గత చిత్రాల్లో రొమాంటిక్‌గా కనిపించిన అఖిల్ ఏజెంట్ సినిమాలో అందుకు భిన్నంగా వైల్డ్‌గా కనిపించేందుకు ప్రయత్నించాడు. స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ కంటే ఎక్కువగా నెగెటివ్ టాకే వస్తోంది. దీంతో హీరో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని అభిమానులు బాధపడుతున్నారు.
ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అంతంతమాత్రమే స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ ఇదివరకే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఏజెంట్ మూవీ నెల లోపే ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అంటే మే నెలాఖరులోపు సోనీలివ్‌లో ఏజెంట్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. వీలైతే మే మూడో వారంలోపే ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఇక ఏజెంట్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో మమ్ముట్టి కీలక పాత్ర పోషించాడు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా అనిల్ సుంకర నిర్మించారు.
చదవండి: స్టార్ హీరోతో హీరోయిన్ లవ్.. నటుడి విరహవేదన.. ఇన్నాళ్లకు స్పందించిన నటి
Comments
Please login to add a commentAdd a comment