TS
-
నెలకు ఒకసారే ఇంటికి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ)లో లీవ్ (సెలవు) మాన్యువల్ మరోసారి చర్చనీయాంశం కానుంది. గతంలో 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లిన కానిస్టేబుళ్లు.. ఇకపై 26 రోజుల నుంచి నెల రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లేలా కొత్త లీవ్ మాన్యువల్ అమలు కానుండటమే ఇందుకు కారణం. వచ్చే నవంబర్ 1 నుంచి కొత్త మాన్యువల్ అమలు కానుండగా, తాజా నిబంధనలపై కానిస్టేబుళ్లలో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వారి కుటుంబాలు ప్రభుత్వం, అధికార వర్గా లపై మండిపడుతున్నాయి. ఇది ముమ్మాటికీ శ్రమ దోపి డీయేనని, బ్రిటిష్ కాలంనాటి చట్టాలను సవరించాల్సిందిపోయి, ఒత్తిడి మరింత పెంచేలా కొత్త విధానా లకు శ్రీకారం చుట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మళ్లీ పాత విధానం!హైదరాబాద్‌తో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 13 టీఎస్ఎస్పీ బెటాలియన్లు ఉన్నాయి. దాదాపు 8 వేల మంది పోలీసులు వివిధ ర్యాంకుల్లో పనిచేస్తున్నారు. బెటాలియన్లలోని ప్రతి 12 మందిని ఒక ప్లటూన్ లేదా సెక్షన్ అని పిలుస్తారు. వీరిలో నలుగురు హెడ్‌క్వార్టర్‌కు అందుబాటులో ఉంటారు. మిగిలిన 8 మందికి ఈ లీవ్ మాన్యువల్ వర్తిస్తుంది. ఒకరు సెలవు తీసుకుంటే ఏడుగురు కచ్చితంగా విధుల్లో ఉండాలి. ఈ ఏడుగురు ఒకరి తర్వాత మరొకరు నాలుగు రోజుల చొప్పున సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 నుంచి 7వ కానిస్టేబుల్ వరకు నాలుగు రోజుల చొప్పున లీవు తీసుకున్నాక 8వ కానిస్టేబుల్‌కు అవకాశం వస్తుందన్నమాట. అంటే 28 రోజుల డ్యూటీ తర్వాత 4 రోజుల సెలవు దొరుకు తుందన్నమాట. అంటే ప్రతి కానిస్టే బుల్ 28 రోజులకు ఒకసారి ఇంటికి వెళతారన్నమాట. ఒక వేళ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో సెలవు పెడితే ఈ క్రమం దెబ్బతిని తదుపరి వ్యక్తి తీసుకోవాల్సిన సెలవు మరింత ఆల స్యం అవుతుంది. 2012 వరకు ఇలాంటి నిబంధనలే ఉండేవి. అయితే 2012 ఆగస్టు 5వ తేదీన తమ భర్తలు ఇంటికి రావడం లేదంటూ కొండాపూర్ బెటాలియన్ ఎదుట కానిస్టే బుళ్ల భార్యాపిల్లలు భారీయెత్తున ధర్నా నిర్వహించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లకు లీవుల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మాన్యువల్‌లో మార్పులు చేసి ఒకసారి ఒక్కరిని కాకుండా ముగ్గురికి అవకా శం ఇవ్వడం ప్రారంభించారు. ఫలితంగా ప్రతి నెలా రెండుసార్లు అంటే 15 రోజులకు ఒకసారి ఇంట్లో వారిని చూసే అవకాశం కానిస్టేబుళ్లకు దక్కేది.అగచాట్లు తప్పవా?⇒ దాదాపుగా పాత పద్ధతి తరహాలోనే ఇకపై 26 రోజుల నుంచి నెల రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లేలా కొత్త లీవ్ మాన్యువల్ అమలు కానుండటంతో కానిస్టేబుళ్లతో పాటు వారి కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వారాలకు వారాలు భర్తలు తమకు, పిల్లలకు దూరంగా ఉండేలా చేస్తు న్న నిబంధనలపై భార్యలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి కాపురాల్లో కలహాలకు కారణమై విడాకుల వరకు వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే కుటుంబసభ్యులు అనా రోగ్యంతో బాధ పడుతున్నా ఇంటికి వెళ్లలేని స్థితిలో ఉంటున్నామని కానిస్టే బుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాజా ఆదేశాలు అమలైతే తమ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని అంటున్నారు. ఇంకోవైపు వీరికి స్థిరంగా విధులు ఎక్కడా ఉండక పోవడం కూడా వారిలో అసంతృప్తికి కారణమవుతోంది. ప్రతి వారానికి లేదా 15 రోజులకు అప్పుడప్పుడూ ప్రతి రోజూ మారతాయి. ఇక సాధారణ ఎన్నికలు, విపత్తులు, అల్లర్లు చెలరేగినపుడు వీరంతా సెలవులు రద్దు చేసుకుని మరీ బందోబస్తు విధుల్లో కొనసాగాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే కొత్త మాన్యువల్‌పై కానిస్టేబుళ్ల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. బ్రిటిష్ కాలంలో రూపొందించిన చట్టాలను మార్చాలంటూ మరోసారి కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకోవాలి⇒ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమ బాధల్ని అసెంబ్లీ వేదికంగా లోకానికి చాటిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం సీఎం, హోంమంత్రిగా ఉన్నారని, ఆయన గతాన్ని గుర్తుచేసుకుని తమ విషయంలో పెద్దమనసు చేసుకో వాలని వారు కోరుతున్నారు. 26 రోజులకు ఒకసారి లీవు విధానం అమలు చేయకుండా ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని, టీఎస్ఎస్పీ, సివిల్, ఏఆర్ బెటాలియన్లను కలిపి తమిళనాడు, కర్ణాటక తరహాలో ‘ఏక్ పోలీసింగ్’ విధానాన్ని అమలు చేయాలని, కుటుంబాలతో ఒకేచోట 3 నుంచి ఐదేళ్లపాటు కలిసి ఉండే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
..........
ప్రస్తుతం సాగు వివరాలుపంటల ఎకరాలువరి 1,63,341పత్తి 94,269మొక్కజొన్న 21,024కంది 4,163ఇతర 23,113సాధారణంగా వరి నాట్లు ఆగస్టు మొదటి వారం వరకు పూర్తి అవుతాయి. ఈ సారి వర్షాలు ఎక్కువగా కురవకపోవడంతో నారు పోసినా నాట్లు వేయలేని పరిస్థితి నెలకొంది. పలు చోట్ల నారు ముదిరిపోయింది. గతేడాది వానకాలంలో 5,20,690 ఎకరాలు సాగైతే ఇప్పటి వరకు 3,05,910 ఎకరాలు మాత్రమే సాగు అవుతోంది. గతేదాడి వరి 3,79,108 ఎకరాలు సాగు అయితే ఇప్పటి వరకు 1,63,341 ఎకరాలే సాగు అయినట్లు సమాచారం. గతంతో పోలిస్తే సుమారు 2లక్షల ఎకరాల మేర తక్కువగా సాగవుతుంది. ఇంకా వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.పలు మండలాల్లో లోటు వర్షపాతంజిల్లాలో ఇప్పటి వరకు సగటు వర్షపాతం కంటే ఎక్కువగానే వర్షం కురిసింది. పలు మండలాల్లో లోటు, సాధారణ, అధిక వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతం వర్గల్, ములుగు, మర్కూక్, జగదేవ్‌పూర్, కొమురవెల్లిలలో నమోదు కాగా, సాధారణ వర్షపాతం హుస్నాబాద్, దుబ్బాక, సిద్దిపేట అర్బన్, దౌల్తాబాద్, రాయపోలు, గజ్వేల్, కొండపాక, చేర్యాలలో నమోదైంది. అలాగే అధిక వర్షపాతం సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు, బెజ్జంకి, కోహెడ, అక్కన్నపేట, నంగనూరు, తొగుట, మిరుదొడ్డి, మద్దూరు, దూల్మిట్ట, నారాయణరావుపేట, అక్బర్పేట భూంపల్లి, కుకునూరుపల్లిలలో నమోదైనట్లు అధికారులు తెలిపారు. గోదావరి జలాలతో చెరువులను నింపే అవకాశం ఉండటంతో మరో 15 రోజుల్లో సాగు పెరిగే అవకాశం ఉంది. -
సాగర్ నుంచి 3.54 లక్షల క్యూసెక్కులు దిగువకు..
నాగార్జునసాగర్/దోమలపెంట/సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి భారీగా వరద నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం రాత్రి 20 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు మంగళవారం ఉదయం మరో రెండు గేట్లు తెరిచి మొత్తం 22 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు సాగర్ నీటిమట్టం 585.40 అడుగుల వద్ద నిల్వ సామర్థ్యం 298.5890కు చేరడంతో ఆరు గేట్లను ఐదు అడుగుల మేర, 16 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి దిగువకు 2,70,920 క్యూసెక్కుల నీరు వదిలారు.మధ్యాహ్నం 2 గంటలకు వరద మరింత పెరగడంతో 22 గేట్లను పది అడుగుల పైకెత్తి 3,09276 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాయంత్రం 6 గంటలకు ఇన్‌ఫ్లో 3,14,594 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 3,54,663కు పెంచారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుతం 585.10 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం జలాశయంలో 297.7235 టీఎంసీల నీరు ఉంది. మరోవైపు శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు నీటి విడుదల కొనసాగుతోంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 3,11,790 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.కుడి, ఎడమ కాల్వలకు నీటి పెంపు..సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటిని పెంచారు. కుడి కాల్వకు 8,144 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఎడమ కాల్వకు 8,193 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఏఎమ్మార్పీకి 1,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. చెరువులు నింపేందుకు వరద కాల్వకు 400 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా అనుముల మండలం మారేపల్లి వద్ద కాల్వకు గండి పడటంతో మంగళవారం ఉదయం వరద కాల్వకు నీటిని నిలిపేశారు. మరోవైపు ఏఎమ్మారీ్పతో పరిధితోపాటు ఆయకట్టు ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులు, కుంటలు వాగులు ఎండిన నేపథ్యంలో ఏఎమ్మార్పీ కాల్వలకు నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని రైతులు కోరుతున్నారు.పులిచింతల నుంచి 1.08 లక్షల క్యూసెక్కులు విడుదలపులిచింతల ప్రాజెక్టు సగం నిండిపోవడం.. ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు పులిచింతలలోకి 3,71,605 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. ప్రాజెక్టులో 157.48 అడుగుల్లో 22.75 టీఎంసీలను నిల్వ చేస్తూ గేట్లు ఎత్తి దిగువకు 1,08,895 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. పులిచింతల నుంచి భారీ ఎత్తున వరదను దిగువకు విడుదల చేస్తుండటంతో.. బుధవారం ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న జలాలను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేయనున్నారు. -
ప్రణీత్ రావు పిటిషన్ ను కొట్టేసిన తెలంగాణ హై కోర్ట్
-
రెండు లక్షల మంది భవితకు పరీక్ష, స్పందించిన ఇంటర్ బోర్డ్ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు కొత్త వివాదాలు రేపుతున్నాయి. 2 లక్షల మందికిపైగా విద్యార్థుల భవిష్యత్ ఏంటనే ప్రశ్న తెరపైకొచ్చింది. పట్టణాల్లో ఫలితాలు మెరుగ్గా, గ్రామాల్లో తక్కువగా రావడంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఫెయిలైన విద్యార్థులు ఇప్పుడు ఫస్ట్, సెకండియర్ పరీక్షలు ఎలా రాస్తారని, పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి సమయమెక్కడ ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఫెయిలైన ప్రభావం రెండో ఏడాదిపైనా ఉంటుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫలితాలపై విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళనకు దిగాయి. ఇంటర్ బోర్డు తీరును దుయ్యబడుతూ శుక్రవారం బోర్డు కార్యాలయం వద్ద సంఘాల నేతలు ధర్నా చేశారు. ప్రభుత్వ అధ్యాపకుల నుంచీ బోర్డు తీరుపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇంటర్ ఫస్టియర్‌లో 2,35,230 మంది ఫెయిలయ్యారు. వీరిలో రెండుకుపైగా సబ్జెక్టులు ఫెయిలైన వాళ్లు 63 శాతం మంది ఉన్నారు. ఆన్లైన్ బోధనకు అవకాశం లేక వీళ్లకు ప్రతికూల ఫలితాలు వచ్చినట్టు అధ్యాపకులు చెబుతున్నారు. ‘పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు సంబంధించిన చాప్టర్లే వాళ్లు వినే అవకాశం చిక్కలేదు. నెట్ సిగ్నల్స్ అందడం లేదని విద్యార్థుల నుంచీ ఫిర్యాదులొచ్చాయి’ అని మహబూబ్‌నగర్‌కు చెందిన అధ్యాపకుడు నవీన్ తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, మహబూబ్‌బాద్, భూపాలపల్లి, మెదక్, యాదాద్రి, సూర్యాపేట, గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల నుంచి ఈ ఫిర్యాదులు వచ్చాయి. గ్రేస్ మార్కులేస్తే?: ఆన్లైన్ సౌకర్యం లేక గ్రామీణ విద్యార్థులు చాలా చాప్టర్లు వినలేదని వరంగల్‌కు చెందిన అధ్యాపకుడు సతీశ్‌వర్మ తెలిపారు. ఇప్పుడీ చాప్టర్స్ మొదటి నుంచీ చదివితేనే మార్చిలోనైనా పరీక్షలు రాయగలరన్నారు. కానీ విద్యార్థులు ఇప్పటికే సెకండియర్ ప్రిపరేషన్లో ఉన్నారని మరి సమయం ఎలా ఉంటుందని అన్నారు. ‘గ్రేస్ మార్కులిస్తే కనీసం 30 శాతం మంది బయటపడే వీలుంది’ అని హైదరాబాద్‌కు చెందిన లెక్చరర్ నీలేశ్ చెప్పారు. అంతా సక్రమంగానే చేశాం, విద్యార్థులు ఆందోళనకు గురవ్వొద్దు: ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఫస్టియర్ పరీక్ష ఫలితాలు గందరగోళం రేపుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ శుక్రవారం రాత్రి స్పందించింది. విద్యార్థులను అన్ని కోణాల్లోనూ సిద్ధం చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించామని బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. లాక్డౌన్ విధించేవరకూ కొంతకాలంపాటు ప్రత్యక్ష బోధన సాగిందని గుర్తు చేశారు. ఆ తరువాత విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను 70 శాతానికి కుదించామన్నారు. అదనంగా బేసిక్ మెటీరియల్‌ను కూడా బోర్డ్ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచిందని చెప్పారు. ఎక్కువ ఐచ్ఛికాలతో ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్షలను తేలిక చేశామని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించామని, ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు. రీ వెరిఫికేషన్ ఫీజును తగ్గిస్తున్నాం..: ఫలితాలపై సందేహాలుంటే విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన మేరకు రీవెరిఫికేషన్ ఫీజు కూడా 50 శాతం తగ్గిస్తున్నామని జలీల్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జవాబు పత్రాల ప్రతిని పంపుతామన్నారు. ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి అసంతృప్తికి గురవ్వొద్దని, బాగా ప్రిపేరై వచ్చే ఏప్రిల్‌లో మళ్లీ పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు. -
50వేల కొలువులు..ఉద్యోగ అభ్యర్థులూ సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 50 వేల ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభిం చాలని సూచించారు. శుక్రవారం ప్రగతి భవన్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉద్యోగాల భర్తీలో స్థానికులకు న్యాయం జరగాలనేది తెలంగాణ ఉద్యమ నినాదాల్లో ఒకటి. ఈ నినాదాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.ఇన్నాళ్లూ జాప్యం జరిగినా, కొత్త విధానానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయాయి. – సీఎం కేసీఆర్ గతంలో అంతా అస్తవ్యస్తం గతంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్య స్తంగా ఉండేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానిం చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రమించి, అత్యంత శాస్త్రీయ విధానాన్ని అను సరించి కొత్త జోనల్ విధానానికి రూపకల్పన చేసిం దని తెలిపారు. ‘ప్రస్తుతం ఈ కొత్త విధానంలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. అన్ని ప్రభుత్వశాఖల్లో నేరుగా నింపే అవకాశాలున్న (డైరెక్ట్ట్ రిక్రూట్మెంట్) అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయి. వీటిని తొలి విడతలో భర్తీ చేస్తాం. రెండో విడతలో ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా నింపుతాం. ఇప్పటికే అన్ని శాఖల్లోనూ ప్రమోషన్ల ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం చేపట్టింది. ప్రమోషన్లు, వాటి మూలంగా ఏర్పడే ఉద్యోగ ఖాళీలకు సంబంధిం చిన పూర్తి సమాచారంతో నివేదిక తయారు చేసి ఈనెల 13న జరిగే కేబినెట్ సమావేశానికి తీసుకు రండి..’ అని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎంఓ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఏ వేవ్‌కైనా సంసిద్ధంగా.. ♦ ఇతర రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై అధ్యయనం చేయండి ♦ సరిహద్దు జిల్లాల్లో కూడా మూడురోజులు పర్యటించాలి ♦ కరోనా నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్‌కు నివేదిక సమర్పించాలి ♦ కోవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి ఫీవర్ సర్వే ఏ వేవ్ ఎప్పుడు వస్తదో, ఎంతవరకు విస్తరిస్తదో ఎవరికీ తెలియట్లేదు ♦ మహమ్మారి కట్టడికి ప్రభుత్వంతో కలసి రావాలని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా అప్పం కిషన్
భూపాలపల్లి అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా భూపాలపల్లికి చెందిన అప్పం కిషన్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కిషన్ విద్యార్థి దశ నుంచి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అభిమాని కాగా, 2003 సంవత్సరంలో వైఎస్ చేపట్టిన పాదయాత్రతో కాంగ్రెస్‌పార్టీలో చేరి ఎన్ఎస్యూఐలో కీలకంగా పనిచేశారు. 2010లో జగన్ యువసేన వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2011లో వైఎస్సార్ సీపీలో చేరి పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్నారు. 2012లో పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లాల విభజన తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా సింగరేణి ఎన్నికల్లో మహాకూటమి గెలుపొందేందుకు కృషిచేశారు. తన సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి పదవి ఇచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, షర్మిల, వరంగల్ రూరల్ జిల్లా క్రాంతికుమార్, రాష్ట్ర నాయకులందరికీ అప్పం కిషన్ కృతజ్ఞతలు తెలిపారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎంపీ
సంగెం(పరకాల) : కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ఆదివారం మండలంలోని కృష్ణానగర్‌లో నూతనంగా రూ.16 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ గ్రామాలకు గతంలో ఎన్నడూ రాని విధంగా ఈ నాలుగేళ్లలో నిధులు మంజూరయ్యాయని, వాటితో చేపట్టే అభివృద్ధి ప్రతిపక్షాలకు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. నాలుగైదు రోజుల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని, వచ్చే ఏడాది కాలేశ్వరం నీళ్లు చెరువుల్లో నింపి రెండు పంటలకు అందిస్తామని చెప్పారు. గ్రామస్తుల కోరిక మేరకు అంగన్వాడీ, యాదవ కమ్యూనిటీ భవనాలు, వాటర్ ట్యాంకు, విద్యుత్ స్తంభాలు, రేషన్‌షాపు మంజూరుకు హామీ ఇచ్చారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎంపీపీ కట్టయ్య, సర్పంచ్ కోడారి రాజమ్మ, ఎంపీటీసీ సభ్యుడు బానోత్ బాలు, ఉపసర్పంచ్ సుబ్బారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి, మండల కన్వీనర్ నరహరి, నాయకులు వెంకటేశ్వర్రావు, మోహన్ ఎంపీడీఓ భద్రునాయక్, డీఈ మంగ్యానాయక్, ఏఈలు కిష్టయ్య, రాజునాయకులు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ నూతన సీఎస్‌గా ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత సీఎస్ శేఖర్ ప్రసాద్ సింగ్ (ఎస్పీ సింగ్) పదవీకాలం నేటితో ముగియనుంది. ఎస్పీ సింగ్ పదవీకాలాన్ని పొడగించాలని కేంద్రాన్ని కోరినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో నూతన సీఎస్ నియామకం అనివార్యమైంది. 984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శైలేంద్ర కుమార్ జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ ఆయన స్వస్థలం. ఢిల్లీ ఐఐటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ అనంతరం సివిల్స్ ర్యాంకు సాధించారు. రాజీవ్ శర్మ, ప్రదీప్ చంద్ర, ఎస్పీ సింగ్‌ల తర్వాత తెలంగాణకు నాలుగో సీఎస్ ఎస్కే జోషి. సీఎస్ నియామక ఉత్తర్వులు -
ఉపాధి లక్ష్యంగా నైపుణ్యాల శిక్షణ
జాయింట్ కలెక్టర్ మల్లికార్జున వికాస, టీసీఎస్ సంస్థలతో సమీక్ష కాకినాడ సిటీ : వికాస, టాటా కన్సెటెన్సీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జిల్లాలోని మూడువేల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను అందించే నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామని జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. గురువారం జేసీ తన చాంబర్లో వికాస, టీసీఎస్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎఫర్మేటీవ్ యాక్షన్ ప్రోగ్రామ్ కింద జిల్లాలోని నిరుద్యోగ యువతకు బిజినెస్ ప్రోమోషన్ సర్వీసెస్ శిక్షణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి అవకాశాలను అందుకునేందుకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్, యాటిట్యూడ్ డెవలెప్మెంట్, అనలిటికల్, లాజికల్ రీజనింగ్ వంటి అంశాల్లో జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇందుకు జిల్లాలో 10 శిక్షణా కేంద్రాలను వికాస ద్వారా ఏర్పాటు చేసి, టీసీఎస్ నిపుణుల సహకారంతో శిక్షణ నిర్వహిస్తారన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు నెల రోజుల పాటు శిక్షణ కల్పిస్తారని, శిక్షణ అనంతరం 10 నుంచి 20 శాతం ప్రతిభావంతులైన అభ్యర్థులకు టీఏసీఎస్ నియామకాలు కల్పిస్తుందని, మిగి లిన వారికి వికాస ద్వారా ఇతర సంస్థల్లో ఉపాధి అవకాశాలను అన్వేషించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే సిద్ధమైన కాకినాడ, తుని కేంద్రాలలో జూలై 3 నుంచి తొలి బ్యాచ్ శిక్షణ ప్రారంభం కానుందన్నారు. త్వరలోనే సామర్లకోట, రంపచోడవరం, అమలాపురంలలో కూడా ఈ కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రతి బ్యాచ్‌లో 50 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయిస్తారన్నారు. 2016–17 సంవత్సరాల్లో పాసైన గాడ్యుయేట్లు మాత్రమే అర్హులని, అంతకు ముందు పాసైన వారు, కరస్పాండెన్స్ కోర్టులు చేసిన వారు అర్హులు కారన్నారు. ఈ కార్యక్రమంలో వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ వీఎన్ రావు, టీసీఎస్ కన్సల్టెంట్ సరస్వతి పద్మనాభన్ పాల్గొన్నారు. కొబ్బరితాళ్లు, తేనెటీగల పెంపకం యూనిట్లు ప్రధాన మంత్రి ఉపాధికల్పన కింద నాబార్డు సహకారంతో స్వయం సహాయ బృందాల మహిళలకు కొబ్బరి తాళ్ల యూనిట్లు, తేనెటీగల పెంపకం యూనిట్లు మంజూరు చేయనున్నామని జేసీ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పరిశ్రమలు, డీఆర్డీఏ, బ్యాంకర్లు, నాబార్డు అధికారులతో సమావేశం నిర్వహించి ఉపాధి యూనిట్ల మంజూరుపై సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, నాబార్డు ఏజీఎం ప్రసాద్, పరిశ్రమల శాఖ డీడీ శ్రీపతి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
టీజేఏసీది హింసాత్మక చరిత్ర .
-
సాక్షి స్పెల్‌బీ గ్రాండ్ ఫినాలే TS కేటగిరీ–4
-
సాక్షి స్పెల్‌బీ గ్రాండ్ ఫినాలే TS కేటగిరీ–3
-
ఏపీకి 18.5, తెలంగాణకు 17.5
-ఇరు రాష్ట్రాల ఖరీఫ్ అవసరాల దృష్ట్యా నీటి విడుదలకు బోర్డు నిర్ణయం -ఎడమ కాల్వ కింద లెలంగాణకు 15 టీఎంసీ, హైదరాబాద్, నల్లగొండ తాగునీటికి 2.5టీఎంసీ -పోతిరెడ్డిపాడు కింది అవసరాలకు 11 టీఎంసీ -ఇందులో చెన్నై తాగునీటికి 3 టీఎంసీ -ఇరు రాష్ట్రాలకు బోర్డు లేఖలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాగు, తాగు అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో లభ్యతగా ఉన్న జలాలను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయం చేసింది. అక్టోబర్ అవసరాలకు గానూ తెలంగాణకు 17.5 టీఎంసీలు, ఏపీకి 18.5 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం చేసింది. ఈ మేరకు నీటి కేటాయింపులపై తన నిర్ణయాన్ని తెలియజేస్తూ బుధవారం ఇరు రాష్ట్రాలకు బోర్డు లేఖలు రాసింది. సాగర్ ఎడమ కాల్వ కింద ఖరీఫ్ కోసం 30.20 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 6టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.10టీఎంసీలు కలిపి మొత్తంగా 40.30టీఎంసీలు అవసరం ఉంటాయని ఆగస్టు నెలలో తెలంగాణ బోర్డును కోరింది. ఇందులో 15 టీఎంసీల నీటి విడుదలకు బోర్డు గతంలోనే అనుమతులిచ్చింది. అనంతరం మళ్లీ తెలంగాణ సాగర్ ఎడమ కాల్వ కింద జోన్-1, జోన్-2లోని ఖరీఫ్ సాగు అవసరాలకు 15 టీఎంసీలు కేటాయించాలని మరో లేఖ రాసింది. ఇదే సమయంలో టగత 28, 30 తేదీల్లో ఏపీ తనకు పోతిరెడ్డిపాడు కింద 11 టీఎంసీలు, హంద్రీనీవా కింద 5 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వ కింద మరో 2.50 టీఎంసీలు కావాలని విన్నవించింది. ఈ వినతులను పరిశీలించిన బోర్డు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుధ్దంగా ఇరు రాష్ట్రాలు నీటిని విడుదల చేశారో తెలుపుతూనే, ప్రస్తుత కేటాయింపులు జరిపింది. మూడు చోట్ల వాటాకు మించి వినియోగం.. కృష్ణా బేసిన్లో ఇప్పటివరకు తెలంగాణ ఏఎంఆర్పీ కింద 10.21టీఎంసీ, ఎడమ కాల్వ కింద 5.131టీఎంసీ, కల్వకుర్తి కింద 1.745 టీఎంసీలు కలిపి మొత్తంగా 17.087టీఎంసీ వినియోగించుకోగా, ఏపీ పోతిరెడ్డిపాడు కింద 23.79టీఎంసీ, సాగర్ కుడి కాల్వ కింద 9.989, కృష్ణా డెల్టా సిస్టమ్ కింద 20.413, హంద్రీనీవా కింద 9.33టీఎంసీలు కలిపి మొత్తంగా 63.524 టీఎంసీలు వినియోగించారని బోర్డు లేఖలో వివరించింది. గత ఆగస్టులో ఇచ్చిన ఆదేశాలకు విరుధ్దంగా పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఏఎంఆర్పీ కింద వాటాకు మించి వినియోగం చేశారని లేఖలో పేర్కొంది. అధికం వాడుంటే వీటిని వాడరాదు.. ప్రస్తుత రాష్ట్రాల వినతులను దృష్టిలో పెట్టుకొని హంద్రీనీవాకు 5 టీఎంసీ, చెన్నై తాగునీటికి 3, ఎస్ఆర్బీసీ 3, తెలుగుగంగ ప్రాజెక్టు 5, సాగర్ ఎడమ కాల్వ కింద 2.50 టీఎంసీలు కలిపి మొత్తంగా ఏపీకి 18.50 టీఎంసీలు విడుదలకు బోర్డు అంగీకారం తెలిపింది. ఇక తెలంగాణకు సాగర్ ఎడమ కాల్వ కింద 15 టీఎంసీ, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు 2.50టీఎంసీలు కలిపి 17.50 టీఎంసీల వినియోగానికి అంగీకారం తెలిపింది. ప్రస్తుతం జరిపిన కేటాయింపులు గత ఆగస్టు నెలలో పేర్కొన్న నీటి కేటాయింపులకు అదనమని, అప్పటి ఆదేశాల్లో పేర్కొన్న దాని కంటే అధికంగా వినియోగం చేసుంటే ప్రస్తుత నీటిని వాడటానికి అవసకాశం ఉండదని, తక్కువగా వినియోగించి ఉంటే మిగిలిన నీటిని వినియోగించుకోవచ్చని లేఖలో స్పష్టం చేసింది. ఏ రాష్ట్రమైనా అధికంగా నీటిని వాడుకొని ఉంటే ఆ రాష్ట్రం త్రిసభ్య కమిటీకి ఆ విషయాన్ని తెలియజేయాలని సూచించింది. ప్రస్తుతం చేసిన కేటాయింపులను ఆయా రాష్ట్రాలు అదే అవసరాలకు వాడుతున్నాయా? లేక ఇతర ప్రాధాన్యాత అవసరాలకు వాడకుంటున్నాయా? అన్నది ఆయా రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు గమనిస్తూ ఉండాలని తెలిపింది. -
బ్రాహ్మణుల హక్కుల కోసం ఐక్యవేదిక పోరాటం
రామన్నపేట : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 123 బ్రహ్మణ సంఘాలు ఏకమై బ్రాహ్మణుల హక్కులను సాధించడానికి ఐక్య వేదిక ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని బ్రాహ్మణ సేవా సమితి గౌరవాధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. వరంగల్ బట్టలబజార్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన కళ్యాణమండపంలో శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్రహ్మణ ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపేంద్రశర్మ మాట్లాడుతూ బ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ప్రయత్నించాలన్నారు. ఆగ్రవర్ణాల పేదలకు సంక్షేమ పథకాలు వర్తించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ పాలక ప్రతిపక్షాల పార్టీల దృష్టికి తీసుకుపోవాలని ఆయన సూచించారు.కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందించే విధంగా త్వరలో ముఖ్యమంత్రిని కలిసి అభ్యర్థిస్తామని ఆయన అన్నారు. సమావేశంలో కార్పొరేటర్ వద్దిరాజు గణేష్, బ్రహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రావు, ధన్వంతరీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు పంతంగి కమలాకర్‌రావు, సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు నిట్టూరి సతీష్, మహిళ అధ్యక్షురాలు రజిత శర్మ, ఆదిశేష బ్రహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరభద్రయ్య నగర శాఖ అ«ధ్యక్షుడు పవన్‌కుమార్, పురుషోత్తం, సముద్రాల పురుషోత్తమచార్యులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో గాడితప్పిన పాలన
వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. సమస్యలపై అవగాహన లేని వారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. హన్మకొండలోని విశాల్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధి చూపించడంలేదని విమర్శించారు. మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయడంలో విఫలమవుతున్నారని తెలిపారు. ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తున్నామని, అందులో 80 శాతం ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని హామీ ఇవ్వడంతో వేలాది మంది నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అయితే ఏడాది గడిచినా రుణాలపై అతీగతీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో అమలు చేసిన అభయహస్తం పింఛన్లను తొమ్మిది నెలలుగా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో పాలనను అస్తవ్యస్తంగా మార్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాకతీయ ఉత్సవాలకు ని«ధులు ఇస్తే.. తెలంగాణ అని చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌కు ఇప్పుడు ఆ ఉత్సవాలను పట్టించుకోని కేసీఆర్‌ను ప్రశ్నించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. మహబూబాబాద్ నుంచి జనగామ వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ఘనకార్యాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎంసెట్ నిర్వహణ లోపాలతో ర్యాంకులు పొందిన వారు ఇప్పుడు రాస్తే ఎక్కువ ర్యాంకులు వచ్చి ఏడాది నష్టపోయారన్నారు. ప్రకటనలు చేయడమే తప్పా.. టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు ఒరగపెట్టింది ఏమి లేదన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరికి రుణాలు ఇవ్వకుంటే ఎస్సీ కార్పొరేషన్‌తో పాటు ఇతర కులాల సంక్షేమ కార్యాలయాలను ముట్టడించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, కార్పొరేటర్ తొట్ల రాజు, కాంగ్రెస్ నేతలు ఈవీ శ్రీనివాసరావు, బత్తిని శ్రీనివాసరావు, రవీందర్, లక్ష్మారెడ్డి, మండల సమ్మయ్య, మనుపాటి శ్రీనివాస్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 28హెచ్‌ఎంకెడి401: మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి నోట్ : ఫోటో సీఎస్ ఫోల్డర్లో ఉంటుంది -
తేలని కృష్ణా పంచాయితీ
-
ఏపీ, తెలంగాణ నీళ్ల పంచాయితీ
-
తేలని కృష్ణా పంచాయితీ: పరస్పర ఫిర్యాదులు
- అపెక్స్ సమావేశంలో హాట్ హాట్ గా వాదనలు - పాలమూరు, డిండికి ఏపీ అభ్యంతరం - అవి పాతవేనన్న తెలంగాణ.. పట్టిసీమ, పోతిరెడ్డిపాడులపై ఫిర్యాదు - కలిసి మాట్లాడుకోవాలని ఉమాభారతి సూచన న్యూఢిల్లీ: కృష్ణానదీ జలాల్లో వాటాల కేటాయింపులు, వాటి ఆధారంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కేంద్రానికి పరస్పర ఫిర్యాదులు చేశాయి. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లోని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన అపెక్స్ సమావేశంలో.. తెలంగాణ నిర్మిస్తోన్న పాలమూరు, డిండి ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు వ్యక్యం చేయగా, అవి రెండూ పాత ప్రాజెక్టులేనని, తమకు దక్కాల్సిన నీటివాటాను పెంచాలని తెలంగాణ వాదించింది. మొత్తంగా ఎజెండాలోని ఐదు అంశాల్లో మూడింటికి ఏకాభిప్రాయం లభించగా, కీలకమైన ప్రాజెక్టులపై మాత్రం స్పష్టత రాలేదు. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి, తెలంగాణ, ఏపీ సీఎంలు కె.చంద్రశేఖర్ రావు, నారా చంద్రబాబునాయుడులతోపాటు నీటిపారుదల మంత్రులు హరీశ్ రావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ముఖ్యకార్యదర్శులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ఇంజనీర్ ఇన్ చీఫ్ లు అపెక్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీ అనంతరం అనంతరం ఉమాభారతి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించామని, ఇరు పక్షాల వాదలు పూర్తయిన తర్వాత మూడు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని, వ్యక్తిగతంగా దీనినొక విప్లవాత్మక(క్రాంతికారి) భేటీగా భావిస్తున్నానని అన్నారు. టెలీ మెట్రిక్ విధానం ద్వారా నీటి వాడకాన్ని లెక్కించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. 47 చోట్ల ఈ టెలీమీటర్లను ఏర్పాటుచేయనున్నారు. టెండర్ల ద్వారా త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించాయి. నదీజలాల లభ్యత, పంపిణీపై అధ్యయనానికి సంయుక్త కమిటీ ఏర్పాటుచేసుకోవాలనే ఎజెండా అంశానికి కూడా ఇరు పక్షాలు సరేనన్నాయి. రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి తాత్కాలిక విధానానికి (ప్రస్తుతం అమలవుతోన్న దానికి) అంగీకారం తెలిపాయి. అయితే ఏకాభిప్రాయం కుదరని ప్రాజెక్టుల అంశాలపై రెండు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అపెక్స్ భేటీకి సంబంధించిన నివేదికను ట్రిబ్యూనల్ కు అందజేయనున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. కాగా, నీటి వాటాలపై మరో సమావేశం ఉండదని ఉమాభారతి తెగేసిచెప్పారు. దీంతో తదుపరి అభ్యంతరాలన్నీ ట్రిబ్యూనల్, సుప్రీంకోర్టులకే తెలపాల్సి ఉంటుంది. పాలమూరు, డిండికి ఏపీ 'నో': తెలంగాణ నిర్మించతలపెట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని అపెక్స్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. బ్రిజేష్ ట్రిబ్యూనల్ తీర్పు నోటిఫై అయ్యేంత వరకు పాత విధానంలోనే నీటిని పంచుకునేందుకు, టెలీ మీటర్ల ఏర్పాటుకు, నీటి లభ్యతపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. పాలమూరు, డిండి పాతవే: ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నట్లు పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కొత్తవి కావని, చాలా ఏళ్ల కిందటే వాటి నిర్మాణాలకు జీవోలు జారీ అయ్యాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఏపీ నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు కొత్తదని, దానికి సీడీబ్ల్యూసీ, బోర్డు అనుమతులు లేవని ఆరోపించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ ఎక్కువ నీళ్లను వాడుకుంటున్నదని ఫిర్యాదుచేసింది. ఆర్డీఎస్ ఉల్లంఘనలపై కేంద్రం దృష్టిపెట్టాలని కోరింది. కృష్ణాలో తెలంగాణ వాటా 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచాలని విజ్ఞప్తి చేసింది. ట్రిబ్యూనల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసే వరకు బోర్డు నియంత్రణ అక్కర్లేదని, మొహిలే, గోయల్ లను నిపుణుల కమిటీ నుంచి తొలిగించాలని కోరింది. గోదావరి జలాల్లో తనకున్న 954 టీఎంసీల వాటాను వినియోగించుకునేలా చేపట్టిన ప్రాజెక్టుల రీ డిజైనింగ్ లో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ సమావేశంలో తేల్చిచెప్పింది. సుప్రీం ఆదేశాల మేరకు రూపొందించిన అపెక్స్ ఎజెండాలోని అంశాలివే.. 1) తెలంగాణ నిర్మిస్తోన్న పాలమూరు, డిండి ప్రాజెక్టులపై చర్చకు మొదటిప్రాధాన్యం 2) ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి తాత్కాలిక విధానం 3) రిజర్వాయర్ల పరిధిలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో లెక్కలు పారదర్శకంగా ఉండేందుకు టెలీమెట్రీ విధానం 4) సంవత్సరంలో(ఒక వాటర్ ఇయర్లో) నీటి వాటాల్లో హెచ్చుతగ్గులుంటే వాటి సర్దుబాటు చేసుకోవడం 5) గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి తరలిస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై చర్చ వీటిలో కీలకమైన అంశాలు తప్ప మిగిలిన మూడింటిపై భేటీలో ఏకాభిప్రాయం కుదిరింది. -
'నయీంను పెంచి పోషించింది ప్రభుత్వాలే'
నల్గొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను పెంచి పోషించింది ప్రభుత్వాలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఉన్నాయని, అవే నయీమ్ లాంటి వారిని పెంచి పోషించాయన్నారు. పోలీసులు, మంత్రులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నక్సలైట్లు, మాజీ నక్సలైట్లను చంపేందుకు నయీమ్‌కు ప్రభుత్వాలు డబ్బులిచ్చి ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. డీజీపీ స్థాయి అధికారులు, మంత్రులు నయీమ్‌తో సన్నిహితంగా ఉంటూ అనేక ఆస్తులు సంపాదించుకుని, సాంబశివుడి లాంటి వారిని చంపించారని దుయ్యబట్టారు. నయీమ్ కేసులో ఉన్న పెద్దలు బయటకి రావాలంటే సిట్ ద్వారా కాకుండా.. సీబీఐ ద్వారా విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై బీజేపీ మాట మార్చడం బాధకరమన్నారు. ఆనాడు ప్రత్యేక హోదాపై ఆశలు కల్పించి నేడు ఇలా మాట మార్చడంలో ఆంతర్యమేమిటో తెలపాలన్నారు. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి నాలుకపై నరం లేదని విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మధ్యలో ఉంటూ పోటీ చేస్తానని చెప్పిన పవన్‌కళ్యాణ్ మాటలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులతో చర్చిస్తానని చెప్పడం స్వాగతిస్తున్నామని తెలిపారు. -
ఈనెల 11న తెలంగాణ ఎంసెట్ 3
-
టీఎస్ ఎన్పీడీసీఎల్కు ‘ఏ’ గ్రేడ్
హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర ఎన్పీడీసీఎల్ గ్రేడ్ ‘బీ’ నుంచి ‘ఏ’కు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. తద్వారా గతంలో కంటే అధిక మొత్తంలో రుణాలు సులువుగా పొందే అవకాశం సంస్థకు లభిస్తుంది. ఆయా నిధులతో మెరుగైన విద్యుత్ పంపిణీ, కొత్త సబ్‌స్టేçÙన్ల నిర్మాణం, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించనున్నారు. వీటితో పాటు నష్టాల తగ్గింపు, వ్యయాల కుదింపు, మరిన్ని ఆదాయ మార్గాల అన్వేషణపై దృష్టిసారించనున్నారు. -
జలం.. జగడం
శ్రీశైలం నుంచి నీళ్లిస్తేనే సాగర్ కుడి కాలువకు నీళ్లిస్తాం కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ 4 టీఎంసీల నీటి విడుదలపై మెలిక మరో వివాదానికి తెరతీసినట్లే..! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువకు నాలుగు టీఎంసీలు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మెలిక పెట్టింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేస్తేనే సాగర్ కుడి కాలువకు నీళ్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కు లేఖ రాసింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 802.7 (డెడ్ స్టోరేజీ) అడుగుల మట్టంలో 30.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. డెడ్ స్టోరేజీ కారణంగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు లేవు. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాల వినియోగంపై ఈ నెల 20న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా సాగర్ కుడి కాలువకు తాగునీటి అవసరాలకు 8, కృష్ణా పుష్కరాలకు 4, సాగు, తాగునీటి అవసరాలకు ఎడమ కాలువకు 4.. మొత్తం 16 టీఎంసీల నీటిని తక్షణమే విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అదే సమయంలో హైదరాబాద్ తాగునీటి అవసరాలు, ఇతరత్రా అవసరాల నిమిత్తం మొత్తం 7 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఆ మేరకు నీటì విడుదల సాధ్యం కాదని బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ అన్నారు. ఇరు రాష్ట్రాల నీటిపారుదల కార్యదర్శులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని.. అందువల్ల సాగర్ కుడి కాలువకు తక్షణమే 4 టీఎంసీలు విడుదల చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఈనెల 22న కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఆ మేరకు నీటిని విడుదల చేయాలని కోరుతూ ఈనెల 25న కృష్ణా బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి జవాబుగానే టీ సర్కార్ మంగళవారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. శ్రీశైలం ప్రస్తుత నీటిమట్టం 802.7 అడుగులే.. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. గరిష్టంగా 215.807 టీఎంసీలను నిల్వ చేయొచ్చు. కనీసం 854 (మినిమం డ్రా డౌన్ లెవల్) అడుగుల మట్టం ఉంటేనే నీటిని విడుదల చేయాలి. అంతకన్నా తక్కువ ఉంటే చేయకూడదు. కానీ 1996లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎండీడీఎల్‌ను 834 అడుగులకు (జీవో 69) తగ్గించింది. దీనిపై అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో 2004లో ప్రభుత్వం ఎండీడీఎల్‌ను 854 అడుగులకు పునరుద్ధరించింది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో గతేడాది 790 అడుగుల వరకు నీటిని వాడుకునేలా ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. కానీ 786 అడుగుల వరకు నీటిని వినియోగించుకున్నాయి. దీని వల్ల రాయలసీమ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 874 అడుగుల నీటిమట్టం ఉంటేనే దిగువకు నీటిని విడుదల చేయాలని సీమ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు నీళ్లందించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో ప్రస్తుతం 802.7 అడుగుల నీటిమట్టమే ఉంది. అయినా నీటి విడుదలకు ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తే, గతేడాది తరహాలోనే తెలంగాణకు విద్యుదుత్పత్తి చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లవుతుందని నిపుణులు అంటున్నారు. -
టీఎస్ వర్సెస్ ఏపీ
►ఆర్టీసీ బస్టాండ్లలో ప్లాట్ ఫాంల గొడవ ► ఆంధ్రా బస్సులను ప్లాట్‌ఫాంపైకి రాకుండా అడ్డగింత ► విజయవాడలో తమను రానివ్వడం లేదని ఆరోపణ ► కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడలో అడ్డుకునేందుకు ప్రత్యేక సిబ్బంది కోదాడటౌన్ : ఆర్టీసీలో తెలంగాణ- ఆంధ్ర వివాదం ముదిరి పాకాన పడింది. బస్టాండ్లలో ప్లాట్ ఫాంలపైకి రాకుండా అక్కడి బస్సులను ఇక్కడి వారు.. ఇక్కడి బస్సులను అక్కడి వారు అడ్డుకుంటున్నారు. జాతీయ రహదారిపై ఉన్న కోదాడ, సూర్యాపేట, నార్కట్‌పల్లి బస్టాండ్లతో పాటు ఆంధ్ర బస్సులు ఎక్కువగా వచ్చే మిర్యాలగూడెం, మల్లేపల్లి బస్టాండ్లలో ఆంధ్ర బస్సులకు ఒక్క ప్లాట్ ఫాం మాత్రమే కేటాయించారు. వారు అక్కడ తప్పా మిగతా ఫ్లాట్‌ఫాంలపై బస్సులను నిలపకుండా ప్రతి బస్టాండ్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమించి అడ్డుకుంటున్నారు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బందికి టీఎస్ ఆర్టీసీ సిబ్బందికి బస్టాండ్లలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. వివాదం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ బస్టాండ్ నుంచి కోదాడతో పాటు నల్లగొండ, మిర్యాలగూడకు నిత్యం బస్సుల రాక పోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నుంచి తెలంగాణ బస్సులు హైదరాబాద్‌కు కూడా సర్వీస్‌లు కొనసాగి స్తున్నారు. అయితే తెలంగాణ బస్సుల్లో చార్జీలు ఆంధ్ర బస్సుల కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తెలంగాణ బస్సులను ఎక్కుతున్నారని తమకు తీవ్ర నష్టం వస్తుందని ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు అంటున్నారు. ఈ క్రమంలో విజయవాడ బస్టాండ్‌లో 80 ప్లాట్‌ఫాంలు ఉండగా తెలంగాణ బస్సులన్నింటికి కలిపి ఒక్క ప్లాట్ పాం మాత్రమే ఇచ్చారు. బస్సులు బయట నిలపడానికి అవకాశం లేక, ప్లాట్‌ఫాం మీదకు వెళ్లనీయకపోవడంతో తెలంగాణ బస్సులు కొద్ది రోజులుగా అక్కడి నుంచి ఖాళీగా రావాల్సి వస్తుంది. నల్లగొండ నుంచి కాకినాడకు వెళ్లే బస్సుకు, పరకాల నుంచి గుంటూరు వెళ్లే బస్సులకు కూడా అక్కడ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మేమేం తక్కువ... కోదాడ డిపో నుంచి విజయవాడకు నిత్యం నడిచే బస్సుల సిబ్బంది దీనిపై తీవ్రంగా స్పందించారు. కోదాడ బస్టాండ్‌లో మొత్తం 10 ప్లాట్ ఫాంలు ఉండగా బస్టాండ్ చివరి ప్లాట్ ఫాం ఒక్క దానిని మాత్రమే వారికి కేటాయించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులన్నీ ఆ ఒక్క ప్లాట్ ఫాం మీద మాత్రమే ఆగాలి. దీంతో పాటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు వెళ్లే ఆర్టీసీ ఆర్డినరీ బస్సులు, విజయవాడ-కోదాడ షటిల్ బస్సులన్నింటికి ఇది ఒక్కటే కేటాయించారు. ఈ ప్లాట్‌ఫాం ఖాళీ లేకపోతే దూరంగా చెట్ల కింద ప్రయాణికులను దింపి అక్కడి నుంచి అటే వెళ్లాల్సి వస్తుంది. ఇతర ప్లాట్ ఫాంలు ఖాళీగా ఉన్నా వీరి బస్సులను మాత్రం అక్కడ నిలపనీయకుండా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఈ విధంగా ఆంధ్ర బస్సుల తాకిడి ఎక్కువగా ఉండే సూర్యాపేట, మిర్యాలగూడ, మల్లేపల్లి బస్టాండ్లలో ఆంధ్ర బస్సులకు ప్లాట్‌ఫాంల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. దీంతో ఇరు రాష్ట్రాల సిబ్బంది నిత్యం ప్లాట్‌ఫాంల విషయంలో గొడవ పడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రా బస్సులకు ఒక ప్లాట్‌ఫాం కేటాయించాం కోదాడ బస్టాండ్‌లో ప్లాట్‌ఫాంల కొరత ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కొన్ని బస్సులు వచ్చి ప్లాట్‌ఫాంలపై ఎక్కువ సమయం నిలపడం వల్ల కోదాడ డిపో బస్సులకు ప్లాట్‌ఫాం దొరకడం లే దు. వారి బస్సులు ఖాళీ ఉన్నప్పుడే బస్టాండ్‌కు వస్తున్నారు. నిండుగా ఉంటే బైపాస్‌లో వెళ్తున్నారు. ఈ సమస్యల వల్ల వారికి ఒక్క ప్లాట్ పాం కేటాయించాం. వారు అక్కడే నిలపాలి. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సులను నడుపుతాం. - శ్రీనివాసరావు,కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ -
మైనారిటీలకు 60 కొత్త స్కూళ్లు
-
‘టెట్’ గైడ్‌లైన్స్ ఖరారు
-
‘ఆధార్’.. 99 శాతం పూర్తి..!
అంగన్వాడీ పిల్లల కోసం స్పెషల్ డ్రైవ్ మీ సేవ కేంద్రాల్లో ఆధార్ నమోదు ‘సాక్షి’తో యూఐడీఏఐ ప్రాంతీయ ప్రధాన ఉపసంచాలకులు ఎంవీఎస్ రామిరెడ్డి సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ‘ఆధార్’ నమోదు ప్రక్రియ 99 శాతం పూర్తి చేసినట్లు భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రాంతీయ ప్రధాన సంచాలకులు ఎంవీఎస్ రామిరెడ్డి తెలిపారు. గురువారం ‘సాక్షి‘తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో తాజా జనాభా లెక్కల ప్రకారం 3.72 కోట్ల మందికి గాను 3.70 కోట్ల మందికి, ఆంధ్రప్రదేశ్‌లో 5.22 కోట్ల జనాభాకు గాను 4.90 కోట్ల మందికి ఆధార్ నంబర్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలతోపాటు 0 - 5 సంవత్సరాలలోపు చిన్నారుల ఆధార్ నమోదు కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల చిన్నారులకు గాను 22 లక్షల చిన్నారుల వరకు, ఆంధ్రప్రదేశ్‌లో 35 లక్షల చిన్నారులకు గాను 11 లక్షల వరకు ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఆఖరు వరకు నిర్వహించే స్పెషల్ డ్రైవ్ కోసం 400 చొప్పున కిట్స్‌ను గ్రామాలకు పంపించినట్లు వివరించారు. శాశ్వత కేంద్రాల ఏర్పాటుతో పాటు మీ-సేవా కేంద్రాలకు కూడా ఆధార్ నమోదు కోసం అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. నవంబర్ 30 వరకు ఆధార్ నమోదు చేసుకున్నవారికి ఆధార్ నంబర్‌తో సహా కార్డులు జారీచేశామని, డిసెంబర్ 1 నుంచి నమోదు చేసుకున్న వారికి ఈ నెల 14 నుంచి జారీ చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులను పోర్టల్ ద్వారా నేరుగా జనరేట్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పేరులో తప్పులు, చిరునామా మారిన ఆన్లైన్లోనే ఆప్ డెట్ చేసుకునే అవకాశం ఉందన్నారు. చివరకు ఆధార్‌కార్డులు పోయినా యూఐడీ, ఈఐడీ ద్వారా ఈ-ఆధార్‌ను జనరేట్ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. బోగస్ ఏరివేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేయడంతో బోగస్ లబ్ధిదారులకు అడ్డుకట్ట పడుతుందని ఎంవీఎస్ రాంరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్ధలో రేషన్ కార్డులకు అధార్ లింక్ చేయడంతో 11.75 లక్షల కార్డులు, 74.91 లక్షల యూనిట్లు బోగస్‌గా గుర్తించి ఏరివేసినట్లు చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో 3.7 లక్షల మంది బోగస్‌గా బయటపడ్డారని గుర్తు చేశారు. -
సికిందరాబాద్‌లో ఏపి-టీఎస్ స్నూకర్ పోటీలు
-
'కోర్టు ఇచ్చిన నోటీసులను తీసుకున్నాం'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు అందినట్లు తెలంగాణ హెంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది తెలిపారు. తాము ఎప్పుడూ చట్టాన్ని గౌరవిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం తమ వద్ద ఉన్న వివరాలను భద్రపరుస్తామన్నారు.ఎప్పుడు కోరితే అప్పడు.. ఆ వివరాలను కోర్టు ముందు ఉంచుతామని రాజీవ్ త్రివేది స్పష్టం చేశారు. ఆ వివరాలు ఏమిటి అనేది బహిర్గతమైనప్పుడే తెలుస్తుందని ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ్ చీఫ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఇచ్చిన నోటీసులు తెలంగాణ హెం సెక్రటరీ రాజీవ్ త్రివేదికి అందించినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఆ నోటీసులను త్రివేది తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ సచివాలయంలో సిట్ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఆ అధికారులు గో బ్యాక్ అంటూ సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. రాజీవ్ త్రివేది కార్యాలయానికి చేరుకున్న క్రమంలో తెలంగాణ ఉద్యోగులు తమ నిరసనను తెలిపారు. చాలాసేపు త్రివేది వేరే సమావేశంలో ఉండటంతో ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ అధికారులు చాలాసేపు బయట నిరీక్షించారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల నుంచి నిరసన ఎదురైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ ఆడుతూ ఏపీ పోలీసులతో నోటీసులు పంపిస్తున్నారని మండిపడ్డారు. -
టీఎస్‌కు మిగులు.. ఏపీకి దిగులు
-
టీఎస్‌కు మిగులు.. ఏపీకి దిగులు
- బస్‌భవన్‌లో మళ్లీ ‘విభజన’ కిరికిరి - ఏపీఎస్ఆర్టీసీలో దిగువస్థాయి సిబ్బంది కొరత - అదనంగా ఉన్న తెలంగాణవారిని తీసుకోవడానికి నిరాకరణ - ఆంధ్రా నుంచి ఔట్సోర్సింగ్ సిబ్బందిని తెచ్చుకోవాలని నిర్ణయం - ఫర్నిచర్ పంపకంపై టీఎస్ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రధాన పరిపాలన కేంద్రం బస్‌భవన్‌లో మళ్లీ విభజన చిచ్చు రగులుకుంది. ఇటీవలే పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీల్లో ‘ఎక్కడి వారక్కడే’ పద్ధతిలో అధికారులు, ఉద్యోగుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించినప్పటికీ... ఆ తర్వాత లొల్లి మొదలైంది. బస్‌భవన్‌లో ప్రస్తుతం 875 మంది వరకు సిబ్బంది పని చేస్తున్నారు. జనాభా సంఖ్య పద్ధతిలో 58:42 నిష్పత్తిలో వారి పంపకం పూర్తి చేశారు. కానీ ఆంధ్రా ప్రాంతానికి చెందిన సిబ్బంది తక్కువ ఉండడంతో దాదాపు 160 మంది వరకు ఏపీకి సిబ్బంది కొరత ఏర్పడింది. అదే సమయంలో తెలంగాణకు చెందిన సిబ్బంది ఎక్కువ ఉండడంతో టీఎస్ ఆర్టీసీకి అదనపు సిబ్బంది వచ్చారు. దీంతో అదనంగా ఉన్నవారిని డిప్యుటేషన్ పద్ధతిలో ఏపీఎస్ ఆర్టీసీకి కేటాయించాల్సి ఉంది. కానీ, తాజాగా వారిని తీసుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిరాకరిస్తున్నట్టు సమాచారం. వారి బదులు ఆంధ్రాప్రాంతానికి చెందిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తెచ్చి నియమించుకునేందుకు కసరత్తు మొదలైనట్టు తెలిసింది. అవసరమైతే వారికి కాస్త అధికంగా వేతనాలు చెల్లించేందుకు కూడా సిద్ధపడ్డట్టు సమాచారం. ఏపీఎస్ ఆర్టీసీకి బస్‌భవన్‌లోని ‘ఎ’ బ్లాకు, టీఎస్ ఆర్టీసీకి ‘బి’ బ్లాకును కేటాయించడంతో కార్యాలయాల సర్దుబాటు కొనసాగుతోంది. అయితే ఈ కార్యాలయాల్లో ఫర్నిచర్ పంపకంపై ఇప్పుడు వివాదం రగులుకుంటోంది. ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో ఈ పంపకాలు జరిగినప్పటికీ... తెలంగాణకు పనిచేయని కంప్యూటర్లు, పాత ఫర్నిచర్, పాతకార్లు వచ్చాయని, ఏపీఎస్ ఆర్టీసీ పరిధిలోకి లేటెస్ట్ కంప్యూటర్లు, కొత్త ఫర్నిచర్, కొత్త కార్లు చేరాయంటూ తెలంగాణ అధికారులు, సిబ్బంది ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు ఉన్నతాధికారులు కావాలనే తెలంగాణకు పాత సామగ్రి వచ్చేలా చక్రం తిప్పారనేది వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల సిబ్బంది మధ్య వాదోపవాదనలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఇప్పుడు మరో సమస్యకు దారి తీసింది. ఉద్యోగుల విభజన ప్రశాంతంగా ముగిసినా... తదనంతర పరిణామాలతో మళ్లీ బస్‌భవన్‌లో కాస్త వేడి రగిలినట్టు కనిపిస్తోంది. -
బీజేపీకి షాక్ ఇచ్చిన తెలుగుప్రజలు
-
రెండుగా వీడిన రాష్ట్ర ఒలింపిక్ ఉద్యమం
-
విద్యుత్ ‘చార్జ్’
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి కరెంట్ చార్జీల పెంపు సగటున 4.4 శాతం మోతకు ఈఆర్సీ ఆమోదం ప్రజలపై రూ. 816 కోట్ల భారం.. పేదలకు ఊరట 200 యూనిట్ల వరకు పాత చార్జీలు.. ఆపై బాదుడే పరిశ్రమలకు 5 శాతం పెంపు వ్యవసాయ వినియోగ లెక్కలకు ఈఆర్సీ కత్తెర సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల మోత మోగింది. ప్రస్తుత విద్యుత్ చార్జీల మీద సగటున 4.42 శాతం పెంపునకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈఆర్సీ) శుక్రవారం ఆమోదం తెలిపింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ పెంపుతో ప్రజలపై రూ.816 కోట్ల భారం పడనుంది. ఫిబ్రవరి 7న విద్యుత్ పంపిణీ సంస్థలు ఈఆర్సీకి సమర్పించిన చార్జీల ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను పరిశీలించిన ఈఆర్సీ... ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఈ కొత్త చార్జీలను ప్రకటించింది. అయితే డిస్కంలు చేసిన పలు ప్రతిపాదనలను ఈఆర్సీ అంగీకరించలేదు. గృహ వినియోగదారులకు సంబంధించి 100 యూనిట్ల లోపు వరకు చార్జీల పెంపును డిస్కంలే మినహాయించాయి. ఆపైన పెంపును కోరాయి. కానీ ఈఆర్సీ మాత్రం నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించే వారికి కూడా భారం పడకుండా మినహాయింపునిచ్చింది. దీంతో 200 యూనిట్లకు మించితే చార్జీ మోత మోగడం ఖాయమైంది. ఇక వ్యవసాయ, కుటీర పరిశ్రమలకు చార్జీలు పెంచకుండా ఈఆర్సీ తీసుకున్న నిర్ణయం ఆ వర్గాలకు ఊరటనిచ్చింది. మిగతా వ్యాపార, వాణిజ్య కేటగిరీలన్నింటా చార్జీల పెంపు ఉంది. టెలిస్కోపిక్ విధానం కాబట్టి శ్లాబ్‌ల ప్రకారం విద్యుత్ చార్జీల లెక్కింపు ఉంటుంది. మొత్తంగా గృహాల కేటగిరీలో సగటున 1.3 శాతం చార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతిచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థలు రూ. 1,088.68 కోట్ల పెంపును ప్రతిపాదిస్తే... ఈఆర్సీ రూ. 272.68 కోట్ల మేరకు తగ్గించి.. రూ. 816 కోట్ల భారానికి పచ్చజెండా ఊపింది. వీధి దీపాలు, తాగునీటి సరఫరా, ప్రార్థన మందిరాలన్నింటికీ చార్జీలు పెంచింది. పరిశ్రమల కేటగిరీల్లో సగటున 5 శాతం చార్జీలు పెరిగాయి. రాష్ట్రంలో 200 వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు దాదాపు 80 లక్షలు ఉన్నాయి. వారికి ప్రస్తుత భారం నుంచి ఉపశమనం లభించినట్లే. అంతకు మించి విద్యుత్ వినియోగించే 8 లక్షల కుటుంబాలపై పెంపుతో భారం పడుతుంది. 80 లక్షల ఇళ్లకు ఉపశమనం.. రాష్ట్రంలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1.20 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉంటాయని ఈఆర్సీ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 88 లక్షల కనెక్షన్లు గృహ వినియోగదారులే. అంటే వారందరిపై చార్జీల భారం ఉండదని టీఎస్ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ ప్రకటించారు. చైర్మన్‌తో పాటు ఈఆర్సీ సభ్యులు హెచ్.శ్రీనివాసులు, ఎల్.మనోహర్‌రెడ్డి శుక్రవారం కొత్త విద్యుత్ చార్జీలను వెల్లడించారు. వ్యవసాయ, కుటీర పరిశ్రమలను పెంపు నుంచి మినహాయించడంతో 18 లక్షల మందిపై ప్రభావం ఉండదని వారు చెప్పారు. 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే గృహేతర చిరు వ్యాపారులు, దుకాణాలకు సంబంధించి 10.6 లక్షల కనెక్షన్లు ఉన్నాయని, వీటిలో 6 లక్షల కనెక్షన్లకు చార్జీల పెంపు భారమేమీ ఉండదని తెలిపారు. మొత్తంగా ప్రస్తుతమున్న చార్జీలతో పోలిస్తే 4.4 శాతం చార్జీలు పెరిగాయని.. గృహాల కేటగిరీలో కేవలం 1.3 శాతం పెరిగాయని ప్రకటించారు. 2015-16 సంవత్సరానికి సంబంధించి ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్), దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సమర్పించిన ఆదాయ వ్యయ నివేదికలు, కొత్త చార్జీల ప్రతిపాదనల ప్రకారం.. వివిధ కేటగిరీల్లో చార్జీల పెంపు 4 నుంచి 5.75 శాతం వరకు ఉంది. సర్కారు సబ్సిడీ రూ. 4,227 కోట్లు.. రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 26,473.76 కోట్లు అవసరమని ఏఆర్ఆర్ నివేదికల్లో ప్రతిపాదించాయి. కానీ ఈఆర్సీ రూ. 23,416 కోట్లకు దీనిని కుదించింది. మొత్తం రూ. 6,476.23 కోట్ల లోటు ఉందని డిస్కంలు ఏఆర్ఆర్ నివేదికల్లో పేర్కొన్నాయి. ప్రభుత్వం నుంచి రూ. 5,387.55 కోట్ల సబ్సిడీ ఆశిస్తూ... రూ. 1,088.68 కోట్లను చార్జీల పెంపు ద్వారా పూడ్చుకోవడానికి అనుమతించాలని ఈఆర్సీని కోరాయి. అయితే ప్రభుత్వం రూ. 4,227 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. కోళ్ల పరిశ్రమకు అదనంగా ఇచ్చిన రూ. 30 కోట్ల సబ్సిడీని నేరుగా చార్జీలలోనే సర్దుబాటు చేసింది. వీటికి యూనిట్‌కు రూ. 5.63 చొప్పున ఉన్న చార్జీని ఏకంగా రూ. 2.03కు తగ్గించింది. అయితే కొత్త టారిఫ్‌లో పౌల్ట్రీ ఫారాలకు రూ. 3.60 చొప్పున చార్జీ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించిన విద్యుత్ వినియోగం డిస్కం లు అంచనా వేసినంతగా ఉండదని ఈఆర్సీ అభిప్రాయపడింది. సర్కారు ఇస్తున్న సబ్సిడీ సరిపోతుందని పేర్కొంటూ... కేటగిరీల వారీగా వ్యవసాయ విద్యుత్ వినియోగ లెక్కలను తగ్గించింది. డిస్కంలు 13,431 మిలియన్ యూనిట్లు అవసరమని అంచనా వేసుకోగా.. ఈఆర్సీ భారీగా కత్తెర పెట్టి 10,650 మిలియన్ యూనిట్లు సరిపోతుందని స్పష్టం చేసింది. ఇందులో ఎన్పీడీసీఎల్కు 4,300 మిలియన్ యూనిట్లు, ఎస్పీడీసీఎల్కు 6,350 యూనిట్లు సరిపోతుందని పేర్కొంది. రూ. 3,789 కోట్లలోటు చూపిన ఎన్పీడీసీఎల్కు రూ. 3,529 కోట్లు ప్రభుత్వ సబ్సిడీ అందుతుందని, రూ. 2,687 కోట్లలోటు చూపిన ఎస్పీడీసీఎల్కు రూ. 698 కోట్లు సబ్సిడీ అందుతుందని ఈఆర్సీ వెల్లడించింది. ప్రస్తుత, ప్రతిపాదిత చార్జీలతో భారం (రూ.లలో) యూనిట్లు ప్రస్తుత చార్జీ ప్రతిపాదిత చార్జీ 100 202.50 202.50 200 620 620 201 670.38 826.80 250 983 1,160 300 1,327 1,525 400 2,065 2,305 పెంపుతో ఆదాయ, వ్యయాలు (రూ. కోట్లలో) 2015-16లో రాబడి అంచనా 23,416 ప్రస్తుత చార్జీలతో ఆదాయం 18,373 చార్జీల పెంపుతో వచ్చే రాబడి 1,816 ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 4,227 -
తెలుగు రాష్ట్రాలపై స్వరూపానందేంద్ర వ్యాఖ్యలు !
-
నిర్లక్ష్య ఫలితం ఇది!
కనువిప్పు ‘‘మీ పెద్ద అబ్బాయి ఏం చదువుతున్నాడు?’’ అని ఎవరైనా అడిగితే మా నాన్న ముఖంలో కనిపించే విషాదాన్ని మరవ లేకుండా ఉన్నాను. పెద్దల మాట చద్ది మూట అంటారు. నేను మాత్రం పెద్దలు ఏదైనా చెప్పబోతే ‘చెప్పింది చాలు. సుత్తి ఆపు’ అన్నట్లుగా చూసేవాడిని. నీతులు చెప్పబోతే నిప్పులు మింగినట్లు ఇబ్బందిగా ముఖం పెట్టేవాడిని. ‘‘ఎప్పుడు చూసినా బజార్లో కనిపిస్తావు. బుద్ధిగా చదువుకోవచ్చు కదా’’ అని ఒకసారి మా పెద నాన్న అంటే- ‘‘నా విషయం మీకు అనవసరం. ఈ నీతులేవో మీ అబ్బాయికి చెప్పుకోండి’’ అన్నాను కోపంగా. ఇక అప్పటి నుంచి పెదనాన్న నన్ను చూస్తేనే ఒకలా ముఖం పెట్టేవారు. ‘‘గొడవల్లో తలదూరుస్తున్నావట. చదువుకోవాలని లేదా?’’ అని మా బావ ఒకసారి అక్షింతలు వేయబోతే- ‘‘నాకు చెప్పేంత సీన్ నీకు లేదు. నీ పనేదో నువ్వు చూసుకో’’ అని దురుసుగా సమాధానం ఇచ్చే సరికి ఆయన తీవ్రంగా హర్ట్ అయ్యారు. ‘‘నువ్వు పరాయి వాడివైతే నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వినాల్సిన అవసరం లేదు. నువ్వు దగ్గరి బంధువు కదా అని నీ మంచికే చెప్పాను. ఇక ముందు నేను నీతో మాట్లాడను. దయచేసి నువ్వు కూడా నాతో ఎప్పుడూ మాట్లాడవద్దు’’ అన్నాడు బావ బాధగా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొడవలు. దగ్గరి వాళ్లు ఎందరో దూరం అయ్యారు. అయినా సరే నాలో పశ్చాత్తాపం లేదు. మార్పు లేదు. అందరూ అనుకున్నట్లుగానే ఇంటర్మీడియెట్ తప్పాను. ఎన్నిసార్లు సప్లిమెంటరీ పరీక్షలు రాసినా పాస్ కాలేక పోయాను. ఖాళీగా ఉంటే మరింత చెడిపోతాడనే కారణంతో నాన్న నాతో చిన్న కిరాణా కొట్టు ఒకటి పెట్టించాడు. ఈ కొట్టు వల్ల లాభాలు రావు. నష్టాలు రావు. ఏదో నడవాలి కాబట్టి నడుస్తుంది. ‘‘మీ పెద్ద అబ్బాయి ఏం చదువుతున్నాడు?’’ అని ఎవరైనా అడిగితే మా నాన్న ముఖంలో కనిపించే విషాదాన్ని మరవ లేకుండా ఉన్నాను. అందుకే గట్టిగా నిర్ణయించుకున్నాను. అది వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు. నాన్న నా గురించి గర్వంగా చెప్పుకునేలా చేయాలనుకున్నాను. ఇప్పుడు నా కళ్లు పూర్తిగా తెరుచుకున్నాయి. -టియస్, రాజమండ్రి -
నేటి నుంచి టీఎస్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
జిల్లాల వారీ కోడ్లను అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం అధికారులు ప్రతిపాదించిన నంబర్లను ఓకే చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన పక్షం రోజుల తర్వాత ఈ సిరీస్‌ను ప్రకటించడం విశేషం. వాస్తవానికి ఈ నెల 2 (అపాయింటెడ్ డే) తేదీ నుంచే కొత్త సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రారంభించాల్సి ఉన్నప్పటికి... టీజీ సిరీస్ కేటాయిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాల్సి రావటం, కొత్త సిరీస్‌తో మరో నోటిఫికేషన్ జారీ జాప్యం కావడం, టీఎస్ సిరీస్ జారీ అయినా జిల్లాల వారిగా కోడ్నంబర్ల కేటాయింపు వెంటనే చేయకపోవడంతో ఈ జాప్యం అనివార్యమైంది. దీంతో గత పక్షం రోజులుగా తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఎట్టకేలకు జిల్లాల వారి కోడ్ నెంబర్లు కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి పొద్దుపోయాక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో బుధవారం నుంచి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఏపీ సిరీస్‌లో భాగంగా తెలంగాణ జిల్లాలకు ఉన్న కోడ్నంబర్లను టీఎస్ సిరీస్‌లో కూడా కొనసాగించాలని ఇదివరకే రవాణాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఏపీ బదులు టీఎస్ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోతుందని జిల్లా కోడ్లు మారిస్తే సాఫ్ట్వేర్ పరంగా తమకు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు పేర్కొన్నారు. కాని తెలంగాణ జిల్లాలకు కొత్త కోడ్ ఉండాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించడంతో కొత్త కోడ్ నంబర్లు కేటాయించక తప్పలేదు. పాత కోడ్ నంబర్లలో వీలైనన్ని అలాగే ఉండేలా అధికారులు ఈ కొత్త కోడ్ నంబర్లను కేటాయించడం విశేషం. పాత సిరీస్‌లో హైదరాబాద్ నగరంలో ఉన్న 9,10,11,12,13 కోడ్నంబర్లే ఇప్పుడు ఉండడం విశేషం. కొత్త సిరీస్‌లో భాగంగా తొలి నెంబర్‌గా టీఎస్ 09 ఈఏ 0001 బుధవారం కేటాయించనున్నారు. పోలీసు వాహనాలకు గతంలోలానే పీ కోడ్‌ను, ఆర్టీసీకి జెడ్‌ను, రవాణాశాఖ వాహనాలకు టీ, యూ,వి, డబ్ల్యూ, ఎక్స్, వై వరకు కేటాయించారు. -
ఇక టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్
హైదరాబాద్: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు ఇకపై తెలంగాణ స్టేట్ (TS) పేరుతో ఆరంభమైనట్లు రవాణాశాఖ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం వాహనాల రిజిస్ట్రేషన్ల అంశానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని భావించిన ప్రభుత్వం.. తర్వాత టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. తాజాగా ప్రభుత్వం టీఎస్ పేరుతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆరంభమైంది. అంతకుముందు ఏపీ పేరుపై ఉన్న పాత వాహనాల నంబర్‌ప్లేట్ మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం 4 నెలల గడువును ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని వివిధ జిల్లాలకు వాహనాల రిజిస్ట్రేషన్ల కోడ్ల వివరాలు.. ఆదిలాబాద్ TS - 01, కరీంనగర్ - 02 వరంగల్ - 03, ఖమ్మం - 04, నల్లగొండ - 05 మహబూబ్‌నగర్ - 06, రంగారెడ్డి - 07, 08 హైదరాబాద్ - 09, 10, 11, 12, 13, 14 మెదక్ - 15, నిజామాబాద్ -16 ఆర్టీసీ వెహికల్స్‌కు TS Z, పోలీసు వాహనాలకు TS P 09 రవాణా వాహనాలకు... T,U,VW,X,Y సిరీస్‌లు వాడుతూ రిజిస్ట్రేషన్ -
ఒక్క ఏపీ అనేది మార్చితే చాలు!
-
ఇక టీఎస్ 01
ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. తెలంగాణ స్టేట్(టీఎస్) జారీ చేస్తూ కేంద్రం నుంచి బుధవారం గెజిట్ నోటిఫికేషన్ వెలువడడంతో అటు రవాణా శాఖ ఇటు వాహనదారుల్లో అయోమయం తొలగిపోయింది. జిల్లాల వారీగా కోడ్‌ను ఒకట్రెండు రోజుల్లో కేటాయిస్తామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కనడంతో ఉత్కంఠ నెలకొంది. అల్ఫాబెటికల్ ప్రకారం ఆదిలాబాద్ జిల్లాకు ఏ అక్షరం మొదట ఉండడంతో ఇంతకుముందున్న 01 కోడ్ కొనసాగే అవకాశాలే అధికంగా ఉన్నాయని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. టీఎస్పైనే రిజిస్ట్రేషన్లు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఇక నుంచి టీఎస్పైనే జరగనుంది. కోడ్‌పై సందిగ్ధత నెలకొంది. రిజిస్ట్రేషన్లు చేస్తున్నా నంబరు కేటాయించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్‌కు అక్షర క్రమంలో ఏపీ 01 సిరీస్ ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో 24 జిల్లా ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కోడ్ నంబరు కేటాయింపులో తేడాలు ఉంటాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది. మంచిర్యాల జిల్లాను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతంలో మరో కోడ్ కేటాయిస్తారా లేని పక్షంలో జిల్లా ఏర్పడిన అనంతరం మార్పులు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఇదివరకు ఏపీ 01పై ఆదిలాబాద్, ఏపీ 01ఏ పై మంచిర్యాల, ఏపీ 01బీ పై నిర్మల్ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసేవారు. పాత వాహనాలు 1.30 లక్షలకుపైనే.. జిల్లాలో అన్ని రకాల పాత వాహనాలు కలిపి లక్షా 30 వే ల 016 ఉన్నాయి. వీటిలో ద్విచక్ర వాహనాలు 95,437, ఆటోరిక్షాలు 7,780, గూడ్స్ క్యారేజ్‌లు 5,203, కార్లు 4,864, మోపెడ్లు 3,714, ట్రాక్టర్లు(ప్రైవేట్) 2,554, ట్రా క్టర్లు కమర్షియల్ 2,134, జీపులు 575, మోటర్ క్యాబ్‌లు 1189 ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం ఏపీ 01 సీరి స్ కోడ్‌పై కొనసాగుతుండగా, నాలుగు నెలల్లోగా టీఎస్ గా మార్చుకోవాలని రవాణా శాఖ సూచిస్తోంది. వాహనాల నంబరు కూడా మారుతుందనే ప్రచారం జరగడం తో వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమైంది. ప్రధానంగా ఫ్యాన్సీ నంబర్లు తీసుకున్న వారు ఆందోళనకు గురయ్యారు. నంబర్లు మారవని ఏపీ స్థానంలో టీఎస్‌గా, కే టాయించిన కోడ్‌ను మాత్రమే మార్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రవాణా శాఖ అధికారుల స మావేశంలో స్పష్టం చేస్తూ గందరగోళానికి తెరదించారు. ఇతర జిల్లాలకు కోడ్ మారే అవకాశాలు ఉండగా, ఆది లాబాద్ జిల్లాకు మాత్రం 01 ఉండే అవకాశాలు అధికం గా ఉన్నాయి. దీంతో కేవలం ఏపీ స్థానంలో టీఎస్‌గా మార్చుకుంటే సరిపోతుంది. కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా త్వరలో ప్రకటిస్తామని రవాణా శా ఖ పేర్కొన్న నేపథ్యంలో భారం ఎలా ఉంటుందోనని అందరిలో ఆందోళన కనిపిస్తోంది. జిల్లాలో ప్రతినెల రిజి స్ట్రేషన్లతో రూ.20లక్షలు ఆదాయం సమకూరుతోంది. జిల్లాల వారీగా కోడ్ నంబర్లు ఇలా ఉండే అవకాశముంది ఆదిలాబాద్ 1 కరీంనగర్ 2 వరంగల్ 3 ఖమ్మం 4 నల్గొండ 5 మహబూబ్‌నగర్ 6 రంగారెడ్డి 7 - 8 హైదరాబాద్ 9 - 14 మెదక్ 15 నిజామాబాద్ 16 -
నంబర్లు మారవు...
సిరీస్, జిల్లా కోడ్ మార్పు మాత్రం తప్పనిసరి! పాత వాహనాలకు ఏపీ స్థానంలో టీఎస్ రవాణా శాఖతో సీఎం కేసీఆర్ సమీక్ష, గందరగోళానికి తెర 73 లక్షల వాహనాల నంబర్లు మార్చడం అసాధ్యమన్న అధికారులు తొందరపాటు ప్రకటనలపై ముఖ్యమంత్రి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల విషయంలో రాష్ర్ట ప్రభుత్వం నాలుక్కరుచుకుంది. ప్రస్తుతం ఏపీ సిరీస్‌తో ఉన్న 73 లక్షల పాత వాహనాలకూ కొత్తగా టీఎస్ సిరీస్‌తో కొత్త నంబర్లు పొందాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కొత్త రాష్ట్రానికి కేటాయించిన టీఎస్ సిరీస్ నంబర్లను లక్షల సంఖ్యలో ఉన్న పాత వాహనాలకు అమలు చేయడం అసాధ్యమని రవాణా శాఖ అధికారులు గురువారం తేల్చి చెప్పడంతో సర్కారు పెద్దలు పునరాలోచన చేశారు. పాత వాహనాలకు కొత్త జిల్లా కోడ్‌తో పాటు ఏపీ బదులు టీఎస్ అని మార్చాల్సి ఉంటుందని, నంబర్ మాత్రం అదే కొనసాగుతుందని నిర్ధారించారు. 4 నెలల్లో పాత వాహనాలన్నింటికీ నంబర్లు మార్చాల్సిందేనని రవాణా శాఖ మంత్రి బుధవారం చేసిన ప్రకటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. సిరీస్‌తో పాటు నంబర్లూ మార్చుకోవడమేంటని, అందుకు తాము మళ్లీ జేబులు గుల్ల చేసుకోవడమేంటని వాహనదారులు నొసలు చిట్లించడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. అసలు దీన్ని అమలు చేయడమే కష్టమని అధికారులూ చెప్పడంతో ఈ విషయంలో నెలకొన్న గందరగోళానికి సీఎం తెరదించే ప్రయత్నం చేశారు. గురువారం సాయంత్రం ఆయన రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆ శాఖ కమిషనర్ జగదీశ్వర్, సంయుక్త కమిషనర్ వెంకటేశ్వర్లుతో సమీక్ష జరిపారు. పాత వాహనాల నెంబర్ల నూ మార్చుకోవాలని ప్రకటించడమేంటని మంత్రి మహేందర్ రెడ్డిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే అధికారులు అందజేసిన సమాచారం మేరకే ప్రకటించాల్సి వచ్చిందని రవాణా మంత్రి చెప్పినట్టు సమాచారం. దీంతో అధికారులను కూడా కేసీఆర్ మందలించినట్టు తెలిసింది. కీలక విషయాలను ప్రకటించే సమయంలో ముం దస్తు కసరత్తు అవసరమని, లేదంటే ఇలాంటి గందరగోళ పరిస్థితులే నెలకొంటాయని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇకపై కొత్త వాహనాలకే టీఎస్ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేయాలని, పాత వాటికి కేవలం టీఎస్‌తో పాటు జిల్లా కోడ్‌ను మార్చితే సరిపోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. భారీ రుసుము చెల్లించి ఫ్యాన్సీ నంబర్లు పొందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, భారీ సంఖ్యలో ఉన్న పాత వాహనాల నంబర్ల మార్పు అంత సులభం కాదని, భారీ కసరత్తుతో కూడుకున్న వ్యవహారమని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. మరి అలాం టప్పుడు వాటిని మార్చుకోవాలని ఎందుకు ప్రకటించాల్సి వచ్చిం దని కేసీఆర్ ప్రశ్నించడంతో అధికారులు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. కాగా, పాత జిల్లా కోడ్లనే కొనసాగించాలని అధికారులు సూచించినప్పటికీ సీఎం అంగీకరించనట్లు తెలిసిం ది. కొత్త రాష్ట్రంలో కొత్త కోడ్లు కేటాయిస్తేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని పై కసరత్తు ప్రారంభించామని ఈ భేటీ అనంతరం అధికారులు వెల్లడించారు. అయితే జిల్లాల పేర్ల ప్ర కారం అక్షర క్రమం ఆధారంగా కోడ్‌ను కేటాయిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నందున ఏదో ఒక కోడ్ ఇవ్వడమే మేలని భావిస్తున్నట్లు తెలిపారు. కొత్త కోడ్లను 2రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తామన్నారు. -
ఏపీ బదులు ఇక టీఎస్
* తెలంగాణ వాహనాలపై కేంద్ర ప్రభుత్వ గెజిట్ * 4 నెలల్లో పాత వాహనాల నంబర్లు మార్చుకోవాలి * రెండు మూడు రోజుల్లో కొత్త వాహనాలకు నంబర్లు తీసుకోవచ్చు * ప్రతి జిల్లాకో కోడ్ ఇస్తామన్న రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి * నంబర్లు కూడా మారతాయంటూ గందరగోళానికి తెరతీసిన మంత్రి * సిరీస్ సరే, నంబర్లు మారడమేమిటని తలపట్టుకుంటున్న వాహనదారులు * డబ్బుపెట్టి కొన్న ఫ్యాన్సీ నంబర్లను మారిస్తే ఎలాగంటూ ప్రశ్న సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాహనాలు ఇక నుంచి ‘టీఎస్’తో మొదలుకానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో పాత వాహనాల నంబర్లను నాలుగు నెలల్లో మార్చుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో ప్రతి జిల్లాకు కోడ్, ఆర్డర్ ఇస్తామన్నారు. ఈ రెండు మూడు రోజుల్లోనే కొత్త వాహనాలకు ‘టీఎస్’తో నంబరు తీసుకోవచ్చన్నారు. పాత వాహనాల నంబర్లను ముందుగా దరఖాస్తు చేసుకొని మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. నాలుగు నెలల సమయం సరిపోకపోతే మరికొంత సమయం ఇస్తామన్నారు. పాత వాహనాలకు ‘ఏపీ’ బదులుగా ‘టీఎస్’తోపాటు నంబరు కూడా మారుతుందని చెప్పారు. వాహనదారులు అందుకోసం కొంత ఫీజు చెల్లించాలన్నారు. తెలంగాణ వచ్చినందుకు ఇది ప్రజలకు కానుకగా వేస్తున్న భారమా? అని విలేకరులు ప్రశ్నించగా... భారం వేయకుండా చూస్తామన్నారు. ప్రస్తుత నంబరును యథావిధిగా ఉంచి, ‘ఏపీ’ స్థానే ‘టీఎస్’ను వాహనదారులే మార్చుకునే వెసులుబాటు చేయవచ్చు కదా? అని అడగ్గా అలా చేయడం సాధ్యం కాదన్నారు. ఫ్యాన్సీ నెంబర్ల విషయంలో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. వీటిపై ఇంకా కసరత్తు చేస్తున్నామన్నారు. ఆటోల ట్యాక్స్‌లను ఎత్తివేస్తున్నామన్నారు. తెలంగాణలో 73 లక్షల వాహనాలు తిరుగుతున్నాయనీ... అందులో 50 లక్షలు ద్విచక్ర వాహనాలేనన్నారు. విధి విధానాలు ఖరారయ్యాకే రిజిస్ట్రేషన్లు తెలంగాణ రాష్ట్రంలోని వాహనాల రిజిస్ట్రేషన్‌కు కేంద్రం టీఎస్ సిరీస్‌ను కేటాయించిన నేపథ్యంలో రాష్ట్రంలో మారో నాలుగైదు రోజుల్లో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాబోతోంది. దీంతో ఏ జిల్లాకు ఏ నంబర్ కేటాయించాలనే విషయంలో అధికారులు కసరత్తు ప్రారంభించారు. సాధారణంగా అక్షర క్రమం ఆధారంగా వీటి కేటాయింపు ఉంటుంది. అదే ప్రకారం ఆదిలాబాద్ జిల్లాకు 01 కోడ్ కేటాయింపుతో ఇది మొదలుకానుంది. అయితే ఈ కేటాయింపు ఎలా ఉండాలనే విషయంలో గురు, శుక్రవారాల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 10 జిల్లాలు మాత్రమే ఉండగా, వీటిని విభజించి ఆ సంఖ్యను 24కు పెంచాలనే ఆలోచన కూడా ఉంది. అక్షర క్రమం ప్రకారం కేటాయిస్తే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మళ్లీ గందరగోళం తలెత్తుతుంది. అలాంటప్పుడు అక్షరక్రమం కాకుండా సాధారణంగా నెంబర్లు కేటాయించాలా, లేదా ముందస్తుగా కొన్ని బఫర్ నెంబర్లు గుర్తించి బ్లాక్ చేసి పెట్టడమా అన్న విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కోడ్ నెంబర్ల వ్యవహారం తేలితేనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉన్నందున ఈ కసరత్తును వీలైనంత తొందరలో పూర్తి చేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. నంబర్ల మార్పంటూ గందరగోళం తెలంగాణ రాష్ర్టంలోని వాహనాలకు టీఎస్ సిరీస్ కేటాయించడాన్ని వాహనదారులు స్వాగతిస్తున్నా.. నంబర్లు కూడా మారుతాయంటూ మంత్రి గందరగోళానికి తెరలేపారంటూ వాహనదారులంటున్నారు. సిరీస్ మార్పు సరే నంబర్లు ఎందుకు మార్చాలని ప్రశ్నిస్తున్నారు. అలా మారితే, డబ్బులు పెట్టి కొనుక్కున్న ఫ్యాన్సీ నంబర్ల పరిస్థితి ఏమిటనీ వారు ప్రశ్నిస్తున్నారు. తాము ఎంతో ఖర్చు చేసి కొనుక్కున్న ఫ్యాన్సీ నంబర్లు తమకే దక్కుతాయా? లేక మళ్లీ కొనుక్కొవాల్సిన పరిస్థితి ఎదురవుతుందా? అన్న ఆందోళన వాహనదారుల్లో నెలకొంది. -
టీఎస్ తోనే వాహనాల రిజిస్టేషన్లు!
-
టీజీ కాదు.. టీఎస్ తోనే వాహనాల రిజిస్టేషన్లు!
హైదరాబాద్: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు ఇకపై తెలంగాణ స్టేట్ (TS) పేరుపై జరుగుతాయని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. టీజీ పేరుతో కాకుండా టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని మహేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, తెలంగాణలో ఏపీ పేరుపై ఉన్న పాత వాహనాల నంబర్‌ప్లేట్ మార్చడానికి 4 నెలల గడువు ఇస్తున్నట్టు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. మార్పు సమయంలో ప్రజలపై భారం పడకుండా చూస్తామని, తెలంగాణలో 70 లక్షలకు పైగా వాహనాలున్నాయని ఓ ప్రశ్నకు మహేందర్ రెడ్డి సమాధానమిచ్చారు. -
వాహన రిజిస్ట్రేషన్లకు బ్రేక్
కొత్త సిరీస్‌పై తొలగని ప్రతిష్టంభన మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు సాక్షి, సిటీబ్యూరో: కొత్త సిరీస్‌పై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో నగరంలో సోమవారం కూడా వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ వాహనాల నమోదు ప్రక్రియకు బ్రేక్ పడింది. తెలంగాణ రాష్ట్రానికి ‘టీజీ’ సిరీస్ ఉంటుందని మొదట భావించినా.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ‘టీజీ’కి బదులు ‘టీఎస్’ ఉండాలని సూచించడంతో రవాణా అధికారులు మరోసారి ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపారు. టీఎస్ సిరీస్‌ను కేటాయిస్తూ కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు వెలువడలేదు. దీంతో సోమవారం కొత్త వాహనాల నమోదుకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. రాష్ట్రానికి సంబంధించిన సిరీస్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కోడ్లపైనా స్పష్టత రావలసి ఉంది. ఒకవేళ కేంద్రం నుంచి కొత్త సిరీస్‌పై ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు వెలువడినా జిల్లా కోడ్లు, ప్రాంతీయ రవాణా కేంద్రాల నెంబర్ల రూపకల్పనకు కొంత సమయం పట్టొచ్చని రవాణా అధికారులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు రానిదే తాము అడుగు ముందుకు వేయలేమని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రోజు వెయ్యికిపైగా కొత్త వాహనాలు గ్రేటర్ పరిధిలోని పది ఆర్టీఏ కార్యాలయాల్లో రోజూ వెయ్యికి పైగా కొత్త వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వీటిలో 75 శాతం ద్విచక్ర వాహనాలే. కానీ రవాణాశాఖ సెంట్రల్ సర్వర్ నిలిపివేతతో గత నెల 31 నుంచే వాహనాల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. సోమవారం రెండు రాష్ట్రాల్లోనూ సెంట్రల్ సర్వర్ పునరుద్ధరణ జరిగింది. లర్నింగ్ లెసైన్స్‌లు, శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల బదిలీ వంటి కార్యకలాపాలకు అనుగుణంగా రెండు రాష్ట్రాలకు సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ జరిగినా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిరీస్‌పై స్పష్టత లేకపోవడం వల్ల నగరంలో వాహనాల నమోదు శాశ్వత నమోదు ఆగిపోయింది. మరోవైపు రాష్ర్ట అవతరణ ఉత్సవాల దృష్ట్యా పౌరసేవల కోసం వచ్చే వినియోగదారుల సంఖ్యా పలుచబడింది. -
తెలంగాణ వాహనాలకు టీఎస్ సిరీస్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పరిధిలోని వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికే కేంద్రం ‘టీజీ’ సిరీస్‌ను నోటిఫై చేసిన విషయం తెలిసిందే. కానీ టీఎస్ సిరీస్ కావాలని తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరటంతో కేంద్రం మళ్లీ దాన్ని మార్చే పనిలో పడింది. తెలుగు అక్షరాల్లో ‘స’ అక్షరాన్ని శుభకరంగా భావించే కేసీఆర్ వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్‌లో కూడా ‘స’ ధ్వనించేలా ‘ఎస్’ అనే ఆంగ్ల అక్షరం ఉండాలని భావిం చినట్టు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. టీఎస్ పొడి అక్షరాలు ‘తెలంగాణ స్టేట్’ అనే పదానికి ప్రతిబింబంగా ఉంటున్నందున దాన్నే ఖాయం చేయాలని విజ్ఞప్తి చేయటంతో కేంద్రం కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం టీజీ సిరీస్‌ను నోటిఫై చేస్తున్నట్టు ఢిల్లీ నుంచి స్థానిక రవాణా శాఖాధికారులకు సమాచారం రావటంతో వారు ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ ఇప్పుడు సిరీస్ మార్పుపై వార్తలు వస్తుండటంతో స్పష్టత కోసం అధికారులు ఢిల్లీలోని అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించారు. దీంతో టీజీ ఉంటుందా టీఎస్ ఉంటుందా అన్న విషయంలో అయోమయం నెలకొందని రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు సాక్షితో చెప్పారు. శనివారం అర్ధరాత్రి వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, లేదంటే సోమవారం వస్తుందని తెలిపారు. జిల్లాల వారీగా నంబర్ సిరీస్‌ను ప్రస్తుతానికి పాతదే కొనసాగించే వీలుందన్నారు.