Identity
-
స్కెచ్ వేస్తారా?
త్రిష, టొవినో థామస్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ కానుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.ఈ చిత్రంలో స్కెచ్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు టొవినో థామస్. ఓ క్రైమ్‌ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో అతని స్కెచ్ వేస్తారా? అని టొవినోకు చెబుతున్నట్లుగా టీజర్లో కనిపిస్తోంది. టొవినోకు ఆ నేరస్తుడి ముఖాకృతిని త్రిష వివరిస్తుంటారు. వచ్చే జనవరిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. -
అవును..! వారిది గుర్తింపు కోసం ఆరాటమే..
టీనేజర్లు ఎందుకు చిత్రంగా ప్రవర్తిస్తుంటారు? ఎందుకు చిత్ర విచిత్రమైన డ్రెస్‌లు వేస్తారు? ఎందుకు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుంటారు? ఎందుకంటే, అదంతా గుర్తింపు నిర్మాణ (ఐడెంటిటీ ఫార్మేషన్) ప్రక్రియలో భాగం. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో భాగం. అయితే ఐడెంటిటీ ఫార్మేషన్ అనేది అంత సులువుగా, సూటిగా జరగదు. స్వీయ భావన (సెల్ఫ్–కాన్సెప్ట్), స్వీయ గౌరవం (సెల్ఫ్–ఎస్టీమ్), సామాజిక గుర్తింపు (సోషల్ ఐడెంటిటీ)ల మధ్య సంక్లిష్ట చర్యల ద్వారా జరుగుతుంది.నేనెవరు? నేనేం కావాలనుకుంటున్నాను? సమాజంలో నా స్థానం ఏమిటి? వంటి ప్రశ్నలతో యువత తర్జన భర్జన పడుతుంది. అందుకోసం విభిన్న పాత్రలను, విలువలను, విశ్వాసాలను పరీక్షిస్తారు. ఈ ప్రక్రియ సజావుగా జరిగినప్పుడు సరైన ఐడెంటిటీ ఏర్పడుతుందని లేదా గందరగోళంలో పడతారని ప్రముఖ డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ ఎరిక్ ఎరిక్సన్ చెప్పాడు. అందుకే దీన్ని Identity Vs Role confusion అని పేర్కొన్నాడు.నేనెవరు?ఒక వ్యక్తికి తన సామర్థ్యం, విలువలు, వ్యక్తిత్వ లక్షణాలపై ఉన్న అవగాహననే స్వీయభావన అంటారు. యవ్వనంలో ఇది వేగంగా మారుతూ ఉంటుంది. కొత్త కొత్త స్నేహాలు చేస్తారు, కొత్త హాబీలను స్వీకరిస్తారు, కొత్త కొత్త దుస్తులు ప్రయత్నిస్తారు. విరుద్ధమైన ప్రవర్తనలను ప్రదర్శిస్తుంటారు. ఇదంతా తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో భాగమే. కానీ తల్లిదండ్రులు దీన్ని తప్పుగా అర్థం చేసుకుని నిలకడగా ఉండరంటూ విమర్శిస్తుంటారు.ఉదాహరణకు, 15 ఏళ్ల మాయ చదువుపై శ్రద్ధ పెట్టడమా లేక సింగింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొనడమా అనే విషయంలో తర్జన భర్జన పడుతోంది. కానీ తల్లిదండ్రులు చదువుపైనే దృష్టిపెట్టాలని చెప్పడంతో దానికి అనుగుణంగా ఆమె స్వీయ భావన రూపుదిద్దుకుంటుంది. గుర్తింపు నిర్మాణంలో ఇది ముఖ్యమైన అంశం. యవ్వనంలో ఇలా అన్వేషించడం, నచ్చినదానికి కట్టుబడి ఉండటం వలన సరైన ఐడెంటిటీ ఏర్పడుతుందని, లేదంటే గందరగోళంలో పడతారని మీయుస్, తదితరులు చేసిన దీర్ఘకాలిక అధ్యయనం పేర్కొంది.నా విలువేంటి? ఒక వ్యక్తి తన విలువను తానెలా చూస్తున్నారనేదే స్వీయగౌరవం. ఇతరులతో పోల్చుకోవడం, విద్యాపరమైన ఒత్తిళ్లు, బాడీ ఇమేజ్‌కు సంబంధించిన అంశాల వల్ల టీనేజ్‌లో ఇది తరచుగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, పదహారేళ్ల రవి సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇతరులతో పోల్చుకుని, తాను అంత అందంగా లేనని మథనపడుతున్నాడు. దానివల్ల అతని స్వీయగౌరవం తగ్గిపోతోంది. దాంతో బయటకు వెళ్లడానికి జంకుతున్నాడు. నిజానికి చదువులో అందరికంటే ముందుంటాడు. కానీ దాని విలువను అతను గుర్తించడంలేదు. స్వీయ–కరుణ (self&compassion) అనే భావనను అభివృద్ధి చేయడం వల్ల ఈ నష్టాన్ని తగ్గించవచ్చని నెఫ్ (2011) పరిశోధనలు తేల్చాయి. సామాజిక గుర్తింపు..వ్యక్తిగత గుర్తింపుతో పాటు సామాజిక గుర్తింపు కూడా యవ్వనంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే స్నేహ సమూహాలు, సాంస్కృతిక లేదా మత సంఘాలు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇలాంటి సమూహాలతో గుర్తింపును కలిగి ఉండటం యువతలో భద్రత భావనను పెంచుతుంది. ఉదాహరణకు, 17 ఏళ్ల కరణ్ కుటుంబం ఉత్తర భారతం నుంచి హైదరాబాద్ వలస వచ్చింది. తమ కుటుంబ సంప్రదాయ విలువలను పాటించాలని ఇంట్లో నొక్కి చెప్పినా, కళాశాలలో అందుకు భిన్నమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ రెండింటిలో దేన్నీ అతను వదులుకోలేడు. వాటి మధ్య రాజీ కుదుర్చుకోవడం ద్వారా అతనికి సామాజిక గుర్తింపు ఏర్పడుతుంది. అంటే యవ్వనంలో చేసే తిక్క తిక్క పనులన్నీ గుర్తింపు నిర్మాణంలో భాగమేనని గుర్తించాలి.తల్లిదండ్రులు చేయాల్సినవి..– టీన్స్‌లో జరిగే మార్పులను తల్లిదండ్రులు అర్థం చేసుకుని, పిల్లలకు అండగా నిలబడినప్పుడు వారిలో సరైన గుర్తింపు ఏర్పడుతుంది. – పిల్లల ఆలోచనలు, భావాలు, సవాళ్లు పంచుకోవడానికి విమర్శలు లేని వాతావరణాన్ని సృష్టించాలి. – భిన్న ఆసక్తులు, స్నేహాలు అన్వేషించడానికి అవసరమైన స్వేచ్ఛ కల్పించాలి. వారి ఎంపికలను గౌరవించాలి.– స్వేచ్ఛంటే విచ్చలవిడితనం కాదని, సంపూర్ణ బాధ్యత అని చెప్పాలి. అవసరమైన నిబంధనలు విధించాలి. అవసరానుగుణంగా వాటిని సడలించాలి. – ఇతరులతో పోల్చకుండా, వారి బలాలను గుర్తించి, విజయాలను ప్రశంసించాలి.– వారి పరిశీలనను, సామాజిక సంబంధాలను ప్రోత్సహించాలి. – యువత తాము గమనిస్తున్న ప్రవర్తనల ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. అందువల్ల తల్లిదండ్రులు మంచి రోల్ మోడల్స్‌గా ఉండాలి. -
ఐక్యరాజ్యసమితిచే గుర్తింపు పొందిన మన ‘నాడు-నేడు’.. శభాష్ ఏపీ..!
ప్రపంచ గుర్తింపు సాధించిన మన విద్యా విధానం ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధకు అరుదైన గుర్తింపు లభించింది. ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల పర్యటనను తమ వెబ్సైట్లో ఐక్యరాజ్య సమితి పబ్లిష్ చేసింది. తద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధలో తీసుకువచ్చిన సంస్కరణలు, నూతన విద్యావిధానాలకు విశ్వవ్యాప్త గుర్తింపును ఐక్యరాజ్యసమితి ఇచ్చినట్టయింది. మన రాష్ట్ర విధాన్ని తన సైట్లో ప్రచురించిన యుఎన్ ప్రపంచశాంతి, సమాజంలో మార్పు కోసం పాటుపడే ఐక్యరాజ్యసమితి ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధ, ఏపీలో అమలవుతున్న బాలికా విద్యా, జెండర్ ఈక్వాలిటీ, ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ (అందరికి సమానవిద్య) నచ్చి తమ వెబ్ సైట్ లో ప్రమోట్ చేసేందుకు ఒక ఆర్టికల్ ను (సంచికను) ప్రచురించింది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన గుర్తింపు మన ఏపీ రాష్ట్రానికి దక్కడం ఎంతో గొప్ప విషయం. దేశచరిత్రలో తోలి సారిగా.. సమాజంలో అట్టడుగు వర్గాల గొంతుకను ప్రపంచ వేదిక, యూఎన్ లో వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున పంపించిన పదిమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల ప్రతిభను గుర్తించి ఐక్యరాజ్య సమితి వెబ్ సైట్ ఇంపాక్ట్ స్టోరీస్ లిస్ట్ లో దీన్ని లిస్ట్ చేశారు యుఎన్ అధికారులు. సెప్టెంబర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులను అమెరికాలోని పలు అంతర్జాతీయ మీటింగ్ ల కోసం పంపించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పదిరోజుల పర్యటనలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అమెరికా న్యూయార్క్ లో ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ లో జరిగిన SDG సమ్మిట్, యూత్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు మన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు నాడు-నేడు స్లాల్‌ను సందర్శించిన లచ్చెజర స్టోవ్ జులైలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పధకాలు – నాడు - నేడు నవరత్నాల స్టాల్ ను ఏర్పాటు చేశారు యుఎన్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్. ఈ స్టాల్ ను ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ లచ్చెజర స్టోవ్ సందర్శించి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలను కొనియాడారు. ఏదేమైనా ఏపీ విద్యార్ధుల ప్రతిభను ఐక్యరాజ్య సమితి గుర్తించి తమ వెబ్ సైట్ లో ప్రచురించడం చాలా గొప్ప విషయం. ఇది చదవండి: ‘మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి’ -
అబద్దాలతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు..
ఢిల్లీ: 1860 నాటి భారత శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మహిళలపై నేరాలకు సంబంధించిన నిబంధనలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుర్తింపును దాచిపెట్టి యువతిని వివాహం చేసుకుంటే ఇలాంటి నేరాలకు ఇకపై 10 ఏళ్ల వరకు శిక్ష పడే విధంగా నింబంధనలను పొందుపరిచారు. ఇదే కాకుండా ఉద్యోగం, పదోన్నతి వంటి తప్పుడు వాగ్దానంతో మహిళను వివాహమాడటం లేదా లైంగిక చర్యలకు పాల్పడితే కూడా పదేళ్ల వరకు శిక్ష పడే విధంగా నూతనంగా తీసుకువచ్చిన న్యాయ చట్టాల్లో నిబంధనలు పొందుపరిచారు. ఉద్యోగం, పదోన్నతి, వివాహం వంటి అంశాల్లో తప్పుడు వాగ్దానాలతో స్త్రీతో లైంగిక చర్యను అత్యాచారంగా పరిగణించలేదు కానీ పదేళ్ల వరకు శిక్ష ఉంటుందని స్టాండింగ్ కమిటీ పేర్కొంది. అత్యాచార ఘటనల్లో.. కొత్త న్యాయ చట్టాల ప్రకారం గ్యాంగ్‌రేప్ నేరంలో దోషికి 20 ఏళ్ల శిక్ష పడుతుంది. 18 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి ఒడిగడితే మరణిశిక్ష ఉంటుంది. అత్యాచారంలో బాధితురాలు మరణిస్తే.. 20 ఏళ్లకు తగ్గకుండా శిక్ష, జీవితకాలం లేదా మరణశిక్ష పడే అవకాశాలను చట్టంలో సూచించారు. 12 ఏళ్లలోపు బాలలపై రేప్ ఘటనల్లోనూ ఇదే తరహా శిక్షలు అమల్లోకి వస్తాయి. బ్రిటీష్ వలస పాలన తాలూకు అవశేషాలుగా కొనసాగుతూ వస్తున్న మూడు కీలక నేర న్యాయ చట్టాలకు చెల్లు చీటీ పాడే దిశగా శుక్రవారం పెద్ద ముందడుగు పడింది. వాటి స్థానంలో స్వదేశీ చట్టాలను తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ లు చరిత్రగా మిగలనున్నాయి. వాటి స్థానంలో పూర్తి భారతీయ చట్టాలు రానున్నాయి. ఈ మేరకు న్యాయ సంహిత బిల్లు– 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు–2023, భారతీయ శిక్షా బిల్లు–2023లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇదీ చదవండి: ఐపీసీ, సీఆర్పీసీ స్దానంలో కొత్త చట్టాలు.. చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ -
త్రిష కోసం ఎదురుచూస్తున్నానంటున్న యంగ్ హీరో
‘ఫోరెన్సిక్’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో టోవినో థామస్, దర్శక ద్వయం అఖిల్ పాల్ – అనస్‌ఖాన్ కాంబినేషన్లో రూపొందనున్న మలయాళ చిత్రం ‘ఐడెంటిటీ’. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషను ఎంపిక చేసింది యూనిట్. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ‘ఐడెంటిటీ’. ఎర్నాకులం, బెంగళూరు, మారిషష్, కోయంబత్తూరు లొకేషన్్సలో షూటింగ్‌కి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 'త్రిషతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అన్నారు '2018' సినిమా ఫేమ్ హీరో టోవినో థామస్. 'ఐడెంటిటీ’లో జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని పేర్కొన్నారు త్రిష. కాగా నివిన్ పౌలి ‘హే జూడ్’, మోహన్‌లాల్ ‘రామ్’ (చిత్రీకరణ జరుగుతోంది) తర్వాత మలయాళంలో త్రిష చేస్తున్న మూడో చిత్రం ‘ఐడెంటిటీ’. -
అనుమతి లేకుండా సచిన్ ఫోటో వాడుకుంటున్న డిగ్రీ కంపెనీ
-
భారత టెక్నాలజీతో కోట్ల కొద్దీ ఆదా
న్యూఢిల్లీ: ఇతర దేశాలు బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేసుకునేందుకు డిజిటల్ చెల్లింపులు, కో–విన్, విశిష్ట గుర్తింపు సాంకేతికత వంటి భారతీయ టెక్నాలజీలు సహాయపడగలవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. అలాగే ఆయా దేశాలు డిజిటైజేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జీ20కి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో భారత్ .. తన వంతు బాధ్యతగా పలు దేశాలకు మన టెక్నాలజీ స్టాక్‌ను (ఉత్పత్తులు, సాధనాలు మొదలైనవి) ఆఫర్ చేసే ప్రణాళికలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇండియా స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు వివరించారు. రూ. 1.28 లక్షల కోట్లకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ. 1.28 లక్షల కోట్ల స్థాయికి చేరగలవని అంచనా వేస్తున్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఐటీ హార్డ్‌వేర్, విడిభాగాల తయారీదార్లు, హియరబుల్–వేరబుల్స్ ఉత్పత్తులకు కూడా కొత్తగా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని వర్తింపచేయడం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొబైల్ ఫోన్ సెగ్మెంట్ అత్యంత వేగంగా ఎదుగుతున్న విభాగంగా ఉండటంతో దానిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. 2023–24లో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి రూ. 1 లక్ష కోట్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. -
జిన్‌పింగ్ కూతురి ఫొటో వల్లే ఈ కష్టాలు!
ఆయన ప్రపంచంలోనే రెండో అత్యంత శక్తివంతమైన నేత. అమెరికా అంటే.. అగ్గిమీద గుగ్గిలం అయిపోతుంటాడు. అలాంటోడు తన గారాల కూతురిని మాత్రం సురక్షితంగా శత్రుదేశంలోనే దాచిపెట్టాడు.. అక్కడే చదివించాడు కూడా. అదీ బయటి ప్రపంచానికి తెలియకుండా. అలాంటిది.. ఆ కూతురి ఐడెంటిటీ బయటపెడితే ఊరుకుంటాడా?.. 2019లో చైనాకు చెందిన నియూ టెంగ్యూ అనే వ్యక్తి.. ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూతురు జీ మెంగ్జీ ఫొటోను, ఐడెంటిటీని ఓ వెబ్సైట్లో పోస్ట్ చేశాడు. వాటి ఆధారంగా పత్రికల్లో ప్రముఖంగా కథనాలు వచ్చాయి. ఇంకేం అధ్యక్షుల వారికి మండిపోయింది. ఆ దెబ్బకు 22 ఏళ్ల ఆ యువకుడిని అరెస్ట్ చేసి.. కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. అక్కడి చట్టాలేమో అతగాడికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఎలాగైనా అతన్ని కలవాలని, బయటకు రప్పించాలని అతగాడి తల్లి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా.. ఏకంగా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఓ బహిరంగ లేఖ రాసింది. అందులో తన కొడుకును ఈ వ్యవహారంలో ఎలా ఇరికించారు.. అతని న్యాయం దక్కకుండా ఎలా చేస్తున్నారని వివరిస్తూ సంచలన ఆరోపణలు చేసింది. అధ్యక్షుడి కూతురి ఫొటో, ఐడెంటిటీ బయటపెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చాక నియూకి, అతని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయట. అంతేకాదు.. అతని తరపున వాదించేందుకు లాయర్లు ఎవరూ ముందుకు రావడం లేదని, ఒకవేళ వచ్చినా ఎక్కువ రోజులు ఉండడం లేదని, ఇప్పటిదాకా 14 మంది లాయర్లను నియమించుకున్నామని ఆమె చెబుతోంది. అంతేకాదు.. కొడుకును కలిసేందుకు ఎన్ని అర్జీలు పెట్టుకుంటున్నా గువాంగ్‌డోంగ్ న్యాయస్థానం వాటిని తిరస్కరిస్తోందని, పైగా ఆ అర్జీలు తమదాకా రావడం లేదని చెబుతోందని ఆమె ఆరోపించింది. ఇదిలా ఉంటే.. చైనాలో జీ జిన్‌పింగ్ ఫ్యామిలీని కదిలించినా.. ఆయన ప్రభుత్వంపై సెటైరిక్‌గా పోస్టులు చేసినా శిక్షలు కఠినంగానే ఉంటాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఏకైక తనయ జీ మెంగ్జీ(30). తన రెండో భార్య పెంగ్ లియువాన్(ఫోక్ సింగర్)తో కలిగిన సంతానం. చైనా కమ్యూనిస్టు పార్టీ చట్టం ఆధారంగా అమెరికాలో కూతురు మెంగ్జీ ఉన్నత విద్యను అభ్యసించింది. ఆపై ఐదేళ్లపాటు చైనాలో ఉండి.. మళ్లీ అమెరికాకే వచ్చి రీసెర్చి విద్యార్థిగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికా చట్ట సభ ప్రతినిధి(మాజీ) విక్కీ హార్ట్జ్లర్ ఆమధ్య ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అయితే ఆ వెబ్సైట్, పత్రికల్లో ప్రచురితమైన ఐడెంటిటీ మెంగ్జీదేనా? అనేది మాత్రం ఇప్పటికీ అనుమానమే!. అలాగే ఆమెకు సంబంధించిన ఇతర వివరాలేవీ ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియవు. ఇదీ చదవండి: గన్ గురిపెట్టి చంపబోయాడు, కానీ.. -
రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: మేకపాటి
సాక్షి, నెల్లూరు: ఉదయగిరికి ప్రత్యేక గుర్తింపునిచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను కేంద్ర మంత్రి మంగళవారం ముంబైలో ప్రారంభించారన్నారు. ఇందులో ఒకదానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టడం హర్షణీయమన్నారు. దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌకకు ఉదయగిరి పేరును పెట్టడడం చాలా సంతోషంగా ఉందని, ఇది జిల్లాకే గర్వకారణంగా ఉందన్నారు. ఉదయగిరిలోని అతిపెద్ద పర్వతాలను పరిగణనలోకి తీసుకుని యుద్ధ నౌకకు ఆ పేరు పెట్టడం మంచిపరిణామమని కొనియాడారు. చదవండి: (ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్: రాజ్‌నాథ్) -
ఏపీలోనే ప్రథమ స్థానం.. పట్టు.. ‘కొత్త’గా మెరిసేట్టు..
ధర్మవరం...పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది పట్టుచీర. రక్షా బంధన్ చీర, కట్టుకుంటే సంగీతం వినిపించే మ్యూజికల్ చీర, పూల వాసన గుబాళించే సంపంగి చీర, వాతావరణాన్ని బట్టి రంగు మారే చీర, భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే చీరలు.. ఇక్కడి నేతన్నల నైపుణ్యానికి నిదర్శనం. 120 ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మవరం చీరకు ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు కూడా ఇచ్చింది. నూతన జిల్లా శ్రీసత్యసాయి మకుటంలో ధర్మవరం పట్టుచీర మణిలా మెరుస్తోంది. రానున్న రోజుల్లో మరింత ప్రకాశించనుంది. చదవండి👉: మారేడు తెచ్చి.. నన్నారి షర్బత్ చేసి.. ధర్మవరం టౌన్(శ్రీసత్యసాయి జిల్లా): జిల్లాకు ధర్మవరం పట్టుచీర కీర్తికిరీటంలా నిలుస్తోంది. రాష్ట్రంలో 28 వేల మగ్గాలు ఉన్న ఏకైక ప్రాంతం ధర్మవరం. ఇక్కడి నేతన్నలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, విదేశాలకు సైతం పట్టుచీరలను ఎగుమతి చేస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ఇక్కడి మార్కెట్లో సగటున వారానికి రూ.100 కోట్ల దాకా పట్టుచీరల బిజినెస్ జరుగుతోంది. ధర్మవరం నేతన్నల పనితనాన్ని గుర్తించి భారత ప్రభుత్వం ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్)ను ఇచ్చింది. ఉపాధికి ఊతం శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా ధర్మవరం, పుట్టపర్తి, కొత్తచెరువు, గోరంట్ల, బుక్కపట్నం, సోమందేపల్లి, పెనుకొండ, హిందూపురం, చిలమత్తూరు మండలాల్లో 28 వేల దాకా చేనేత మగ్గాలున్నాయి. ఒక్క ధర్మవరం పట్టణంలోనే 20 వేల మగ్గాలున్నాయి. చేనేత మగ్గాలతో పాటు పట్టుచీరల తయారీలో 18 దాకా అనుబంధ రంగాలు ఉంటాయి. రంగుల అద్దకం, డోలు చుట్టడం, పాలిషింగ్, పురిమిషన్, బోట్లు చుట్టడం, రేషం చుట్టడం, అచ్చులు అతకడం తదితర వాటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది దాకా ఉపాధి పొందుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా డిజైన్లు మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా ఇక్కడి డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు రూపొందిస్తున్నారు. వందమంది దాకా పట్టుచీరల డిజైనర్లు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వివాహ శుభకార్యాల దగ్గర నుంచి సినీ మోడళ్లు, సెలబ్రిటీలు ధరించే చీరల కోసం ఇక్కడి డిజైనర్లు వినూత్న డిజైన్లతో ఆకట్టుకుంటున్నారు. ధర్మవరం పట్టుచీర జరీ, మోడల్, డిజైన్బట్టి రూ.5 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. భౌగోళిక గుర్తింపు ధర్మవరం నేతన్న ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 2014లో ధర్మవరం పట్టుచీరలు, పావుడాలకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఇచ్చింది. దీని ద్వారా ధర్మవరం పట్టుచీర డిజైన్లు ఎక్కడా తయారు చేయకూడదు. ఒక వేళ ఇతర ప్రాంతాల్లో ధర్మవరం నేతన్నల డిజైన్లు నేస్తే చర్యలు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దేశ, విదేశాలకు ఎగుమతులు ధర్మవరంలో తయారైన పట్టుచీరలు ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, కేరళ రాష్ట్రాలతో పాటు అమెరికా, సౌదీ అరేబియా, న్యూజిల్యాండ్ తదితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ధర్మవరంలో 1,800 దాకా సిల్్కషాపులుండగా.. వీటి ద్వారా పట్టుచీరలను కొనుగోలు చేయడం, ఆపై షోరూంలకు హోల్‌సేల్‌గా ఎగుమతి అవుతాయి. ధర్మవరం నేసేపేటలోని పట్టుచీరల మార్కెట్లో వారానికి సగటున రూ.100 కోట్ల దాకా టర్నోవర్ జరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ధర్మవరం పట్టణాన్ని, చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేసి శ్రీసత్యసాయి జిల్లాకు వన్నె తేవాలని నేతన్నలు కోరుతున్నారు. చేనేతకు మంచిరోజులు శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటుతో ధర్మవరం చేనేతలకు మంచిరోజులు వచ్చాయి. పుట్టపర్తి ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసి వివిధ రాష్ట్రాల నుంచి విమానాల రాక పోకలకు అనుమతినిస్తే వ్యాపారులు ఎక్కువ మంది ధర్మవరం వచ్చే అవకాశం ఉంటుంది. సరుకు ఎగుమతులకూ వీలు కలుగుతుంది. తద్వారా వ్యాపారం మరింత జోరందుకుంటుంది. –రంగన శ్రీనివాసులు, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం జాతీయ అవార్డు అందుకున్నా ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు రూపొందిస్తున్నాం. మేము తయారు చేసే చీరలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, ఎక్కువగా అమెరికా, సౌదీ దేశాలకు పంపుతుంటాం. నేను తయారు చేసిన పట్టుచీర డిజైన్లకు రాష్ట్ర స్థాయిలో రెండు, జాతీయ స్థాయిలో ఒక అవార్డు లభించింది. –నాగరాజు, క్లస్టర్ డిజైనర్, ధర్మవరం. అంతర్జాతీయంగా గుర్తింపు తెస్తాం ధర్మవరం నేతన్నల నైపుణ్యంతో తయారైన పట్టుచీరలను కొందరు వ్యాపారులు కంచిపట్టు చీరలుగా చెలామణి చేస్తున్నారు. అందువల్లే ధర్మవరం నేతన్నకు అనుకున్నంత పేరు రాలేదు. భౌగోళి గుర్తింపు దృష్ట్యా ధర్మవరం పట్టుచీరకు ఉన్న ప్రత్యేకత తెలియజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రానున్న రోజుల్లో ధర్మవరంలో తయారయ్యే పట్టుచీరలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తాం. –కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే, ధర్మవరం. -
కాకినాడ మళ్లీ కేక.. అరుదైన గుర్తింపు..
కాకినాడ(తూర్పుగోదావరి): స్మార్ట్‌సిటీ కాకినాడ మరో అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే కార్యకలాపాల నిర్వహణకు గాను ఈ గుర్తింపు దక్కింది. వివిధ వర్గాల ప్రజల మధ్య మంచి వాతావరణాన్ని కల్పించడం, పిల్లల్లో పోటీతత్వాన్నిపెంచడం, సామాజిక అంశాలపై యువతలో చైతన్యం పెంపొందించడం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నుంచి కాకినాడ స్మార్ట్‌సిటీకి మంగళవారం సమాచారం అందింది. చదవండి: మసాజ్ సెంటర్ల పేరుతో చీకటి కార్యకలాపాలు.. కళ్లు బైర్లుకమ్మే అంశాలు ఈ ప్రక్రియకు దేశంలోని పలు నగరాలను ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క కాకినాడకు మాత్రమే చోటు లభించింది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల తినుబండారాలను హైజనిక్‌గా ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం, అజాదికా అమృత్ మహోత్సవ్ పేరుతో విద్యార్థుల మధ్యపోటీ పెట్టడం, సైకత శిల్పాల తయారీ, డ్రాయింగ్ పోటీలు సహా అనేక కార్యక్రమాల నిర్వహణ ద్వారా కాకినాడ స్మార్ట్‌సిటీ ప్రత్యేక గుర్తింపును సాధించగలిగింది. ఈ తరహా కార్యకలాపాలను నిర్వహించి అన్ని వర్గాల ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచేలా చేసిన కృషికి ఈ గౌరవాన్ని దక్కించుకోగలిగింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంమరోసారి కాకినాడ స్మార్ట్‌సిటీని మంచిస్థానంలో నిలబెట్టిందని కమిషనర్ స్వప్నిల్‌దినకర్‌పుండ్కర్ చెప్పారు. -
మంచి మాట..జీవన లక్ష్యం
ప్రతి మనిషి జీవితానికి లక్ష్యం అనేది అత్యంత అవసరం. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలంటే, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని సఫలీకృతుడవడానికి అంకిత భావంతో పనిచేయాలి. తనకున్న యావచ్ఛక్తిని వినియోగించి పనిచేస్తే, విజయానికి దారులు తప్పక తెరుచుకుంటాయి. ఈ ధరిత్రిపై లక్ష్యం లేకుండా సాగే ఏ మనిషి జీవికైనా నిరర్ధకమంటారు స్వామి వివేకానంద. ఉన్నతపదవి.. వ్యాపారం.. క్రీడలు..లలితకళలు.. యిలా ఏ విభాగంలో మనం రాణిద్దామని అనుకుంటామో, అందులో చేరుకోవాలనుకున్న లక్ష్యాన్ని సావధానంతో నిర్ణయించుకోవాలి. అయితే, లక్ష్యాన్ని నిర్దేశించుకోగానే సరిపోదు. లక్ష్యాన్ని సాధించే దిశగా నిరంతర సాధనతో ముందుకు సాగాలి. ప్రతి పనినీ మొక్కవోని శ్రద్ధతో, ఏకాగ్రతతో, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలి. మన గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ముందుకు సాగాలి. మనం పయనించే మార్గంలో విజయంతో బాటు అపజయాలు కూడా కలుగుతూనే ఉంటాయి. అపజయం సంభవించినప్పుడు కుంగిపోక, లక్ష్యసాధనలో విజయానికి చేరువ కావడానికి మరింత అనుభవం తనకు సమకూడిందని భావిస్తూ సానుకూల దక్పథంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. ఈ ధరిత్రిలో ఏదీ, తనంత తానుగా మన చెంతకు రాదు. ఎనలేని శోధన, వలసినంత సాధన తోడైతేనే లక్ష్యం అవలీలగా సొంతమవుతుంది. మనిషి ఎంచుకునే లక్ష్యం చాలా ఉన్నతంగా ఉండాలి . ఉన్నతంగా ఉండడమంటే జీవనోపాధికోసం అప్పుడే సాధారణమైన ఉద్యోగంలో జేరినవాడు, వెంటనే అత్యంత సంపన్నుడు కావాలని కోరుకోవడం ఏమాత్రం సబబుకాదు. కానీ, తాను చేరిన వృత్తిలో, ఉద్యోగంలో, కృషి చేస్తే తాను ఎంతవరకు ఎదగగలడు అన్న విషయాన్ని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలి. సహేతుకమైన ఆలోచనతో, వివేచనతో ముందుకు సాగుతూ నిజాయితీతో కృషి చేస్తే, తను అనుకున్న ఉన్నతమైన స్థానాన్ని అందుకోలేకపోయినా, ఖచ్చితంగా గౌరవనీయమైన స్థానాన్ని మానవుడు కైవశం చేసుకుంటాడని చరిత్ర నిరూపించిన నిదర్శనాలెన్నో మనకు కనబడతాయి. ఓర్పు, పట్టుదల, నిజాయితీలనే ఆయుధాలుగా చేసుకుని లక్ష్యసాధన దిశగా కషి చేసిన వారందరూ, తమ జీవన గమనంలో అప్రతిహతమైన విజయాలను చేబూనారన్న విషయం చరిత్ర తేజోమయంగా మనకు తెలియజేస్తుంది. ఈ విజయపరంపరలో అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి, అత్యున్నత స్థాయి కి ఎదిగిన వ్యక్తులూ మనకు ఎంతో మంది తారసపడుతూనే ఉంటారు. బీద కుటుంబంలో పుట్టి, ఉదయాన్నే వార్తా పత్రిక లను పంచే అతి సాధారణ వ్యాపకాన్ని బాలునిగా ఉన్నప్పుడు నిర్వర్తించిన అబ్దుల్ కలామ్ దేశ ప్రధమ పౌరుడైన రాష్ట్రపతిగా, భారత అణుశాస్త్ర పితామహునిగా నిలవడం కృషితో నాస్తి దుర్బిక్షం అన్న సామెతకు నిలువెత్తు సాక్ష్యం. కలలు కను..కలలను సాకారం చేసుకో’’ అన్న ఆ మహోన్నత వ్యక్తి లక్ష్య సాధకు లకు చక్కటి సందేశాన్ని ఇవ్వడమే గాక, తన జీవితాన్నే ఆ సుధా మయ వాక్యాలకు నిలువెత్తు ఉదాహరణగా నిలిపిన సార్ధక జీవనుడు. లక్ష్యం ఉన్నతమైనదైతే, చిత్తశుద్ధి దానికి తోడైతే, దారిలో ఎదురయ్యే ఆటంకాలేవీ మనల్ని బాధించవు. లక్ష్యాన్ని చేరే గమ్యంలో ఎదురయ్యే ఆటంకాలు, సవాళ్ళు సాధారణమైనవిగానే మనకు అనిపిస్తాయి. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే చిరు సవాళ్ళు, పెనుసవాళ్ళు కూడా మన విజయానికి బాసటగా నిలిచే పునాదిరాళ్ళుగా మనం విశ్వసించాలి. మనిషికి మహితమైన సహనాన్ని, తనలో తనకు విశ్వాసాన్ని పెంపొందించే మేలురాళ్ళుగా ఈ సవాళ్ళను పేర్కొనవచ్చు. మహత్తరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, విజయాన్ని చేబూనిన ప్రతి మానవుడూ మహనీయుడు కాకపోవచ్చు, కానీ సమాజంలో తప్పకుండా మాననీయుడవుతాడు. మహితమైన హితాన్ని నలుగురికీ తద్వారా చేకూరుస్తాడు. లక్ష్యసాధకునికి తప్పనిసరిగా కావలసింది అచంచలమైన ఆత్మవిశ్వాసం. మానవ చరిత్రను పరికిస్తే లక్ష్యాలను సాధించి, ఉన్నతులైన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నిటికంటే ఎక్కువ సామర్థ్యాన్ని పెంపొందించిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే. వాళ్ళు మొదటినుంచీ ఉన్నతులు కావాలనే విశ్వాసంతో పరిశ్రమించి, సాఫల్యతను సాధించారని వారి జీవనచిత్రం తిలకిస్తే మనకు అర్థమవుతుంది. లక్ష్యం అంటే గురి.. లక్ష్యం లేకుండా సాగే మనిషి జీవితాన్ని గమ్యం తెలియకుండా పయనించే నావతో పోల్చడం సబబుగా ఉంటుంది. మనం ఏ లక్ష్యం కోసమైతే సాధన, పరిశ్రమ కొనసాగిస్తామో, ఆ సాధనలో అవిశ్రాంతంగా కొనసాగితే, ఈ ధరిత్రిలోని ప్రతిశక్తీ మనకు సహకరిస్తుందనే మాట అత్యంత ప్రసిద్ధిని పొందిన ఓ పాశ్చాత్య దార్శనికుని మాట. – వెంకట్ గరికపాటి , వ్యాఖ్యాన విశారద -
13 ‘జూ’ల గుర్తింపు రద్దు
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల్లోని మొత్తం 13 జంతు ప్రదర్శన శాల (జూ)ల గుర్తింపు రద్దయ్యింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఈ జంతు ప్రదర్శన శాలలు పనిచేయకపోవడం, అక్కడి జంతువుల ఆరోగ్యం కోసం కేంద్ర జూ సంస్థ (సీజెడ్ఏ) వాటి గుర్తింపును రద్దు చేసిందని పర్యావరణ శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ శుక్రవారం లోక్‌సభకు చెప్పారు. గుర్తింపు రద్దయిన వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఉన్న డీర్ పార్క్ ఎన్సీఎఫ్ఎల్, తెలంగాణలోని డీర్ పార్క్ కేశోరాం సిమెంట్, సంఘీ మినీ జూ, కర్ణాటకలోని తుంగభద్ర మినీ జూ, శ్రీ క్షేత్ర సొగల్ సౌండట్టి, తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న వీఓసీ పార్క్ మినీ జూ మొదలగునవి ఉన్నాయి. -
హనుమంత్ ఖాన్ సాహెబ్
ఆ మధ్య యోగి ఆదిత్యనాథ్ గారు హనుమంతుడు దళితుడని వాక్రుచ్చారు. ఈ దేశంలో కులాల మధ్య తారతమ్యాలను ఆ విధంగా నిర్మూలించే ప్రయ త్నం వారు చేశారు. వారి మంత్రి మండలిలోని లక్ష్మీనారాయణ చౌదరిగారు శాసనసభలో హను మంతుడు జాట్ అని సెలవి చ్చారు. వారి దూరదృష్టి అనన్యసామాన్యం. ఈ విధంగా రాజస్తాన్‌లో ఒక వర్గం నిస్పృహను, నినాదాలను ఆయన ఒక్క వేటుతో నేలమట్టం చేసేశారు. ఈ లోగా మరొక బీజేపీ నాయకుడు బుక్కాల్ నవాబ్ గారు మరొక అపూర్వమైన సృష్టి రహస్యానికి తెర లేవ దీశారు. హనుమంతుడు ముస్లిం అని బల్లగుద్దారు. ఇది చరిత్రను తిరగరాసే, సమాజహితానికి తెరలేపే అపూర్వ మైన పరిశీలన. ఈ లెక్కన కిష్కింధలో వానర సైన్య మంతా ముస్లింలేనా– సుగ్రీవ్ అహమ్మద్, వాలి అహమ్మ ద్‌ల మధ్య వైషమ్యానికి కేవలం తారా బేగం మాత్రమే కాక మతపరమైన కారణాలేమైనా ఉన్నాయా అన్న విష యాలను వివరిస్తూ మరో వాల్మీకి ఖాన్ కనీసం కిష్కింధ కాండనుంచీ రామాయణాన్ని తిరిగి రాయాలని నాకని పిస్తుంది. నన్నడిగితే ఈ బుక్కాల్ నవాబు గారిని హిందు వులు పూలదండలు వేసి దేశమంతా ఊరేగించాలి. హను మంత్ ఖాన్ సాహెబ్ ముస్లిం కనుక, వారికి తన స్వామి శ్రీరాముని పట్ల అపారమైన భక్తి కనుక– ఈ దేశంలో తర తరాలుగా మురిగిపోతున్న అయోధ్య రామ మందిర సమస్య తేలికగా పరిష్కారం కాగలదు. అది ఈ లెక్కన ముస్లింలకూ ప్రార్థనా స్థలం కనుక. నా దగ్గర ఒక మహా అపురూపమైన నాణెం ఉంది. అది 210 సంవత్సరాల కిందటిది. మన దేశానికి స్వాతం త్య్రం రావడానికి 139 సంవత్సరాల ముందుది. ఆనాటికీ ఈ దేశంలో దేశ స్వాతంత్య్రానికి ఆలోచనలే లేవు. ముస్లింలకు వేరే దేశం, ప్రతిపత్తి అన్న ఆలోచనలే లేవు. నిజానికి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పాలించడం లేదు. ఏమిటి ఈ నాణెం ప్రత్యేకత? ఈ దేశంలో 565 జమీందారీలు, రాజపాలిత సంస్థానాలూ ఉండగా మన దేశానికి కేవలం వ్యాపారానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వెలువరించిన నాణెమిది. అర్దణా నాణెం. అంటే రూపాయిలో 32వ వంతు. ఈ నాణెం మీద హను మంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకువెళ్తున్న దృశ్యాన్ని ముద్రించారు. ఇది అపూర్వమైన విషయం (210 సంవ త్సరాల కిందటిమాట అని మరిచిపోవద్దు) ఇంకా నయం హనుమంతుడు లంక్‌షైర్‌లోనో, బర్మింగ్‌హామ్‌లోనో పుట్టిన హనుమంత్ హెన్రీ అనో, వయస్సొచ్చాక ఎగిరి కిష్కింధ చేరాడనో అనలేదు. అయినా నిమ్మకాయలమ్ము కునే వ్యాపారికి యజమాని విశ్వాసాలను పరిరక్షించే ప్రయత్నం ఎందుకు? సమాధానం– అది వారి సంస్కృతి కనుక. ఆ సంస్కృతిలోంచే బ్రౌన్, కాటన్, మెకంజీ వంటి మహనీయులు వచ్చారు. ప్రజల సొమ్మును తినే నీచ వ్యాపారుల సంస్కృతి మనది. ఉదాహరణకి– విజయ్ మాల్యా, నీరవ్ మోదీ. ఏదీ? మతాతీత దేశమైన ఈ దేశంలో దమ్ముంటే ఇలాంటి నాణేన్ని విడుదల చేయమనండి. వేలంకన్ని చర్చి బొమ్మతో నాణేన్ని ముద్రించమనండి. జుమ్మా మసీదు బొమ్మతో నాణేన్ని ముద్రించమనండి. మతాతీత వ్యవస్థ అంటే మతాన్ని అటకెక్కించాల్సిన పనిలేదు. మనకి మతం అడ్డువస్తుంది. మతం సామరస్యానికి పట్టుగొ మ్మగా నిలవాల్సిందిపోయి– పక్కవాడి మతాన్ని దుయ్య పట్టేదిగా తయారయింది. కాగా, ఒక వర్గానికి జరిపే ఉపకారం, క్రమంగా షరతై, ఓట్లయి, హక్కై– మైనారిటీల పేరిట పునాదుల్ని పెంచుకున్నాయి. ఇవాళ మనది స్వాతంత్య్ర దేశం. ఎంతో పురోగతిని సాధించిన దేశం. కానీ మతాల మధ్య అంతరాలను ఆ కారణానికే పరిష్క రించుకునే పెద్ద మనస్సు లేని దేశం. ఈ నేపథ్యంలో మన బుక్కాల్ నవాబుగారి ప్రతి పాదన అమోఘం. అన్నట్టు సత్యపాల్ చౌదరి అనే కేంద్ర మంత్రి హనుంతుడు ఒక ‘ఆర్యుడు’ అన్నారు. నంద కిషోర్ అనే రాష్ట్ర గిరిజన సంస్థ అధ్యక్షులు హనుమంతుడు ఒక గిరిజనుడన్నారు. కాంగ్రెస్ శాసనసభ్యులు దీపక్ సింగ్ గారు మొదట హనుమంతుడు ఎవరో ప్రభుత్వం తేల్చవ లసిన అవసరం ఉన్నదని సభా హక్కుల తీర్మానాన్ని లేవదీశారు. ఏతావాతా మనకి అర్థం అవుతున్న విషయం ఏమి టంటే– ఈ దేశంలో మత విశ్వాసాల ఉద్దీపనకిగానీ, తమ వర్గానికో, మతానికో ప్రాతినిధ్యం వహించే ముఖ్య లక్ష్యా నికిగానీ రామాయణంలో ‘హనుమంతుడి’ పాత్ర ఒక్కటే పెట్టుబడి కావటం– అదిన్నీ 210 సంవత్సరాలకు పైగా నిరూపణ అవుతున్నందుకు హిందువులు గర్వపడవచ్చు. ఈ ప్రతిపాదనలు చేసినవారు కేవలం పార్టీ సభ్యులు కారు. శాసనసభల్లో ప్రతినిధులు. సమాజానికి సేవ చెయ్యడానికి ప్రజల మద్దతుని కూడగట్టుకున్న రాజకీయ నాయకుల ‘వెర్రితలల’ విశృంఖలత్వానికి ఇది శిఖరాగ్రం. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
కోహితూర్.. నిజమైన రాజ ఫలం!
చారిత్రక ప్రసిద్ధి పొందిన కోహితూర్ మామిడి పండుకు ప్రాదేశిక గుర్తింపు పొందడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది అత్యంత మధురమైన ఫలరాజం. దీనికున్న మరో విశిష్టత ఏమిటంటే.. ప్రత్యేకించి రాజ కుటుంబీకులు మాత్రమే తినేవారట. దాదాపు రెండున్నర శతాబ్దాల క్రితం ఈస్టిండియా కంపెనీ భారత ఉపఖండంలో రాజకీయ పగ్గాలు చేపట్టడానికి ముందు పశ్చిమ బెంగాల్‌ను పాలించిన ముర్షీదాబాద్ చివరి నవాబు సిరాజ్–ఉద్–దాలా హయాం(క్రీ.శ.1733–1757)లో ఈ మామిడి వంగడం రూపుదాల్చింది. ఈ ఫలరాజాన్ని రాజ కుటుంబీకులు అమితంగా ఇష్టపడేవారట. చారిత్రక ప్రసిద్ధి పొందిన ఈ మధుర ఫలరాజం ఒక్కొక్కటి రూ.1,500 వరకు మార్కెట్లో ధర పలుకుతోందిప్పుడు. ఇది సున్నితమైన ఫలం కావడం వల్ల చెట్టు మీదనే మిగల పండిన తర్వాత చేతితోనే కోసి.. భద్రంగా దూదిలో ఉంచుతూ ఉంటారు. కోసిన తర్వాత సాధ్యమైనంత త్వరగా తినేయాల్సి ఉంటుంది. అతి సున్నితమైన పండు కావడంతో నిల్వ, రవాణాలో పరిమితుల దృష్ట్యా ఈ వంగడం వాణిజ్యపరంగా సాగుకు అనుకూలమైనది కాదని రైతులు భావిస్తున్నారు. అందువల్ల ఈ వంగడం అంతరించిపోయే స్థితిలో ఉంది. ముర్షీదాబాద్ జిల్లాలో 15 మంది రైతుల దగ్గర 25–30 కొహితూర్ మామిడి చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయట. కొన్ని చెట్ల వయసు 150 ఏళ్లకు పైగానే ఉందట. ఒక్కో చెట్టు ఏడాదికి 40 పండ్ల కన్నా కాయదు. ఒక సంవత్సరం కాసిన చెట్టు రెండో ఏడాది కాయదు. ఈ నేపధ్యంలో కోహితూర్ మామిడి రకాన్ని పరిరక్షించడానికి ఉపక్రమించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రాదేశిక గుర్తింపు ఇవ్వవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల కోరింది. ముర్షీదాబాద్ నవాబు సిరాజ్–ఉద్–దౌలా మామిడి పండ్లంటే అమితంగా ఇష్టపడే వారట. దేశవ్యాప్తంగా అనేక రకాల మామిడి రకాలను సేకరించి పెంచేవారు. మేలైన మామిడి రకాలను సంకరపరచి మంచి రకాలను తయారు చేసేందుకు ప్రత్యేక నిపుణులను ఆయన నియమించారు. హకీమ్ అదల మొహమ్మది అనే మామిడి ప్రజనన అధికారి.. రాజు గారికి బాగా ఇష్టమైన కాలోపహర్ను, మరో రకాన్ని సంకరపరచి కొహితూర్ వంగడాన్ని రూపొందించారు. రైతుకు పండుకు రూ. 500 వరకు రాబడి ఉంటుంది కాబట్టి.. ప్రాదేశిక గుర్తింపు(జి.ఐ.) ఇస్తే దీని సాగుకు రైతులను ప్రోత్సహించడం సాధ్యపడుతుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రాదేశిక గుర్తింపు లభిస్తే.. సంబంధిత అధికారుల వద్ద ముందుగా రిజిస్టర్ చేయించుకున్న రైతులే ఈ వంగడాన్ని సాగు చేయగలుగుతారు, అమ్ముకోగలుగుతారు. పూర్వం రాజులు కోహితూర్ మామిడి పండ్లను తేనెలో ముంచి ఉంచడం ద్వారా కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచుకునే వారట! అంతేకాదు.. ఇనుప కత్తితో కోస్తే దీని రుచి పాడవుతుందట. వెదురు చాకులతో కోస్తేనే దీని రుచి బాగుంటుందని చెబుతుండటం విశేషం!! -
భర్తను హతమార్చి తప్పించుకోవడానికి మరో హత్య
ఫ్లోరిడా : 56 ఏళ్ల వయస్సులో ఓ మహిళ పాల్పడిన ఘాతుకం చూస్తుంటే మనుషులు ఇలా కూడా ఆలోచిస్తారా అనే అనుమానం కలుగుతుంది. సినిమాల్లోలాగా తన ఐడెండిటిని మార్చుకోవడం కోసం ఆమె తన పోలికలతో ఉన్న మరో మహిళని చంపేసింది. వివరాల్లోకి వెళ్తే.. మిన్నెసోటాకు చెందిన లోయిస్ రైస్, డేవిడ్‌లకు ముగ్గురు పిల్లలు. గత నెలలో వీరు కనబడకపోవడంతో సన్నిహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఫామ్‌హౌస్‌లో డేవిడ్ మృతదేహాన్ని గుర్తించారు. జూదానికి బానిసైన అతని భార్యే హత్య చేసినట్టు అనుమానించారు. ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. కానీ లాభం లేకపోవడంతో ఫేస్బుక్ ద్వారా లోయిస్ గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. సీన్ కట్ చేస్తే ఫ్లోరిడా స్టేట్‌లోని లీ కౌంటిలో తన పొలికలతో ఉన్న పమేలా హచిన్సన్తో స్నేహన్ని పెంచుకున్న లోయిస్ ఆమె ఐడెండిటిని తనదిగా చేసుకోవడానికి ప్రయత్నించింది. అందులో భాగంగా ఆదివారం రాత్రి పమేలాను హతమార్చింది. ఆమె పర్స్‌తో పాటు, ఇతర విలువైన వస్తువులను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనిపై దర్యాప్తు జరుపుతున్న ఓ అధికారి మాట్లాడుతూ.. నా జీవితంలో ఈ రకమైన హత్యను చూడలేదన్నారు. లోయిస్ చిరునవ్వు చూసిన వారెవరైనా ఆమె మృదు స్వభావం కలదని అనుకుంటారని, కానీ లోయిస్ రైస్ పెద్ద నయ వంచకురాలని అభిప్రాయపడ్డారు. తన భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న లోయిస్, పమేలా హచిన్సన్లా మారడానికే ఈ హత్య చేసింది.. ఆమె కోసం దేశవ్యాప్తంగా గాలింపు చేపట్టామని తెలిపారు. -
2017 సంవత్సరపు హిందీ పదంగా ‘ఆధార్’
జైపూర్: ఆధార్ కార్డుతో దేశవాసుల మనసుల్లో బాగా నాటుకుపోయిన ‘ఆధార్’కు 2017 సంవత్సరపు హిందీ పదంగా గుర్తింపు లభించింది. జైపూర్ సాహితీ వేడుకలో భాగంగా శనివారం ‘ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్’ అంశంపై జరిగిన చర్చలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆధార్ తర్వాత మిత్రోన్(అసలు రూపం మిత్రో), నోట్‌బందీ, గోరక్షక్ అనేవి హిందీ పదాలు కూడా బాగా ప్రాచుర్యం పొందినట్లు వివిధ రంగాల నిపుణులు పేర్కొన్నారు. అయితే, జనం నోళ్లలో అత్యధికంగా నానిన పదం మాత్రం ఆధారేనని ఈ చర్చ సందర్భంగా పాత్రికేయుడు ద్వివేది వెల్లడించారు. -
ఎంఆర్ఐతోనే క్యాన్సర్ కణుతుల గుర్తింపు...
శరీరంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే చేయించుకునే ఎంఆర్ఐ పరీక్షలు ఇకపై క్యాన్సర్ కణుతుల గుర్తింపుకి కూడా ఉపయోగపడనున్నాయి. ఇదంతా యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్ సౌత్ వెస్టర్న్ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితం. శరీరంలో కణుతులు ఏర్పడటం కొన్ని సందర్భాల్లో సహజం. అన్నీ క్యాన్సర్‌కు దారితీయవు. ఏది వ్యాధిగా మారుతుందో గుర్తించాలంటే.. ఆ కణజాలాన్ని బయటకు తీసి పరీక్షించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కత్తికి అందనిచోట్ల కూడా కణుతులు ఏర్పడటం కద్దు. ఈ నేపథ్యంలో టెక్సస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కిడ్నీల్లో ఏర్పడే కణుతులపై పరిశోధనలు జరిపారు. సాధారణ ఎంఆర్ఐ పరీక్షలకే కొన్ని మార్పులు చేయడం ద్వారా కణితి ప్రమాదకరమైనదా? కాదా? అందులో ఉన్న పదార్థం ఎలాంటిది? వంటి అన్ని అంశాలను విశ్లేషించగలిగారు. బోలెడన్ని ఎంఆర్ఐ చిత్రాల ఆధారంగా నిర్దిష్ట ప్రాంతలో ఉండే కణితి లోపల అతి సూక్ష్మస్థాయిలో ఉండే కొవ్వు కణాలను కూడా ఇది గుర్తించగలదు. ఈ పద్ధతి దాదాపు 80 శాతం కచ్చితత్వంతో ప్రమాదకరమైన కణుతులను గుర్తించగలదని జెఫ్రీ కాడెడూ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతానికి ఇది శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయం కాదని.. అనవసరంగా పదే పదే శస్త్రచికిత్సలు చేసే అవసరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
మళ్లీ గురుత్వ తరంగాల గుర్తింపు
వాషింగ్టన్: విశ్వంలో జనించి కోట్లాది కాంతి సంవత్సరాలు ప్రయాణించే గురుత్వాకర్షణ తరంగాలను నాలుగోసారి గుర్తించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమికి దాదాపు 180 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రెండు కృష్ణ బిలాలు ఢీకొన్న సమయంలో ఈ శక్తిమంతమైన తరంగాలు ఉద్భవించినట్లు తెలిపారు. ఈ తరంగాలను అమెరికాలోని వాషింగ్టన్, లూసియానాల్లోని లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)లు, యూరప్‌లోని ఇటలీలో ఏర్పాటు చేసిన విర్గో అబ్జర్వేటరీ తొలిసారి సంయుక్తంగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ రెండు కృష్ణబిలాలు ఢీకొన్న అనంతరం ఏర్పడ్డ కృష్ణబిలం ద్రవ్యరాశి సూర్యుని ద్రవ్యరాశి కంటే 53 రెట్లు ఎక్కువన్నారు. మూడు సూర్యులకు సమానమైన శక్తి ఈ గురుత్వ తరంగాలుగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. ప్రయోజనం ఏంటి? గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడం ద్వారా ఖగోళంలో మనకు అంతుచిక్కని అనేక రహస్యాలను తెలుసుకోవచ్చు. విశ్వం ఆవిర్భావ (బిగ్‌బ్యాంగ్) సమయంలో ఎలాంటి పరిస్థితులున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాంతిని విశ్లేషించడం ద్వారా టెలిస్కోపులు విశ్వంలోని సుదూర ప్రాంతాల సమాచారాన్ని అందిస్తాయి. అయితే కాంతి కంటే గురుత్వ తరంగాల ద్వారా అందే సమాచారం చాలా ఎక్కువగా, మరింత కచ్చితత్వంతో ఉంటుంది. గురుత్వ తరంగాల ద్వారా అవి జనించిన గ్రహాలు, నక్షత్రాలు, కృష్ణబిలాల ద్రవ్యరాశిని, అక్కడి పరిస్థితిని తెలుసుకోవచ్చు. తద్వారా విశ్వం గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు కనుగొన్నారు ఈ తరంగాలను 2015 సెప్టెంబర్‌లో తొలిసారి, అదే ఏడాది డిసెంబర్లో రెండోసారి గుర్తించారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో మూడోసారి గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు. తాజాగా ఆగస్ట్ 14న లిగో శాస్త్రవేత్తలు, యూరప్‌కు చెందిన విర్గో పరిశోధకులతో సంయుక్తంగా గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు. భారతీయుల కీలక పాత్ర గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. లిగో ప్రాజెక్టులో భాగంగా దేశంలోని 13 కేంద్రాల్లో 67 మంది భారత శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్లు లిగో–ఇండియాకు నేతృత్వం వహిస్తున్న సంజీవ్ దురంధర్ తెలిపారు. సీఎంఐ–చెన్నై, ఐసీటీఎస్– బెంగళూరు, ఐఐఎస్ఇఆర్–కోల్‌కతా, ఐఐఎస్ఇఆర్–తిరువ నంతపురం, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్, ఐపీఆర్ గాంధీనగర్, ఐయూసీఏఏ పూణే, ఆర్ఆర్సీఏటీ ఇండోర్, టీఐఎఫ్ఆర్ ముంబై, యూఏఐఆర్ గాంధీనగర్ తదితర చోట్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నట్లు వెల్లడించారు. గురుత్వాకర్షణ తరంగాలు అంటే? కృష్ణ బిలాలు లేదా నక్షత్రాలు పరస్పరం ఢీకొన్నప్పడు ఈ గురుత్వాకర్షణ తరంగాలు జనిస్తాయి. 1915లో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం ప్రకారం స్థల, కాలాలను ప్రభావితం చేసే శక్తి గురుత్వ తరంగాలకు ఉంటుంది. కాంతి వేగంతో ప్రయాణించే ఈ తరంగాలు తమ మార్గంలో అడ్డువచ్చే వస్తువులను ముందుకు తోస్తాయి. తద్వారా విశ్వం మరింతగా విస్తరిస్తుంది. ఈ గురుత్వాకర్షణ తరంగాల పరిమాణం అణువు కంటే చాలా చిన్నవిగా ఉండటంతో వీటిని చాలాకాలంగా గుర్తించలేకపోయారు. ఐన్‌స్టీన్ కూడా వీటిని గుర్తించడం అప్పటి సాంకేతికతో సాధ్యం కాదని గతంలో అభిప్రాయపడ్డారు. -
పక్కాగా సామర్థ్యం గుర్తింపు పరీక్షలు
జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రాథమిక స్థాయి విద్యార్థుల ప్రతిభా, అభ్యాస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ నెల 14, 15 తేదీల్లో 2–5 తరగతుల విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక పరీక్షలు పక్కాగా ఉండాలని డీఈఓ శామ్యూల్ స్పష్టం చేశారు. స్థానిక సైన్స్ సెంటర్లో గురువారం ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 4, 5 తరగతుల విద్యార్థులకు స్టేట్ లెవల్ అచీవ్మెంట్ సర్వే (స్లాస్) పరీక్ష . 2 నుంచి 5 తరగతుల పిల్లలకు 3ఆర్ (రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్) పరీక్షలు ఉంటాయన్నారు. ఫలితాలను జనవరిలో వెల్లడవుతాయన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 80 పాఠశాలల్లో నమూనా అధ్యయనం పరీక్షలు ఉంటాయన్నారు. డీఎడ్ విద్యార్థులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. తక్కిన పాఠశాలల్లో ఆయా యాజమాన్యాల పర్యవేక్షణలో ఇతర సబ్జెక్టుల టీచర్లు నిర్వహించాలన్నారు. నిర్వహణలో సందేహాలు, సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. డైట్ కళాశాల ప్రిన్సిపల్ జనార్ధన్‌రెడ్డి, పెనుకొండ డెప్యూటీ డీఈఓ సుబ్బారావు, ఏడీ పగడాల లక్ష్మీనారాయణ, డీసీఈబీ కార్యదర్శి నాగభూషణం, ఎస్ఎస్ఏ ఏఎంఓ చెన్నకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ప్రారంభమైన కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష
హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాత పరీక్ష జరుగనుంది. మొత్తం 9,281 పోస్టుల కోసం తెలంగాణ వ్యాప్తంగా 153 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో పోలీసు కానిస్టేబుల్ (సివిల్/ ఏఆర్/ ఎస్ఏఆర్/ టీఎస్ఎస్పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)లో కానిస్టేబుల్ (పురుష), అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించారు. అభ్యర్థులు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతోపాటు హాల్ టికెట్‌తో హాజరు కావాలని అధికారులు సూచించిన సంగతి విధితమే. -
నేడు కానిస్టేబుల్ రాత పరీక్ష
-
నేడు కానిస్టేబుల్ రాత పరీక్ష
⇒రాష్ట్రవ్యాప్తంగా 153 పరీక్ష కేంద్రాలు ⇒9,281 పోస్టులకు 81,523 మంది ⇒అభ్యర్థుల పోటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో పోలీసు కానిస్టేబుల్ (సివిల్/ ఏఆర్/ ఎస్ఏఆర్/ టీఎస్ఎస్పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)లో కానిస్టేబుల్ (పురుష), అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష నిర్వహించనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే రాత పరీక్షకు నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతిం చమని బోర్డు స్పష్టం చేసింది. ఉదయం 9 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని తెలిపింది. మొత్తం 9,281 పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 153 కేంద్రాల్లో 81,523 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతోపాటు హాల్ టికెట్‌తో హాజరు కావాలని అధికారులు సూచించారు. -
గురుభ్యోనమః
8న ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం ముగ్గురికి రాష్ట్ర స్థాయి 27 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక నేడు ఉపాధ్యాయ దినోత్సవం ఆదిలాబాద్: గురుబ్రహ్మ.. గురు విష్ణు.. గురుదేవో మహేశ్వర.. అనాది నుంచి గురువులకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. తల్లిదండ్రుల తర్వాత పూజించబడేది గురువులే. గురువులు పరబ్రహ్మ స్వరూపంగా సంభోదించే సంప్రదాయం మనది. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు భవిష్యత్తుకు బాట చూపుతారు. అక్షర ఓనమాలు నేర్పి ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. గురువులను గౌరవించని వారి భవిష్యత్తు అంధకారమే అని చెప్పవచ్చు. దేశ ప్రథమ పౌరుడైనా.. ఎంతటి స్థాయిలో ఉన్నా... గురువు లేనిదే ఆ వ్యక్తి గమ్యానికి చేరుకోలేరు. క్రమశిక్షణ, సమయ పాలన, విధి నిర్వహణలో నిబద్ధతకు నిదర్శనం ఉపాధ్యాయ వత్తి. విద్యార్థులకు అలాంటి ఉత్తమ విద్యనందించిన వారే ఉత్తములు అవుతారు. సర్వేపల్లి రాధాకష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితి రావడంతో జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈనెల 8న జరుపుకుంటున్నారు. రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి సన్మానం చేయనున్నారు. కాగా జిల్లా స్థాయిలో 27 మందికి, రాష్ట్ర స్థాయిలో ముగ్గురిని సన్మానించనున్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన వారి మనోగతం.. సేవలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు.. ఆదిలాబాద్ మండలంలోని అంకోలి ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న సంతోష్ కుమార్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈయన 1987 ఫిబ్రవరిలో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరారు. అంకోలి పాఠశాలలో పనిచేసే కంటేముందు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండేది. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను సర్కార్ బడికి వచ్చేలా చేసి, పాఠశాల అభివద్ధికి ఎంతగానో కషి చేస్తున్నారు. ఈ పాఠశాలలో ప్రైవేటుకు దీటుగా విద్యా బోధన జరుగుతుంది. బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు సంతోష్. 2014 సంవత్సరంలో జిల్లా ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోనున్నారు. నిబద్దతకు నిదర్శనం.. కట్టరాజమౌళి వత్తిలో నిబద్ధతకు నిదర్శనం. రాజమౌళి ఎన్సీసీ శిక్షణ అధికారి పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులకు దారి చూపారు. రాజమౌళి వద్ద శిక్షణ పొందిన 30 మంది వరకు విద్యార్థులు ప్రస్తుతం పోలీసు కానిస్టేబుళ్లుగా, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. ఎన్సీసీ నిర్వహించిన వివిధ పోటీల్లో, సాంస్కతిక కార్యక్రమాల్లో 200 వరకు బంగారు పథకాలు సాధించేలా కృషి చేశారు. 1995 సంవత్సరం జూన్ మాసంలో ఉపాధ్యాయ వత్తిలో చేరారు. 2001 సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందారు. ప్రస్తుతం జన్నారం జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2012 సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. 2012, 2014 సంవత్సరాలలో ఉత్తమ ఎన్సీసీ అధికారిగా అవార్డులు పొందారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకోనున్నారు. పర్యావరణ ప్రేమికుడు పర్యావరణ పరిరక్షించడంలో ఈ ఉపాధ్యాయుడు తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులకు పర్యావరణం పరిరక్షణపై శిక్షణ కల్పిస్తున్నారు. నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కో ఆర్డినేటర్‌గా, మాస్టర్ ట్రైనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కౌమర విద్య, హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై ఎన్నో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2010లో మారిన పాఠ్యపుస్తకాలపై ఉపాధ్యాయలకు శిక్షణలు ఇవ్వడంతో పాటు జీవశాస్త్రం సబెక్టు ట్రైనర్‌గా, రాష్ట్ర రిసోర్స్‌పర్సన్‌గా పనిచేశారు. ఎన్జీసీ ద్వారా జిల్లాకు చెందిన 40 మంది విద్యార్థులను తిరుపతి తీసుకెళ్లి పర్యావరణంపై అవగాహన కల్పించారు. మొక్కలు నాటడం వల్ల కలిగే లాభాలు, విద్యుత్ పొదుపు, కాలుష్యం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ ఉపాధ్యాయుడు 1998 సంవత్సరంలో ఉపాధ్యాయ వత్తిలో చేరారు.1998 సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. 2012 సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2010 సంవత్సరంలో ఉత్తమ ఎన్జీసీ ఉపాధ్యాయుడిగా అవార్డులు పొందారు. -
పురోహితులకు గుర్తింపు కార్డులివ్వాలి
భూదాన్‌పోచంపల్లి కృష్ణ పుష్కరాల సందర్భంగా జిల్లాలోని ప్రతి పురోహితుడికి గుర్తింపుకార్డులు ఇవ్వాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పోచంపల్లి రమణారావు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండలంలోని జిబ్లక్‌పల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహా పుష్కరాలు తెలంగాణకు తొలి పండుగ అన్నారు. తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు పరిమితమైన ఈ మహోత్సవంలో ఎక్కువ సంఖ్యలో పురోహితులు అవసరమై ఉంటారని, ఈ రెండు జిల్లాల పురోహితులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.