టొవినో థామస్, త్రిష, వినయ్ రాయ్, మందిరా బేడి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’. దర్శక ద్వయం అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ ఈ మూవీని తెరకెక్కించారు. రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 2న మలయాళంలో రిలీజైంది. ఈ సినిమాకు మలయాళ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది.
కాగా ఈ సినిమా అదే టైటిల్‌తో తెలుగులో ఈ నెల 24న విడుదల కానుంది. మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఉత్కంఠగా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టు కునేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment