SonyLIV
-
ఓటీటీలో మలయాళ హిట్ మూవీ.. ఎప్పుడంటే?
జోజు జార్జ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం పానీ. ఒకే ఒక సంఘటన సాధారణ జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసి, దాచిన రహస్యాలను బహిర్గతం చేసే, విధేయతలను పరీక్షించే భయంకరమైన భయాలను ఎదుర్కొనేలా చేసే ప్రపంచంలోకి తీసుకెళుతుంది. నీడల నుంచి నిజం బయటపడుతుందా? లేదా దానిని బహిర్గతం చేసే ప్రయత్నంలో ప్రేమించే ప్రతిదాన్ని నాశనం చేస్తుందా? థియేట్రికల్ రన్ తర్వాత పానీ ఇప్పుడు జనవరి 16 నుంచి సోనీ లివ్‌లో అందుబాటులోకి వస్తోంది. ఈ సందర్భంగా జోజు జార్జ్ (Joju George) మాట్లాడుతూ, ‘‘దాగి ఉన్న నిజాలను వెలికి తీయడానికి మించినది పానీ. ఇది వాటిని బహిర్గతం చేయడానికి అయ్యే వ్యయ ప్రయాసలను వెల్లడిస్తుంది. ఇది కుటుంబం, విధేయత, న్యాయం, ప్రతీకారానికి సంబంధించినది, ఇక్కడ ప్రతి నిర్ణయం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు, మానవ మనస్తత్వాన్ని లోతుగా ప్రతిబింబిస్తుంది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, పానీ ఇప్పుడు సోనీ లివ్‌లో మరింత మంది ప్రేక్షకులను చేరుకుంటోంది. ఇదో భావోద్వేగ ప్రయాణం’’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.దర్శకత్వం, రచనతో పాటు నటుడిగానూ జోజు జార్జ్ కనిపించే ఈ చిత్రంలో సాగర్ సూర్య, జునైజ్ వి.పి, బాబీ కురియన్, అభినయ, (Abhinaya) అభయ హిరణ్మయి, సీమ, చాందిని శ్రీధరన్, ప్రశాంత్ అలెగ్జాండర్, సుజిత్ శంకర్, రినోష్ జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రియాజ్ ఆడమ్ నిర్మాతలు ఎడి స్టూడియోస్ పతాకంపై సిజో వడక్కన్ నిర్మిస్తుండగా... సినిమాటోగ్రఫీని వేణు, జింటో జార్జ్ అందిస్తున్నారు.చదవండి: డబ్బు కోసం నన్నే చంపాలనుకుంది.. నా కూతురికి తండ్రి ఇంకెవరో..?: దేవిక మాజీ భర్త -
'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' సిరీస్ రివ్యూ
భారతదేశ స్వాతంత్య్రం కోసం సాగిన బహుముఖ పోరాటాన్ని వివరిస్తూ చరిత్ర, నాటకం యాక్షన్లను మిళితం చేస్తూ నిఖిల్ అద్వానీ 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' అందించారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ సిరీస్‌లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ (సిద్ధాంత్ గుప్తా), సర్దార్ వల్లభాయ్ పటేల్ (రాజేంద్ర చావ్లా), మహాత్మా గాంధీ (చిరాగ్ వోహ్రా), లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్ (ల్యూక్ మెక్‌గిబ్నీ) పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. రాజకీయ కుట్రల సూక్ష్మమైన విశ్లేషణ, వ్యక్తిగత త్యాగాలు, భావోద్వేగ తిరుగుబాట్లు ఆసక్తికరంగా సాగుతాయి.నెహ్రూ, పటేల్, గాంధీల విభిన్న భావజాలంతో కూడిన సన్నివేశాలతో ఈ సిరీస్ వైవిధ్యభరిత అనుభూతిని అందిస్తుంది. స్వతంత్ర భారతదేశం కోసం పోరాడిన ఈ ముగ్గురివీ.. వేటికవే విభిన్న థృక్కోణాలైనా సమర్థనీయమైనవిగా అనిపిస్తాయి. ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. దేశ నిర్మాణం ఆచరణాత్మక డిమాండ్ల మధ్య చిక్కుకున్న నాయకుడి అంతర్గత సంఘర్షణ నెహ్రూ పాత్ర చిత్రణలో తెలుస్తుంది. ముహమ్మద్ అలీ జిన్నాలోని అహం, ఆశయం, తెలివిని నటుడు ఆరిఫ్ జకారియా చక్కగా చూపించాడు. సర్దార్ పటేల్‌గా రాజేంద్ర చావ్లా, లియాఖత్ అలీ ఖాన్‌గా రాజేష్ కుమార్, లార్డ్ లేడీ మౌంట్‌బాటన్‌గా కార్డెలియా బుగేజా మెరుస్తారు. మలిష్కా మెండోన్సా సరోజినీ నాయుడుగా కనిపిస్తారు.ఈ సిరీస్ 1940ల నాటి భారతదేశానికి అద్దం పట్టింది. పునర్నిర్మించిన వైస్రాయ్ హౌస్ లేదా కాంగ్రెస్ కార్యాలయాలు..ఇలా ప్రతి ఫ్రేమ్ సమగ్ర పరిశోధనను ప్రతిబింబిస్తుంది. కథ, కథనాలను భావోద్వేగభరితంగా అందించటంలో అద్వానీ దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకుటుంది. భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఇతర చిత్రీకరణల మాదిరిగా కాకుండా, ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ 1944 - 1947 మధ్య కీలకమైన సంవత్సరాలకు దాని పరిధిని కుదించింది. ఇది గాంధీ–జిన్నా చర్చలు విభజనకు దారితీసిన వంటి సంఘటనలపైనే దృష్టి పెట్టింది. రాజకీయ కుతంత్రాలు, సైద్ధాంతిక వైరుధ్యాలు, తెరవెనుక చర్చలను చక్కగా చూపించారు.చదవండి: దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్ కామెంట్స్' -
ఈ వారం ఓటీటీల్లో 34 సినిమాలు రిలీజ్.. అవేంటంటే? (ఫొటోలు)
-
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం టాలీవుడ్ సినిమాలదే హవా!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. అంతా వినాయక చవితి పండుగ సందడితో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. గతనెల రిలీజైన హిట్ కొట్టిన టాలీవుడ్ చిత్రాలు ఈ వారంలో ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. అవేంటో తెలుసుకుందాం.ఈ వారం ఓటీటీల్లో ఎక్కువగా తెలుగు సినిమాలు ఉండడం అభిమానుల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ ఈ వారం నుంచే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో సందడి చేయనుంది. దీంతో పాటు హిట్ మూవీ ఆయ్, బెంచ్ లైఫ్ లాంటి టాలీవుడ్ వెబ్ సిరీస్ అభిమానులకు కాస్తా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్మిస్టర్ బచ్చన్(టాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 12ఆయ్ (టాలీవుడ్ చిత్రం) - సెప్టెంబర్ 12సెక్టార్ 36- (బాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 13బ్రేకింగ్ డౌన్ ది వాల్(డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4 పార్ట్-2 (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12మిడ్నైట్ ఎట్ ది పెరా ప్యాలెస్ సీజన్-2- (వెబ్ సిరీస్) సెప్టెంబర్ 12అగ్లీస్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 13అమెజాన్ ప్రైమ్ది మనీ గేమ్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ సిరీస్)-సెప్టెంబర్ 10జీ5బెర్లిన్(హిందీ సినిమా)- సెప్టెంబర్ 13నునాకుజి(మలయాళ మూవీ)- సెప్టెంబర్ 13సోనిలివ్తలవన్(మలయాళ సినిమా)- సెప్టెంబర్ 10బెంచ్ లైఫ్(తెలుగు వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12డిస్నీ ప్లస్ హాట్స్టార్గోలి సోడా రైజింగ్ (తమిళ సినిమా)- సెప్టెంబర్ 13హౌ టు డై ఆలోన్ -సెప్టెంబర్ 13ఇన్ వోగ్ ది 90ఎస్(డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 13లెగో స్టార్ వార్స్: రిబిల్డ్ ది గెలాక్సీ- సెప్టెంబర్ 13జియో సినిమాకల్బలి రికార్డ్స్(హిందీ సినిమా)- సెప్టెంబర్ 12లయన్స్ గేట్ ప్లేలేట్ నైట్ విత్ ది డెవిల్(హారర్ మూవీ)- సెప్టెంబర్ 13 -
ఓటీటీకి టాలీవుడ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన టాలీవుడ్ వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్. ఈ వెబ్ సిరీస్‌కు మానస శర్మ దర్శకత్వం వహించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మించారు. ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులను కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.ఐటీరంగంలో బెంచ్‌పై ఉండడం అనే మాటలు తరచుగా వింటుంటాం. ఆ సబ్జెక్ట్‌నే వెబ్ సిరీస్‌గా ఆవిష్కరించారు. ట్రైలర్లో డైలాగ్స్, సీన్స్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు దాదాపు ఏడు భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌లో ఈ సిరీస్ ప్రసారమవ్వనుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, నయన్ సారిక, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు పీకే దండి సంగీతమందించారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బిజు మీనన్, ఆసీఫ్ అలీ నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'తలవన్'. ఈ సినిమాను జిస్ జాయ్ దర్శకత్వంలో తెరకెక్కించరు. ఈ ఏడాది మే నెలలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రేక్షకులను మెప్పించింది. పోలీస్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా మలయాళంలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 12 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, కన్నడతో సహా మొత్తం ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓ పోలీస్ అధికారి ఓ కేసును ఎలా చేధించాడనేది ఈ సినిమాలో చూపించారు. #Thalavan will be streaming from Sept 12 on SONY LIV. pic.twitter.com/5A1GE3jXs6— Christopher Kanagaraj (@Chrissuccess) August 11, 2024 -
ఓటీటీకి వచ్చేస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం టర్బో. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ మూవీగా మలయాళంలో తెరకెక్కించారు. మే 23న మలయాళంలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో మెప్పించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఆగస్టు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనిలివ్ ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో అంజనా జయ ప్రకాశ్, రాజ్ బి.శెట్టి, శబరీష్ వర్మ, సునీల్, కబిర్ దుహాన్ సింగ్‌లు కీలక పాత్రలు పోషించారు.Hold on to your seats as Mammootty takes you on a roller coaster ride of thrills and twists. Stream Turbo from August 9th only on Sony LIV.#Turbo #SonyLIV #TurboOnSonyLIV #Action #Mammootty #MammoottyKampany #Vysakh #MidhunManuelThomas pic.twitter.com/xhwBhfFxbk— Sony LIV (@SonyLIV) July 27, 2024 -
2024 OTT ఫస్టాఫ్: ఎక్కువమంది చూసిన సిరీస్, సినిమాలివే!
బాక్సాఫీస్ వద్ద రిలీజయ్యే పెద్ద సినిమాలన్నీ కచ్చితంగా ఏదో ఒక ఓటీటీలోకి రావాల్సిందే! ఈ పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదలవుతున్నాయి. వీటిమీదే ఆధారపడకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను తీసుకువస్తున్నాయి. సినిమాలు, సిరీస్‌లు, రియాలిటీ షోలతో కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి. అలా ఈ ఏడాది బోలెడన్ని చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేశాయి. మరి ఈ ఆరు నెలల్లో (జనవరి- జూన్) ఎక్కువమంది చూసిన సినిమాలేంటో చూసేద్దాం..ఆర్మాక్స్ నివేదికల ప్రకారం.. ఎక్కువ మంది చూసిన హిందీ ఓటీటీ కంటెంట్ ఇదే..1. పంచాయత్- సీజన్ 3 (అమెజాన్ ప్రైమ్ వీడియో) - 2.82 కోట్లమంది వీక్షించారు.2. హీరామండి (నెట్‌ఫ్లిక్స్) -2.30 కోట్ల మంది చూశారు.3. ఇండియన్ పోలీస్ ఫోర్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) - 1.95 కోట్ల మంది వీక్షించారు.4. కోట ఫ్యాక్టరీ సీజన్ 3 (నెట్‌ఫ్లిక్స్) - 1.57 కోట్ల మంది చూశారు.5. ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 & 4 (హాట్‌స్టార్) -1.48 మంది చూశారు.6. షో టైమ్ (హాట్‌స్టార్) - 1.25 కోట్ల మంది వీక్షించారు.7. గుల్లక్ సీజన్ 4 (సోనిలివ్) -1.21 కోట్ల మంది చూశారు.8.మహారాణి సీజన్ 3 (సోనీలివ్) - 1.02 కోట్ల మంది వీక్షించారు.9. కిల్లర్ సూప్ (నెట్‌ఫ్లిక్స్) - 92 లక్షల మంది చూశారు.10. జంనపార్ (అమెజాన్ మినీ టీవీ) - 92 లక్షల మంది చూశారు.11. కర్మ కాలింగ్ (హాట్‌స్టార్) - 91 లక్షల మంది వీక్షించారు.12. రైసింఘని వర్సెస్ రైసింఘని (సోనిలివ్) - 85 లక్షల మంది చూశారు.13. మామ్లా లీగల్ హై (నెట్‌ఫ్లిక్స్)- 81 లక్షల మంది వీక్షించారు.14. లూటెర్ (హాట్‌స్టార్) - 80 లక్షల మంది చూశారు.15. బాహుబలి : క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హాట్‌స్టార్) - 80 లక్షల మంది చూశారు.చదవండి: సింగర్‌కు అధ్భుతమైన టాలెంట్.. ట్రాన్స్‌జెండర్ అంటూ కామెంట్స్ -
ఓటీటీకి మెగాస్టార్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ టర్బో. మే 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్ నటుడు సునీల్ మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ అగ్ర నటుడు రాజ్ బీ శెట్టి విలన్‌గా మెప్పించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు రిలీజైన రెండు నెలల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. ఆగస్టు 9 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ మూవీని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ഒരു മാസ്സ് ആക്ഷൻ മമ്മൂട്ടി ചിത്രം!ടർബോ ഓഗസ്റ്റ് 9 മുതൽ Sony LIVൽA mass action entertainer starring Mammootty opposite Raj B Shetty!Turbo, coming on Sony LIV from August 9th#Turbo #SonyLIV #TurboOnSonyLIV #Mammootty #MammoottyKampany #Vysakh #MidhunManuelThomas #SamadTruth pic.twitter.com/LZ88S0wOxq— Sony LIV (@SonyLIV) July 10, 2024 -
ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?
అక్కినేని హీరో అఖిల్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ సినిమా విడుదలైన ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. పెద్ద పెద్ద సినిమాలే రిలీజైన 50 రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. గతంలో పలుసార్లు డేట్స్ అనౌన్స్ చేసినప్పటికీ స్ట్రీమింగ్కు రాకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా.. ఏజెంట్ ఓటీటీ రైట్స్ సోని లివ్ కొనుగోలు చేసింది. ఈ నెలలో ఓటీటీ రావచ్చని ఫ్యాన్స్ భావించారు. కానీ స్ట్రీమింగ్ తేదీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల ఏజెంట్ సినిమాను సెప్టెంబరు 29న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు పోస్టర్ విడుదల చేసింది. దీంతో అఖిల్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కానీ ఆ తర్వాత సోనిలివ్ తమ సోషల్ మీడియాలో ఖాతా నుంచి ఏజెంట్ ప్రీమియర్ పోస్టర్ లను తొలగించింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో స్ట్రీమింగ్ అవుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. మరోవైపు అఖిల్ ధీర అనే చిత్రంలో నటిస్తున్నారు. -
ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. టీజర్ చూస్తే చాలు!
కోలీవుడ్ భామ త్రిష గతేడాది లియోతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటించనున్నారు. స్టాలిన్ తర్వాత మెగాస్టార్‌తో మరోసారి జతకట్టనున్నారు. వశిష్ట డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. అయితే ఇప్పటికే పలువురు స్టార్స్ ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ జాబితాలో హీరోయిన్ త్రిష కూడా చేరిపోయారు. త్రిష కృష్ణన్, ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న ఎమోషనల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బ్రింద. సూర్య మనోజ్ వంగలదర్శకత్వంలో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే 'ఈ ప్రపంచంలో మనం రాకముందు ఎంత చెడైనా ఉండొచ్చు.. కానీ వెళ్లేముందు ఎంతో కొంత మంచి చేసి వెళ్లడం మన బాధ్యత అనే డైలాగ్' విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 2వ తేదీ నుంచి సోనిలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో జయ ప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఏడాది తర్వాత ఓటీటీకి ఏజెంట్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
టాలీవుడ్ యంగ్ అఖిల్ అక్కినేని, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫుల్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ చిత్రం ఏజెంట్. ఈ చిత్రం గతేడాది థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. సురేందర్ 2 సినిమా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.కాగా.. ఈ మూవీ ఏప్రిల్ 28, 2023 థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏజెంట్ ఓటీటీకి రాలేదు. దీంతో అభిమానులు ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో చాలాసార్లు స్ట్రీమింగ్కు వస్తుందని భావించినా అలా జరగలేదు. అయితే తాజాగా జూలైలో ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సోనీ లివ్‌లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా.. వరలక్ష్మి శరత్‌కుమార్, మురళీ శర్మ, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. దీంతో వెబ్ సిరీస్ కంటెంట్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీసులు తెగ చూసేస్తున్నారు. దీంతో సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. హుమా ఖురేషి ప్రధాన పాత్రలో తెరకెక్కించిన పొలిటికల్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాకపోతే అది టాలీవుడ్‌కు సంబంధించినది మాత్రం కాదు. మొదటి, రెండు సీజన్స్ సూపర్ హిట్‌గా మహారాణి సీజన్-3 స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈనెల 7వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ సిరీస్‌లో బీహార్‌లో హానికరమైన మద్యం వ్యాపారం గురించి చూపించనున్నారు. ఈ సిరీస్‌ను సుభాష్ కపూర్ కథను అందించగా.. కరణ్ శర్మ దర్శకత్వం వహించారు. రాజకీయాలు నేపథ్యంగా కల్పిత కథ ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. కాంగ్రా టాకీస్ పతాకంపై డింపుల్ ఖర్బందా, నరేన్ కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. కాకపోతే ఈ సిరీస్ కేవలం హిందీ భాషలోనే స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీలో 37 సినిమాలు/ సిరీస్‌లు.. ఓ పట్టు పట్టేయండి మరి!
ఓటీటీలకు గిరాకీ పెరిగిపోయింది. అటు థియేటర్లో రిలీజైన సినిమాలను, ఇటు సొంతంగా సినిమాలు, సిరీస్‌లు నిర్మిస్తూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాయి. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా విభిన్న కంటెంట్‌తో సినీప్రియులను ఆకర్షిస్తున్నాయి. 2023కి ముగింపు పలకడానికి ఇంకా ఒక్క నెల మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ ఏడాదికిగానూ ఎక్కువ పాపులర్ అయిన సిరీస్‌లు ఇవే అని ఐఎమ్‌డీబీ ఓ జాబితా విడుదల చేసింది. ఇందులో ఫర్జి, గన్స్ అండ్ గులాబ్స్, ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్‌లు టాప్ 3లో వరుసగా చోటు దక్కించుకున్నాయి. కోహ్రా, అసుర్ 2 నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి. రానా నాయుడు ఆరో స్థానంలో ఉండగా దహాద్, సాస్, బహు ఔర్ ఫ్లెమింగో, స్కూప్, జూబ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటికి పోటీనిచ్చేందుకు కొత్త సినిమాలు, సిరీస్‌లు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మరి డిసెంబర్ నెలలో ఓటీటీలోకి వచ్చే చిత్రాలు, సిరీస్‌లేంటో చూసేద్దాం... అమెజాన్ ప్రైమ్ ► క్యాండీ కేన్ లేన్ - డిసెంబర్ 1 ► మేరీ లిటిల్ బ్యాట్‌మెన్ - డిసెంబర్ 8 ► యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ - డిసెంబర్ 8 ► రేచర్ 2 - డిసెంబర్ 15 హాట్‌స్టార్ ♦ ద షెఫర్డ్ - డిసెంబర్ 1 ♦ మాన్స్టర్ ఇన్సైడ్: అమెరికాస్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ హాంటెడ్ హౌస్ - డిసెంబర్ 1 ♦ ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ - డిసెంబర్ 1 ♦ ద ఫ్రీలాన్సర్: ద కన్‌క్లూజన్ - డిసెంబర్ 15 ♦ బీటీఎస్ మోనమెంట్స్: బియాండ్ ద స్టార్స్ - డిసెంబర్ 20 ♦ పెర్సీ జాక్సన్ అండ్ ద ఒలంపియన్స్ - డిసెంబర్ 20 నెట్‌ఫ్లిక్స్ ► మే డిసెంబర్ - డిసెంబర్ 1 ► మిషన్ రాణిగంజ్ - డిసెంబర్ 1 ► స్వీట్ హోమ్ 2 - డిసెంబర్ 1 ► ద ఆర్చీస్ - డిసెంబర్ 7 ► మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ - డిసెంబర్ 7 ► జిగర్తాండ డబుల్ ఎక్స్ - డిసెంబర్ 8 ► లీవ్ ద వరల్డ్ బిహైండ్ - డిసెంబర్ 8 ► ద క్రౌన్ సీజన్ 6, రెండో భాగం - డిసెంబర్ 14 ► చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ యానిమేట్ ఫిలిం - డిసెంబర్ 15 ► ట్రెవర్ నోవా: వేర్ వాస్ ఐ - డిసెంబర్ 19 ► మాస్ట్రో - డిసెంబర్ 20 ► రెబల్ మూన్: ద చైల్డ్ ఆఫ్ ఫైర్ - డిసెంబర్ 22 ► జియోంగ్సియోంగ్ క్రియేచర్ సీజన్ 1 పార్ట్ 1 - డిసెంబర్ 22 ► కర్రీ అండ్ సైనేడ్: ద జెల్లీ జోసెఫ్ కేస్ డాక్యుమెంటరీ - డిసెంబర్ 22 ► రిక్కీ జెర్వాయిస్: అర్మగెడాన్ - డిసెంబర్ 25 ► మనీ హెయిస్ట్ బెర్లిన్ - డిసెంబర్ 29 లయన్స్ గేట్ ప్లే ♦ డిటెక్టివ్ నైట్: రోగ్ - డిసెంబర్ 1 జియో సినిమా ► 800 (సినిమా) - డిసెంబర్ 2 ► జర హట్కే జర బచ్కే - డిసెంబర్ 2 ► స్మోదర్డ్ - డిసెంబర్ 8 ► స్కూబీ డూ అండ్ క్రిప్టో టూ - డిసెంబర్ 10 ► ద బ్లాకెనింగ్ - డిసెంబర్ 16 ► ఆస్టరాయిడ్ సిటీ - డిసెంబర్ 25 సోనీలివ్ ♦ చమక్ సిరీస్ - డిసెంబర్ 7 జీ5 ► కడక్ సింగ్ - డిసెంబర్ 8 ► కూసే మునిస్వామి వీరప్పన్ - డిసెంబర్ 8 యాపిల్ టీవీ ♦ ద ఫ్యామిలీ ప్లాన్ - డిసెంబర్ 15 చదవండి: ఆ కంటెస్టెంట్ చేతికి ఫినాలే అస్త్ర.. ఎలిమినేషన్ గండం గట్టెక్కితేనే టాప్ 5లోకి -
నెల రోజుల్లోపే ఓటీటీకి సంపూర్ణేశ్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ మూవీ నెల రోజులు కాకముందే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ త్వరలోనే ఓటీటీలో అలరించనుంది. నవంబర్ 17న లేదా 24న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ఈ మూవీ సోనీ లివ్‌లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా.. తమిళంలో విజయవంతమైన మండేలా మూవీకి రీమేక్‌గా మార్టిన్ లూథర్ కింగ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో డైరెక్టర్ వెంకటేష్ మహా కీలక పాత్ర పోషించారు. అసలు కథేంటంటే.. 'మార్టిన్ లూథర్ కింగ్' ఒక స్థానిక చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కథ. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికలలో అతని ఓటు, గెలుపుని నిర్ణయించే ఓటు కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 28 సినిమాలు రిలీజ్
చాలామంది వీకెండ్లో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి కాలక్షేపం చేస్తుంటారు. అయితే రోజుకో సినిమా చూడాలంటే మాత్రం ఓటీటీని మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదనే చెప్పాలి. అటు ఒక వారంలో థియేటర్లో ఎన్ని సినిమాలు రిలీజవుతున్నాయో అంతకు మించిన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ.. ఇలా అన్ని జానర్ల కంటెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుంది. మరి ఈ శుక్రవారం (నవంబర్ 3న) ఏయే సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయో చూసేద్దాం.. అలాగే స్ట్రీమింగ్ అవుతోంది అని రాసి ఉన్న సినిమాలు ఈ రోజే ఓటీటీలోకి వచ్చాయని అర్థం. అమెజాన్ ప్రైమ్ వీడియో ► తకేశి క్యాటిల్ గేమ్ షో - స్ట్రీమింగ్ అవుతోంది ► ఇన్విజిబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► రత్తం - నవంబర్ 3 ► PI మీనా (హిందీ సిరీస్) - నవంబర్ 3 హాట్‌స్టార్ ► స్కంద - నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ► కాఫీ విత్ కరణ్ షో రెండో ఎపిసోడ్ -స్ట్రీమింగ్ అవుతోంది ► లోకి రెండో సీజన్, ఐదవ ఎపిసోడ్ - స్ట్రీమింగ్ అవుతోంది ► ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 3 నెట్‌ఫ్లిక్స్ ► జవాన్ - స్ట్రీమింగ్ అవుతోంది. ► ఆల్ ద లైట్ వి కాంట్ సీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► సిగరెట్ గర్ల్ (ఇండోనేసియన్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► హిగ్యుటా: ద వే ఆఫ్ ద స్కార్పియన్ (స్పానిష్ సినిమా) - స్ట్రీమింగ్ అవుతోంది. ► ఒనిముషా (జపనీస్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► యునికార్న్ అకాడమీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► మ్యాడ్ - నవంబర్ 3 ► బ్లూ ఐ సమురాయ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► డైలీ డోస్ ఆఫ్ సన్‌షైన్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 3 ► ఫెర్రీ: ద సిరీస్ (డచ్ సిరీస్) - నవంబర్ 3 ► న్యాద్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 ► సెల్లింగ్ సన్‌సెట్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► స్లై (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 3 ► ద టైలర్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - నవంబర్ 3 సోనీలివ్ ► స్కామ్ 2003: ద తెల్గీ స్టోరీ వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 3 బుక్ మై షో ► హాఫ్ వే హోమ్ (హంగేరియన్ మూవీ) - నవంబర్ 3 ► మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 ► ద థీఫ్ కలెక్టర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబర్ 3 ఆపిల్ ప్లస్ టీవీ ► ఫింగర్ నెయిల్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 జియో సినిమా ► టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ సిరీస్) - నవంబరు 3 చదవండి: ప్రతిసారి వెధవ పని చేయడం అలవాటు.. అమర్‌పై రతికా ఫైర్! -
ఉచితంగా ఓటీటీ సబ్స్క్రిప్షన్లు.. అదిరిపోయే జియో కొత్త ప్లాన్స్
రిలయన్స్ జియో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్లు ఒక సంవత్సరం వ్యాలిడిటీతో వస్తాయి. అపరిమిత కాలింగ్, డేటా అలాగే సోనీ లివ్ (SonyLiv), జీ5 (Zee5) కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. రూ. 3662 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 2.5 GB డేటా, అపరిమిత 5G డేటా, రోజుకు 100 SMSలతో వస్తుంది. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు ఉచితంగా వస్తాయి. 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ. 3226 ప్లాన్: ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, 5G డేటాతో పాటు 2GB రోజువారీ 4G డేటా, రోజుకు 100 SMSలు ఉంటాయి. జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు సోనీలివ్ సబ్స్క్రిప్షన్లు ఇతర ప్రయోజనాలు. రూ. 3225 ప్లాన్: ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, 5G డేటాతో పాటు 2GB రోజువారీ 4G డేటా కోటా, రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలు ఉంటాయి. జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు ఈ ప్లాన్‌లో జీ5 సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఇక ఓటీటీ సబ్స్క్రిప్షన్లు వద్దనుకున్నవారికి తక్కువ ధరకు మరో వార్షిక ప్లాన్ అందుబాటులో ఉంది. అదే రూ. 1,999 ప్లాన్. ఇది అపరిమిత 5G డేటా, కాలింగ్‌తో వస్తుంది. వీటితో పాటు 2.5GB రోజువారీ 4G డేటా, రోజుకు 100 SMS కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో థర్డ్-పార్టీ ఓటీటీ ప్రయోజనాలేవీ లేవు కానీ ఇందులో జియో యాప్‌లు, సేవలకు యాక్సెస్ ఉంటుంది. -
అఖిల్ ఫ్యాన్స్‌కు మరో షాక్.. ఓటీటీ రిలీజ్లో బిగ్ ట్విస్ట్!
అక్కినేని అఖిల్ ఇటీవలే నటించిన చిత్రం ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటించింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్‌గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్‌కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. అయితే ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటూ ఇటీవలే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఓటీటీలో అఖిల్ 'ఏజెంట్' మూవీ వాయిదా.. స్ట్రీమింగ్ అప్పుడే) అయితే ఈ విషయంలో ఈ మూవీకి మరో షాక్ తగిలింది. అయితే వైజాగ్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీశ్,) ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. నిర్మాత అనిల్ సుంకర తనని మోసం చేశారని పేర్కొంటూ సతీశ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 29న ఏజెంట్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా కోర్టు స్టే విధించింది. దీంతో ఎంతో ఆశగా ఎదురుచూసిన అఖిల్ ఫ్యాన్స్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఏజెంట్ మూవీ ఇప్పుడైన వస్తోందని ఆశించిన అభిమానులు నిరాశకు గురవుతున్నారు. (ఇది చదవండి: పెళ్లికి ముందు ఆ నిర్మాత ప్రేమలో స్నేహ.. నటుడి సంచలన వ్యాఖ్యలు) -
ఓటీటీలోకి 'ఏజెంట్'.. ఐదు నెలల తర్వాత ఆ రోజే రిలీజ్
ఏ సినిమా అయినా మహా అయితే నెల.. లేదంటే నెలన్నరలోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ అక్కినేని హీరో అఖిల్ నటించిన 'ఏజెంట్' మాత్రం పత్తా లేకుండా పోయింది. అప్పుడెప్పుడో ఏప్రిల్ చివర్లో థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నా.. దాన్ని అలా వదిలేశారు. దీంతో అందరూ ఆ మూవీ గురించి మర్చిపోయారు. ఇన్నాళ్లకు ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏమైంది? దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో తీసిన యాక్షన్ మూవీ 'ఏజెంట్'. అయితే రిలీజ్‌కి ముందు అంచనాలు బాగానే ఉండటంతో.. హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఘోరంగా బోల్తా కొట్టింది. పదుల కోట్ల నష్టాన్ని నిర్మాతకు మిగిల్చింది. దీంతో డిజిటల్ హక్కులు కొనుగోలు చేసిన సోనీ లివ్.. ఓటీటీ రిలీజ్ విషయంలో వెనకడుగు వేసింది. (ఇదీ చదవండి: సమ్మోహనుడా పాట షూటింగ్లో దర్శకుడితో గొడవ, ఏడ్చేసిన హీరోయిన్!) ఐదు నెలల తర్వాత అయితే మే 19నే తొలుత ఓటీటీ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ సమయానికి విడుదల చేయలేదు. అప్పుడు ఇప్పుడు అనుకుంటూ వచ్చారు కానీ పూర్తిగా పక్కనబెట్టేశారు. దీంతో అందరూ 'ఏజెంట్' గురించి మర్చిపోయారు. ఇలాంటి టైంలో సెప్టెంబరు 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు ఐదు నెలల తర్వాత ఓ సినిమా ఓటీటీలోకి రానుంది. ఇది నిజంగా విశేషమే. కథేంటి? రామకృష్ణ అలియాస్ రిక్కీకి రా(RAW) ఏజెంట్ కావాలనేది కల. దానికోసం మూడుసార్లు పరీక్ష రాసి పాస్ అయినా రిజెక్ట్ అవుతాడు. మహాదేవ్(మమ్ముట్టి) రా చీఫ్. భారతదేశాన్ని టార్గెట్ చేసిన ది గాడ్ (డినో మోరియా)ని అంతం చేయాలనేది ఈయన లక్ష్యం. అందుకోసం ఓ మిషన్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా ఈ మిషన్‌లో భాగమవుతాడు. ఇంతకు మహాదేవ్.. రిక్కీకి ఏం చేయమన్నాడు? రిక్కీ రా ఏజెంట్ కల నేరవేరిందా? మహాదేవ్ మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే 'ఏజెంట్' స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలో సూపర్‌హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!) The wait is over! Brace yourself for the wild adrenaline rush! The Agent starring Mammotty and Akhil Akkineni will be streaming on Sony LIV from 29th Sept.#SonyLIV #AgentOnSonyLIV #Agent @AkhilAkkineni8 @mammukka @DirSurender @sakshivaidya99 @AnilSunkara1 pic.twitter.com/zYL0ljh8M1 — Sony LIV (@SonyLIV) September 22, 2023 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ మూవీ, మరో థ్రిల్లర్ సిరీస్ కూడా!
సినిమా సినిమానే.. ఓటీటీ ఓటీటీనే! వీకెండ్లో థియేటర్‌కు వెళ్లి సినిమా చూశాం కదా అని ఓటీటీలో మూవీస్, వెబ్ సిరీస్ చూడకుండా ఉండలేం కదా! అందుకే ఓటీటీలు సినీప్రియులను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ముందుకు వస్తూనే ఉంది. ప్రతివారం ఏదో ఒక ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజవుతూనే ఉన్నాయి. ఇప్పటికే భోళా శంకర్ సెప్టెంబర్ 15న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యేందుకు రెడీ అయింది. తాజాగా మరో సినిమా అదే రోజు రిలీజ్ అయ్యేందుకు సంసిద్ధమైంది. అదే 'జర్నీ ఆఫ్ లవ్ 18+'. నస్లీన్ కె.గపూర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు అరుణ్ డి.జోస్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో జూలై 7న రిలీజైన ఈ చిత్రం అక్కడి యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీని సోనీలివ్‌లో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 15 నుంచి ఈ చిత్రం సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు సబంధించిన కంటెంట్‌ను ఇష్టపడతారు. అందుకే మేకర్స్ కూడా ఈ తరహా సినిమాలు, సిరీస్‌లపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అలా రూపొందిన వెబ్ సిరీసే 'బంబై మేరీ జాన్'. 1960లో ముంబై పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య జరిగే పోరాటం చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. షుజాత్ సౌదాగర్ డైరెక్ట్ చేసిన బంబై మేరీ జాన్ సిరీస్‌లో కేకే మీనన్, అవినాశ్ తివారి ప్రధాన పాత్రలు పోషించారు. నివేదిత భట్టాచార్య, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 14 నుంచి అందుబాటులోకి రానుంది. చదవండి: ఆ హీరో నా కొడుకే, కానీ మా మధ్య ఆ అనుబంధం లేదు.. కలిసి దిగిన ఫోటో ఒక్కటీ లేదు! -
ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
ఎంటర్టైన్మెంట్ను అన్నివేళలా అందుబాటులోకి ఉంచేందుకు ఓటీటీలు ఉపయోగపడుతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కామెడీ షోలు, రియాలిటీ షోలు.. ఇలా భిన్నరకాల కంటెంట్‌తో బోలెడంత వినోదాన్ని అందిస్తున్నాయి. అందుకే ప్రేక్షకులు థియేటర్లో రిలీజయ్యేవాటితో పాటు ఓటీటీ రిలీజెస్ మీద కూడా ఓ కన్నేస్తున్నారు. ఈ రోజు శుక్రవారం కావడంతో ఓటీటీలో కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో రంగబలి టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రంగబలి. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యుక్తి తరేజ హీరోయిన్గా నటించింది. జూలై 7న థియేటర్లో విడుదలైన ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. నేటి(ఆగస్టు 4) నుంచి రంగబలి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ ఓటీటీలో పరేషాన్ ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదలైంది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 4 నుంచి ఈ చిత్రం సోనీలివ్‌లో అందుబాటులోకి వచ్చింది. దయ సిరీస్ ఎందులో అంటే? ఇకపోతే అటు దయ అనే వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఇందులో జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించాడు. అలాగే భాగ్‌సాలే అనే మూవీ సైతం ఓటీటీలోకి వచ్చేసింది. ఇది అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చదవండి: రీఎంట్రీకి రెడీ అయిన నజ్రియా -
ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ
మంచి సినిమా ఏ భాషలో వచ్చినా సరే దాన్ని ఆదరించాలి. ఇదేదో మేం చెబుతున్న మాట కాదు చాలామంది మూవీ లవర్స్‌కి మనసులో ఉన్నమాట. అలా వాళ్లు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిపోయింది. పేరుకే ఇది థ్రిల్లర్ సినిమా అయ్యుండొచ్చు కానీ ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే సమ్‌థింగ్ డిఫరెంట్. ఇప్పుడు దీని స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?) స్ట్రీమింగ్ డేట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అనేది ఎప్పటికీ బోర్ కొట్టని జానర్. కరెక్ట్‌గా తీయాలే గానీ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. అలా తమిళంలో జూన్ 9న రిలీజై సెన్సేషన్ సృష్టించిన సినిమా 'పోర్ తొడిల్'. యంగ్ హీరో అశోక్ సెల్వన్, సీనియర్ నటుడు శరత్ కుమార్ నటించిన ఈ సినిమా.. పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. అయితే పోలీసులు-మర్డర్ మిస్టరీ ఇలాంటివి చాలా చూశాం కదా అని మీరనుకోవచ్చు కానీ వాటితో పోలిస్తే ఇది స్పెషల్. అయితే ఈ చిత్రాన్ని ఆగస్టు 4న ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడది మారింది. ఆగస్టు 11 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. 'పోర్ తొడిల్' కథేంటి?ప్రకాశ్(అశోక్ సెల్వన్) క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్. మనోడికి కాస్త బిడియం, భయం. అడిషనల్ డీజీపై ఆదేశాల మేరకు క్రైమ్ బ్రాంచ్‌లోని సీనియర్ ఆఫీసర్ లోకనాథ్(శరత్ కుమార్) దగ్గర ట్రైనీగా పనిచేసేందుకు వస్తాడు. టెక్నికల్ అసిస్టెంట్ వీణ(నిఖిలా విమల్) కూడా వీళ్లతో కలిసి పనిచేస్తుంది. తిరుచ్చిలో ఓ బాలిక హత్య కేసు వీళ్ల ముగ్గురు టేకప్ చేస్తారు. దీని గురించి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే నగరంలో ఇదే రీతిలో జరుగుతున్న హత్యలు గురించి తెలుస్తుంది. ఇంతకీ వీళ్లని చంపుతన్నది ఎవరు? ప్రకాశ్-లోకనాథ్ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది మెయిన్ స్టోరీ. తమిళంలో సెన్సేషన్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో? The wait is over! The Thriller Sensation that Shattered Box Office Records, "Por Thozhil" is streaming on Sony LIV from Aug 11th.#PorThozhilOnSonyLIV #PorThozhil #SonyLIV @ApplauseSocial #E4Experiments @epriusstudio @nairsameer @SegalDeepak @e4echennai @cvsarathi pic.twitter.com/LOthMauGbD — Sony LIV (@SonyLIV) August 1, 2023 (ఇదీ చదవండి: సాయితేజ్ పక్కనున్న వ్యక్తిని గుర్తుపట్టారా? స్టార్ హీరో కొడుకు!) -
ఓటీటీలోకి ఆ చిన్న సినిమా.. మరీ ఇంత ఆలస్యమా?
సాధారణంగా ఓటీటీల్లోకి ఏ సినిమా అయినా వీలైనంత త్వరగానే వచ్చేస్తుంటాయి. భారీ బడ్జెట్ చిత్రాలైతే కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్ అవుతుంటాయి కానీ చిన్న మూవీస్ అయితే నెలలోపే స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేసుకుంటూ ఉంటాయి. రానా సమర్పణలో వచ్చిన 'పరేషాన్' మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్) స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ 'మసూద' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తిరువీర్ ఇందులో హీరోగా నటించారు. మిగతా వాళ్లందరూ చాలావరకు కొత్త నటీనటులే. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన ఈ సినిమా జూన్ 2న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా జనాల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో చాలామంది ఈ మూవీ గురించి మర్చిపోయారు. అలాంటి ఆగస్టు 4 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. 'పరేషాన్' కథేంటి? మంచిర్యాలలో జులాయిగా తిరిగే కుర్రాడు ఐజాక్(తిరువీర్). తన జాబ్ కోసం దాచుకున్న డబ్బుల్ని ఫ్రెండ్‌కి ఇచ్చి సహాయపడే రకం. ఓ రోజు ఊరిలో జరిగిన పెళ్లిలో శిరీష(పావని)ని చూసి లవ్‌లో పడతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. వారం తిరక్కుండానే ఆమెకు వాంతులవుతాయి. దీంతో ఇద్దరూ పరేషాన్ అవుతారు. హైదరాబాద్ వెళ్లి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుందామని అనుకుంటారు. మరి ఐజాక్-శిరీషల పరిస్థితి ఏమైంది? చివరకు ఏం జరిగిందనేదే స్టోరీ. What if your best friends turn out to be your worst nightmares? Rana Daggubati presents the quirkiest film of the year, #Pareshan streaming on Sony LIV from Aug 4th.#Pareshan #PareshanOnSonyLIV #SonyLIV @RanaDaggubati @iamThiruveeR @PavaniKaranam1 @imvishwadev @siddharthr87 pic.twitter.com/Ic8SXK3apg — Sony LIV (@SonyLIV) July 20, 2023 (ఇదీ చదవండి: మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!) -
'2018' సినిమాపై వివాదం.. ఆ విషయంలో తీవ్ర అభ్యంతరం!
మలయాళ నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం '2018'. మాలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగులోనూ ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశారు. కేరళ వరదల నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని జూన్ 7న ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. (ఇది చదవండి: ఓటీటీకి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!) ఓటీటీ రిలీజ్‌పై అభ్యంతరం హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఓటీటీ విడుదలపై కేరళలోని థియేటర్ల యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా ఓటీటీలో రిలీజ్‌ల చేయడంపై 7,8 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సినిమాను కేవలం ఐదు వారాల లోపే ఓటీటీలో విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్‌తో తాము రూ.200 కోట్లు నష్టపోతామని ఆరోపిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.170 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాస్, ఆసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి, అజు వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: నా వల్ల పైకొచ్చినవాళ్లు గీత దాటారు, అతడి పేరు చెప్పను!) -
ఓటీటీకి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!
మలయాళంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 2018. ఇటీవలే ఈ చిత్రాన్ని దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల చేశారు. ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన 25 రోజుల్లోనే రూ.160 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక టాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి ఊహించని రీతిలో ఆదరణ దక్కింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన వచ్చింది. (ఇది చదవండి: దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..) అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్ దక్కించుకోగా జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. థియేటర్లలో రికార్డు వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఓటీటీలోనూ దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది. 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యాన్ని కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: గీతగోవిందం వసూళ్లను విరాళంగా ఇచ్చాం, అందుకేనేమో!) ഒന്നിച്ച് കരകയറിയ ഒരു ദുരന്തത്തിൻ്റെ കഥ! The biggest blockbuster Mollywood has ever seen is now coming to Sony LIV 2018, streaming on Sony LIV from June 7th#SonyLIV #2018OnSonyLIV #BiggestBlockbuster #BasedOnTrueStory @ttovino #JudeAnthanyJoseph @Aparnabala2 #kavyafilmcompany pic.twitter.com/9UzcYSPz1j — Sony LIV (@SonyLIV) May 29, 2023