Actress Kajal Aggarwal Receives UAE Golden Visa, See Her Reaction - Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: అరుదైన గౌరవం అందుకున్న కాజల్‌, గర్వంగా ఉందంటూ పోస్ట్‌..

Published Fri, Feb 4 2022 9:00 PM | Last Updated on Sat, Feb 5 2022 9:02 AM

Actress Kajal Aggarwal Got UAE Golden Visa - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌కు అరుదైన గౌరవం లభించింది.  కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే యూఏఈ గోల్డెన్ వీసాను తాజాగా ఈ ‘చందమామ’ అందుకుందీ. ఈ విషయాన్ని కాజల్‌ సోషల్‌ మీడియా వేదిక వెల్లడించింది. ‘యూఏఈ గోల్డెన్ వీసా లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మనలాంటి కళాకారులకు ఈ అరబ్‌ దేశం ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తోంది. నాకు ఈ గుర్తింపు ఇచ్చిన యూఏఈ మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు. భవిష్యత్‌లో కూడా మీ సహాయ సహకారాలు కొనసాగాలని కోరుకుంటున్నాను’ అంటూ కాజల్‌ ఆనందం వ్యక్తం చేసింది.

చదవండి: టాలీవుడ్‌ ప్రముఖుల మధ్య కోల్డ్‌వార్‌, వరస ట్వీట్స్‌తో మాటల యుద్ధం..

కాగా ఈ గోల్డెన్‌ విసాను పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్య సంపద తదితర రంగాల్లో సేవలందిస్తున్న వారికి దుబాయ్ ప్రభుత్వం అందిస్తోంది. ఈ వీసాతో ఆ దేశంలో  ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా నివాసం, వ్యాపారం చేసుకోవచ్చు. ఈ గోల్డెన్‌ వీసాను సినీ రంగంలో నుంచి తొలిసారిగా బాలీవుడ్‌  బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ అందుకున్నాడు. ఆ తర్వాత సంజయ్ దత్, బోనీ కపూర్‌ ఫ్యామిలీ, సునీల్‌ శెట్టి, సోనూ నిగమ్‌, నేహా కక్కర్‌, మౌనీ రాయ్‌ తదితరులు పొందారు. ఇక దక్షిణాదిలో మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, టోవినో థామస్‌, దుల్కర్‌ సల్మాన్‌, త్రిష, అమలాపాల్‌ ఈ వీసాను అందుకున్నారు. ఇటీవల మెగా కోడలు ఉపాసన కూడా ఈ గౌరవం దక్కించుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement