
Liger Stars Vijay Deverakonda, Ananya Panday At Apoorva Mehta Birthday: బాలీవుడ్ అంతా ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తుంది. ఇప్పటికే మన స్టార్స్ పాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటుతున్నారు. ఇక టాలీవుడ్ అర్జున్‌రెడ్డి విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ చేస్తున్న 'లైగర్' సినిమా కోసం ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది. ఓవైపు షూటింగ్‌లో బిజీగా ఉంటూనే, మరోవైపు పార్టీ మూడ్‌ని ఎంజాయ్ చేస్తుంది లైగర్ టీం.
గురువారం ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పుట్టినరోజు సందర్భంగా ముంబైలో గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో లైగర్ బ్యాచ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. బ్లాక్ అండ్ బ్లాక్‌లో అందరూ దుమ్మురేపారు. మోస్ట్ స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేశారు.
పార్టీ మొత్తంలో లైగర్ టీం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రసత్తుం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే..ధర్మ ప్రొడక్షన్స్- పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్ సినిమా ఆగస్ట్25న ప్రేక్షకుల ముందుకు రానుంది.