్ ఫ్యామిలీ ఈ జాబితాలో ఉన్నారు.Thalaivar #Rajinikanth receives THE Golden Visa from the UAE (DUBAI) govt, through chairman and MD of LULU group. Benefits:* He can own a property. * He can visit any time. * He can reside for 10 years. * Can sponsor family members & even domestic staff. And many more 🔥 pic.twitter.com/2y8F6k3yvJ— Rana Ashish Mahesh (@RanaAshish25) May 23, 2024 -
ఆస్ట్రేలియా గోల్డెన్ వీసా రద్దు!
ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా అక్కడి ప్రభుత్వ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే అందులో భాగంగా విదేశీయులు అక్కడ పెట్టుబడి పెట్టేందుకు వీలుగా, అక్కడే కొన్ని రోజులు నివసించేందుకు అనువుగా జారీచేస్తున్న ‘గోల్డెన్ వీసా ’లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ వీసా ప్రోగ్రామ్ ఆశించిన ఫలితాలను ఇవ్వట్లేదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఈ వీసాల స్థానంలో వృత్తి నిపుణులకు ఇచ్చే వీసాలను పెంచనున్నట్లు పేర్కొంది. గోల్డెన్ వీసా నిబంధనల ప్రకారం కనీసం రూ.27 కోట్లు పెట్టుబడి పెట్టేవారు ఐదేళ్ల పాటు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 2012లో ఈ నిబంధనను తీసుకొచ్చింది. హోంశాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దాదాపు లక్ష మంది ఈ ప్రోగ్రామ్ కింద ఆసీస్‌లో ఉండేలా అవకాశం సంపాదించారు. ఇందులో 85శాతం చైనా మిలియనీర్లు ఉన్నారు. ఇదీ చదవండి: ఎగిరిన కొత్త ఫ్లైట్.. దేశంలోనే తొలిసారి! కొంతకాలంగా ఈ ప్రోగ్రామ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీసా ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేసి కొందరు విదేశీయులు అక్రమ సంపదను తరలిస్తున్నారనే వాదనలున్నాయి. దీంతో వీటి జారీని రద్దు చేస్తున్నట్లు హోంమంత్రి క్లేర్ ఓ నీల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. వీటి స్థానంలో వృత్తి నిపుణులకు మరిన్ని ఎక్కువ వీసాలు జారీ చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించనుందని తెలిపారు. ఇప్పటికే కెనడా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాలు కూడా ఈ తరహా వీసా స్కీమ్‌లను రద్దు చేశాయి. -
అల్లు అర్జున్‌కు దుబాయ్ ప్రభుత్వం అరుదైన గౌరవం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు దుబాయ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. ప్రసిద్ది చెందిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) గోల్డెన్ వీసా తాజాగా బన్నీ అందుకున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ షేర్ చేశారు. కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే యూఏఈ గోల్డెన్ వీసాను అందుకున్న టాలీవుడ్ తొలి హీరోగా అల్లు అర్జున్ నిలవడం విశేషం. ఈ మేరకు బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశారు. దుబాయ్ దేశం ఫొటోను షేర్ చేస్తూ.. ‘నాకు ఎన్నో అనుభూతులు పంచిన దుబాయ్‌కి థాంక్స్. త్వరలోనే మళ్లీ కలుద్దామ’ అంటూ పోస్ట్ చేశాడు. చదవండి: మైల్స్టోన్ దిశగా హీరో ధనుష్.. 50వ సినిమా ఫిక్స్ కాగా ఇప్పటికే ఈ వీసాను కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, నటి కాజల్ అగర్వాల్, అమలా పాల్, ఖుష్బు సుందర్, త్రిష, బాలీవుడ్ బాద్షా షారుక్, సోనూసూద్, తమిళ హీరో విక్రమ్‌తో పాటు తదితర నటీనటులు అందుకున్నారు. అంతేకాదు మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఈ వీసా అందుకున్నారు. కాగా వివిధ రంగాల్లో అంటే కళలు, క్రియేటివిటీ పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ (దుబాయ్) ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంది. దీని ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు లేకుడా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు వీలు కలుగుతుంది. 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తుందీ యూఏఈ ప్రభుత్వం. చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
విక్రమ్‌కు అరుదైన గౌరవం, పూర్ణ భర్త చేతుల మీదుగా ‘చియాన్’కు గోల్డెన్ వీసా
స్టార్ హీరో చియాన్ విక్రమ్ అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్ ప్రభుత్వం తాజాగా ఆయన గోల్డెన్ వీసా ఇచ్చింది. ఈ విషయాన్ని నటి పూర్ణ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్తతో కలిసి పూర్ణ విక్రమ్ దుబాయ్ గోల్డెన్ వీసా అందిస్తున్న ఫొటోను ఈ సందర్భంగా ఆమె షేర్ చేసింది. కాగా గతంలో కూడా పలువురు భారతీయ నటీనటులకు దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసా ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: అప్పటి వరకు అల్లు శిరీష్ ఎవరో కూడా తెలియదు: అను ఇమ్మాన్యుయేల్ మోహన్ లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్, షారుక్ ఖాన్, నటి త్రిష, కాజల్ అగర్వాల్‌తో పాటు తదితర స్టార్ నటులకు ఈ వీసా అందింది. తాజాగా ఈ జాబితాలో విక్రమ్ కూడా చేరటం విశేషం. ఇదిలా ఉంటే నటి పూర్ణ అలియాస్ షమ్మా ఖాసీమ్ ఆమె భర్త షానిద్ ఆసీఫ్ చేతుల మీదుగా విక్రమ్కుగోల్డెన్ వీసా ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. దీంతో దీనిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్ణ భర్త చొరవతోనే విక్రమ్‌కు గోల్డెన్ వీసా వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: అలా లెక్కలేసుకుని నేను ఇండస్ట్రీకి రాలేదు: అనుష్క శెట్టి పూర్ణ భర్త షానిద్ ఆసీఫ్ అలీ యూఏఈలో బడా వ్యాపారస్తుల్లో ఒకరనే విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఆయన పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. అయితే షానీద్ తన కంపెనీ ద్వారా విక్రమ్‌కి గోల్డెన్ వీసా వచ్చేలా చేశాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా సినీ, సాహిత్యం, విద్య, కల్చర్ ఇతర రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు అందిస్తుంది. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆరబ్ దేశాల్లో ఎలాంటి పరిమితులు లేకుండా నివసించవొచ్చు. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తూ వస్తుంది. View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
అక్కడ ఐటీ ఎంప్లాయిస్ కి గోల్డెన్ వీసా... ఇంకెన్నో ఫేసిలిటీస్
-
ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. అక్కడ జీతంతో పాటు బెనిఫిట్స్ వింటే షాక్ అవుతారు!
దుబాయ్ అంటే అధికంగా క్రూడ్ ఆయిల్‌పై ఆధారపడే దేశంగా ఉండేది ఒకప్పుడు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచంతో పోటీ పడాలంటే ఇతర రంగాలలోనూ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. అందుకే గత కొనేళ్లుగా ఆయిల్‌తో పాటు ఇతర వ్యాపార రంగాలలోనూ పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈ జాబితాలో యూఏఈ కాస్త ముందు వరుసలో ఉందనే చెప్పాలి. ఇప్పటికే ఫార్మా నుంచి ఇన్వెస్ట్మెంట్ కంపెనీల వరకు వివిధ రంగాల కంపెనీలను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సారి కన్ను ఐటీ రంగంపై కూడా పడింది. ఐటీ రంగంపై కన్న పడింది! ఇందుకోసం సరికొత్త ప్లాన్‌తో ఐటీ కంపెనీలకు ఆఫర్లను ప్రకటించింది. యూఏఈ తెలిపిన ప్రకారం.. తమ దేశంలో అడుగుపెట్టే కంపెనీలకు వేగంగా వ్యాపార లైసెన్స్‌లతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్‌కు సంబంధించి కూడా సులభమైన రీతిలో పనులు పూర్తి కానున్నాయి. అంతేకాకుండా అందులో పని చేసే ఉద్యోగులకు దీర్ఘకాలిక పౌరసత్వాన్ని కూడా అందించనుంది. దీని ద్వారా ఆసియా, యూరప్‌లోని టెక్ కంపెనీలను ఆకర్షించాలని యోచిస్తోంది. ఆ కంపెనీలోని ఉద్యోగులకు 10 ఏళ్ల పాటు గోల్డెన్ వీసా, ఉండటానికి స్థలం, పిల్లలకు పాఠశాల వంటి సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. దీనిపై యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి థానీ అల్ జెయోడీ మాట్లాడుతూ.. జూలైలో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా గల్ఫ్ దేశం 300 కంటే ఎక్కువ డిజిటల్ సంస్థలను లక్ష్యంగా పెట్టుకుందని, దాదాపు 40 కంపెనీలు తరలింపు ప్రక్రియలో ఉన్నాయన్నారు. ఇప్పటికే బ్యాంకర్లు, హెడ్జ్ ఫండ్ మేనేజర్లు, కమోడిటీ వ్యాపారులకు అనువైన ప్రదేశంగా యూఏఈ పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. చదవండి: మైండ్‌బ్లోయింగ్ ఐడియా.. మట్టి లేకుండా వ్యవసాయం, ఏడాదికి 70 లక్షల ఆదాయం! -
సోనూసూద్‌కు దుబాయ్ నుంచి అరుదైన గౌరవం..
Actor Sonu Sood Receives UAE Golden Visa: సోనూసూద్.. రీల్ విలన్ నుంచి రియల్ లైఫ్ హీరోగా మారాడు. సోనూసూద్ అంటే లాక్డౌన్ ముందు వరకు విలన్‌గానే అందరికీ తెలుసు, కానీ లాక్డౌన్ తర్వాత సీన్ మారింది. నిరుపేదలకు బాసటగా నిలుస్తూ, కార్మికులకు కొండంత అండగా పేద ప్రజల పాలిట పెన్నిధిగా మారి యువతకు రియల్ హీరో అయ్యాడీ రీల్ విలన్. అతడు చేసే సేవా కార్యక్రమాలకు యావత్ దేశం ఫిదా అయింది. 'ప్రభుత్వాలు చేయలేని సాయాన్ని మీరు చేశారంటూ' సోనూను ప్రతి ఒక్కరూ కొనియాడారు. చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్ తాజాగా ఆయన దుబాయ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాతకమైన గౌరవాన్ని అందుకున్నాడు. సోనూసూద్ అహర్నిశలు శ్రమిస్తూ చేసిన సమాజ సేవకు గౌరవార్థవంగా 'యూఏఈ గోల్డెన్ వీసా'ను అందించింది. ఈ దుబాయ్ గోల్డెన్ వీసాను అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు సోనూసూద్. ఇంకా నేను ఈ గోల్డెన్ వీసాను అందుకోవడం చాలా గౌరవంగా ఉంది. నేను సందర్శించేందుకు ఇష్టపడే ప్రదేశాల్లో దుబాయ్ ఒకటి. ఇది అభివృద్ధి చేందడానికి అత్యద్భుతమైన చోటు. నేను అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అని సోనూసూద్ పేర్కొన్నాడు. చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న హాట్ బ్యూటీ.. -
గోల్డెన్ వీసా అందుకున్న హాట్ బ్యూటీ..
Heroine Andrea Jeremiah Receives UAE Golden Visa: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గోల్డెన్ వీసా పొందింది తమిళ హాట్ బ్యూటీ ఆండ్రియా. తమిళ సినీ ఇండస్ట్రీలో బోల్డ్ పాత్రల్లో అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కార్తీ నటించిన 'యుగానికి ఒక్కడు', లోకనాయకుడు కమల్ హాసన్ యాక్ట్ చేసిన 'విశ్వరూపం' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఈ అమ్మడు. ప్రస్తుతం పిశాచి 2 సినిమాలో నటిస్తోంది ఆండ్రియా. ఈ మూవీకి మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే భారతీయ సినీ తారలకు దుబాయ్ ప్రభుత్వం ఈ వీసాను అందజేస్తోంది. తాజాగా ఈ జాబితాలో చేరింది ఆండ్రియా జెరెమియా. ఈ సంధర్భంగా యూఏఈ ప్రభుత్వానికి ఆండ్రియా ధన్యవాదాలు తెలిపింది. చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్ 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలతో సత్కరిస్తోంది దుబాయ్ ప్రభుత్వం. ఈ వీసాను అందుకున్న వారికి పదేళ్ల పాటు దుబాయ్ పౌరసత్వం ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్ అవుతుంది. ఇటీవలే ఈ గోల్డెన్ వీసాను సీనియర్ నటి మీనా అందుకున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ వీసాను పొందగా.. టాలీవుడ్ నుంచి మెగా కోడలు ఉపాసన అందుకుంది. యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాద్ షా షారుఖ్ ఖాన్ దక్కించుకున్నాడు. తర్వాత బాలీవుడ్లో సంజయ్ దత్, సునీల్ శెట్టి, సింగర్స్ సోనూ నిగమ్, నెహా కక్కర్, బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్, ఫరా ఖాన్, దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో పాటు బోనీ కపూర్ కుటుంబం ఈ వీసా పొందింది. చదవండి: దుబాయ్ గోల్డెన్ వీసా అంటే ఏంటీ ?.. ఎందుకిస్తారు ? -
గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్
Senior Actress Meena Receives UAE Golden Visa: ఈ మధ్య కాలంలో సినీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇచ్చే గోల్డెన్ వీసాలను అందుకుంటున్నారు. 2019 నుంచి ఈ వీసాలతో సత్కరిస్తోంది దుబాయ్ ప్రభుత్వం. ఈ వీసాను అందుకున్న వారికి పదేళ్ల పాటు దుబాయ్ పౌరసత్వం ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్ అవుతుంది. ఈ అరుదైన గౌరవాన్ని తాజాగా సీనియర్ హీరోయిన్, నటి మీనాకు దక్కింది. ఈ వీసాను స్వీకరించిన మీనా దుబాయ్‌లో జరుగుతున్న ఎక్స్ఫోలో పాల్గొన్నారు. తనకు గోల్డెన్ వీసాను యూఏఈ ప్రదానం చేయడం పట్ల మీనా సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలాగే అరబ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ వీసాను పొందగా.. టాలీవుడ్ నుంచి మెగా కోడలు ఉపాసన అందుకుంది. యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాద్ షా షారుఖ్ ఖాన్ దక్కించుకున్నాడు. తర్వాత బాలీవుడ్లో సంజయ్ దత్, సునీల్ శెట్టి, సింగర్స్ సోనూ నిగమ్, నెహా కక్కర్, బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్, ఫరా ఖాన్, దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో పాటు బోనీ కపూర్ కుటుంబం ఈ వీసా పొందింది. ఈ వీసాను సాధించిన హీరోయిన్ త్రిష.. తొలి తమిళ కథానాయికగా అవతరించింది. తర్వాత అమలా పాల్‌ను కూడా గోల్డెన్ వీసా వరించింది. వీరితో పాటు మలయాళ ఇండస్ట్రీ నుంచి మొదటగా మోహన్ లాల్ తర్వాత మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ కూడా ఈ వీసాను పొందారు. -
అరుదైన గౌరవం అందుకున్న కాజల్, గర్వంగా ఉందంటూ పోస్ట్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు అరుదైన గౌరవం లభించింది. కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే యూఏఈ గోల్డెన్ వీసాను తాజాగా ఈ ‘చందమామ’ అందుకుందీ. ఈ విషయాన్ని కాజల్ సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. ‘యూఏఈ గోల్డెన్ వీసా లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మనలాంటి కళాకారులకు ఈ అరబ్ దేశం ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తోంది. నాకు ఈ గుర్తింపు ఇచ్చిన యూఏఈ మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు. భవిష్యత్‌లో కూడా మీ సహాయ సహకారాలు కొనసాగాలని కోరుకుంటున్నాను’ అంటూ కాజల్ ఆనందం వ్యక్తం చేసింది. చదవండి: టాలీవుడ్ ప్రముఖుల మధ్య కోల్డ్‌వార్, వరస ట్వీట్స్‌తో మాటల యుద్ధం.. కాగా ఈ గోల్డెన్ విసాను పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్య సంపద తదితర రంగాల్లో సేవలందిస్తున్న వారికి దుబాయ్ ప్రభుత్వం అందిస్తోంది. ఈ వీసాతో ఆ దేశంలో ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా నివాసం, వ్యాపారం చేసుకోవచ్చు. ఈ గోల్డెన్ వీసాను సినీ రంగంలో నుంచి తొలిసారిగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అందుకున్నాడు. ఆ తర్వాత సంజయ్ దత్, బోనీ కపూర్ ఫ్యామిలీ, సునీల్ శెట్టి, సోనూ నిగమ్, నేహా కక్కర్, మౌనీ రాయ్ తదితరులు పొందారు. ఇక దక్షిణాదిలో మోహన్ లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్ ఈ వీసాను అందుకున్నారు. ఇటీవల మెగా కోడలు ఉపాసన కూడా ఈ గౌరవం దక్కించుకుంది. Happy to have received UAE’s Golden visa. This country has always been such huge encouragement for artists like us. Grateful and looking forward to future collaborations in the UAE. Big thank you to Mr Muhammed Shanid of Juma Almheiri, Suresh Punnasseril and Naressh Krishna pic.twitter.com/XDuuO4boPG — Kajal Aggarwal (@MsKajalAggarwal) February 3, 2022 -
నటి అమలాపాల్‌కు అరుదైన గౌరవం..
Amala Paul Get Golden Visa: నటి అమలాపాల్ దుబాయ్ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు అని చెప్పవచ్చు. ఇటీవల ఈమె హవా కాస్త తగ్గింది. అయితే వెబ్ సిరీస్‌లతో బిజీగానే ఉన్నారు. కాగా, తాజాగా దుబాయ్ ప్రభుత్వం అమలాపాల్‌కు గోల్డెన్ వీసాను ఇవ్వడం విశేషం. దీని గురించి ఆమె పేర్కొంటూ ఇలాంటి అరుదైన గౌరవం లభించడం సంతోషంగా, భాగ్యంగానూ భావిస్తున్నానన్నారు. అది ఇది అందం, ఆడంబరాలకు నిలయమైన దేశం మాత్రమే కాదనీ, అక్కడి ప్రజలు ప్రతి ఒక్కరూ నిజాయితీగా లక్ష్యంతో పని చేస్తారని పేర్కొన్నారు. చదవండి: (నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా ఇది) -
అసలేంటీ గోల్డెన్ వీసా.. ఇప్పటివరకు వీసా పొందిన సెలబ్రిటీలు
What Is UAE Golden Visa And Celebrities Who Got It: వివిధ రంగాల్లో అంటే కళలు, క్రియేటివిటీ పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ (దుబాయ్) ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంది. దీని ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు లేకుడా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు వీలు కలుగుతుంది. 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తుందీ యూఏఈ ప్రభుత్వం. ఇందులో భాగంగా విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనానికి ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసాకు 10, 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్ అవుతుంది. ఈ గోల్డెన్ వీసాను తాజాగా టాలీవుడ్ నుంచి మెగా కోడలు ఉపాసన అందుకుంది. యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాద్ షా షారుఖ్ ఖాన్ దక్కించుకున్నాడు. తర్వాత బాలీవుడ్లో సంజయ్ దత్, సునీల్ శెట్టి, సింగర్స్ సోనూ నిగమ్, నెహా కక్కర్, బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్, ఫరా ఖాన్, దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో పాటు బోనీ కపూర్ కుటుంబం ఈ వీసా పొందింది. ఈ వీసాను సాధించిన హీరోయిన్ త్రిష.. తొలి తమిళ కథానాయికగా అవతరించింది. తర్వాత అమలా పాల్‌ను కూడా గోల్డెన్ వీసా వరించింది. వీరితో పాటు మలయాళ ఇండస్ట్రీ నుంచి మొదటగా మోహన్ లాల్ తర్వాత మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ కూడా ఈ వీసాను పొందారు. స్పోర్ట్స్‌కు చెందిన సానియా మీర్జా-షోయబ్ మాలిక్ దంపతులకు దుబాయ్ గోల్డెన్ వీసా దక్కింది. వీరే కాకుండా ఒడిషాకు చెందిన ఆర్టిస్ట్ మోనా విశ్వరూప మోహంతీకి కూడా ఈ దుబాయ్ గోల్డెన్ వీసా దక్కింది. ఇదీ చదవండి: మెగా కోడలికి గోల్డెన్ వీసా.. గ్లోబల్ సిటిజన్‌గా ఉపాసన -
గోల్డెన్ వీసా పొందిన మెగా కోడలు.. గ్లోబల్ సిటిజన్‌గా ఉపాసన
Upasana Got UAE Golden Visa For India Expo 2020: మెగా ఫ్యామిలి కోడలు, మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన పరిచయం అక్కర్లేని పేరు. తన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఒకవైపు అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్‌గా బిజిగా ఉంటూ మరోవైపు పర్యావరణ ప్రేమికురాలిగా, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉపాసన కామినేని కొణిదెలగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. కాగా తాజాగా ఉపాసన అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన దుబాయ్ గోల్డెన్ వీసాను పొందారు ఉపాసన. క్రిస్మస్ కానుకగా ఈ బహుమతి పొందినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపి సంతోషం వ్యక్తం చేశారు ఈ మెగా కోడలు. 'ఇండియా ఎక్స్పో 2020 కార్యక్రమంలో పాల్గొన్నందుకు అనుకుంటా ఈ క్రిస్మస్కు మంచి బహుమతి లభించింది. 'వసుధైక కుటుంబం'- ప్రపంచమంతా ఒకే కుటుంబం. యూఏఈ గోల్డెన్ విసా పొందడం సంతోషంగా ఉంది. అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన భారతీయురాలిని. నేను అధికారికంగా ప్రపంచ పౌరురాలిని (గ్లోబల్ సిటిజన్).' అని ట్వీట్ చేశారు ఉపాసన. ఇటీవల దుబాయ్ 2020 ఎక్స్పోను సందర్శించిన ఉపాసన.. అగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకే ఉపాసన దుబాయ్ అందించే గోల్డెన్ వీసా పొందినట్లు తెలుస్తోంది. This Christmas I received A gift that reiterates what I was taught at the @IndiaExpo2020 “Vasudhaiva Kutumbakam”-the world is one family Happy to get my UAE #GoldenVisa Heart & soul is Indian with immense respect for all nations I’m officially a global citizen!@UAEmediaoffice pic.twitter.com/JQSx9SFG9U — Upasana Konidela (@upasanakonidela) December 27, 2021 ఇదీ చదవండి: ఉపాసన ఎమోషనల్ పోస్ట్.. సమంత రియాక్షన్ -
అరుదైన ఘనతను సొంతం చేసుకున్న త్రిష, తొలి సౌత్ స్టార్‌గా రికార్డు
దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష అరుదైన ఘనతను సొంతంగా చేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా ఆమెను వరించింది. అంతేకాకుండా.. ఈ వీసా అందుకున్న తొలి తమిళ నటిగా త్రిష రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సందర్భంగా త్రిష యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందంటూ మురిసిపోతోంది. చదవండి: ఆచార్య సెకండ్ సింగిల్: ఆకట్టుకుంటున్న ‘నీలాంబరి’ ప్రోమో సాంగ్ దీంతో త్రిష సోషల్ మీడియాలో శభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ వీసాను.. ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, అర్జున్ కపూర్, మోహన్ లాల్.. మమ్ముట్ట, దుల్కర్ సల్మాన్, నేహా కక్కర్, అమాల్ మాలిక్, కేఎస్ చిత్ర వంటి వారు అందుకున్నారు. ఇక తమిళ చిత్రపరిశ్రమ నుంచి ఈ వీసా అందుకున్న తొలి సినీ నటిగా త్రిష నిలిచింది. ఈ వీసా ఉన్నవారు సూదీర్ఘకాలం వరకు యూఏఈలో ఉండొచ్చు. Happy and privileged to be the first Tamil actor to have received the golden visa😀 Thank you🙏🏻 @emiratesfirst @jamadusman @rjrijin @efirstglobal @alsaadgdrfa @gdrfa @dubai #uaegovernment #dubaiculture pic.twitter.com/MgCnwtZj5m — Trish (@trishtrashers) November 3, 2021 -
ప్రముఖ గాయనికి ప్రతిష్టాత్మక గౌరవం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని కేఎస్ చిత్ర అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. యుఏఈ గోల్డెన్ వీసా దక్కించుకున్నారు.యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నట్టు స్వయంగా చిత్ర సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బుధవారం ఉదయం దుబాయ్ ఇమ్మిగ్రేషన్ చీఫ్ హెచ్ఇ మేజర్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మారి చేతుల మీదుగా యుఎఇ గోల్డెన్ వీసా అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆమె ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. చదవండి: kidney transplantation: సంచలనం ఇటీవల మాలీవుడ్‌కు చెందిన పలువురు నటులకు ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసాను ప్రకటించింది. వీరిలో మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్‌ను గోల్డెన్ వీసాతో సత్కరించిన సంగతి తెలిసిందే. ఇంకా టొవినో థామస్, నైలా ఉష, దర్శకుడు , సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, ఆశా శరత్, ఆసిఫ్ అలీ లాంటి మాలీవుడ్ ప్రముఖులు కూడా ఉండటం విశేషం. బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్, సంజయ్ దత్ ఈ వీసాను స్వీకరించారు. కాగా 2019లో యుఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టింది. పెట్టుబడిదారులు, వైద్యులు, ఇంజనీర్లు, ఆయా రంగాల్లో గణనీయ కృషి చేసిన కళాకారులు,ఇతర ప్రముఖులకు ఈ గౌరవాన్నిస్తుంది. గోల్డెన్ వీసా గ్రహీతలు 10 సంవత్సరాల పాటు జాతీయ స్పాన్సర్ అవసరం లేకండా అక్కడి వర్క్ చేసుకోవచ్చు. అంతేకాదు గడువు ముగిసిన వెంటనే ఆటోమేటిగ్గా రెన్యువల్ కావడం ఈ వీసా ప్రత్యేకత. So pleased honoured & privileged to receive the UAE Golden Visa from H.E.Major General Mohammad Ahmed Al Maari the chief of Dubai immigration today morning. pic.twitter.com/a1fPYv5Ncn — K S Chithra (@KSChithra) October 20, 2021 -
మోహన్ లాల్, మమ్ముట్టిలకు యూఏఈ అరుదైన గౌరవం
యుఏఈ గోల్డెన్ వీసాలకు మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్లు ఎంపికయ్యారు. యూఏఈ గోల్డెన్ వీసా ప్రకటించినట్లు స్వయంగా మోహలాల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. యుఏఈ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటులకు గౌరవప్రదమైన గుర్తింపును ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, సంజయ్ దత్‌లకు ఈ వీసాను ఇచ్చిన సంగతి తెలిసిందే. గోల్డెన్ వీసా, 2019 లో యుఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ వీసా ద్వారా అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకోవచ్చు. అంతేగాక ఎలాంటి జాతీయ స్పాన్సర్స్ లేకుండానే 10 సంవత్సరాల పాటు అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. ఈ వీసా గడువు పూర్తి కాగానే ఆటోమెటిక్‌గా రెన్యూవల్ అవుతుంది. ఇప్పటికే ఈ వీసా మోహాన్ లాల్ అందుకోగానే త్వరలోనే మమ్ముట్టి యూఏఈలో తీసుకోనున్నారు. My grateful thanks to H E Mohamed Ali Al Shorafa Al Hammadi for bestowing upon me the Golden Visa for the UAE. Am indeed honoured. My gratitude also goes out to Mr @Yusuffali_MA for facilitating this.@AbuDhabiDED pic.twitter.com/Wo5Jd8AaJX — Mohanlal (@Mohanlal) August 23, 2021 -
యూఏఈ గోల్డెన్ వీసా.. మన ఆర్టిస్ట్‌కు!
న్యూఢిల్లీ: ఒడిషాకు చెందిన ఆర్టిస్ట్ మోనా విశ్వరూప మోహంతీకి అరుదైన అవకాశం దక్కింది. యూఏఈ ప్రభుత్వం అందిస్తున్న గోల్డెన్ వీసా ఆమెకి దక్కింది. గోల్డెన్ వీసా ప్రకారం.. ఎవరైనా సరే పదేళ్లపాటు అక్కడ నిరభ్యరంతంగా ఉండొచ్చు. అంతేకాదు వీసా దానికదే రెన్యువల్ అవుతూ ఉంటుంది. కళలు, క్రియేటివిటీ పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ ప్రభుత్వం ఈ వీసా అందిస్తుంది. ఈ వీసా వల్ల అక్కడ ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా ఉండొచ్చు, పని చేసుకోవచ్చు, చదువుకునే అవకాశం కూడా ఉంటుంది. పైగా స్వదేశం నుంచి ఎలాంటి స్పాన్సర్షిప్ అక్కర్లేదు. అంతేకాదు అక్కడ చేసుకునే వ్యాపారాలకు వంద శాతం హక్కులు ఉంటాయి. కాగా, యూఏఈ 2019 నుంచి కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ఐదు నుంచి పదేళ్ల మధ్య గోల్డెన్ వీసా ఇస్తారు. ఇది ఆటోమేటిక్‌గా రెన్యువల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ ఘనత దక్కించుకున్న తొలి ఒడిషా పర్సన్‌గా మోనా విశ్వరూప నిలిచింది. మయూర్భంజ్ జిల్లా పుట్టిన ఆమె 2007 నుంచి దుబాయ్‌లో ఉంటోంది. ఫ్యాషన్ కెరీర్‌ను వదిలేసుకుని.. డిజైన్ ఇండస్రీ్టలో ఎనిమిదేళ్లుగా పని చేస్తోంది. దుబాయ్ ఎకనామిక్ డిపార్ట్మెంట్లో ఆమె సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రాక్టీషనర్‌గా రిజిస్ట్రర్ చేసుకుంది. కాగా, తనకు దక్కిన గౌరవంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ.. భారత సంప్రదాయాలకు మరింత గుర్తింపు కోసం ప్రయత్నిస్తానని చెబుతోంది. -
Corona Crisis: ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా యూరప్‌లో చదివే ఛాన్స్ !
వెబ్‌డెస్క్ : కరోనా ఇంకా కంట్రోల్లోకి రాకపోవడంతో ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూలుకు పంపే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. వ్యాక్సినేషన్లో ముందున్న యూఎస్, యూరప్ దేశాలకు తమ పిల్లల్ని పంపే ప్రణాళికలో సంపన్న వర్గాల ప్రజలు ఉన్నారు. ఇలాంటి వారి కోసం పొర్చుగల్ దేశానికి చెందిన అరేతా పోర్చుగల్ విజన్ ఫండ్ సరికొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. అక్కడే స్థిర నివాసం యూరప్‌లో రియల్ రంగంలో వ్యాపారం చేస్తోన్న అరేతా పోర్చుగల్ విజన్ ఫండ్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ సంస్థలో పెట్టుబడులు పెడితే పోర్చుగల్‌లో పర్మినెంట్‌గా నివసించే అవకాశం కల్పిస్తామంటూ తెలిపింది. అ అవకాశం పొందాలంటే ఈ సంస్థలో 3,50,000 యూరోలు అంటే మన కరెన్సీలో రూ. 3.09 కోట్లు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. 2021 జులై 1 నుంచి ఈ స్కీం ప్రారంభించనున్నట్టు ఆరేతా సంస్థ సీఈవో ఆశీష్ సరాఫ్ ప్రకటించారు. చదువు ఒకే పర్మినెంట్ నివాసానికి సంబంధించిన గోల్డెన్ వీసా ఉంటే అనేక ప్రయోజనాలు వర్తిస్తాయి. పోర్చుగల్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్నాళ్లైన అక్కడే నివసించవచ్చు. దీంతో పాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్య దేశాల్లోకి రాకపోకలు సుళవు అవుతుంది. ఎంట్రన్స్‌లు, టెస్టులు తదితర వ్యవహరాలు లేకుండా ఈయూ దేశాల్లో చదువుకొవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు, ఓటు హక్కు వంటి ప్రయోజనాలు అందవు. యూరప్ క్రేజ్ ఎంత స్వదేశీ అభిమానం మనలో ఉన్నా .... యూరోపియన్ లైఫ్ స్టైల్ అన్నా అక్కడి వాతవరణ పరిస్థితులు అన్నా ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా సంపన్న వర్గాల వారికి యూరప్ అంటే వల్లమానిన అభిమానం. అందువల్లే కరోనా సంక్షోభ సమయంలో చాలా మంది సంపన్న వర్గాల వారు విదేశాలకు వెళ్లిపోయారు. వీరిలో చాలా మంది యూరప్‌కే వెళ్లారు. గోల్డెన్ వీసా 2012లో పోర్చుగీసు ప్రభుత్వతం గోల్డెన్ వీసా పథకం ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం రూ. 3.09 కోట్లు పెట్టుబడులు పెట్టిన వారికి సులువుగా పోర్చుగల్‌లో నివసించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ గోల్డెన్ వీసా గడువు 2021 డిసెంబరుతో ముగియనుంది. కొత్త నిబంధనలతో తిరిగి 2022 జనవరి నుంచి ప్రారంభం కానుంది. అయితే పెట్టుబడి మొత్తం దాదాపు రెట్టింపు కానుంది. దీంతో జులై నుంచి డిసెంబరు వరకు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థిర నివాసం అవకాశం అరేతా సంస్థ కల్పిస్తోంది . చదవండి : క్రిప్టోకరెన్సీ పై భారీగా ఇన్వెస్ట్ చేస్తోన్న భారతీయులు..! -
బ్రిటన్ ‘గోల్డెన్ వీసా’ రద్దు
లండన్: బ్రిటన్ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ కోటీశ్వరులకు శాశ్వత నివాసం, పౌరసత్వం కోసం జారీచేస్తున్న గోల్డెన్ వీసా (టైర్ 1 ఇన్వెస్టర్ వీసా)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గోల్డెన్ వీసా దుర్వినియోగం అయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామనీ, శుక్రవారం (స్థానికకాలమానం) నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. భారత్, రష్యా, చైనా సహా పలు దేశాలకు చెందిన విదేశీయులు ఈ గోల్డెన్ వీసా ద్వారా బ్రిటన్‌లో స్థిరపడుతున్నారు. ఈ గోల్డెన్ వీసాలో ప్రధానంగా మూడు కేటగిరీలు ఉన్నాయి. బ్రిటన్‌లో కనీసం రూ.18.09 కోట్లు(2 మిలియన్ పౌండ్లు) పెట్టుబడి పెట్టే విదేశీయులు తొలుత 40 నెలలు ఉండేందుకు అధికారులు అనుమతిస్తారు. దీన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. వీరికి ఐదేళ్ల అనంతరం బ్రిటన్‌లో శాశ్వత నివాస హోదా(ఐఎల్ఆర్)ను జారీచేస్తారు. ఈ పెట్టుబడిదారులు తమ భార్యతో పాటు 18 ఏళ్లలోపు ఉండే తమ పిల్లల్ని బ్రిటన్‌కు తీసుకురావచ్చు. అలాగే బ్రిటన్‌లో రూ.45.22 కోట్లు(5 మిలియన్ పౌండ్లు) పెట్టుబడి పెట్టేవారికి మూడేళ్లలో, రూ.90.44 కోట్లు(10 మిలియన్ పౌండ్లు) పెట్టుబడి పెడితే రెండేళ్లలో శాశ్వత నివాస హోదా లభిస్తోంది. అంతేకాదు. గోల్డెన్ వీసా కింద మొదటి కేటగిరి వ్యాపారవేత్తలు ఆరేళ్ల తర్వాత, మిగిలినవారు ఐదేళ్ల అనంతరం బ్రిటన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. -
విదేశాలకు ‘పసిడి ద్వారం’
ఆయా దేశాల్లో పౌరసత్వానికి గోల్డెన్ వీసా మరింత మెరుగైన జీవనం కోసం విదేశాలకు వలస వెళ్లాలంటే.. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి చదువు, ఉద్యోగం కోసం వీసాలు సంపాదించుకుని పయనమవుతారు. డాలర్ డ్రీమ్స్ స్వర్గంగా భావించే అమెరికా మొదలుకుని ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జర్మనీ ఇలా ఎన్నో దేశాలకు నిత్యం వలసలు సర్వసాధారణం. ఆ వీసాల గడువు ఎప్పుడు ముగుస్తుందో ఎలా పొడిగించుకోవాలా? అని ఆందోళన చెందుతుంటారు. ఈ కష్టాలేవీ లేకుండా అమెరికా సహా చాలా దేశాలకు ముందుగానే కుటుంబ సభ్యులందరికీ శాశ్వత వీసాలు పొంది ఐదారేళ్లలోనే శాశ్వత నివాసం, పౌరసత్వం పొందేందుకు స్వర్ణ ద్వారాలున్నాయి. అందుకు కావల్సింది పెట్టుబడి మాత్రమే!! ‘మా దేశాల్లో పెట్టుబడి పెట్టండి. స్థిరాస్తులు కొనండి. మా ప్రభుత్వాల బాండ్లు కొనండి. ఓ ఐదారేళ్ల పాటు ఆ పెట్టుబడుల్ని కదిలించకుండా ఉంచండి. కొత్త వ్యాపారమో, పరిశ్రమో పెట్టి.. కనీసం ఒకరికో లేక పది మందికో ఉద్యోగాలు కల్పించండి. మీకు, మీ జీవిత భాగస్వామికి, మీ మైనర్ పిల్లలకు శాశ్వత వీసాలు ఇస్తాం. నిర్ధిష్ట గడువు తర్వాత శాశ్వత నివాసం, పౌర సత్వం కల్పిస్తాం’ అంటూ చాలా దేశాలు ‘గోల్డెన్’ చాన్స్ కల్పిస్తున్నాయి. పెట్టాల్సిన పెట్టుబడుల మొత్తం ఆయా దేశాల్ని బట్టి రూ. కోటి నుంచి ఐదారు కోట్ల వరకూ ఉంది. అయితే ఎలాంటి చింతా లేకుండా నచ్చిన దేశంలో సెటిలైపోవచ్చు. నచ్చిన పని చేసుకుంటూ బతకవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే.. ఆయా దేశాల పౌరసత్వాల్ని డబ్బులతో కొనుక్కుని ఇంటిల్లిపాదీ రెక్కలు గట్టుకుని అక్కడికి ఎగిరిపోవచ్చు!! ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు పెట్టుబడులు పెట్టే వారిని ఆకర్షించేందుకు శాశ్వత నివాసం, సత్వర పౌరసత్వం పథకాల్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకాలనే ‘గోల్డెన్ వీసా’ పథకాలుగా వ్యవహరిస్తున్నారు. వీటికి చాలా గిరాకీ ఉంది. ముఖ్యంగా అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల గోల్డెన్ వీసాలకు డిమాండ్ ఎక్కువ. 5 లక్షల డాలర్లు (సుమారు రూ. 3.22 కోట్లు) పెట్టుబడి పెడితే అమెరికా శాశ్వత పౌరసత్వం లభిస్తుంది. 20 లక్షల పౌండ్లతో(రూ. 16.60 కోట్లు) బ్రిటన్‌లో శాశ్వత నివాసం పొందవచ్చు. 2–8 లక్షల కెనడియన్ డాలర్లు (కోటి నుంచి రూ. 4 కోట్లు) పెట్టుబడితో కెనడాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవచ్చు. అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలు హెచ్1బీ వీసాలపై ఆంక్షల్ని కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఈ గోల్డెన్ వీసాలపై దృష్టి పెడుతున్నారు. యూరప్‌లోని అన్ని దేశాలూ గోల్డెన్ వీసా పథకాలు అందిస్తున్నాయి. ఏ ఒక్క దేశ పౌరసత్వం పొందినా ‘షెంజెన్ ప్రాంతం’లోని మిగతా యూరప్ దేశాలకు వీసా అవసరం లేకుండా ప్రయాణిం చవచ్చు. మాల్టా వంటి కొన్ని యూరప్ దేశాల పాస్‌పోర్ట్ ఉంటే.. అమెరికా వెళ్లడానికి వీసా అవసరం లేదు. అంతేకాదు యూరప్‌లోని గ్రీస్ వంటి దేశాలకు గోల్డెన్ వీసాల ఖర్చు తక్కువ. 10 కోట్లు పెడితే భారత్‌లోనూ.. భారతదేశంలో కూడా రూ. 10 కోట్ల నుంచి రూ. 25 కోట్ల వరకూ పెట్టుబడులు పెడితే విదేశీయులకు శాశ్వత నివాస హోదా కల్పిస్తారు. కనీసం 20 మందికి ఉపాధి కల్పిస్తే పెట్టుబడిదారుడికి, ఆ వ్యక్తి జీవిత భాగస్వామి, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు శాశ్వత నివాస హోదా ఇస్తారు. వాళ్లు ఇక్కడ నివసించడానికి ఇల్లు కూడా కొనుక్కోవచ్చు. ఈ పథకం పాకిస్తాన్, చైనా దేశస్తులకు వర్తించదు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాదే ఆమోదం తెలిపింది. దేశం పెట్టుబడి (రూ.లలో) అమెరికా 3.22 కోట్లు కెనడా 4 కోట్లు బ్రిటన్ 16.60 కోట్లు ఆస్ట్రేలియా 7 కోట్లు రష్యా 65 లక్షలు గ్రీస్ 1.75 కోట్లు జర్మనీ 2.45 కోట్లు స్పెయిన్ 3,5 కోట్లు మాల్టా 7 కోట్లు స్విట్జర్లాండ్ 6.3 కోట్లు టర్కీ 45 లక్షలు బెల్జియం 2.1కోట్లు నెదర్లాండ్స్ 3.5 కోట్లు సింగపూర్ 22.5 కోట్లు హాంగ్‌కాంగ్ 8 కోట్లు