Charmi Kaur
-
ఇలా అవుతుందని ఊహించలేదు: చార్మీ, మంచు లక్ష్మి ఎమోషనల్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ భార్య, యోగా ట్రైనర్ రూహీ మరణవార్త అందరినీ కలిచివేస్తోంది. ఎంతోమంది తారలకు యోగా టీచర్‌గా పని చేసిన రూహి అనారోగ్యంతో గురువారం నాడు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు. చార్మీ, మంచు లక్ష్మి.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనలయ్యారు. ఈ వార్త అబద్ధమైతే బాగుండు 'ప్రియమైన రూహి.. నీ కోసం ఇలాంటి పోస్ట్ వేస్తానని ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నాను. మాటలు రావడం లేదు. నువ్వు ఇక లేవన్న వార్త అబద్ధమైతే బాగుండనిపిస్తోంది. మనం చివరిసారి కూడా ఎంతో సరదాగా మాట్లాడుకున్నాం. 18 ఏళ్ల అందమైన స్నేహబంధం మనది. నిన్ను మిస్ అవుతానని చెప్పడం చిన్నమాటే అవుతుంది. నీ కుటుంబానికి ఆ దేవుడు మరింత శక్తినివ్వాలి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది చార్మీ. డ్యాన్స్, నవ్వులు.. అవన్నీ.. మంచు లక్ష్మి.. రూహితో తన చివరి చాట్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'రూహి నుంచి నాకు అందిన చివరి మెసేజ్ ఇదే! ప్రతివారం తనను జిమ్‌లో కలుస్తూ ఉండేదాన్ని. తన ముఖంలో ఎప్పుడూ ఒక నిష్కల్మషమైన నవ్వు కనిపిస్తూ ఉండేది. ఎంతో ఎనర్జీగా కనిపించేది. మేమిద్దరం ఒళ్లంతా చెమటలు పట్టేవరకు డ్యాన్స్ చేసేవాళ్లం.. దవడలు నొప్పిపుట్టేంతవరకు నవ్వుతూనే ఉండేవాళ్లం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని నువ్వు మరోసారి నిరూపించావు. ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయినందుకు ఎంతో బాధగా ఉంది. మేము అదృష్టవంతులం సెంథిల్, తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తుంటేనే మనసు కలుక్కుమంటోంది. కానీ నువ్వు జీవితానికి సరిపడా ప్రేమను పంచి వెళ్లిపోయావు. నీతో కలిసి ప్రయాణం చేసిన మేమంతా ఎంతో అదృష్టవంతులం. ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ సర్ప్రైజ్ చేసేదానివి.. ఇప్పుడు స్వర్గంలో ఉన్న ఏంజెల్స్‌కు యోగాసనాలు నేర్పిస్తున్నావని ఆశిస్తున్నాను. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. ఇకపై నన్ను చూడటానికి రాలేవు. ఇలాంటి పోస్ట్ వేస్తానని కలలో కూడా ఊహించలేదు. నీ పేరు మీద ఈరోజు ప్రతిక్షణం సెలబ్రేట్ చేసుకుంటా.. ఇట్లు నీ స్నేహితురాలు లక్ష్మి' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రాఫర్ భార్య మృతి -
హనుమాన్ కంటే 'శ్రీ ఆంజనేయం' బెటర్.. కృష్ణ వంశీ రియాక్షన్ వైరల్
ఈ సంవత్సరం సంక్రాంతి హిట్‌గా 'హనుమాన్' చిత్రం నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతుంది. తాజాగా ఈ సినిమా 300 సెంటర్లలో 30రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా హనుమాన్ ఉండటం విశేషం. హనుమాన్ చిత్రం గురించి సోషల్ మీడియా ఒక చర్చ జరుగుతుంది. గతంలో కృష్ణ వంశీ తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం చిత్రం గురించి ఇప్పుడు మళ్లీ పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.నితిన్, ఛార్మి నటించిన ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. సినిమా కథ బాగున్నప్పటికీ కొన్ని పాయింట్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. కానీ ఇందులో కూడా గ్రాఫిక్స్ పనితీరును మెచ్చుకోవాల్సిందే. తాజాగా నెటిజన్లు కొందరు హను మాన్ కంటే శ్రీ ఆంజనేయం సినిమానే గొప్ప సినిమా అంటూ కృష్ణ వంశీ ఎక్స్ పేజీలో పలు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదో అంటూ తిడుతూ ఒక పోస్ట్ పెట్టాడు. దానికి డైరెక్టర్ కృష్ణ వంశీ రియాక్ట్ అయ్యారు. ప్లీజ్ ప్రేక్షకులను మాత్రం తిట్టకండి వాళ్ల నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు.. శ్రీ ఆంజనేయం సినిమా విషయంలో ఎక్కడో తప్పు జరిగింది. ఈ చిత్రంలోని కొన్ని అంశాలు వాళ్లకు నచ్చలేదు. కానీ మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు అని కృష్ణ వంశీ రిప్లై ఇచ్చారు. ఇంతలో మరో నెటిజన్ శ్రీ ఆంజనేయం సినిమాలో ఛార్మి క్యారెక్టర్ చాలా చిరాకు పుట్టించేలా ఉందని చెప్పాడు. ఈ కారణంతోనే సినిమా ప్లాప్ అయిందని తెలిపాడు. అందుకు కృష్ణ వంశీ మాత్రం గాడ్ బ్లెస్ యు అని రిప్లై ఇచ్చారు. వాస్తవంగా అప్పట్లో ఆ సినిమా ప్లాప్‌కు కారణం ఛార్మి పాత్రే అని ఎక్కువగా కామెంట్లు చేశారు. ఆమెలో మంచి నటి ఉన్నప్పటికీ కథలో ఛార్మి పాత్రను క్రియేట్ చేసిన విధానం బాగలేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇలాంటి చిత్రంలో మితిమీరిన ఎక్స్ ఫోజింగ్ సాంగ్ ఉండటం ఎవరికీ నచ్చలేదు. నితిన్ పాత్రను కూడా మరీ అమాయకంగా చూపించడం పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. Audience r never wrong .. they didn't like it means there was a mistake r problem of reachability .. so dnt blame audience sir .. may b I was wrong AT some portions .. THQ 🙏♥️ God bless https://t.co/RBumH9z4nm — Krishna Vamsi (@director_kv) February 11, 2024 GOD bless you 🙏 https://t.co/1AcCs3Q2vq — Krishna Vamsi (@director_kv) February 11, 2024 -
ఇస్మార్ట్ యాక్షన్
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా రామ్, పూరీల కాంబినేషన్లోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రూపొందుతోంది. హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా గురువారం పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా హీరో రామ్, కీలక పాత్ర చేస్తున్న సంజయ్ దత్తో పూరి జగన్నాథ్ ఉన్న వర్కింగ్ స్టిల్‌ను రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 18న రిలీజ్ కానుంది. -
'డబుల్ ఇస్మార్ట్' కోసం బిగ్ బుల్‌ను దించిన పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబోలో 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించిన వార్త ఏదో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. 'లైగర్'తో దెబ్బతిన్న పూరీ 'డబుల్ ఇస్మార్ట్' కోసం పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను తీసుకున్నారు. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. (ఇదీ చదవండి: సౌత్ ఇండియాలో రిచ్చెస్ట్ హీరో ఆయనే.. ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే) ఇక సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కుడా రిలీజ్ చేశారు. అందులో సిగరెట్ తాగుతూ సంజయ్ దత్ కనిపిస్తుండగా ఆయనపై గన్స్ అన్నీ పాయింట్ చేసి ఉన్నాయి. ఇందులో 'బిగ్ బుల్'గా సంజయ్ దత్ కనిపిస్తారని మేకర్స్ తెలిపారు. గతంలో కేజీఎఫ్ 2లో అధీర పాత్రలో ఆయన మెప్పించిన విషయం తెలిసిందే. ఈ మూవీపై సంజయ్ కూడా ట్వీట్ చేశాడు. డైరెక్టర్ పూరిజగన్నాధ్, రామ్ పోతినేనితో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని ఆయన తెలిపాడు. ఈ సైన్స్ ఫిక్షన్ మాస్ ఎంటర్టైనర్లో తాను భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందంటూ సంజయ్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: శోభన ఇంట్లో చోరీ.. పనిమనిషి వేడుకోవడంతో ఆమె నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా) ఇక 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్‌గా రానున్న ఈ సినిమాలో రామ్‌కు జోడిగా మీనాక్షి చౌదరి కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. పూరీ సొంత నిర్మాణంలో ఛార్మీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి8న ప్రేక్షకుల ముందుకు రానుంది. It takes me immense pride to be working with the director of the masses #PuriJagannadh ji and the young energetic Ustaad @ramsayz 🤗 Glad to be Playing the #BIGBULL in this sci-fi mass entertainer #DoubleISMART Excited to be teaming up with this super-talented team and Looking… pic.twitter.com/SrIAJv6yy1 — Sanjay Dutt (@duttsanjay) July 29, 2023 -
పూరి 'ఇస్మార్ట్ శంకర్' వచ్చేస్తున్నాడు.. ఈసారి బాలీవుడ్ హీరోయిన్
2019లో పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' భారీ హిట్ అందుకుంది. ఆ సినిమా మాస్ ఆడియన్స్‌ను ఎంతగానో మెప్పించి వారిద్దరికీ బ్లాక్ బస్టర్‌గా నిలించింది. ఈ సినిమా సీక్వెల్ సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ఓ ఇస్మార్ట్ అప్డేట్ను చిత్ర యూనిట్ షేర్ చేసింది. లైగర్ రిజల్ట్ తనను తీవ్రంగా బాదించినా మళ్లీ తన మార్క్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు పూరి. తనలో ఉన్న ప్రత్యేకత ఇదేనని చెప్పవచ్చు. హీరోలకు ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ బేస్ పూరికి ఉంది. (ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్) నేడు జులై 10న ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగినట్లు యూనిట్ తెలిపింది. అందుకు సంబంధించిన పలు షేర్ చేసింది. జులై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దీనికి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. 2024 మార్చి 8న డబుల్ ఇస్మార్ట్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో భారీ యాక్షన్ మూవీ 'స్కంద' చేస్తున్నాడు. దీనిని సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. అది హిట్ అయితే డబుల్ ఇస్మార్ట్ కి డబుల్ కిక్ ఇవ్వడమే కాకుండా.. లైగర్‌తో నష్టపోయిన పూరి బౌన్స్ బ్యాక్ ఇవ్వడం ఖాయం. బాలీవుడ్ హీరోయిన్ రామ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరోక హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారని సమాచారం. మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. With the blessings of Lord Shiva 🔱 Ustaad @ramsayz & Dashing Director #PuriJagannadh's#DoubleISMART Pooja ceremony commenced 🪔 Shoot Begins on July 12th❤️🔥 Mass Action Entertainer at the cinemas on MARCH 8th, 2024💥@Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/Kj9vDRHiIg — Puri Connects (@PuriConnects) July 10, 2023 (ఇదీ చదవండి: అల్లర్ల మధ్య హోటల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఊర్వశి!) -
లైగర్ నష్టాలతో నిరవధిక దీక్ష.. స్పందించిన చార్మీ
బాక్సాఫీస్ బద్ధలు కొడుతుందనుకున్న విజయ్ దేవరకొండ లైగర్ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే! పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్ నిర్మించారు. గతేడాది తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 25న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ గండం గట్టెక్కలేకపోయింది. ఈ సినిమా వల్ల ఎంతో డబ్బు నష్టపోయామంటూ నైజాంకు చెందిన ఎగ్జిబిటర్లు హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ఎదుట రిలే నిరవధిక దీక్షకు పూనుకున్నారు. నష్టాన్ని భర్తీ చేస్తామని పూరీ జగన్నాథ్, డిస్ట్రిబ్యూటర్ తమకు మాటిచ్చి ఆరునెలలు అయిందని, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ ధర్నాపై నటి, నిర్మాత చార్మీ స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో వారికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. త్వరలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఫిలిం ఛాంబర్‌కు ఈ మెయిల్ ద్వారా సందేశాన్ని పంపింది. చదవండి: మోడ్రన్ లవ్ చెన్నై... ఆ ఓటీటీలో అప్పుడే స్ట్రీమింగ్! -
రోడ్డెక్కిన లైగర్ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు
-
చాలా రోజుల తర్వాత జంటగా కనిపించిన పూరి జగన్నాథ్-ఛార్మీ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మీ పేర్లు లైగర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో పాన్ ఇండియా రేంజ్లో వినిపించాయి. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఛార్మీ అయితే కొన్నాళ్ల పాటు సోషల్ మీడియా నుంచి కూడా దూరంగా ఉంది. ఇప్పటికీ ఆమె నెట్టింట అంతగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. లైగర్ రిలీజై సుమారు 6-7 నెలలు అయినా నిమా ఫంక్షన్లు, పార్టీలు ఇలా బయట కూడా వీరు అంతగా కనిపించలేదు. అలాంటిది తాజాగా ఛార్మీ-పూరీలు ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా లైగర్ అనంతరం విజయ్‌తో అనౌన్స్ చేసిన ‘జనగణమన’ ప్రాజెక్ట్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పూరి జగన్నాథ్ కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. మరి త్వరలోనే ఏదైనా ప్రాజెక్ట్ గురించి కబురు చెబుతారేమో చూడాలి మరి. -
‘లైగర్’ ఫ్లాప్.. చార్మీ షాకింగ్ నిర్ణయం
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటిగా లైగర్ నిలుస్తుందని అంతా భావించినా అందుకు భిన్నంగా డిజాస్టర్ టాక్ని మూటగట్టుకుంది. మైక్ టైసన్ వంటి ప్రపంచ చాంపియన్ ఉన్నా కంటెంట్ లేకుంటే థియేరట్లకు జనాలు రారని లైగర్ మరోసారి నిరూపించింది. ఫలితంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చిందంటున్నారు సినీ విశ్లేషకులు. చదవండి: నిర్మాతతో టీవీ నటి రెండో పెళ్లి, కొత్త జంటపై దారుణమైన ట్రోల్స్ ఇక లైగర్ ఫలితం అనంతరం చార్మీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఆమె ట్వీట్ చేస్తూ ట్రోలర్స్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. తాను సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘చిల్ గాయ్స్. కాస్తా బ్రేక్ తీసుకుంటున్నా(సోషల్ మీడియాకు). పూరీ కనెక్ట్స్ త్వరలోనే మరింత దృఢంగా, మునుపటికి కంటే ఉత్తమంగా తిరిగి వస్తుంది. అప్పటి వరకు కాస్తా శాంతించండి అబ్బాయిలు’ అంటూ చార్మీ రాసుకొచ్చింది. ఇక చార్మీపై కొందరు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా లైగర్ ఫ్లాప్‌తో విజయ్‌తో పాటు పూరీ కనెక్ట్స్ నిర్మాతలైన చార్మీ, పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశించి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: వైరల్‌గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు! ప్రమోషన్స్‌లో విజయ్ ఓవరాక్షన్, నోటి దురుసు వల్లే ఈసినిమా ఫ్లాప్ అయ్యిందని, అతడిని నమ్ముకున్నందుకు పూరీ కనెక్ట్స్ పని అయిపోయిందంటూ సోషల్ మీడియా విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు చార్మీ, పూరీ కనెక్ట్స్‌ను ట్యాగ్ చేస్తూ సినిమా అసలు బాగోలేదని, విడుదలకు ముందు క్రియేట్ చేసిన హైప్ కథలోనే లేదని.. కథ, కథనం చాలా బలహీనంగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటి కారణంగానే ఆమె సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Chill guys! Just taking a break ( from social media )@PuriConnects will bounce back 😊 Bigger and Better... until then, Live and let Live ❤️ — Charmme Kaur (@Charmmeofficial) September 4, 2022 -
'లైగర్' డిజాస్టర్‌పై స్పందించిన ఛార్మి
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటిగా లైగర్ నిలుస్తుందని అంతా భావించినా అందుకు భిన్నంగా డిజాస్టర్ టాక్ని మూటగట్టుకుంది. మైక్ టైసన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఉన్నా కంటెంట్ లేకుంటే థియేరట్లకు జనాలు రారని లైగర్ మరోసారి ప్రూవ్ చేసినట్లయ్యింది. ఫలితంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్‌పై నిర్మాత ఛార్మి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'జనాలు ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్‌తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూసే యాక్సిస్ ఉంది. కుటుంబం మొత్తం ఇంట్లోనే భారీ బడ్జెట్ సినిమాలు చూడగలరు. కాబట్టి సినిమాలు వారిని ఎగ్జైట్ చేయనంత వరకు థియేటర్లకు రావడానికి వాళ్లు ఇష్టపడటం లేదు. తెలుగులో ఇటీవల బింబిసార, సీతారామం, కార్తికేయ 2 వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. సుమారు రూ 150 కోట్ల నుంచి రూ. 170కోట్ల వరకు వసూలు చేశాయి. కానీ బాలీవుడ్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2019నుంచి లైగర్ కోసం కష్టపడ్డాం. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత లైగర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ఎన్నో అడ్డంకులను దాటి థియేటర్లో విడుదల చేశాం. కానీ సినిమా ఫెయిల్యూర్ అవడం బాధగా అనిపిస్తుంది' అంటూ ఛార్మి ఆవేదన వ్యక్తం చేసింది. -
చేతిలో రూపాయి లేకపోయినా ఆఫర్‌ను రిజెక్ట్ చేశా : ఛార్మి
ప్రస్తుతం ఎక్కడ చూసిన 'లైగర్' మూవీ జోరు కనిపిస్తోంది.రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోలో విజయ్‌కు జోడీగా అనన్య పాండే నటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా విజయ్, పూరి జగన్నాథ్‌లను ఛార్మి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను పూరి జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. చదవండి: ఛార్మితో రిలేషన్ బయటపెట్టిన పూరి జగన్నాథ్ ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఛార్మి అడిగారు. ఇక లాక్డౌన్ టైంలో ఓ ఓటీటీ సంస్థ నుంచి భారీగా ఆఫర్ వచ్చినా వదులుకున్నాననని, చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా సరే ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు చెబుతూ ఛార్మీ ఎమోషనల్ అయ్యింది. -
విజయ్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న మైక్ టైసన్.. ఎంతంటే
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చదవండి: హీరో కాకముందు విజయ్ దేవరకొండ ఏం చేశాడో తెలుసా? ప్రస్తుతం వరుస ప్రమోషన్స్‌తో మూవీ టీం ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. లైగర్ కోసం విజయ్ దేవరకొండ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం విజయ్ దాదాపుగా రూ. 35కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అనన్య పాండేకు మాత్రం కేవలం రూ. 3కోట్ల రూపాయాలే అప్పజెప్పారట. మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఈ సినిమాలో నటించిన మైక్ టైసన్‌కు విజయ్ కంటే ఎక్కువగా సుమారు రూ. 40కోట్ల వరకు రెమ్యునరేషన్ అందించినట్లు సమాచారం. -
'లైగర్'.. ఫుల్లీ లోడెడ్ మసాలా మూవీ : పూరి జగన్నాథ్
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ఆగస్టుల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లోని హన్మకొండలో లైగర్ టీం ఫ్యాన్డమ్ టూర్‌ని నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ..హాయ్ వరంగల్., వర్షం పడుతున్నా తడిచిమరీ ఈ వేడుకకి విచ్చేసిన ప్రేక్షకులు, అభిమానులందరికీ లవ్ యూ. ఆగస్ట్ 25 విడుదలౌతుంది. కరణ్ జోహార్ గారికి స్పెషల్ థాంక్స్. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. అపూర్వ మెహతా మిగతా టీం అందరికీ థాంక్స్. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారికి కృతజ్ఞతలు. ఒక రోజు మా ఆవిడ తిట్టింది. ఎందుకంటే.. కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు మంచి మంచి సినిమాలు తీసుతున్నారు.. నువ్వు వెనకపడిపోతున్నావ్.. సందీప్ రెడ్డి వంగా అనే డైరెక్టర్ వచ్చాడు. అర్జున్ రెడ్డి అనే సినిమా తీశాడు. నేను నా కూతురు మూడు సార్లు చూశాం., నువ్వూ చూడు'' అని చెప్పింది. అర్జున్ రెడ్డి చూశా. డైరెక్షన్ బావుంది.. సినిమా కూడా బాగానే వెళ్తుంది. కానీ 45 నిమిషాలు సినిమా చూసి ఆపేశా. కారణం.. సినిమాలో కుర్రాడిపై నా ద్రుష్టి ఆగిపోయింది. ఇంత నిజాయితీగా ఒక కుర్రాడు నటిస్తున్నాడని విజయ్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయా. అప్పుడే విజయ్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. విజయ్ లో నాకు నచ్చేది నిజాయితీ. లైగర్ లో ఎంత ఎలివేషన్ పెట్టినా కొంచెం పొగరు కూడా కనిపించదు. చాలా నిజాయితీగా చేశాడు. ఒక నిర్మాతగా విజయ్ కి కోటి రూపాయిలు ఇస్తే వద్దు ముందు సినిమా కోసం ఖర్చుపెట్టండని అంటాడు. తర్వాత రెండుకోట్లు పంపిస్తే.,,. మాకు అప్పులున్నాయని తెలిసి.. ముందు అప్పులు తీర్చమని తిరిగిపంపించేస్తాడు. ఈ రోజుల్లో ఇలా ఎవరంటారు ? హ్యాట్సప్ టు విజయ్. విజయ్ నాన్నగారు మా అబ్బాయిని ఒక కొడుకులా చూసుకొని మంచి సినిమా తీయ్ అన్నారు. కానీ విజయ్ నన్ను ఒక తండ్రిలా చూసుకొని నా కష్టాల్లో నాతో పాటు నిల్చున్నాడు. విజయ్ లాంటి హీరోని నేను చూడలేదు. మైక్ టైసన్ ని పట్టుకోవడానికి ఏడాది పట్టింది. ఆయన్ని ఈ సినిమాలోకి తీసుకొచ్చిన క్రెడిట్ ఛార్మికి దక్కుతుంది. మైక్ టైసన్ లాంటి లెజెండ్ తో కలసి పని చేసే అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఆయనతో సినిమా చేస్తామంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. అనన్య ఫైర్ బ్రాండ్. అద్భుతంగా నటిస్తుంది. రమ్యకృష్ణ గారు రెబల్ తల్లిగా కనిపిస్తారు. అమెది చాలా స్ఫూర్తిని ఇచ్చే పాత్ర. ఛార్మీ సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఏ కష్టాన్ని నా వరకూ తీసుకురానివ్వదు. సెట్ లో ఆమె ఏడ్చిన సందర్భాలు కూడా వున్నాయి. కానీ బయటికి చెప్పదు. ఛార్మీకి బిగ్ థాంక్స్. అలీతో చేసిన సినిమాలన్నీ హిట్టే. కష్టాల్లో సుఖాల్లో తోడుంటాడు. నాపై ప్రేమతో స్టేజ్ పై డ్యాన్స్ వేశాడు. రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే, చంకీ పాండే, గెటప్ శ్రీను, వంశీ అందరూ ప్రేమతో చేసిన సినిమా ఇది. అజీమ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. భాస్కర భట్ల మంచి లిరిక్స్ రాశారు. సాగర్ సౌత్ మ్యూజిక్ చూసుకున్నారు. విష్ నటుడిగా తెలుసు. అతను రియల్ ఫైటర్. ఈ సినిమాలో బ్యాడ్ గాయ్ రోల్ ప్లేయ్ చేశాడు. మా కంపనీ సీఈవో కూడా. విష్ మా బలం. డివోపీ విష్ణు శర్మ, ఎడిటర్ జునైద్, ఆర్ట్ డైరెక్టర్ జానీ, అనిల్.. మా పీఆర్వో వంశీ- శేఖర్, లీగర్, మార్కెటింగ్ టీమ్స్ ,శ్రేయాస్ మీడియా శ్రీనివాస్.. అందరికీ కృతజ్ఞతలు. లైగర్ ఆగస్ట్ 25 న వస్తోంది. ఇది ఫుల్లీ లోడెడ్ మసాలా మూవీ. సినిమాని మీరంతా థియేటర్ లో చూడాలి' అని కోరారు. ఛార్మీ కౌర్ మాట్లాడుతూ.. ఐ లవ్ యూ వరంగల్. ఈవెంట్ చేయాలంటే నా ఫస్ట్ ఛాయిస్ వరంగల్. ఇక్కడ ఈవెంట్ జరిగితే సినిమా సూపర్ హిట్. చివరి క్షణంలో వేదిక మారింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు ఎంతో సహకారం అందించారు. లైగర్ గురించి చాలా మాట్లాడాలని వుంది. కానీ లైగర్ సక్సెస్ కొట్టి బిగ్ బాక్సాఫీసు నంబర్స్ క్రియేటి చేసిన తర్వాత అప్పుడు సక్సెస్ మీట్ లో మాట్లాడతాను. ఆగస్ట్ 25 వాట్ లాగా దేంగే'' అన్నారు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈదెబ్బతో ఇండియా మొత్తం నేనేంటో చూపిస్తా..
-
ట్రైలర్‌కే ఈ రచ్చ ఏందిరా నాయనా! విజయ్ మాస్ స్పీచ్
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ 'లైగర్'. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు లైగర్ ట్రైలర్‌తో ట్రీట్ ఇచ్చారు మూవీ టీం. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో గ్రాండ్‌గా లైగర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'మీకు మా అయ్య తెల్వడు, మా తాత తెల్వడు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయితుంది. ఆ సినిమా కూడా పెద్దగా చెప్పుకునే సినిమా కాదు. అయినా ట్రైలర్‌కి ఈ రచ్చ ఏందిరా నాయనా? ఏందిరా ఈ మెంటల్ మాస్! మీ ప్రేమకు ఐ లవ్ యూ. ఈ సినిమా కోసం బాడీ, ఫైట్స్, డ్యాన్స్ చేసినా అంటే అది మీ కోసమే. ఈ సినిమాను మీకు డెడికేట్ చేస్తున్నా. ఆగస్టు 25న ఇండియా షేక్ అవ్వడం గ్యారెంటీ!' అంటూ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే రేంజ్లో విజయ్ మాట్లాడాడు. ఇక ఇండియాలో నెక్స్ట్ బిగ్ థింగ్ విజయ్ దేవరకొండ అంటూ పూరి జగన్నాథ్ మరింత హైప్ క్రియేట్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, అనిల్ తడానీ, అనన్య పాండే, చార్మీ సహా పలువురు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విజయ్ దేవరకొండ సరసన శ్రీదేవి కూతురు
పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటించనున్న రెండో సినిమా 'జనగణమన' (JGM). లైగర్ సెట్స్‌పై ఉండగానే ఈ మూవీని అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ముంబైలో గ్రాండ్‌గా ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సైనికుడిగా కనిపించనున్నాడు రౌడీ హీరో.ఇక ఈ సినిమాలో విజయ్ సరసన ఎవరు నటించనున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ని తీసుకోవాలని చూస్తున్నారట. లైగర్ మూవీలోనే హీరోయిన్గా జాన్వీని అనకున్నా కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. దీంతో ఫైనల్లీ ఈ ప్రాజెక్ట్ ద్వారా జాన్వీ టాలీవుడ్‌కు పరిచయం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. -
పూరీ జగన్నాథ్ 'జనగణమన' పోస్టర్ లాంచ్.. అప్పుడే వార్ స్టార్ట్
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ 'జనగణమన' (JGM). రౌడీ హీరో విజయ్ దేవరకొండతో జగన్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది. ఇదివరకే పాన్ ఇండియాగా 'లైగర్' మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 25, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ క్రేజీ కాంబోగా వస్తోన్న ఈ 'జనగణమన' చిత్రం పోస్టర్, విడుదల తేదిని ప్రకటించారు. ఈ పోస్టర్ లాంచ్‌ను మంగళవారం (మార్చి 29) ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ఆర్మీ డ్రెస్‌లో ప్రత్యేక ఛాపర్లో ముంబై చేరుకున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సైనికుడిగా కనిపించనున్నాడు రౌడీ హీరో. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ 'నేను ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. నేను చూసిన స్క్రిప్ట్‌లలో ఇది చాలా ఛాలెంజింగ్ కథ. ఈ సినిమా కథ ప్రతీ భారతీయుడికి హత్తుకుంటుంది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. నేను ఎప్పుడూ చేయని పాత్రను జెజీఎంలో చేస్తున్నాను. ఆ పాత్ర ప్రభావం ప్రేక్షకులపై కచ్చితంగా ఉంటుందని విశ్వవిస్తున్నాను.' అని తెలిపాడు. 'మా తర్వాతి ప్రాజెక్ట్ జెజీఎం పోస్టర్‌ను నాకు చాలా సంతోషంగా ఉంది. విజయ్‌తో మళ్లీ కలిసి పనిచేయడం గొప్పగా అనిపిస్తుంది. ఇది ఒక బలమైన కథ, కథనంతో ఉన్న అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైనర్.' అని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ బాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఆగస్టు 3, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 2022లో షూటింగ్ ప్రారంభంకానుంది. -
పార్టీలో హీరోయిన్‌తో విజయ్ ముచ్చట్లు.. వీడియో తీసిన చార్మీ
Liger Stars Vijay Deverakonda, Ananya Panday At Apoorva Mehta Birthday: బాలీవుడ్ అంతా ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తుంది. ఇప్పటికే మన స్టార్స్ పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నారు. ఇక టాలీవుడ్ అర్జున్‌రెడ్డి విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ చేస్తున్న 'లైగర్' సినిమా కోసం ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది. ఓవైపు షూటింగ్లో బిజీగా ఉంటూనే, మరోవైపు పార్టీ మూడ్‌ని ఎంజాయ్ చేస్తుంది లైగర్ టీం. గురువారం ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పుట్టినరోజు సందర్భంగా ముంబైలో గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో లైగర్ బ్యాచ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. బ్లాక్ అండ్ బ్లాక్‌లో అందరూ దుమ్మురేపారు. మోస్ట్ స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేశారు. పార్టీ మొత్తంలో లైగర్ టీం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రసత్తుం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే..ధర్మ ప్రొడక్షన్స్- పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్ సినిమా ఆగస్ట్25న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) -
రికార్డు స్థాయిలో 'లైగర్' డిజిటల్ రైట్స్.. విజయ్ క్రేజ్ అలాంటిది
విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కతుతున్న పాన్ ఇండియా సినిమా 'లైగర్'. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా గురించి ఓ వార్త ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి భారీ ఆఫర్ దక్కినట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండకు ఉన్న స్టార్‌డమ్‌ని దృష్టిలో ఉంచుకొని మూవీ రిలీజ్‌కు ముందే లైగర్ డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.60కోట్లకు సొంతం చేసుకుందట. ఇదే నిజమైతే విజయ్ కెరీర్లో రికార్డు స్థాయిలో కుదరిన డీల్ ఇదేనని చెప్పొచ్చు. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఇక దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అనన్య పాండే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. -
Liger Movie: రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన 'లైగర్' టీం
Vijay Devarakonda Liger Movie Announces Release Date: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 25న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక ఈ ఏడాది చివర్లో డిసెంబర్31రోజు లైగర్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైక్ టైసన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. #AagLagaDenge #LIGER #LigerOnAug25th2022 https://t.co/o1aztzI9GD — Puri Connects (@PuriConnects) December 16, 2021 -
మహేశ్‌బాబుతో పోటీ పడనున్న విజయ్ దేవరకొండ
Vijay Devarakonda Liger Movie Going To Release On Ugadhi: లాస్ వేగాస్ నుంచి లాస్ ఏంజిల్స్‌కు షిఫ్ట్ అయింది ‘లైగర్’ టీమ్. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లైగర్’. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాస్ ఏంజిల్స్‌లో జరుగుతోంది. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్లపై లాస్ వేగాస్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత తదుపరి చిత్రీకరణ కోసం ‘లైగర్’ యూనిట్ లాస్ ఏంజిల్స్‌కి వెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. కానీ వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న విడుదల చేసే సాధ్యాసాధ్యాలను నిర్మాతలు ఆలోచిస్తున్నారని ఫిల్మ్‌నగర్ తాజా టాక్. మరోవైపు మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారువారి పాట’ చిత్రం ఏప్రిల్ 1న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
లాస్ ఏంజెల్స్‌లో 'లైగర్' టీం సందడి.. ఫోటో వైరల్
Vijay Deverakonda and Ananya Panday shoot for Liger in Los Angeles: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా 'లైగర్'. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. ఇటీవలె లాస్ వెగాస్‌లో షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో షెడ్యూల్‌ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫోటోలను చార్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. లైగర్ టీం..లాస్ ఏంజెల్స్ నుంచి హాయ్ చెబుతుంది అంటూ ఫోటోను పంచుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, చార్మీ, పూరి జగన్నాథ్ ఉన్నారు. ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటి రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) -
ఆకాశ్ మంచి నటుడే.. కానీ అందులో చాలా వీక్: పూరి జగన్నాథ్
‘ప్రేమ కన్నా మోహం చాలా గొప్పది.. మోహం నుంచే ప్రేమ పుడుతుంది.. ప్రేమలో ఉన్నా కూడా వాళ్ళిద్దరూ మోహమే అని అనుకుంటారు.. రొమాంటిక్ సినిమాకు అదే ఫ్రెష్‌గా ఉంటుంది’అన్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్. అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్’.పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటే చేసింది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. . ‘ఇంటెన్స్ లవ్ స్టోరీ సినిమా చూసి చాలా రోజులైంది. మూడేళ్ల తరువాత థియేటర్లో సినిమా చూడటం చాలా బాగుంది. సినిమా చూసిన చాలా మంది ఎమోషనల్ అయ్యారు. థియేటర్ కాకపోతే ఏడ్చేవాళ్లమని చాలా మంది చెప్పారు. ముందే ఎడిటింగ్ రూంలో చూసినప్పుడు నాకు కూడా ఏడుపు వచ్చింది. ఇది ఇడియట్ లాంటి సినిమా అని అందరూ అన్నారు. ఆకాశ్ మంచి నటుడే. కానీ రొమాన్స్‌లో వీక్. ఇంకా బాగా చేస్తాను అంటే ఇంకా బాగా రాస్తాను. ఈ చిత్రాన్ని యంగ్ జనరేషన్ తీస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే అనిల్‌కు ఇచ్చాను. కథను ఎంతో ప్రేమిస్తే గానీ కూడా అలాంటి ఎమోషన్‌ను క్యారీ చేసేలా తీయడం మామూలు విషయం కాదు. అనిల్ బాగా తీశాడు. దర్శకులందరూ వచ్చి ఈ చిత్రాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇదొక మంచి వాతావరణాన్ని క్రియేట్ అయ్యేలా చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ కూడా సినిమా చూస్తే బాగుండేది. మళ్లీ నా మీద షాంపైన్ పోసేవారు. ఆయన ఏలూరులో షూటింగ్లో ఉన్నారు. అందుకే రాలేకపోయారు. నటుడిగా ఆకాశ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ఇది పెద్ద హీరో కథ. కానీ ఆకాశ్ బాగా హోల్డ్ చేశాడు. బయట సినిమాలు చేయనివ్వు.. కొంచెం పేరు వచ్చాక మనం చేద్దామని ఆకాశ్ అన్నాడు. సినిమా విడుదలవుతుందని తెలిసి.. ప్రభాస్ ఫోన్ చేశాడు. డార్లింగ్ మనం ఏం చేద్దాం.. ఎలా ప్రమోట్ చేద్దామని అన్నారు. ఇక విజయ్ కూడా వరంగల్‌లో ఫంక్షన్ పెడదామని అన్నారు. వారిద్దరూ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు’ అని అన్నారు. ‘ఆకాశ్ అద్భుతంగా నటించాడు. ఇది మా అందరికీ ఎంతో ముఖ్యమైన సినిమా. ఇది మాకు చావో రేవో అనే సినిమా ఉండేది. కానీ నిన్న అందరూ సినిమా గురించి మాట్లాడాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంతలా సపోర్ట్ చేసిన మీడియాకు థ్యాంక్స్. సినిమాను ఇంతలా ప్రమోట్ చేసిన ప్రభాస్, విజయ్ దేవరకొండలకు థ్యాంక్స్’ అని అన్నారు నటి, నిర్మాత చార్మి. చంటిగాడు, పండుగాడిలా వాస్కోడిగామా పాత్ర కూడా గుర్తుండిపోవాలని అనుకున్నాను. ఈ సినిమాకు నా వాయిస్ ప్లస్ అవుతుందని అందరూ అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. మీ నాన్న డబ్బింగ్ చెప్పారా? అని అన్నారు. సినిమా చూసిన అందరూ కూడా అదే అన్నారు. మా నాన్నకు ఓ హిట్ సినిమా ఇవ్వాలి. అదే నా లక్ష్యం. వాస్కోడిగామా పాత్రనే సెకండ్ పార్ట్‌గా తీయాలనే కోరికగా ఉంది’అన్నాడు యంగ్ హీరో ఆకాశ్. -
హీరోయిన్గా ఉన్నప్పుడు కంఫ్టర్ ఉండేది: చార్మీ
Charmy Kaur: అతి తక్కువ కాలంలోనే నటిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ చార్మీ. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన చార్మీ ఆ తర్వాత సినిమాలకు గుడ్‌డై చెప్పి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నిర్మించిన రొమాంటిక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. 'హీరోయిన్గా ఉన్న సమయంలో ఎక్కువ కంఫర్ట్ ఉండేది. ఫిటినెస్‌పై మాత్రమే దృష్టి పెడితే సరిపోయేది. కానీ నిర్మాతగా బాధ్యతలు స్వీకరించడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు అందరి కంఫర్ట్ చూసుకోవాల్సి వస్తుంది. అయినా నాకేమీ విసుగు అనిపించడం లేదు. ఇప్పటికీ నటిగా అవకాశాలు వస్తున్నాయి. కానీ నాకు ఇక నటించే ఆలోచన మాత్రం లేదు. అని చెప్పుకొచ్చింది. చదవండి: పూరి జగన్నాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు : డైరెక్టర్ టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత -
మందు గ్లాస్‌తో పూరికి బర్త్‌డే విషెస్ తెలిపిన చార్మీ
Charmi Kaur Birthday Wishes To Director Puri Jagannadh: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా చార్మీ ఆయనకు స్పెషల్ బర్త్‌డే విషెస్‌ను తెలియజేసేంది. 'నాకెంతో ఇష్టమైన వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే. మీరు నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. మీరు గర్వపడేలా ఆ నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకుంటానని ఆశిస్తున్నాను' అంటూ మందు గ్లాసు పట్టుకొని పూరితో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో పూరి జగన్నాథ్ కుర్చీలో కూర్చొని ఉండగా, చార్మీ మందు గ్లాసుతో దర్శనమిచ్చింది. హీరోయిన్గా గుడ్‌బై చెప్పిన చార్మీ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విజయ్ ఈ చిత్రంలో బాక్సర్‌గా అలరించబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు,హిందీ, తమిళం, కన్నడలో ఒకేసారి సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. Happy birthday to my most favourite human 🤩 the trust and belief u have over me , I hope I live upto it always n keep making u feel proud 🤗#purijagannadh #hbdpurijagannadh 💕@puriconnects pic.twitter.com/7Aq9U4KA2a — Charmme Kaur (@Charmmeofficial) September 27, 2021 -
హాట్ వ్యూ చూస్తున్న చార్మీ..చెట్టు వెనుక దాక్కున్న దియా
► లైగర్ షూటింగ్లో చార్మీ కౌర్..హాట్ వ్యూ అంటూ పోస్ట్ ►యూట్యూబ్‌లో దూసుకుపోతున్న యాంకర్ హరితేజ ► గార్జియస్ లుక్‌లో మలైకా అరోరా ► ఇన్‌స్టా రీల్స్ చేసిన సోనాలీ బింద్రె ► చెట్టు వెనుక దాక్కున్న దియా మీర్జా ► వెనీలా డ్రెస్‌ను చుట్టేసుకున్న జాన్వీ కపూర్ ► ఫ్లోరల్ సారీలో యాంకర్ వర్షిణి View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) -
చార్మీ దాదా ఎవరు?
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం నటి చార్మీ కౌర్‌ను ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ విచారణ 8 గంటలపాటు సాగింది. కెల్విన్‌తో చార్మీ, పూరీ జగన్నాథ్ తదితరులకు సంబంధం ఉన్న అంశాల పైనా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఉదయం 10.30 గంటలకు తన ఆడిటర్ సతీష్, న్యాయవాది, సహాయకుడితో కలిసి చార్మీ ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలోని బృందం సాయంత్రం 6.30 గంటల వరకు చార్మీని ప్రశ్నించింది. అధికారులు కోరిన మేరకు తనతోపాటు తన సంస్థకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల వివరాలను చార్మీ ఈడీ బృందానికి అందించింది. తన సినిమాలకు ఈవెంట్ మేనేజర్‌గా.. ఎక్సైజ్ అధికారులు 2017లో నమోదు చేసిన డ్రగ్ కేసు ఆధారంగానే ఈడీ కేసు దర్యాప్తు సాగుతోంది. అప్పట్లో ఎక్సైజ్‌కు చెందిన సిట్ అధికారులూ చార్మీని ప్రశ్నించారు. నాటి వివరాలతోపాటు రెండు నెలల క్రితం ఈడీ విచారణలో కెల్విన్ చెప్పిన అంశాల ఆధారంగా చార్మీ విచారణ సాగింది. కెల్విన్ కాల్‌డేటాతోపాటు వాట్సాప్‌లో చార్మీ దాదా అనే పేరుతో కాల్స్, చాటింగ్స్ ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించిన ఆధారాలను సేకరించిన అధికారులు చార్మీ దాదా ఎవరంటూ ఆమెను ప్రశ్నించారు. 2015–17 మధ్య కెల్విన్ ఖాతాలోకి చార్మీ ఓ దఫా రూ.2 లక్షలు, తర్వాత మరికొన్నిసార్లు మరికొంత మొత్తాన్ని బదిలీ చేశారు. ఈ ఆర్థిక లావాదేవీలకు కారణాలేంటని అధికారులు ప్రశ్నించారు. కెల్విన్ చార్మీ దాదా పేరుతో సేవ్ చేసుకున్న నంబర్ తనదేనని అంగీకరించిన చార్మీ.. తన సినిమాలకు అతడు ఈవెంట్ మేనేజర్‌గా పని చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే సంప్రదింపులతోపాటు ఆర్థిక లావాదేవీలు జరిగాయని వివరించారు. ఎక్కడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, మనీల్యాండరింగ్ జరగలేదని వివరణ ఇచ్చారు. ఈడీ అడిగిన కొన్ని అంశాలకు ఆమె తరఫున ఆడిటర్ సమాధానం ఇచ్చారని తెలిసింది. పూరీ చెప్పిన సమాచారం పైనా... ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు మంగళవారం దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ప్రశ్నించారు. ఆయన చెప్పిన అంశాలకు సంబంధించి కూడా చార్మీని ఈడీ బృందం ప్రశ్నించింది. ప్రతి ప్రశ్నకూ కొన్ని అనుబంధ ప్రశ్నలు జోడిస్తూ చార్మీ విచారణ సాగింది. ఇప్పటికే చార్మీ బ్యాంకు స్టేట్మెంట్లు, ఐటీ రిటర్న్స్, బ్యాలెన్స్‌షీట్లను సేకరించిన ఈడీ అధికారులు చార్మీ చెప్పిన విషయాలతో వాటిని సరిచూడనున్నారు. అవసరమైతే ఆమెను మరోసారి విచారించే అవకాశం ఉంది. అడిగిన వివరాలన్నీ ఇచ్చా: మీడియాతో చార్మీ ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చా. బ్యాంకు ఖాతాల లావాదేవీలు, తదితరాలకు సంబంధించిన రికార్డులనూ సమర్పించా. మరోసారి విచారణకు రావాలని కోరితే తప్పకుండా వస్తా. విచారణకు పూర్తిగా సహకరిస్తా. రకుల్ విజ్ఞప్తి మేరకు.. కేసు దర్యాప్తులో ఈడీ అధికారులు సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్‌కు సమన్లు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఆమె ఈడీ కార్యాలయంలో విచారణకు రావాల్సి ఉంది. అనివార్య కారణాలతో తాను ఆ రోజు హాజరుకాలేనని, తేదీ మార్చాలని రకుల్ గురువారం ఈడీ అధికారులకు లేఖ రాశారు. దీంతో నేడు (శుక్రవారం) విచారణకు రావాల్సిందిగా రకుల్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. -
ఈడీ విచారణకు హాజరైన సినీ నటి ఛార్మి
-
డ్రగ్ పెడ్లర్ కెల్విన్‌తో చార్మీ వాట్సాప్ చాటింగ్ ?
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి చార్మీ ఈడీ విచారణకు హాజరైంది. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్‌తో చార్మీ వాట్సాప్ చాటింగ్ చేసినట్లు సమాచారం. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు చార్మీని ప్రశ్నించనున్నారు. 2015-17వరకు జరిగిన బ్యాంక్ లావాదేవీల వివారాలను వెంట తేవాలని ఈడీ నోటీసులో పేర్కొంది. చార్మీ ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ ఆరా తీయనుంది. ఇది వరకే పూరి జగన్నాథ్ తన బ్యాంకు ఖాతాల వివరాలను ఈడీ అధికారులు సమర్పించారు. హీరోయిన్గా గుడ్‌బై చెప్పిన చార్మీ ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి కో ప్రొడ్యూసర్ గా సినిమాలు తెరకెక్కిస్తుంది. 2017లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై చార్మీ ఎక్సైజ్ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కెల్విన్ ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈడీ అధికారులకు అప్రూవర్‌గా మారిపోయాడు. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు నటి ఛార్మీ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు పంపినట్టుగా సమాచారం. చదవండి : Tollywood Drugs Case: ఆమూడు ఖాతాలపై ఈడీ ఆరా Tollywood Drugs Case: లొంగిపోయిన కెల్విన్.. కీలక సమాచారం సేకరించిన ఈడీ -
టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం.. మనీల్యాండరింగ్ కేసు నమోదు
Tollywood Drug Case: టాలీవుడ్ ప్రముఖులతో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసు కథ మరో మలుపు తిరిగింది. నాలుగేళ్ల క్రితం నాటి ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అకస్మాత్తుగా దూకుడు పెంచింది. ఎక్సైజ్ విభాగానికి చెందిన సిట్ దాఖలు చేసిన చార్జ్షీట్ల ఆధారంగా మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసింది. వీటికి సంబంధించి విచారణకు హాజరుకావాలని 10 మంది టాలీవుడ్ ప్రముఖులు సహా 12 మందికి బుధవారం నోటీసులు పంపింది. వీరిలో పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్ కూడా ఉన్నారు. వీరిని ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు విచారించనున్నారు. మాదకద్రవ్యాల క్రయవిక్రయాలకు సంబంధించి మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ భావిస్తోంది. ఈ కోణంలోనే వీరిని ప్రశ్నించనుంది. నేరానికి సంబంధించి ఆధారాలు లభించే వరకు అందరినీ సాక్షులుగానే పరిగణించనుంది. 2017లో విచారణ.. నమూనాల సేకరణ హైదరాబాద్‌కు చెందిన అనేక మంది ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన కెల్విన్‌తోపాటు చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన సోదరులు అబ్దుల్ వహీద్, ఖుద్దూస్‌లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 2017 జూలై 2న అరెస్టు చేశారు. వీళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతోపాటు విద్యార్థులు, సిటీ ప్రముఖులకు డ్రగ్స్ విక్రయించినట్లు అనుమానించారు. దీంతో ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు విభాగం (సిట్) ఏర్పాటై 10 మంది అనేక మందికి నోటీసులిచ్చింది. అదే ఏడాది జూలై 19 నుంచి కొన్ని రోజులు వీరిని విచారించింది. మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్... 11 కేసుల దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిలో ఎక్కడా సినీ రంగానికి చెందిన వారిని నిందితులుగా చేర్చలేదు. 2017 జూలైలోనే టాలీవుడ్ ప్రముఖులతోసహా మొత్తం 62 మంది అనుమానితుల నుంచి జుట్టు, గోళ్ల నమునాలను సేకరించింది. మాదకద్రవ్యాలు తీసుకునే వారికి చాన్నాళ్ల పాటు వీటిలో ఆనవాళ్లు ఉంటాయని ఇలా చేసింది. అయితే ఆ పరీక్షల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయనే అంశాన్ని ఇప్పటికీ బయటపెట్టలేదు. మాదకద్రవ్యాలను ముంబై నుంచి హైదరాబాద్?కు రవాణా చేసి.. ఇక్కడ విక్రయించిన దక్షిణాఫ్రికాకు చెందిన రాఫెల్ అలెక్స్ విక్టర్‌పైనా చార్జిషీట్ దాఖలైంది. ఇతడిని 2017లో అరెస్టు చేసి విచారించినప్పుడు కొందరు టాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ చార్జిషీట్ల ఆధారంగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఆధారాల సేకరణ కోసం అప్పట్లో సిట్ విచారణకు హాజరైన సినీ ప్రముఖులను విచారించాలని తాజాగా నిర్ణయించింది. ఎప్పుడు ఎవరిని విచారిస్తారు? ఆగస్టు 31: పూరీ జగన్నాథ్ సెప్టెంబర్ 2: చార్మీ కౌర్ సెప్టెంబర్ 6: రకుల్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 8: రాణా దగ్గుబాటి సెప్టెంబర్ 9: రవితేజతోపాటు డ్రైవర్ శ్రీనివాస్ సెప్టెంబర్ 13: నవ్‌దీప్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్ సెప్టెంబర్ 15: ముమైత్ ఖాన్ సెప్టెంబర్ 17: తనీష్ సెప్టెంబర్ 20: నందు సెప్టెంబర్ 22: తరుణ్ -
హల్చల్ : వెనక్కి వెళ్లనంటోన్న అనసూయ...తప్పు కాదంటోన్న ప్రియమణి
♦ అది ఎప్పటికీ తప్పు కాదంటున్న ప్రియమణి ♦ వెనక్కి వెళ్లనంటున్న అనసూయ ♦ క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న జాస్మీన్ ♦ బ్లూపర్ షేర్ చేసిన భాను ♦ తన అందానికే సీక్రెట్ ఇదేనంటోన్న కత్రినా ♦ ఆ సమస్య లేకపోతే రోజూ అవే తింటానంటున్న కల్పిక ♦ యోగాతో మోటివేషన్ అంటోన్న ఙ్ఞానేశ్వరి View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kanika Mann 🦋 (@officialkanikamann) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Kalpika Ganesh (@iamkalpika) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) -
ఛార్మీకి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ
-
ఛార్మీకి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ
15ఏళ్లకే నీ తోడు కావాలి సినిమాతో హీరోయిన్గా ఎంట్రి ఇచ్చిన ఛార్మీ తెలుగునాట స్టార్డంను సొంతం చేసుకుంది. అగ్రహీరోలతో నటిస్తూనే నటనా ప్రాధాన్యమున్న సినిమాలను చేసి సత్తా చాటింది. ప్రస్తుతం హీరోయిన్గా వెండితెరకు దూరమైనా డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరీ కనెక్ట్స్ పేరుతో నిర్మాతగా మారింది. సోమవారం ఛార్మీ34వ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సహా అభిమానులు ఆమెకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. ఇక హీరో విజయ్ దేవరకొండ ఓ స్పెషల్ గిఫ్ట్‌తో ఛార్మీని సర్ప్రైజ్ చేశాడు. దీంతో ఆనందంలో మునిగిపోయిన ఛార్మీ ఈ గిఫ్ట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ మురిసిపోయింది. దీంతో ఆ గిఫ్ట్ ఏమై ఉంటుందా అని ఫ్యాన్స్‌లో క్వశ్చన్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పూరీ జగన్నాద్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్లు సంయుక్తంగా పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక మొదటిసారి విజయ్ సరసన అనన్య పాండే కలిసి నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చదవండి : విజయ్‌పై ఛార్మి ఆసక్తికర వ్యాఖ్యలు, పోస్ట్ వైరల్ అందాల ఛార్మి పెళ్లి చేసుకోబోతోందా? -
అందాల చార్మి పెళ్లి చేసుకోబోతోందా?
సాక్షి,హైదరాబాద్: అందాల ఛార్మి (33)ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతోందట. ఇపుడు ఈ వార్తే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.14 ఏళ్ల వయసులోనే ‘నీతోడు కావాలి’ అంటూ టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ అమ్మానాన్న చెప్పిన వరుడినే త్వరలోనే పెళ్లాడనుందట. అయితే పెళ్లిపై తనకు నమ్మకం లేదనీ, తనకెలాంటి తోడు అవసరం లేదని గతంలోనే కుండబద్దలు కొట్టిన ఈ గ్లామర్ గాళ్ ఇపుడిక మనువుపై మనసు పడినట్టు సమాచారం. తమ సమీప బంధువుతో కలిసి ఏడు అడగులు నడిచేందుకు సిద్ధమవుతోందటఛార్మి. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు వివాహం నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఛార్మి పెద్దవాళ్ల నిర్ణయం తరువాత అతణ్ని త్వరగా పెళ్ళి చేసుకోమని చెప్పిందట లావణ్య. మూడు పదుల వయసు దాటినా ఇప్పటిదాకా పెళ్లి ఊసెత్తని ఛార్మి , పూరితో డేటింగ్లో ఉందన్న పుకార్లు చాలా కాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి పూరి కనెక్ట్స్ అనే నిర్మాణం సంస్థను మెుదలుపెట్టారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనక్ట్స్ బ్యానర్స్ పై పలు సినిమాలు నిర్మిస్తున్నారు. పూరీకి సంబంధించిన వ్యవహారాలల్లో పూర్తిగా తలమునకలైన ఈ అమ్మడు విజయవంతంగా దూసుకు పోతోంది. అలాగే ఇస్మార్ట్ శంకర్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో వీరిలో జోష్ పెరిగిన సగతి తెలిసిందే. కాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర దేవిశ్రీ ప్రసాద్‌తో డేటింగ్లో ఉందని త్వరలోనే పెళ్లి అంటూ గతంలో పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఎవరు, ఏంటి వివరాలను ప్రస్తావించకుండానే తాను ప్రేమలో విఫలమయ్యానంటూ చార్మి ఆ మధ్య వెల్లడించింది. అంతేకాదు తనకు, పెళ్లికీ పడదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఛార్మి మరి తాజా గాసిప్స్‌పై ఎలా స్పందిస్తుందో చూడాలి. -
బాలీవుడ్ స్టార్స్‌తో పార్టీ మూడ్‌లో లైగర్: వైరల్ పిక్స్
సాక్షి, ముంబై: తన అప్‌కమింగ్ మూవీ ‘లైగర్’ తో షూటింగ్లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ పార్టీ మూడ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం ముంబైలో మకాం వేసిన లైగర్ టీం, అర్జున్‌రెడ్డి బాలీవుడ్ స్టార్స్‌తో కలిసి లీజర్ టైంలో పార్టీ చేసుకుంటోంది. షూటింగ్ విరామంలో రౌడీతోపాటు, దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, సారా అలీ ఖాన్‌తో సందడి చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్నఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. విజయ్ బాక్సర్‌గా దర్శనమివ్వనున్న లైగర్ సినిమాను హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, చార్మీ, పూరీలతో కలిసి నిర్మిస్తున్నారు. అలాగే ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ తెరకెక్కించే లైగర్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. లైగర్ మూవీ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఫైల్ ఫోటో) -
ట్రెండింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ మూవీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం రాఖీ.. ఛార్మీ కౌర్, గోవా బ్యూటీ ఇలియానా ఫీమెల్ లీడ్‌లో నటించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సీనియర్ నటి సుహాసిని పవర్ఫుల్ పోలీస్ అధికారిణి పాత్రలో కనిపించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌కు కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో రాఖీ ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. తను తప్ప మరెవరూ నటించలేరన్నంతగా డైలాగులతో ప్రతి ఒక్కరిని ఎమోషనల్‌గా టచ్ చేశారు. 2006లో ప్రేక్షకుల ముదుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నేటితో రాఖీకి(డిసెంబర్22) 14 ఏళ్లు పూర్తియ్యాయి. ఈ సందర్భంగా ట్విటర్లో #14YearsForRakhi అనే హ్యష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సినిమాలో ఎన్టీఆర్ నటన వేరే లేవల్లో ఉందంటూ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. చదవండి: బుల్లితెరపై మరోసారి హోస్ట్‌గా ఎన్టీఆర్ సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో తన చెల్లెలికి జరిగినటువంటి అన్యాయాన్ని చూసి చలించిపోయిన హీరో తీవ్ర కుంగుబాటుకు గురవుతాడు. తన చెల్లె కేసుకు వ్యతిరేకంగా వాదించిన న్యాయవాదిని, దొగ సాక్ష్యం ఇచ్చిన డాక్టరును, పోలీసులను కూడా పెట్రోల్ పోసి తగులబెడతాడు. ఇలాంటి పరిస్థితి మరే అమ్మాయికి రాకూడదని కంకణం కట్టుకుంటాడు. అప్పటి నుంచి సమాజంలో ఏ ఆడపిల్లకు ఎక్కడ అన్యాయం జరిగినా అంతు చూసే పనిలో పడతాడు. అక్కడ నుంచి మాయమయిపోయిన రాఖీ ఎక్కడ ఏ ఆడపిల్లను ఎవరు వేదించినా, బాధించినా వాళ్ళని పెట్రోల్ పోసి తగులబెడుతుంటాడు. ప్రెగ్నెంట్ అయిన తన చెల్లెను డబ్బుపిచ్చితో కాల్చి చంపినా కోర్టులో కేసుకొట్టేయడం చూసిన రాఖీ తన చెల్లి అత్తింటి వారందరినీ కారుతో సహా పెట్రోల్ పోసి తగులబెడతాడు. సినిమా క్లైమాక్స్‌లో రాఖీ కోర్టులో మాట్లాడే సీన్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. -
వారే నిజమైన అందగత్తెలు: పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పోడ్ కాస్ట్ ఆడియోలతో ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ సంచలనం సృష్టిస్తున్నారు. సమాజంలోని ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ తనదైన స్టైల్లో వివరణ ఇస్తున్నారు. అందుకే ఆయన మాట్లాడుతుంటే ఆవేశంతో కూడిన వేదాంతం వినిపిస్తూ ఉంటుంది. టాపిక్ ఏదైనా క్లియర్ కట్‌గా లాగ్ చేయకుండా మాట్లాడతాడు. పూరి జగన్నాథ్ చెప్పిన ప్రతి విషయాన్ని గమనిస్తే.. సమాజం, అందులోని వ్యక్తులు, వారి స్వభావాలను చదివేశాడన్న ఫీలింగ్ కలుగుతోంది. ఆయన ఏం మాట్లాడుతున్నా అదేదో మన జీవితానికి ఉపయోగపడే అంశంలా కూర్చోని ఆసక్తిగా వినాలనిపిస్తుంది. ఈ కారణాల వల్లే పూరి ఆడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చదవండి: కళ్లు చెమ్మగిల్లాయి: పూరీ జగన్నాథ్ ఇప్పటి వరకు పోడ్ కాస్ట్ ఆడియోలతో చాలా విషయాలపై ప్రస్తావించిన పూరి తాజాగా టామ్బాయ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టామ్ బాయ్ అంటే.. అమ్మాయి అయినప్పటికీ అబ్బాయిలా బిహేవ్ చేయడం అని చెప్తూ ప్రారంభించాడు. అన్నింట్లో అబ్బాయిలతో పోటీపడుతూ, తనకు నచ్చినట్టుగా వ్యవహరించేవారని తెలిపారు. ‘ఎదీ ఉన్న మొహం మీద చెబుతూ, ప్రాక్టికల్‌గా ఉంటారు. ఐ లవ్ టామ్‌బాయ్స్. మగవాళ్లలాగా ఆలోచిస్తూ, వాళ్ల లాగే పనిచేస్తారు. ఎక్కడికైనా ధైర్యంగా వెళ్తారు. రెబల్స్లాగా ఆలోచిస్తారు. టామ్‌బాయ్స్ వల్లే ఈ ప్రపంచం మారుతుంది. హ్యట్సాఫ్ టు ద వుమెన్ ఇన్ మిలిటరీ. స్పోర్ట్స్, పోలీస్, డ్యాన్స్, వర్కింగ్ వుమెన్.. కూతురు మగ రాయుడిలా తిరుగుతుంటే మీకు భయం వేయొచ్చు. ఇది ఇలా ఉంటే దీన్ని ఎవరు చేసుకుంటారని కంగారు పడొచ్చు. అలాంటి కూతురు ఉన్నందుకు సంతోషించండి. కాలర్ పట్టుకొని మగాన్ని కొట్టే ఆడపిల్ల మనకు కావాలి. అమ్మోరు తల్లిలా తాటా తీయాలి. కాళికా దేవిలా కన్నెర్ర చేయాలి. నూర్ ఇనాయత్ ఖాన్, ఝాన్సీ లక్ష్మీ భాయ్, సరస్వతి రాజామణి, పులన్ దేవి, కిరణ్ బేడీ, కరణం మల్లేశ్వరి.. ఇలాంటి వాళ్లే మనకు కావాలి. కళ్లల్లో కసి, పట్టుదల ఉన్నవాళ్లే నిజమైన అందగత్తెలు. రియల్ వుమెన్ ఆల్వేస్ ఏ టామ్‌బాయ్’ అంటూ ముగించారు. Thank you @purijagan and @Charmmeofficial for nominating me....I hereby nominate @realradikaa @DrManjula_A and soul mate @madhoo69 powerful #tomboy https://t.co/zQmzAaOCdD — Ramya Krishnan (@meramyakrishnan) November 25, 2020 కాగా ఈ వీడియో అనేక మంది అమ్మాయిలు, మహిళలను హత్తుకుంటోంది. తమలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయని, ఎంతో మందికి ఈ వీడియో ఆదర్శంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అదే విధంగా ఈ టామ్‌బాయ్ వీడియో పవర్‌ఫుల్‌గా ఉందంటూ నటి ఛార్మి కౌర్ ప్రశంసలు కురిపించారు. అంతేగాక తను కూడా ఓ టామ్బాయ్నని చెబతూ తన జీవితంలో అలాంటి వ్యక్తులు మరో ముగ్గురు ఉన్నారని తెలిపారు. త్రిష, లక్ష్మీ మంచు, రమ్యకృష్ణలను ట్యాగ్ చేశారు. మరో ముగ్గురు స్వతంత్ర్య, ధైర్య మహిళలను నామినేట్ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన రమ్యకృష్ణ.. ఛార్మి, పూరి జగన్నాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే నటి రాధికా, డాక్టర్ మంజులా, నటి మధును రమ్య కృష్ణ నామినేట్ చేశారు. -
'ఫైటర్'ను బరిలోకి దింపిన పూరి జగన్నాథ్
సన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా దర్శకుడు పూరి జగన్నాథ్ 'ఫైటర్' చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం విజయ్ థాయ్‌లాండ్‌లో మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ సోమవారం ముంబైలో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో విజయ్, పూరి జగన్నాథ్, చార్మి పాల్గొన్నారు. పూరి కనెక్ట్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మిలతో కలిసి కరణ్ జొహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, విజయ్ దేవరకొండ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. విజయ్ లేటెస్ట్ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫిబ్రవరి 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే. చదవండి: ఫైటర్‌కు జోడి? To new beginnings 💖 Shoot begins in mumbai from today 💪🏻@TheDeverakonda @purijagan @karanjohar @PuriConnects @DharmaMovies #VD10 #PJ37 #PCfilm #PanIndia 😍 pic.twitter.com/g8MOAk9EQY — Charmme Kaur (@Charmmeofficial) January 20, 2020 -
సుకుమార్‌ను రౌడీ అనేసింది!
వరుస ప్లాఫులతో సతమతమవుతున్న..డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో కలిసి ఇస్మార్ట్ శంకర్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఫుల్ స్వింగ్‌లో షూటింగ్‌ను పూర్తి చేస్తున్న పూరి.. ఈ మూవీ సక్సెస్‌పై నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. చిత్రయూనిట్ ప్రస్తుతం దిమాక్ ఖరాబ్ సాంగ్‌ను షూట్ చేస్తోంది. ఈ పాట చిత్రీకరణ సమయంలో.. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ లొకేషన్లో ప్రత్యక్షమయ్యారు. చిత్రయూనిట్‌తో సుక్కు సరదాగా ముచ్చటించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలను చార్మీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘రౌడీ గారు.. సుకుమార్.. లొకేషన్‌కు రావడంతో ఎంతో సరదాగా ఉంది. థ్యాంక్స్ ఫర్ ఆల్ కాంప్లీమెంట్స్’ అంటూ చార్మీ ట్వీట్ చేసింది. Was so much fun having rowdy garu @aryasukku on sets of #ismartshankar #dimaakkharab song location .. thanks for all the compliments 🤗🤗 @ramsayz @purijagan @puriconnects #PCfilm #happyugadi pic.twitter.com/S1f6BMhjZo — Charmme Kaur (@Charmmeofficial) April 6, 2019 -
రామ్ కనెక్ట్స్పూరి
పూరి జగన్నాథ్ సినిమాలో హీరో ఎలా ఉంటాడు? చూపుల్లో నిర్లక్ష్యం, బాడీ లాంగ్వేజ్‌లో లెక్కలేనితనం, ఏదైనా చేయగలననే తెగువ.. ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఈ క్వాలిటీస్‌ని స్క్రీ¯Œ పై అలవోకగా చూపించగల సత్తా ఉన్న హీరోల్లో రామ్ ఒకరు. యస్.. పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్లో సినిమా సెట్ అయ్యింది. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్థ పూరి టూరింగ్ టాకీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ – చార్మీ కౌర్) నిర్మాతలు. ఈ సినిమా కోసం రామ్ సరికొత్త లుక్‌లోకి మారారు. పూరీలో ఉన్న హై క్వాలిటీ ఏంటంటే ప్రీ ప్రొడక్ష¯Œ వర్క్‌కి ఎక్కువ, షూటింగ్‌కి తక్కువ టైమ్ తీసుకుంటారు. రామ్ ఎనర్జీ లెవల్స్ మామూలుగా ఉండవు. అందుకే జనవరిలో షూటింగ్ ఆరంభించి నాలుగే నెలల్లో పూర్తి చేసి, మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
పడ్డానండి.. మరి!
అవును.. చలాకీ అమ్మాయి చార్మీ కౌర్ పడ్డారండి! అవునా.. ఎవరితో ప్రేమలో పడ్డారు? అని ఆరా తీయకండి. అలా ఆలోచిస్తే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. పడింది ప్రేమలో కాదు, కుర్చీలో నుంచి కిందకు జారి పడ్డారు. పడగానే కాలిలో ఏదో కలుక్కుమనిపించిందట. పడినప్పుడు కామనే కదా అని సరిపెట్టుకున్నారు. ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు. మర్నాడు నిద్ర లేవగానే ఈ బ్యూటీకి చుక్కలు కనిపించాయి. కాలు వాచింది. దాంతో పాటు నొప్పి కూడా. సరిగ్గా నడవలేని పరిస్థితిలో డాక్టర్ దగ్గరకు వెళితే మోకాలి నుంచి కింద వరకూ పెద్ద కట్టు కట్టారు. ఆ తర్వాత చార్మి.. ‘థాంక్స్ అమైరా దస్తర్.. ఫర్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్. యు రియల్లీ బ్రోక్ ఏ లెగ్’ అంటూ గాయమైన కాలి ఫొటోలను ట్వీట్ చేశారు. ఇది చదివిన చార్మి అభిమానులు ‘అసలు కాలికి ఏమైంది?’, ‘అమైరా దస్తర్ (‘అనేకుడు’ హీరోయిన్) ఏం చేసింది?’ అని కంగారుపడ్డారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలని చార్మీకి ‘సాక్షి’ ఫోన్ చేస్తే, ‘హలో’ అని స్వీట్‌గా పలకరించారామె. ‘కాలికి గాయమైందని ట్వీట్ చేశారు. చిన్న గాయమే అనుకుంటున్నాం. ఎలా ఉన్నారు?’ అని ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. ‘‘ఐయామ్ ఫైన్ అండి. శుక్రవారం రాత్రి కింద పడ్డాను. ఐస్ పెట్టి, మూవ్ రాశాను. హ్యాపీగా పడుకున్నాను. మార్నింగ్ చూస్తే అరికాలి నుంచి మోకాలి వరకూ వాచింది. డాక్టర్ వద్దకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాను. అసలు నడవలేకపోతున్నాను. కానీ, ఇంపార్టెంట్ వర్క్ ఉంది. బయటకు రాక తప్పలేదు’’ అని చార్మి అన్నారు. ఇంతకీ మీ ఈ పరిస్థితికి అమైరానే కారణమా? ఒకవేళ అదే నిజమైతే పడేసినవాళ్లకు ఎవరైనా థ్యాంక్స్ చెబుతారా? అని చార్మీని అడిగితే... ‘‘అమైరా నాకు మంచి ఫ్రెండ్. ఆమె ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేస్తోంది. మనది హైదరాబాద్, తనది ముంబై. సరదాగా సిటీ చూపిద్దామని బయటకు తీసుకువెళ్లాను. సిటీ అంతా తిరిగాక,తన రూమ్‌కి వెళ్లాను. కుర్చీలో కుర్చోగానే స్లిప్ అయింది. నేను వెనక్కి పడుతుంటే అమైరా నా చెయి పట్టుకుని ముందుకు లాగింది. దాంతో ఇద్దరం కలసి పడ్డాం. శనివారం ఉదయమే అమైరా ముంబయ్ వెళ్లింది. అందుకే, వెళ్తూ వెళ్తూ నాకు మంచి గిఫ్ట్ ఇచ్చావ్! అని సరదాగా ట్వీట్ చేశా’’ అని చెప్పారు. మరో వారం రోజుల్లో అమైరా హైదరాబాద్ వస్తారట. ఈలోపు గాయం నయమైతే సరి. లేదంటే అమైరా పని చెప్తానంటున్నారు చార్మి. ‘మీరు తనను కింద పడేస్తారా.. ఏంటి?’ అనడిగితే.. ‘‘ఏదో సరదాకి అన్నాను కానీ, అమైరాని ఏమీ చేయనండి. తనకేమైనా అయితే షూటింగ్ డిస్ట్రబ్ అవుతుంది. నిర్మాతపై భారం పడుతుంది. అది నాకిష్టం లేదు’’ అని తనలో మంచితనాన్ని చార్మి చాటుకున్నారు. ఇన్ని చెప్పారు కదా... ఏదో కొత్త సినిమా కోసం ఫిజిక్‌ని మార్చుకుంటున్నారట.. ఆ సినిమా డీటైల్స్ చెప్పేస్తే మీ ఫ్యాన్స్ ఆనందిస్తారు కదా? అనడిగితే... ఇప్పుడు కాదు. త్వరలోనే ఆ తీపి కబురు చెప్తా అంటూ స్వీట్‌గా దాటేసారు చార్మి. -
అతడే నా వరుడు!
ఇంటర్వ్యూ చార్మి అంటే చాలామందికి ఇష్టం. కానీ చార్మికి ఏమంటే ఇష్టం? ఏం తినడం ఇష్టం? ఏం ధరించడం ఇష్టం?ఏయే ప్రదేశాలు తిరగడం ఇష్టం? ఏమేం చేయడమంటే ఇష్టం? అడిగితే ఆపకుండా చెబుతుంది. అందంగా నవ్వుతూ ఇష్టాలన్నీ తెలుపుతుంది. ఆ నవ్వే... కుర్రాళ్ల గుండెల్లో కోటి వీణలు మోగిస్తుంది. చార్మింగ్ బ్యూటీ చార్మి ఇష్టాయిష్టాలు... మీకోసం! పుట్టినరోజు: మే 17 ముద్దుపేరు: చార్మ్స్ నచ్చే రంగులు: బ్లూ, వైట్, రెడ్ నచ్చే దుస్తులు: జీన్స్, టీషర్ట్స్, చీరలు నచ్చే ఫుడ్: హైదరాబాదీ బిర్యానీ నచ్చే డ్రింక్: వైట్ గ్రేప్ జ్యూస్ నచ్చే ప్రదేశాలు: బీచ్లుండే ప్రదేశం ఏదైనా ఇష్టమే. నచ్చే క్రీడ: క్రికెట్ నచ్చిన సినిమా: తారే జమీన్ పర్ నచ్చే హీరోలు: షారుఖ్, అమితాబ్ నచ్చే హీరోయిన్లు: జూహీ చావ్లా, డింపుల్ కపాడియా, రమ్యకృష్ణ హాబీలు: పుస్తకాలు విపరీతంగా చదువుతాను. శివ్ ఖేరా రాసిన మోటి వేషనల్ బుక్స్ అంటే మరీ ఇష్టం. నేను స్విమ్మింగ్ చాంపియన్ని కాబట్టి బాగా స్విమ్ చేస్తుంటాను. డ్యాన్స్ చేయడం, ఫ్రెండ్స్‌తో చాటింగ్... మూడ్‌ని బట్టి ఇలా ఏదో ఒకటి చేస్తుంటా. బలం: ఆత్మవిశ్వాసం, పాజిటివ్ థింకింగ్. బలహీనత: చాక్లెట్స్. మిగిలినవాటి విషయంలో ఎంత కంట్రోల్ చేసినా, చాక్లెట్స్ విషయంలో మాత్రం నా వల్లకాదు. మార్చుకోవాలనుకునేది: ఫిజికల్‌గా అయితే నన్ను నేను మొత్తం మార్చేసు కోవాలనిపిస్తుంది. నాలో ఏదీ నాకు నచ్చదు. మానసికంగా అయితే అంద రినీ నమ్మేసే బలహీనతను మార్చాలి. దైవభక్తి: చాలా ఉంది. దేవుడు ఎవరైనా దేవుడే అనుకుంటాను. అందరికీ ప్రార్థన చేస్తాను. ఆంజనేయ స్వామి అంటే మాత్రం కాస్త ఎక్కువ ఇష్టం. ఎదుటివారిలో నచ్చేది: అమాయకత్వం, నిజాయతీ, ప్రకృతిని ప్రేమించడం ఇతరుల్లో నచ్చనిది: అపరిశుభ్రత, క్రూరత్వం ఫిట్నెస్ సీక్రెట్స్: హెల్దీ డైట్, యోగా, ఏరోబిక్స్ రోల్ మోడల్: మా నాన్న. నావరకూ నాకు ఈ ప్రపంచంలో అతి తెలివైన వ్యక్తి ఆయనే అనిపిస్తుంది. ప్రేమంటే: బలమైన స్నేహం స్నేహమంటే: కష్టనష్టాల్లో సైతం తోడు వీడక నిలబడే బంధం పెళ్లెప్పుడు: నేను చేసుకోవాలను కున్నప్పుడు. నాకో తోడు అవసరమని నేను ఫీలైనప్పుడు. నచ్చే వరుడు: మనసుకి నచ్చేవాడు, దేవుడు మనకి రాసిపెట్టిన వాడు. నా కో-స్టార్ కావచ్చు, డెరైక్టర్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు... అసలు ఇండస్ట్రీకి సంబంధం లేనివాడూ కావచ్చు. నాకు తగినవాడు, నా మనసు దోచినవాడే నా వరుడు. ఇంకా తీరని కోరిక: ఒక్క సినిమాలో పది రకాల పాత్రలు చేయాలని ఉంది. కమల్ హాసన్ ‘దశావతారం’ చేశారు. ‘నట్టీ ప్రొఫెసర్’ చిత్రంలో ఎడ్డీ మర్ఫీ ఏడు రకాల రోల్స్ చేశారు. ఏ నిర్మాత అయినా నాకు అలాంటి అవకాశం ఇస్తే ఫ్రీగా నటిస్తా. ఎవ్వరూ ముందుకు రాక పోతే ఎప్పుడో నేనే తీసినా తీసేస్తాను. వెంటాడే కల: కల అంటే నిద్రలో వచ్చే కల కాదు గానీ... నాకయితే ఓ విచిత్రమైన కల ఉంది. అదేంటంటే నేను మూనీవుడ్లో రారాణిని కావాలని. ఇదెక్కడుందా అనుకుంటు న్నారా! చంద్రమండలంలో. మనిషి చంద్రుడి మీద నివాసం ఏర్పరచు కోడానికి ట్రై చేస్తున్నాడు కదా! అది సక్సెస్ అవ్వాలి. చంద్రుడి మీదికి చాలామంది వెళ్లాలి. అక్కడ కూడా సినిమాలు తీయాలి. వాటిలో నేను నటించాలి. మళ్లీ జన్మంటూ ఉంటే: ఐశ్వర్యారాయ్ కళ్లు, జెన్నిఫర్ లోపెజ్ ఫిగర్, జూహీ చావ్లా లాంటి నవ్వు, ‘బాబీ’లో డింపుల్ కపాడియా చూపించి నటువంటి యాక్టింగ్ టాలెంట్, కృష్ణవంశీ లాంటి బ్రెయిన్‌తో పుట్టాలను కుంటాను. ఆ జన్మలో షారుఖ్ ఖాన్ లాంటి బాయ్ ఫ్రెండ్ కూడా దొరకాలనుకుంటాను.