నన్ను ఆ విషయం అడగొద్దు: హీరోయిన్ ఆండ్రియా | Andrea Jeremiah Respond On Casting Couch Issue Kollywood | Sakshi
Sakshi News home page

Andrea Jeremiah: రిపోర్టర్ ప్రశ్న.. ఆన్సర్ చెప్పని హీరోయిన్

Published Wed, Sep 4 2024 9:08 AM | Last Updated on Wed, Sep 4 2024 10:54 AM

Andrea Jeremiah Respond On Casting Couch Issue Kollywood

ప్రస్తుతం సినీ రంగంలో లైంగిక వేధింపుల అంశం హాట్ టాపిక్ అయిపోయింది. మలయాళ చిత్రసీమలో జరుగుతున్న ఘోరాలపై హేమా కమిటీ రిలీజ్ చేసిన రిపోర్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఇది జరిగిన దగ్గర నుంచి నటీమణులు కనిపిస్తే చాలు.. లైంగిక వేధింపులు, కేరళ ప్రభుత్వం విడుదల చేసిన హేమ కమిషన్ నివేదిక గురించే అడుగుతున్నారు. వీటికి కొందరు సమాధానాలు చెబుతుండగా.. మరికొందరు ఎందుకొచ్చిన గొడవలే అని ఊరుకుంటున్నారు.

(ఇదీ చదవండి: మరో స్టార్ హీరోపై లైంగిక ఆరోపణలు.. ఏమని స్పందించాడంటే?)

ఇప్పుడు నటి, సింగర్ ఆండ్రియాకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. తిరువణ్నమలైలో ఆదివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆండ్రియా.. ఇది పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం విడుదల చేసిన హేమ కమిషన్ నివేదిక గురించి మీ అభిప్రాయం ఏంటని ఓ విలేకరి అడగ్గా.. ఆ విషయం తనను అడగొద్దని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.

ఏ విషయంలోనైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఆండ్రియానేనా ఇలా సమాధానం ఇచ్చింది అనే మాట్లాడుకుంటున్నారు. తెలుగులో 'మజాకా' అనే సినిమా చేసిన ఆండ్రియా.. 'యుగానికొక్కడు' లాంటి డబ్బింగ్ మూవీతో తెలుగులో బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం హీరోయిన్, కీలక పాత్రల్లో నటిస్తూ ఉన్నంతలో కాస్త బిజీగా ఉంది.

(ఇదీ చదవండి: దయనీయ స్థితిలో నటుడు ఫిష్ వెంకట్.. రెండు కిడ్నీలు ఫెయిల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement