దుబాయ్: భారత్‌తో సహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణలపై ఉన్న ఆంక్షలను సడలిస్తున్నట్లు యుఏఈలోని దుబాయ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లో దుబాయ్ ఎమిరేట్స్ విమాన సర్వీసుల పునః ప్రాంరంభిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 23 నుంచి విమాన సర్వీసులు నడపాలని దుబాయ్ ఎమిరేట్స్ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వెళ్లే ప్రయాణికులపై యూఏఈ ప్రోటోకాల్స్ జారీ చేసింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులను అనుమతించనున్నట్లు పేర్కొంది.
భారత్, దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాల విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా, భారతదేశం, దక్షిణాఫ్రికా, నైజీరియా నుంచి దుబాయ్ వచ్చే ప్రయాణీకులను తిరిగి అనుమతించడానికి దుబాయ్ సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకటించిన తాజా ప్రోటోకాల్స్‌ను ఎమిరేట్స్ స్వాగతించిందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. భారత్‌లో కరోనా మహమ్మారి సెకండ వేవ్‌లో కరోనా కేసులు పెరగడంతో యూఏఈ ఏప్రిల్ చివరలో సరిహద్దులను మూసివేసిన సంగతి తెలిసిందే.
చదవండి: వైరల్ వీడియో: మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్ ఏది?
భారత్‌లో దుబాయ్ ఎమిరేట్స్ విమాన సర్వీసుల పునః ప్రాంరంభం
Published Sun, Jun 20 2021 12:07 PM | Last Updated on Sun, Jun 20 2021 12:17 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment