Tovino Thomas
-
ఓటీటీలో పాన్ ఇండియా సినిమా స్ట్రీమింగ్
మలయాళ నటుడు టొవినో థామస్- కృతిశెట్టి జోడీగా నటించిన కొత్త సినిమా 'ఏఆర్ఎం' (అజయంతే రంధం మోషణమ్) (ARM). సెప్టెంబర్ 12న పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. జితిన్ లాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సురభి లక్ష్మి, ఐశ్వర్య రాజేష్, రోహిణి వంటి వారు నటించారు. మిన్నల్ మురళి, 2018 వంటి డబ్బింగ్ చిత్రాలతో టొవినో థామస్‌కు టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు ఉంది.టొవినో థామస్‌కు 50వ చిత్రంగా విడుదలైన 'ఏఆర్ఎం' భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లకు పైగానే రాబట్టింది. ఇంతటి విజయాన్ని దక్కించుకున్న ఈ చిత్రం నవంబర్ 8న ఓటీటీలో విడుదల కానుందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెలిపింది. మలయాళంతో పాటు తెలుగు,తమిళ్,కన్నడ,హిందీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.వేర్వేరు కాలాల్లో సాగే మూడు తరాల కథ ఇది. డైరెక్టర్ జితిన్‌లాల్‌కు ఇదే తొలి చిత్రమైనప్పటికీ తెరకెక్కించిన తీరు చాలా బాగుంటుంది. నిధి అన్వేషణతో కూడిన ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు అద్భుతంగా చూపించాడు. ఈ మూవీకి ప్రధాన బలం కూడా ఇదే కావడం విశేషం. 90ల కాలం నాటి అమ్మాయిగా కృతిశెట్టి పాత్ర ఆకట్టుకుంటుంది. -
Bhargavi Nilayam Review: ఓ దెయ్యం పరిష్కరించుకున్న కథ!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘నీల వెళిచ్చమ్’(Neelavelicham) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఎక్కడైనా ప్రేమ కథలు చూస్తాం లేదంటే హారర్ కథలు చూస్తాం. కానీ ‘భార్గవి నిలయం’ (1964) హారర్ ప్రేమ కథా చిత్రమని చెప్పవచ్చు. ఎ. విన్సెంట్ దర్శకత్వంలో వచ్చిన ఈ బ్లాక్ అండ్ వైట్ మలయాళ సినిమాని రీమేక్ చేసి ‘నీల వెళిచ్చమ్’గా మన ముందు నిలిపారు దర్శకుడు ఆషిక్ అబు. ఈ చిత్రం కథాంశానికొస్తే... ఓ కథా రచయిత మారుమూల గ్రామంలోని ఓ భవంతిలోకి రావడంతో సినిమా మొదలవుతుంది. అదే భార్గవి నిలయం. ఆ ఊళ్లోని వారందరూ ఆ భవంతిలో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, ఆ అమ్మాయి ఆత్మ ఆ భవంతిలో తిరుగుతుందని భయపడుతూ ఎవరూ అటు వైపు వెళ్లడానికి కూడా సాహసించరు. కానీ ఈ రచయిత ధైర్యంగా ఆ భవంతిలోకి అడుగుపెట్టి ఆ దెయ్యం కథ రాయాలనుకుంటాడు. (చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)భార్గవి నిలయంలో అడుగుపెట్టిన రచయితకు దెయ్యం కనబడిందా? కనబడిన దెయ్యం తన కథ చెప్పిందా? అలాగే ఆ ఆత్మ తన కథలోని సమస్యను ఎలా పరిష్కరించుకోగలిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే ఇదో వింటేజ్ కథ. సినిమా స్క్రీన్‌ప్లే కొంత ల్యాగ్లో నడిచినా చూసే ప్రేక్షకుడిని మాత్రం రీ రికార్డింగ్, అద్భుతమైన సంగీతంతో కొంతవరకు ఆకట్టుకుంటుంది. కొంత ‘చంద్రముఖి’ సినిమా ఛాయలు కనబడినా చివరకు ఓ మంచి సినిమా చూశామన్న అనుభూతి కలుగుతుంది. టొవినో థామస్ హీరోగా నటించారు. ఈ చిత్ర కథానాయకుడు సినిమాలో భార్గవి బంగారం అని దెయ్యాన్ని ప్రేమగా పిలుస్తున్నప్పుడల్లా ప్రేక్షకుడికి ప్రేమానుభూతి కలుగుతుందన్న విషయంలో అతిశయోక్తి లేదు. తెలుగులో ‘భార్గవి నిలయం’గా అనువాదం అయి, ‘ఆహా ఓటీటీ’లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఓసారి చూడొచ్చు.– ఇంటూరు హరికృష్ణ -
మూడు పాత్రలు సవాల్‌గా అనిపించింది: టోవినో థామస్
‘‘ఏఆర్ఎమ్’ సినిమా మొదలుపెట్టినప్పుడు నటుడిగా ఇది నా 50వ చిత్రం అవుతుందనుకోలేదు. ఎగ్జయిటింగ్ స్క్రిప్ట్ ఇది. ఈ చిత్రంలో మూడు వైవిధ్యమైన పాత్రలు చేయడం పెద్ద సవాల్‌గా అనిపించింది. అయితే ఈ మూడు పాత్రలు దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి’’ అని హీరో టోవినో థామస్ అన్నారు. జితిన్ లాల్ దర్శకత్వంలో టోవినో థామస్ హీరోగా కృతీ శెట్టి, ఐశ్వర్యా రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఏఆర్ఎమ్’. డా. జకారియా థామస్‌తో కలిసి లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. తెలుగులో ఈ నెల 12న మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా టోవినో థామస్ మాట్లాడుతూ– ‘‘చిన్న నటుడిగా నా కెరీర్ ఆరంభించాను. సపోర్టింగ్, కామెడీ, విలన్ రోల్స్ చేశాను. 2016 నుంచి లీడ్ రోల్స్ చేస్తున్నా. నటుడు కావాలనేది నా కల... ఇప్పుడు ఆ కలలో జీవిస్తున్నాను. ‘అజాయంతే రందం మోషణం’ (ఏఆర్ ఎమ్) అంటే అజయన్ రెండో దొంగతనం అని అర్థం. మిగతా భాషల వారికి ఈ పేరు పలకడం ఇబ్బందిగా ఉంటుందని ‘ఏఆర్ఎమ్’గా పిలుస్తున్నాం. యూనివర్సల్‌గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. మైత్రీ లాంటి టాప్ డిస్ట్రిబ్యూటర్స్ మా సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల మలయాళం సినిమాలకు తెలుగులోనూ ప్రేక్షకాదరణ దక్కుతోంది. చిన్న సినిమాలైన ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ సైతం టాలీవుడ్లో రాణించాయి. ఓటీటీలోనూ మలయాళ చిత్రాలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా టోవినో థామస్ నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.గతేడాది థియేటర్లలో విడుదలైన నీలవెలిచమ్ మూవీ దాదాపు 16 నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. ఈ సినిమా త్వరలోనే తెలుగు ఆడియన్స్‌ను అలరించనుంది. భార్గవి నిలయం పేరుతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 5 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రానికి ఆషిక్ అబు దర్శకత్వం వహించారు. ఇందులో రీమా, రోషన్ మ్యాథ్యూ, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు. Our Tovino is ready to entertain you with'#BhargaviNilayam premieres on #aha from Sep 5th.🏠🎬@roshanmathew22 @PoojaMohanraj @ttovino @shinetomchacko_ @rimakallingal pic.twitter.com/leMWbAJURc— ahavideoin (@ahavideoIN) September 3, 2024 -
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వజక్కు. 2021లోనే ఈ చిత్రం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ కాలేదు. దీనికి కారణం దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్, హీరో టొవినో థామస్ మధ్య వివాదమే. అయితే మూడేళ్ల పాటు ఓపికగా ఉన్న డైరెక్టర్ సడన్‌గా షాకిచ్చాడు. ఈ సినిమాను ఓ వీడియో ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశాడు.తాజాగా వజక్కు చిత్రాన్ని వీమియో అనే ప్లాట్ఫామ్లో డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్ అప్లోడ్ చేశారు. ఈ ప్లాట్‌ఫామ్ కూడా దాదాపు యూట్యూబ్ లాగే ఉంటుంది. వీమియోలో ఈ చిత్రాన్ని యూజర్లు ఉచితంగా చూసేలా అందుబాటులోకి తెచ్చారు. అయితే మొదట వజక్కు చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు హీరో టొవినో థామస్ అంగీకరించలేదని శశిధరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన కెరీర్‌పై ప్రభావం చూపుతుందనే కారణంతో థియేటర్లలోనూ.. ఓటీటీలోనూ ఈ మూవీని రిలీజ్ చేయకుండా థామస్ అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారుస్పందించిన టొవినో థామస్సనల్ శశిధరన్ చేసిన ఆరోపణలకు హీరో టొవినో థామస్ స్పందించారు. ఈ సినిమా నిర్మాణం కోసం తాను రూ.27లక్షలను ఖర్చు చేశానని.. తనకు ఎలాంటి లాభం రాలేదని అన్నారు. ఈ సినిమా విడుదల కాకపోవడానికి డైరెక్టరే కారణమని చెప్పారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించేందుకు కూడా ఆయన అంగీకరించలేదని టొవినో చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో కునీ కుశృతి, సుదేవ్ నాయర్, అజీస్ నెడుమంగద్, బైజూ నీటో కీలకపాత్రలు పోషించారు. పారట్ మౌంట్ పిక్చర్స్, టొవినో థామస్ ప్రొడక్షన్స్ బ్యానర్లు నిర్మించిన ఈ మూవీకి పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందించారు. -
'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఈ మధ్య మలయాళ సినిమాలు సెన్సేషన్ సృష్టించాయి. ఫిబ్రవరిలో రిలీజైన నాలుగు మూవీస్ కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అందులో ఒకటే 'అన్వేషిప్పిన్ కండేతుమ్'. పోలీస్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం? (ఇదీ చదవండి: 'ప్రేమలు' సినిమా రివ్యూ) కథేంటి? ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) చింగావనం అనే ఊరిలో సబ్ ఇన్స్పెక్టర్. లవ్ లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు తన దగ్గరకు వస్తుంది. చాలా చాక్యంగా అన్ని ఆధారాలతో నేరస్తుడిని పట్టుకుంటారు. కానీ ఊహించని విధంగా అతడు పోలీసులు కళ్లముందే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. దీంతో ఆనంద్ & టీమ్‌పై సస్పెన్షన్ వేటు. కొన్నాళ్లకు అనధికారికంగా ఆనంద్ టీమ్ దగ్గరకు మరో కేసు వస్తుంది. శ్రీదేవిని అమ్మాయి మర్డర్ కేసు ఇది. అందరూ చేతులెత్తేసిన ఈ కేసుని ఆనంద్ టీమ్ ఎలా పరిష్కరించింది? ఇంతకీ నిందుతుడు ఎవరనేదే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' స్టోరీ. ఎలా ఉందంటే? థ్రిల్లర్ సినిమా అనగానే.. మిస్సింగ్ లేదా మర్డర్ కేసు. దొంగని పట్టుకోవడానికి ఓ పోలీసు ఆఫీసర్. సవాళ్లు, పలువురు వ్యక్తులపై అనుమానం. చివరకు నిందుతుడు ఎలా దొరికాడు? అనేదే మీకు గుర్తొస్తుంది. చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఎవరెంత గ్రిప్పింగ్‌గా తీశారా అనేదే ఇక్కడ పాయింట్. ఆ విషయంలో 'అన్వేషిప్పిన్ కండేతుమ్' మూవీ డిస్టింక్షన్లో పాస్ అయిపోయింది. ఒక్క టికెట్ మీద రెండు సినిమాలు అన్నట్లు ఈ చిత్రంలో హీరో రెండు కేసుల్ని సాల్వ్ చేస్తాడు. సస్పెన్షన్‌లో ఉన్న హీరో.. ఎస్పీ ఆఫీస్‌కి రావడంతో సినిమా ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తుంది. ఎస్సైగా ఆనంద్.. పోలీస్ స్టేషన్లో జాయిన్ కావడం, కొన్నాళ్లు గడవడం.. ఓ రోజు లవ్లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు వస్తుంది. ఇంటి పరిసరాల్లో వెతకగా ఆ అమ్మాయి శవం దొరుకుతుంది. ఎవరు చంపారు? ఎందుకు చంపారు అనేది ఫస్టాప్ అంతా చూపించారు. నిందితుడు విషయంలో ఓ షాకింగ్ ఘటన జరగడంతో ఇంటర్వెల్ పడుతుంది. ఈ సంఘటన.. ఆనంద్ & టీమ్‌ని ఇబ్బందుల్లో పడేస్తుంది. అదే టైంలో మరో అమ్మాయి మర్డర్ కేసు వీళ్ల దగ్గరికి వస్తుంది. దీన్ని చేధించడం అంతా సెకండాఫ్‌లో ఉంటుంది. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) ఈ సినిమాలో మర్డర్ కేసు.. దొంగ దొరకడం అనే పాయింట్ చూపిస్తూనే.. పోలీస్ వ్యవస్థలో జరిగే రాజకీయాల్ని కూడా చూపించారు. 1980-90 కాలమానాన్ని తీసుకుని డైరెక్టర్ చాలా మంచి పనిచేశాడు. అప్పటి కాలానికి తగ్గట్లు డ్రస్సులు, ఇల్లు, వాతావరాణన్ని అద్భుతంగా క్రియేట్ చేశారు. అలానే హీరో పోలీసు అనగానే అనవసరమైన బిల్డప్పుల జోలికి పోకుండా స్టోరీకి తగ్గట్లు సినిమా తీశారు. దర్యాప్తు చూపించే విధానంగా మిమ్మల్ని ఎటు డైవర్ట్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా చూసేలా చేస్తుంది. సాధారణంగా ఓ సినిమాలో ఒక్క కథ మాత్రమే ఉంటుంది. ఇందులో ఇంటర్వెల్ ముందు ఒకటి. తర్వాత ఒకటి ఉంటుంది. అంటే ప్రేక్షకులకు డబుల్ ధమాకా. ఎవరెలా చేశారు? అంకిత భావంతో పనిచేసే ఎస్సై ఆనంద్‌గా టొవినో థామస్ ఆకట్టుకున్నాడు. పాత్రకు ఎంత కావాలో అంత చేశాడు. మిగతా పాత్రధారులందరూ కూడా సినిమాకు తగ్గట్లు చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇందులో హీరోయిన్లు లాంటి వాళ్లు ఎవరూ లేకపోవడం రిలాక్సింగ్ విషయం. రెండు వేర్వేరు కేసుల్లో డిఫరెంట్ యాక్టింగ్ తో టొవినో ఆకట్టుకున్నాడు. ఇక టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ డార్విన్ కురియాకోస్ ఫెర్ఫెక్ట్ థ్రిల్లర్ సినిమాని ప్రేక్షకులకు అందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. ఓ థ్రిల్లర్ మూవీకి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. సినిమా చూస్తున్నంతసేపు మీకు కూడా ఓ టెన్షన్ క్రియేట్ అవుతుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ కూడా బ్యూటీఫుల్. ఆర్ట్ డిపార్ట్మెంట్ 1980 వాతావరణాన్ని ఉన్నది ఉన్నట్లు చూపించింది. ఓవరాల్‌గా చెప్పుకుంటే ఓ మంచి థ్రిల్లర్ చూసి చాలారోజులైంది అనుకుంటే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' ట్రై చేయండి. పక్కా నచ్చేస్తుంది. -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరో క్రేజీ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా దీని గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు మూవీ లవర్స్ కోసమా అన్నట్లు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చెబుతూ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏ సినిమా? '2018' ఫేమ్ టొవినో థామస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'అన్వేషిప్పిన్ కండేతుమ్'. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. నిజ జీవిత సంఘటనలతో 90స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు తెగ ఆకట్టుకున్నాయి. (ఇదీ చదవండి: శివరాత్రికి ఓటీటీలో హనుమాన్ సినిమా) సినిమా కథేంటి? ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) సబ్ ఇన్స్పెక్టర్. హాల్ టికెట్ కోసం కాలేజీకి వెళ్లిన లవ్లీ అనే అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఈ కేసుని ఆనంద్కి అప్పగిస్తారు. ఈ దర్యాప్తులో భాగంగా ఓ ప్రమాదం జరుగుతుంది. దీంతో ఇతడిని సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో కేసు. ఇది ఓ అమ్మాయి పరువు హత్య కేసు. ఇలా రెండు డిఫరెంట్ కేసుల్ని ఎస్ఐ ఆనంద్, తన బృందంతో కలిసి ఎలా డీల్ చేశాడు? చివరకు ఏమైందనేదే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా స్టోరీ. ఓటీటీలో ఎప్పుడు? మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మార్చి 8 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ మధ్యే సరైన థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాలేదు. కాబట్టి ఇది తెలుగు ఆడియెన్స్‌కి నచ్చే ఛాన్సులున్నాయి. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) -
రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా
ఓటీటీల వచ్చిన తర్వాత మూవీ లవర్స్ చాలా సదుపాయం అయిపోయింది. ఎందుకంటే మహా అయితే లేదంటే మరోవారం అంతే. హీరో ఎవరనేది సంబంధం లేకుండా ఆయా మూవీస్.. ఓటీటీల్లో రిలీజైపోతున్నాయి. ఇప్పుడు కూడా అలానే ఓ స్టార్ హీరో నటించిన హిట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైపోయింది. కానీ థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల్లోనే స్మాల్ స్క్రీన్‌పై రానుండటం షాకింగ్ విషయం. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) ఏంటా సినిమా? మలయాళ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది రిలీజైన బెస్ట్ సినిమా '2018'. ఇందులో హీరోగా నటించిన టొవినో థామస్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఓటీటీల్లో పలు డబ్బింగ్ చిత్రాల ద్వారా.. తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానుల్ని సంపాదించాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'అదృశ్య జలకంగళ్'. వార్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో.. టొవినో డీ గ్లామర్ రోల్ చేశాడు. ఓటీటీలో ఎప్పుడు? ఈ నవంబరు 24న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. హిట్ టాక్‌తో పాటు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అలాంటి ఈ చిత్రాన్ని.. రెండే వారాల్లోకి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు. డిసెంబరు 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. ఈ సినిమాని నిర్మించింది. ఓటీటీలో కాబట్టి తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశముంది. అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకుని హిట్ అయిన ఈ మూవీని మరీ రెండు వారాల్లోనే ఓటీటీలో తీసుకొస్తుండటం మూవీ లవర్స్‌కి మంచి కిక్ ఇస్తోంది. (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
ట్రిపుల్ ట్రీట్: ఒక సినిమా.. మూడింతల ఆనందం
వెండితెరపై తమ అభిమాన హీరో ఒక్క పాత్రలో కనిపిస్తేనే కేకలు, విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తారు అభిమానులు. అదే హీరో ద్విపాత్రాభినయం చేస్తే ఫ్యాన్స్ ఆనందం డబుల్ అవుతుంది. ట్రిపుల్ గెటప్స్‌లో కనిపిస్తే.. ఫ్యాన్స్ ఆనందం మూడింతలు అవుతుంది. తాజాగా దక్షిణాదిలో ధనుష్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, టొవినో థామస్ వంటి హీరోలు తొలిసారి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం. కెప్టెన్ మిల్లర్ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకెళుతున్నారు హీరో ధనుష్. ప్రస్తుతం అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఆయన పాన్ ఇండియా సినిమా ‘కెప్టెన్ మిల్లర్’ చేస్తున్నారు. 1930–1940 నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ధనుష్ మూడు గెటప్స్‌లో కని పిస్తారు. ఇప్పటికి రెండు గెటప్స్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ లుక్‌లో పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, పెద్ద సైజు గన్ను పట్టుకుని చుట్టూ మరణించిన సైనికుల మధ్య యుద్ధ భూమిలో నిల్చుని ఉన్న ధనుష్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ధనుష్ చేస్తున్న పాత్రల్లో కెప్టెన్ మిల్లన్ పాత్ర ఒకటి. మిగతా రెండు పాత్రల వివరాలు తెలియాల్సి ఉంది. మామా మశ్చీంద్ర కెరీర్ పారంభం నుంచి వినూత్నమైన, కథా బలమున్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు హీరో సుధీర్ బాబు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మామా మశ్చీంద్ర’. నటుడు, డైరెక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మృణాలినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లు. ఈ సినిమాలో తొలిసారి మూడు పాత్రల్లో (డీజే, డాన్, దుర్గ) సందడి చేయనున్నారు సుధీర్ బాబు. ఈ మూడు లుక్స్‌కి సంబంధించిన పోస్టర్లు విడుదలయ్యాయి. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. కామెడీ, రొమాన్స్, యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రీక్వెల్‌లో మూడు పాత్రలు.. డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో శ్రీ విష్ణు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సామజ వరగమన’ జూన్ 29న విడుదలై సూపర్ హిట్‌గా దూసుకెళుతోంది. శ్రీ విష్ణు కెరీర్లో అత్యధిక వసూళ్లు (ఇప్పటికే 40 కోట్లు దాటాయి) సాధించిన చిత్రంగా ‘సామజ వరగమన’ నిలిచింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న శ్రీ విష్ణు తాను ఓ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘రాజ రాజ చోర’ (2021)తో హిట్ కాంబో అనిపించుకున్న శ్రీ విష్ణు– డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ఈ మూవీలోనే శ్రీ విష్ణు త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ‘రాజ రాజ చోర’కి ప్రీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. -
మలయాళ ఇండస్ట్రీకి మైత్రీ మూవీ మేకర్స్, టొవినో థామస్ హీరోగా..
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలతో పలు బ్లాక్ బస్టర్లను అందించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మలయాళంలో అడుగుపెట్టింది. తొలి ప్రాజెక్ట్‌గా ‘గాడ్ స్పీడ్’ అనే బ్యానర్‌తో కలిసి ‘నడికర్ తిలగం’ సినిమాకి శ్రీకారం చుట్టారు. టొవినో థామస్ హీరోగా లాల్ జూనియర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నవీన్ యర్నేని, వై. రవిశంకర్, అల్లన్ ఆంటోని, అనూప్ వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం కొచ్చిలోప్రారంభమైంది. ‘‘టొవినో థామస్ ఈ చిత్రంలో అనేక సవాళ్లతో కూడిన సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ పాత్రను పోషిస్తున్నారు. బుధవారమే రెగ్యులర్ షూటింగ్‌ప్రారంభించాం’’ అన్నారు. భావన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆల్బీ, సంగీతం: యక్జాన్ గారి పెరీరా, నేహా నాయర్. -
త్రిష కోసం ఎదురుచూస్తున్నానంటున్న యంగ్ హీరో
‘ఫోరెన్సిక్’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో టోవినో థామస్, దర్శక ద్వయం అఖిల్ పాల్ – అనస్‌ఖాన్ కాంబినేషన్లో రూపొందనున్న మలయాళ చిత్రం ‘ఐడెంటిటీ’. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషను ఎంపిక చేసింది యూనిట్. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ‘ఐడెంటిటీ’. ఎర్నాకులం, బెంగళూరు, మారిషష్, కోయంబత్తూరు లొకేషన్్సలో షూటింగ్‌కి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 'త్రిషతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అన్నారు '2018' సినిమా ఫేమ్ హీరో టోవినో థామస్. 'ఐడెంటిటీ’లో జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని పేర్కొన్నారు త్రిష. కాగా నివిన్ పౌలి ‘హే జూడ్’, మోహన్‌లాల్ ‘రామ్’ (చిత్రీకరణ జరుగుతోంది) తర్వాత మలయాళంలో త్రిష చేస్తున్న మూడో చిత్రం ‘ఐడెంటిటీ’. -
'2018' సినిమాపై వివాదం.. ఆ విషయంలో తీవ్ర అభ్యంతరం!
మలయాళ నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం '2018'. మాలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగులోనూ ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశారు. కేరళ వరదల నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని జూన్ 7న ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. (ఇది చదవండి: ఓటీటీకి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!) ఓటీటీ రిలీజ్‌పై అభ్యంతరం హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఓటీటీ విడుదలపై కేరళలోని థియేటర్ల యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా ఓటీటీలో రిలీజ్‌ల చేయడంపై 7,8 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సినిమాను కేవలం ఐదు వారాల లోపే ఓటీటీలో విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్‌తో తాము రూ.200 కోట్లు నష్టపోతామని ఆరోపిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.170 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాస్, ఆసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి, అజు వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: నా వల్ల పైకొచ్చినవాళ్లు గీత దాటారు, అతడి పేరు చెప్పను!) -
ఓటీటీకి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!
మలయాళంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 2018. ఇటీవలే ఈ చిత్రాన్ని దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల చేశారు. ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన 25 రోజుల్లోనే రూ.160 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక టాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి ఊహించని రీతిలో ఆదరణ దక్కింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన వచ్చింది. (ఇది చదవండి: దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..) అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్ దక్కించుకోగా జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. థియేటర్లలో రికార్డు వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఓటీటీలోనూ దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది. 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యాన్ని కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: గీతగోవిందం వసూళ్లను విరాళంగా ఇచ్చాం, అందుకేనేమో!) ഒന്നിച്ച് കരകയറിയ ഒരു ദുരന്തത്തിൻ്റെ കഥ! The biggest blockbuster Mollywood has ever seen is now coming to Sony LIV 2018, streaming on Sony LIV from June 7th#SonyLIV #2018OnSonyLIV #BiggestBlockbuster #BasedOnTrueStory @ttovino #JudeAnthanyJoseph @Aparnabala2 #kavyafilmcompany pic.twitter.com/9UzcYSPz1j — Sony LIV (@SonyLIV) May 29, 2023 -
గీతగోవిందం వసూళ్లను విరాళంగా ఇచ్చాం, అందుకేనేమో!
‘‘గీతగోవిందం’ సినిమాను కేరళలో విడుదల చేసి, వసూళ్లను అక్కడ విరాళంగా ఇచ్చాం(కేరళలో 2018 వచ్చిన వరదలను ఉద్దేశిస్తూ). బాహుశా.. అందుకేనేమో మలయాళ హిట్ మూవీ ‘2018’ ని తెలుగులో విడుదల చేసే అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ వేణు, ఆంథోనీ, పద్మ కుమార్‌గార్లకు థ్యాంక్స్. హృదయాన్ని హత్తుకునే సినిమా ‘2018’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. టోవినో థామస్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘2018’. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఈ నెల 3న రిలీజైంది. ఈ మూవీని ఈ నెల 26న తెలుగులో ‘బన్నీ’ వాసు విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ‘2018’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో టోవినో థామస్ మాట్లాడుతూ–‘‘ఇకపై నేను నటించే సినిమాలను తెలుగులోనూ విడుదల చేస్తాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాని థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు జూడ్ ఆంథోనీ జోసెఫ్. ఈ కార్యక్రమంలో అపర్ణా బాలమురళి, నిర్మాత ఎస్కేఎన్ పాల్గొన్నారు. -
దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
కంటెంట్ నచ్చితే డబ్బింగ్ సినిమానా, రీమేక్ చిత్రమా అని చూడకుండా థియేటర్స్‌కి బారులు తీస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో ఇతర భాష చిత్రాలు ఎక్కువగా డబ్ అవుతుంటాయి. తాజాగా తెలుగులో విడుదలైన మలయాళ సూపర్ హిట్ ‘2018’ చిత్రానికి కూడా టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన లభిస్తుంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటిరోజు 1 కోట్లు వసూలు చేసింది. (చదవండి: 2018 మూవీ రివ్యూ) కేవలం మౌత్ టాక్ ఈ సినిమా రెండో రోజు 1.7 గ్రాస్ ను సాధించింది. మొదటి రోజు కంటే రెండవరోజు కలక్షన్స్ పెరగడం అతి తక్కువ సినిమాలకు జరుగుతుంది. 2018 సినిమాకి అమాంతం 70 కలక్షన్స్ పెరగడం శుభసూచకం. తెలుగు ప్రేక్షకులు ఒక గొప్ప సినిమాను ఆదరిస్తారు అని నమ్మిన ప్రముఖ నిర్మాత బన్నీవాసు నమ్మకం మరోసారి రుజువైంది. ఈ రెండు రోజులు గాను ఈ సినిమా మొత్తం కలక్షన్స్ 2.7 కోట్ల గ్రాస్ పైగా ఉంది. 2018 కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. -
ఇకపై నా సినిమాలన్నీ తెలుగులో డబ్ చేస్తా: టొవినో థామస్
‘2018 ’చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమాకు కేరళలో మాత్రమే కాదు అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇకపై నా సినిమాలన్నీ తెలుగులో డబ్ అయ్యేటట్లు చూస్తాను’అని మలయాళ హీరో టొవినో థామస్ అన్నారు. టొవినో థామస్ ప్రధాన పాత్రధారిగా, అపర్ణా బాలమురళి, కుంచక్కో బోబన్ కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘2018’. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 26న ప్రముఖ నిర్మాత బన్నివాసు రిలీజ్ చేయగా.. మంచి స్పందన లభించింది. తొలి రోజు రూ. కోటికి పైగా వసూళ్లను రాబట్టి దుసూకెళ్తోంది. (చదవండి: 2018 మూవీ రివ్యూ) ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది . ఈ సందర్భంగా హీరో టోవినో థామస్ మాట్లాడుతూ.. ‘బన్నీ వాసు గారు ఈ సినిమా రిజల్ట్ ను మార్నింగ్ చూపిస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. చాలా మందికి సినిమా ఎంటర్టైన్మెంట్. కానీ నా వరకు సినిమా జీవితం. ముందున్న రోజుల్లో ఇంకా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను’అన్నారు. ‘నేను 17 సినిమాల వరకు తెలుగులో ప్రొడ్యూస్ చేశాను.కానీ ఈ సినిమా నాకు ఒక ఎక్స్ట్రా లేబుల్ ఇచ్చింది. .పబ్లిసిటి కి ఎక్కువ టైం లేకపోయినా ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మనిషి యొక్క హృదయాన్ని కదిలిస్తుందని నమ్మాను. ఇప్పుడు అదే నిజమైంది. అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.చాలా ఆనందంగా ఉంది’అని నిర్మాత బన్నీవాసు అన్నారు. ఈ సినిమా రియల్ హీరోస్ కి ఒక ట్రిబ్యూట్ అని అపర్ణ బాలమురళి అన్నారు.