ఏ సినిమా అయినా మహా అయితే నెల.. లేదంటే నెలన్నరలోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ అక్కినేని హీరో అఖిల్ నటించిన 'ఏజెంట్' మాత్రం పత్తా లేకుండా పోయింది. అప్పుడెప్పుడో ఏప్రిల్ చివర్లో థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నా.. దాన్ని అలా వదిలేశారు. దీంతో అందరూ ఆ మూవీ గురించి మర్చిపోయారు. ఇన్నాళ్లకు ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.
ఏమైంది?
దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో తీసిన యాక్షన్ మూవీ 'ఏజెంట్'. అయితే రిలీజ్‌కి ముందు అంచనాలు బాగానే ఉండటంతో.. హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఘోరంగా బోల్తా కొట్టింది. పదుల కోట్ల నష్టాన్ని నిర్మాతకు మిగిల్చింది. దీంతో డిజిటల్ హక్కులు కొనుగోలు చేసిన సోనీ లివ్.. ఓటీటీ రిలీజ్ విషయంలో వెనకడుగు వేసింది.
(ఇదీ చదవండి: సమ్మోహనుడా పాట షూటింగ్‌లో దర్శకుడితో గొడవ, ఏడ్చేసిన హీరోయిన్!)
ఐదు నెలల తర్వాత
అయితే మే 19నే తొలుత ఓటీటీ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ సమయానికి విడుదల చేయలేదు. అప్పుడు ఇప్పుడు అనుకుంటూ వచ్చారు కానీ పూర్తిగా పక్కనబెట్టేశారు. దీంతో అందరూ 'ఏజెంట్' గురించి మర్చిపోయారు. ఇలాంటి టైంలో సెప్టెంబరు 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు ఐదు నెలల తర్వాత ఓ సినిమా ఓటీటీలోకి రానుంది. ఇది నిజంగా విశేషమే.
కథేంటి?
రామకృష్ణ అలియాస్ రిక్కీకి రా(RAW) ఏజెంట్ కావాలనేది కల. దానికోసం మూడుసార్లు పరీక్ష రాసి పాస్ అయినా రిజెక్ట్ అవుతాడు. మహాదేవ్(మమ్ముట్టి) రా చీఫ్. భారతదేశాన్ని టార్గెట్ చేసిన ది గాడ్ (డినో మోరియా)ని అంతం చేయాలనేది ఈయన లక్ష‍్యం. అందుకోసం ఓ మిషన్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా ఈ మిషన్‌లో భాగమవుతాడు. ఇంతకు మహాదేవ్.. రిక్కీకి ఏం చేయమన్నాడు? రిక్కీ రా ఏజెంట్ కల నేరవేరిందా? మహాదేవ్ మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే 'ఏజెంట్' స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలో సూపర్‌హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!)
The wait is over! Brace yourself for the wild adrenaline rush!
— Sony LIV (@SonyLIV) September 22, 2023
The Agent starring Mammotty and Akhil Akkineni will be streaming on Sony LIV from 29th Sept.#SonyLIV #AgentOnSonyLIV #Agent @AkhilAkkineni8 @mammukka @DirSurender @sakshivaidya99 @AnilSunkara1 pic.twitter.com/zYL0ljh8M1
Comments
Please login to add a commentAdd a comment