త్రిష కోసం ఎదురుచూస్తున్నానంటున్న యంగ్‌ హీరో | Trisha Krishnan joins forces with Tovino Thomas in Malayalam movie Identity | Sakshi
Sakshi News home page

త్రిష కోసం ఎదురుచూస్తున్నానంటున్న యంగ్‌ హీరో

Published Mon, Jul 10 2023 3:42 AM | Last Updated on Mon, Jul 10 2023 6:53 AM

Trisha Krishnan joins forces with Tovino Thomas in Malayalam movie Identity - Sakshi

‘ఫోరెన్సిక్‌’ వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో టోవినో థామస్, దర్శక ద్వయం అఖిల్‌ పాల్‌ – అనస్‌ఖాన్‌  కాంబినేషన్‌లో రూపొందనున్న మలయాళ చిత్రం ‘ఐడెంటిటీ’. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేసింది యూనిట్‌. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం ‘ఐడెంటిటీ’. ఎర్నాకులం, బెంగళూరు, మారిషష్, కోయంబత్తూరు లొకేషన్‌్సలో షూటింగ్‌కి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

'త్రిషతో స్క్రీన్‌  షేర్‌ చేసుకునేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అన్నారు '2018' సినిమా ఫేమ్‌ హీరో టోవినో థామస్‌. 'ఐడెంటిటీ’లో జాయిన్‌  అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని పేర్కొన్నారు త్రిష. కాగా నివిన్‌  పౌలి ‘హే జూడ్‌’, మోహన్‌లాల్‌ ‘రామ్‌’ (చిత్రీకరణ జరుగుతోంది) తర్వాత మలయాళంలో త్రిష చేస్తున్న మూడో చిత్రం ‘ఐడెంటిటీ’.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement