నదిజలాల పంపకాలపై పలు రాష్ట్రాలు తగువులాడుకుంటున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలు మాత్రం కృష్ణా నదీ జలాల వివాదాన్ని సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునే ప్రయత్నం చేశాయి. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లోని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి చాంబర్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన అపెక్స్ భేటీలో.. అజెండాలోని ఐదు అంశాల్లో మూడింటిపై తెలంగాణ, ఏపీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. కాగా, కీలకమైన రెండు అంశాల్లో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.