
ఐటమ్ గాళ్!
లీడింగ్ రోల్స్ రాకపోయినా ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది పంజాబీ బ్యూటీ చార్మీ. టాలీవుడ్‌లోనే కాదు... తమిళంలోనూ ఐటెమ్ సాంగ్స్ ఆఫర్స్ కొట్టేస్తోంది. విక్రమ్, సమంతా నటిస్తున్న ‘10 ఎన్‌రాత్‌కుల్లా’ చిత్రంలో ఈ బబ్లీ గాళ్ స్టెప్పులేసి కుర్రకారు మది దోచేందుకు సిద్ధమైంది. దర్శకుడు విజయ్ మిల్టన్ చిత్రంలోని ఓ ఆసక్తికరమైన పాట షూటింగ్‌ను పూనాలో తీసేందుకు సన్నాహకాలు చేసుకొంటున్నారు. ఇది తొమ్మిది నిమిషాల లాంగ్ సాంగ్. రెండున్న కోట్ల రూపాయలు ఖర్చుతో భారీ సెట్ వేస్తున్నారట.