UAE government
-
యూఏఈ వీసా ఆన్ అరైవల్.. షరతులు వర్తిస్తాయి
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. యూఏఈ ప్రభుత్వం భారత జాతీయుల కోసం నూతనంగా వీసా ఆన్ అరైవల్ విధానాన్ని ప్రకటించింది. అయితే, ఇందుకు ఓ షరతు విధించింది. అమెరికా, యూకే, ఇతర ఏదైనా యూరోపియన్ యూనియన్ దేశం శాశ్వత నివాస కార్డు లేదా వీసా ఉన్న వ్యక్తులే వీసా ఆన్ అరైవల్‌కు అర్హులు. ఈ విధానం ద్వారా యూఏఈలో అడుగు పెట్టిన వెంటనే వీరికి 14 రోజుల వీసా లభిస్తుంది. అవసరమైన ఫీజు చెల్లించిన పక్షంలో మరో 60 రోజుల వరకు దీనిని పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకుగాను..అమెరికా వీసా, నివాస కార్డు లేక గ్రీన్ కార్డు ఉన్న వారు.. ఏదేని యూరోపియన్ యూనియన్ దేశం లేక యునైటెడ్ కింగ్డమ్ వీసా లేక నివాస ధ్రువీకరణ కార్డు ఉన్నవారు అర్హులు. కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్టు కూడా వీరు చూపాల్సి ఉంటుంది. భారత్–యూఏఈల బంధం బలపడుతున్న వేళ ఈ నూతన విధానం అమల్లోకి రావడం విశేషం. యూఏఈలో ప్రస్తుతం 35 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. -
మంచు విష్ణుకు గోల్డెన్ వీసా
టాలీవుడ్ హీరో మంచు విష్ణు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసా అందకున్నారు. కళలు, క్రియేటివిటీ పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ (దుబాయ్) ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంది. దీని ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు లేకుడా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు వీలు కలుగుతుంది.ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ యూఏఈ గోల్డెన్ విసా అందుకున్నారు. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్‌లో మంచు విష్ణు చేరారు. 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందిన రజనీకాంత్, షారుక్ ఖాన్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్, సునీల్ దత్, సంజయ్ దత్,మోనీ రాయ్,బోనీ కపూర్, మమ్ముట్టి, టొవినో థామస్ వంటి స్టార్స్‌కు ఈ వీసా లభించింది.2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు యూఏఈ ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనానికి ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసాకు 10, 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్ అవుతుంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. -
యూఏఈ ప్రభుత్వానికి కేటీఆర్ రిక్వెస్ట్
సాక్షి, హైదరాబాద్: దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని మంత్రి కేటీఆర్, యూఏఈ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌కు విచ్చేసిన ఆ దేశ రాయబారి ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారాయన. యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి.. నగర పర్యటనలో భాగంగా ప్రగతిభవన్‌తో కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, నాంపల్లి వెంకట్, దండుగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు ప్రస్తుతం దుబాయ్‌లో ఒక కేసుకుగానూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2005లో నేపాల్ దేశానికి చెందిన దిల్ ప్రసాద్ రాయ్ మరణం విషయంలో వీరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే యూఏఈ చట్టాల ప్రకారం (షరియా చట్టం) మేరకు రూ.15 లక్షల రూపాయల పరిహారాన్ని బాధితుని కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని, ఈ మేరకు గతంలోనే స్వయంగా తానే నేపాల్ వెళ్లి 2013లోనే బాధితుడి కుటుంబాన్ని కలిసినట్లు మంత్రి కేటీఆర్, దుబాయ్ రాయబారికి వివరించారు. షరియా చట్టంలోని (Diyyah) ప్రకారం బాధితుల కుటుంబం (blood money తీసుకుని) క్షమాపణ పత్రం అందిస్తే వీరిని విడుదల చేసే అవకాశం ఉందని, ఈ మేరకు బాధితుని కుటుంబం 2013లోనే అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్లను దుబాయ్ ప్రభుత్వానికి ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే అటు భారత దౌత్య కార్యాలయం తో పాటు యూఏఈ దౌత్య కార్యాలయానికి సైతం ఈ విషయంలో అనేకసార్లు తాను స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే.. యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిందని, ఇక దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాభిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని తెలిపారు. ఈ మేరకు తాను వివరించిన ఈ సంఘటన తాలూకు వివరాలను అటు భారత, నేపాల్ దౌత్య కార్యాలయాల ద్వారా విచారించుకోవాలన్నారు. క్షమాభిక్షకు అర్హమైన ఈ కేసులో, దుబాయ్ రాజు సానుకూలంగా స్పందించేలా ఆయన దృష్టికి తమ విజ్ఞప్తిని తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ యూఏఈ రాయబారిని కోరారు. ఈ అంశంలో ప్రత్యేకంగా చొరవ చూపించి, దుబాయిలోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు భారతీయ ప్రవాసీలను వెంటనే భారతదేశానికి పంపించేలా ప్రయత్నం చేయాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి భేష్ మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల అనేక ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీపడేలా నిర్మిస్తున్న మౌలిక వసతుల వలన భవిష్యత్తులో హైదరాబాద్ ముఖచిత్రం మరింతగా మారుతుందన్న ఆశాభావాన్ని అబ్దుల్ నసీర్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం మరియు ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ బలం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక రంగాల్లోని పెట్టుబడి అవకాశాలను, తెలంగాణ ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్, యూఏఈ రాయబారికి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని స్టార్టప్ ఈకో సిస్టంతో ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లోని వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్నోవేషన్ ఈకో సిస్టం భాగస్వాములు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారని, ఇదే రీతిన యూఏఈ లోని వెంచర్ క్యాపిటలిస్టులను టీ హబ్ కు పరిచయం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యూఏఈ రాయబారి, ఈ మేరకు తమ దేశంలోని ఔత్సాహిక వెంచర్ క్యాపిటలిస్టులను, హైదరాబాద్ ఈకో సిస్టంలోని స్టార్ట్ అప్ సంస్థలను అనుసంధానం చేసేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. -
సోనూసూద్‌కు దుబాయ్ నుంచి అరుదైన గౌరవం..
Actor Sonu Sood Receives UAE Golden Visa: సోనూసూద్.. రీల్ విలన్ నుంచి రియల్ లైఫ్ హీరోగా మారాడు. సోనూసూద్ అంటే లాక్డౌన్ ముందు వరకు విలన్‌గానే అందరికీ తెలుసు, కానీ లాక్డౌన్ తర్వాత సీన్ మారింది. నిరుపేదలకు బాసటగా నిలుస్తూ, కార్మికులకు కొండంత అండగా పేద ప్రజల పాలిట పెన్నిధిగా మారి యువతకు రియల్ హీరో అయ్యాడీ రీల్ విలన్. అతడు చేసే సేవా కార్యక్రమాలకు యావత్ దేశం ఫిదా అయింది. 'ప్రభుత్వాలు చేయలేని సాయాన్ని మీరు చేశారంటూ' సోనూను ప్రతి ఒక్కరూ కొనియాడారు. చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్ తాజాగా ఆయన దుబాయ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాతకమైన గౌరవాన్ని అందుకున్నాడు. సోనూసూద్ అహర్నిశలు శ్రమిస్తూ చేసిన సమాజ సేవకు గౌరవార్థవంగా 'యూఏఈ గోల్డెన్ వీసా'ను అందించింది. ఈ దుబాయ్ గోల్డెన్ వీసాను అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు సోనూసూద్. ఇంకా నేను ఈ గోల్డెన్ వీసాను అందుకోవడం చాలా గౌరవంగా ఉంది. నేను సందర్శించేందుకు ఇష్టపడే ప్రదేశాల్లో దుబాయ్ ఒకటి. ఇది అభివృద్ధి చేందడానికి అత్యద్భుతమైన చోటు. నేను అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అని సోనూసూద్ పేర్కొన్నాడు. చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న హాట్ బ్యూటీ.. -
గోల్డెన్ వీసా అందుకున్న హాట్ బ్యూటీ..
Heroine Andrea Jeremiah Receives UAE Golden Visa: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గోల్డెన్ వీసా పొందింది తమిళ హాట్ బ్యూటీ ఆండ్రియా. తమిళ సినీ ఇండస్ట్రీలో బోల్డ్ పాత్రల్లో అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కార్తీ నటించిన 'యుగానికి ఒక్కడు', లోకనాయకుడు కమల్ హాసన్ యాక్ట్ చేసిన 'విశ్వరూపం' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఈ అమ్మడు. ప్రస్తుతం పిశాచి 2 సినిమాలో నటిస్తోంది ఆండ్రియా. ఈ మూవీకి మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే భారతీయ సినీ తారలకు దుబాయ్ ప్రభుత్వం ఈ వీసాను అందజేస్తోంది. తాజాగా ఈ జాబితాలో చేరింది ఆండ్రియా జెరెమియా. ఈ సంధర్భంగా యూఏఈ ప్రభుత్వానికి ఆండ్రియా ధన్యవాదాలు తెలిపింది. చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్ 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలతో సత్కరిస్తోంది దుబాయ్ ప్రభుత్వం. ఈ వీసాను అందుకున్న వారికి పదేళ్ల పాటు దుబాయ్ పౌరసత్వం ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్ అవుతుంది. ఇటీవలే ఈ గోల్డెన్ వీసాను సీనియర్ నటి మీనా అందుకున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ వీసాను పొందగా.. టాలీవుడ్ నుంచి మెగా కోడలు ఉపాసన అందుకుంది. యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాద్ షా షారుఖ్ ఖాన్ దక్కించుకున్నాడు. తర్వాత బాలీవుడ్లో సంజయ్ దత్, సునీల్ శెట్టి, సింగర్స్ సోనూ నిగమ్, నెహా కక్కర్, బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్, ఫరా ఖాన్, దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో పాటు బోనీ కపూర్ కుటుంబం ఈ వీసా పొందింది. చదవండి: దుబాయ్ గోల్డెన్ వీసా అంటే ఏంటీ ?.. ఎందుకిస్తారు ? -
గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్
Senior Actress Meena Receives UAE Golden Visa: ఈ మధ్య కాలంలో సినీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇచ్చే గోల్డెన్ వీసాలను అందుకుంటున్నారు. 2019 నుంచి ఈ వీసాలతో సత్కరిస్తోంది దుబాయ్ ప్రభుత్వం. ఈ వీసాను అందుకున్న వారికి పదేళ్ల పాటు దుబాయ్ పౌరసత్వం ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్ అవుతుంది. ఈ అరుదైన గౌరవాన్ని తాజాగా సీనియర్ హీరోయిన్, నటి మీనాకు దక్కింది. ఈ వీసాను స్వీకరించిన మీనా దుబాయ్‌లో జరుగుతున్న ఎక్స్ఫోలో పాల్గొన్నారు. తనకు గోల్డెన్ వీసాను యూఏఈ ప్రదానం చేయడం పట్ల మీనా సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలాగే అరబ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ వీసాను పొందగా.. టాలీవుడ్ నుంచి మెగా కోడలు ఉపాసన అందుకుంది. యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాద్ షా షారుఖ్ ఖాన్ దక్కించుకున్నాడు. తర్వాత బాలీవుడ్లో సంజయ్ దత్, సునీల్ శెట్టి, సింగర్స్ సోనూ నిగమ్, నెహా కక్కర్, బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్, ఫరా ఖాన్, దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో పాటు బోనీ కపూర్ కుటుంబం ఈ వీసా పొందింది. ఈ వీసాను సాధించిన హీరోయిన్ త్రిష.. తొలి తమిళ కథానాయికగా అవతరించింది. తర్వాత అమలా పాల్‌ను కూడా గోల్డెన్ వీసా వరించింది. వీరితో పాటు మలయాళ ఇండస్ట్రీ నుంచి మొదటగా మోహన్ లాల్ తర్వాత మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ కూడా ఈ వీసాను పొందారు. -
అరుదైన గౌరవం అందుకున్న కాజల్, గర్వంగా ఉందంటూ పోస్ట్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు అరుదైన గౌరవం లభించింది. కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే యూఏఈ గోల్డెన్ వీసాను తాజాగా ఈ ‘చందమామ’ అందుకుందీ. ఈ విషయాన్ని కాజల్ సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. ‘యూఏఈ గోల్డెన్ వీసా లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మనలాంటి కళాకారులకు ఈ అరబ్ దేశం ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తోంది. నాకు ఈ గుర్తింపు ఇచ్చిన యూఏఈ మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు. భవిష్యత్‌లో కూడా మీ సహాయ సహకారాలు కొనసాగాలని కోరుకుంటున్నాను’ అంటూ కాజల్ ఆనందం వ్యక్తం చేసింది. చదవండి: టాలీవుడ్ ప్రముఖుల మధ్య కోల్డ్‌వార్, వరస ట్వీట్స్‌తో మాటల యుద్ధం.. కాగా ఈ గోల్డెన్ విసాను పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్య సంపద తదితర రంగాల్లో సేవలందిస్తున్న వారికి దుబాయ్ ప్రభుత్వం అందిస్తోంది. ఈ వీసాతో ఆ దేశంలో ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా నివాసం, వ్యాపారం చేసుకోవచ్చు. ఈ గోల్డెన్ వీసాను సినీ రంగంలో నుంచి తొలిసారిగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అందుకున్నాడు. ఆ తర్వాత సంజయ్ దత్, బోనీ కపూర్ ఫ్యామిలీ, సునీల్ శెట్టి, సోనూ నిగమ్, నేహా కక్కర్, మౌనీ రాయ్ తదితరులు పొందారు. ఇక దక్షిణాదిలో మోహన్ లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్ ఈ వీసాను అందుకున్నారు. ఇటీవల మెగా కోడలు ఉపాసన కూడా ఈ గౌరవం దక్కించుకుంది. Happy to have received UAE’s Golden visa. This country has always been such huge encouragement for artists like us. Grateful and looking forward to future collaborations in the UAE. Big thank you to Mr Muhammed Shanid of Juma Almheiri, Suresh Punnasseril and Naressh Krishna pic.twitter.com/XDuuO4boPG — Kajal Aggarwal (@MsKajalAggarwal) February 3, 2022 -
అసలేంటీ గోల్డెన్ వీసా.. ఇప్పటివరకు వీసా పొందిన సెలబ్రిటీలు
What Is UAE Golden Visa And Celebrities Who Got It: వివిధ రంగాల్లో అంటే కళలు, క్రియేటివిటీ పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ (దుబాయ్) ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంది. దీని ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు లేకుడా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు వీలు కలుగుతుంది. 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తుందీ యూఏఈ ప్రభుత్వం. ఇందులో భాగంగా విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనానికి ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసాకు 10, 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్ అవుతుంది. ఈ గోల్డెన్ వీసాను తాజాగా టాలీవుడ్ నుంచి మెగా కోడలు ఉపాసన అందుకుంది. యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాద్ షా షారుఖ్ ఖాన్ దక్కించుకున్నాడు. తర్వాత బాలీవుడ్లో సంజయ్ దత్, సునీల్ శెట్టి, సింగర్స్ సోనూ నిగమ్, నెహా కక్కర్, బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్, ఫరా ఖాన్, దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో పాటు బోనీ కపూర్ కుటుంబం ఈ వీసా పొందింది. ఈ వీసాను సాధించిన హీరోయిన్ త్రిష.. తొలి తమిళ కథానాయికగా అవతరించింది. తర్వాత అమలా పాల్‌ను కూడా గోల్డెన్ వీసా వరించింది. వీరితో పాటు మలయాళ ఇండస్ట్రీ నుంచి మొదటగా మోహన్ లాల్ తర్వాత మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ కూడా ఈ వీసాను పొందారు. స్పోర్ట్స్‌కు చెందిన సానియా మీర్జా-షోయబ్ మాలిక్ దంపతులకు దుబాయ్ గోల్డెన్ వీసా దక్కింది. వీరే కాకుండా ఒడిషాకు చెందిన ఆర్టిస్ట్ మోనా విశ్వరూప మోహంతీకి కూడా ఈ దుబాయ్ గోల్డెన్ వీసా దక్కింది. ఇదీ చదవండి: మెగా కోడలికి గోల్డెన్ వీసా.. గ్లోబల్ సిటిజన్‌గా ఉపాసన -
గోల్డెన్ వీసా పొందిన మెగా కోడలు.. గ్లోబల్ సిటిజన్‌గా ఉపాసన
Upasana Got UAE Golden Visa For India Expo 2020: మెగా ఫ్యామిలి కోడలు, మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన పరిచయం అక్కర్లేని పేరు. తన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఒకవైపు అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్‌గా బిజిగా ఉంటూ మరోవైపు పర్యావరణ ప్రేమికురాలిగా, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉపాసన కామినేని కొణిదెలగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. కాగా తాజాగా ఉపాసన అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన దుబాయ్ గోల్డెన్ వీసాను పొందారు ఉపాసన. క్రిస్మస్ కానుకగా ఈ బహుమతి పొందినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపి సంతోషం వ్యక్తం చేశారు ఈ మెగా కోడలు. 'ఇండియా ఎక్స్పో 2020 కార్యక్రమంలో పాల్గొన్నందుకు అనుకుంటా ఈ క్రిస్మస్కు మంచి బహుమతి లభించింది. 'వసుధైక కుటుంబం'- ప్రపంచమంతా ఒకే కుటుంబం. యూఏఈ గోల్డెన్ విసా పొందడం సంతోషంగా ఉంది. అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన భారతీయురాలిని. నేను అధికారికంగా ప్రపంచ పౌరురాలిని (గ్లోబల్ సిటిజన్).' అని ట్వీట్ చేశారు ఉపాసన. ఇటీవల దుబాయ్ 2020 ఎక్స్పోను సందర్శించిన ఉపాసన.. అగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకే ఉపాసన దుబాయ్ అందించే గోల్డెన్ వీసా పొందినట్లు తెలుస్తోంది. This Christmas I received A gift that reiterates what I was taught at the @IndiaExpo2020 “Vasudhaiva Kutumbakam”-the world is one family Happy to get my UAE #GoldenVisa Heart & soul is Indian with immense respect for all nations I’m officially a global citizen!@UAEmediaoffice pic.twitter.com/JQSx9SFG9U — Upasana Konidela (@upasanakonidela) December 27, 2021 ఇదీ చదవండి: ఉపాసన ఎమోషనల్ పోస్ట్.. సమంత రియాక్షన్ -
ఆ మ్యాచ్‌కు "స్టేడియం ఫుల్"గా అనుమతివ్వండి.. బీసీసీఐ విజ్ఞప్తి
BCCI Requests To Have Full Capacity Spectators For T20 World Cup Final Match: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా నవంబర్ 14న జరగబోయే ఫైనల్ మ్యాచ్‌కు స్టేడియం పూర్తి సామర్థ్యం( 25 వేలు) మేరకు ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐతో పాటు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)లు యూఏఈ ప్రభుత్వాన్ని కోరాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆతిధ్య దేశం అనుమతి తప్పనసరి కావడంతో బీసీసీఐ, ఈసీబీలు ఎమిరేట్స్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. కరోనా కారణంగా మెగా టోర్నీ నిర్వహణ భారత్ నుంచి యూఏఈకి తరలిపోయినప్పటికీ.. ఆతిథ్య హక్కులు మాత్రం బీసీసీఐతోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌కు అభిమానులను అనుమతించిన విషయం తెలిసిందే. అయితే కొవిడ్ నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. స్టేడియానికి వచ్చే ప్రేక్షకులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధనతో పాటు 48 గంటల వ్యవధిలో చేయించుకున్న నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్‌ను తప్పనిసరి చేశారు. కాగా, అక్టోబర్ 23న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగబోయే మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామం మొదలుకానుంది. ఆ మరుసటి రోజు( అక్టోబర్ 24న) దాయాదుల(భారత్, పాక్) మధ్య రసవత్తర పోరు జరుగనుంది. చదవండి: టీమిండియాకు 'ఆ చాణక్య బుర్ర' తోడైతే.. -
యూఏఈలో భారతీయుల ఇబ్బందులు
-
చట్టాన్ని పక్కనపెట్టి చిన్నారికి బర్త్ సర్టిఫికెట్
దుబాయ్: హిందూ, ముస్లిం దంపతులకు జన్మించిన ఓ 9నెలల చిన్నారికి జనన ధ్రువీకరణ పత్రం జారీ చేయడం ద్వారా యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ప్రభుత్వం ఔదార్యతను చాటుకుంది. నిబంధనలను పక్కన పెట్టి మరీ భారత్‌కు చెందిన హిందూ తండ్రి, ముస్లిం తల్లికి జన్మించిన పాపకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు మీడియా తెలిపింది. యూఏఈలోని వివాహ చట్టం ప్రకారం ఓ ముస్లిం వ్యక్తి వేరే మతానికి చెందిన మహిళను వివాహమాడొచ్చు. కానీ ఓ ముస్లిం మహిళ మాత్రం ముస్లిమేతర వ్యక్తిని వివాహం చేసుకోరాదు. హిందువైన కిరణ్ బాబు, ముస్లిం యువతి సనమ్ సాబూ సిద్ధికీ 2016లో కేరళలో వివాహం చేసుకున్నారు. షార్జాలో నివాసముంటున్నారు. వీరికి జూలై 2018లో పాప జన్మించింది. కిరణ్ హిందువు కావడంతో అతని కూతురికి జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది. దీంతో యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్షౖకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నిబంధనలు మార్చి అధికారులు జనన ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. దేశంలో ఇదే మొదటిసారి అని కిరణ్ పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు సహకరించిన ఇండియన్ ఎంబసీ కౌన్సిలర్ ఎమ్.రాజమురుగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఔదార్యతను ప్రదర్శించే దేశంగా ముందుండటానికి యూఏఈ 2019 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ టాలరెన్స్గా ప్రకటించింది. రెండు భిన్న సంస్కృతులను కలిపేలా, ఇతర మతంలోని వారిని అనమతించే దిశగా ఈ చర్యలు చేపట్టింది. -
బుర్జ్ ఖలీఫాపై ఆమె చిత్రాన్ని ప్రదర్శించారు!
సాక్షి, వెల్లింగ్టన్: యూఏఈ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన తమ కట్టడం బుర్జ్ ఖలీఫాపై న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డర్న్ చిత్రాన్ని ప్రదర్శించింది. ఈ నెల 15న న్యూజిలాండ్‌లోని రెండు మసీదులపై శ్వేత జాతీయుడు కాల్పులు జరిపినప్పుడు తక్షణమే స్పందించి, అక్కడి ముస్లింలకు అండగా నిలబడినందుకు కృతజ్ఞతగా యూఏఈ ప్రభుత్వం ఆమె చిత్రాన్ని బుర్జ్పై ప్రదర్శించింది. న్యూజిలాండ్ జరిగిన ఆ కాల్పుల్లో ఐదుగురు భారతీయులు కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అలీ మక్తమ్ ముస్లింలకు బాసటగా నిలిచిన జసింగా ఆర్డర్న్‌కు ధన్యవాదాలు తెలుపుతూ బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించిన ఆమె ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. న్యూజిలాండ్‌లో జరిగిన దాడితో మొత్తం ముస్లిం సమాజం భయాందోళనలకు గురైందని.. సరైన సమయంలో బాధితులకు భరోసాగా నిలిచిన జసిండా 1.5 బిలియన్ల ముస్లింల మనసులను గెలుచుకున్నారనేది ఆయన ప్రశంసించారు. ఈ ట్వీట్‌కు జసిండా బదులిస్తూ.. ‘న్యూజిలాండ్‌లో పుట్టకపోయినా, ఈ ప్రాంతంలో జీవించడానికి నిర్ణయించుకొని వలస వచ్చిన వారికి రక్షణ కల్పించే బాధ్యత మా మీదే ఉంది. తమ సంస్కృతీ, సంప్రదాయాలను స్వేచ్ఛగా పాటించే హక్కు ఇక్కడ నివసిస్తున్న వలస ప్రజలకూ ఉంది. అలాంటి వారికి మేం అండగా ఉంటాం’ అని తెలిపారు. మార్చి 15న జరిగిన కాల్పుల నుంచి న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌తోపాటు, పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ జట్టు తృటిలో తప్పించుకున్నాయి. రెండు జట్ల మధ్య జరగాల్సిన మూడో టెస్ట్ రద్దు చేసి, బంగ్లా టీమ్‌ను వెంటనే స్వదేశానికి పంపే ఏర్పాట్లను చేసింది అక్కడి ప్రభుత్వం. కాల్పులకు తెగబడ్డ వ్యక్తి బ్రెండన్ టరెంట్ (28)ను ఆస్ట్రేలియన్‌గా భావిస్తున్నారు. ఏప్రిల్ 5న టరెంట్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. -
కూటికని పోయి ‘కాటికి’పోయిర్రు
సాక్షి, ఖానాపూర్: పొట్ట కూటి కోసం ఎడారి దేశాలకు వలస వెళ్లిన బతుకులకు భరోసా కరువైంది. ఉన్న ఊరిలో ఉపాధి కరువై.. నెర్రెలు బారిన నేలతల్లి ఆదుకోక.. ఆర్థికంగా చితికి.. అప్పు మూటతో విదేశాలకు వెళ్లిన వారిలో మోసపోయిన వారు కొందరైతే.. తిరిగిరాని లోకాలకు చేరిన వారు మరికొందరు. నిస్సహాయ స్థితిలో ఉన్న బాధిత కుటుంబాలకు గల్ఫ్ మానని గాయాలు మిగిల్చింది. అక్కడ జరిగిన పలు ప్రమాదాలతో పాటు గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు, వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాల గుండె కోత తీర్చలేనిది. ఆయా కుటుంబాలకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఎక్స్‌గ్రేషియా రాకపోవడంతో వారంతా దీనస్థితిలో ఉన్నారు. మోసపోతున్న కుటుంబాలు... గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్న వలసజీవుల బాధలు చెప్పలేకుండా ఉన్నాయి. బోగస్ ఏజెంట్లు నకిలీ, విజిట్ వీసాలను కంపెనీ వీసాలుగా నమ్మిస్తే గంపెడాశతో అక్కడికి వెళ్లిన అనేక మంది దిక్కుతోచని స్థితిలో ఉండగా ఎంతో మంది పలు కారణాలతో మృత్యువాత పడుతున్నారు. వీటన్నింటిని నకిలీ ఏజెంట్ వ్యవస్థే శాసిస్తోంది. అనివార్య కారణాలతో మృతి చెందిన కుటుంబాల మృతదేహాలు సైతం స్వదేశానికి తీసుకురావడానికి ఏడాదికిపైగా బాధిత కుటుంబాలు తడారిన కళ్లతో వేచి చూడాల్సి దుస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు గల్ఫ్ సమస్యలను మేనిఫెస్టోలో చేర్చి వలస కుటుంబాలకు న్యాయం చేసేలా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఇవీ నిబంధనలు... విదేశాల్లో ఉన్న ఉద్యోగ నియామకాలు జరిపే కంపెనీలు విధిగా కేంద్ర విదేశాంగ శాఖ లైసెన్స్ పొంది ఉండాలి. కేంద్రం వద్ద రూ. 50 లక్షలు డిపాజిట్ చేయాలి. వారికి అనుమతించిన పరిధిలోనే నియామకాలు జరపాలి. ఉద్యోగ వివరాలతో పత్రిక ప్రకటన ఇవ్వాలి. స్థానికులు, అధికారుల అనుమతి పొంది ఉండాలనే నిబంధనలు కేంద్ర ప్రభుత్వం పెట్టింది. వీటిని పాటించని కంపెనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తే వారి డిపాజిట్ జప్తుతో పాటు లైసెన్స్ రద్దు అవుతుంది. అయితే బహిరంగంగా నకిలీ ఏజెంట్లు నిర్వహించే ఇంటర్వ్యూలు, జారీచేసే ప్రకటనలపై స్థానిక పోలీసు, రెవెన్యూ విభాగాలు కఠినంగా వ్యవహరించడం లేదనే విమర్శలున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తామని, పాస్‌పోర్టులు మొదలు వీసాలు, టికెట్ల సేవలందించే పేరుతో ఏర్పాటు చేసే సంస్థల్లో బోగస్‌వే ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల వరకు ఇలాంటి ఏజెన్సీలు ఉన్నాయి. రెండు ప్రభుత్వ కంపెనీలైనా ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓంకాం, స్వరాష్ట్రంలో ఏర్పాటు చేసిన టాంకాంతో పాటు 29 కంపెనీలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లైసెన్స్‌లు ఉన్నాయి. తగ్గని గల్ఫ్ చావులు.. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలోని ఎంతో మంది గల్ఫ్ కార్మికులు వివిధ కంపెనీల్లో పనిచేయగా, వేలాది మంది కార్మికులు వీసాలు లేకుండా కల్లివెల్లి అవుతున్నారు. గల్ఫ్ నుంచి వచ్చిన మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు(ఫైల్) ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఆశల సౌదంలో గల్ఫ్ బాట పడుతున్న పలువురు అక్కడే మృత్యువాత పడుతున్నారు. రోడ్డు ప్రమాదంలో కొందరు మృతి చెందుతుండగా.. అధిక పనిబారం, వేతనం తక్కువ, కంపెనీల వేదింపులతో ఎంతో మంది గుండెపోటుకు గురవ్వడం, ఆత్మహత్యలు చేసుకోవడం, అనారోగ్యంతో మృతి చెందడం జరుగుతుంది. ఒకే ప్రమాదంలో జిల్లాలోని ముగ్గురు మృతి దుబాయ్‌లోని అబుదాబికి 10 కిలోమీటర్ల దూరంలోఉన్న అల్రీమ్ ఐలాండ్‌లో గతేడాది అక్టోబర్ 19న జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణలోని ఐదుగురు కార్మికులు అక్కడిక్కడే కాలి బూడిద కాగా, అందులో జిల్లావాసులే ముగ్గురు ఉన్నారు. సత్తన్‌పల్లికి చెందిన ప్రకాశ్ మృతితో పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబం ఈ ప్రమాదంలో క్యాంపులోని రూం నెం.20లో గల నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సేవానాయక్ తండాకు చెందిన ఎం.ప్రకాష్ నాయక్ (29), రూం నెం.30లో మామడ మండలం పొన్కల్‌కు చెందిన గాండ్ల్ల అఖిలేష్ (22), సారంగాపూర్‌కు చెందిన మంచాల నరేష్ (29) ఉండగా.. రూం నెం.17లో గల కామారెడ్డిలోని మాచారెడ్డి చౌరస్తాకు చెందిన పిట్ల నరేష్ (25), నిజామాబాద్ జిల్లా నందిపేట్‌కు చెందిన తోట రాకేశ్ (32)లు ఆహుతయ్యారు. గల్ఫ్‌లోనూ నిబంధనలు తూచ్ .. దుబాయిలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనలో సదరు కంపెనీ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. సెంచురి అనే కంపెనీకి చెందిన జిలానీ అనే క్యాంపును నిర్వాహకుల నుంచి గల్ఫ్ డ్యూమ్స్ అనే కంపెనీ అద్దెకు తీసుకుని, తన కంపెనీకి చెందిన కార్మికులకు వసతి కల్పించింది. ఈ క్యాంపు యూఏఈ ప్రభుత్వ నింబంధనల ప్రకారం లేదు. ఇది 30ఏళ్ల క్రితం నిర్మించిన రేకుల షెడ్డులో ఉంది. అక్కడి అనేక క్యాంపుల్లో గ్యాస్‌ను కాని, బయట ఆహారాన్ని గాని క్యాంపుల్లోకి అనుమతించరు. దుబాయ్‌లోని కంపెనీలో అగ్నిప్రమాద దృశ్యం(ఫైల్) అలాగే ఈ క్యాంపులో కూడా ఎలాంటి గ్యాస్ సిలిండర్లను, వంట చేసుకోవడానికి అనుమతించరు. క్యాంపునకు సమీపంలో ఉన్న మెస్‌లోనే వీరంతా భోజనం చేస్తారని అక్కడి కార్మికులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి కారణం కార్బన్ మిథైల్, టోక్సిస్ గ్యాసెస్ అయి ఉంటాయని వీటికి చాలా వేగంగా మండే గుణం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ ప్రమాదానికి గ్యాస్‌సిలిండర్ అనే సమస్యే తలెత్తదని పేర్కొన్నారు. కేవలం షార్ట్‌సర్క్యూట్ కారణంతోనే కార్మికులు మృతి చెందారని సంఘటన తీరుతో తెలిసింది. -
దుబాయ్ వీధుల్లో దుర్భర జీవితం
దుబాయ్ నుంచి జనార్దన్‌రెడ్డి : ఎడారి దేశం దుబాయ్‌లో తెలంగాణ జిల్లాల కార్మికులు కొందరు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కల్లివెల్లి కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. యూఏఈ ప్రభుత్వం అమలు చేస్తున్న క్షమాభిక్షను సద్వినియోగం చేసుకుని ఇంటికి చేరుకోవాలంటే తమకు మొదట్లో వీసా జారీ చేసిన కంపెనీలకు వలస కార్మికులు జరిమానా చెల్లించాల్సి ఉంది. జరిమానా చెల్లించే స్థోమత లేక ఎంతో మంది కార్మికులు ఇంటికి చేరుకోలేకపోతున్నారు. వలస కార్మికులు నివాసం ఉన్న చోట ఉండాలంటే గదికి అద్దె, భోజనానికి కొంత పైకం చెల్లించాలి. అయితే.. చేతిలో చిల్లిగవ్వ లేక బల్దియా పార్కులు, ట్రక్కుల మెకానిక్ షెడ్లను ఆవాసంగా మార్చుకుని రోజులు వెళ్లదీస్తున్నారు. కొందరు కార్మికులైతే నిలచి ఉన్న ట్రక్కుల పైభాగంలో సేద తీరుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యూఏఈలో చట్టవిరుద్ధంగా ఉంటున్న కార్మికులు ఇంటికి వెళ్లడానికి ఔట్‌పాస్ కోసం 500 ధరమ్స్ నుంచి 1,000 ధరమ్స్ వరకు జరిమానాగా చెల్లించాల్సి ఉంది. మన కరెన్సీలో రూ.7,500 నుంచి రూ.19 వేల వరకు అన్నమాట. కల్లివెల్లి కార్మికులు జరిమానా చెల్లిస్తేనే వారికి గతంలో వీసా జారీ చేసిన కంపెనీలు ఔట్‌పాస్ జారీకి ఆమోదం తెలుపుతాయి. అయితే.. క్షమాభిక్ష కార్మికులకు విమాన టిక్కెట్లను ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ.. కార్మికులు చెల్లించాల్సిన జరిమానా విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేక పోయింది. నిబంధనలు సవరిస్తేనే కార్మికులకు విముక్తి యూఏఈలో చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు జరిమానా చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం చేయూత ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం విమాన టికెట్లు ఉచితంగా పంపిణీ చేయడానికి విమానయాన సంస్థలకు చెక్కు రూపంలో చెల్లింపులు జరిపారు. అయితే.. కల్లివెల్లి కార్మికులు చెల్లించే జరిమానాలకు నగదు రూపంలో ప్రభుత్వం సహాయం అందించాల్సి ఉంది. కానీ.. నిబంధనల ప్రకారం నగదు చెల్లింపులకు అనుమతి లేదని ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధి చిట్టిబాబు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో యూఏఈలో కల్లివెల్లి కార్మికులు జరిమానా చెల్లించడానికి ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోవాల్సి ఉంది. గల్ఫ్‌లో పని చేసి ఇంటికి డబ్బులు పంపించాల్సింది పోయి ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఎదురుకావడంతో కార్మికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రూ.లక్షల్లో అప్పులు చేసి దుబాయ్‌కి ఎంతో ఆశతో వచ్చిన తాము నిరాశతో వెనుదిరుగుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనలను సవరించి కార్మికుల తరఫున జరిమానాను చెల్లించడానికి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎండలో ఎండుతూ.. చలికి వణుకుతూ.. పార్కులు, ట్రక్కులు, షెడ్లలో తలదాచుకుంటున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పగటి పూట ఎండ వేడిమికి, రాత్రిపూట చలి తీవ్రతను తట్టుకోలేక వణికిపోతున్నారు. కాగా.. బయట ఉంటున్న వారిపై కొందరు విదేశీ వ్యక్తులు ముఖ్యంగా పాకిస్తాన్‌కు చెందిన దుండగులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికుల వద్ద ఉన్న బ్యాగులను దుండగులు అపహరిస్తున్నారు. దీంతో కార్మికులు ఆదమరిస్తే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వాహనాలు ఏర్పాటు చేసిన నర్సింలు యూఏఈ క్షమాభిక్షను వినియోగించుకోవాలనుకునే కార్మికులకు మెదక్ జిల్లాకు చెందిన గుండేటి నర్సింలు అందించిన సహకారం ఎంతో ఉంది. ఒకప్పుడు కల్లివెల్లి కార్మికునిగా దుబాయ్‌లో పనిచేసిన నర్సింలు ఇప్పుడు ఒక కంపెనీకి యజమాని అయ్యాడు. కార్మికుల కష్టాలను గుర్తెరిగిన ఆయన.. వారి కష్టాలను తన కష్టాలుగా భావించి తన కంపెనీ వాహనాలను క్షమాభిక్ష కార్మికుల కోసం వినియోగించాడు. క్షమాభిక్ష పొందిన కార్మికులు లేబర్ క్యాంపుల నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి నర్సింలు వాహనాలను తిప్పాడు. అంతేకాక రాయబార కార్యాలయంలో కార్మికులకు అవసరమైన సేవలను అందించాడు. కార్మికులకు ఎన్నో విధాలుగా సేవలు అందించిన నర్సింలును అందరూ అభినందిస్తున్నారు. 84 మందికి విముక్తి కలిగించాం యూఏఈ క్షమాభిక్షను వినియోగించుకున్న 84 మంది కార్మికులను రెండు దశల్లో ఇంటికి చేర్పించాం. కొంత మంది కార్మికులు స్వచ్ఛందంగానే ఇంటికి చేరుకున్నారు. మరికొంత మందికి తెలంగాణ ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలను అందించాం. జరిమానా చెల్లించలేని స్థితిలో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి మంత్రి కేటీఆర్‌కు విన్నవించాం. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. –కొటపాటి నర్సింహానాయుడు, ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధి -
నగరానికి గల్ఫ్ క్షమాభిక్ష బాధితులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం గల్ఫ్‌కు వలస వెళ్లి పలు కేసుల్లో చిక్కుకుని, అక్కడి ప్రభుత్వం నుంచి క్షమాభిక్ష పొందిన బాధితులు హైదరాబాద్ చేరుకున్నారు. యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష సాయంతో మంగళవారం రాష్ట్రానికి తిరిగి వచ్చిన 30 మంది గల్ఫ్ బాధితులకు రాష్ట్ర ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కె.తారక రామారావు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సరైన వీసా లేని తెలంగాణ వాసులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు యూఏఈకి వెళ్లిన రాష్ట్ర అధికారుల బృందం చొరవతో వీరు రాష్ట్రానికి చేరుకున్నారు. మంత్రి కేటీఆర్ విమానాశ్రయంలో వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సరైన వీసాలు లేకుండా వలస వెళ్లడంతో ఎదుర్కొన్న సమస్యలను మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. అబుదాబిలో తెలుగు భాష వచ్చే అధికారులు అందుబాటులో ఉంటే మరింత సౌకర్యంగా ఉంటుందనే విషయాన్ని మంత్రికి తెలిపారు. టికెట్ల కొనుగోళ్లతోపాటు వివిధ కేసులకు సంబంధించిన బకాయి జరిమానాలను చెల్లించేందుకు డబ్బుల్లేక చాలా మంది క్షమాభిక్ష అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారని మంత్రికి వివరించారు. అలాంటివారికి టికెట్లను ప్రభుత్వమే సమకూరుస్తుందని, జరిమానాల విషయంలోనూ సహకరిస్తుందని మంత్రి వారికి భరోసా కల్పించారు. భారత రాయబారితో స్వయంగా మాట్లాడి గల్ఫ్ బాధితులకు సహకరించాలని కోరుతానన్నారు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన బాధితులకు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వారితో త్వరలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. క్షమాభిక్ష సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకునే వారు తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ ఫోన్ నంబర్ 9440854433ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు రాజేంద్రనగర్ మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ఉన్నారు. -
విదేశీ కార్మికులకు క్షమాభిక్ష
దుబాయ్: గడువు తీరిన తర్వాత దేశంలో నివసిస్తూ పట్టుబడిన కార్మికులకు యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ఇందులో భాగంగా 3 నెలల క్షమాభిక్ష కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న లక్షల మంది భారతీయులు సహా విదేశీ కార్మికులకు ఇది లబ్ధిచేకూర్చనుంది. ఈ కార్యక్రమం ద్వారా జరిమానాల్లేకుండా దేశం విడిచి వెళ్లడం లేదా ఆర్నెల్లలో ఉద్యోగం వెతుక్కునే చాన్సుంటుంది. యూఏఈ అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలో 28లక్షల మంది భారతీయ వలసదారులున్నారు. ఇందులో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు 15–20% కాగా, 20 శాతం మంది వివిధ ఉద్యోగాల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. మిగిలిన 65% మంది వివిధ పరిశ్రమల్లో కార్మికులు. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు క్షమాభిక్ష అమల్లో ఉంటుందని ఈ మధ్యలోనే అక్రమంగా ఉంటున్న వారు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని యూఏఈ గుర్తింపు, పౌరసత్వ సంస్థ స్పష్టం చేసింది. ఈ దిశగా దేశ వ్యాప్తంగా కమ్యూనిటీ సెంటర్లు, వివిధ బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కేంద్రాలను ఏర్పాటుచేశారు. బుధవారం ముగ్గురు భారతీయులు అబుదాబిలోని బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సెంటర్లో క్షమాభిక్ష కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. తొలిరోజే కావడంతో సంఖ్య పలుచగా ఉందని.. రానున్న రోజుల్లో మరింత మంది రావొచ్చని భావిస్తున్నారు. యూఏఈలో ఉన్న భారత కార్మికుల్లో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారే ఉన్నారు. ‘క్షమాభిక్ష గురించి సమాచారం తెలిసింది. స్వామి అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఏ1 ఆమ్నెస్టీ సెంటర్లో దరఖాస్తు చేసుకున్నారు. యూఏఈలో యజమాని.. భారత్‌లో ఉన్న తన కుటుంబసభ్యులతో మాట్లాడనివ్వనందునే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని లక్ష్మీదేవి రెడ్డి అనే మహిళ పేర్కొన్నారు. జూన్‌లోనే తన ఔట్‌పాస్ గడువు ముగిసిందని ఆమె తెలిపారు. యజమాని తనపై కేసు వేసినందున పోలీసు క్లియరెన్స్ రాలేదని.. మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆమె చెప్పారు. -
ఆమ్నెస్టీపై కార్మికులకు అవగాహన
మోర్తాడ్: యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ(క్షమాభిక్ష)పై కార్మికులకు ప్రధానంగా తెలంగాణ జిల్లాల వారికి అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తుంది. యూఏఈ పరిధిలోని వివిధ పట్టణాల్లోని కార్మికుల క్యాంపుల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు ఆమ్నెస్టీని సద్వినియోగం చేసుకుని స్వదేశానికి రావడం లేదా వీసా, వర్క్ పర్మిట్లను పునరుద్ధరించుకుని ఉపాధి పొందాలనే సూచనలతో ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధుల అవగాహన శిబిరాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ కార్మికుల కోసం నిర్వహిస్తున్న అవగాహన శిబిరాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి ‘సాక్షి’తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన, ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ బీఎం వినోద్ కుమార్ సలహా మేరకు తాను దుబాయ్‌లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. షార్జాలోని సోనాపూర్ శిబిరానికి దుబాయ్‌లోని తమ ప్రతినిధి ముత్యాల మారుతి ఆధ్వర్యంలో ఈరోజు వెళ్లి కార్మికులకు ఆమ్నెస్టీ విధి విధానాలపై అవగాహన కల్పించామన్నారు. దుబాయ్, అబుదాబి, షార్జా తదితర పట్టణాల్లో ఉంటున్న తెలంగాణ జిల్లాలకు చెందిన కల్లిబిల్లి కార్మికులు యూఏఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆమ్నెస్టీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించినట్లు నంగి దేవేందర్ రెడ్డి తెలిపారు. ఇది ఇలా ఉండగా తెలంగాణలోని గల్ఫ్ కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేందుకు మేనిఫెస్టోలో పేర్కొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై కార్మికులకు వివరిస్తున్నామని వెల్లడించారు. యూఏఈలో ఐదేళ్ల విరామం తరువాత అక్కడి ప్రభుత్వం క్షమాభిక్షను ఆగష్టు ఒకటో తేదీ నుంచి మూడు నెలల పాటు అమలు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఆమ్నెస్టీపై ఇటీవలే యూఏఈ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెల్లడించింది. ‘ప్రొటెæక్ట్ యువర్ సెల్ఫ్ వయా రెక్టిఫై యువర్ స్టేటస్’ అనే కార్యక్రమం ద్వారా యూఏఈ ప్రభుత్వం చట్ట విరుద్దంగా ఉన్న విదేశీ కార్మికుల కోసం ఆమ్నెస్టీని ప్రకటించింది. ఈ ఆమ్నెస్టీతో ఎక్కువగా ప్రయోజనం పొందే వారిలో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఉండటం విశేషం. -
ఇండియన్స్ విజిటింగ్ వీసాలపై రావద్దు!
దుబాయి(యూఏఈ): ఉపాధి కోసం యూఏఈ రావాలనుకునే వారు విజిటింగ్ వీసాలపై మాత్రం ఇక్కడికి రావద్దని యూఏఈ ప్రభుత్వం భారతీయులను కోరింది. వీసా మోసాలు, నకిలీ ధ్రువపత్రాలు పెద్ద సంఖ్యలో బయటపడుతున్న నేపథ్యంలో యూఏఈ ఈ మేరకు సూచనలు వెలువరించిందని దుబాయిలోని భారతీయ రాయబార కార్యాలయం వివరించింది. ప్రతిరోజు ఇందుకు సంబంధించి వందలాదిగా బాధితుల నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయని తెలిపింది. ఇలా మోసపోయి విజిటింగ్ వీసాలపై 2016లో యూఏఈకి వచ్చిన 225 మంది భారతీయులను, 2017లో ఇప్పటివరకు 186 మందికి టికెట్లు కొనుగోలు చేసి ఇచ్చి ప్రభుత్వం వెనక్కి పంపిందని పేర్కొంది. నకిలీ వీసాలను భారతదేశంలో గుర్తించటం చాల కష్టమని భారత రాయబార కార్యాలయం వివరించింది. ఈ నేపథ్యంలోనే ఉపాధి కోసం వచ్చే భారతీయులు నమ్మకమైన వారి ద్వారా కచ్చితమైన ఉద్యోగ వీసా పత్రాలను, ధ్రువీకరణలను పొందాలని లేని పక్షంలో కష్టాలు తప్పవని హెచ్చరించింది.