Liger Movie
-
లైగర్ లో నటించడం నాకు ఇష్టం లేదు
-
'లైగర్'లో నా కూతురు చాలా అసౌకర్యంగా ఫీల్ అయింది: అనన్య తండ్రి
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేకు తెలుగులో కూడా భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. 2022లో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా నటించిన లైగర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ సినిమాలో అనన్య గ్లామర్ డోస్ పెంచినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ మూవీ తర్వాత మళ్లీ తెలుగు సినిమా వైపు ఆమె చూడలేదు. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తండ్రి చంకీ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. లైగర్ చిత్రంలో నటించడం అనన్యకు ఎంత్ర మాత్రం ఇష్టం లేదని ఆయన కామెంట్స్ చేశారు. కేవలం తను చెప్పడం వల్లే లైగర్ ప్రాజెక్ట్‌లో ఆమె భాగమైందని గుర్తు చేసుకున్నారు.లైగర్ సినిమా హిందీలో కూడా విడుదల చేస్తుండటంతో హీరోయిన్ ఎవరైతే బాగుంటుందని చిత్ర యూనిట్ సర్చ్ చేస్తున్నప్పుడు అనన్య పాండే మంచి ఛాయిస్ అనుకున్నారని ఆమె తండ్రి గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ వచ్చినప్పుడు తన కూతురు అనన్య చాలా అసౌకర్యంగా ఫీలైందని చంకీ పాండే పేర్కొన్నారు. లైగర్‌లో హీరోయిన్ పాత్రకు ఎంత మాత్రం సెట్ కానంటూ అనన్య కాస్త గందరగోళానికి గురైందని ఆయన తెలిపారు. స్క్రీన్‌పై మరీ చిన్న పిల్లలా కనిపిస్తానేమో అనే సందేహాన్ని అనన్య వ్యక్తం చేసినట్లు చంకీ పాండే అన్నారు.'నాన్నా.. లైగర్ సినిమాలో నేను సెట్ కానేమో అనుకుంటున్నా.. ఏం చేద్దామో చెప్పండి' అంటూ నా దగ్గరకు వచ్చింది. ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు. పాన్ ఇండియా రేంజ్లో చాలా పెద్ద ప్రాజెక్ట్‌లో ఛాన్స్ వచ్చింది. సినిమా విజయం సాధిస్తే.. భవిష్యత్‌లో మంచి పేరు వస్తుందని చెప్పాను. దీంతో ఆమె ఓకే చెప్పింది. అయితే, సినిమా విడుదుల తర్వాత వచ్చిన రివ్యూలు చూసి నా నిర్ణయం తప్పు అనిపించింది. తను చెప్పినట్లుగానే స్క్రీన్‌పై చాలా యంగ్‌గా కనిపించింది. ఈ సినిమా తర్వాత ఎప్పుడూ కూడా తనకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు' అని చంకీ పాండే అన్నారు.‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పాండే.. తొలి చిత్రంతోనే బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి క్రేజ్ ఉన్న సమయంలోనే లైగర్‌లో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె కూడా పలు వ్యాఖ్యలు చేసింది. లైగర్ సినిమా చేయడానికి ఇద్దరే కారణమని ఆమె చెప్పింది. నిర్మాత కరణ్‌జోహార్‌తో పాటు తన తల్లిదండ్రులు చెప్పడం వల్లే 'లైగర్'లో నటించానని ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ మూవీ బెడిసికొట్టడంతో తనకు ఎలాంటి సలహాలు, సూచనలు భవిష్యత్‌లో ఇవ్వద్దని అదే వేదిక మీద తన తండ్రితో చెప్పింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. -
లైగర్ తర్వాత నాన్నను సలహాలివ్వొద్దన్నా: అనన్య పాండే
వందకోట్లేంటి.. వెయ్యికోట్లు గ్యారెంటీ.. అనుకున్న సినిమాలు కూడా కొన్నిసార్లు బొక్కబోర్లా పడతాయి. అలాంటి కోవలోకే వస్తుంది విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ. ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా చేయమని తన తండ్రి చుంకీ పాండే సలహా ఇచ్చినట్లున్నాడు. ఆ మూవీ బెడిసికొట్టడంతో తనకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వద్దంటోంది అనన్య.స్క్రిప్ట్ సెలక్షన్లో జాగ్రత్త..తాజాగా అనన్య, చుంకీ పాండే 'బి ఎ పేరెంట్ యార్' అనే షోలో పాల్గొన్నారు. అనన్య మంచి నటి అనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు ఇంట్లోనా? స్క్రీన్‌పైనా? అని చుంకీ సరదాగా బదులిచ్చాడు. స్క్రిప్టులు సెలక్ట్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని చుంకీ అనగా.. లైగర్ సినిమా తర్వాత నువ్వు నాకు ఎలాంటి సలహాలు ఇవ్వకూడదని చెప్పానుగా అని అనన్య హెచ్చరించింది.చదవకుండానే లైక్ కొడతాడుఇంకా మాట్లాడుతూ.. నాన్న ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటాడు. పోస్టులు చదవకుండానే లైక్ కొడుతుంటాడు. ఇలాంటివి చేసి ఇబ్బందుల్లో పడే కన్నా ఆయన ఫోన్లో ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయడమే మేలు అని పేర్కొంది. ఇంతలో చుంకీ కలగజేసుకుంటూ.. నీ ఫోటో ఎక్కడ కనిపిస్తే అక్కడ నేను లైక్ కొడుతున్నానంతే అని చెప్పాడు. అది నా అదృష్టంనెపోటిజం గురించి అనన్య మాట్లాడుతూ.. ఈ రోజుల్లో నెపోటిజం అనేదాన్ని పెద్ద బూతుగా చూస్తున్నారు. ఏదేమైనా ఆయనకు కూతురుగా పుట్టడం నా అదృష్టం. అందుకు నేను గర్వంగా ఫీలవుతున్నాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే చుంకీ పాండే ప్రస్తుతం హౌస్‌ఫుల్ 5 సినిమా చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది జూన్ 6న విడుదల కానుంది. అనన్య.. కంట్రోల్ సినిమాతో పాటు కాల్ మీ బే వెబ్ సిరీస్‌తో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించింది.చదవండి: బాహుబలిని మించిందేముంటుంది? నెక్స్ట్ ఏంటో అర్థం కాలే! -
హార్దిక్‌తో డేటింగ్ రూమర్స్.. ఖరీదైన కారు కొన్న బ్యూటీ!
సినీతారలకు కార్లపై మక్కువ ఎక్కువ. మార్కెట్లో ఏదైనా కొత్త బ్రాండ్ వచ్చిందంటే గ్యారేజ్‌లోకి రావాల్సిందే. హీరోలైనా, హీరోయిన్లయినా సరే తమ రేంజ్‌కు తగిన కారును కొనేస్తుంటారు. అలా తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఆమె కొన్న రేంజ్ రోవర్ కారు విలువ దాదాపు రూ.3.38 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఇటీవల బ్యాడ్ న్యూజ్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. ఈ మూవీలో విక్కీ కౌశల్, త్రిప్తి డిమ్రీ జంటగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. అంతే కాకుండా కాల్ మీ బే అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్.. హార్దిక్‌తో డేటింగ్!ఇటీవల అనంత్ అంబానీ బారాత్‌లో క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కలిసి అనన్య డ్యాన్స్ చేసిన వీడియో వైరలైన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి. అంతే కాకుండా ఇన్‌స్టాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో ఆ వార్తలు మరింత వైరలయ్యాయి. కాగా.. తన ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్‌లో ఈ ఏడాది మార్చి బ్రేకప్ చేసుకుంది. మరోవైపు హార్దిక్ ఇటీవలే తన భార్య నటాసా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. అయితే డేటింగ్ రూమర్స్ పై అనన్య పాండే, హార్దిక్ కానీ ఎవరూ స్పందించలేదు. View this post on Instagram A post shared by Ananya pandey 💫💛 (@ananya__panday__love) -
మెరుపు తీగలా మెరుస్తున్న ఈ ష్యాషన్ క్వీన్‌ని చూశారా? (ఫొటోలు)
-
అనన్య పాండే గ్లామర్ ట్రీట్.. వేరే లెవల్ అంతే! (ఫొటోలు)
-
25 ఏళ్లకే కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. గృహప్రవేశం ఫోటోలు వైరల్
అనన్య పాండే.. బాలీవుడ్లో క్రేజ్ ఉన్న హీరోయిన్. లైగర్ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది. కానీ ఈ సినిమా బెడిసికొట్టడంతో మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేసుకుంటోంది. అయితే 25 ఏళ్లకే బాగా సంపాదించిన అనన్య పాండే తాజాగా ముంబైలో కొత్త అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. ధంతేరస్ నాడు నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మ 'ఇదే నా కొత్త ఇల్లు' అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. గుమ్మం ముందు కొబ్బరి కాయ కొట్టిన తర్వాతే లోనికి అడుగుపెట్టింది. ఈ వీడియోను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది చూసిన సెలబ్రిటీలు ఈ బ్యూటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంత త్వరగా ఇల్లు కొనేశావా? వావ్.. ఈ ఇల్లు నీకు సంతోషంతోపాటు అదృష్టాన్ని కూడా అందించాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అటు అనన్య తల్లి భావన ఈ పోస్ట్‌పై స్పందిస్తూ.. నువ్వు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి.. చాలా గర్వంగా ఉంది అని కామెంట్ చేసింది. కాగా అనన్య పాండే చివరగా డ్రీమ్ గర్ల్ 2 సినిమాలో నటించింది. ఇది 2019లో వచ్చిన డ్రీమ్ గర్ల్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ రెండో భాగంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా రాజ్ శాండిల్య దర్శకత్వం వహించాడు. ఆగస్టులో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో కో గయే హమ్ కహాన్, కంట్రోల్ సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) చదవండి: అవసరం లేకున్నా ఆ సీన్ చేయమన్నారు: హీరోయిన్ -
విజయ్ దేవరకొండ హీరోయిన్.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్!
బాలీవుడ్ భామ అనన్య పాండే బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. లైగర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. తాజాగా ఈ ముంబై ముద్దుగుమ్మ తన 25వ పుట్టినరోజును జరుపుకుంటోంది. తన బర్త్ డే వేడుకల కోసం మాల్దీవులకు చెక్కేసింది భామ. అంతే కాకుండా వేడుకలకు భాయ్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఒకరోజు ముందే ఆమె ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్ ముంబై విమానాశ్రయంలో వెళ్తూ కెమెరాలకు చిక్కారు. దీంతో ఇద్దరు కలిసి బర్త్ డే వేడుకల కోసం మాల్దీవుస్కు వెళ్లినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా ఈ బర్త్ డే భామ మాల్దీవుల్లో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ది ఫర్ఫెక్ట్ హ్యాపీ బర్త్ డే మార్నింగ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే గతంలో ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి చాలాసార్లు వార్తల్లో నిలిచింది. ఆదిత్య రాయ్ కపూర్‌తో కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే! ఓ బ్రిడ్జిపై వీరిద్దరూ హగ్ చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ లవ్ బర్డ్స్ షికారుకు వెళ్లగా.. ప్రియుడు ఆదిత్య కారు నడుపుతుంటే అనన్య అతడి పక్కనే కూర్చుని కనిపించింది. కాగా.. ఈ ఏడాది అనన్య పాండే.. డ్రీమ్ గర్ల్-2 చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా సరసన నటించింది. చుంకీ పాండే స్పెషల్ విషెస్ అనన్య పాండే పుట్టిన రోజు సందర్భంగా ఆమె తండ్రి చుంకీ పాండే ఎమోషనల్ పోస్ట్ చేశారు. అనన్య త్రోబ్యాక్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనన్యతో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ "హ్యాపీ హ్యాపీ హ్యాపీ సిల్వర్ జూబ్లీ మై డార్లింగ్.. లవ్ యు ఫరెవర్" అనే క్యాప్షన్‌తో తన ప్రేమను చాటుకున్నారు. కాగా.. ఆమె తండ్రి చుంకీ పాండే మూడు దశాబ్దాల కెరీర్లో 100కు పైగా సినిమాల్లో నటించాడు. View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) -
Birthday Special: గ్లామర్‌తో బాలీవుడ్లో హీట్ పెంచిన అనన్య పాండే బర్త్‌డే నేడు (ఫోటోలు)
-
దీక్ష విరమించిన లైగర్ ఎగ్జిబిటర్లు
భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ ఎంతటి పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే! విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకనిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ఈ సినిమా వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని ఎగ్జిబిటర్లకు మాటిచ్చాడు పూరీ. అయితే హామీ ఇచ్చి ఆరు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మే 12న ఎగ్జిబిటర్లు ఫిలిం ఛాంబర్ ఎదుట నిరవధిక దీక్ష చేపట్టారు. నిర్మాతల మండలి సహా తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమస్య పరిష్కారం చేస్తామని మాటివ్వడంతో ఎగ్జిబిటర్లు గురువారం దీక్ష విరమించారు. పూరీ జగన్నాథ్, చార్మి త్వరలో అంతా సర్దుబాటు చేస్తామని చెప్పడం వల్లే దీక్ష విరమించామని పేర్కొన్నారు. చదవండి: సింహాద్రి రీరిలీజ్ కలెక్షన్లు ఏం చేస్తారంటే? -
లైగర్ నష్టాలతో నిరవధిక దీక్ష.. స్పందించిన చార్మీ
బాక్సాఫీస్ బద్ధలు కొడుతుందనుకున్న విజయ్ దేవరకొండ లైగర్ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే! పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్ నిర్మించారు. గతేడాది తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 25న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ గండం గట్టెక్కలేకపోయింది. ఈ సినిమా వల్ల ఎంతో డబ్బు నష్టపోయామంటూ నైజాంకు చెందిన ఎగ్జిబిటర్లు హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ఎదుట రిలే నిరవధిక దీక్షకు పూనుకున్నారు. నష్టాన్ని భర్తీ చేస్తామని పూరీ జగన్నాథ్, డిస్ట్రిబ్యూటర్ తమకు మాటిచ్చి ఆరునెలలు అయిందని, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ ధర్నాపై నటి, నిర్మాత చార్మీ స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో వారికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. త్వరలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఫిలిం ఛాంబర్‌కు ఈ మెయిల్ ద్వారా సందేశాన్ని పంపింది. చదవండి: మోడ్రన్ లవ్ చెన్నై... ఆ ఓటీటీలో అప్పుడే స్ట్రీమింగ్! -
రోడ్డెక్కిన లైగర్ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు
-
'లైగర్' మూవీ ఎఫెక్ట్.. ఆందోళనకు దిగిన ఎగ్జిబిటర్స్!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'లైగర్'. అనన్యా పాండే కథానాయికగా నటించింది. పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై ఛార్మి, పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. (ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు.. నెటిజన్స్ ట్రోలింగ్) అయితే భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా వల్ల తాము ఎంతో డబ్బు నష్టపోయామంటూ నైజాంకు చెందిన ఎగ్జిబిటర్లు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే నష్టాన్ని భర్తీ చేస్తామని చిత్ర నిర్మాత పూరి జగన్నాథ్, డిస్ట్రిబ్యూటర్ తమకు మాటిచ్చి ఆరునెలలు అయిందని తెలిపారు. కానీ ఇప్పటి వరకూ తమకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన గడువు ముగియడంతో ఎగ్జిబిటర్లు ఆందోళనకు దిగారు. (ఇది చదవండి: బీస్ట్ మోడ్‌లో హీరో సూర్య.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో) -
విజయ్ దేవరకొండ, అఖిల్ కెరీర్‌ని దెబ్బ తీసిన ‘బామ్మర్ది’!
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. దీంతో బడా హీరోలతో పాటు యంగ్ స్టార్స్ కూడా పాన్ ఇండియాపై ఫోకస్ పెట్టారు. వాటిలో చాలా వరకు విజయవంతం అయ్యాయి. కానీ ఓ రెండు చిత్రాలు మాత్రం భారీ అంచనాలతో విడుదలై.. అట్టర్ ఫ్లాప్ చిత్రాలుగా మారాయి. అవే విజయ్ దేవరకొండ ‘లైగర్’, అఖిల్ ‘ఏజెంట్’. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’పై బాలీవుడ్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రచార చిత్రాలు.. ప్రమోషన్ కార్యక్రమాలు చూసి మరో తెలుగు సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టినా.. తర్వాత రోజు నుంచి చతికిల పడింది. భారీ బడ్జెట్‌తో తెరరెక్కిన లైగర్.. బయ్యర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. (చదవండి: సోషల్ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక) ఇక ఈ నెల 28న విడైదలైన ‘ఏజెంట్’పై కూడా అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాతో అఖిల్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ విడుదలైన తొలి రోజు ఈ మూవీ డిజాస్టర్ టాక్ని సొంతం చేసుకుంది. లైగర్ కోసం విజయ్ దేవరకొండ.. ఏజెంట్ కోసం అఖిల్ చాలా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ కూడా చేశారు. అయితే తమ కష్టానికి తగ్గ కథను ఎంచుకోవడంలో ఇద్దరు విఫలమయ్యారు. అందుకే రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. (చదవండి: మండుటెండలో తిరుగుతున్నా, ఎవరూ ఇల్లు అద్దెకివ్వడం లేదు: నటి) అయితే ఈ రెండు చిత్రాల డిజాస్టర్ వెనుక ‘బామ్మర్ది’ ఉన్నాడనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఎవరీ బామ్మర్ది అంటే.. ఈ రెండు చిత్రాల్లో ‘సాలా’ అనే పదం బాగా హైలెట్ అయింది. సాలా అంటే హిందీలో బామ్మర్ది అని అర్థం. దీన్ని తెలుగులో బూతు పదంగానూ వాడుతున్నారు. ఇలాంటి పదాలను బాగా ఇష్టపడే పూరి జగన్నాథ్.. లైగర్కి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనే ట్యాగ్ లైన్ తగిలించారు. ఇక ఏజెంట్లో సురేందర్ రెడ్డి హీరో క్యారెక్టర్ని ‘వైల్డ్ సాలా’ అంటూ పరిచయం చేయించాడు. ఈ రెండింటిలోనూ ‘సాలా’ కామన్‌గా ఉంది. రెండూ డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌కి ‘సాలా’ పదం అచ్చిరావడంలో లేదని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది సిల్లీ సెంటిమెంట్. కంటెంట్‌లో బలం లేకపోవడంతో రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. అయితే టాలీవుడ్లో సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. నిజంగా సాలా పదం అచ్చిరాదేమో అని భావించేవాళ్లు కూడా ఉంటారు. మరి భవిష్యత్తులో ‘సాలా’తో సాలిడ్ హిట్ కొడతారో లేదా సెంటిమెంట్‌తో ఆ పదమే వాడడానికి భయపడతారో చూడాలి. -
38 సార్లు అరెస్ట్! జైలర్ చొరవతో ఇలా! వివాహేతర సంబంధాలు.. ఈ ‘హీరో’ విలన్ కూడా!
1986 నవంబర్ 22 .. వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్. అప్పటికి విజేతగా ఉన్న జమైకా బాక్సర్ ట్రెవర్ బెర్బిక్ తన టైటిల్ నిలబెట్టుకునేందుకు తయారయ్యాడు. ఎదురుగా 20 ఏళ్ల కుర్రాడొకడు తనతో పోటీకి సిద్ధమయ్యాడు. అప్పటికే ఆ కుర్రాడు వరుస విజయాలతో మంచి ఊపు మీదున్నా సరే.. ఒకప్పుడు మొహమ్మద్ అలీనే ఓడించిన రికార్డు ఉన్న బెర్బిక్ గెలుపుపై ఎవరికీ సందేహాలు లేవు. మొత్తం 12 రౌండ్ల పోరు.. రెండో రౌండ్లో ఆ కొత్త బాక్సర్ విసిరిన ఒక పదునైన పంచ్‌కు బెర్బిక్ కుప్పకూలాడు. అయితే లేచి నిలబడే ప్రయత్నం చేసి మళ్లీ పడిపోయాడు. మరోసారి కూడా అలాగే శక్తి కూడదీసుకొని నిలబడే ప్రయత్నం చేశాడు. అయినా సాధ్యం కాక కింద పడిపోయాడు! ఒక్క దెబ్బకు బెర్బిక్ మూడు సార్లు నేలకూలాడు! అప్పటికి జరిగింది 2 నిమిషాల 35 సెకన్ల పోరు మాత్రమే. రిఫరీ వచ్చి ఆటను ఆపేశాడు. కొత్త కుర్రాడిని వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌గా ప్రకటించాడు. ఆ పంచ్ గురించి గర్వంగా చెప్పుకున్న, తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనగా అభివర్ణించుకున్న ఆ బాక్సర్ పేరే ‘మైక్ టైసన్’. సుదీర్ఘకాలం పాటు ఒక తరం మొత్తానికి బాక్సింగ్ అంటే టైసన్ మాత్రమే అనిపించుకున్న మహాబలుడు. ‘అమ్మను నేను ఎప్పుడూ సంతోషంగా చూడలేదు. నేను ఆమె కోసం ఏమీ చేయలేకపోయాను. వీథుల్లో నేను ఆవారాగా తిరుగుతూ గొడవలు పడుతుంటానని ఆమెకు తెలుసు. ప్రతిరోజూ కొత్త బట్టలతో వస్తుంటే అవి నేను కొన్నవి కాదనీ ఆమెకు తెలుసు. అసలు అమ్మతో నేను ఎప్పుడూ సరిగ్గా మాట్లాడలేకపోయాను’ అంటూ తన బాల్యం, తల్లి గురించి టైసన్ చెప్పుకున్న మాటలు అవి. నిజంగానే దశాదిశా లేని జీవితం. పట్టించుకోని తండ్రి.. గల్లీ గూండాలతో సాన్నిహిత్యం.. డీలర్ల నుంచి డ్రగ్స్ దొంగతనం.. టైసన్ చిన్నతనమంతా ఇలాగే సాగింది. 13 ఏళ్ల వయసు వచ్చే సరికే టైసన్ 38 సార్లు అరెస్ట్ అయ్యాడు. జైలర్ వల్లే అయితే టీనేజర్‌గా జైలుకు వెళ్లిన సమయం కూడా చివరకు అతని జీవితానికి కొత్త దారిని చూపించింది. ఒక స్ట్రీట్ ఫైటర్ స్థాయి నుంచి వరల్డ్ చాంపియన్‌గా నిలిపింది. టైసన్లోని ఆవేశాన్ని సరైన రీతిలో వాడుకుంటే అద్భుతాలు చేయవచ్చని గుర్తించిన వ్యక్తి అక్కడి జైలర్.. మాజీ బాక్సర్ కూడా అయిన బాబీ స్టివార్ట్! టైసన్ పవర్‌ను పద్ధతిగా ఉపయోగించుకునేలా చేశాడు. స్టివార్ట్తో పాటు తల్లి తాను చనిపోతూ టైసన్‌ను అప్పగించిన వ్యక్తి కస్ డి అమాటో.. ఆ తర్వాత టైసన్ దిగ్గజ బాక్సర్‌గా మారేందుకు దిశానిర్దేశం చేశాడు. టీనేజర్‌గా ఉన్నప్పుడే తాను ఇష్టపడే పావురం మెడ విరిచాడనే కోపంతో వీథిలో ఒక పెద్ద రౌడీ మెడవిరిచి తనలో ఆవేశాన్ని ప్రదర్శించిన టైసన్ ఆ తర్వాత ఎంతో మంది ప్రత్యర్థులను తన నాకౌట్ పంచ్‌లతో కుప్పకూల్చాడు. ఆరంభం అదిరేలా.. కెరీర్ ఆరంభంలో టైసన్ అమెచ్యూర్ బాక్సర్‌గా రాణించాడు. వరుసగా రెండేళ్లు జూనియర్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు సాధించాడు. అయితే అతని కోచ్‌లు, ప్రమోటర్లు వాటిని టైసన్ స్థాయికి మరీ చిన్నవిగా భావించారు. అందుకే అన్ని రకాలుగా సిద్ధం చేసి పదునైన ప్రొఫెషనల్ రింగ్లోకే దింపారు. టైసన్ వారి అంచనాలను వమ్ము చేయలేదు. 18 ఏళ్ల వయసులో తొలిసారి అసలు పోరులోకి దిగిన టైసన్ తొలి మ్యాచ్‌లో హెక్టర్ మెర్సిడెజ్‌తో తలపడ్డాడు. టెక్నికల్ నాకౌట్ ద్వారా తన ప్రత్యర్థిని చిత్తు చేసిన టైసన్‌ను చూడగానే అందరికీ కొత్త చాంపియన్ వచ్చాడని అర్థమైంది. అక్కడితో మొదలైన విజయ ప్రస్థానం 37 బౌట్ల వరకు సాగింది. వీటిలో తొలి 26 బౌట్లలోనైతే అతను ఏకపక్షంగా విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థికి ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వని ఈ పోటీలన్నీ నాకౌట్ లేదా టెక్నికల్ నాకౌట్ ద్వారా ముగిశాయి. ఈ ప్రదర్శన చూస్తేనే అతని ఆధిపత్యం ఎలా సాగిందో అర్థమవుతుంది. 20 ఏళ్ల 145 రోజుల వయసులోనే వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచిన అతను ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ‘బాక్సింగ్ భవిష్యత్ గురించి ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. రాబోయే కొన్నేళ్ల పాటు ఈ ఆటకు ప్రాచుర్యపరంగా శిఖరానికి తీసుకెళ్లగలవాడు వచ్చేశాడు’ అంటూ విశ్లేషకులంతా అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. కొనసాగిన జోరు అతి బలమైన శరీరం, వేగంగా దూసుకొచ్చే చేయి, తీవ్రత, కచ్చితత్వంతో పాటు ఎప్పుడు పంచ్ విసరాలో తెలిసిన టైమింగ్‌తో టైసన్ బాక్సింగ్ ప్రపంచాన్ని శాసించాడు. ప్రత్యర్థి శరీరంపై కుడి చేత్తో హుక్ చేసిన వెంటనే అప్పర్‌కట్‌తో దవడపై వరుసగా దాడి చేసే శైలికి ఎదురులేకుండా పోయింది. పైగా బలమైన డిఫెన్స్ అవతలి బాక్సర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అతని ఈ ఆటపై అప్పట్లో ‘మైక్ టైసన్స్ పంచ్ అవుట్’ పేరుతో ఒక వీడియో గేమ్ కూడా వచ్చి సూపర్ హిట్ అయిందంటే అతని పాపులారిటీ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో బాక్సింగ్ ప్రపంచాన్ని నడిపిస్తున్న మూడు వేర్వేరు సంఘాలు వేర్వేరు వరల్డ్ చాంపియన్ షిప్‌లను నిర్వహిస్తుండేవి. అలా డబ్ల్యూబీఏ, డబ్ల్యూబీసీ, ఐబీఎఫ్ నిర్వహించిన వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్ షిప్‌లలో గెలిచి ఈ మూడింటిలో ఒకేసారి చాంపియన్ గా నిలిచిన ఏకైక బాక్సర్‌గా చరిత్రలో నిలిచాడు టైసన్. ఆ ఒక్క ఓటమితో.. వరుసగా 37 బౌట్లలో విజయాలు, అన్ని హెవీవెయిట్ పోటీల్లోనూ విశ్వవిజేత, అప్రతిహతంగా సాగిపోతున్న మైక్ టైసన్ కు 1990 ఫిబ్రవరిలో షాక్ తగిలింది. తన మూడు టైటిల్స్‌ను కాపాడుకునేందుకు జేమ్స్ బస్టర్ డగ్లస్‌తో టైసన్ పోటీ పడాల్సి వచ్చింది. అప్పటికే కొంత కాలంగా వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతూ ప్రాక్టీస్‌కు కూడా తగినంత సమయం ఇవ్వలేకపోయిన టైసన్ ఈ పోరుకు వచ్చాడు. అయినా సరే అతనిపై 42–1 తేడాతో బెట్టింగ్ అంచనాలు ఉన్నాయి. కానీ 10 రౌండ్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరకు టైసన్ తడబడ్డాడు. 82 సెకన్ల వ్యవధిలో ముగిసిన పోరులో టైసన్ ఓడి తన మూడు టైటిల్స్‌ను కోల్పోయాడు. అతని కెరీర్లో ఇదే తొలి పరాజయం. ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యంత సంచలన ఫలితాల్లో ఒకటిగా ఇది నిలిచిపోయింది. ఈ పరాజయం అప్పటికప్పుడు టైసన్ కు నష్టం కలిగించకపోయినా ఆటపై అతని ఏకాగ్రత చెదిరినట్లు బాక్సింగ్ ప్రపంచం గుర్తించింది. డగ్లస్‌తో పోరు తర్వాత మరికొన్ని విజయాలు దక్కినా, అవి మునుపటి టైసన్ ను చూపించలేకపోయాయి. టైసన్‌ను కూడా ఓడించవచ్చనే విషయాన్ని గుర్తించేలా చేశాయి. తర్వాతి తొమ్మిదేళ్ల కెరీర్లో 12 బౌట్లలో పాల్గొన్న టైసన్ ఐదింటిలో పరాజయం చవిచూడటం అతనిలో సత్తా తగ్గిందని నిరూపించాయి. దాంతో ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి తప్పుకోవడం అనివార్యంగా మారింది. హోలీఫీల్డ్, లెనాక్స్ లూయీ లాంటి స్టార్లతో పాటు కెరీర్ చివర్లో డానీ విలియమ్స్, కెవిన్ మెక్‌బ్రైన్ లాంటి అనామకులు కూడా టైసన్ ను ఓడించగలిగారు. ఆద్యంతం వివాదాలమయం.. ఒక దశలో తన పంచ్‌లతో ప్రపంచాన్ని శాసించిన మహా బాక్సర్ జీవితంలో లెక్కలేనన్ని వివాదాలు ఉన్నాయి. ఒక అమ్మాయిపై అత్యాచారం చేసి ఆరేళ్ల జైలుశిక్షకు గురి కావడంతో టైసన్ పతనం మొదలైంది. శిక్ష తగ్గించుకొని మూడేళ్లకే బయటకు వచ్చినా ఇతరత్రా కూడా అతనిలోని ‘పాత టైసన్ ’ బయటకు వచ్చి కెరీర్‌ను నాశనం చేశాడు. వివాహేతర సంబంధాలు, డ్రగ్స్‌తో పట్టుబడటం వివాదాల కారణంగా అప్పటికే తెచ్చుకున్న పేరుప్రతిష్ఠలను కోల్పోవడమే కాకుండా తను ఆర్జించిన కోట్లాది సంపద కూడా ఆవిరైంది. బాక్సింగ్ రింగ్‌లో చూస్తే ఓటమి ఎదురువుతున్న దశలో పంచ్‌లతో కాకుండా హోలీఫీల్డ్ ‘చెవి కొరికి’ డిస్క్వాలిఫై కావడం అతని చక్కటి కెరీర్లో మచ్చగా మిగిలిపోయింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్నా బయట అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు, డ్రగ్స్‌తో పట్టుబడటం, డోపింగ్, కోర్టు వివాదాలు.. ఇలా ఒక్కటేమిటి అన్నీ నెగెటివ్ వార్తలే! అద్భుతమైన అతని కెరీర్‌ను మరచి అతన్ని ఒక దుర్మార్గుడిలా చిత్రీకరించాయి. తన ఆత్మకథ ‘ద అన్ డిస్ప్యూటెడ్ ట్రూత్’లో అతను ఈ విషయాలన్నీ పంచుకున్నాడు. అమెరికాలో పలు టీవీ సిరీస్‌లలో నటించిన టైసన్ ఇటీవల తెలుగు సినిమా ‘లైగర్’లోనూ కనిపించాడు. అయితే టైసన్లోని ‘విలన్’ను పక్కన పెట్టి చూస్తే క్రీడా ప్రపంచంలో ఎదురు లేని ‘హీరో’ల్లో ఒకడిగా టైసన్ నిలిచిపోతాడనేది నిజం! -మొహమ్మద్ అబ్దుల్ హాది -
'నీ బాయ్‌ఫ్రెండ్‌కి పట్టిన గతే నీకూ పడుతుంది'.. రష్మికపై దారుణమైన ట్వీట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం టాప్ హీరోయిన్గా వెలిగిపోతుంది. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఆమె నటించిన మిషన్ మజ్ను, వారీసు చిత్రాలు రిలజ్కు రెడీగా ఉన్నాయి. ఇక సినిమాలతో పాటు వివాదాలతోనూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్న రష్మికపై బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే దారుణమైన కామెంట్స్ చేశాడు. `మేడమ్ రష్మిక జీ.. మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుంచి ఎలాగైతే తరిమికొట్టారో.. సరిగ్గా నీకు కూడా అలాగే చేయబోతున్నాం. కానీ మిమ్మల్ని భోజ్‌పురి చిత్రాల్లో చూడటం మాకు ఆనందంగా ఉంటుంది` అంటూ రష్మికను కించపరిచే విధంగా కేఆర్కే ట్వీట్ చేశాడు. దీంతో అతడి ట్వీట్‌పై అటు రష్మిక ఫ్యాన్స్, ఇటు విజయ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ముందు నీ సంగతి చూసుకో, తర్వాత మిగతా వారి గురించి కామెంట్స్ చేద్దువు గానీ అంటూ కేఆర్కేపై మండిపడుతున్నారు ఫ్యాన్స్. Madam @iamRashmika Ji hope you know, what we Hindi audiences did with your boyfriend Anakonda film #Liger and throw him out of Bollywood. Exactly same, we are going to do with you. But we will be happy to watch you in Bhojpuri films. — KRK (@kamaalrkhan) January 9, 2023 Those all the people should do checkup of their eyes, who call @iamRashmika a national crush. Rashmika should do films with #RaviKishan #Nirahua #PawanSingh #KhesariLal etc if she wants to rock.🤪😁 — KRK (@kamaalrkhan) January 9, 2023 -
‘లైగర్’ పెట్టుబడులపై ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: లైగర్ చిత్రానికి పెట్టుబడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి దృష్టి సారించింది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి దర్శకుడు, నిర్మాత పూరీ జగన్నాథ్‌తోపాటు చార్మీని, ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించిన సంగతి విదితమే. కాగా, శుక్రవారం సినీ ఫైనాన్షియర్ శోభన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సినిమాలో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టారు?.. పెట్టుబడిగా పెట్టారా?.. లేక ఫైనాన్స్ చేశారా?.. చేస్తే ఆ డబ్బు ఎలా సర్దుబాటు చేశారు?.. దానికి సంబంధించిన లావాదేవీలు ఎలా జరిగాయన్న అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఈ సినిమా పెట్టుబడులపై ఇదివరకు పూరీ జగన్నాథ్, చార్మి, విజయ్ను ప్రశ్నించినప్పుడు, శోభన్‌ను ప్రశ్నించినప్పుడు ఈడీ అధికారులు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: విజయ్‌కి ‘లైగర్’ సెగ! -
'లైగర్' ఫ్లాప్‌తో హీరోయిన్ అనన్య సంచలన నిర్ణయం!
స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చినా కొన్నిసార్లు అదృష్టం కలిసిరాదు. ఒక్క ఫ్లాప్ రాగానే అవకాశాలు చేజారిపోతుంటాయి. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనన్యకు సినిమా ఫ్లాప్ కావడంతో వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. ఊహించని విధంగా లైగర్ డిజాస్టర్ కావడంతో దాని ఎఫెక్ట్ అనన్య మీద గట్టిగానే పడింది. ఆమె నటనను బాగా ట్రోల్ చేసిన నెటిజన్లు అనన్య స్థానంలో వేరే వాళ్లని తీసుకొని ఉంటే బాగుండేదని కామెంట్స్ చేశారు. ఇక లైగర్ రిజల్ట్ తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గాయని తెలుస్తుంది. దీంతో చేసేదేమి లేక అనన్య తన రెమ్యునరేషన్ తగ్గించేసిందట. ఇంతకుముందు సుమారు రూ. 80 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకునే అనన్య ఇప్పుడు దాదాపు రూ. 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి అనన్య అనుకున్నట్లుగా అవకాశాలు వస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
విజయ్‌కి ‘లైగర్’ సెగ!
సాక్షి, హైదరాబాద్: ‘లైగర్’చిత్రంలో పెట్టుబడులకు సంబంధించిన సెగ ఆ చిత్రంలో నటించిన హీరో విజయ్ దేవరకొండకు తగిలింది. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట ఆయన బుధవారం హాజరయ్యారు. ప్రధానంగా భారీ బడ్జెట్‌తో కూడిన ఆ సినిమా నిర్మాణానికి పెట్టుబడులు పెట్టిన వారి విషయం పైనే ఈడీ దృష్టి పెట్టింది. కొందరు రాజకీయ నేతలు మనీలాండరింగ్ ద్వారా లైగర్‌లో పెట్టుబడులు పెట్టారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈడీ గత నెల 17న ఈ సినిమా దర్శకనిర్మాతలు పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్‌లను 10 గంటలపాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వారి విచారణలో వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలను క్రాస్ చెక్ చేసుకోవడానికి విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం అధికారులు ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. రెమ్యునరేషన్ ఎలా తీసుకున్నారు? విజయ్ తన మేనేజర్‌తో కలిసి బుధవారం ఉదయం 8.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈడీ అధికారులకు ఇవ్వడానికి తన వెంట కొన్ని పత్రాలను తెచ్చారు. ఉదయం 10.30 గంటలకు విజయ్ను ప్రశ్నించడం ప్రారంభించిన అధికారులు గంట భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకు సాగింది. ఈ చిత్ర నిర్మాణంతోపాటు విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్‌కు సంబంధించి అధికారులు ప్రశ్నల్ని సంధించారు. పారితోషికాన్ని చెక్కుల ద్వారానా, ఆన్‌లైన్‌లోనా లేదా నగదు రూపంలో తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతలతో చేసుకున్న ఒప్పంద పత్రాలను విజయ్ నుంచి తీసుకున్నారు. ఈ చిత్రానికి పెట్టుబడులు పెట్టిన వారిలో హైదరాబాద్‌కు చెందిన కొందరు రాజకీయ నేతలు ఉన్నారన్నది ఈడీ అనుమానం. ఈ విషయంపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన.. నటించడం మాత్రమే తన బాధ్యతని, ఆర్థిక లావాదేవీల్లో కలగజేసుకోలేదని చెప్పారని సమాచారం. తాను ఎక్కువగా దర్శకుడితోనే సంప్రదింపులు జరిపానని, తమ మధ్య పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడు, వివిధ ఫంక్షన్ల సమయంలోనూ రాకపోకలు సాగించిన, హాజరైన వారి జాబితాలను అధికారులు సేకరిస్తున్నారు. వీరికి నిర్మాతలతో ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు. అధికారులు త్వరలో మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. లైగర్ నిర్మాతల్లో పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్‌తోపాటు బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్, అపూర్వ మెహతా సైతం ఉన్నారు. వీరికీ నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించిన మైక్ టైసన్ రెమ్యునరేషన్ అంశాన్నీ ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారని సమాచారం. ఈ కేసుకు సంబంధించి మరికొందరి విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే విజయ్ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. వారికి కావాల్సిన జవాబులిచ్చా.. ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. విచారణ నేపథ్యంలో అధికారులు తన రెమ్యునరేషన్ వివరాలు అడిగారని, తాను చెప్పానని పేర్కొన్నారు. ‘మీరందరూ ఎలా ఉన్నారు. (మీడియా వాళ్లను ఉద్దేశించి) చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు... దాదాపు రోజంతా కదా!! నేను లోపల (ఈడీ కార్యాలయంలో) 12 గంటలు ఉన్నా. ఈడీ వాళ్లు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు. వారికి కావాల్సిన జవాబులు ఇచ్చాను. మీరు ఎంతగానో ప్రేమిస్తారు... ఆ పాపులారిటీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందులో ఇదీ ఒకటి. నన్ను ఈడీ వాళ్లు పిలిచినప్పుడు వచ్చి నా డ్యూటీ నేను చేశాను. గురువారం రమ్మని పిలవలేదు’అని విజయ్ అన్నారు. ఏ కేసుపై మిమ్మల్ని విచారించారు అన్న మీడియా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా గుడ్‌నైట్ అంటూ వెళ్లిపోయారు. -
లైగర్ సినిమా పెట్టుబడులపై కొనసాగుతున్న ఈడీ విచారణ
-
ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ డైరెక్షన్ చేయడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు. ఛార్మి కౌర్ సహ నిర్మాతగా వ్యవహరించింది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడింది. అయితే ఈ సినిమా లావాదేవీల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గుర్తించింది. ఈ సినిమాలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారన్న విషయంపై ఇప్పటికే లైగర్ నిర్మాతలు పూరీ జగన్నాథ్, చార్మీలను ఈడీ అధికారులు విచారించారు. తాజాగా లైగర్ హీరో విజయ్ దేవరకొండను కూడా విచారణకు పిలిచారు ఈడీ అధికారులు. మంగళవారం ఉదయం హీరో విజయదేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యాడు. లైగర్ సినిమా లావాదేవిలపై విజయ్ను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. -
డైరెక్టర్ పూరీ, ఛార్మీ లను విచారిస్తున్న ఈడీ అధికారులు
-
ఈడీ ఆఫీసులో పూరీ, చార్మీ..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫోకస్ చేసింది. ఈ సినిమాలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారన్న విషయంపై లైగర్ నిర్మాతలు పూరీ జగన్నాథ్, చార్మీలను విచారిస్తోంది. గురువారం పూరీ, చార్మీ ఈడీ ఆఫీస్‌కు రాగా.. సినిమాకు సంబంధించిన నగదు లావాదేవీలపై ఈడీ వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కాగా వీరు ఫెమా(విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం) నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు అధికారులు ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు. ఇకపోతే లైగర్ సినిమాలో రాజకీయ నేతలు బ్లాక్‌మనీని పెట్టుబడులుగా పెట్టారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఈడీకి ఫిర్యాదు కూడా అందింది. దీనికి తోడు లైగర్ నిర్మాతలు ఫెమా నిబంధనలను బ్రేక్ చేసినట్లు ఆధారాలు దొరకడంతో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పూరీ, చార్మీలకు పదిహేను రోజుల క్రితమే నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డ పూరీ, చార్మీతో కలిసి నేడు ఈడీ ఆఫీస్‌కు వెళ్లగా.. విదేశీ పెట్టుబడుల గురించి ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: అమెజాన్ ప్రైమ్‌లోకి కాంతార, కాకపోతే ఓ ట్విస్ట్ -
‘లైగర్’ ద్వారా విలువైన పాఠం నేర్చుకున్నా: విజయ్ దేవరకొండ
‘లైగర్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్ దేవరకొండ భారీ షాక్ తగిలింది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా ‘లైగర్’ నిలిచింది. ఈ మూవీ డిజాస్టర్ కారణంగా వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే ‘జనగనమణ’ కూడా మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఒక మూవీ హిట్ కొట్టలేదనే కారణంగా తాను మాత్రం విరామం తీసుకోబోనని విజయ్ అంటున్నాడు. లైగర్ ఒక నటుడిగా, వ్యక్తిగా తానేంటో తనకు చూపించిందన్నారు. ఈ సినిమా ద్వారా విలువైన పాఠాన్ని నేర్చుకున్నట్లు విజయ్ చెప్పారు. ప్రస్తుతం విజయ్ ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్. సామ్ అనారోగ్యం కారణంగా ‘ఖుషి’ షూటింగ్ నిలిచిపోయింది. ఆమె కొనుకోగానే మిగతా షూటింగ్ పూర్తి చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. -
Vijay Devarakonda: నేను ఎక్కడికి వెళ్లలేదు.. మళ్లీ తిరిగి వస్తా
లైగర్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో బోల్తా కొట్టింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ మూవీలో విజయ్‌కి జోడీగా అనన్య పాండే నటించింది. ఆదివారం ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్.. లైగర్ ఫ్లాప్‌పై స్పందించారు. లైగర్ సినిమా విడుదల తర్వాత నేను ఎక్కడికెళ్లినా అభిమానులు మంచి కమ్ బ్యాక్‌తో రావాలని అడుగుతున్నారని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ పెద్దఎత్తున సందడి చేశారు. ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ద్వారా విజయ్ బాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేశారు. (చదవండి: ఆర్మీ క్యాంపులో విజయ్ దేవరకొండ.. ఆ ప్రాజెక్ట్ కోసమేనా?) ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ.. 'నేను ఎక్కడికి వెళ్లినా అభిమానులు అన్నా.. నువ్వు మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వాలని అడుగుతున్నారు. నేను మీకు ఒకటే చెప్పాలనుకున్నా. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. మళ్లీ తిరిగి వస్తా' అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరలవుతోంది. దీంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్‌కు ఉన్న కాన్ఫిడెన్స్ తమకు ఉండాలని కోరుకుంటున్నట్లు ఓ అభిమాని కామెంట్ చేశాడు. రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్ కూడా ఈ చిత్రంలో నటించారు. లైగర్ విడుదలకు ముందే విజయ్, పూరి కలిసి జనగణమన అనే మరో ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగిపోయినట్లు తెలుస్తోంది. విజయ్ ప్రస్తుతం సమంతా రూత్ ప్రభుతో కలిసి తెలుగు రొమాంటిక్ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. -
'లైగర్' మూవీని ముందు ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో అటు పూరి జగన్నాథ్‌కు, ఇటు విజయ్‌కు కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా కథను పూరి ముందుగా కన్నడ స్టార్ హీరో యష్‌కు వినిపించాడట. అయితే ఆయన నో చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ విజయ్ దగ్గరికి వెళ్లిందట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ సినిమాను రిజెక్ట్ చేసి యశ్ మంచి పనే చేశాడంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
వాళ్లని తప్పా నేను ఎవరిని మోసం చేయలేదు : పూరి జగన్నాథ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. లైగర్ ఫ్లాప్ కావడంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు డబ్బు వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేయడమే కాకుండా, పూరిని బెదిరిస్తూ ధర్నాకు దిగేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో పూరి తమ ఫ్యామిలీకి ముప్పు ఉందని రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరిణామాలపై పూరి జగన్నాథ్ మీడియాకు లేఖను విడుదల చేశారు. 'నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే.. అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియన్స్‌ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా.వాళ్ళని ఎంటర్ టైన్ చేస్తా' అంటూ సుధీర్ఘ నోట్లో రాసుకొచ్చారు. పూరి లేఖ పూర్తి సారాంశం.. ”సక్సెస్.. ఫెయిల్యూర్.. ఈ రెండూ అపోజిట్ అనుకుంటాం. కానీ కాదు. ఈ రెండూ ఫ్లోలో ఉంటాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయి. గుండెల నిండా ఊపిరి పిలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి ? ఊపిరి వొదిలెయ్యటమే. పడతాం, లేస్తాం. ఏడుస్తాం, నవ్వుతాం. ఎన్నో రోజులు ఏడ్చినాక తర్వాత జరిగేది ఏంటి ? పగలబడి నవ్వటమే.. ఇక్కడ ఏదీ పర్మినెంట్ కాదు .. లైఫ్ లో మనకి జరిగే ప్రతి సంఘటనని మనం ఒక ఎక్స్పీరియన్స్ లా చూడాలి తప్ప, ఫెయిల్యూర్ సక్సెస్ లా చూడకూడదు. నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలుజారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, వడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, వూరి వేలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు, ఇలా ఎన్నెన్నో లైఫ్ లో జరుగుతుంటాయి. అవన్నీ సీన్లే. అందుకే లైఫ్ ని సినిమా లా చూస్తే, షో అయిపోగానే మర్చిపోవచ్చు. మైండ్ కి తీసుకుంటే మెంటల్ వస్తాది. సక్సెస్ ఐతే డబ్బులొస్తాయి. ఫెయిల్ ఐతే బోలెడు జ్ఞానం వస్తాది. సో ఎప్పుడూ మనం మెంటల్లీ, ఫైనాన్షియల్లీ పెరుగుతూనే ఉంటాం తప్ప, ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదిలేదు. అందుకే దేన్నీ ఫెయిల్యూర్ గా చూడొద్దు. ఇక బ్యాడ్ జరిగితే మన చుట్టూ ఉన్న బ్యాడ్ పీపుల్ మాయమైపోతారు .. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది. మంచిదే కదా ? కానీ ఖాళీగా ఉండకూడదు. ఏదోకటి చెయ్యాలి .. అది రిస్క్ అవ్వాలి. జీవితంలో రిస్క్ చెయ్యకపోతే అది లైఫే కాదు. ఏ రిస్క్ చెయ్యకపోతే అది ఇంకా రిస్క్. జీవితంలో నువ్వు హీరో ఐతే, సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. పొగుడుతారు, నిందిస్తారు, బొక్కలో వేస్తారు, మళ్ళీ విడుదల చేస్తారు, అందరూ చప్పట్లు కొడతారు, అక్షింతలు వేస్తారు. సో ఇవన్నీ మీ జీవితంలో జరగకపోతే, జరిగేలా చూడండి. లేకపోతె మీరు హీరో కాదేమో అనుకొనే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరోలా బతకాలి. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి. నేను నిజాయతి పరుడుని అని చెప్పుకొనవసరంలేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది. నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకులని ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. నిజానికి నేను ప్రేక్షకుల పట్ల బాధ్యత వహిస్తాను. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా . వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా. డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడనుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన, ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే .. మధ్యలో జరిగేది అంతా డ్రామా”.. – మీ పూరి జగన్నాధ్ -
పూరీ జగన్నాథ్ ఇంటికి పోలీసుల భద్రత.. కోర్టుకు వెళ్లనున్న డిస్ట్రిబ్యూటర్లు!
లైగర్ మూవీ ఫ్లాప్‌తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చిక్కుల్లో పడ్డారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందింది. దీంతో ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన పూరీ ఆర్థికంగా భారీగా నష్టపోయారు. మరోవైపు లైగర్ వల్ల తాము ఆర్థికంగా నష్టపోయామని, పెట్టన డబ్బులో కోంతభాగం వెనక్కి ఇవ్వాలంటూ పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పూరీని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పూరీ సమయంలో కోరడంతో వారు బెదిరింపులకు పాల్పడుతున్నారు. చదవండి: నిజమే పూరీ పెద్ద మోసగాడు.. పరువు తీసేద్దాం పదండి!: లేఖ వైరల్ దీంతో బుధవారం పూరీ పోలీసులను ఆశ్రయించారు. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్ల ద్వారా తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు వారినుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డిస్ట్రిబ్యూటర్లు తన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందని, ముందస్తు భద్రత కల్పించాలని ఆయన ఫిర్యాదు కోరారు. ఈ మేరకు పోలీసులు పూరీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. గురువారం ఆయన ఇంటి వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. చదవండి: పెద్దింటి కోడలు కాబోతున్న యంగ్ హీరోయిన్ వర్ష! కాగా గత ఆగస్ట్ 25న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ మూవీ ఘోర పరాజయం పొందింది. నైజాం డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ వరంగల్ శీను, శోభన్ బాబులు నష్టపోయిన డబ్బులు తిరిగి చెల్లించాలని పూరీపై ఒత్తిడి పెంచారు. సుమారు రూ.8 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, వాటిని తిరిగి ఇప్పించాలంటూ పూరీకి లేఖలు రాశారు. ఈ విషయమై పూరీ మాట్లాడిన ఓ ఆడియో ఫైల్ రెండు రోజుల క్రితం వైరల్ అయింది. ఈ నెల 27న వారంతా తన ఇంటి ముందు ధర్నా చేయబోతున్నారని, తన పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారంటూ పూరీ వాపోయారు. అయితే ఈ విషయమైన డిస్ట్రిబ్యూటర్లు కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
నిజమే పూరీ పెద్ద మోసగాడు.. పరువు తీసేద్దాం పదండి!: అతడి లేఖ వైరల్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొద్ది రోజులుగా వారల్లో నిలుస్తున్నాడు. ఇటీవల లైగర్ మూవీ డిస్ట్రిబ్యూటర్‌తో ఆయన మాట్లాడిన ఆడియో కాల్ చర్చనీయాంశమైంది. ఇటీవల ఆయన భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన లైగర్ మూవీ బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. లైగర్ ఫ్లాప్‌తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. అయితే ఈ సినిమాకు పూరీ కూడా ఓ నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. లైగర్ ఫ్లాప్‌తో తమకు కొంత డబ్బు వెనక్కి ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్ పూరీని డిమాండ్ చేశారు. అయితే దీనికి అయినా కొంత గడువు అడిగినప్పటికీ కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఆయన ఆఫీసు ముందు ధర్నా చేసేందుకు సిద్ధపడ్డారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న జెర్సీ నటుడు, చెన్నైలో నేడు గ్రాండ్ వెడ్డింగ్ దీంతో తన పరువు తీసే ప్రయత్నాలు చేస్తే అసలు డబ్బు ఇవ్వనంటూ పూరీ వారిని వారించిన ఆడియో ఈమధ్య బయటకు వచ్చింది. దీంతో పూరీ పరువు తీసేందుకు కావాలనే ఈ ఆడియోను లీక్ చేశారని, కొంతమంది పని గట్టుకునిన ఆయనను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిని ఉద్దేశిస్తూ పూరీ ఫ్యాన్ ఒకరు బహిరంగ లేఖ రాశారు. అవును డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నిజంగా ఓ మోసగాడు. పరువు తీసేద్దాం పదండి! అంటూ అతడు ఫేస్బుక్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందులో అతడు డైరెక్టర్ పూరీ గురించి ఈ లొల్లి ఏందో నాకేం అర్థం కావట్లా..! పూరీ ఫ్యాన్‌గా కాదు. సాదాసీదా ఆడియన్‌గా సూటిగా అడుగుతున్నా సమాధానం చెప్పండి! ‘‘అవును డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. నిజంగా ఓ మోసగాడు. పరువు తీసేద్దాం పదండి! ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్.. మైల్ స్టోన్స్ లాంటి సినిమాలను ఇచ్చి.. ఇప్పుడు ఇలాంటి కుట్రల మధ్య నలిగిపోతున్నందుకు ఖచ్చితంగా పరువు తీసేయాలి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ, ఒక్కో మార్క్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కదా.. మోసగాడు అనే ముద్ర తప్పకుండా వేయాల్సిందే. దర్శకుడిగా, నిర్మాతగా తాను వందల కోట్లు నష్టపోయినా.. ఎప్పుడూ ఎవరి పేర్లు బయట పెట్టనందుకు, ఎవరినీ బాధ్యులను చేయకుండా పల్లెత్తు మాట కూడా అనకుండా ఉన్నందుకు పక్కాగా కుటుంబంతో సహా రోడ్డుకు లాగాలి. చదవండి: ఫ్యాన్స్‌తో తమన్నా మాస్ డాన్స్, వీడియో వైరల్ అవును.. తాను సమాజంలో పరువుగా బ్రతకాలని అనుకుని.. ఇన్నాళ్లు ఎవరి పరువు తీయకుండా ఉన్నందుకు బుద్దొచ్చేలా పరువు తీయాలి. తనను ఎంతోమంది మోసగించినా.. ఎన్ని ప్లాప్స్ వచ్చినా.. బ్లాక్ బస్టర్స్ తో బౌన్స్ బ్యాక్ అయ్యే డాషింగ్ డైరెక్టర్ ని ఇలాగే పరువు తీసి సత్కరించాలి’’ అంటూ తన లేఖలో రాసుకొచ్చాడు. పూరీకి మద్దతు తెలుపుతూ ఆయన పురువు తీయాలని చూసేవారిపై అసహనం వెల్లగక్కుతు ఈ సందర్భంగా అతడు ఒపెన్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే తనకు, తన కుటుంబానికి డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్ల ద్వారా ప్రాణహాని ఉందంటూ ఇటీవల ఆయన జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
'నా కుటుంబం ఆపదలో ఉంది'.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో పూరి ఫిర్యాదు
జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ పోలీసులను ఆశ్రయించారు. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై, తన కుటుంబంపై హింసకు పాల్పడేలా వీరు ఇతరులను ప్రేరేపిస్తున్నట్లు కంప్లైంట్లో పేర్కొన్నారు. వారి నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని పూరి జగన్నాధ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ పూరి జగన్నాథ్‌కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. భారీ స్థాయిలో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ తమకు కొంత డబ్బు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీని కోసం పూరి ఒక నెల రోజులు గడువు కోరినప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం దర్శకుడి ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన పూరి జగన్నాథ్ తన పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు. ఈమేరకు ఓ ఆడియోకాల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా పూరి జగన్నాధ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదురుతోంది. #Liger : Producer-Director #PuriJagannath Complains to Poloce Authorities that his Distributors are trying to instigate violence! pic.twitter.com/POxsnGsbdk — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 26, 2022 -
లైగర్ వివాదం.. పూరీ డబ్బులివ్వాల్సిన పని లేదు: తమ్మారెడ్డి
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ పూరీ జగన్నాథ్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే! భారీ స్థాయిలో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ తమకు కొంత డబ్బు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు పూరీ ఒక నెల రోజులు గడువు కోరినప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం పూరీ ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ విషయం తెలిసిన పూరీ జగన్నాథ్ తన పరువు తీయాలని ప్రయత్నిస్తే ఒక్క పైసా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు. ఈమేరకు ఓ ఆడియోకాల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించాడు. 'పూరీ జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. లైగర్ హక్కులు కొనమని వాళ్ల ఇంటికి వెళ్లి అడిగాడా? లేదు కదా! కొనుక్కునేవాడిదే తప్పు. అంతకుముందు విజయ్ దేవరకొండ నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు అంత పెద్ద మొత్తానికి కొనడం ఎందుకు? నష్టాలు వచ్చాయని డబ్బులు డిమాండ్ చేయడం ఎందుకు? లాభాలొస్తాయని పెద్ద సినిమాలు కొన్నప్పుడు నష్టం వచ్చినా భరించాలి' అని చెప్పుకొచ్చాడు. చదవండి: సినిమా చూడమని ఇంటింటికీ వెళ్లి అడుక్కోవాలా? అమ్మ ఆరోగ్యానికి రిస్క్ అని తెలిసినా నాన్న లెక్కచేయలేదు: శ్రీదేవి కూతురు -
పూరీ జగన్నాథ్‌కు బ్లాక్మెయిల్.. సంచలనంగా ఆడియో లీక్
-
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూరి జగన్నాథ్ ఆడియో
-
పూరీ జగన్నాథ్‌కు బ్లాక్మెయిల్.. సంచలనంగా ఆడియో లీక్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా పూరీ జగన్నాథ్‌కు, బయ్యర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే ఎంతో కొంత నష్టాన్ని పూడ్చేందుకు తాను ప్రయత్నిస్తానన్నాడు పూరీ. కానీ ఇంతవరకు ఆ డబ్బు అందకపోవడంతో బయ్యర్లు ధర్నాకు దిగుతామని బ్లాక్మెయిల్ చేస్తున్నారట. ఈ విషయంపై పూరీ మాట్లాడిన ఆడియో కాల్ లీకైంది. 'ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ తిరిగి డబ్బివ్వాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకిస్తున్నాను? పాపం, వాళ్లు కూడా నష్టపోయారులే అని! ఇదివరకే బయ్యర్లతో మాట్లాడాను. ఒక అమౌంట్ ఇస్తానన్నాను, వాళ్లూ ఒప్పుకున్నారు. కాకపోతే ఒక నెల రోజులు గడువు అడిగాను. ఇస్తానని చెప్పాక కూడా ఇలా ఓవరాక్షన్ చేస్తే అసలివ్వబుద్ధి కాదు. పరువు కోసం డబ్బులిస్తున్నాం, నా పరువు తీయాలని చూస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. కొన్ని ఆడతాయి, కొన్ని పోతాయి. ఒకవేళ సినిమా హిట్ అయితే బయ్యర్స్ దగ్గర వసూలు చేయడానికి నానాపాట్లు పడాలి. పోకిరి దగ్గర నుంచి ఇస్మార్ట్ శంకర్ దాకా బయ్యర్స్ నుంచి నాకు రావాల్సిన డబ్బు ఎంతో ఉంది. బయ్యర్స్ అసోసియేషన్ అది నాకు వసూలు చేసి పెడుతుందా? లేదు కదా! ధర్నా చేస్తారా? చేయండి. ధర్నా చేసినవారికి తప్ప మిగతావాళ్లందరికీ డబ్బులిస్తాను' అని పూరీ కోపంతో శివాలెత్తిపోయాడు. ప్రస్తుతం ఈ ఆడియో లీక్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. చదవండి: హ్యాపీగా టాయ్‌లెట్స్ కడిగేవాడిని: నటుడు నేనెలా ఉన్నా అందగత్తెనే -
లైగర్ ఎఫెక్ట్... ఉప్పెన డైరెక్టర్ కథను రిజెక్ట్ చేసిన విజయ్?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం లైగర్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఫలితంగా విజయ్ చేయబోయే తర్వాతి ప్రాజెక్ట్స్‌పై కూడా ఈ ప్రభావం గట్టిగానే పడింది. లైగర్ ఫ్లాప్ తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడట ఈ రౌడీ బాయ్. దీంతో ఎంత పెద్ద దర్శకుడైనా సరే కథ నచ్చితే తప్పా సైన్ చేయకూడదని విజయ్ ఫిక్స్ అయ్యాడట. ఈ కారణంగానే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన కథకు కూడా విజయ్ నో చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. కథలో కొన్ని లోపాలు ఉండటంతో సున్నితంగా ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించాడట విజయ్. మరి విజయ్ఘే డైరెక్టర్‌కి ఛాన్స్ ఇవ్వనున్నారో త్వరలోనే తెలియనుంది. -
లైగర్ ఫ్లాప్‌పై తొలిసారి స్పందించిన పూరీ
-
లైగర్ ఫ్లాప్‌పై తొలిసారి స్పందించిన పూరీ, ఏమన్నాడంటే
విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్చించిన చిత్రం లైగర్. పాన్ ఇండియా మూవీగా రూపొందిన లైగర్ భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా పడింది. దీంతో ఈ మూవీ నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లైగర్ నష్టాలను మిగిల్చింది. ఇదిలా ఉంటే విడుదలకు ముందు బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన పూరీ విడుదల అనంతరం సినిమా గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. చదవండి: ‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి మూవీ పరాజయంపై ఇంతవరకు ఆయన నేరుగా స్పందించింది లేదు. ఈ నేపథ్యంలో చిరుతో ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్‌లో పాల్గొన్న పూరీ ఈ సందర్భంగా లైగర్ ఫ్లాప్‌పై స్పందించాడు. కాగా గాడ్ ఫాదర్ బ్లాక్‌బస్టర్ హిట్ నేపథ్యంలో పూరీ జగన్నాథ్-చిరంజీవి ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్ ద్వారా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో చిరు, పూరీని ఇలా ప్రశ్నించాడు. పూరీ మీరు అనుకున్న రిజల్ట్ రాకపోతో ఎలా తీసుకుంటారు? అని అడగ్గా.. ‘దెబ్బ తగినప్పుడు హీలింగ్ టైమ్ ఉంటుంది చూశారా.. అది తక్కువగా పెట్టుకోవాలి. ఆస్తులు పోవచ్చు లేదా యుద్ధాలు జరగోచ్చు ఏం జరిగినా హీలింగ్ టైమ్ నెలకు మించి ఉండకూడదు. ఒక నెలలో వేరే పనిలో పడిపోవాలి అంతే. కొన్నిసార్లు నమ్మిన వాళ్లు కూడా ఫ్లిప్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు’ అన్నాడు. చదవండి: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్‌లుక్ రిలీజ్ అనంతరం ‘నేను లైగర్ సినిమా తీశాను. మూడేళ్లు సినిమాకి పనిచేస్తూ ఎంతో ఎంజాయ్ చేశాను. మంచి సెట్స్ వేశాం. కాస్ట్ అండ్ క్రూ, మైక్ టైసన్ ఇలా అంతా ఎంతో ఆనందంగా చేశాం. కానీ, సినిమా ఫ్లాప్ అయ్యింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా రిజల్ట్ కోసం ఆదివారం వరకు వేచి చూశా. ఆ తర్వాత మూవీ ప్లాప్ అని అర్థమైంది. ఆ మరుసటి రోజు సోమవారం జిమ్‌కు వెళ్లి 100 స్క్వాడ్స్ చేశా. ఒత్తిడి మొత్తం పోయింది. నా జీవితం నేను బాధగా ఉన్న రోజుల కంటే నవ్వుతూ ఉన్న రోజులే ఎక్కువ’ అంటూ పూరీ సమాధానం ఇచ్చాడు. ఇక ప్రస్తుతం తాను ముంబైలో కొత్త కథలు రాసే పనిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. కాగా గాడ్ ఫాదర్లో పూరీ జర్నలిస్ట్‌గా కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. -
లైగర్ తర్వాత ఛార్మి ట్వీట్.. పూరికి స్పెషల్ విషెస్ చెబుతూ..!
దర్శకుడు పూరి జగన్నాధ్ బర్త్‌డే సందర్భంగా సినీనటి ఛార్మి ప్రత్యేకంగా విష్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పూరి ఫోటోను షేర్ చేస్తూ 'ఎటర్నల్' అంటూ ఎమోజీని జత చేశారు. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'లైగర్' బాక్సాఫీస్ ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాకు కొద్ది రోజులు స్పల్ప విరామం ప్రకటించారు. తాజాగా పూరి బర్త్‌డే సందర్భంగా ఛార్మి ట్వీట్ చేయడంతో వైరలవుతోంది. లైగర్ తర్వాత వెంటనే జనగణమన ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ సినిమాపై ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ చిత్రం షూటింగ్ ఆపేసినట్లు సోషల్ మీడియాలో చాలా రూమర్లు వచ్చాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైంది. తాజాగా సైమా వేడుకలకు హాజరైన విజయ్‌ని అక్కడి మీడియా ‘జనగణమన’పై ప్రశ్నించగా.. ‘అవన్ని ఇప్పుడెందుకు? ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి జగణమన గురించి మర్చిపోండి. సైమా వేడుకను ఎంజాయ్ చేయండి’అని రౌడీ హీరో సమాధానం ఇచ్చాడు. దీంతో నిజంగానే జగగణమన ఆగిపోయిందని, అందుకే ఆ చిత్రంపై స్పందించడానికి విజయ్ ఇష్టపడడంలేదని నెటిజన్స్ కామెంట్ చేశారు. 𝐄𝐓𝐄𝐑𝐍𝐀𝐋 ☺️#HBDPuriJagannadh @PuriConnects pic.twitter.com/lh7UyGn2tv — Charmme Kaur (@Charmmeofficial) September 28, 2022 -
ఓటీటీలోకి వచ్చేసిన లైగర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. ఇప్పుడు లైగర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈరోజు(సెప్టెంబర్22)నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. కథేంటంటే..తల్లి కల కోసం కరీంనగర్ నుంచి ముంబై చేరిన ఒక సాదా సీదా కుర్రాడు ఇంటర్నేషనల్ ఎంఎంఏ ఫైటర్ అయిన ఒక ఇన్స్పిరేషన్ ఈ చిత్రం. పు పాన్ ఇండియా సినిమాగా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ చిత్రం ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ కథ, సంభాషణలు, ప్రతి పాత్ర తీర్చిదిద్దిన పధ్ధతి, సంగీతం, విజయ్ దేవరకొండ నటన.. అన్నిటినీ ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు.సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్, లవ్ అన్నీ సమపాళ్లలో కలిసిన ఈ సినిమా చూడడం కుటుంబం మొత్తానికి ఒక పెద్ద రిలీఫ్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా "లైగర్". డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రమే. "లైగర్" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/3dywSjk -
ఫ్లాప్ ఎఫెక్ట్.. అప్పుడే ఓటీటీకి లైగర్, ఆ రోజు నుంచి అక్కడ స్ట్రీమింగ్!
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటిగా లైగర్ నిలుస్తుందనుకు మూవీ టీం అంచనాలను తలకిందులు చేసింది. ఫలితంగా ఈ చిత్రం ఘోరపరాజయం పొందింది. మైక్ టైసన్ వంటి ప్రపంచ చాంపియన్ ఉన్నా కంటెంట్ లేకుంటే థియేరట్లకు జనాలు రారని లైగర్ మరోసారి నిరూపించింది. చదవండి: నా పాటంటేనా? నేను బాగుంటానని ఇష్టపడుతున్నారా?: సునీత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చింది. ఇదిలా ఉంటే ఏ చిత్రమైన థియేట్రికల్ రిలీజ్ అనంతరం రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. అలాగే లైగర్ కూడా ఓటీటీలోకి రాబోతోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించి ఉంటే ఓటీటీకి వచ్చేందుకు కనీసం రెండు నుంచి మూడు నెలలు పట్టేది. ఇటీవల వచ్చిన చిన్న సినిమా రేంజ్‌ను కూడా ఈ మూవీ దాటలేకపోయింది. దీంతో అనుకున్న సమయాని కంటే ముందే లైగర్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. చదవండి: రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ కాగా లైగర్ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 22 నుంచి లైగర్‌ను స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్-పూరీ కనెక్ట్స్‌పై బాలీవుడ్ నిర్మాత కరన్ జోహార్-చార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ అతిథి పాత్రలో కనిపించారు. -
లైగర్ హీరోయిన్‌తో బ్రేకప్‌పై స్పందించిన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే- షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ విడిపోయినట్లు బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఖాళీ పీలి సినిమా నుంచి మొదలైన వారి డేటింగ్ జర్నీ ముగిసినట్లు తెలుస్తుంది. గతంలో పార్టీలకు, ఫంక్షన్లకు, ట్రిప్పులకు, టూర్లకు కలిసి వెళ్తూ హడావుడి చేసిన జంట తాజాగా బ్రేకప్ చెప్పేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఇదే విషయాన్ని అనన్య పాండే ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ ఇషాన్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా కత్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఇషాన్ ఖట్టర్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అనన్యతో నువ్వు విడిపోయావు కదా అని కరణ్ ప్రశ్నించగా ప్రస్తుతానికి తాను సింగిల్ అని పేర్కొన్నాడు. మరిప్పుడు అనన్యతో స్నేహంగా ఉంటున్నారా అని అడగ్గా నా జీవితాంతం ఆమెకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నా. నాకు తెలిసిన వాళ్లలో మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అనన్య అని చెప్పాడు. -
‘లైగర్’ ఎఫెక్ట్.. రెంట్ కట్టలేక ఆ ఫ్లాట్ ఖాళీ చేసిన పూరి జగన్నాథ్
లైగర్ ఫ్లాప్‌తో మరోసారి పూరి జగన్నాథ్ కష్టాల్లో పడ్డాడని తెలుస్తోంది. మాస్, డాషింగ్ డైరెక్టర్ చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న పూరి ఆ మధ్యలో వరుస ఫ్లాపులతో అప్పుల పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తిరిగి తన కెరీర్‌ను గాడిన పెట్టుకున్నాడు. అదే జోష్‌తో లైగర్ చిత్రాన్ని అంత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆశపడ్డ మూవీ టీం అంచనాలన్ని తలకిందులయ్యాయి. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లైగర్ భారీ నష్టాలను మిగిల్చింది. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్? వరుడు ఎవరంటే.. దీంతో బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఈ చిత్ర నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారట. ఇక మూవీని కరణ్ జోహార్‌తో కలిసి పూరీ, చార్మీలు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు లైగర్ చిత్రీకరణ అంతా ముంబైలోనే జరిగింది. ఈ నేపథ్యంలో ముంబైలో ఓ విలసవంతమైన ప్లాట్‌ను తీసుకున్న పూరి ఇప్పుడు రెంట్ కట్టలేక దాన్ని ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. మూవీ షూటింగ్, ప్రమోషన్స్‌లో భాగంగా గతేడాది పూరీ ముంబైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ముంబైలో ఓ విలాసవంతమైన సీ ఫేసింగ్ 4 బిహెచ్కే ఫ్లాట్‌ను రూ. 10 లక్షలకు అద్దెకు తీసుకున్నాడట. మెయింటనెన్స్ ఖర్చులు కలుపుకుని దాదాపు రూ. 15 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. చదవండి: రణ్‌బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత ఇక లైగర్ డిజాస్టర్‌తో ఇప్పుడు ఆ రెంట్ కట్టేలేని పరిస్థితులో పూరి ఉన్నాడని, అందువల్లే ఈ ఫ్లాట్‌ను ఖాళీ చేశాడని తెలుస్తోంది. అదే లైగర్ హిట్ అయ్యి ఉంటే పూరి రేంజ్ ఒక్కసారిగా మారిపోయేది. ఆశించినట్లు ఈ మూవీ విజయం సాధించి ఉంటే ఆయన కోసం బాలీవుడ్ అగ్ర హీరోలు, నిర్మాతలు క్యూ కట్టి ఉండేవారు. పూరి కూడా ఈ ఉద్దేశంతోనే ముంబైకి మకాం మార్చాడని సన్నిహితుల నుంచి సమాచారం. లైగర్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని, అదే జరిగితే ఇక తాను ముంబైలోనే సెటిల్ అవ్యొచ్చనే ఉద్దేశంతో వెతికి మరి పూరి ఆ విలాసవంతమైన ఫ్లాట్‌ను ఎంతో ఇష్టంగా తీసుకున్నాడట. దాదాపు రూ. 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లైగర్ చిత్రం తొలి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో మొత్తం ఇప్పటి వరకు లైగర్ రూ. 58 నుంచి 60 కోట్లు మాత్రమే వసూలు చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. Rumours Suggest Director #PuriJagannadh Has Been Forced To Vacate His Posh Mumbai Sea-Facing Flat After #Liger Failed At The #BoxOffice@purijaganhttps://t.co/zqPfGmWWTb — Box Office Worldwide (@BOWorldwide) September 8, 2022 -
‘లైగర్’ ఫ్లాప్.. చార్మీ షాకింగ్ నిర్ణయం
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటిగా లైగర్ నిలుస్తుందని అంతా భావించినా అందుకు భిన్నంగా డిజాస్టర్ టాక్ని మూటగట్టుకుంది. మైక్ టైసన్ వంటి ప్రపంచ చాంపియన్ ఉన్నా కంటెంట్ లేకుంటే థియేరట్లకు జనాలు రారని లైగర్ మరోసారి నిరూపించింది. ఫలితంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చిందంటున్నారు సినీ విశ్లేషకులు. చదవండి: నిర్మాతతో టీవీ నటి రెండో పెళ్లి, కొత్త జంటపై దారుణమైన ట్రోల్స్ ఇక లైగర్ ఫలితం అనంతరం చార్మీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఆమె ట్వీట్ చేస్తూ ట్రోలర్స్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. తాను సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘చిల్ గాయ్స్. కాస్తా బ్రేక్ తీసుకుంటున్నా(సోషల్ మీడియాకు). పూరీ కనెక్ట్స్ త్వరలోనే మరింత దృఢంగా, మునుపటికి కంటే ఉత్తమంగా తిరిగి వస్తుంది. అప్పటి వరకు కాస్తా శాంతించండి అబ్బాయిలు’ అంటూ చార్మీ రాసుకొచ్చింది. ఇక చార్మీపై కొందరు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా లైగర్ ఫ్లాప్‌తో విజయ్‌తో పాటు పూరీ కనెక్ట్స్ నిర్మాతలైన చార్మీ, పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశించి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: వైరల్‌గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు! ప్రమోషన్స్‌లో విజయ్ ఓవరాక్షన్, నోటి దురుసు వల్లే ఈసినిమా ఫ్లాప్ అయ్యిందని, అతడిని నమ్ముకున్నందుకు పూరీ కనెక్ట్స్ పని అయిపోయిందంటూ సోషల్ మీడియా విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు చార్మీ, పూరీ కనెక్ట్స్‌ను ట్యాగ్ చేస్తూ సినిమా అసలు బాగోలేదని, విడుదలకు ముందు క్రియేట్ చేసిన హైప్ కథలోనే లేదని.. కథ, కథనం చాలా బలహీనంగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటి కారణంగానే ఆమె సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Chill guys! Just taking a break ( from social media )@PuriConnects will bounce back 😊 Bigger and Better... until then, Live and let Live ❤️ — Charmme Kaur (@Charmmeofficial) September 4, 2022 -
‘లైగర్’ ఫ్లాప్‌తో పారితోషికంలో భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్! ఎంతంటే..
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన లైగర్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అనుకున్నంత స్థాయిలో అందుకోలేకపోయింది. లైగర్ రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినప్పటికీ విడుదల తర్వాత సీన్ మారిపోయింది. తొలి షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో లైగర్ బాక్సాఫీస్ లెక్కలన్ని తలకిందులయ్యాయి. విడుదలకు ముందు ఈ మూవీ రూ. 200 కోట్లకుపైగా వసూలు చేస్తుందని ఆశపడ్డ విజయ్‌కి బాక్సాఫీసు ఫలితాలు షాకిచ్చాయి. చదవండి: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ! దీంతో రౌడీ హీరో ఆశలన్ని అడియాసలయ్యాయి. అన్ని భాషల్లోనూ ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో లైగర్ మూవీ నిర్మాతలకు పెద్ద ఎత్తున్న నష్టాలను మిగిల్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ సినిమాకు బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్, నటి చార్మీ కౌర్‌లు నిర్మాతలు కాగా.. పూరీ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించాడు. దీంతో లైగర్ పరాజయంతో పూరీ తన పారితోషికంతో పాటు లాభాల్లో వచ్చిన తన వాటాలో 70 శాతం వెనక్కి ఇచ్చాడని సమాచారం. ఇక హీరోగా చేసిన విజయ్ కూడా తన పారితోషికంలో కొంతభాగాన్ని వదులుకున్నాడని తెలుస్తోంది. చదవండి: శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాకి విజయ్ రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడని ఇప్పటికే వార్తలు వినిపించాయి. దీనితో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్‌లో విజయ్‌కి కూడా వాటా ఉందట. ఇప్పుడు ఆ వాటాను వద్దని పూరీ, చార్మీలకు చెప్పడమే కాకుండా.. తన పారితోషికంలో రూ. 6 కోట్లను విజయ్ వెనక్కి ఇచ్చేసినట్లు ఫిలిం దూనియాలో టాక్ వినిపిస్తోంది. ఇది తెలిసి విజయ్ నిర్ణయంపై అతడి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. నష్టాల్లో కూరుకుపోయిన నిర్మాతలను ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడంటూ విజయ్ అభిమానులు కాలర్ ఎగిరేస్తున్నారు. కాగా విజయ్ తన తదుపరి చిత్రం జన గణ మన కోసం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టాడు. ఈ మూవీకి కూడా పూరీ దర్శకత్వం వహిస్తుండగా.. చార్మీతో కలిసి నిర్మించనున్నాడు. -
'ఇండియాను షేక్ చేస్తా అన్నాడు.. ఫ్లాప్ చేశాడు'.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకోని రీతిలో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. రిలీజ్ అయిన తొలిరోజు నుంచి నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడిందీ సినిమా. దీంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండపై కొందరు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లైగర్ రిజల్ట్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. 'మన యాక్షన్‌ని బట్టే ప్రేక్షకుల రియాక్షన్ఉంటుంది. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయి. సినిమాను చూడండి అని ప్రమోట్ చేసుకోవాలి. నువ్వు చిటికెలు వేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. హీరోలు ఊరికే ఎగిరెగిరి పడటం మంచిది కాదు. అలాగే ఇష్టం వచ్చినట్లు ''ఊపేస్తాం.. తగలెడతాం.. అని స్టేట్మెంట్లు ఇస్తే ఇలాగే ప్రేక్షకులు మనల్ని తగలెడతారు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ సినిమా డిజాస్టర్‌కు కారణాలు ఏమై ఉంటాయి అని ప్రశ్నించగా.. ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. నేను పూరి జగన్నాథ్ అభిమానినే. కానీ లైగర్ ట్రైలర్ చూసినప్పుడే మూవీ చూడలనిపించలేదు. భవిష్యత్తులో కుదిరితే చూస్తా అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. -
'లైగర్' డిజాస్టర్‌పై స్పందించిన ఛార్మి
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటిగా లైగర్ నిలుస్తుందని అంతా భావించినా అందుకు భిన్నంగా డిజాస్టర్ టాక్ని మూటగట్టుకుంది. మైక్ టైసన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఉన్నా కంటెంట్ లేకుంటే థియేరట్లకు జనాలు రారని లైగర్ మరోసారి ప్రూవ్ చేసినట్లయ్యింది. ఫలితంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్‌పై నిర్మాత ఛార్మి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'జనాలు ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్‌తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూసే యాక్సిస్ ఉంది. కుటుంబం మొత్తం ఇంట్లోనే భారీ బడ్జెట్ సినిమాలు చూడగలరు. కాబట్టి సినిమాలు వారిని ఎగ్జైట్ చేయనంత వరకు థియేటర్లకు రావడానికి వాళ్లు ఇష్టపడటం లేదు. తెలుగులో ఇటీవల బింబిసార, సీతారామం, కార్తికేయ 2 వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. సుమారు రూ 150 కోట్ల నుంచి రూ. 170కోట్ల వరకు వసూలు చేశాయి. కానీ బాలీవుడ్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2019నుంచి లైగర్ కోసం కష్టపడ్డాం. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత లైగర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ఎన్నో అడ్డంకులను దాటి థియేటర్లో విడుదల చేశాం. కానీ సినిమా ఫెయిల్యూర్ అవడం బాధగా అనిపిస్తుంది' అంటూ ఛార్మి ఆవేదన వ్యక్తం చేసింది. -
అనకొండ, తలపొగరు అంటూ తిట్టిన వ్యక్తిని కలిసిన రౌడీ హీరో, ఫొటో వైరల్
'యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఒళ్లంతా పొగరు. లైగర్ ప్రమోషన్స్‌లో యాటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడాడు. అతడి చేష్టల వల్ల మేము నష్టపోయాం. అతడు కొండ కాదు అనకొండ.. అంటూ నానామాటలు అన్నాడు ప్రముఖ మల్టీప్లెక్స్, థియేటర్ మరాఠా మందిర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్. అయినా రౌడీ హీరో ఇవేమీ పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. తాజాగా అతడు ముంబైకి వెళ్లి మనోజ్ దేశాయ్‌ను కలిసి తాను ఏం మాట్లాడాడో వివరించాడు. అతడితో మాట్లాడిన తర్వాత మనోజ్ తన విమర్శలు తప్పని తెలుసుకుని హీరోకు సారీ చెప్పాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'విజయ్ దేవరకొండ మాట్లాడిన దాంట్లో చిన్న బిట్ మాత్రమే నాకు ఎవరో పంపారు. అది చూసి నేను అతన్ని విమర్శించాను. విజయ్ నన్ను కలిసి తానేం మాట్లాడాడో పూర్తి వీడియో చూపించాడు. అతనిపై అనవసరంగా విమర్శలు చేశానని సారీ చెప్పాను. అతని లైగర్ సినిమాకు వసూళ్లు బాగున్నాయి. ఇలాగే కష్టపడి కెరీర్లో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా' అన్నారు. ఇక వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో రౌడీ హీరో ముఖంలో మనోజ్.. తనను తిట్టాడన్న కోపం మచ్చుకైనా కనిపించడం లేదు. మనస్పర్థలను తొలగించేందుకు విజయ్ ఇలా కలిశాడని ఒక అభిమాని అభిప్రాయపడగా.. మరొకరు మాత్రం ఇదంతా పెద్ద డ్రామాలా కనిపిస్తోంది అని కామెంట్ చేశారు. కాగా బాలీవుడ్లో రిలీజవుతున్న పెద్ద సినిమాలకు బాయ్‌కాట్ సెగ తగులుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే లాల్‌సింగ్ చడ్డా, రక్షా బంధన్ అట్టర్ ఫ్లాప్ అవ్వగా తాజాగా విజయ్ బాలీవుడ్ డెబ్యూ మూవీ లైగర్ కూడా ఆ జాబితాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: చక్కటి ప్రేమకావ్యం.. ‘సీతారామం’పై చిరు ప్రశంసలు ఆచార్య ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న కొరటాల, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ! -
మైక్ టైసన్ నన్ను బూతులు తిట్టాడు, బయటికి చెప్పలేను: విజయ్
విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'లైగర్'. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. రిలీజ్ అయిన మొదటిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. కథలో లోపాలున్నా విజయ్ నటనకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అతని రెండేళ్ల కష్టం ప్రతి ఫ్రేములో కనిపిస్తుందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో గెస్ట్ రోల్లో నటించిన మైక్ టైసన్ గురించి విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో మైక్ టైసన్ తనను చాలా సందర్భాల్లో తిట్టాడని, ఆ బూతుల్ని తాను చెప్పాలనుకోవట్లేదని తెలిపాడు. అయితే అవన్నీ టైసన్ కేవలం ప్రేమతోనే అన్నాడని చెప్పుకొచ్చాడు. 'ఇండియా అంటే ఆయనకు ఎంతో గౌరవం. ఇక్కడి ఆహారం, మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తాడు. కానీ పెద్ద సంఖ్యలో జనాల్ని చూస్తే మాత్రం భయపడతాడు. ఓసారి ఆయన ఇండియాకు వచ్చిన క్రమంలో ఆయన్ని చూడటానికి గుంపులుగా వచ్చిన జనాల్ని చూసి హోటల్ నుంచి బయటికి కూడా రాలేదు' అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. -
షాకింగ్.. 'లైగర్' చెత్త రికార్డ్.. రేటింగ్‌లో మరీ ఇంత తక్కువా?
విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ఇండియా చిత్రం 'లైగర్'. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైందనే చెప్పొచ్చు. విడుదలైన రోజు నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న లైగర్ చిత్రానికి ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ సంస్థ(ఐఎండీబీ)అత్యల్ప రేటింగ్‌ను ఇచ్చింది.10కి కేవలం 1.7 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఇక ఈ రేటింగ్ ఇటీవల లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ చిత్రాల కంటే తక్కువ అని తెలుస్తోంది.చదవండి: లైగర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!.. ఎప్పుడంటే అమీర్ ఖాన్ కెరీర్లోనే అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచిన లాల్ సింగ్ చడ్డాకు ఐఎండీబీ రేటింగ్ 5 ఇవ్వగా.. లైగర్‌కు మాత్రం 1.7 ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అక్షయ్ కుమార్ రక్షా బంధన్ చిత్రానికి 4.6, దొబారా 2.9. రణ్‌బీర్ కపూర్ 4.9తో పోలిస్తే లైగర్‌కు మాత్రం అత్యంత దారుణంగా 1.7రేటింగ్ ఇచ్చారు. ఇక ఈ వీకెండ్ రోజుల్లో కలెక్షన్స్ అనుకున్నట్టుగా రాబట్టకపోతే మూవీ డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. చదవండి: 'తలకిందులైంది.. లైగర్ రిజల్ట్ చూసి విజయ్ ఏం చేశాడో తెలుసా? -
లైగర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!.. ఎప్పుడంటే
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ+ హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఓటీటీ రైట్స్‌ను దాదాపు 85 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది.సినిమా రిలీజ్‌కు ముందే ఈ డీల్ కుదుర్చుకుంది.సాధారణంగా కొత్త సినిమాలు 50రోజుల తర్వాతే ఓటీటీలోకి రానున్నాయి. దీన్ని బట్టి అక్టోబర్ తొలివారంలో లైగర్ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: లైగర్ రిజల్ట్ తర్వాత విజయ్ ఏం చేశాడో తెలుసా? -
'తలకిందులైంది.. లైగర్ రిజల్ట్ చూసి విజయ్ ఏం చేశాడో తెలుసా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లైగర్. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన లైగర్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అనుకున్నంత స్థాయిలో అందుకోలేకపోయింది. లైగర్ రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినప్పటికీ విడుదల తర్వాత సీన్ మారిపోయింది. నెగిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. దీంతో రౌడీ హీరో ఆశలు అడియాసలయ్యాయి. అయితే సినిమా ఫలితం పక్కనపెడితే విజయ్ దేవరకొండ యాక్టింగ్‌కి మాత్రం ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అతడి కష్టమంతా సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా లైగర్ రిలీజ్ అయిన ఒకరోజు తర్వాత విజయ్ దేవరకొండ మళ్లీ యాక్షన్‌లోకి దిగాడు. సినిమా రిజల్ట్‌ని పట్టించుకోకుండా తన పనుల్లో నిమగ్నమయ్యాడు. జిమ్‌లో ఉత్సాహంగా కసరత్తులు చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. వందశాతం మనం ప్రయత్నం చేసినా ఫలితం మన చేతుల్లో ఉండదని విజయ్‌కి సపోర్ట్ చేస్తూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Just a day after #Liger’s release, #VijayDeverakonda is back in action again. @TheDeverakonda sweating it out with his fitness regime. This man never stops.🔥 pic.twitter.com/qeh902naNb — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 26, 2022 -
విజయ్ తలపొగరు వల్ల మేము నష్టపోయాం: థియేటర్ యజమాని ఫైర్
లైగర్ మూవీతో బాలీవుడ్లో గ్రాండ్‌గా లాంచ్ అవుదామనుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రమోషన్స్‌లో భాగంగా దేశంలోని ప్రధానమైన పదిహేడు నగరాలను తిరిగాడు. తీరా సినిమా రిలీజయ్యాక లైగర్ టాక్ మరోలా ఉంది. దీంతో రౌడీ హీరో ఆశలు అడియాసలయ్యాయి. అతడు పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరయింది. సినిమా రిలీజ్‌కు ముందు అతడు చేసిన కామెంట్లు కూడా ఈ వైఫల్యానికి కారణమేనంటున్నాడో థియేటర్ యజమాని. తాజాగా ముంబైలోని ఓ థియేటర్ యజమాని మనోజ్ దేశాయ్.. విజయ్‌పై ఫైర్ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'మా సినిమాను బాయ్‌కాట్ చేసుకోండి అని చెప్పి తెలివిని ప్రదర్శించాననుకుంటున్నావా? కనీసం ఓటీటీలో కూడా సినిమా చూడరు. నీ ప్రవర్తన వల్ల మేము నష్టపోతున్నాం, అడ్వాన్స్ బుకింగ్స్‌పై కూడా దాని ఎఫెక్ట్ పడింది. మిస్టర్ విజయ్.. నువ్వు కొండవి కాదు అనకొండవి. అనకొండలాగే మాట్లాడావు. వినాశకాలే విపరీతబుద్ధి అంటారు. అయినా నాశనమయ్యే సమయం దగ్గరపడ్డప్పుడు నోటినుంచి ఇలాంటి మాటలే వస్తాయి, నువ్వు అలాగే మాట్లాడావు కూడా! అయినా అది నీ ఇష్టం. విజయ్, నువ్వు చాలా అహంకారివి. నచ్చితే చూడండి, ఇష్టం లేకపోతే అసలు చూడకండి అన్న మాటలు ఎంత చేటు తెచ్చాయో నీకింకా అర్థం కావడం లేదా? ఆమిర్ ఖాన్, తాప్సీ, అక్షయ్ కుమార్ సినిమాలు ఎలా కొట్టుకుపోయాయో చూడలేదా? లైగర్ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడటం వల్ల చాలా నష్టం జరిగిపోయింది' అని చెప్పుకొచ్చాడు. #VijayDeverakonda Your hard work will pay off 💪💪 This is for sure ✊✊✊✊@TheDeverakonda pic.twitter.com/AgTx96TeOQ — rowdy (@rowdy000001) August 26, 2022 చదవండి: లైగర్ ఫ్లాప్‌తో బాధలో విజయ్, కాలర్ ఎగరేసే రోజులొస్తాయంటున్న ఫ్యాన్స్ హృతిక్.. కంగనా ప్రైవేట్ ఫొటోలు చూపించాడు -
‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న(ఆగస్టు 25న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందు చేసిన ప్రచార కార్యక్రమాలు, పాటలు, ట్రైలర్‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. అయితే అదేక్కడ సినిమాలో కనిపించలేదని అంటున్నారు ప్రేక్షకులు. చదవండి: అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వార్, తగ్గేదే లే అంటున్న యాంకరమ్మ ఇక ఏదేమైన పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ క్రమంలో మూవీ బడ్జెట్, హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ లైగర్‌ను భారీ తారాగణంతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. లీడ్ రోల్స్‌తో పాటు లైగర్‌లో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్ నటి రమ్యకృష్ణ, మైక్ టైసన్‌ల పారితోషికంపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకు విజయ్ రూ. 35 కోట్లు తీసుకున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. చదవండి: ఒక్క సినిమాకే భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన ‘సీత’? అవాక్కవుతున్న నిర్మాతలు! ఈ రూమర్స్ ప్రకారం విజయ్ ఈ మూవీకి రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. ఇక విజయ్ తల్లిగా.. పవర్ఫుల్ మదర్‌గా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రమ్యకృష్ణ కోటీ రూపాయలు తీసుకోగా.. కోచ్‌గా కనిపించిన రోనిత్ రాయ్ రూ. 1.5 కోట్లు తీసుకున్నాడట. ఇక హీరోయిన్గా ఈ సినిమాలో అందాలు ఆరబోసిన అనన్య పాండే కూడా బాగానే చార్జ్ చేసిందట. ఈ సినిమాకు ఆమె రూ. 3 కోట్లు అందుకుందని సమాచారం. ఇక సినిమాకు హైలెట్ రోల్‌గా మొదటి నుంచి పేరు తెచ్చుకు మైక్ టైసన్ విజయ్ కంటే ఎక్కువగా రూ. 40 కోట్లు అందుకున్నాడని తెలుస్తోంది. -
థియేటర్ నుంచి బాధతో వెనుదిరిగిన విజయ్, వీడియో వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం లైగర్. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమాపై భారీగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో హీరో విజయ్ థియేటర్లో సినిమా చూసి బాధతో తిరిగి వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన రౌడీ ఫ్యాన్స్ మనసు చివుక్కుమంది. 'ఈ సినిమా కోసం బాడీని మార్చుకునేందుకు ఎన్నో కసరత్తులు చేశావు. యాక్టింగ్ చించేశావ్. సినిమాలో ఎక్కడా నీ జోష్ తగ్గలేదు. కానీ మంచి కథను సెలక్ట్ చేసుకోవడంలోనే తడబడ్డావు', 'అన్నా, నువ్వు బాధపడకు.. ఇప్పుడు నిన్ను విమర్శించిన నోళ్లే రేపు నీకు చప్పట్లు కొడతారు', 'మేము కాలర్ ఎగరేసేలా నీకు మంచి రోజులు వస్తాయ్' అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. Stay strong bro @TheDeverakonda 🥺oka Pan India movie fail aithey aa pain ela untundo maku telusu Come back more mass strong 💪#Liger #VijayDevarakonda pic.twitter.com/TRgiaQhssI — Dps Nayak 💔 (@NayakTweetz) August 26, 2022 చదవండి: సినిమా ఛాన్సులు రావేమోనని క్యాన్సర్ ఉందని చెప్పలేదు ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా? -
'లైగర్' సినిమా ఎమ్ఎంఏ ఫైట్.. క్రూరమైన క్రీడ నుంచి ఆదరణ దిశగా
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా సినిమా ''లైగర్'' ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా ఫలితం సంగతి పక్కనబెడితే.. ఈ సినిమా ఎంఎంఏ ఫైట్(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) నేపథ్యంలో తెరకెక్కింది. మన దేశంలో చాలా మంది ఎంఎంఏ అంటే తెలిసి ఉండకపోవచ్చు. మార్షల్ ఆర్ట్స్ తెలిసినవాళ్లకు మాత్రమే ఈ క్రీడపై కాస్త అవగాహన ఉంటుంది. చాలా మందికి తెలియని ఎంఎంఏ క్రీడ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. -సాక్షి,డెబ్డెస్క్ photo credit : Getty Images ఎంఎంఏ ఫైట్(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) అనేది ఒక హైబ్రిడ్ యుద్ధ క్రీడ. బాక్సింగ్, రెజ్లింగ్, జడో, కరాటే, థాయ్ బాక్సింగ్ వంటి క్రీడల నుంచి తీసుకున్న కొన్ని టెక్నిక్స్‌తో ఎంఎంఏను రూపొందించారు. అయితే ఎంఎంఏ రూపొందించిన తొలి రోజుల్లో ఎలాంటి నిబంధనలు పెట్టకపోవడంతో అత్యంత క్రూరమైన క్రీడగా చాలా మంది పేర్కొన్నారు.కానీ కాలక్రమంలో ఎంఎంఏ ఆ చెడ్డ పేరు నుంచి బయటపడి ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షిస్తున్న క్రీడగా ఆదరణ పొందుతుండడం విశేషం. photo credit : Getty Images చరిత్ర తిరగేస్తే క్రీస్తూ పూర్వమే ఎంఎంఏ గేమ్‌ను ఒలింపిక్స్‌లో ఆడారని ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు. మనకు తెలిసి 20వ శతాబ్దంలో బ్రెజిల్ లోని వాలే ట్యూడో ద్వారా ఎంఎంఏ గేమ్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. కార్లో, హెలియో అనే ఇద్దరు సోదరులు నార్త్ అమెరికాలో ఈ గేమ్‌కు బాగా పాపులారిటీ తీసుకొచ్చారు. వాళ్లే ఈ టోర్నమెంట్ కు యూఎఫ్‌సీ(UFC)-అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ అని పేరు పెట్టారు.అయితే ఈ ఎంఎంఏ(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్)పై అమెరికా సహా చాలా దేశాల్లో ఆంక్షలు ఉన్నాయి. ఎంఎంఏ మ్యాచ్‌ల్లో విజయాలను సబ్మిషన్, నాకౌట్, టెక్నికల్ నాకౌట్, న్యాయనిర్ణేతల ద్వారా నిర్ణయిస్తుంటారు. photo credit : Getty Images ఎంఎంఏ ఆట.. కఠిన నిబంధలు ►దశ దిశ లేకుండా సాగుతున్న ఎంఎంఏ ఆటకు యూఎఫ్‌సీ(అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్) కొన్ని స్థిరమైన నిబంధనలు, రూల్స్ తీసుకొచ్చింది. ఆ నిబంధనలు, రూల్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం ►రింగ్‌లోకి వెళ్లే ఆటగాళ్లు ప్యాడ్స్ ఉన్న ఫింగర్‌లెస్ గ్లౌజులతోనే పోరాడాలి ►బూట్లు వేసుకోకూడదు.. తలకు ఎటుంటి సేఫ్‌గార్డ్స్ పెట్టుకోకూడదు. ►ప్రత్యర్థి ఆటగాడి కంట్లో పొడవడం, కొరకడం, జట్టు లాగడం, తలతో కొట్టడం వంటివి పూర్తిగా నిషేధం. photo credit : Getty Images ఎంఎంఏలో యూనిఫైడ్ రూల్స్ కింద ఒక్కో రౌండు ఐదు నిమిషాల చొప్పున మూడు రౌండ్లు పోరాడాల్సి ఉంటుంది. ఒక్కో రౌండు ముగిసిన తర్వాత ఒక నిమిషం విశ్రాంతినిస్తారు. అదే చాంపియన్‌షిప్ బౌట్స్‌లో ఐదు రౌండ్లు ఉంటాయి. ప్రత్యర్థిని నాకౌట్ చేయడం, సబ్మిషన్(ప్రత్యర్థిని ఓటమి ఒప్పుకునేలా చేయడం) ద్వారా గెలుపును నిర్ణయిస్తారు. ఒకవేళ ఇద్దరు ఆటగాళ్లు సమంగా పోరాడితే మాత్రం.. ఇద్దరిలో విజేత ఎవరనేది ప్యానెల్ నిర్ణయిస్తుంది. photo credit : Getty Images ఇక అమెరికాలోని నెవడా రాష్ట్రంలోని లాస్వేగాస్లో ఉన్న యూఎఫ్‌సీ ఎంఎంఏకు ప్రధాన సంస్థ. ప్రతీ ఏడాది వివిధ స్థాయిల్లో యూఎఫ్‌సీ ఎంఎంఏ విభాగంలో ఈవెంట్లు నిర్వహిస్తూ వస్తోంది. అందుకే విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా సెకండాఫ్ మొత్తం లాస్వేగాస్లో షూటింగ్ జరుపుకుంది. చదవండి: 'లైగర్' బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడిన మౌత్ టాక్ Stuart Broad: ముప్పతిప్పలు పెట్టి తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు.. -
Liger Movie: థియేటర్ వద్ద రచ్చ చేసిన పూరీ ఫ్యామిలీ
నర్సీపట్నం: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా రిలీజ్ కావడంతో నర్సీపట్నంలో అభిమానుల సందడి నెలకొంది. రాజు థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటింది. పూరీ జగన్నాథ్ సోదరుడు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పూరీ సతీమణి లావణ్య, కుమార్తె పవిత్ర, మిగతా కుటుంబ సభ్యులతో రాజు థియేటర్లో సినిమాను తిలకించారు. అభిమానులు భారీ ఎత్తున బాణసంచా పేల్చారు. సినిమా తిలకించిన అనంతరం థియేటర్ ఆవరణలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ఎమ్మెల్యే గణేష్, పూరీ సతీమణి లావణ్య, కుమార్తె పవిత్ర, ఎమ్మెల్యే సతీమణి కళావతి కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందనడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: (గణేష్ మండపం పెడుతున్నారా? ఈ అనుమతులు తప్పనిసరి) -
'లైగర్' ఫస్ట్‌డే కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ రావాలంటే అన్ని కోట్లు రావాల్సిందే!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల నడుమ నిన్న(గురువారం) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం అనుకున్నంతగా ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగానూ నిరాశపరిచింది. పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా తొలిరోజు రూ. 12కోట్ల షేర్‌ను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ నెగిటివ్ టాక్ కారణంగా ఆ టెర్గెట్ను లైగర్ అందుకోలేకపోయింది. తొలిరోజు తెలంగాణ, ఏపీలో కలిపి రూ. 9. 57కోట్ల షేర్ని మాత్రమే రాబట్టింది. తెలుగురాష్ట్రాల్లో కలెక్షన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి... నైజాంలో రూ. 4.2కోట్లు సీడెడ్‌లో రూ. 1.32కోట్లు వైజాగ్‌లో రూ. 1.30కోట్లు ఈస్ట్‌లో రూ.. 64లక్షలు వెస్ట్‌లో రూ. 39లక్షలు కృష్ణలో రూ. 48 లక్షలు గుంటూరులో రూ. 83లక్షలు నెల్లూరులో రూ. 40 లక్షల వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ అంచనాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ. 12 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా 15.40 కోట్ల గ్రాస్, రూ. 9.57కోట్ల షేర్‌ను రాబట్టింది. ఓవర్ సీస్ సహా వరల్డ్ వైడ్ గా లైగర్ సినిమా తొలి రోజు 33.12 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ రూ. 90కోట్లు ఉండగా, ఇంకా రూ.76.55 కోట్ల వసూళ్లు రావాల్సి ఉంది. -
లైగర్‌లో విజయ్‌కి నత్తి పెట్టడానికి కారణం బన్నీనే: పూరీ
ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ సినిమాల గురించి చర్చించుకుంటే ఎలా ఉంటుంది.. ఇక వారి ఫ్యాన్స్‌కి ఇదోక క్రేజీ న్యూసే కదా. అలా అభిమానులకు ఓ మంచి అనుభూతి అందించారు మన తెలుగు క్రేజీ డైరెక్టర్స్. నేడు(ఆగస్ట్ 25) లైగర్ మూవీ రిలీజ్ నేపథ్యంలో బుధవారం డాషింగ్ డైరెక్టర్ పూరీని ఇంటర్య్వూ చేశారు మన లెక్కల మాస్టర్ సుకుమార్. ఈ సందర్భంగా పూరీ దగ్గర తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశానని చెప్పారు సుక్కు. చదవండి: సౌందర్యతో ఎఫైర్.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన జగపతి బాబు ఈ నేపథ్యంలో పూరీ కథలు రాయడం, ఆయన అద్భుతమైన డైరెక్షన్ వెనక ఉన్న కృషి గురించి అడిగా సుకుమార్. కథ రాసేటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందో పూరీ వివరించారు. ఈ సందర్భంగా లైగర్‌లో విజయ్ దేవరకొండకు లోపం పెట్టడం వెనక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడంటూ ఆసక్తికర విషయం చెప్పారు పూరీ. ‘‘ఒకసారి బన్నీ నాతో మాట్లాడుతూ ‘హీరోకి ఏదైనా ఒక లోపం పెట్టి, అతని పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేయవచ్చును గదా’ అన్నారు. హీరోకి నత్తి ఉన్నట్టుగా చూపిస్తే ఎలా ఉంటుందని అడిగితే సూపర్‌గా ఉంటుందని చెప్పారు. చదవండి: Surekha Vani: అలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలంటున్న నటి సురేఖ వాణి ఇక మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని అనుకున్న నేను ఈ బాక్సింగ్ కథ వైపు వెళ్లాను. విజయ్ దేవరకొండ పాత్రకి నత్తి పెట్టాను. అలా ఈ పాత్రను డిజైన్ చేయడం వెనుక బన్నీ ఉన్నాడు. విజయ్ దేవరకొండ ఈ పాత్రను గొప్పగా చేశాడు’’ అంటూ పూరీ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఈ మూవీ కోసం మైక్ టైసన్‌ను ఒప్పించడానికి ఏడాది పట్టిందని పూరీ వెల్లడించారు. ఈ సందర్భంగా తన సినిమాల్లోని హీరో క్యారెక్టరైషన్స్ గురించిన మరిన్ని విశేషాలను పూరీ పంచుకున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఇక్కడో లుక్కేయండి. -
లైగర్ సినిమా పబ్లిక్ టాక్
-
Liger Review: లైగర్ మూవీ రివ్యూ
టైటిల్ : లైగర్ నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, మైక్‌టైసన్, విషురెడ్డి, అలీ తదితరులు నిర్మాణ సంస్థలు: ధర్మా ప్రొడెక్షన్స్,పూరీ కనెక్ట్స్ నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా దర్శకత్వం:పూరి జగన్నాథ్ సంగీతం :సునీల్ కశ్యప్, విక్రమ్ మాంట్రోస్, తనీష్ భాగ్చి సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ ఎడిటర్:జనైద్ సిద్దిఖీ విడుదల తేది: ఆగస్ట్ 25, 2022 యావత్ సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ‘లైగర్’. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం.. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తొలిసారిగా బాక్సర్ గా వెండితెరపై కనిపించబోతుండడంతో ‘లైగర్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘లైగర్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య గురువారం(ఆగస్ట్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లైగర్’ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లైగర్’ కథేంటంటే.. కరీంనగర్‌కు చెందిన బాలమణి(రమ్యకృష్ణ) తన కొడుకు లైగర్(విజయ్ దేవరకొండ)ని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎమ్.ఎమ్.ఏ)లో నేషనల్ ఛాంపియన్‌గా చూడాలనుకుంటుంది. కొడుకుకి ట్రైనింగ్ ఇప్పించడం కోసం కరీంనగర్ నుంచి ముంబై వస్తుంది. అక్కడ ఓ టీస్టాల్ నడుపుతూ లైగర్కి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పిస్తుంది. జీవితంలో ఏ అమ్మాయి జోలికి వెళ్లొదని, ప్రేమలో పడితే మన లక్ష్యాన్ని మర్చిపోతామని చెబుతుంటుంది. కానీ లైగర్ మాత్రం ముంబైకి చెందిన తాన్య(అనన్యపాండే)తో ప్రేమలో పడిపోతాడు. ఆమె కూడా లైగర్‌ని ప్రేమిస్తుంది కానీ అతనికి నత్తి ఉందని తెలిసి దూరమవుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయిన లైగర్ చివరకు తన గోల్‌ని రీచ్ అయ్యాడా? లేదా? ఇంటర్నేషనల్ చాపియన్‌షిప్‌లో పాల్గొనడానికి లైగర్‌కు సహాయం చేసిందెవరు? తన గురువులా భావించే మైక్ టైసన్‌తో లైగర్ ఎందుకు తలపడాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఈ మధ్య కాలంలో ‘లైగర్’చిత్రానికి వచ్చినంత హైప్ ఏ చిత్రానికి రాలేదు. ఈ సారి పూరీ బలమైన కథలో వస్తున్నాడని అంతా భావించారు. తీరా సినిమా చూశాక.. పూరీ మళ్లీ పాత పాటే పాడరనిపిస్తుంది. ఓ సాధారణ ప్రేమ కథకి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యాన్ని జోడించి ‘లైగర్’ని తెరకెక్కించాడు. ఇది ప్రేమ కథ అని ప్రచారం చేయడం కంటే.. ఎమ్ఎమ్ఏ నేపథ్యంలో వస్తున్న చిత్రమనే ఎక్కువగా ప్రచారం చేశారు. హీరోని కూడా అదే స్థాయిలో చూపించారు. కానీ కథలో మాత్రం ఆ సిరియస్‌నెస్ ఎక్కడా కనిపించలేదు. ఎమ్.ఎమ్.ఏ సంబంధించిన సీన్స్ సాధారణంగా సాగుతాయే తప్ప ఉత్కంఠను రేకెత్తించవు. పోనీ ప్రేమ కథను అయినా ఆకట్టుకునేలా ఉందా అంటే అదీ అనిపించదు.తాన్య, లైగర్ ప్రేమలో పడిన తీరు కూడా ఆకట్టుకునేలా ఉండదు. యూత్‌ని అట్రాక్ చేయడం కోసం బోల్డ్‌నెస్‌ని అతికించడం కొంతమేర ఇబ్బందిగా అనిపిస్తుంది. హీరోహీరోయిన్ ప్రేమలో పడిన సన్నివేశాలతో పాటు.. వాళ్లు విడిపోవడం, సెకండాఫ్‌లో బ్రేకప్‌కి చెప్పిన రీజన్ అన్ని సిల్లీగా అనిపిస్తాయి. అయితే తెరపై విజయ్‌ని చూపించిన తీరు మాత్రం అందరిని మెప్పిస్తుంది. ఇక సెకండాఫ్ ఎక్కువగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాపింయన్ చుట్టే తిరుగుతుంది. ఇంటర్నేషనల్ ఛాపింయన్‌షిప్ కోసం అమెరికా వెళ్లాల్సిన లైగర్‌కు ప్రభుత్వం సహాయం చేయకపోవడం.. స్పాన్సర్షిప్ వ్యవహారం అంతా సాదాసీదాగా సాగుతుంది. అలాగే కొడుకు అమెరికాలో ఫైట్ చేస్తుంటే.. తల్లి ముంబైలోని ఇంట్లో కూర్చొని ప్రోత్సహించడం లాంటి సీన్‌తో పాటు మరికొన్ని సనివేశాలు వాస్తవికతకు దూరంగా ఉంటాయి. మైక్‌టైసన్, విజయ్‌ల మధ్య వచ్చే ఫైటింగ్ సీన్ అయితే మైక్‌టైసన్ అభిమానులు జీర్ణించుకోవడం కష్టమే. సినిమాలోని మెయిన్ పాయింట్‌కి ఆధారంగా ముగింపు ఉంటే బాగుండేది. హీరో నత్తితో పలికే డైలాగ్స్ కొన్ని చోట్ల నవ్విస్తాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. పూరీ రాసుకున్న స్టోరీ లైన్, లైగర్ అనే క్యారెక్టర్ బాగున్నప్పటికీ.. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్లుగా కథనాన్ని మాత్రం నడిపించలేకపోయాడు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్ దేవరకొండ యాక్టింగ్. ప్రాణం పెట్టి నటించాడు. లైగర్ పాత్ర కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. నత్తితో ఆయన పలికిన డైలాగ్స్ సహజంగా అనిపిస్తాయి. గత సినిమాలలో కంటే ఇందులో విజయ్ నటన కొత్తగా ఉంటుంది. ఎనర్జిటిక్ ఫెర్ఫార్మెన్స్‌తో విజయ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక లైగర్ తల్లి బాలామణిగా రమ్యకృష్ణ తనదైన నటనతో ఆకట్టుకుంది. తాన్యగా అనన్య పాండే మెప్పించింది. తెరపై అందంగా కనిపించింది. అయితే ఆ పాత్ర సినిమాపై అంతగా ప్రభావం చూపదు. పాటల్లో విజయ్, అనన్య రొమాన్స్ ఆకట్టుకుంటుంది. లైగర్ కోచ్‌గా రోనిత్ రాయ్ మెప్పించాడు. విషురెడ్డి, అలీ, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికిస్తే.. సంగీతం పర్వాలేదు. పాటలు టాలీవుడ్ కంటే బాలీవుడ్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన అనన్య పాండే
-
విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన అనన్య పాండే
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం 'లైగర్'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పూరి కనెక్ట్స్ ,ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత విజయ్ నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో లైగర్‌పై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో భారీ అంచనాల మధ్య నేడు(గురువారం)లైగర్ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆడియెన్స్ రెస్పాన్స్ చూసేందుకు విజయ్, అనన్య హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లారు. వీళ్లు ఎంట్రీ కాగానే ఆడియెన్స్ థియేటర్లో రచ్చరచ్చ చేశారు. విజిల్స్ వేస్తూ పేపర్లు చింపుతూ హంగామా సృష్టించారు. దీంతో విజయ్ క్రేజ్ చూసిన అనన్య పాండే కాస్త భయపడినట్లుంది. కాస్త కంగారుగానే థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
‘లైగర్’ ట్విటర్ రివ్యూ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన అనన్య పాండే నటించింది. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు భారీ స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘లైగర్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 25) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘లైగర్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. సినిమా బాగుందని , కమర్షియల్‌గా ఆడుతుందని కొందరు కామెంట్ చేస్తుంటే.. స్టోరీ యావరేజ్‌గా ఉందని, విజయ్ మాత్రం తనదైన నటనతో ఆకట్టుకున్నారని మరికొందరు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ బాగుందని, నటుడిగా తన బెస్ట్ ఇచ్చాడని, సినిమాలో అతను నత్తితో ఇబ్బంది పడటం అందరిని బాధిస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మొదటి భాగం కాస్త ఫర్వాలేదనిపించినా, సెకండాఫ్ మాత్రం చాలా దారుణంగా ఉందంటున్నారు. Just now finished watching the #Liger..the movie is so high standards with very quality output. @TheDeverakonda lived in his character..Production values are so high @PuriConnects . Boss #purijagan delivered another block buster. Please go and book the tickets to watch #Liger https://t.co/JGX5jkI38J — Ramu Akula (@Akula4Ramu) August 25, 2022 ‘ఇప్పుడే లైగర్ సినిమా చూశా. సినిమా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ తన పాత్రలో జీవించేశాడు. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ బాగున్నాయి. పూరీ జగన్నాథ్ మరో బ్లాక్ బస్టర్ అందించాడు’అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. One word review:- Excellent One of the best movies related to journey of a wrestler and fight scenes were so classic. #VijayDevarakonda as usual nailed his role in movie.#MikeTyson played an excellent role.#AnanyaPanday was so hot and pretty.#Liger #LigerReview pic.twitter.com/fNzJaH728X — 𝙰𝚑𝚊𝚍 (@catzproud) August 25, 2022 బాక్సర్ నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో లైగర్ ఒక బెస్ట్ చిత్రమని, విజయ్ దేవరకొండ ఎప్పటి మాదిరే తన పాత్రలో ఒదిగిపోయాడు. మైక్‌టైసన్ ఓ అద్భుతమైన పాత్రని పోషించాడు. అనన్య పాండే తెరపై అందంగా కనిపించింది. మొత్తంగా లైగర్ ఓ అద్భుతమైన చిత్రమని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Liger #LigerHuntBegins A below average first half followed by a hideous second half. HIDEOUS. Abysmal writing and horrible screenplay. A climax Endira 😭😭😭 There's no story no screenplay just random montages. VD couldn't do much either. Stammer, ruining characterization😭 — Sai_Reviews (@saisaysmovies) August 24, 2022 ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని, సెకండాఫ్ కూడా అంతగా ఆకట్టుకోలేదని చెబుతున్నారు. పూరి జగన్నాథ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అస్సలు బాగోలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. #LigerReview ⭐️/ 5 Firstly #Liger is not a Telugu Film, Whole film/songs shot in Hindi & then dubbed into Telugu. Such a disrespect to our Audience Positives: - Vijay looks Negatives: - Songs 🤮 - #AnanyaPanday 🙏 Poker-faced actress i've seen in recent times 🤦 1/3 — ᐯ K (@vamsixplores) August 25, 2022 If #Liger makes money it’s only because of @TheDeverakonda acting but if it fails it’s because of bad screenplay, misplaced songs & bollywoodizing south content. @ananyapandayy and @karanjohar association leaves bad side effects to this movie !! Good luck ! — Nidhi Singh (@NidhiSi85385249) August 25, 2022 #LigerReview : Puri missed a great chance with the movie #Liger STORY👎 SCREENPLAY👎 SECOND HALF 👎 CLIMAX👎 Heroine Track👎 HERO acting 👎#VijayDeverakonda action is poor the stuttering character didn't suit Vijay Devarakonda. Rating:1.5/5 — Harish (@Harish1432D) August 25, 2022 #LigerReview our rating 2/5 Plus points; 👉Vijaya Deverakonda Minus points 👉Story 👉Screen Play 👉Heroine Track 👉Climax 👉Songs Puri Missed a great chance with the movie #Liger@TheDeverakonda @sarigamacinemas @purijagan#Waatlagadenge pic.twitter.com/08VlBakVVQ — Movies Box Office (@MovieBoxoffice5) August 25, 2022 #Liger Review: OK Action Entertainer 👍#VijayDeverakonda Shines👏#RamyaKrishnan & #MikeTyson r effective👌#AnanyaPanday 🥲🙏 Songs👎, but BGM👍 Story & Screenplay🙏 Action scenes r good✌️ Rating: ⭐⭐⭐/5#LigerReview #LigerHuntBegins #WaatLagaDenge pic.twitter.com/vY9DjGmnDM — Kumar Swayam (@KumarSwayam3) August 24, 2022 -
నాకౌట్ పంచ్ ఇవ్వండి..లైగర్ టీమ్‌కు మెగాస్టార్ విషెస్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ భామ అనన్య పాండే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరి కొద్ది గంటల్లో(ఆగస్ట్ 25)ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పాటు చేశాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు లైగర్ టీమ్. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిశారు. (చదవండి: ‘లైగర్’ ఫస్ట్ రివ్యూ ఇదే.. సినిమా ఎలా ఉందంటే..) ‘గాడ్ ఫాదర్’సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవితో పాటు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కూడా కలిశారు లైగర్ టీమ్. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి లైగర్ టీమ్ కు విషెస్ తెలుపుతూ.. మీలాగే ఇండస్ట్రీ కూడా దీన్ని ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంది! నాకౌట్ పంచ్ ఇవ్వండి! అంటూ ట్వీట్ చేశారు. మెగాస్టార్ విషెస్ తెలుపడంతో చిత్రయూనిట్ ఆనందం లో తేలిపోతున్నారు. It’s #Liger Day Tomorrow! Wishing Dearest @purijagan @TheDeveraKonda @meramyakrishnan @karanjohar @Charmmeofficial @ananyapandayy & the Entire Team, All The Very Best for a Memorable Success! It will be relished as much by the Industry as you all! Go for the Knockout Punch!! pic.twitter.com/XDsVLt4aT0 — Chiranjeevi Konidela (@KChiruTweets) August 24, 2022 చిరంజీవి ట్వీట్‌ని విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చాడు. ‘మా స్వీటెస్ట్ మెగాస్టార్ చిరంజీవి. మీరు గర్వించేలా ఈ సినిమా ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు. మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చిరు సార్’అంటూ విజయ్ ట్వీట్ చేశాడు. Chiru sirrrr ❤️ Our Sweetest Megastar - really hope you enjoy the film and we make you proud. Gratitude always for all that you have done 🙏🥰 https://t.co/r35x8vxsz1 — Vijay Deverakonda (@TheDeverakonda) August 24, 2022 -
Liger First Review: ‘లైగర్’ ఫస్ట్ రివ్యూ ఇదే.. సినిమా ఎలా ఉందంటే..
విజయ్ దేవరకొండ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ కోసం ‘రౌడీ’ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రేపే(ఆగస్ట్ 25) ఈ చిత్రం విడుదల కోబోతుంది. దీంతో విజయ్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. సినిమా ఎలా ఉంటుందో అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే ‘రౌడీ’ అభిమానులకు శుభవార్త వచ్చేసింది. దుబాయ్‌లో ఉంటూ టాలీవుడ్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ విమర్శకుడు, ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటికే ఆయన చాలా తెలుగు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇచ్చారు. ఇప్పుడు ‘లైగర్’కి కూడా రివ్యూ ఇచ్చేశాడు. విజయ్ దేవరకొండ సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకొని నడిపించాడని, యాక్షన్ స్టంట్స్ అదరగొట్టేశాడని రివ్యూలో చెప్పుకొచ్చాడు. (చదవండి: ‘లైగర్’కి ఆల్ ది బెస్ట్ చెప్పిన అనుష్క.. పూరీని ఇలా పిలిచిందేంటి?) 'విజిల్స్ వేసే మాస్ ఎంటర్టయినర్ 'లైగర్'. విజయ్ దేవరకొండ వన్ మేన్ షో చేశాడు. షో మొత్తాన్ని ఆయన దోచేశాడు. టెర్రిఫిక్ యాక్షన్ స్టంట్స్. డైరెక్షన్ అదిరిపోయింది. ఈ సినిమాలో రమ్యకృష్ణది ఒక సర్ ప్రైజ్ ప్యాకేజ్ అని ట్వీట్ చేస్తూ సినిమాకు మూడు స్టార్లు ఇచ్చాడు. మరి ఉమైర్ సంధు చెప్పినట్టుగానే ‘లైగర్’ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో లేదో మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘లైగర్’కి ఆల్ ది బెస్ట్ చెప్పిన అనుష్క.. పూరీని ఇలా పిలిచిందేంటి?
విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ఇండియా మూవీ ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 25న విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసేంది. పాన్ ఇండియా స్థాయికి తగినట్లే ప్రచారం కూడా చేయడంతో ‘లైగర్’గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. (చదవండి: సినిమా అట్టర్ ఫ్లాప్.. కలెక్షన్స్‌లో రికార్డు) ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. లైగర్ పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా స్టార్ హిరోయిన్ అనుష్క శెట్టి సోషల్ మీడియా వేదికగా ‘లైగర్’టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. విజయ్ కూడా అనుష్క పోస్ట్‌పై స్పందించాడు.‘ థ్యాంక్యూ సోమచ్ స్వీటీ.. అర్జున్ రెడ్డి సినిమా విడుదలప్పుడు కూడా మీకు ఇలాగే విషెస్ చెప్పారు. ఆ సినిమాలాగే లైగర్ కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని విజయ్ రిప్లై ఇచ్చాడు. అయితే అనుష్క తన పోస్ట్‌లో పూరి జగన్నాథ్ ‘జగ్గుదాదా’ అని సంబోధించడం విశేషం. కాగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ చిత్రంతోనే అనుష్క వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) -
లైగర్ మూవీ ఫ్లాప్ అయితే? విలేకరి ప్రశ్నకు విజయ్ షాకింగ్ రియాక్షన్
సౌత్, నార్త్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా లైగర్. మూవీ రిలీజ్ అయ్యేందుకు ఇంకా రెండు రోజుల మాత్రమే ఉంది. ఇక ఈ మూవీని ప్రమోషన్లో భాగంగా లైగర్ టీం కొద్ది రోజులుగా దేశమంత చూట్టుముడుతున్న సంగతి తెలిసిందే. నార్త్ నుంచి సౌత్ వరకు దాదాపు అన్ని పెద్ద నగరాల్లో పర్యటిస్తూ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లైగర్ టీం ముంబై మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ విలేకరి నుంచి విజయ్‌కి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఒకవేళ లైగర్ ఫ్లాప్ అయితే? అని ఆయన అడిగారు. చదవండి: నగరానికి దూరంగా చిరు బర్త్‌డే వేడుకలు, ఫొటోలు వైరల్ దీంతో విజయ్ అతడి ప్రశ్నకు షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ‘ఇలాంటి చిన్న విషయాలకు కోపంతో ఊగిపోనవసరం లేదు. ఇదే ప్రశ్న నన్ను కొన్నేళ్ల కిందట అడిగి ఉంటే కోపంతో ఊగిపోయేవాడిని. ఇలా అడిగినందుకు మీపై విరుచుకుపడేవాడినేమో. అప్పుడు నాకు కోపం చాలా ఎక్కువ. కానీ గత కొన్ని రోజులుగా నాకసలు కోపమే రావడం లేదు. ఎందుకంటే అభిమానులు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేసింది. ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలా చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని వారిని నేను అగౌరవ పరచలేను’ అని వ్యాఖ్యానించాడు. చదవండి: ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కియారా-సిద్దార్థ్, క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో అనంతరం ‘లైగర్ ప్రమోషన్స్ చేస్తూ దేశమంత పర్యటిస్తున్నాం. ఎక్కడికి వెళ్లిన ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. నాకు ఆడియన్సే ముఖ్యం. వారి కోసమే మేం పని చేస్తున్నాం. వారి కలిసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేందుకే నగరాలన్ని చూట్టుముడుతున్నాం’ అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. ఇక అతడి రియాక్షన్ చూసి అంతా షాకయ్యారు. పాన్ ఇండియా చిత్రమైన ఆ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఫ్లాప్ అంటూ ప్రస్తావిస్తే ఎవరైనా వారిపై కోపంతో ఊగిపోవాల్సిందే. కానీ విజయ్ సదరు విలేకరితో వ్యవహరించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అతడిపై మరింత అభిమానం పెరిగిపోయిందంటూ విజయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
అలా బతకలేకపోతే ఎంత సంపాదించినా లాభం లేదు: విజయ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోలో విజయ్‌కు జోడీగా అనన్య పాండే నటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆగస్ట్ 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్న లైగర్ టీం ఇటీవలె సాక్షి టీవీతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. సినిమా బ్యాగ్రౌండ్ ఏమాత్రం లేకపోయినా, ఎంత స్టార్డమ్ సంపాదించుకున్నారు. అసలు విజయ్ దేవరకొండ ఎవరు అని అడిగితే.. 'నాకు పూర్తిగా నేను ఎవరో తెలియదు. కానీ నాకు ఒకటి తెలుసు.. నాకు అనిపించింది నేను చేస్తా. నచ్చినట్లు ఉంటా. అన్నింటికంటే నాకు ఇదే ముఖ్యం. నచ్చినట్లు బతకలేకపోతే సూపర్ స్టార్ అయినా, ఎంత సంపాదించినా లాభం లేదు' అంటూ చెప్పుకొచ్చాడు. పూరి జగన్నాథ్ తనను చాలా బాగా అర్థం చేసుకుంటారని, తన గురించి తనకే చెప్తారంటూ పేర్కొన్నాడు. ఇక విజయ్ అందరికీ ఇంతలా కనెక్ట్ అవ్వడానికి కారణం అతని నిజాయితీ అని హీరోయిన్ అనన్య పాండే తెలిపింది. ప్రతిరోజూ విజయ్ తనకు కొత్తగానే కనిపిస్తాడని, పని విషయంలో చాలా కష్టపడతాడని చెప్పుకొచ్చింది. -
రౌడీ హీరోకు ఉంగరం తొడిగి ఏడ్చేసిన మహిళా అభిమాని
-
మోకాలిపై కూర్చుని రౌడీ హీరోకు ప్రపోజ్ చేసిన లేడీ ఫ్యాన్
లైగర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దేశాన్ని చుట్టేస్తున్నాడు విజయ్ దేవరకొండ. హీరోయిన్ అనన్యపాండేతో కలిసి ఇప్పటికే పలు నగరాలు సందర్శించాడు. ఈ క్రమంలో బెంగళూరులో ఓ వీరాభిమాని రౌడీ హీరోకు రింగుతో ప్రపోజ్ చేసింది. మోకాలిపై కూర్చొని విజయ్‌కు ఉంగరం తొడిగి తన ప్రేమాభిమానాలను చాటుకుంది. రౌడీ హీరోను ఇలా కలిసినందుకు ఉద్వేగానికి లోనైన ఆ అమ్మాయి సంతోషంతో ఏడ్చేసింది. దీంతో విజయ్.. ఆమెను హత్తుకుని ఓదార్చాడు. అంతేకాదు, ఈ ఉంగరాన్ని లైగర్ మూవీ ప్రమోషన్లు పూర్తయ్యేవరకు ఉంచుకుంటానని మాటిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన లైగర్ మూవీ ఆగస్టు 25న విడుదల కాబోతోంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అనన్యపాండే కథానాయికగా నటించింది. చదవండి: విడాకుల తర్వాత ఒక్కటిగా కనిపించిన ధనుష్, ఐశ్వర్య.. ఫొటో వైరల్ ఆగస్టు చివరి వారంలో ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే! -
‘లైగర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
60 ఏళ్లు వచ్చినా.. ఆ 20 రోజులు మరిచిపోలేను : విజయ్ దేవరకొండ
‘‘నా కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమా ‘లైగర్’. గుంటూరులోనే కాదు.. ఇండియాలో ఎక్కడికి వెళ్లినా నాపై మీరు చూపిస్తున్న ప్రేమను మరచిపోలేను’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గుంటూరులో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నాకు అరవై ఏళ్లు వచ్చి, సినిమాలు మానేసి ఇంట్లో కూర్చొని ఉన్నా కూడా ‘లైగర్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న 20రోజులు, మీ (అభిమానులు) ప్రేమని మరచిపోలేను.. ఆలోచిస్తుంటాను. అంత స్ట్రాంగ్ మెమొరీ నాకు ఇచ్చారు. అంతే మెమొరీ మీకు తిరిగి ఇవ్వడం నా బాధ్యత. మీకు గుర్తుండిపోయే సినిమా ‘లైగర్’. ఈ సినిమాకి మూడేళ్లు పట్టింది. ఈ చిత్ర కుమ్మేస్తుంది. ఆగస్టు 25న గుంటూరుని మీరు (అభిమానులు) షేక్ చేయాలి’’ అన్నారు. (చదవండి: ట్రెండింగ్‌లోకి ‘బాయ్‌కాట్ లైగర్’.. ‘రౌడీ’ ఫ్యాన్స్ గట్టి కౌంటర్) పూరి జగన్నాథ్ మాట్లాడుతూ–‘‘మిమ్మల్ని చూస్తుంటే ‘లైగర్’ ప్రీ రిలీజ్‌కి వచ్చామా? సక్సెస్ మీట్‌కి వచ్చామా? అన్నది అర్థం కావడం లేదు. మీరందరూ ఒక్కొక్క టిక్కెట్ కొంటే చాలు మా సినిమా బ్లాక్‌బస్టర్. ఈ సినిమాలో విజయ్ ఇరగదీశాడు.. అనన్య చింపేసింది. రమ్యకృష్ణ ఉతికి ఆరేసింది. ఈ సినిమాలో హైలైట్ మైక్ టైసన్. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.. ఎంత వసూలు చేస్తుందో తెలియదు. ఇవన్నీ పక్కనపెట్టి ఇంతకంటే డబుల్ బడ్జెట్‌తో విజయ్‌తో ‘జనగణమణ’ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాం.. అది మా నమ్మకం’’ అన్నారు. -
బాయ్‌కాట్ చేస్తారా ..ఏదొచ్చినా కొట్లాడుడే: విజయ్ దేవరకొండ
‘లైగర్ కోసం మూడేళ్లు కష్టపడ్డాం. ప్రాణం పెట్టి నటించాను. తల్లి సెంటిమెంట్‌తో భారతీయ జెండాను ఎగురవేస్తే బాయ్ కాట్ చేస్తారా? మనం ధర్మంతో ఉన్నాం. ఏదొచ్చిన కొట్లాడుడే’అని విజయ్ దేవరకొండ అన్నాడు. లైగర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ శనివారం విజయవాడలో ఈవెంట్ నిర్వహించింది. ఇందులో హీరో విజయదేవర కొండ, హీరోయిన్ అనన్య పాండే, డైరెక్టర్ పూరి జగన్నాధ్, ప్రొడ్యూసర్ చార్మి పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా విజయ్ మీడియాతో ముచ్చటిస్తూ బాయ్‌కాట్ వివాదంపై స్పందించారు. మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు, మన ధర్మం మనం చేసినప్పుడు ఎవడి మాట వినేదే లేదు. ఏదొచ్చినా కొట్లాడుడే. తల్లి సెంటిమెంట్‌తో మంచి సినిమా చేస్తే బాయ్‌కాట్ చేస్తారా? చూద్దాం.. అల్రెడీ బుకింగ్స్ ఓపెనయ్యాయి’ అన్నారు. ఇక లైగర్ సినిమా గురించి పూరి కధ చెప్పగానే మెంటలొచ్చిందని వెంటనే ఓకే చెప్పేశానన్నారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్నిఇండియా కు పరిచయం చేశారని చెప్పాడు. ఇక పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. లైగర్ ఓ యాక్షన్ డ్రామా చిత్రమని, చిన్నా, పెద్ద అంతా కలిసి చూడొచ్చని చెప్పారు. అమ్మా నాన్నా తమిళ అమ్మాయి చిత్రానికి లైగర్‌తో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇలాంటి చిత్రాన్ని థియేటర్స్‌లోనే చూడాలని, ఓటీటీ చూడాల్సిన మూవీ కాదన్నారు. Manam Correct unnapudu Mana Dharmam manam chesinapudu Evvadi maata vinedhe ledu. Kotladudham 🔥#Liger — Vijay Deverakonda (@TheDeverakonda) August 20, 2022 -
ట్రెండింగ్‌లోకి ‘బాయ్‌కాట్ లైగర్’.. ‘రౌడీ’ ఫ్యాన్స్ గట్టి కౌంటర్
బాలీవుడ్లో బాయ్‌కాట్ ట్రెండింగ్ నడుస్తోంది. ఇటీవల ఆమిర్ ఖాన్ ‘లాల్‌సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’, తాప్సీ ‘దొబారా’చిత్రాలకు ఈ బాయ్‌కాట్ సెగ తగిలింది. సినిమాలను బహిష్కరించాలని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ బాయ్‌కాట్ సెగ విజయ్ దేవరకొండను తాకింది. ఆయన నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ను బహిష్కరించాలంటూ #BoycottLigerఅనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా విజయ్ దేవరకొండ అభిమానులు, సినీ ప్రియులు ఐ సపోర్ట్ లైగర్(#iSupportLIGER), అన్ స్టాపబుల్ లైగర్(#UnstoppableLiger) అనే యాష్ ట్యాగ్ లను ట్రెండింగ్ చేస్తున్నారు. (చదవండి: విజయ్ 'లైగర్'కు బాయ్‌కాట్ సెగ.. ట్విట్టర్లో ట్రెండింగ్) లైగర్ బాయ్ కాట్ అనే దాన్ని ఎందుకు ట్రెండింగ్ చేస్తున్నారు, ఇది కరణ్ జోహార్ ప్రాజెక్ట్ అనా లేక ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలకు వస్తున్న క్రేజ్ చూడలేకా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వేల మంది ఆధారపడిన అతి పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలువు ఇవ్వడం అర్థం లేని పని అని అంటున్నారు. లైగర్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఈ సినిమా టీమ్ ను చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రేజ్ తట్టుకోలేని కొంతమంది.. బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ తో పాటు లైగర్ ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.ఏదేమైనా బాయ్‌కాట్ ట్రెండ్ చిత్ర పరిశ్రమకు కొత్త సమస్యగా మారింది. ఇక లైగర్ విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రమిది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. -
ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!: లైగర్ విలన్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన లైగర్ రిలీజ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఆగస్టు 25న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఇంతలోనే బాయ్‌కాట్ లైగర్ అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరోపక్క సినిమా ప్రమోషన్స్ కోసం దేశాన్ని చుట్టేస్తున్నారు విజయ్, అనన్యపాండే. ఇదిలా ఉంటే సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయాలని భారీ ఆఫర్లు వచ్చాయట. కానీ కథ మీదున్న నమ్మకంతో వాటన్నింటినీ తిరస్కరించారట. మొదట థియేటర్లోనే రిలీజ్ చేస్తామని ముక్తకంఠంతో చెప్పారట. మరి ఈ సినిమా ఎన్ని వారాల తర్వాత ఓటీటీలోకి రానుందనే విషయాన్ని తాజాగా లైగర్ విలన్ విషు రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'లైగర్ థియేటర్లో చూడాల్సిన చిత్రం. ఇది ఓటీటీకి పెద్దగా సెట్టవ్వదు. ఇప్పుడప్పుడే ఓటీటీలోకి కూడా రాదు. థియేటర్లో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంది' అని క్లారిటీ ఇచ్చాడు విషు. చదవండి: విజయ్ 'లైగర్'కు బాయ్‌కాట్ సెగ.. ట్విట్టర్లో ట్రెండింగ్ కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ కౌంటర్, వేడి కాఫీలో ముంచేస్తారు -
కొంపముంచిన విజయ్ కామెంట్స్.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ 'లైగర్'
#బాయ్‌కాట్ బాలీవుడ్.. ఇండియలో ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగ్ ఇది. బీటౌన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ బాయ్‌కాట్ ట్రెండ్ ఇప్పడు 'లైగర్' సినిమాను కూడా తాకింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న ఈ సమయంలో లైగర్‌కు బాయ్‌కాట్ సెగ తగిలింది. దీనికి కరణ్‌జోహార్ ఒక కారణమైతే, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ మరో కారణంగా తెలుస్తుంది. పూరి కనెక్ట్స్‌తో కలిసి కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో లైగర్ బాయ్‌కట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఇక మరోవైపు ఓ ఇంటర్వ్యూలో లాల్‌సింగ్ చడ్డా బాయ్‌కాట్ చేయడంపై విజయ్ స్పందిస్తూ.. ఇలా చేయడం వల్ల చాలామంది కార్మికులు నష్టపోతారని కామెంట్స్ చేసి అమీర్‌ఖాన్‌కు మద్దతు తెలపడంతో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. దీనికి తోడు ఓ ప్రెస్మీట్లో విజయ్ దేవరకొండ టేబుల్ మీద కాళ్లు పెట్టి మీడియాకు ఆన్సర్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ కారణాలతో లైగర్ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ #BoycottLigerఅనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. We Telugu youth also support for this #BoycottLiger because it is not Telugu movie it is Hindi movie which is dubbing in telugu produced by Karan Johar #BoycottLigerMovie — suman kumar (@khsumankumar45) August 20, 2022 It's enough for boycott #BoycottLigerMovie pic.twitter.com/Tkt5PVhuOJ — Chris Virat🇮🇳 (@Chrisvirat100) August 20, 2022 -
ప్రెస్మీట్లో విజయ్ తీరుపై వివాదం.. స్పందించిన రౌడీ హీరో
లైగర్ సినిమా కోసం దేశంలోని ప్రధాన నగరాలన్నీ చుట్టేస్తున్నాడు విజయ్ దేవరకొండ. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఉత్తరాది, దక్షణాదిలో వరుస ప్రెస్మీట్స్ నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల ఓ ప్రెస్మీట్లో విజయ్ ప్రవర్తించిన తీరు బాగోలేదని విమర్శలు వచ్చాయి. దీనిపై ఓ జర్నలిస్ట్ స్పందిస్తూ.. 'మీడియా ముందు విజయ్ రెండు కాళ్లు టేబుల్ మీద పెట్టి యాటిట్యూడ్ చూపించాడని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆరోజు జరిగిందేంటంటే.. ఓ జర్నలిస్టు.. టాక్సీవాలా సమయంలో నేను మీతో చాలా ఫ్రీగా మాట్లాడేవాడిని. అప్పుడు బాలీవుడ్‌కు వెళ్తారా? అని అడిగితే నవ్వేసి ఊరుకున్నారు. కానీ ఇప్పుడు నిజంగానే బాలీవుడ్‌కు వెళ్లారు. ఇప్పుడు ఫ్రీగా మాట్లాడాలంటే ఒకరకంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. విజయ్ అతడిలో భయం పోగొట్టడానికి మీరు ఫ్రీగా మాట్లాడండి.. కాలు మీద కాలేసుకుని మాట్లాడండి, నేనూ కాలు మీద కాలేసుకుని మాట్లాడతా, మనం చిల్‌గా మాట్లాడుకుందాం అని సరదాగా అన్నాడు. అలా సరదాగా టేబుల్‌పై కాళ్లు పెట్టాడు. ఆ చర్యను అక్కడున్న అందరం ఎంజాయ్ చేశాం' అని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ కొందరు మాత్రం రౌడీ హీరోను ఇప్పటికీ తప్పుపడుతుండటంతో విజయ్ ఈ వివాదంపై స్పందించాడు. 'ఎవరి రంగంలో వారు ఎదగాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఎంతోమందికి టార్గెట్ అవుతుంటారు. కానీ మనం వాటిపై పోరాటం చేస్తూనే ఉండాలి. నీకు నువ్వు నిజాయితీగా ఉంటూ ప్రతిఒక్కరి మంచి కోరుకున్నప్పుడు ప్రజల ప్రేమ, ఆ దేవుని ప్రేమ నిన్ను తప్పకుండా రక్షిస్తుంది' అని ట్వీట్ చేశాడు. Anybody trying to grow in their field Will Always have a Target on their back - But we fightback :) And when you are honest, yourself and want the best for everyone - The love of people and God will protect you ❤️🥰https://t.co/sWjn9ewDpr — Vijay Deverakonda (@TheDeverakonda) August 19, 2022 చదవండి: బిగ్‌బాస్ ఎంట్రీని కన్ఫర్మ్ చేసిన బుల్లితెర కమెడియన్ ఓటీటీలోకి వచ్చేసిన షంషేరా.. ఎక్కడంటే? -
‘లైగర్’లో ముందుగా ఆమెను హీరోయిన్గా అనుకున్నా: పూరీ
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-అనన్య పాండే జంటగా నటించిన తాజా చిత్రం లైగర్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో లైగర్ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న పూరి జగన్నాథ్ చిత్ర విశేషాలను పంచుకున్నాడు. అయితే లైగర్‌లో ముందుగా తాను వేరు హీరోయిన్ను అనుకున్నట్లు చెప్పాడు. చదవండి: ప్రపోజల్స్‌పై ‘జీ సరిగమప’ విన్నర్ శ్రుతిక ఆసక్తిర వ్యాఖ్యలు ఈ మేరకు పూరీ మాట్లాడుతూ.. ‘విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాక నిర్మాణంలో భాగంగా నిర్మాత కరణ్ జోహార్‌ని కలిసి కథ చెప్పాను. ఆయన వెంటనే ఒకే అన్నారు. ఆ తర్వాత హీరోయిన్ కోసం జాన్వీ కపూర్‌ను కలిశా. ఎందుకంటే కథ అనుకున్నప్పుడే విజయ్‌కి జోడిగా జాన్వీని అనుకున్నాను. నేను శ్రీదేవి విరాభిమాని కావడంతో నా చిత్రం ద్వారానే జాన్వీని తెలుగులో లాంచ్ చేయాలనుకున్నా. అందుకే జాన్వీని కలిసి కథ వినిపించా. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌ను వదులుకుంది. చదవండి: నా పాత్రను అందరు ప్రశంసిస్తున్నారు: ‘సీతారామం’ నటుడు ఇదే విషయాన్ని కరణ్‌కు చెప్పడంతో ఆయన అనన్య పేరును సూచించారు. దీంతో అనన్యను హీరోయిన్గా ఫైనల్ చేశాం. ఇక షూటింగ్ స్టార్ట్ అయ్యాక తెలిసింది ఆమె ఎంత మంచి నటి అనేది. ప్రతి సీన్లోనూ హావభావాలు చాలా బాగా ఇచ్చేది. ఈ సినిమా తర్వాత ఆమెకు యూత్‌లో ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది’ అని పూరీ చెప్పుకొచ్చాడు. కాగా పూరీ కనెక్ట్స్-ధర్మ ప్రొడక్షన్స్‌లో కరణ్ జోహార్-చార్మీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కాగా రీసెంట్గా సెన్సార్ కార్యక్రమాన్ని జరపుకున్న ఈ మూవీకి బోర్డు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 7 అసభ్యకర సన్నివేశాలని ఉన్నాయని, వాటి తొలగించి చిత్రం విడుదల చేయాలని పేర్కొంటూ సెన్సార్ బోర్డు లైగర్‌కు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. -
వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్ దిగ్గజానికి ఏమైంది..?
దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ గురించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ 'లైగర్'లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం వరకు సినిమా ప్రమోషన్స్‌లో బిజిబిజీగా గడిపిన మైక్ టైసన్.. తాజాగా వీల్‌చైర్‌లో కూర్చొని కదలలేని పరిస్థితిలో కనిపించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు లెజెండరీ బాక్సర్‌కు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. లైగర్ షూటింగ్లో హుషారుగా కనిపించిన యోధుడు కర్ర పట్టుకు కూర్చొని, ఇతరుల సాయంతో ముందుకు కదులుతున్న దృశ్యాలను చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. Former heavyweight boxing champion Mike Tyson’s health failing him and says his ‘expiration date may come really soon’ Mike Tyson is pictured in a wheelchair at Miami Airport, raising new fears for his health amid problems with sciatica. pic.twitter.com/ITHHAwfJQK — Zedbugs (@Zedbugs1) August 17, 2022 ఈ దృశ్యాలు టైసన్ మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసినవిగా చెబుతున్నారు. టైసన్ ఈ పరిస్థితిలో ఉన్నప్పటికీ కొందరు సెల్ఫీల కోసం ఎగబడిన వైనం విస్మయానికి గురి చేస్తుంది. టైసన్ ఈ స్థితిపై ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. టైసన్ గతకొంతకాలంగా వెన్నునొప్పి, సయాటికాతో బాధపడుతున్నట్లు తెలిసింది. డాక్టర్లు టైసన్‌ను వీల్ చైర్ వాడాలని సూచించారట. విషయం తెలుసుకున్న అభిమానులు.. ప్రపంచాన్ని ఏలిన దిగ్గజ బాక్సర్‌కు ఈగతి పట్టిందేనని వాపోతున్నారు. 56 ఏళ్ల టైసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎక్స్పైరీ డేట్‌కు దగ్గర పడుతున్నానని చెప్పిన మాటల గురించి ప్రస్తుతం జనం చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం లైగర్ ఈనెల (ఆగస్టు) 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా బాలీవుడ్ క్యూటీ అనన్య పాండే నటించగా.. టైసన్ కీ రోల్ పోషించాడు. ఇక మైక్ టైసన్ ప్రొఫెషనల్ కెరీర్ విషయానికొస్తే.. టైసన్ ఇరవై ఏళ్ల వయసుకే తన దూకుడుతో ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగాడు. జూన్ 30, 1966లో జన్మించిన టైసన్.. చిన్నవయసులోనే అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఎదిగాడు. బాల్యంలో ఎన్నో కష్టాలు, వేధింపులు ఎదుర్కొన్న టైసన్.. స్ట్రీట్ఫైట్లలో పాల్గొని జైలు పాలయ్యాడు. లైంగిక వేధింపులు, ఇతరత్రా వివిదాల కారణంగా అతను 38సార్లు జైలుకెళ్లాడు. టైసన్ జైల్లో ఉండగానే బాక్సింగ్ దిగ్గజం ముహమ్మద్ అలీని కలిశాడు. 1997లో ప్రత్యర్థి ఇవాండర్ హోలిఫీల్డ్ చెవి కొరికి 3 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాడు. టైసన్ కెరీర్ రికార్డు 50 విజయాలు-20 ఓటములుగా ఉంది. చదవండి: విజయ్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న మైక్ టైసన్.. ఎంతంటే -
ఛార్మితో రిలేషన్ బయటపెట్టిన పూరి జగన్నాథ్
పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కౌర్ తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతుంది. పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో పూరి-ఛార్మిల మధ్య ఏదో ఉందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని వార్తలు వస్తున్నాయి. చదవండి: చేతిలో రూపాయి లేకపోయినా ఆఫర్‌ను రిజెక్ట్ చేశా : ఛార్మి తాజాగా ఛార్మితో తనకున్న రిలేషన్ షిప్‌ను బయటపెట్టారు పూరి జగన్నాథ్. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 'ఛార్మీ 13 ఏళ్ల వయసప్పటి నుండి తనకు తెలుసని, దశాబ్దాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. ఛార్మీకి నాకు ఏదో అఫైర్ ఉందని ఏదేదో మాట్లాడుకుంటారు. ఆమె ఇంకా యంగ్‌గా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అదే అదే ఛార్మికి 50ఏళ్లు ఉంటే ఇలా మాట్లాడేవారు కాదు. ఆమెకు వేరేవాళ్లతో పెళ్లి జరిగినా పట్టించుకునేవారు కాదు. చదవండి: రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష? ఎంజీఆర్, జయలలిత దారిలో.. కానీ తామిద్దరం ఒకే ఇండస్ట్రీలో ఉండటం, ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్ అవుతుండటంతో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఒకేవళ అఫైర్ ఉన్నా అది ఎక్కువరోజులు నిలబడదు. ఆకర్షణ అనేది కొన్నిరోజుల్లోనే చచ్చిపోతుంది. స్నేహమే శాశ్వతం. తామిద్దరం మంచి ఫ్రెండ్స్' అంటూ పుకార్లకు పూరి ఫుల్ స్టాప్ పెట్టారు.