brahmans
-
ముస్లింలపై బీజేపీ వివక్ష: మాయావతి
లక్నో: యూపీలో బ్రాహ్మణులు, దళితులు, ముస్లిములను టార్గెట్ చేశారని(లక్ష్యంగా చేసుకోవడం) బీఎస్పీ(బహుజన్ సమాజ్ పార్టీ) అధినేత మాయావతి తెలిపారు. శుక్రవారం మాయావతి మీడియాతో మాట్లాడారు. యూపీలో బీజేపీ నేతృత్వంలోని యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం దళితుల పై తప్పుడు కేసులు బనాయించి వేదిస్తుందని విమర్శించారు. అయితే గతంలో పాలించిన ఎస్పీ(సమాజ్ వాదీ) ప్రభుత్వంలో బ్రాహ్మణులు, దళితులు వివక్షకు గురయ్యారని మండిపడ్డారు కాగా ఎస్పీ పాలనలో దిగ్గజ నాయకుల విగ్రహాలు ధ్వంసమయ్యావని, జిల్లాలు, సంస్థల పేర్లు (దళిత చిహ్నాలు) ఎస్పీ ప్రభుత్వం మార్చిందని మాయావతి ధ్వజమెత్తారు. మరోవైపు వారనాసి, జౌన్పూర్ ప్రాంతాలలో సంఘటనలను ఆమె విమర్శించారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. -
పురోహితులకు లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ చేయూత
కరోనా మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. లాక్డౌన్ కారణంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న పురోహితులకు యూఎస్ఏకు చెందిన లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ చేయుత అందిస్తోంది. ఫౌండేషన్ ప్రతినిధులు స్పందిస్తూ.. ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్న బ్రాహ్మణులు ఉండాల్సిందేనని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పురోహితులకు పూట గడవడమే కష్టంగా ఉందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శుభకార్యాల మీదే ఆధారపడి జీవిస్తున్న బ్రాహ్మణుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని.. వీరికి ఎటువంటి నెలసరి జీతం లేకపోవడంతో నిత్యావసరాలు, ఇంటి అద్దెలు కట్టుకోలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. పురోహితుల బాధను చూసి చలించిన లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ యాజమాన్యం పుల్లా రెడ్డి యెదురు, పరమేశ్వర రెడ్డి నంగి, రవి కుమార్ రెడ్డి పులిమి సుమన్ టీవీ వారితో కలిసి ఇబ్బంది పడుత్నున్న 110 మంది పురోహితులకు నెలకు సరిపడే నిత్యావసరాలు అందజేశామని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయం అందించిన లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ వారికీ సుమన్ టీవీ కృతజ్ఞతలు తెలియజేసింది. -
పేద బ్రాహ్మణులకు ప్రభుత్వం అండ
సాక్షి, సిద్దిపేట: తెలం గాణ ఏర్పాటు తర్వాత బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి నిధులు కేటాయించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణాచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. బ్రాహ్మణుల కష్టాలు నేరుగా చూసిన సీఎం కేసీఆర్ వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పా టు చేశారని చెప్పారు. బ్రాహ్మణుల అభివృద్ధికోసం ప్రత్యేక కమిటీని వేసి దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం పథకాలు ప్రవేశపెడుతున్నామని వివరించారు. ప్రభుత్వ సలహాదారు రమణా చారి మాట్లాడుతూ.. నిరుపేద బ్రాహ్మణ యువ త, మహిళలకోసం కుటీర పరిశ్రమల ఏర్పాటు కు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. -
బ్రాహ్మణుల హక్కుల కోసం ఐక్యవేదిక పోరాటం
రామన్నపేట : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 123 బ్రహ్మణ సంఘాలు ఏకమై బ్రాహ్మణుల హక్కులను సాధించడానికి ఐక్య వేదిక ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని బ్రాహ్మణ సేవా సమితి గౌరవాధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. వరంగల్ బట్టలబజార్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన కళ్యాణమండపంలో శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్రహ్మణ ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపేంద్రశర్మ మాట్లాడుతూ బ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ప్రయత్నించాలన్నారు. ఆగ్రవర్ణాల పేదలకు సంక్షేమ పథకాలు వర్తించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ పాలక ప్రతిపక్షాల పార్టీల దృష్టికి తీసుకుపోవాలని ఆయన సూచించారు.కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందించే విధంగా త్వరలో ముఖ్యమంత్రిని కలిసి అభ్యర్థిస్తామని ఆయన అన్నారు. సమావేశంలో కార్పొరేటర్ వద్దిరాజు గణేష్, బ్రహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రావు, ధన్వంతరీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు పంతంగి కమలాకర్‌రావు, సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు నిట్టూరి సతీష్, మహిళ అధ్యక్షురాలు రజిత శర్మ, ఆదిశేష బ్రహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరభద్రయ్య నగర శాఖ అ«ధ్యక్షుడు పవన్‌కుమార్, పురుషోత్తం, సముద్రాల పురుషోత్తమచార్యులు పాల్గొన్నారు. -
ఆలయ ధర్మకర్తలపై బ్రాహ్మణుల ఆగ్రహం
కొడంగల్ : పేదల తిరుపతిగా పేరుగాంచిన స్థానిక పద్మావతీ సమేత శ్రీ మహాక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలపై కొడంగల్ బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఆలయంలో ప్రతి ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడి ఆలయ ప్రత్యేకత. వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, లక్ష తులసీ అర్చన, ఉగాది ఉత్సవాలు, ధనుర్మాసం పూజలు, నెలవారీ ప్రత్యేక పూజలు, ఇతర ముఖ్య పండుగలు, పర్వదినాల్లో నిర్వహించే పూజలు, కైంకర్యాలు అంగరంగా వైభవంగా నిర్వహించడంలో కొడంగల్ బ్రాహ్మణులు, అర్చకులు, పురోహితులు కీలకంగా ఉంటున్నారు. ఏనాడూ డబ్బులు ఆశించకుండా సేవా నిరతితో పూజల్లో పాల్గొంటున్నారు. అయితే ఆలయ ధర్మకర్తల నుంచి సరైన సహకారం, గౌరవం లేదని అవమాన పరిచే రీతిలో వ్యవహరిస్తున్నారని పలువురు బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ధర్మకర్తల విపరీత పోకడల వల్ల ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గిందని ఆలయంలో నిత్యం కైంకర్యాల్లో ఎప్పుడూ చూసిన దేవుని మూలమూర్తికి అడ్డంగా ధర్మకర్తల కుటుంబసభ్యులు నిలబడతారని విమర్శించారు. భక్తులు ఆలయానికి రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమ శాస్త్ర సలహాదారుడు సుందర వరద భట్టాచార్యులు ఆలయ ధర్మకర్తలను పిలిచి ఇలాంటి చర్యలు పునరావతం కాకుండా చూడాలని మందలించినట్లు తెలిసింది. -
పురోహితులకు గుర్తింపు కార్డులివ్వాలి
భూదాన్‌పోచంపల్లి కృష్ణ పుష్కరాల సందర్భంగా జిల్లాలోని ప్రతి పురోహితుడికి గుర్తింపుకార్డులు ఇవ్వాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పోచంపల్లి రమణారావు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండలంలోని జిబ్లక్‌పల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహా పుష్కరాలు తెలంగాణకు తొలి పండుగ అన్నారు. తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు పరిమితమైన ఈ మహోత్సవంలో ఎక్కువ సంఖ్యలో పురోహితులు అవసరమై ఉంటారని, ఈ రెండు జిల్లాల పురోహితులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. -
'ఐలయ్య తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు'
గుంటూరు: బ్రాహ్మణులపై ప్రొఫెసర్ కంచె ఐలయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ తీవ్రంగా స్పందించారు. ఐలయ్య తన తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. బ్రాహ్మణులను తిని కూర్చునే సోమరులంటూ ఓ పత్రికలో కంచెం ఐలయ్య రాసిన కథనంపై బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య తరఫున శ్రీకాంత్ తన స్పందనను ప్రకటన రూపంలో విడుదల చేశారు. వేదాలు, మంత్రాలను శ్రద్ధగా చదివి, వాటిని అర్థం చేసుకోవాలని, సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని ఐలయ్యకు సూచించారు. అనవసరంగా బ్రాహ్మణులను నిందించడం సరికాదన్నారు.