
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మీ పేర్లు లైగర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో పాన్ ఇండియా రేంజ్‌లో వినిపించాయి. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఛార్మీ అయితే కొన్నాళ్ల పాటు సోషల్ మీడియా నుంచి కూడా దూరంగా ఉంది. ఇప్పటికీ ఆమె నెట్టింట అంతగా యాక్టివ్‌గా కనిపించడం లేదు.
లైగర్ రిలీజై సుమారు 6-7 నెలలు అయినా నిమా ఫంక్షన్లు, పార్టీలు ఇలా బయట కూడా వీరు అంతగా కనిపించలేదు. అలాంటిది తాజాగా ఛార్మీ-పూరీలు ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా లైగర్ అనంతరం విజయ్‌తో అనౌన్స్ చేసిన ‘జనగణమన’ ప్రాజెక్ట్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పూరి జగన్నాథ్ కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. మరి త్వరలోనే ఏదైనా ప్రాజెక్ట్ గురించి కబురు చెబుతారేమో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment