
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ చిత్రం 'ఏజెంట్'. 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా మెప్పించింది. అయితే అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.
అయితే ఈ మూవీ విడుదలై దాదాపు రెండేళ్లు కావొస్తోంది. కానీ ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. గతంలో సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌కు రానుందని ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాలతో ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూనే ఉంది. గతంలో పలుసార్లు డేట్స్ అనౌన్స్ చేసినప్పటికీ స్ట్రీమింగ్‌కు రాకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా అఖిల్ అభిమానులకు ఎట్టకేలకు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది.
(ఇది చదవండి: ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?)
తాజాగా ఏజెంట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేశారు. మార్చి 14వ తేదీ నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోనీ లివ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment