బ్రాహ్మణుల హక్కుల కోసం ఐక్యవేదిక పోరాటం | govt should establish brahman corporation | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణుల హక్కుల కోసం ఐక్యవేదిక పోరాటం

Published Mon, Oct 3 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

govt should establish brahman corporation

రామన్నపేట : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 123 బ్రహ్మణ సంఘాలు ఏకమై బ్రాహ్మణుల హక్కులను సాధించడానికి ఐక్య వేదిక ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని బ్రాహ్మణ సేవా సమితి గౌరవాధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. వరంగల్‌ బట్టలబజార్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన కళ్యాణమండపంలో శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్రహ్మణ ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపేంద్రశర్మ మాట్లాడుతూ  బ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ప్రయత్నించాలన్నారు.   ఆగ్రవర్ణాల పేదలకు సంక్షేమ పథకాలు వర్తించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ పాలక ప్రతిపక్షాల పార్టీల దృష్టికి తీసుకుపోవాలని ఆయన సూచించారు.కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందించే విధంగా త్వరలో ముఖ్యమంత్రిని కలిసి అభ్యర్థిస్తామని ఆయన అన్నారు. సమావేశంలో కార్పొరేటర్‌ వద్దిరాజు గణేష్, బ్రహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, ధన్వంతరీ ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు పంతంగి కమలాకర్‌రావు, సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు నిట్టూరి సతీష్, మహిళ అధ్యక్షురాలు రజిత శర్మ, ఆదిశేష బ్రహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరభద్రయ్య నగర శాఖ అ«ధ్యక్షుడు పవన్‌కుమార్, పురుషోత్తం, సముద్రాల పురుషోత్తమచార్యులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement