Emirates Airline
-
సగం దూరం వెళ్లి.. వెనక్కి వచ్చిన విమానం
దుబాయ్: సుమారు 13 గంటల పాటు గాల్లో ప్రయాణించిన విమానం.. చివరకు ఊహించని ల్యాండింగ్ అయ్యింది. ఎక్కడి నుంచి విమానం టేకాఫ్ అయ్యిందో.. చివరికి మళ్లీ అక్కడే విమానం దిగేసరికి ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ అసాధారణమైన ఈ ఘటన గత శుక్రవారం చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం ఒకటి 13 గంటలపాటు ప్రయాణించి.. చివరికి మళ్లీ వెనక్కి వచ్చేసింది. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 10.30 ప్రాంతంలో ఈకే 448 అనే ఎమిరేట్స్ విమానం టేకాఫ్ అయ్యింది. అయితే.. సగం దూరం వెళ్లాక వెనక్కి వచ్చేసి మళ్లీ దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోనే ల్యాండ్ అయ్యింది. అర్ధ రాత్రి జరిగిన ఈ పరిణామం.. అనౌన్స్‌మెంట్‌తో ప్రయాణికులంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. Auckland Airport has been assessing the damage to our international terminal and unfortunately determined that no international flights can operate today. We know this is extremely frustrating but the safety of passengers is our top priority. — Auckland Airport (@AKL_Airport) January 28, 2023 అక్లాండ్(న్యూజిలాండ్) ఎయిర్పోర్ట్ వరదలతో మునిగిపోవడంతో మూసేశారు నిర్వాహకులు. ఈ సమాచారం అందుకున్న పైలట్.. ఎమిరేట్స్ విమానాన్ని వెనక్కి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 9వేల మైళ్ల దూరం ఉన్న ప్రయాణంలో అప్పటికే సగానికి పైగా దూరం విమానం ప్రయాణించేసింది కూడా. అయితే.. అక్లాండ్ ఎయిర్పోర్ట్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అయినప్పటికీ ప్రయాణికుల భద్రతే తమకు ప్రాధాన్యమని ఒక ప్రకటన విడుదల చేసింది. Did you know the Auckland airport is the only airport in the world to have an immersive underwater experience in the terminal? Brilliant architecture! pic.twitter.com/2weSzlMSQd — STØNΞ | Roo Troop (@MorganStoneee) January 27, 2023 ఇదిలా ఉంటే తీవ్ర వరదలతో మునిగిపోయిన అక్లాండ్ను ఎయిర్‌పోర్ట్‌ను.. జనవరి 29 నుంచి తిరిగి కార్యకలాపాలను పునరుద్ధరించారు. -
విమానం గాల్లో ఉండగా పురిటి నొప్పులు.. చివరికి..
దుబాయ్: విమానంలో ఉన్నట్లుండి ఆరోగ్య సమస్యలు తలెత్తితే.. అత్యవసర ల్యాండింగ్‌లు కావాల్సి ఉంటుంది. అది పురిటి నొప్పులకు కూడా వర్తిస్తుంది. సాధారణంగా డెలివరీ దగ్గర పడుతున్న గర్భిణిల విమాన ప్రయాణాలకు అనుమతి ఉండదు. కానీ, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే!. అలా ఎమిరేట్స్ విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలికి హఠాత్తుగా పురిటి నొప్పులు రాగా.. గగనతంలో ఉండగానే విమానంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. టోక్యో నరిటా నుంచి దుబాయ్(యూఏఈ)కి వెళ్తున్న ఎమిరేట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో జనవరి 19వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈకే 319 విమానంలో ప్రయాణికురాలికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో పైలట్ మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పటికీ షెడ్యూల్ ప్రకారమే ల్యాండ్ కావడం గమనార్హం. ప్రయాణికురాలు ప్రసవ వేదనకు గురవుతున్న క్రమంలో విమాన సిబ్బంది సమయస్ఫూర్తిగా, చాకచక్యంగా వ్యవహరించినట్లు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. విమానశ్రయంలో దిగేసరికి వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని ఎమిరేట్స్ ప్రకటించుకుంది. సాధారణంగా డెలివరీకి దగ్గరపడే సమయంలో మహిళలను ప్రయాణానికి అనుమతించరు. అయితే.. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలకు అనుమతిస్తారు. ఎమిరేట్స్ రూల్స్ ప్రకారం.. ఏడో నెల వరకు గర్భిణిలకు మాత్రమే విమాన ప్రయాణాలకు అనుమతి ఉంది. ఒకవేళ ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలు చెబితే మాత్రం నెలలు నిండిన గర్భిణులకు ప్రయాణాలకు అనుమతిస్తారు. ఇదిలా ఉంటే.. విమాన ప్రయాణాల్లో ఇలా డెలివరీ జరిగిన ఘటనలు కొత్తేం కాదు. కిందటి ఏడాది మే నెలలో.. డెన్వర్ నుంచి కొలరాడోకు వెళ్తున్న ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణికురాలు బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ నెలలోనే ఘనా నుంచి అమెరికా(వాషింగ్టన్) వెళ్తున్న ఓ విమానంలో ఆరు గంటల పాటు ప్రసవవేదన అనుభవించిన ఓ ప్రయాణికురాలు.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద ఉండే క్యాబిన్ ఫ్లోర్‌పై విమాన బృందం సాయంతో బిడ్డకు జన్మనిచ్చింది. -
బంగారం పట్టివేత
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణంగా తనిఖీ చేశారు. అతడి ప్యాంట్ లోపలి భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జేబులో 475 గ్రాముల బంగారాన్ని గుర్తిచి బయటికి తీశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 24.8 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: డ్రగ్స్ సరఫరాదారుల అరెస్ట్) -
భారత్‌లో దుబాయ్ ఎమిరేట్స్ విమాన సర్వీసుల పునః ప్రాంరంభం
దుబాయ్: భారత్‌తో సహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణలపై ఉన్న ఆంక్షలను సడలిస్తున్నట్లు యుఏఈలోని దుబాయ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లో దుబాయ్ ఎమిరేట్స్ విమాన సర్వీసుల పునః ప్రాంరంభిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 23 నుంచి విమాన సర్వీసులు నడపాలని దుబాయ్ ఎమిరేట్స్ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వెళ్లే ప్రయాణికులపై యూఏఈ ప్రోటోకాల్స్ జారీ చేసింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులను అనుమతించనున్నట్లు పేర్కొంది. భారత్, దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాల విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా, భారతదేశం, దక్షిణాఫ్రికా, నైజీరియా నుంచి దుబాయ్ వచ్చే ప్రయాణీకులను తిరిగి అనుమతించడానికి దుబాయ్ సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకటించిన తాజా ప్రోటోకాల్స్‌ను ఎమిరేట్స్ స్వాగతించిందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. భారత్‌లో కరోనా మహమ్మారి సెకండ వేవ్‌లో కరోనా కేసులు పెరగడంతో యూఏఈ ఏప్రిల్ చివరలో సరిహద్దులను మూసివేసిన సంగతి తెలిసిందే. చదవండి: వైరల్ వీడియో: మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్ ఏది? -
హిందూ మీల్‌పై ఎమిరేట్స్ యూటర్న్..
దుబాయ్ : దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ తన విమానాల్లో హిందూ మీల్‌ను నిలిపివేయనున్నట్టు ప్రకటించిన కొద్ది గంటల్లోనే యూటర్న్ తీసుకుంది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా హిందూ భోజనాన్ని మెనూలో కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. హిందూ వినియోగదారుల నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ ఆప్షన్‌ను తాము కొనసాగించాలని నిర్ణయించినట్టు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తమ ఉత్పత్తులు, సేవల సమీక్షలో భాగంగా హిందూ మీల్ ఆప్షన్‌ను నిలిపివేస్తున్నట్టు మంగళవారం ఎమిరేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ మేరకు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామని హిందూ ప్రయాణీకులు ఇక శాకాహార, మాంసాహార వంటకాలను హిందూ మీల్లో భాగంగా ఎంచుకోవచ్చని సంస్థ పేర్కొంది. శాకాహార ప్రయాణీకులు జైన్ మీల్, ఇండియన్ వెజిటేరియన్ మీల్, కోషల్ మీల్, నాన్ బీఫ్, నాన్ వెజిటేరియన్ ఆప్షన్లనూ ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. శాకాహారుల కోసం ఇండియన్ వెజిటేరియన్ మీల్‌ను అందిస్తుందని ఎయిర్‌లైన్ వెల్లడించింది. -
రాత్రికి రాత్రే విదేశాలకు ఎంపీ జేసీ!
న్యూఢిల్లీ: విశాఖ ఎయిర్‌పోర్టులో వీరంగం చేసి వివాదంలో చిక్కుకున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రాత్రికి రాత్రే విదేశాలకు వెళ్లిపోయారు. గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు బోర్డింగ్ పాస్ మేషీన్లను ధ్వసం చేసిన జేసీపై తీవ్ర విమర్శలు వెల్లుతున్నాయి. ఈ ఘటనపై టీడీపీ అధిష్టానం రంగంలోకి ఆయనను బుజ్జగించి క్షమాపణ చెప్పించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. క్షమాపణ చెబుతారా అని విలేకరులు హైదరాబాద్‌లో శుక్రవారం ప్రశ్నించగా.. చెప్పడానికి ఏమీ లేదని, తానేమీ మాట్లాడనంటూ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లొస్తే వివాదం సద్దుమణుగుతుందని భావించిన ఆయన కుటుంబంతో సహా యూరప్ వెళ్లినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి 9:50 గంటలకు ఎమిరెట్స్ విమానంలో దుబాయ్ వెళ్లిన జేసీ, అక్కడి నుంచి మరో విమానంలో ఫ్రాన్స్ చేరుకున్నారు. దాదాపు వారం రోజులు కుటుంబంతో అక్కడే గడుపుతారని తెలుస్తోంది. తాజా వివాదానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కుటుంబంతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లిపోయారని దేశీయ విమానయాన సంస్థలతో పాటు పలువురు నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, విస్తారా, గోఎయిర్, ఎయిర్ఆసియా ఇండియా సంస్థలు జేసీని తమ విమానాలు ఎక్కనివ్వబోమని స్పష్టం చేశాయి.టీడీపీ ఎంపీ జేసీ విదేశీ పర్యటనపై ఆయన సన్నిహితులు మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా ఆయన ఇప్పుడు యూరప్ వెళ్లలేదని, కొన్ని రోజుల ముందుగానే ఫ్రాన్స్ వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. గతంలో శివసేన ఎంపీ గైక్వాడ్ విషయంలో కఠినంగా వ్యవహరించి ఆయనపై చర్యలు తీసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, ఎంపీ జేసీ విషయంలో ముట్టిముట్టనట్లుగా ఉంటున్నారు. సీసీటీవీ ఫుటేజీలు అన్ని వివరాలు బయటపెడతాయని, బోర్డింగ్ పాస్ ఇచ్చే సమయానికి జేసీ ఎయిర్‌పోర్టుకు రాలేదని గుర్తించామని చెప్పారు. కానీ అంతకుముందు విజయనగరంలో ఈ కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. జేసీ విషయాన్ని అధికారులే చూసుకుంటారని, ఆయన విషయంలో తనకేం సంబంధం లేదని చెప్పడం గమనార్హం. -
ట్రంప్ దెబ్బకు ఆ విమానానికి బుకింగ్స్ కరువు
బెర్లిన్ : ట్రంప్ దెబ్బకు ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎమిరేట్స్ కు బుకింగ్స్ కరువయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఒరిజినల్ ట్రావెల్ బ్యాన్ అనంతరం తమ బుకింగ్స్ 35 శాతం పడిపోయాయని ఎమిరేట్స్ విమానయాన సంస్థ అధ్యక్షుడు టిక్ క్లార్క్ చెప్పారు. జనవరి నెలలో ట్రంప్ ఏడు ముస్లిం దేశాలకు చెందిన ప్రయాణికులకు అమెరికాలోకి ప్రవేశించడాన్ని నిషేధించిన విషయం విదితమే. అనంతరం ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తాయి. నిరసనకారులు విమానశ్రయాల వద్ద ఆందోళనలు చేపట్టారు. అనంతరం మళ్లీ ట్రావెల్ బ్యాన్ పై కొత్త ఆర్డర్లను ట్రంప్ జారీచేశారు. ఈ సారి ఆరు దేశాలపైనే వేటువేసి, గ్రీన్ కార్డు హోల్డర్స్ కు ఈ బ్యాన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన వెంటనే ఈ ప్రభావం తమ సంస్థపై పడిందని క్లార్క్ చెప్పారు. గత నెలలో భారతీయుడిపై కాన్సస్ లో జరిగిన విద్వేషపూరిత దాడి కూడా తమ ఎయిర్ లైన్స్ కు దెబ్బకొట్టినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం బుకింగ్స్ రికవరీ అవుతున్నాయని, కానీ ఆశించని స్థాయిలో లేదన్నారు. యథాతథ స్థితికి వస్తాయో లేదో కూడా అనుమానమేనని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు ట్రావెల్ బ్యాన్ విధించిన తొలి ఎనిమిది రోజుల్లోనే అమెరికాకు వెళ్లే ప్రయాణికుల శాతం కూడా 6.5 శాతం తగ్గినట్టు ట్రావెల్ కన్సల్టెంట్ ఫార్వర్డ్ కీస్ సోమవారం రిపోర్టు వెలువరిచింది. నిషేధ దేశాల ప్రయాణికులను, అమెరికాను కలుపుతూ ప్రయాణించే ప్రధాన విమానసంస్థ ఎమిరేట్సే. దుబాయ్ హబ్ ద్వారా ఇది ప్రయాణిస్తోంది. నిషేధ దేశాలకు, అమెరికాకు ప్రస్తుతం డైరెక్ట్ గా ఎలాంటి విమానాలు లేవు.