Dubai government
-
దుబాయ్ బందీలకు విముక్తి
సిరిసిల్ల: దుబాయ్‌లోని అవీర్ జైల్లో 18 ఏళ్లుగా ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వలసజీవులు ఎట్టకేలకు విడుదల కానున్నారు. ఈనెల 21న జైలు నుంచి విడుదలై భారత్‌కు రానున్నారు. దుబాయ్ జైలు నుంచి నేరుగా భారత్‌కు వచ్చేందుకు విమాన టికెట్లు సిద్ధమయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం(48), శివరాత్రి రవి(45) అన్నదమ్ములు. కోనరావు పేటకు చెందిన దుండుగుల లక్ష్మణ్(48), చందుర్తికి చెందిన నాంపల్లి (గొల్లెం) వెంకటి(43), జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు(51), కరీంనగర్ జిల్లాకు చెందిన సయ్యద్ కరీం బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లారు. వీరిలో కరీం మినహా ఐదుగురు ఓ సెక్యూరిటీగార్డు హత్య కేసులో 18 ఏళ్లుగా దుబాయ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి విడుదల కోసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దుబాయ్ వెళ్లి ప్రయత్నం చేశారు. ఐదుగురు ఎన్నారై ఖైదీల విడుదల అంశాన్ని దుబాయ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, దుబాయ్ కాన్సుల్ జనరల్ రామ్‌కుమార్, ఈ కేసు వాదిస్తున్న అరబ్ న్యాయవాదితో మాట్లాడారు. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ క్షమాభిక్ష ప్రసాదించేలా ప్రయతి్నంచాలని కోరారు. ఆ దౌత్యం ఫలించి ఎట్టకేలకు మల్లేశం, రవి, హన్మంతు విడుదలవుతున్నారు. నాలుగు నెలల కిందట దుండుగుల లక్ష్మణ్ విడుదలయ్యారు. వెంకటి విడుదలకు కొంత సమయం పడుతుందని తెలిసింది. ఇదీ కేసు నేపథ్యం 2006లో దుబాయ్‌లోని జబల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ సంస్థ ఆవరణలో నేపాల్‌కు చెందిన దిల్ ప్రసాద్‌రాయ్ అనే సెక్యూరిటీగార్డు హత్య కు గురయ్యాడు. అక్కడ టన్నుల కొద్దీ ఉన్న ఇత్తడి విద్యుత్ తీగలను పది మంది కలిసి దొంగిలించేందుకు యత్నించారని, అడ్డుకున్న ప్రసాద్‌రాయ్‌ని హత్య చేశారని ఆరోపణలున్నాయి. ఈ కేసు నింది తుల్లో ఆరుగురు తెలంగాణ వారుకాగా, నలుగురు పాకిస్తానీయులు. ఈ పది మందిని అక్కడి కోర్టు దోషులుగా నిర్ధారిస్తూ.. పాకిస్తానీయులకు తొమ్మిదేళ్ల చొప్పున, తెలంగాణ వారికి పదేళ్ల చొప్పున శిక్ష విధించింది. శిక్ష పూర్తి చేసుకున్న నలుగురు పాకిస్తానీయులు, సయ్యద్ కరీం విడుదలయ్యారు. మిగిలిన వారికి హత్యకేసులో క్షమాభిక్ష లభించినా.. దొంగతనం, దేశం విడిచివెళ్లే ప్రయత్నం చేసిన కేసుల్లో జైల్లో ఉన్నారు. అప్పీలుకు వెళ్తే.. పెరిగిన శిక్ష జైల్లో ఉన్న ఐదుగురి విడుదల కోసం హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. ఆ నిర్ణయమే వారి పాలిట శాపంగా మారింది. హైకోర్టులో ఈ కేసులు విచారించిన ధర్మాసనం ఈ హత్యను క్రూరమైనదిగా పరిగణించింది. మల్లేశం, రవి, వెంకటి, హన్మంతు, లక్ష్మణ్‌లకు కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను 2015లో యావజ్జీవ కారాగార శిక్షకు పెంచింది. నేరం నుంచి తప్పించునేందుకు కత్తిని పూడ్చిపెట్టడంతోపాటు, అక్రమంగా దేశం దాటేందుకు ప్రయత్నించారని.. ఇవన్నీ తీవ్రమైన నేరాలని ధర్మాసనం పేర్కొంది. దీంతో దోషుల విడుదల ఆలస్యమైంది. అయితే, నాడు మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. -
డ్రాగన్‌మార్ట్‌కు పోటీగా ‘భారత్‌మార్ట్’.. ఎక్కడో తెలుసా..
భారతప్రధాని మోదీ దుబాయ్ పర్యటనలో భాగంగా ‘భారత్ మార్ట్’కు శంకుస్థాపన చేశారు. యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌తో కలిసి మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్‌లోని జెబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్లో రిటైల్, వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ సౌకర్యాలను అందించేలా ఈ మార్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. భారత్ మార్ట్ దుబాయ్‌కు చెందిన లాజిస్టిక్స్, పోర్ట్ టెర్మినల్ కార్యకలాపాలు, మెరిటైమ్ సేవలను అందిస్తున్న డీపీ వరల్డ్‌తో కలిసి రూపొందించనున్నారు. భారత్‌లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తయారుచేస్తున్న ఉత్పత్తుల ఎగుమతులకు ఈ మార్ట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిసింది. దాదాపు 1,00,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే ఈ మార్ట్ 2025 వరకు కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. చైనాకు పోటీగా.. ప్రధానంగా ఈమార్ట్ వల్ల దుబాయ్‌తోపాటు దగ్గర్లోని ఇతర దేశాలకు త్వరగా సరుకులు రవాణాచేసేలా వీలవుతుంది. దాంతో సమయం, రవాణా ఖర్చులు తగ్గి ప్రపంచంలోని ఇతర దేశాలకు భారత ఉత్పత్తుల ఎగుమతులు పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. గల్ఫ్, పశ్చిమాసియా, ఆఫ్రికా, యురేషియాలోని అంతర్జాతీయ కొనుగోలుదారులకు ఇది వేదికగా మారనుంది. దుబాయ్‌లో నెలకొల్పనున్న భారత్ మార్ట్ చైనాకు చెందిన డ్రాగన్ మార్ట్‌తో పోటీపడనుంది. డ్రాగన్ మార్ట్‌లాగా భారత్ మార్ట్ కూడా దుబాయ్‌లో అనేక ఉత్పత్తులను విక్రయించనుంది. పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు.. మహ్మద్ బిన్ రషీద్‌తో మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, అంతరిక్షం, విద్య, ప్రజల మధ్య సంబంధాలతో సహా అనేక రంగాలలో సహకారంపై చర్చించారు. భారత్, యుఏఈ మధ్య పెరుగుతున్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కొత్తప్లాన్‌తో భారత్‌లోకి టెస్లా.. ప్రయత్నం ఫలిస్తుందా..? ఈ నేపథ్యంలో 2022లో ఇరు దేశాలు కుదుర్చుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యాన్ని గుర్తించి ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు చేశారు. దుబాయ్‌లో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించేలా ప్రత్యేక కమ్యూనిటీ హాస్పిటల్ కోసం భూమిని కేటాయించారు. -
దుబాయ్‌లో మద్యంపై పన్ను రద్దు
దుబాయ్: పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాలపై ఇప్పటిదాకా విధిస్తున్న 30 శాతం పన్నును పూర్తిగా రద్దు చేసింది. ఇది ఆదివారం నుంచే అమల్లో వచ్చింది. అంతేకాకుండా వ్యక్తిగత ఆల్కహాల్ లైసెన్స్‌లకు ఇకపై ఎలాంటి చార్జీ వసూలు చేయబోరు. దుబాయ్‌లో ఎవరైనా ఇళ్లలో మద్యం సేవించాలంటే వ్యక్తిగత ఆల్కహాల్ లైసెన్స్ ఉండాల్సిందే. దుబాయ్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో మద్యం విషయంలో కొన్ని చట్టాలను సడలిస్తోంది. అయితే, పన్ను రద్దు అనేది తాత్కాలికమా? లేక శాశ్వతమా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
సోనూసూద్‌కు దుబాయ్ నుంచి అరుదైన గౌరవం..
Actor Sonu Sood Receives UAE Golden Visa: సోనూసూద్.. రీల్ విలన్ నుంచి రియల్ లైఫ్ హీరోగా మారాడు. సోనూసూద్ అంటే లాక్డౌన్ ముందు వరకు విలన్‌గానే అందరికీ తెలుసు, కానీ లాక్డౌన్ తర్వాత సీన్ మారింది. నిరుపేదలకు బాసటగా నిలుస్తూ, కార్మికులకు కొండంత అండగా పేద ప్రజల పాలిట పెన్నిధిగా మారి యువతకు రియల్ హీరో అయ్యాడీ రీల్ విలన్. అతడు చేసే సేవా కార్యక్రమాలకు యావత్ దేశం ఫిదా అయింది. 'ప్రభుత్వాలు చేయలేని సాయాన్ని మీరు చేశారంటూ' సోనూను ప్రతి ఒక్కరూ కొనియాడారు. చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్ తాజాగా ఆయన దుబాయ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాతకమైన గౌరవాన్ని అందుకున్నాడు. సోనూసూద్ అహర్నిశలు శ్రమిస్తూ చేసిన సమాజ సేవకు గౌరవార్థవంగా 'యూఏఈ గోల్డెన్ వీసా'ను అందించింది. ఈ దుబాయ్ గోల్డెన్ వీసాను అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు సోనూసూద్. ఇంకా నేను ఈ గోల్డెన్ వీసాను అందుకోవడం చాలా గౌరవంగా ఉంది. నేను సందర్శించేందుకు ఇష్టపడే ప్రదేశాల్లో దుబాయ్ ఒకటి. ఇది అభివృద్ధి చేందడానికి అత్యద్భుతమైన చోటు. నేను అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అని సోనూసూద్ పేర్కొన్నాడు. చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న హాట్ బ్యూటీ.. -
అరుదైన ఘనత.. చరిత్ర సృష్టించిన దుబాయ్
UAE City Dubai world's first govt to go 100% paperless: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ నగరం దుబాయ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 100 శాతం పేపర్‌లెస్ గవర్నమెంట్ ఖ్యాతి దక్కించుకుంది. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల సేవలను, ట్రాన్జాక్షన్స్ను ‘డిజిటల్ ఫార్మట్’లోనే కొనసాగిస్తూ.. ఈ ఘనత అందుకుంది దుబాయ్ నగరం. వంద శాతం ‘పేపర్‌లెస్’ సాధించిన తొలి ప్రభుత్వంగా దుబాయ్ సిటీ నిలిచింది. ఈ మేరకు ఎమిరేట్స్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. తద్వారా 14 మిలియన్ గంటల మనిషి శ్రమను.. 1.3 బిలియన్ దిర్హమ్(350 మిలియన్ డాలర్లు) ఆదా చేసినట్లు పేర్కొన్నారాయన. ప్రభుత్వానికి సంబంధించి ఇంటర్నల్, బయటి ట్రాన్జాక్షన్స్తో పాటు.. ప్రభుత్వానికి సంబంధించి ప్రతీ సేవలను డిజిటల్ పద్దతిలో.. అదీ ప్రభుత్వ వేదికల మీదుగానే సాగిందని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించుకుంది. మొత్తం 45 ప్రభుత్వ రంగాల్లో 1,800 రకాల డిజిటల్ సేవలను .. అదీ ఆలస్యం అవ్వకుండా డిజిటల్ ఫార్మట్‌లో ప్రజలకు చేరవేయడం విశేషం. ఈ క్రమంలో నగరవాసులపై ప్రభుత్వం ఏమాత్రం ఒత్తిడి చేయకుండా.. స్వచ్ఛందంగా ఈ ఘనత సాధించింది. పేపర్‌లెస్ ఘనత ప్రపంచానికి డిజిటల్ క్యాపిటల్‌గా నిలవడానికి దుబాయ్‌కు ఎంతో ప్రొద్భలం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు క్రౌన్ ప్రిన్స్. అంతేకాదు మరో ఐదు దశాబ్దాలపాటు అత్యాధునిక వ్యూహాలతో దుబాయ్‌లో డిజిటల్ లైఫ్ కొనసాగేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారాయన. ఇదిలా ఉంటే అమెరికా(ఖండాలు), యూకే, యూరప్ దేశాల్లో ప్రభుత్వాలు ఈ తరహా విధానానికి మొగ్గు చూపించినప్పటికీ.. సైబర్ దాడుల భయంతో వెనక్కి తగ్గాయి. కానీ, దుబాయ్ మాత్రం ధైర్యం చేసి ముందడుగు వేసి.. ఈ ఫీట్ సాధించింది. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ మూమెంట్‌తో 336 మిలియన్ పేపర్లను, 1.3 బిలియన్ దిర్హమ్(350 మిలియన్ డాలర్లు) బడ్జెట్‌ను, 14 మిలియన్ గంటల ఉద్యోగుల శ్రమను మిగిల్చింది దుబాయ్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ప్రపంచంలో రిచ్చెస్ట్ సిటీల్లో ఒకటిగా ఉన్న దుబాయ్ జనాభా 35 లక్షలు కాగా.. మెట్రో ఏరియాలో జనాభా 29 లక్షలకు పైనే ఉంది. చదవండి: అర్జెంటీనా టు అస్సాం వయా దుబాయ్.. ఖరీదు 20లక్షలకుపైనే! -
భారత్‌లో దుబాయ్ ఎమిరేట్స్ విమాన సర్వీసుల పునః ప్రాంరంభం
దుబాయ్: భారత్‌తో సహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణలపై ఉన్న ఆంక్షలను సడలిస్తున్నట్లు యుఏఈలోని దుబాయ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లో దుబాయ్ ఎమిరేట్స్ విమాన సర్వీసుల పునః ప్రాంరంభిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 23 నుంచి విమాన సర్వీసులు నడపాలని దుబాయ్ ఎమిరేట్స్ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వెళ్లే ప్రయాణికులపై యూఏఈ ప్రోటోకాల్స్ జారీ చేసింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులను అనుమతించనున్నట్లు పేర్కొంది. భారత్, దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాల విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా, భారతదేశం, దక్షిణాఫ్రికా, నైజీరియా నుంచి దుబాయ్ వచ్చే ప్రయాణీకులను తిరిగి అనుమతించడానికి దుబాయ్ సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకటించిన తాజా ప్రోటోకాల్స్‌ను ఎమిరేట్స్ స్వాగతించిందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. భారత్‌లో కరోనా మహమ్మారి సెకండ వేవ్‌లో కరోనా కేసులు పెరగడంతో యూఏఈ ఏప్రిల్ చివరలో సరిహద్దులను మూసివేసిన సంగతి తెలిసిందే. చదవండి: వైరల్ వీడియో: మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్ ఏది? -
దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు శ్రీదేవి భౌతిక కాయం
దుబాయ్ : ప్రముఖ సినీనటి శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్ ముగిసింది. అనంతరం ఆమె మృతదేహాన్నిభర్త బోనీకపూర్‌కు అప్పగించారు. శ్రీదేవి మృతదేహానికి ఎంబామింగ్ చేస్తున్న సమయంలో బోనీకపూర్, ఖుషీ కపూర్ కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం శ్రీదేవి పార్థీవ దేహం దుబాయి ఎయిర్ పోర్ట్‌కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకు వెళ్లనున్నారు. శ్రీదేవి మృతదేహం రాత్రి 9గంటలకల్లా ముంబై చేరే అవకాశం ఉంది. మరోవైపు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్...శ్రీదేవి మృతిపై విచారణను ముగించింది. అన్ని కోణాల్లో విచారణ జరిపామని, ఆమె మృతి వెనుక ఎలాంటి కుట్ర లేదని దుబాయ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పృహ కోల్పోయి టబ్‌లో పడిపోవటం వల్లే శ్రీదేవి మరణించిందని, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని, బోనీకపూర్ ముంబై వెళ్లవచ్చని దుబాయ్ ప్రభుత్వం పేర్కొంది. ఎంబామింగ్ అంటే... ఎంబామింగ్ అంటే కొన్ని సందర్భాల్లో మృతదేహాన్ని చాలా రోజులపాటు అంత్యక్రియలు నిర్వహించకుండా ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు మృతదేహం కుళ్లిపోకుండా చూడాలి. శరీరం కొంతకాలంపాటు దెబ్బతినకుండా ఉండేందుకు ఎంబామింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో కొన్ని రసాయనాలను ధమనుల ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ ద్రావకాలనే 'ఎంబామింగ్ ఫ్లూయిడ్స్' అని పిలుస్తారు. ఫార్మాల్డిహైడ్, మెథనాల్, ఇథనాల్‌తోపాటు మరికొన్ని రకాల రసాయనాలను ఈ ప్రక్రియలో వాడతారు. ఎంబామింగ్ ప్లూయిడ్స్ ని ఎక్కించడం వల్ల బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. అంటే, ఈ ఫ్లూయిడ్ ఏరకంగానూ బాక్టీరియాకు న్యూట్రియంట్ ఫ్లూయిడ్స్ గా పనిచేయవు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, సత్యసాయి బాబా మరణించినప్పుడు కూడా ఎంబామింగ్ చేసిన విషయం తెలిసిందే. గ్రూమింగ్.. తమ ఆత్మీయులు మరణించినప్పుడు వారి మృతదేహాన్ని కడసారి చూసిన రూపం చిరకాలం గుర్తుండిపోతుంది. ఆ 'తుది జ్ఞాపకం' ఇబ్బందికరంగా కాకుండా, ఎప్పట్లా ఆత్మీయంగానే ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఈ కోరికను బాడీ గ్రూమింగ్ తీరుస్తోంది. ఇది కూడా ఎంబామింగ్‌లో భాగమే. ఈ ప్రక్రియలో మరణించిన వ్యక్తి అంతకుముందు మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు తీసిన ఫొటోను ఉపయోగిస్తారు. -
క్షమాభిక్ష కోరిన తల్లి దయ చూపని ప్రభుత్వం
-
భారం: ఆ దేశాలకు ఒక బరువైన సమస్య...!
ప్రపంచానికి ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటి? ఏ సమస్య పరిష్కారం కోసం చాలా దేశాల ప్రభుత్వాలు కంకణం కట్టుకొని ప్రయత్నిస్తున్నాయి? ఏ విషయంలో కృషి చేసిన వారిని ప్రభుత్వాలు ప్రత్యేకంగా అభినందిస్తున్నాయి? వారికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి?! ఇలాంటి ప్రశ్నలు ఎదురైతే.. మనలో చాలా మంది ‘పచ్చదనం పరిశుభ్రత’ ‘అడవుల పెంపకం’ ‘కాలుష్య నియంత్రణ’ తరహా సమాధానం ఇచ్చేసుకొంటాం. అయితే ఈ రంగాల్లో కృషి చేస్తున్న వారి విషయం ఎలా ఉన్నా.. ఇప్పుడు ప్రపంచానికి ఒక ‘బరువైన’ సమస్య తలనొప్పిగా తయారైంది. ఆ సమస్యను పరిష్కరించడానికి అనేక దేశాల ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అదే ‘ఊబకాయం’. దుబాయ్‌లో బంగారం ఇస్తున్నారు! ఒక కిలోగ్రాము బరువు తగ్గారంటే ఒక గ్రాము బంగారం ఉచితం అనే బంపర్ ఆఫర్‌ను అమల్లో పెట్టింది దుబాయ్ ప్రభుత్వం. ఆ దేశ ప్రభుత్వానికి ప్రజల ఊబకాయం నిద్రలేకుండా చేస్తోంది. ఎలాగైనా సరే వాళ్లందరి బరువును తగ్గించాలని, ఫిట్‌గా ఉంచాలని అక్కడి ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. నిజానికి దుబాయ్ ప్రభుత్వం ప్రతిదానికీ రాయితీలు ఇస్తుండటంతో ఆ దేశప్రజలకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోతోంది. శారీరక శ్రమ చేయాల్సిన అవసరం తగ్గింది. చిన్న చిన్న పనులకు కూడా పరాయి దేశాల నంచి కూలీలను తెచ్చుకొనే సంస్కృతి ఉందక్కడ. దీంతో శారీరకంగా ఏమాత్రం కష్టపడని జనాలు ఊబకాయులు అవుతున్నారు. ఇప్పుడు దుబాయ్‌లో దాదాపు 40 శాతం మంది ఊబకాయం బాధితులే అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాయితీలతో ప్రజలను ఇలా తయారు చేసిన ప్రభుత్వం ఇప్పుడు అలాంటి విధానాలతోనే వారి బరువును తగ్గించడానికి పాటుపడుతోంది. ‘బరువు త గ్గండి బంగారం పొందండి’ అంటూ పదేపదే బంపర్ ఆఫర్లతో జనాలను ప్రలోభపరుస్తోంది. అయితే దీనికి వస్తున్న స్పందన అంతంత మాత్రమేనట! బ్రిటన్ పీఎం స్వయంగా రంగంలోకి దిగాడు! దుబాయ్లాగే పౌరుల ఊబకాయత్వంతో బాగా ఇబ్బందులు పడుతున్న దేశం బ్రిటన్. ఇక్కడ కూడా దాదాపు 30 శాతం ప్రజలు మితిమీరిన బరువుతో ఏ పనీ చేయలేకపోతున్నారట. ఆఖరికి సొంత పనులకు కూడా వీళ్లకు సహాయకుడు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే చిన్నపిల్లల్లో కూడా ఊబకాయ సమస్య తీవ్రస్థాయికి చేరింది. వాళ్లు తీసుకొనే ఆహారంలో కొవ్వులు ఎక్కువగా ఉంటున్నాయనీ, దీంతో శరీరాల్లో ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ పెరిగిపోతోందనీ వైద్యులు నిర్ధారిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు బ్రిటన్ ప్రధాని కామెరూన్. ప్రతి వారాంతంలోనూ క్యాలరీ, షుగర్ ఫ్రీ ఆహారాన్ని తీసుకొంటానని ఆయన ప్రకటించారు. శని, ఆదివారాల్లో కామెరూన్ తన శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరకుండా చూసుకొంటూ అందరికీ ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. తను పత్యం పాటిస్తున్నాడు కాబట్టి దేశంలో తనను అభిమానించే వాళ్లు ఆ విషయంలో ఆదర్శంగా తీసుకొంటారనీ, దీని వల్ల కొంతమేర అయినా ఊబకాయ సమస్య తగ్గుతుందనీ కామెరూన్ ఆశ. కేవలం దుబాయ్, బ్రిటన్లే కాదు. ఆర్థికంగా పుష్టిగా ఉన్న దేశాల్లో, ప్రజలకు రాయితీలను ఇచ్చి పెంచుతున్న అనేక దేశాలలో ఊబకాయం (ఒబేసిటీ) ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. దాన్ని నివారించడానికి ఎవరి పాట్లు వాళ్లు పడుతున్నారు. ఎందుకంటే ఊబకాయం దేశాల ఉత్పాద కతను తగ్గిస్తోంది. మానవ వనరుల్లో సోమరితనాన్ని పెంచుతోంది. ఇది భవిష్యత్తులో వైద్య పరంగానూ భారం అయ్యే ప్రమాదం ఉంది. చాలా దేశాల్లో ఇలా మితిమీరి తినడం, శారీరక శ్రమ చేయపోవడం జాతీయ విపత్తులుగా మారుతున్నాయి. ఏదేమైనా ప్రమాదాన్ని మొదట గుర్తించిన దేశాలు ఈ రెండు. వీటి సరసన నడవడానికి మరికొన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయి.