భూదాన్‌పోచంపల్లి
కృష్ణ పుష్కరాల సందర్భంగా జిల్లాలోని ప్రతి పురోహితుడికి గుర్తింపుకార్డులు ఇవ్వాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పోచంపల్లి రమణారావు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండలంలోని జిబ్లక్‌పల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహా పుష్కరాలు తెలంగాణకు తొలి పండుగ అన్నారు. తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు పరిమితమైన ఈ మహోత్సవంలో ఎక్కువ సంఖ్యలో పురోహితులు అవసరమై ఉంటారని, ఈ రెండు జిల్లాల పురోహితులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
పురోహితులకు గుర్తింపు కార్డులివ్వాలి
Published Sun, Aug 7 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
Advertisement
Advertisement