
Heroine Andrea Jeremiah Receives UAE Golden Visa: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గోల్డెన్ వీసా పొందింది తమిళ హాట్ బ్యూటీ ఆండ్రియా. తమిళ సినీ ఇండస్ట్రీలో బోల్డ్ పాత్రల్లో అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కార్తీ నటించిన 'యుగానికి ఒక్కడు', లోకనాయకుడు కమల్ హాసన్ యాక్ట్ చేసిన 'విశ్వరూపం' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఈ అమ్మడు. ప్రస్తుతం పిశాచి 2 సినిమాలో నటిస్తోంది ఆండ్రియా. ఈ మూవీకి మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే భారతీయ సినీ తారలకు దుబాయ్ ప్రభుత్వం ఈ వీసాను అందజేస్తోంది. తాజాగా ఈ జాబితాలో చేరింది ఆండ్రియా జెరెమియా. ఈ సంధర్భంగా యూఏఈ ప్రభుత్వానికి ఆండ్రియా ధన్యవాదాలు తెలిపింది.
చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్
2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలతో సత్కరిస్తోంది దుబాయ్ ప్రభుత్వం. ఈ వీసాను అందుకున్న వారికి పదేళ్ల పాటు దుబాయ్ పౌరసత్వం ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్ అవుతుంది. ఇటీవలే ఈ గోల్డెన్ వీసాను సీనియర్ నటి మీనా అందుకున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ వీసాను పొందగా.. టాలీవుడ్ నుంచి మెగా కోడలు ఉపాసన అందుకుంది. యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాద్ షా షారుఖ్ ఖాన్ దక్కించుకున్నాడు. తర్వాత బాలీవుడ్‌లో సంజయ్ దత్, సునీల్ శెట్టి, సింగర్స్ సోనూ నిగమ్, నెహా కక్కర్, బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్, ఫరా ఖాన్, దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో పాటు బోనీ కపూర్ కుటుంబం ఈ వీసా పొందింది.
చదవండి: దుబాయ్ గోల్డెన్ వీసా అంటే ఏంటీ ?.. ఎందుకిస్తారు ?
Comments
Please login to add a commentAdd a comment