ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? | Anweshippin Kandethum Movie OTT Release Date And Details | Sakshi
Sakshi News home page

మలయాళంలో హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీ రిలీజ్

Published Fri, Mar 1 2024 1:55 PM | Last Updated on Fri, Mar 1 2024 3:04 PM

Anweshippin Kandethum Movie Ott Release Date And Details - Sakshi

మరో క్రేజీ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా దీని గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు మూవీ లవర్స్ కోసమా అన్నట్లు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చెబుతూ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.

ఇంతకీ ఏ సినిమా?
'2018' ఫేమ్ టొవినో థామస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'అన్వేషిప్పిన్ కండేతుమ్'. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. నిజ జీవిత సంఘటనలతో 90స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు తెగ ఆకట్టుకున్నాయి.

(ఇదీ చదవండి: శివరాత్రికి ఓటీటీలో హనుమాన్‌ సినిమా)

సినిమా కథేంటి?
ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) సబ్ ఇన్‌స్పెక్టర్. హాల్ టికెట్ కోసం కాలేజీకి వెళ్లిన లవ్‌లీ అనే అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఈ కేసుని ఆనంద్‌కి అప్పగిస్తారు. ఈ దర్యాప్తులో భాగంగా ఓ ప్రమాదం జరుగుతుంది. దీంతో ఇతడిని సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో కేసు. ఇది ఓ అమ్మాయి పరువు హత్య కేసు. ఇలా రెండు డిఫరెంట్ కేసుల్ని ఎస్ఐ ఆనంద్, తన బృందంతో కలిసి ఎలా డీల్ చేశాడు? చివరకు ఏమైందనేదే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా స్టోరీ.

ఓటీటీలో ఎప్పుడు?
మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మార్చి 8 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ మధ్యే సరైన థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాలేదు. కాబట్టి ఇది తెలుగు ఆడియెన్స్‌కి నచ్చే ఛాన్సులున్నాయి.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement