Kerala Theatre Owners Protest Against Tovino Thomas 2018 OTT Release - Sakshi
Sakshi News home page

2018 OTT Release: ఓటీటీకి '2018'.. కేరళలో తీవ్ర అభ్యంతరం!

Published Tue, Jun 6 2023 6:03 PM | Last Updated on Tue, Jun 6 2023 7:14 PM

Kerala theatre owners protest against Tovino Thomas 2018 OTT release - Sakshi

మలయాళ నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం '2018'. మాలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగులోనూ ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశారు. కేరళ వరదల నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని జూన్‌ 7న ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

(ఇది చదవండి: ఓటీటీకి బ్లాక్ బస్టర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!)

ఓటీటీ రిలీజ్‌పై అభ్యంతరం

హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఓటీటీ విడుదలపై కేరళలోని థియేటర్ల యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా ఓటీటీలో రిలీజ్ల చేయడంపై 7,8 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సినిమాను కేవలం ఐదు వారాల లోపే ఓటీటీలో విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్‌తో తాము రూ.200 కోట్లు నష్టపోతామని ఆరోపిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.170 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాస్, ఆసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి, అజు వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు.

(ఇది చదవండి: నా వల్ల పైకొచ్చినవాళ్లు గీత దాటారు, అతడి పేరు చెప్పను!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement