త్రిష,టొవినో యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా తెలుగులో విడుదల | Tovino Thomas And Trisha Identity Movie Released In Telugu | Sakshi
Sakshi News home page

త్రిష,టొవినో యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా తెలుగులో విడుదల

Published Tue, Jan 21 2025 7:41 AM | Last Updated on Tue, Jan 21 2025 9:36 AM

Tovino Thomas And Trisha Identity Movie Released In Telugu

మలయాళ స్టార్‌ హీరో టొవినో థామస్(Tovino Thomas), త్రిష(Trisha) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఐడెంటిటీ(Identity Movie) చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. ఈమేరకు తాజాగా తెలుగు వర్షన్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో   వినయ్‌ రాయ్, మందిరా బేడి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. అఖిల్‌ బాయ్, అనాస్‌ ఖాన్‌ ఈ మూవీని తెరకెక్కించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్‌ నిర్మించారు. మ‌ల‌యాళంలో జ‌న‌వ‌రి 2న విడుదలైన ఈ చిత్రం తెలుగులో జనవరి 24న రిలీజ్‌ కానుంది.

ఉత్కంఠగా సాగే ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ప్రేక్షకులను ఆకట్టు కునేలా ఉందని ఇప్పటికే మలయాళ రివ్యూలు తేల్చేశాయి. దీంతో సుమారు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఐఎండీబీ రేటింగ్‌లో కూడా 9 వరకు ఉంది. దీంతో టాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ఈ చిత్రంపై మక్కువ చూపారు. అయితే, మాక్స్‌ శ్రీనివాస్‌ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్‌ చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ‘ఐడెంటిటీ’ టైటిల్‌తోనే రిలీజ్‌ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: నేనూ మనిషినే కదా.. నా ముందు ఇలాంటి పని చేయకండి: సాయిపల్లవి)
ఐడెంటిటీ చిత్రంలో స్కెచ్‌ ఆర్టిస్టుగా  టొవినో థామస్‌ నటించారు. ఓ క్రైమ్‌ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో టొవినో థామస్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె చెబుతున్న ఆధారాలతో అతను ఎవరి  స్కెచ్‌ వేశారు అనేది చాలా ఆసక్తిగా సినిమా ఉంటుంది. సంచ‌ల‌నం సృష్టించిన ఒక మ‌ర్డ‌ర్ కేసును ఓ పోలీస్ ఆఫీస‌ర్‌, స్కెచ్ ఆర్టిస్ట్ క‌లిసి ఎలా సాల్వ్ చేశారు అనే క‌థ‌తో ఈ చిత్రం ఉంటుంది. సంక్రాంతికి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాల‌ని మేకర్స్‌ అనుకున్నారు. కానీ, టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు ఉండటంవల్ల అవకాశం లేకుండాపోయింది. అందుకే ఈనెల 24వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమాలను ఇష్టపడే వారు ఐడెంటిటీకి ఫిదా అవుతారు.

టొవినో థామస్ నటించిన ఏఆర్ఎం మూవీ గతేడాది సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.120 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆయన కెరీర్‌లో ఈ చిత్రం ఓ ల్యాండ్‌మార్క్ అని చెప్పవచ్చు. ఇప్పుడీ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement