అలాంటి సినిమాలు చూడను.. కానీ: హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్ | Andrea Jeremiah Crazy Comments About Her Films | Sakshi
Sakshi News home page

Andrea Jeremiah: 'అలాంటి చిత్రాలు ఇష్టముండదు.. కానీ'

Mar 29 2024 11:59 AM | Updated on Mar 29 2024 12:40 PM

Andrea Jeremiah Crazy Comments About Her Films - Sakshi

దక్షిణాదిలో కథానాయకిగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆండ్రియా. కేవలం నటిగా మాత్రమే కాకుండా ఒక గాయనీ, గీత రచయిత, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. డబ్బింగ్‌ కళాకారిణిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆండ్రియా ఇప్పుడు హీరోయిన్‌గా కూడా రాణిస్తున్నారు. ఒకవైపు సింగర్‌గా రాణిస్తూన్నారు. అదే విధంగా హీరోయిన్‌గానే నటిస్తానని స్టాండ్‌ తీసుకోలేదు. పాత్రలో సత్తా ఉంటే విలనిజాన్ని పండించడానికై నా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానైనా నటించడానికి రెడీ అంటోంది.  అలా వడచైన్నె చిత్రంలో తన భర్తను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునే పాత్రలో మెప్పించారు. మరోపక్క సంగీత కచేరీలతో బిజీగా ఉంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఆండ్రియా తాజాగా నటించిన కా చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఇది యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా రూపొందించారు. ఈ సందర్బంగా ఆండ్రియా ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను హారర్‌, వయలెన్స్‌ ఉన్న కథా చిత్రాలను చూడనని.. అలాంటి చిత్రాలు తనకు నచ్చవని చెప్పారు. అయితే అలాంటి కథా చిత్రాల్లో నటిస్తానని మాత్రం చెప్పారు. చూడడం వేరు.. నటించడం వేరు అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. కాగా మిష్కిన్‌ దర్శకత్వంలో కథానాయకిగా నటించిన మరో హారర్‌, ధ్రిల్లర్‌ కథా చిత్రం పిశాచి- 2 నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement