
టాలీవుడ్ యంగ్ అఖిల్ అక్కినేని, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫుల్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ చిత్రం ఏజెంట్. ఈ చిత్రం గతేడాది థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. సురేందర్ 2 సినిమా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.
కాగా.. ఈ మూవీ ఏప్రిల్ 28, 2023 థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏజెంట్ ఓటీటీకి రాలేదు. దీంతో అభిమానులు ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో చాలాసార్లు స్ట్రీమింగ్‌కు వస్తుందని భావించినా అలా జరగలేదు. అయితే తాజాగా జూలైలో ఓటీటీకి స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సోనీ లివ్‌లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్‌కుమార్, మురళీ శర్మ, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment