ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. దీంతో బడా హీరోలతో పాటు యంగ్ స్టార్స్ కూడా పాన్ ఇండియాపై ఫోకస్ పెట్టారు. వాటిలో చాలా వరకు విజయవంతం అయ్యాయి. కానీ ఓ రెండు చిత్రాలు మాత్రం భారీ అంచనాలతో విడుదలై.. అట్టర్ ఫ్లాప్ చిత్రాలుగా మారాయి. అవే విజయ్ దేవరకొండ ‘లైగర్’, అఖిల్ ‘ఏజెంట్’.
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’పై బాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రచార చిత్రాలు.. ప్రమోషన్ కార్యక్రమాలు చూసి మరో తెలుగు సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టినా.. తర్వాత రోజు నుంచి చతికిల పడింది. భారీ బడ్జెట్‌తో తెరరెక్కిన లైగర్.. బయ్యర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చింది.
(చదవండి: సోషల్ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక)
ఇక ఈ నెల 28న విడైదలైన ‘ఏజెంట్’పై కూడా అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాతో అఖిల్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ విడుదలైన తొలి రోజు ఈ మూవీ డిజాస్టర్ టాక్‌ని సొంతం చేసుకుంది. లైగర్ కోసం విజయ్ దేవరకొండ.. ఏజెంట్ కోసం అఖిల్ చాలా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ కూడా చేశారు. అయితే తమ కష్టానికి తగ్గ కథను ఎంచుకోవడంలో ఇద్దరు విఫలమయ్యారు. అందుకే రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
(చదవండి: మండుటెండలో తిరుగుతున్నా, ఎవరూ ఇల్లు అద్దెకివ్వడం లేదు: నటి)
అయితే ఈ రెండు చిత్రాల డిజాస్టర్ వెనుక ‘బామ్మర్ది’ ఉన్నాడనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఎవరీ బామ్మర్ది అంటే.. ఈ రెండు చిత్రాల్లో ‘సాలా’ అనే పదం బాగా హైలెట్ అయింది. సాలా అంటే హిందీలో బామ్మర్ది అని అర్థం. దీన్ని తెలుగులో బూతు పదంగానూ వాడుతున్నారు. ఇలాంటి పదాలను బాగా ఇష్టపడే పూరి జగన్నాథ్.. లైగర్‌కి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనే ట్యాగ్ లైన్ తగిలించారు.
ఇక ఏజెంట్‌లో సురేందర్ రెడ్డి హీరో క్యారెక్టర్‌ని ‘వైల్డ్ సాలా’ అంటూ పరిచయం చేయించాడు. ఈ రెండింటిలోనూ ‘సాలా’ కామన్‌గా ఉంది. రెండూ డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌కి ‘సాలా’ పదం అచ్చిరావడంలో లేదని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది సిల్లీ సెంటిమెంట్. కంటెంట్‌లో బలం లేకపోవడంతో రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. అయితే టాలీవుడ్‌లో సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. నిజంగా సాలా పదం అచ్చిరాదేమో అని భావించేవాళ్లు కూడా ఉంటారు. మరి భవిష్యత్తులో ‘సాలా’తో సాలిడ్ హిట్ కొడతారో లేదా సెంటిమెంట్‌తో ఆ పదమే వాడడానికి భయపడతారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment