గుంటూరు: బ్రాహ్మణులపై ప్రొఫెసర్ కంచె ఐలయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ తీవ్రంగా స్పందించారు. ఐలయ్య తన తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. బ్రాహ్మణులను తిని కూర్చునే సోమరులంటూ ఓ పత్రికలో కంచెం ఐలయ్య రాసిన కథనంపై బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య తరఫున శ్రీకాంత్ తన స్పందనను ప్రకటన రూపంలో విడుదల చేశారు.
వేదాలు, మంత్రాలను శ్రద్ధగా చదివి, వాటిని అర్థం చేసుకోవాలని, సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని ఐలయ్యకు సూచించారు. అనవసరంగా బ్రాహ్మణులను నిందించడం సరికాదన్నారు.
'ఐలయ్య తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు'
Published Sun, May 15 2016 4:34 PM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM
Advertisement
Advertisement