Vijay Devarakonda Liger Movie Announces Release Date - Sakshi
Sakshi News home page

Liger Movie: ‘రౌడీ’ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ‘లైగర్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Published Thu, Dec 16 2021 10:20 AM | Last Updated on Thu, Dec 16 2021 10:40 AM

Vijay Devarakonda Liger Movie Announces Release Date - Sakshi

Vijay Devarakonda Liger Movie Announces Release Date: విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కరణ్‌ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ షరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా  కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ ఫిక్స్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 25న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక ఈ ఏడాది చివర్లో డిసెంబర్‌31రోజు లైగర్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేస్తామని అనౌన్స్‌ చేశారు. స్పోర్ట్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైక్‌ టైసన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement