2018 Movie OTT Release On Sony Liv From June 7th - Sakshi
Sakshi News home page

2018 Movie: ఓటీటీకి వచ్చేస్తున్న 2018.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Mon, May 29 2023 8:07 PM | Last Updated on Mon, May 29 2023 8:53 PM

2018 Movie OTT Release On Sony liv From June 7th - Sakshi

మలయాళంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 2018. ఇటీవలే ఈ చిత్రాన్ని దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల చేశారు. ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన 25 రోజుల్లోనే రూ.160 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక టాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి ఊహించని రీతిలో ఆదరణ దక్కింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి  అనూహ్య స్పందన వచ్చింది.

(ఇది చదవండి: దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే..)

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్ దక్కించుకోగా జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. థియేటర్లలో రికార్డు వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఓటీటీలోనూ దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది. 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యాన్ని కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

(ఇది చదవండి: గీతగోవిందం వసూళ్లను విరాళంగా ఇచ్చాం, అందుకేనేమో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement