Charmy Kaur
-
రవితేజ, హరీశ్ శంకర్ పై కోపానికి కారణం అదేనా..?
-
హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?
ఒకప్పుడు హీరోయిన్, ఇప్పుడు నిర్మాతగా సినిమాలు తీస్తున్న ఛార్మీ.. హీరో రవితేజతో పాటు డైరెక్టర్ హరీశ్ శంకర్‌ని ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. అయితే స్నేహితులుగా ఉన్న వీళ్ల మధ్య అసలేం జరిగింది? ఛార్మీ ఎందుకిలా చేశారు అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?)డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీసిన 'డబుల్ ఇస్మార్ట్'.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తవగా.. ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు పూరీతో పాటు ఛార్మీ నిర్మాతలు. ఇకపోతే ఇదే తేదీన రవితేజ-హరీశ్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' కూడా రిలీజ్ చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు.పూరీ జగన్నాథ్ శిష్యుడు హరీశ్ శంకర్. అలానే పూరీతో రవితేజకు మంచి బాండింగ్ ఉంది. వీళ్ల కాంబోలో ఐదు సినిమాలు వచ్చాయి. ఛార్మీ కూడా పూరీతో గత కొన్నేళ్ల నుంచి ట్రావెల్ అవుతోంది. ఇకపోతే వీళ్లంతా స్నేహితులే. అలాంటిది ఇప్పుడు ఛార్మీ.. రవితేజతో పాటు హరీశ్ శంకర్‌ని అన్ ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఒకే తేదీన రిలీజ్ అవుతున్నాయి. బహుశా వాయిదా వేయాలని ఏమైనా అనుకుని, సయోధ్య కుదరకపోవడంతో స్నేహితుల మధ్య మనస్పర్థలు వచ్చాయా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఛార్మీ క్లారిటీ ఇస్తే తప్ప అసలు నిజం ఏంటనేది బయటకురాదు.(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?) -
మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఫీల్డ్ లోకి వచ్చాను: ఛార్మీ కౌర్
-
అందుకే పెద్ద హీరోలతో సినిమాలు చెయ్యను
-
డైరెక్టర్స్ తో నా రిలేషన్ ఎలా ఉంటుంది అంటే..!
-
కృష్ణ వంశీ నాకు అన్ని నేర్పించారు..!
-
ఆ అబ్బాయి పంపిన లవ్ లెటర్ ఎప్పటికి మర్చిపోలేను
-
నాకు చాలా మంది మీద క్రష్ ఉంది: ఛార్మీ కౌర్
-
నాకు అలాంటి లైఫ్ స్టైల్ అంటే ఇష్టం: ఛార్మీ కౌర్
-
నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం.....?
-
వాళ్ళిద్దరితో చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు
-
ఆ డైరెక్టర్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను..!
-
‘స్కంద’ క్రేజీ అప్డేట్ ఇచ్చిన బోయపాటి
రామ్, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్కంద’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతదర్శకుడు. ఈ చిత్రంలోని ‘నీ చుట్టు చుట్టు...’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను ఈ నెల 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్ని విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో రామ్ ఇంతకుముందు కనిపించనంత మాస్‌గా కనిపించనున్నారు. ‘నీ చుట్టు..’ సాంగ్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ డిటాకే, సమర్పణ: పవన్ కుమార్, జీ స్టూడియోస్. డబుల్.. తొలి షెడ్యూల్ పూర్తి: రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ‘‘మా యాక్షన్ ప్యాక్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. మరో షెడ్యూల్ కోసం విదేశాలు వెళ్లనున్నాం. 2024 మార్చి 8న థియేటర్లలో ‘డబుల్ ఇస్మార్ట్’’ అని ఛార్మి పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సీఈవో: విషు రెడ్డి. -
చాలా రోజుల తర్వాత జంటగా కనిపించిన పూరి జగన్నాథ్-ఛార్మీ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మీ పేర్లు లైగర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో పాన్ ఇండియా రేంజ్లో వినిపించాయి. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఛార్మీ అయితే కొన్నాళ్ల పాటు సోషల్ మీడియా నుంచి కూడా దూరంగా ఉంది. ఇప్పటికీ ఆమె నెట్టింట అంతగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. లైగర్ రిలీజై సుమారు 6-7 నెలలు అయినా నిమా ఫంక్షన్లు, పార్టీలు ఇలా బయట కూడా వీరు అంతగా కనిపించలేదు. అలాంటిది తాజాగా ఛార్మీ-పూరీలు ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా లైగర్ అనంతరం విజయ్‌తో అనౌన్స్ చేసిన ‘జనగణమన’ ప్రాజెక్ట్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పూరి జగన్నాథ్ కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. మరి త్వరలోనే ఏదైనా ప్రాజెక్ట్ గురించి కబురు చెబుతారేమో చూడాలి మరి. -
తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఛార్మి..!
-
ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఆ ఫోటోలో చిన్నారి ఎవరో గుర్తు పట్టగలరా?
టాలీవుడ్లో ఎందరో స్టార్ హీరోయిన్స్ సైతం కనుమరుగైపోయారు. అలాంటి వారిలో ఆమె కూడా ఒకరు అనడంలో సందేహం లేదు. తెలుగు చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ ప్రస్తుతం నిర్మాతగా మారిపోయింది. ఇటీవలే ఆమె తీసిన ఓ మూవీ బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఆమెకు చెందిన చిన్నప్పటి ఫోటో నెట్టింట్లో వైరలవుతోంది. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? ఇంకెవరండీ టాలీవుడ్ అందాల భామ ఛార్మి. తక్కువ వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఛార్మి కౌర్ దాదాపు టాలీవుడ్లో అందరు స్టార్ హీరోలతో నటించింది. పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌లో కూడా నటించింది. ఆ తర్వాత సినిమా ఛాన్సులు తగ్గిపోవడంతో నిర్మాతగా కొత్త కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె సినిమాలను నిర్మిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి సినిమాలు చేస్తోంది. ఇటీవల రిలీజైన లైగర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఆమె ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
లైగర్ తర్వాత ఛార్మి ట్వీట్.. పూరికి స్పెషల్ విషెస్ చెబుతూ..!
దర్శకుడు పూరి జగన్నాధ్ బర్త్‌డే సందర్భంగా సినీనటి ఛార్మి ప్రత్యేకంగా విష్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పూరి ఫోటోను షేర్ చేస్తూ 'ఎటర్నల్' అంటూ ఎమోజీని జత చేశారు. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'లైగర్' బాక్సాఫీస్ ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాకు కొద్ది రోజులు స్పల్ప విరామం ప్రకటించారు. తాజాగా పూరి బర్త్‌డే సందర్భంగా ఛార్మి ట్వీట్ చేయడంతో వైరలవుతోంది. లైగర్ తర్వాత వెంటనే జనగణమన ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ సినిమాపై ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ చిత్రం షూటింగ్ ఆపేసినట్లు సోషల్ మీడియాలో చాలా రూమర్లు వచ్చాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైంది. తాజాగా సైమా వేడుకలకు హాజరైన విజయ్‌ని అక్కడి మీడియా ‘జనగణమన’పై ప్రశ్నించగా.. ‘అవన్ని ఇప్పుడెందుకు? ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి జగణమన గురించి మర్చిపోండి. సైమా వేడుకను ఎంజాయ్ చేయండి’అని రౌడీ హీరో సమాధానం ఇచ్చాడు. దీంతో నిజంగానే జగగణమన ఆగిపోయిందని, అందుకే ఆ చిత్రంపై స్పందించడానికి విజయ్ ఇష్టపడడంలేదని నెటిజన్స్ కామెంట్ చేశారు. 𝐄𝐓𝐄𝐑𝐍𝐀𝐋 ☺️#HBDPuriJagannadh @PuriConnects pic.twitter.com/lh7UyGn2tv — Charmme Kaur (@Charmmeofficial) September 28, 2022 -
ఛార్మితో రిలేషన్ బయటపెట్టిన పూరి జగన్నాథ్
పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కౌర్ తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతుంది. పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో పూరి-ఛార్మిల మధ్య ఏదో ఉందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని వార్తలు వస్తున్నాయి. చదవండి: చేతిలో రూపాయి లేకపోయినా ఆఫర్‌ను రిజెక్ట్ చేశా : ఛార్మి తాజాగా ఛార్మితో తనకున్న రిలేషన్ షిప్‌ను బయటపెట్టారు పూరి జగన్నాథ్. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 'ఛార్మీ 13 ఏళ్ల వయసప్పటి నుండి తనకు తెలుసని, దశాబ్దాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. ఛార్మీకి నాకు ఏదో అఫైర్ ఉందని ఏదేదో మాట్లాడుకుంటారు. ఆమె ఇంకా యంగ్‌గా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అదే అదే ఛార్మికి 50ఏళ్లు ఉంటే ఇలా మాట్లాడేవారు కాదు. ఆమెకు వేరేవాళ్లతో పెళ్లి జరిగినా పట్టించుకునేవారు కాదు. చదవండి: రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష? ఎంజీఆర్, జయలలిత దారిలో.. కానీ తామిద్దరం ఒకే ఇండస్ట్రీలో ఉండటం, ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్ అవుతుండటంతో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఒకేవళ అఫైర్ ఉన్నా అది ఎక్కువరోజులు నిలబడదు. ఆకర్షణ అనేది కొన్నిరోజుల్లోనే చచ్చిపోతుంది. స్నేహమే శాశ్వతం. తామిద్దరం మంచి ఫ్రెండ్స్' అంటూ పుకార్లకు పూరి ఫుల్ స్టాప్ పెట్టారు. -
చేతిలో రూపాయి లేకపోయినా ఆఫర్‌ను రిజెక్ట్ చేశా : ఛార్మి
ప్రస్తుతం ఎక్కడ చూసిన 'లైగర్' మూవీ జోరు కనిపిస్తోంది.రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోలో విజయ్‌కు జోడీగా అనన్య పాండే నటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా విజయ్, పూరి జగన్నాథ్‌లను ఛార్మి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను పూరి జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. చదవండి: ఛార్మితో రిలేషన్ బయటపెట్టిన పూరి జగన్నాథ్ ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఛార్మి అడిగారు. ఇక లాక్డౌన్ టైంలో ఓ ఓటీటీ సంస్థ నుంచి భారీగా ఆఫర్ వచ్చినా వదులుకున్నాననని, చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా సరే ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు చెబుతూ ఛార్మీ ఎమోషనల్ అయ్యింది. -
భార్యకు పూరీ జగన్నాథ్ విడాకులు? స్పందించిన డైరెక్టర్ కుమారుడు
స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ చార్మీల మధ్య ఏదో ఉందంటూ చాలాకాలంగా ఏవేవో కథనాలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. పూరీ కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించిన పూరీ, చార్మీతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ బయట పార్టీల్లో కనిపిస్తుండటంతో వీళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందని గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేశారు. అంతేకాదు, ఏకంగా పూరీ తన భార్యకు విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడంటూ వార్తలు రాసుకొచ్చారు. తాజాగా ఈ రూమర్లపై పూరీ తనయుడు, హీరో ఆకాశ్ పూరీ స్పందించాడు. 'నాన్న సినీకెరీర్‌లో చాలా నష్టపోయాడు. అమ్మకు పరిస్థితి అర్థమై మాకు ఆ విషయాలేవీ తెలియకూడదని చెల్లిని, నన్ను హాస్టల్ పంపించారు. అప్పుడు నేను మూడో తరగతి చదువుతున్నా. మేమేమో.. మా నాన్న పెద్ద డైరెక్టర్, అంతా హ్యాపీ అనుకున్నాం. కొన్నాళ్ల తర్వాత మాకు అసలు విషయం అర్థమైంది. మేము వేసుకునే బట్టల నుంచి, తినే ఫుడ్ వరకు, ఉంటున్న ప్లేస్ అంతా మారిపోయింది. ఉన్న ఇల్లు, కార్లు కూడా అమ్మేశాం. ఐదారేళ్లు నరకం చూశాం. కానీ మా నాన్న మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడం మాత్రం మామూలు విషయం కాదు. మా ఫ్యామిలీ ఇప్పుడిలా ఉందంటే కారణం అమ్మే. అమ్మానాన్న విడాకులు తీసుకుంటారన్న వార్త నేనింతవరకు వినలేదు. నాన్నకు పెద్ద సపోర్ట్ మమ్మీనే. వాళ్లది లవ్ మ్యారేజ్. కొందరు టైంపాస్ కోసం వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తూనే ఉంటారు. కానీ అదైతే నిజం కాదు. ఇక్కడ మీకో నిజం చెప్తాను.. మా పేరెంట్స్ లవ్‌లో ఉన్న సమయంలో నాన్న అమ్మకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం, వస్తావా? అని అడిగాడు. హా, వచ్చేస్తానంది అమ్మ. నా జేబులో రూ.200 మాత్రమే ఉన్నాయి. రేపు ఎలా ఉంటుందో కూడా తెలీదు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడట. క్షణం కూడా ఆలోచించకుండా చేసుకుంటానని వచ్చేసింది. ఇంతలా ప్రేమించేవాళ్లు నిజంగా ఉంటారా? అనిపించింది' అని చెప్పుకొచ్చాడు ఆకాశ్. చదవండి: తింటున్న టైంలో వచ్చి ముక్కు కోసేశాడు, ప్లేటంతా రక్తమే.. బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి -
హీరోయిన్గా ఉన్నప్పుడు కంఫ్టర్ ఉండేది: చార్మీ
Charmy Kaur: అతి తక్కువ కాలంలోనే నటిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ చార్మీ. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన చార్మీ ఆ తర్వాత సినిమాలకు గుడ్‌డై చెప్పి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నిర్మించిన రొమాంటిక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. 'హీరోయిన్గా ఉన్న సమయంలో ఎక్కువ కంఫర్ట్ ఉండేది. ఫిటినెస్‌పై మాత్రమే దృష్టి పెడితే సరిపోయేది. కానీ నిర్మాతగా బాధ్యతలు స్వీకరించడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు అందరి కంఫర్ట్ చూసుకోవాల్సి వస్తుంది. అయినా నాకేమీ విసుగు అనిపించడం లేదు. ఇప్పటికీ నటిగా అవకాశాలు వస్తున్నాయి. కానీ నాకు ఇక నటించే ఆలోచన మాత్రం లేదు. అని చెప్పుకొచ్చింది. చదవండి: పూరి జగన్నాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు : డైరెక్టర్ టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత -
'లైగర్' సెట్లో పూరి జగన్నాథ్ బర్త్‌డే సెలబ్రేషన్స్
Puri Jagannadh Birthday Celebrations: డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన బర్త్‌డేను లైగర్ సెట్లో జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ దేవేరకొండ, చార్మీ సహా మిగతా యూనిట్ సభ్యుల మధ్య పూరి కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో 'లైగర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు,హిందీ, తమిళం, కన్నడలో ఒకేసారి ఈ మూవీ విడుదల కానుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Charmy: మందు గ్లాస్‌తో పూరికి బర్త్‌డే విషెస్ తెలిపిన చార్మీ -
దిశ ఘటన : సల్మాన్, రవితేజ, రకుల్‌తో సహా 38 మందిపై కేసు
ఇప్పటికే డ్రగ్స్ కేసు, ఫోర్నోగ్రఫీ కేసులతో సతమతమవుతున్న సినీ ప్రముఖలపై తాజాగా మరో కొత్త కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచార ఘటనపై బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ నటులు సల్మాన్ ఖాన్, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ సహా మొత్తం 38 మంది సెలబ్రిటీలపై తాజాగా కేసు నమోదు అయింది. అసలు దిశ కేసుకు, వీరికి సంబంధం ఏంటి? అన్నది చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే... నవంబర్ 27, 2019న హైదరాబాద్‌లో ఓ యువతిపై నలుగురు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడి, అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు దిశ అని పేరు పెట్టారు. ఇటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా బాధితుల అసలు పేర్లను వాడకుండా ఇతర పేర్లతో వాటి గురించి చర్చలు చేస్తుంటారు. ముఖ్యంగా బాధితురాలి పేర్లను, ఫోటోలను బహిర్గతం చేయడం నేరం. ఒకవేళ అలా చేస్తే వారిపై కేసు నమోదు అవుతుంది. అయితే దిశ ఘటన జరిగినప్పుడు మాత్రం పలువురు సెలబ్రిటీలు ఆమె అసలు పేరును ఉపయోగించారు. కొందరైతే ఫోటో కూడా వాడారు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, అనుపమ్ ఖేర్, ఫర్హాన్ అక్తర్, సల్మాన్‌ఖాన్ సహా టాలీవుడ్ స్టార్స్ రవితేజ, అల్లు శిరీష్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి ఉన్నారు. వీరు బాధిత అమ్మాయి పేరుని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. ఇలాంటి సందర్భాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి నలుగురుకి ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రిటీలు ఇలా పేరు వెల్లడించడం సరికాదంటూ ఢిల్లీకి చెందిన గౌరవ్ గులాటి అనే న్యాయవాది సబ్జీ మండీలోని పోలీస్ స్టేషన్లో సెక్షన్ 228ఏ కింద కేసు పెట్టారు. అంతేకాదు వీరిని అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Tollywood Drug Case: ఈడీకి అన్ని డాక్యుమెంట్లు ఇచ్చానన్న చార్మీ
-
డ్రగ్స్ కేసు: ముగిసిన చార్మీ ఈడీ విచారణ
Charmy Kaur: టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అకస్మాత్తుగా దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే పూరీ జగన్నాథ్‌ను విచారించిన ఈడీ గురువారం చార్మీని విచారించింది. ఈ సందర్భంగా 2015-17వరకు జరిగిన బ్యాంక్ లావాదేవీల వివారాలను ఆమె ఈడీకి సమర్పించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం చార్మీ మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపింది. వాళ్లు అడిగిన అన్ని డాక్యుమెంట్లను సమర్పించానని స్పష్టం చేసింది. ఈడీకి పూర్తిగా సహకరిస్తానని, మరోసారి పిల్చినా విచారణకు హాజరవుతానని పేర్కొంది. కాగా ఎక్సైజ్ విభాగానికి చెందిన సిట్ దాఖలు చేసిన చార్జ్షీట్ల ఆధారంగా ఈడీ మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసింది. దీనిపై విచారణకు హాజరు కావాలని పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజతోపాటు డ్రైవర్ శ్రీనివాస్, నవ్‌దీప్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్‌లకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే! -
ఐటమ్‌తో ఆరా అలా.. తల్లైన రష్మిక అంటూ చార్మీ పోస్ట్
నటి, నిర్మాత చార్మీ కౌర్‌కి పెట్స్ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. తను పెంచుకుంటున్న కుక్కపిల్లని కొడుకుగా భావిస్తుంది చార్మి. తన పెట్ చేసే అల్లరిని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఆ ఫోటోలు వైరల్ అయినా సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే పెట్స్ ప్రేమని రష్మికకు కూడా రుద్దింది చార్మీ. రష్మిక మందన్నా ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమితాబ్, సిద్దార్త్ మల్హోత్ర సినిమాలతో ఫుల్ సందడి చేస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. షూటింగ్ నిమిత్తం తాజాగా ఆమె ముంబైలో వెళ్లిన రష్మిక.. అక్కడే మకాం వేసిన చార్మీ వద్దకు వెళ్లింది. ఈ సందర్భంగా రష్మికకు ఓ పెట్‌ను దత్తత ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని చార్మి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంది. ‘ఐటమ్‌ని ఆరా కలిసినప్పుడు.. కంగ్రాట్స్ రష్మిక.. మీ బిడ్డ ఎంతో బాగుంది. మా ముంబైకి స్వాగతం’అని పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్‌కు రష్మిక స్పందిస్తూ.. థ్యాంక్యూ ఛార్మీ, ఇకపై ఎప్పుడూ నన్ను అక్కడే చూడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇంతకి ఐటమ్, ఆరా ఏంటి అనుకుంటున్నారా? చార్మీ పెంపుడు కుక్క పేరు ఐటమ్, రష్మిక పెట్ పేరు ఆరా. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) చదవండి: Pawan Kalyan: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..‘వకీల్ సాబ్’ మళ్లీ వస్తున్నాడు -
పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన చార్మి
టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది అందాల భామ చార్మి. ఒకప్పుడు హీరోయిన్గా తన గ్లామర్‌తో యూత్‌ని అట్రాక్ట్ చేసిన ఈ పంజాబీ బ్యూటీ.. ఇప్పుడు నిర్మాతగా మారి వరుస విజయాలతో దూసుకెళ్తుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభిన ఆమె దాని తాలూకు అన్ని వ్యవహారాలు భుజాలపై వేసుకుంది. ఇలా కెరీర్ పరంగా దూసుకెళ్తున్న చార్మి త్వరలో పెళ్లి చేసుకోతుందని ఇటీవల వార్తలు వినిపించాయి. తాజాగా ఈ పెళ్లి వార్తలపై చార్మి స్పందించింది. తన పెళ్లివార్తలల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ రూమర్స్ అని కొట్టిపడేసింది. పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేసింది. ‘ప్రస్తుతం కెరీర్ హాయిగా, సాఫీగా సాగిపోతోంది. ఈ లైఫ్ నాకు చాలా సంతోషకరంగా ఉంది. నా జీవితంలో పెళ్లి చేసుకోవడం వంటి తప్పు చేయను' అని చార్మి ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఫేక్ రైటర్స్‌పై తనదైన శైలీలో స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. 'తప్పుడు స్టోరీలతో అట్రాక్ట్ చేస్తున్న మిమ్మల్ని అభినందించవచ్చు' వ్యగ్యంగా ట్వీట్ చేసింది చార్మి. చార్మి ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్. కరణ్ జోహార్ మరో నిర్మాత. Goodbye to fake writers and rumours 😂😂😂😂 must appreciate, u guys are fab in creating interesting stories 😂😂😂😂 https://t.co/PN4PePHYZj — Charmme Kaur (@Charmmeofficial) May 8, 2021 -
పరిస్థితి విషమిస్తోంది, నా వల్ల కాదు, వదిలేస్తున్నా..
టాలీవుడ్ హీరోయిన్, నిర్మాత చార్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాకు తాత్కాలికంగా గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ లేఖను పంచుకుంది. ఇందులో ఆమె కరోనా విలయ తాండవాన్ని చూడలేకపోతున్నాననంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి మరింత భయంకరంగా మారేట్లు కనిపిస్తోందని ఆందోళన చెందింది. దురదృష్టవశాత్తూ వీటన్నింటినీ చూసి తట్టుకునేంత శక్తి తనకు లేదని, అందుకే కొద్దిరోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని వెల్లడించింది. అందరూ ఇంట్లోనే ఉండి, మీరు ప్రేమించేవారిని జాగ్రత్తగా చూసుకోండి.. అని అభిమానులకు సూచించింది. 'నిజానికి అందరూ బాగుండాలని కోరుకుంటూ వచ్చాను. కానీ మన దేశం పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. అందుకే ఇప్పుడు నేను సోషల్ మీడియాను వదిలేస్తున్నాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి' అని చేతులెత్తి వేడుకుంది. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) గతంలో పలు సినిమాల్లో హీరోయిన్గా ఆకట్టుకున్న చార్మీ ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటోంది. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నిర్మించే చిత్రాల బాధ్యతను తనే చూసుకుంటోంది. గతేడాది లాక్డౌన్ నుంచి ముంబైలోనే ఉండిపోయిన వీళ్లిద్దరూ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో 'లైగర్' సినిమా చేస్తున్నారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా షూటింగ్‌కు మళ్లీ బ్రేక్ పడింది. చదవండి: కరోనా బారిన నటి సమీరా, పిల్లలిద్దరికీ అస్వస్థత సన్నీలియోన్ ఇంటి సమీపంలో డూప్లెక్స్ ఇల్లు కొన్న డైరెక్టర్ -
బాలీవుడ్ హీరోయిన్లతో విజయ్ దేవరకొండ పార్టీ!
గీతా గోవిందంలో ఏమీ తెలియని అమాయకుడిలా, అర్జున్ రెడ్డిలో అందరినీ ఎదిరించే రౌడీలా నటించడం ఒక్క విజయ్ దేవరకొండకే చెల్లింది. ఏ పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేసే విజయ్ ప్రస్తుతం "లైగర్: సాలా క్రాస్ బ్రీడ్" సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు తొలిసారిగా బాక్సర్‌గా కనిపించనున్నాడు. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మాతగా పని చేస్తున్నాడు. ఈ సినిమా ముంబై నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో చిత్రయూనిట్ ఫిబ్రవరి నెలారంబంలోనే ముంబైకి మకాం మార్చింది. ఈ క్రమంలో తరచూ అక్కడి బీటౌన్ సెలబ్రిటీలను కలుస్తూ, హడావుడి చేస్తూ బాలీవుడ్ టీమ్‌గా మారిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను నటి, నిర్మాత ఛార్మీకౌర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో లైగర్ టీమ్ పార్టీ చేసుకున్న ఫొటోలను ఛార్మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'ఈ పార్టీని ఏర్పాటు చేసిన మనీష్‌కు కృతజ్ఞతలు. పార్టీ చాలా సంతోషంగా గడిచింది. అమేజింగ్ ఫుడ్, అమేజింగ్ పీపుల్' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఈ పార్టీలో చార్మీ, విజయ్ దేవరకొండతో పాటు బాలీవుడ్ హీరోయిన్లు కియారా అద్వాణీ, సారా అలీఖాన్, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, నిర్మాత కరణ్ జోహార్ పాల్గొనడం విశేషం. దీంతో ఈ బాలీవుడ్ పార్టీ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఇటేవలే కరణ్ నివాసంలో జరిగిన పార్టీకి సైతం విజయ్‌కు ఆహ్వానం అందగా అక్కడి స్టార్ నటులు దీపికా పదుకొనె, అనన్య పాండే, సిద్దార్థ్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ సహా తదితరులతో కలిసి పార్టీని ఎంజాయ్ చేశాడు. ఇక లైగర్ సినిమా విషయానికొస్తే ఇందులో అనన్య పాండే కథానాయికగా కనిపించనుండగా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) చదవండి: ఫ్యాన్ మూమెంట్: విజయ్‌తో సారా సెల్పీ భర్త కోసం ఆ పాత్ర ఒప్పుకున్న దీపిక -
సోషల్ హల్చల్ : అనన్య అందాలు.. మత్తెక్కిస్తున్న కియారా
♦ హాట్ లుక్‌లో ఫోటో షూట్లో పాల్గొని హీటెక్కిస్తున్న కియారా అద్వాని ♦ అందాలు ఆరబోసి మత్తెక్కిస్తున్న అనన్య పాండే ♦ లైగర్ చిత్రబృందం తాజాగా ఓ పార్టీకి అటెండ్ అయింది. దీనికి సంబంధించిన పిక్స్ చార్మి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ♦ ఎల్లో కలర్ సారీలో అదరగొట్టిన బిగ్‌బాస్ ఫేమ్ యాంకర్ శ్యామల ♦ ఏడాది అయిందంటూ.. నితిన్‌తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన రష్మిక ♦ కెమెరా వైపు చూస్తూ నవ్వులు చిందిస్తున్న మోనాల్ గజ్జర్ View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) View this post on Instagram A post shared by Krishna Jackie Shroff (@kishushroff) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) -
రౌడీ ఫ్యాన్‌కు గుడ్ న్యూస్..‘లైగర్’వచ్చేస్తున్నాడు
టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అందించింది చార్మి. పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న లైగర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగు హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళంభాషాల్లో రూపొందుతున్న ఈ సినిమాప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు 'లైగర్' కొత్త పోస్టర్ షేర్ చేసిన చార్మీ.. 'సెప్టెంబర్ 9వ తేదీ నుంచి మీ దగ్గర్లోని థియేటర్స్‌లో పంచ్ ప్యాక్' అని పేర్కొన్నారు. ఇక తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్లో విజయ్ దేవరకొండ హై వోల్టేజ్ పంచ్ లుక్కుతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లైగర్’ ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా, తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. చార్మీ, కరణ్ జోహార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కి బాలీవుడ్ భామ అనన్య పాండే జోడీగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైతో పాటు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. Packing a punch in theatres near you on 9th September 2021 A worldwide theatrical release of #Liger in Hindi,Telugu,Tamil,Kannada & Malayalam.#Liger9thSept#PuriJagannadh @TheDeverakonda @ananyapandayy @karanjohar @apoorvamehta18 @DharmaMovies @PuriConnects ❤️ pic.twitter.com/6m2YxDma4b — Charmme Kaur (@Charmmeofficial) February 11, 2021 -
రౌడీ ఫ్యాన్‌కు గుడ్ న్యూస్ చెప్పిన చార్మీ
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘ఫైటర్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ రేపే(సోమవారం) రివీల్ చేస్తున్నామని చార్మీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్ ఖాతాలో పోస్ట్ పెట్టిన ఆమె.. ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ అభిమానులతో పంచుకున్నారు. బాక్సింగ్ రింగ్‌లో పాయింట్లు చూపించినట్లుగా ఆ పోస్టర్ ఉంది. అందులో చేతిక ధరించే గ్లౌవ్స్ ఉన్నాయి. రేపు ఉదయం 10.08నిమిషాలకు ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రాబోతోందని తెలిపారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రియాలిటీకి దగ్గరగా ఉండేలా విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Time to re-load the knock out punch. Tomorrow at 10:08am, it's going to be BIG!#StayTuned@thedeverakonda @karanjohar #PuriJagannadh @apoorvamehta18 @ananyapandayy @RonitBoseRoy @meramyakrishnan @iamVishuReddy @dharmamovies @puriconnects pic.twitter.com/Sqh5dNvjR7 — Charmme Kaur (@Charmmeofficial) January 17, 2021 -
చార్మి బర్త్‌డే : పూరీ ఎమోషనల్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో చార్మికి ప్రత్యేక స్థానం ఉంది. 13 ఏళ్ల వయసులో హీరోయిన్గా ఎంటరై కొన్నేళ్ల పాటు తన అందచందాలతో టాలీవుడ్‌ను ఊపేసింది. ఆ తర్వాత నిర్మాతగా మారి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి పూరీ కనెక్ట్స్ అనే సంస్థను స్థాపించి జ్యోతి లక్ష్మీ, పైసా వసూల్, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలను నిర్మించింది. ఈ రోజు చార్మి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. (చదవండి : సూపర్‌స్టార్ లుక్‌పై బండ్ల గణేష్ కామెంట్స్) ‘నా ఇస్మార్ట్ ఫైటర్ చార్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితం అంత సులువుగా సాగలేదు. అయితే నువ్వెంత బలవంతురాలివో నాకు తెలుసు. మనం కలిసి ఇంకా ప్రయాణించాలి. నువ్వు నన్ను గర్వపడేలా చేశావు. పూరీ కనెక్ట్స్‌కు నువ్వే అసలైన బలం. నీకు మరిన్ని విజయాలతో పాటు ఆరోగ్యంగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను’అంటూ పూరీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం చార్మి పూరి దర్శకత్వం వహిస్తున్న విజయ్ దేవరకొండ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_561241833.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆఫీసుకు తాళం వేసిన పూరీ, ఛార్మి
కరోనా దెబ్బకు థియేటర్లు మూతపడ్డాయి, షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. అటు వైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం 15 రోజులు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పూరీ కనెక్ట్స్(పీసీ) సంస్థ కూడా అదే బాటలో నడిచింది. పీసీ బ్యానర్లో అడ్మినిస్ట్రేషన్, ప్రొడక్షన్ వర్క్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు మంగళవారం వెల్లడించింది. తమ సిబ్బంది, నటీనటుల భద్రత దృష్ట్యా కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటన చేసింది. కరోనాపై యుద్ధంలో గెలవాలంటే సమిష్టిగా పోరాడదామని పూరీ, చార్మీ పిలుపునిచ్చారు.(నిత్యానందను ఒకసారి కలవాలనుంది: నటి) కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొల్పుతున్న కరోనా వైరస్‌పై ప్రభుత్వ సూచనలను పాటించాలని ప్రజలకు సూచన చేశారు. ఈ నిర్ణయంతో పీసీ(పూరీ కనెక్ట్) ఆఫీసుకు తాళం పడినట్లయింది. కాగా చార్మీ ఈ మధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా నుంచి దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో సన్నిహితంగా మెలుగుతున్న చార్మీ ఆయనతో కలిసి పూరీ కనెక్ట్స్ అనే సంస్థను స్థాపించింది. ఈ బ్యానర్ కొత్త వారిని ఎంకరేజ్ చేయడమే కాక ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ సినిమాలనూ అందిస్తోంది. (ఆ ఇద్దరి కాంబినేషన్లో..) -
మీకు మీరే ప్రేరణ అవ్వండి
13 ఏళ్ల వయసులో హీరోయిన్గా ఎంటరై ఓ 13 ఏళ్లు నటిగా వెనక్కి తిరిగి చూసుకోనంత బిజీగా సినిమాలు చేశారు చార్మి. ‘నీ తోడు కావాలి’ (2002) నుంచి ‘జ్యోతిలక్ష్మి’ (2015) వరకూ కథనాయికగా, ప్రత్యేక పాటల్లో, అతిథి పాత్రల్లో చార్మి మెరిశారు. ‘జ్యోతిలక్ష్మి’తో నిర్మాతగా మారారు. ‘పూరి కనెక్ట్స్’ బేనర్లో వచ్చిన జ్యోతిలక్ష్మి రోగ్, పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు ‘రొమాంటిక్’ సినిమా నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండతో ప్యాన్ ఇండియా మూవీ ‘ఫైటర్’కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా చార్మితో జరిపిన ఇంటర్వ్యూ. ► స్క్రీన్ మీద స్త్రీలు కనిపించడం సాధారణమే. కానీ నిర్మాణ రంగంలో తక్కువమంది ఉన్నారు. మీరు యాక్టర్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తెరవెనకతో పోల్చితే తెర మీద కనిపించే స్త్రీల సంఖ్య ఎక్కువే. కానీ యాక్టింగ్ అనేది సాధారణ విషయం కాదు. ఎంతో అంకితభావం, ఇష్టం ఉండాలి. దాంతోపాటు ఎంతో త్యాగం కూడా ఉంటుంది. అప్పుడే ఇండస్ట్రీలో ఉండగలుగుతాం. నా యాక్టింగ్ కెరీర్లో నేను చాలా ఎత్తుకి ఎదిగాను, అవార్డులు తీసుకున్నాను. కానీ ‘జ్యోతిలక్ష్మి’ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమాలో నటిస్తూ, నిర్మించాను. ఒకవైపు ప్రొడక్షన్‌కి సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటూ, ఎవరిని ఎలా డీల్ చేయాలో అర్థం చేసుకుంటూ మరోవైపు నటనని కూడా బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. అయితే యాక్టింగ్ కంటే ప్రొడక్షన్ చాలా చాలెంజింగ్‌గా అనిపించింది. ఒక మంచి సినిమా ఇవ్వడానికి నిర్మాత పడే కష్టాలు తెలిశాయి. ఒక స్త్రీగా నిర్మాణం సవాల్ అయినప్పటికీ సంతృప్తినిస్తోంది. అందుకే ప్రొడక్షన్‌ని కెరీర్‌గా చేసుకుని తెరవెనక పని చేస్తున్నాను. దేశంలో మనకున్న అతి తక్కువమంది సక్సెస్ఫుల్ యంగ్ లేడీ ప్రొడ్యూసర్స్‌లో నేను ఒకదాన్ని కావడం ఆనందంగా, గర్వంగా ఉంది. ► డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌గారు సపోర్ట్ చేయడంవల్లే మీరు ప్రొడక్షన్ చూసుకోగలుగుతున్నారా? లేక మీ అంతట మీరు సొంతంగా ప్రొడక్షన్‌ని హ్యాండిల్ చేసే ధైర్యం మీకుందా? పూరీగారు, నేను ఒకర్నొకరం సపోర్ట్ చేసు కుంటాం. మా మంచీ చెడులకు మేం ఒకరికొకరం అండగా నిలబడ్డాం. ఇక నేను ఓన్‌గా ప్రొడక్షన్ చూసుకోగలనా అంటే.. ‘జ్యోతిలక్ష్మి’ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు విజయ్ దేవరకొండతో తీస్తున్న సినిమాతో కలిపి ఐదేళ్లుగా సినిమాలు నిర్మిస్తున్నాను. మరి నాకు ఓన్‌గా ప్రొడక్షన్‌ని హ్యాండిల్ చేసేంత ధైర్యం ఉందో లేదో చెప్పండి (నవ్వుతూ). ► మేల్, ఫిమేల్ ప్రొడ్యూసర్‌కి ఉన్న డిఫరెన్స్? జెండర్ తేడా తప్ప పని విషయంలో ఏ తేడా ఉండదు. పీపుల్ని డీల్ చేసే విషయంలోను, సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలోనూ అంతా ఒకటే. అయితే పెద్ద తేడా ఏంటంటే.. ఆడవాళ్లను నిరుత్సాహపరచడానికి చాలామంది ట్రై చేస్తారు. ఈ బిజినెస్‌కి పనికి రావు అన్నట్లుగా డౌన్ చేస్తారు. అలాంటి సమయాల్లో స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాంటివాళ్లను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి. కేవలం వాళ్లకున్న అభద్రతాభావంవల్లే స్త్రీలను నిరుత్సాహపరచడానికి ట్రై చేస్తారు. ► హీరోయిన్గా ఎదుర్కొన్న సవాళ్లు? ఇప్పుడు నిర్మాతగా ఎదుర్కొంటున్న వాటి గురించి? నా పదమూడేళ్ల వయసులో యాక్టింగ్ కెరీర్‌ని మొదలుపెట్టాను. అప్పటినుంచి నటిగా నా చివరి సినిమా ‘జ్యోతిలక్ష్మి’ వరకు కెరీర్ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ చాలా ఎత్తుపల్లాలు చూశాను. తట్టుకుని ముందుకెళ్లాలంటే స్ట్రాంగ్‌గా ఉండాలి. మన ప్రతిభే మనల్ని శిఖరానికి చేర్చుతుంది. నటిగా నన్ను ప్రూవ్ చేసుకున్నాక అవకాశాలు వాటంతట అవే వచ్చాయి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టాక చాలామంది ‘నెగటివ్ అడ్వైస్’లు ఇచ్చారు. ప్రొడక్షన్ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చాను. పైగా ఫిమేల్ ప్రొడ్యూసర్. అయితే మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండటంతో పాటు ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ఫైనల్లీ ప్యాన్ ఇండియా మూవీ (‘ఫైటర్’) ప్రొడ్యూసర్‌గా బెస్ట్ స్పేస్‌లో ఉన్నాను. ► నటన, నిర్మాణం ఏది సౌకర్యంగా ఉంది? మీరు ఒక పని చేస్తున్నప్పుడు నేను ‘కంఫర్ట్‌బుల్‌గా ఉన్నాను’ అనే ఫీలింగ్ వస్తే అక్కడితో లైఫ్ చివరి దశకు చేరుకున్నట్లే. ఎందుకంటే కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. జీవితం అంటేనే సాహసం. అది కంఫర్ట్‌గా ఉండేకన్నా చాలెంజింగ్‌గా ఉంటేనే బాగుంటుంది. ► ఫైనల్లీ.. నటిగా ఇండస్ట్రీని చూశారు. ఇప్పుడు నిర్మాతగా చూస్తున్నారు. ఈ రెండింటిలో స్త్రీకి ఏది సేఫ్? ఏది సేఫ్ అని అడుగుతున్నారంటేనే స్త్రీకి ఎక్కడైనా కష్టాలు ఉన్నట్లే. ముఖ్యంగా మన సమాజంలో స్త్రీలకు ఏదో ఒక అసౌకర్య పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. నటన, నిర్మాణం అనేది పక్కన పెడదాం. ప్రతి ఫీల్డ్‌లోనూ స్త్రీలకు సవాళ్లు, కష్టాలు ఉంటాయి. వాటికి భయపడిపోకూడదు. ‘స్ట్రాంగ్‌గా ఉండండి. మీకు మీరే ప్రేరణ అవ్వండి’. -
రాత్రి వేళ రోడ్డు పక్కన హెడ్ మసాజ్..
-
రాత్రి వేళ రోడ్డు పక్కన హెడ్ మసాజ్..
హీరోయిన్ ఓ వెలుగు వెలిగిన చార్మి ఇటీవల నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి చార్మి నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. షూటింగ్ వ్యవహారాలను దగ్గర ఉండి చూసుకుంటున్న చార్మి.. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ‘నిర్మాతగా ఉంటే దక్కే ప్రయోజనాలు..’ అంటూ చార్మి ఓ సరదా వీడియోను అభిమానులతో పంచుకున్నారు. రోడ్డు పక్కన రాత్రి వేళ షూటింగ్ జరుగుతున్న సమయంలో.. హెడ్ మసాజ్ చేయించుకుంటున్న వీడియోను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ఆ వీడియోలో చార్మి ఓ వైపు మసాజ్ చేయించుకుంటూనే.. మరోవైపు షూటింగ్ సీన్ గురించి పూరితో మాట్లాడుతూ కనిపించారు. కాగా, ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ ఫైటర్‌గా కనిపిస్తున్న ఈ సినిమాలో.. అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తున్నారు.(నా క్యారెక్టర్ నాలానే ఉంటుంది!) -
నా కొత్త ఫ్రెండ్‌ను చూశారా?: ఛార్మి
అందాల తార ఛార్మి కౌర్ పూర్థిస్థాయిలో నిర్మాతగా మారడంతో నటనకు ప్రస్తుతం దూరంగా ఉంటుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌తో కలిసి ప్రస్తుతం ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ , విజయ్ దేవరకొండ ‘ఫైటర్’చిత్రాలను నిర్మిస్తున్నారు. ‘రొమాంటిక్’ విడుదలకు సిద్దంగా ఉండగా.. ‘ఫైటర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో ఛార్మి ఊపిరి పీల్చుకోలేనంత బిజీ అయిపోయారు. అయితే ఆదివారం కాస్త విరామం దొరకడంతో సరదా సరదాగా గడిపారు. ఈ క్రమంలో తన కొత్త పెంపుడు కుక్కతో ఆడుకున్నారు. ‘తన ఇంట్లోకి కొత్త నేస్తం వచ్చింది’అంటూ ఆ కుక్కతో ఆడుకుంటున్న వీడియో, ఫోటోలను తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది ఛార్మి. ‘పదేళ్లు ఉంటే అందం పోతుంది.. కానీ జీవితాంతం ఆనందంగా చూసుకునే వారు పక్కన ఉంటే అదే చాలు’అన్న రీతిలో ఉన్న ఆ ఫోటో ఫోజు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక క్యూటీతో బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా, ఛార్మికి జంతువులంటే అమితమైన ప్రేమ అనే విషయం తెలిసిందే. ఇంట్లో పెంపుడు కుక్కలు, పక్షులను పెంచుతుంది. షూటింగ్‌లకు విరామం దొరికినప్పుడల్లా వాటితో గడుపుతుంటారు. When babies come to meet mammaa on location 🥰🥰#VD10 #PJ37 #PCfilm @puriconnects pic.twitter.com/LEcuUKiZAp — Charmme Kaur (@Charmmeofficial) February 16, 2020 LIVE LOVE WOOF 😁 .#pets #loveofmylife 💕 pic.twitter.com/dlZgZeGwAX — Charmme Kaur (@Charmmeofficial) February 16, 2020 చదవండి: ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’.. తమన్నా సాయం! నితిన్ లవ్‌స్టోరీ తెలిసింది అప్పుడే -
విజయ్ థాయ్‌లాండ్‌లో ఏం చేస్తున్నాడంటే..
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. హిందీ వెర్షన్‌కు కరణ్ జోహార్ భాగస్వామిగా వ్యవహరించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ కోసం విజయ్ థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. అయితే విజయ్ థాయ్‌లాండ్ ఎందుకోసం వెళ్లాడనేదానిపై నిర్మాత ఛార్మి స్పష్టత ఇచ్చారు. అక్కడ విజయ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు ఛార్మి తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ చిత్రంలో విజయ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం విజయ్ చాలా కఠోర సాధన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజయ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణకు సంబంధించి ఛార్మి.. ఓ వీడియో కూడా విడుదల చేశారు. అందులో విజయ్‌కు శిక్షణ ఇస్తున్న ట్రైనర్‌ను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ట్రైనర్ మాట్లాడుతూ.. విజయ్ రోజుకు ఆరు గంటల పాటు సాధన చేస్తున్నట్టు తెలిపాడు. అలాగే ట్రైనింగ్ ఎలా సాగుతుందో వివరించాడు. అంతేకాకుండా జనవరి 20న ముంబైలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్టు ఛార్మి వెల్లడించారు. మరోవైపు విజయ్ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకులు మందుకు రానుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో.. విజయ్ సరసన ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఎజిబెల్లా, రాశీ ఖన్నా నటిస్తున్నారు. -
'మీకు మాత్రమే చెప్తా' ప్రీ రిలీజ్ వేడుక
-
ఆరోసారి.. ఒకటోసారి!
అదేంటి.. ఎవరైనా ఒకటోసారి.. రెండోసారి.. ఇలా మొదలు పెడతారు. కానీ ఆరోసారి.. ఒకటోసారి అంటున్నారేంటి? అనేగా మీ సందేహం. మరి ఆ డౌట్ తీరాలంటే మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా రూపొందనుంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల చివర్లో మొదలు కానుంది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనున్నారు. గతంలో పూరి జగన్నాథ్, మణిశర్మ కలిసి చేసిన ఐదు సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. వీరి కాంబినేషన్లో చివరగా ‘టెంపర్’ సినిమా వచ్చింది. ఆ చిత్రానికి నేపథ్య సంగీతం అందించారు మణిశర్మ. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’తో ఆరోసారి వీళ్లిద్దరూ కలిసి పని చేయనున్నారు. కాగా రామ్, మణిశర్మ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇదే. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: లావణ్య. -
నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు: నటి
తమిళసినిమా: ఆ నిర్ణయంలో మార్పు లేదు అంటున్నారు నటి చార్మి. ఈ బ్యూటీ చాలా కాలం కిందట తమిళంలో కాదల్ అళివదిలై, లాడం వంటి కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ తరువాత టాలీవుడ్‌పైనే దృష్టి సారించారు. పలు తెలుగు చిత్రాల్లో కథానాయకిగా నటించిన చార్మి కొన్ని స్పెషల్ సాంగ్స్‌లోనూ ఆడి అందాలను ఆరబోశారు. ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో నిర్మాత అవతారమెత్తారు. అయితే చార్మీపై పలు ప్రేమ వదంతులు హల్చల్ చేశాయి. తాను ప్రేమలో మోసపోయానని, అందువల్ల పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా సోషల్‌మీడియాలో ప్రచారం వైరల్ అవుతోంది. ఆ సంగతేమిటో చూద్దాం. నా జీవితంలో ఒకతన్ని గాఢంగా ప్రేమించాను. అయితే రెండు కారణాలతో ఆ ప్రేమ విఫలమైంది. ఒక వేళ మేము పెళ్లి చేసుకున్నా అదే కారణాలతో విడిపోవలసివచ్చేది. ఆ వ్యక్తి ప్రవర్తన కారణంగా నాకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయింది. అయితే అతను మంచి వాడే. ఇక నాకు మరో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఒక వ్యక్తిని మనసారా ప్రేమించి, మరొకరితో కలిసి జీవించడం, అతని కోసం వేచి చూడటం, సమయాన్ని కేటాయించడం, వంటా వార్పు అంటూ ఇంటి పనులు చేయడం నా వల్ల కాని పని. అందుకే ఇకపై వివాహమే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అని చార్మి పేర్కొన్నారు. చార్మి సంచలన నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
చార్మి పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ చార్మికి స్వల్ప ఊరట లభించింది. సిట్ అధికారులు ఆమెను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు మాత్రమే విచారించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. మహిళా అధికారులు మాత్రమే ఆమెను విచారించాలని స్పష్టం చేసింది. చార్మి వేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువరించింది. అనుమతి లేకుండా రక్త నమూనా తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. చార్మికి ఇష్టమైన స్థలంలోనే విచారణ జరపాలని సూచించింది. వ్యక్తిగత లాయర్ సమక్షంలోనే విచారణ జరపాలన్న విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. తాము లేవనెత్తిన అంశాలపై గౌరవ న్యాయస్థానం మూడు కీలక ఆదేశాలిచ్చిందని చార్మీ తరపు న్యాయవాది విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. విచారణకు వెళ్లాలా, వద్దా అనేది ఆమె ఇష్టమని కోర్టు పేర్కొన్నట్టు చెప్పారు. ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా శాంపిల్స్ తీసుకోవద్దని కోర్టు ఆదేశించిందని వెల్లడించారు. రేపు సిట్ విచారణకు చార్మీ హజరవుతారని తెలిపారు. అయితే ఎక్కడ హాజరవుతారనే దానిపై ఈ సాయంత్రం ఆమె నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. డ్రగ్స్ కేసులో చార్మి నిందితురాలు కాదని, సాక్షి అని తెలిపారు. ఈ విషయాన్ని సమన్లలో స్పష్టంగా పేర్కొన్నారని విచారణ కోసం అబ్కారీ కార్యాలయానికి వెళ్లాలని చార్మిని తాను సూచిస్తానని చెప్పారు. ప్రైవేటు స్థలాల్లో అయితే భద్రతాపరమై సమస్యలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. -
లాయర్ సమక్షంలోనే విచారించాలి
- విచారణ సమయంలో మహిళా అధికారులుండాలి - ఆ మేరకు విచారణాధికారులను ఆదేశించండి - పిటిషన్‌పై నేడు విచారణ సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న సినీ నటి చార్మికౌర్ హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం న్యాయవాది, మహిళా అధికారుల సమక్షంలోనే తన విచారణ జరిపేలా ఎక్సైజ్ అధికారులను ఆదేశించాలని కోరుతూ సోమ వారం పిటిషన్ దాఖలు చేశారు. తన నుంచి బలవంతంగా వాంగ్మూలం తీసుకోకుండా ఆదేశించాలన్నారు. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టకుండా, బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను సేకరించకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. పిటిషన్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి, కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సిట్ సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘‘సినీ పరిశ్రమలో కష్టపడి పైకొచ్చాను. సినీ రంగంలోని కొందరు, ఓ వర్గం మీడియా ఒత్తిళ్లకు లొంగనం దుకు నాపై అనవసర పుకార్లను ప్రచారంలోకి తెచ్చారు. టీఆర్పీ రేటింగ్‌లు, సర్క్యులేషన్లు పెంచుకునేందుకు తప్పుడు ప్రచారం చేశారు. సంబంధం లేని వ్యవహారాలు, వ్యక్తులతో ముడిపెడుతూ నా ప్రతిష్టను దెబ్బతీస్తున్నా రు. దురుద్దేశాలతోనే ఇదంతా చేస్తూ నన్ను బాధితురాలిగా మార్చేశారు. ఓ వర్గం మీడియా చేస్తున్న ఆరోపణలకు.. నాకు ఎలాంటి సంబంధం లేదు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల చట్టం (ఎన్డీపీఎస్) 1985 కింద చార్మినార్, నాంపల్లి, బాలానగర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో విచారణకు సం బంధించి నోటీసులు అందుకున్నాను. వాస్త వానికి ఆ కేసులతో నాకు సంబంధం లేదు. ఆ కేసుల్లో వస్తున్న ఆరోపణలకుగానీ, ఆ కేసుల తో ప్రమేయం ఉన్న వ్యక్తులతోగానీ నాకు సంబంధం లేదు. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. దర్యాప్తు సంస్థ విచారణకు పూర్తిగా సహకరిస్తా. నా తల్లిదండ్రులు వృద్ధులు. వారు హైదరాబాద్‌లో ఉండటంలేదు. విచా రణ సమయంలో న్యాయవాదిని వెంటబెట్టు కునే హక్కు నాకు రాజ్యాంగం కల్పించింది. విచారణ అధికారులు పలువురు సినీ ప్రముఖులను పిలిచి విచారణ చేపట్టినటు మీడియా ద్వారా తెలుసుకున్నా. డాక్టర్ ద్వారా వారి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసు కున్నట్లు కూడా కథనాలు వచ్చాయి. ఇలా చేయడం వారి ఇష్టానికి విరుద్ధం. అలాగే విచారణాధికారులు దారుణమైన ప్రశ్నలు వేస్తూ.. బలవంతంగా సమాచారం చెప్పిస్తు న్నట్లు కూడా కథనాలు వచ్చాయి. నా విచారణ సమయంలోనూ ఇలానే వ్యవహరించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నా. డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయినా.. బలవంతంగా నాకు వ్యతిరేకంగా నాతోనే వాంగ్మూలం ఇప్పించవచ్చు. నా ఇష్టానికి వ్యతిరేకంగా రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను సేకరిస్తే ఓ అవివాహిత మహిళగా ఈ సమాజం దృష్టిలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భవిష్యత్, వృత్తి, రాజ్యాంగ హక్కులను కోల్పోతాను. అధికారుల విచారణ తీరు నా వ్యక్తిగత గోప్యత హక్కును, ప్రతిష్టను దెబ్బతీసేలా ఉండొచ్చు. విచారణ సందర్భంగా నాకు నా న్యాయవాది సహకారం అవసరం. విచార ణాధికారులు నా వాంగ్మూలాన్ని మహిళా అధికారుల సమక్షంలోనే నమోదు చేయాలి’’ అని చార్మి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయ స్థానం మంగళవారం విచారణ చేపట్టనుంది. -
జ్యోతిలక్ష్మి ఆడియో విడుదల
-
అమ్మాయిలూ, అబ్బాయిలూ ఫెండ్షిప్ చేయరా?
కౌర్ కౌర్ మే కహానీ. హిందీలో కౌర్ అంటే ముద్ద. చార్మి కౌర్ మనకు తినిపించే ప్రతి సినిమా ముద్దలో ఒక విషయం ఉంటుంది. బెరుకు ఉండదు... ఆమె నడిపే బుల్లెట్‌కి బ్రేక్ ఉండదు. గుండెలో ఉన్న మాటకి స్పీడ్‌బ్రేకర్ ఉండదు. అడగడమే తరువాయి గన్‌షాట్‌లా సమాధానం వచ్చేస్తుంది. ‘జ్యోతిలక్ష్మీ’ ఆడియో రిలీజ్‌కి ముందు సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూ.... ఎక్స్క్లూజివ్లీ మీకోసం... ♦ లైఫ్ ఎలా ఉందండీ? మీ పేరుకు తగ్గట్టుగా చార్మింగ్‌గా ఉందా? చార్మి: అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే కొత్త కొత్తగా ఉంది. చేతి నిండా పని. ప్రొడ్యూసర్ రోల్ అంటే మాటలా మరి! సినిమా నిర్మాణం, నిర్మాణానంతర కార్యక్రమాలు... ఇలా ప్రతిదీ దగ్గరుండి చూసుకోవాలి కదా! ♦ మరి, నిర్మాతగా కష్టమనిపించడం లేదా? కాస్త కష్టమే. కథానాయికగా చేసిన ఈ పదమూడేళ్లూ చాలా సుఖంగా బతికేశానని ఇప్పుడనిపిస్తోంది. చెప్పిన టైమ్‌కి షూటింగ్‌కి రావడం, యాక్ట్ చేయడంతో బాధ్యత అయిపోయేది. ఇప్పుడలా కాదు. బోల్డంత స్ట్రెస్. కానీ, ఇది కూడా కిక్కిస్తోంది. ఎంజాయ్ చేస్తున్నా. ♦ అసలు ‘జ్యోతిలక్ష్మీ’ చేయాలని ఎందుకనుకున్నారు? ఓ నాలుగైదేళ్లుగా నేను, పూరి (పూరి జగన్నాథ్) గారు ఈ సినిమా గురించి అనుకుంటున్నాం. ‘ప్రతిదీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి’ అని నిర్మాణం బాధ్యత మొత్తం నా మీదే పెట్టేశారు పూరిగారు. నాలాంటి కొత్త నిర్మాతను నమ్మి, బాధ్యత మొత్తం ఇచ్చేయడం చిన్న విషయం కాదు. ♦ పూరి మిమ్మల్ని అంతలా ఎందుకు నమ్మారు? (నవ్వుతూ...) నా టైమ్ బాగుండి నమ్మారు. ఈ సినిమా ఆరంభించినప్పట్నుంచీ పూర్తయ్యేవరకూ, నన్ను ఏ విషయంలోనూ ఆయన ప్రశ్నించలేదు. ‘నువ్వు బాగా చేస్తావని నాకు తెలుసు’ అనేవారు. ♦ ఇప్పటివరకు పూరి జగన్నాథ్ ఎంతోమంది హీరోయిన్స్‌తో సినిమాలు చేశారు. ఆయన దర్శకత్వంలో ఒకే ఒక్క సినిమా (హిందీ చిత్రం ‘బుడ్డా హోగా తేరా బాప్’) చేసిన మీతో అంత అనుబంధం ఎలా కుదిరింది? కొన్ని కొన్ని అలా కుదిరిపోతాయ్. వాటికి కారణాలు చెప్పలేం. కానీ, పూరీగారితో ఈ అనుబంధం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంత పెద్ద దర్శకుడో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలున్నాయి. చిరంజీవిగారు, మహేశ్‌బాబు.. ఇలా వరుసగా స్టార్స్‌తో సినిమాలున్నాయి. అసలు భవిష్యత్తులో ఆయనకు నేను గుర్తుంటానో లేదో కూడా చెప్పలేం. అలాంటిది నాకు ఇప్పుడు డేట్స్ ఇచ్చారంటే నా మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ♦ అంతగా నమ్మిన పూరి.. నిర్మాతగా మీ పనితీరు చూసి ఏమన్నారు? ఏడు నెలల నుంచి ఈ సినిమాతో ట్రావెల్ అవుతున్నా. స్టోరీ సిట్టింగ్స్ నుంచి ఎడిటింగ్ వరకూ అన్ని విషయాల్లోనూ లీనమయ్యా. ‘పూరీ గారు, సి.కల్యాణ్‌గారు చాలా బాగా చేస్తున్నావ్’ అని అభినందించారు. ♦ జ్యోతిలక్ష్మీ పాత్ర కోసం బాగా సన్నబడినట్లున్నారు. ఆల్మోస్ట్ ఫుడ్ త్యాగం చేసేశారా ఏంటి? పది నుంచి పదకొండు కిలోలు తగ్గాను. కానీ, త్యాగాలేవీ చేయలేదు. నచ్చినవన్నీ తిన్నా. కాకపోతే మితంగా తిన్నా. ప్రతిరోజూ వర్కవుట్స్ చేశా. అలా బరువు తగ్గడానికి నాకు నాలుగు నెలలు పట్టింది. ♦ ‘ప్రేమ ఒక మైకం’లో వేశ్యగా చేసిన మీరు, ఈ చిత్రంలో కూడా ఆ పాత్రే చేశారేం? అయితే ఏంటండీ? ఒక సినిమాలో లవర్‌గా నటించాక మరో సినిమాలో కూడా ఆ పాత్ర చేస్తాం కదా! అలాగే, భార్య పాత్ర, తల్లి పాత్రలు రిపీట్ అవుతూనే ఉంటాయి. కానీ, వేశ్య పాత్రను మాత్రం రిపీట్ చేస్తే, ‘ఎందుకు మళ్లీ చేశారు?’ అనడుగుతారు. కథ, పాత్ర కుదిరినప్పుడు చేస్తే తప్పేంటి? అయితే, ఆ సినిమాలోని పాత్రకూ, ఈ సినిమాలోని పాత్రకూ అస్సలు పోలికే ఉండదు. ♦ వేశ్య పాత్ర చేయనున్నానని చెప్పినప్పుడు మీ అమ్మగారు ఎలా రియాక్ట్ అయ్యారు? మా అమ్మగారిది చాలా బ్రాడ్ మైండ్. ప్రొఫెషన్‌కి న్యాయం చేసే దిశలో నేనెలాంటి పాత్రలు చేసినా కాదనరు. నేను తీసుకునే నిర్ణయాల మీద ఆమెకు చాలా నమ్మకం ఉంది. ఒకవేళ నా నిర్ణయం ఎప్పుడైనా తప్పయ్యిందనుకోండి... మళ్లీ ఆ తప్పు చేయనని కూడా నమ్ముతుంది. ♦ ఈ మధ్య వరుసగా సినిమాలు చేయకుండా వెనకబడిపో తున్నారేం? నా కెరీర్ నా ఇష్టం. ఏదో రేస్‌లో ఉండాలి కాబట్టి, వరుసగా సినిమాలు చేయాలనుకోను. అసలు నేను రేస్‌లోనే ఉండదల్చుకోలేదు. మనసుకు నచ్చిన సినిమాలొస్తే చేస్తా.. లేకపోతే లేదు. ఈ మధ్యకాలంలో చాలా కథలు విన్నాను. ఏదీ నచ్చలేదు. ‘జ్యోతిలక్ష్మీ’ నచ్చింది కాబట్టి చేశా. ♦ ఇటీవల ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితమవుతున్నారు. విజయశాంతికి రీప్లేస్‌మెంటా? విజయశాంతిగారిని ఎవరూ రీప్లేస్ చేయలేరు. ఇక, ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ అంటారా? నేను కావాలని సెలెక్ట్ చేయడం లేదు. వస్తున్నాయి కాబట్టి, చేస్తున్నాను. ఆ మాటకొస్తే, నా లైఫ్‌లో నేనేదీ ప్లాన్ చేయను. ఏది బెస్ట్ అనిపిస్తే, అది చేసుకుంటూ వెళ్లిపోతా. ♦ మీ లైఫ్‌లో పూరి జగన్నాథ్, కృష్ణవంశీ లాంటి దర్శకులు చాలా స్పెషలేమో అనిపిస్తోంది. ఆడ, మగ స్నేహాన్ని అంగీకరించేంతగా మన సమాజం ఇంకా ఎదగలేదు. అసలు వాళ్లతో మీ అనుబంధాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఓ కాల్ సెంటర్‌ని తీసుకుందాం. అక్కడ పని చేసే అమ్మాయిలూ, అబ్బాయిలూ స్నేహంగా ఉండరా? సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. అక్కడి అమ్మాయిలూ, అబ్బాయిలూ ఫ్రెండ్షిప్ చేయరా? అలాగే మా సినిమా రంగం కూడా! ఆడ, మగ స్నేహం గురించి సొసైటీ ఏమనుకుంటుందో నాకు తెలియదు కానీ, నా వరకు నాకు అందులో తప్పు లేదు. పూరీగారు, కృష్ణవంశీగారు నాకు మంచి స్నేహితుల్లాంటివాళ్లు. ♦ దేవిశ్రీప్రసాద్‌తో కూడా మీరు చాలా స్నేహంగా ఉంటారు కదా? దేవి నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ల అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు కూడా నాతో క్లోజ్‌గా ఉంటారు. దేవి మంచి హ్యూమన్ బీయింగ్. నా లైఫ్‌లో వచ్చిన అప్స్ అండ్ డౌన్స్ అన్నీ దేవికి తెలుసు. నేను డౌన్లో ఉన్నప్పుడు తను సపోర్ట్‌గా నిలిచాడు. అది జీవితాంతం గుర్తుంటుంది. ♦ మీరు ఎవరితోనైనా లవ్‌లో...? అవును. ‘జ్యోతిలక్ష్మీ’తో లవ్‌లో ఉన్నాను. ప్రస్తుతం నేను ఏడ్చినా, నవ్వినా.. అంతా ‘జ్యోతిలక్ష్మీ’కి సంబంధించే! ♦ ఈ మధ్య మీ అన్నయ్య పెళ్లి చాలా ఘనంగా చేశారు. మరి మీ పెళ్లి గురించి ఆలోచించడం లేదా? లేదు. అసలు పెళ్లి చేసుకునే మూడ్‌లోనే లేను. ఈ ఏడాది కాదు కదా... మరో రెండేళ్ల వరకూ దాని గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. ♦ మీరు కొంచెం రెబల్గానే ఉంటారనిపిస్తోంది? (నవ్వుతూ...) ఆ రోజు మూడ్ ఎలా ఉంటే అలా! సందర్భాన్ని బట్టి రియాక్ట్ అవుతుంటాను. అయితే ఒక్క విషయం స్పష్టంగా చెబుతా. నేను సున్నిత మనస్కురాల్ని మాత్రం కాదు. రెబల్ అవ్వాల్సిన చోట తప్పకుండా అవుతా. ♦ నిర్మాతగా కొనసాగుతారా? స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తారా? నిర్మాతగా కొనసాగాలనే ఉంది. చూద్దాం. కానీ, స్టార్ హీరోలతో సినిమా చేయాలంటే... డేట్స్ అంత ఈజీగా దొరుకుతాయా? ♦ చార్మి అడిగితే ఇవ్వరా? డేట్స్ ఖాళీ లేకపోతే ఎవరడిగినా ఇవ్వరు. ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా సెట్ అయినంత సులువుగా అన్నీ సెట్ అవుతాయా? ఒకవేళ సెట్ అయితే హ్యాపీనే! ♦ మీరు నిర్మించే చిత్రాల్లో మీరే నటిస్తారా? బయటి హీరోయిన్లతో చేస్తారా? తప్పకుండా వేరేవాళ్లతో చేస్తా! ♦ మీలాంటి తారలు నిర్మాతలుగా కూడా కొనసాగితే, ‘ఆడవాళ్లు ఏమైనా చేయగలరు’ అని నిరూపించినట్లవుతుంది! (మధ్యలోనే అందుకుంటూ...) అవునండీ. నాక్కూడా ఆ ఫీలింగ్ ఉంది. ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదు. అందుకే, సాధ్యమైనంతవరకూ నేను నిర్మాతగా కంటిన్యూ అవుతా. ♦ చిరంజీవి 150వ సినిమాలో మీరు నటిస్తారనే టాక్ వినిపిస్తోందే!? వినపడనివ్వండి. మంచిదే కదా! ♦ ఇంతకీ ఆ సినిమాలో మీరు ఉన్నారా? లేరా? అది చెప్పను. టాక్ వినిపిస్తోంది కదా.. వింటూ ఉండండి (నవ్వుతూ). ♦ ఈ మధ్య హిందీలో సూపర్ హిట్ అయిన ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ వంటి చిత్రాలు చూశారా? వాటిని తెలుగులో రీమేక్ చేస్తే నటిస్తారా? ఆ సినిమాలు చూశాను. కంగనా యాక్టింగ్ సూపర్బ్. ఒకవేళ ఆ చిత్రాల తెలుగు రీమేక్‌కు అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. ♦ ఫైనల్‌గా మీ అందం వెనుక సీక్రెట్ చెబుతారా? ఏమీ లేదండీ... హ్యాపీగా ఉంటా. మనసులో ఒకలా బయటికి ఇంకోలా ఉండను. ఓపెన్ మైండెడ్గానే ఉంటా. ఆరోగ్యానికి మంచివనిపించేవన్నీ తింటా. చక్కగా వ్యాయామాలు చేస్తా. - డి.జి. భవాని -
‘జ్యోతిలక్ష్మి’ ఫస్ట్ లుక్ అదిరింది
-
ఐటమ్ గాళ్!
లీడింగ్ రోల్స్ రాకపోయినా ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది పంజాబీ బ్యూటీ చార్మీ. టాలీవుడ్లోనే కాదు... తమిళంలోనూ ఐటెమ్ సాంగ్స్ ఆఫర్స్ కొట్టేస్తోంది. విక్రమ్, సమంతా నటిస్తున్న ‘10 ఎన్రాత్కుల్లా’ చిత్రంలో ఈ బబ్లీ గాళ్ స్టెప్పులేసి కుర్రకారు మది దోచేందుకు సిద్ధమైంది. దర్శకుడు విజయ్ మిల్టన్ చిత్రంలోని ఓ ఆసక్తికరమైన పాట షూటింగ్‌ను పూనాలో తీసేందుకు సన్నాహకాలు చేసుకొంటున్నారు. ఇది తొమ్మిది నిమిషాల లాంగ్ సాంగ్. రెండున్న కోట్ల రూపాయలు ఖర్చుతో భారీ సెట్ వేస్తున్నారట. -
యువతే శాసించాలి : చార్మి
ఇప్పుడు ఎటు చూసినా సమాజంలో అశాంతి, అభద్రతాభావం రాజ్యమేలుతున్నాయి. ఈ సంక్షోభాలను ఎదుర్కోవాలంటే రాజకీయాలను యువతే శాసించాలి. దేశభవిష్యత్తు.. కొత్త రాష్ట్రాల భవిష్యత్తు ఉన్నతంగా లిఖించాల్సిన బాధ్యత యువతరంపైనే ఉంది. ఏ దేశమైనా, రాష్ట్రమైనా ముందుకు సాగాలంటే వనరులు, ప్రమాణాలతో కూడిన విద్య అవసరం.. ఇది కొందరికే పరిమితం కాకూడదు. అందరికీ అందాలి.. యువత ఎప్పటికప్పుడు విద్యారంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని నవసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.. మరో ముఖ్య విషయం.. స్త్రీ స్వేచ్ఛకు భంగం కలగని సమాజం కావాలి.. అటువంటి సమాజాన్ని సృష్టించే నాయకుడినే ఎన్నుకోవాలి.. యువత తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటు వేయడం మన హక్కే కాదు.. దేశపౌరులుగా మన బాధ్యత కూడా.. -
ఐటమ్ సాంగ్ లో చార్మి ఇరగదీసిందట!
ఇటీవల కాలంలో టాలీవుడ్ ను వదిలిసి బాలీవుడ్ పై కన్నేసినట్టు కనిపిస్తోంది. టాలీవుడ్ లో అగ్రతారగా రాణించిన చార్మికి టాలీవుడ్ లో సమంత, కాజల్, తమన్నాల నుంచి గట్టి పోటీ ఎదురవ్వడంతో కాస్తా వెనకబడిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'బుడ్డా హోగా తేరా బాప్' చిత్రంలో చార్మి కనిపించింది. అయితే 'బుడ్డా' చిత్రం చార్మికి ఆశించినంత పేరును బాలీవుడ్ తీసుకురాలేకపోయింది. ఎలాగైనా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలను చార్మి తెగ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రభుదేవా రూపొందిస్తున్న రాంబో రాజ్ కుమార్ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో ఇరగదీసినట్టు సమాచారం. హాట్ హాట్ గా తెరకెక్కించిన ఐటమ్ సాంగ్ లో షాహీద్ కపూర్ సరసన కిక్కెంచే శృంగార భంగిమలతో అదరగొట్టినట్టు ఫిల్మ్ నగర్ లో హాట్ టాక్ గా నిలిచింది. ఈ చిత్రంలో షాహీద్ కపూర్ తోపాటు మరో బాలీవుడ్ ముద్దు గుమ్మ సోనాక్షి సిన్హా కూడా నటిస్తోంది. 2007 లో కన్నడ చిత్రం లవ కుశ ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన చార్మి.. 'నీ తోడు కావాలి' అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆతర్వాత తెలుగులో అగ్రనటుల సరసన నటించి.. టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.