Actor Sonu Sood Receives UAE Golden Visa: సోనూసూద్.. రీల్ విలన్ నుంచి రియల్ లైఫ్ హీరోగా మారాడు. సోనూసూద్ అంటే లాక్‌డౌన్ ముందు వరకు విలన్‌గానే అందరికీ తెలుసు, కానీ లాక్‌డౌన్ తర్వాత సీన్ మారింది. నిరుపేదలకు బాసటగా నిలుస్తూ, కార్మికులకు కొండంత అండగా పేద ప్రజల పాలిట పెన్నిధిగా మారి యువతకు రియల్ హీరో అయ్యాడీ రీల్ విలన్. అతడు చేసే సేవా కార్యక్రమాలకు యావత్ దేశం ఫిదా అయింది. 'ప్రభుత్వాలు చేయలేని సాయాన్ని మీరు చేశారంటూ' సోనూను ప్రతి ఒక్కరూ కొనియాడారు.
చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్
తాజాగా ఆయన దుబాయ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాతకమైన గౌరవాన్ని అందుకున్నాడు. సోనూసూద్ అహర్నిశలు శ్రమిస్తూ చేసిన సమాజ సేవకు గౌరవార్థవంగా 'యూఏఈ గోల్డెన్ వీసా'ను అందించింది. ఈ దుబాయ్ గోల్డెన్ వీసాను అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు సోనూసూద్. ఇంకా నేను ఈ గోల్డెన్ వీసాను అందుకోవడం చాలా గౌరవంగా ఉంది. నేను సందర్శించేందుకు ఇష్టపడే ప్రదేశాల్లో దుబాయ్ ఒకటి. ఇది అభివృద్ధి చేందడానికి అత్యద్భుతమైన చోటు. నేను అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అని సోనూసూద్ పేర్కొన్నాడు.
చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న హాట్ బ్యూటీ..
Comments
Please login to add a commentAdd a comment