అభిమానులకు షాకిచ్చిన ఛార్మి.. ఇలా మారిపోయిందేంటి? | Charmy Kaur Shares Her Weight Loss Pic In Social Media | Sakshi
Sakshi News home page

Charmy Kaur: బొద్దుగా ఉండే ఛార్మి.. సడన్‌గా ఇంత మారిపోయింది!

May 12 2025 4:48 PM | Updated on May 12 2025 5:14 PM

 Charmy Kaur Shares Her Weight Loss Pic In Social Media

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఛార్మి కౌర్.  ప్రస్తుతం నిర్మాతగా మారిపోయింది. గతేడాది పూరి జగన్నాధ్‌తో కలిసి డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.  మూడు పదుల వయసు దాటినా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. నీ తోడు కావాలి అనే మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ఛార్మి.. మాస్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాలకు దూరమైనా తర్వాత మరింత బొద్దుగా తయారైన ఛార్మి సడన్‌కు అభిమానులకు షాకిచ్చింది. తాను ప్రస్తుతం 9 కేజీల బరువు తగ్గినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతేకాకుండా భవిష్యత్తులో మరింత బరువు తగ్గుతానని తెలిపింది. ఈ ప్రక్రియ ఇలానే కొనసాగుతుందని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు సూపర్బ్‌ మేడం అంటూ పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement