Krishna Water Disputes
-
సీమ హక్కులు 'కృష్ణా'ర్పణం
రాయలసీమకు హక్కుగా కేటాయించిన కృష్ణా జలాలను వాడుకునే విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేతకానితనంతో చోద్యం చూస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ యథేచ్ఛగా అనుమతి లేకుండా నీటిని తరలించుకుపోతున్నా, ఇంకా అదనంగా దండుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నా... ఏమాత్రం అడ్డు చెప్పక పోవడం విస్తుగొలుపుతోంది. మాకు కేటాయించిన నీటిని మేము తీసుకెళ్లే ప్రయత్నం చేయడం ఎలా తప్పవుతుందని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఎదుట గట్టిగా నోరు విప్పి వాదించలేదు. ఎవరి మేలు కోసం.. ఎందుకీ ఈ బేలతనం? ‘సీమ’పై కోపమా? లేక వైఎస్ జగన్‌కు పేరొస్తుందని కుళ్లా..?సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీరు.. చెన్నై తాగు నీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం భవితవ్యం కూటమి సర్కారు తీరుతో ప్రశ్నార్థకంగా మారింది. పది నెలలుగా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మన రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని వాదించలేకపోయింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 798 అడుగులు ఉన్నప్పటి నుంచే పొరుగు రాష్ట్రం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని తరలిస్తున్నా, 800 అడుగుల నుంచే ప్రాజెక్టులకు నీటిని తీసుకుంటున్నా.. కొత్తగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తున్నా అడ్డుచెప్పలేక పోతోంది. 880 అడుగులకు నీళ్లొచ్చినప్పుడు మాత్రమే మనం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా గరిష్టంగా హక్కుగా దక్కిన 44 వేల క్యూసెక్కులు తరలించాలంటే ఎన్ని రోజులు ఆగాలని, ఆ మేరకు వరద ఎన్ని రోజులు ఉంటుందని.. ఇలాగైతే ఆ మేరకు నీటిని తరలించడం ఎలా సాధ్యమని గట్టిగా వాదించలేదు. కోటా మేరకు నీటిని వాడుకునేలా గత వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని నోరు విప్పి చెప్పలేదు. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులు కొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని కూడా వాదించలేదు. ఫలితంగా ఈ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం.. చేసిన పనులను తొలగించి, యథాస్థితికి తేవాలని గత నెల 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తుపై ఆ రోజు ఈఏసీ 25వ సమావేశంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ చర్చించింది. ఆ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం పైన పేర్కొన్న విధంగా సమర్థవంతంగా వాదనలు వినిపించక పోవడం వల్లే రాయలసీమ ఎత్తిపోతలకు శరాఘాతంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలను తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులను కొనసాగిస్తూ.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను హరిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2014–19 మధ్య నాటి చంద్రబాబు సర్కార్ రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయ, ఓటుకు నోటు కేసుతో వ్యక్తిగత ప్రయోజనాలు పొందేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన తరహాలోనే ఇప్పుడూ వ్యవహరిస్తోందంటూ రైతులు మండిపడుతున్నారు. తాగునీటి పనులకూ బ్రేక్చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగుగంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదన పంపారు. రాయలసీమ ఎత్తిపోతలలో తాగు నీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పనులను ఏమాత్రం పట్టించుకోలేదు. పది నెలలుగా తీవ్ర నిర్లక్ష్యం చేయడం ద్వారా రాయలసీమకు తీరని ద్రోహం చేసింది. ఇదే సమయంలో ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించలేదు. దీంతో రాయలసీమ ఎత్తిపోతల తొలి దశ పనులకు బ్రేక్ పడినట్లయింది. ‘బనకచర్ల’ ప్రాజెక్టుపైనా డ్రామాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బనకచర్ల ప్రాజెక్టుపైనా నాటకాలాడుతున్నారని స్పష్టమవుతోంది. పోలవరం నీళ్లు బనకచర్లకు తీసుకెళ్తామని, సముద్రంలోకి పోయే వృథా నీటిని సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దని ఓవైపు చెబుతూనే.. మరోవైపు తన శిష్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వారా అభ్యంతరాలు లేవనెత్తేలా కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలే ఇందుకు నిదర్శనం. కేవలం ప్రచారం కోసం మాత్రమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఉపయోగించుకుంటున్నారని ఇట్టే అర్థమవుతోంది. నిర్విఘ్నంగా పాలమూరు– రంగారెడ్డి పనులు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు తరలించేలా రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు–రంగారెడ్డి, రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్ల వ్యయంతో 2015 జూన్10న తెలంగాణ సర్కార్ చేపట్టింది. మన రాష్ట్ర హక్కులకు విఘాతం కలిగించే ఈ ప్రాజెక్టులపై అప్పటి చంద్రబాబు సర్కార్ అభ్యంతరం చెప్పలేదు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన జలాలు దక్కవని.. ఏపీకి చెందిన రైతులు 2021లో ఎన్జీటీ (చెన్నె బెంచ్)ని ఆశ్రయించారు. ఈ కేసులో రైతులతో నాటి వైఎస్సార్సీపీ సర్కార్ జత కలిసింది. ఆ రెండు ఎత్తిపోతలకు నీటి కేటాయింపులే లేవని.. వాటి వల్ల శ్రీశైలం, సాగర్‌పై ఆధారపడ్డ ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టా కూడా నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతుందని వాదించింది. దీంతో ఏకీభవించిన ఎన్జీటీ తక్షణమే పనులు నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశిస్తూ 2021 అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పనులు చేస్తుండటంతో 2022 డిసెంబర్ 22న తెలంగాణ సర్కార్‌కు రూ.920.85 కోట్ల జరిమానా సైతం విధించింది. అయినప్పటికీ వాటిని తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా పనులు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. హక్కులను కాపాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల⇒ ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు–నగరికి 38.. మొత్తంగా 101 టీఎంసీలు సరఫరా చేయాలి.⇒ రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం తమ భూభాగంలో ఉందని తెలంగాణ సర్కార్ దాన్ని తన అధీనంలోకి తీసుకున్నా.. ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం నాటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా కృష్ణా బోర్డు కేటాయింపులు చేయకున్నా, దిగువన నీటి అవసరాలు లేకున్నా తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తూ వస్తోంది. 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది.⇒ తెలంగాణ సర్కార్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా 2015లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్ అడ్డుకోలేదు. ఇలా తెలంగాణ సర్కార్ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాడుకోలేని దుస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగు నీటికి సైతం తల్లడిల్లాల్సిన దయనీయ పరిస్థితి.⇒ తడారిన గొంతులను తడిపేందుకు.. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం.⇒ ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్షతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో తెలంగాణ ప్రాంతంలోని రైతులతో టీడీపీ నేతలు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది. -
మా ప్రయోజనాలు కాపాడండి: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ పరీవాహకంలో సుమారు 70శాతం తెలంగాణలోనే ఉండగా.. 30 శాతం మాత్రమే ఏపీలో ఉందని వివరించారు. అందువల్ల కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన 70శాతం వాటా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి నదికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలు తేల్చిన తర్వాతే.. ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి ని కోరారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ... కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పక్షపాతంతో ఏపీకి 66శాతం, తెలంగాణకు 34శాతం నీటి కేటాయింపులు చేసిందని కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ కేటాయింపుల వల్ల ఎన్నో ఏళ్లుగా తెలంగాణ నష్టపోతోందని.. ఈ ఏడాది సైతం ఏపీ కేటాయించిన మొత్తానికి మించి నీరు తరలించుకుపోయిందని వివరించారు. ఇక ముందు ఏపీ ఇలా వాటాకు మించి జలాలను తరలించుకు పోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి వెంటనే టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలని.. అవసరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని కేంద్ర మంత్రికి తెలియజేశారు.ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించండిపాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను 2022లోనే సమర్పించినా.. అనుమతుల్లో ఆలస్యం చేస్తున్నారని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ వివరించారు. అదే సమయంలో న్యాయస్థానాల పరిధిలో ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మాత్రం అనుమతులు ఇచ్చారన్నారు. సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ బ్యారేజీలకు మాత్రం అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. ఈ మూడు ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), సాంకేతిక సలహా మండలి (టీఏసీ) నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని కోరారు.ఏపీ తీరు చట్టవిరుద్ధంఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావరి–బనకచర్ల అనుసంధాన పథకానికి రూపకల్పన చేసిందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వివరించారు. ఆ పథకానికి కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ), కేఆర్ఎంబీల నుంచి ఎటువంటి అనుమతి పొందలేదని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్లోనూ ఈ ప్రాజెక్టుపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. గోదావరిలో తెలంగాణకు సంబంధించి నికర జలాల వాటాలు తేల్చాలని.. రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. పాలమూరు– రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, మోదికుంట వాగు, చనాకా కొరట బ్యారేజీ (డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్), చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల పథకాలకు ‘సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)’, ‘పీఎంఆర్పీ 2024’ కింద తగిన ఆర్థిక సాయం అందజేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా మౌలిక వసతుల అభివృద్ధి కింద 50 సంవత్సరాల వడ్డీలేని రుణాలను ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని, ఈ క్రమంలో ఏర్పడే ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని కోరారు. -
హరీష్ రావు వ్యాఖ్యలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్
-
బీఆర్ఎస్ పాలనలోనే ‘కృష్ణా’లో అన్యాయం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది ముమ్మాటికీ గత బీఆర్ఎస్ పాలనలోనే అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాలను ఏపీ పాలకులు దోచుకుపోతుంటే అందుకు సహకరించిన బీఆర్ఎస్ పాలకులు.. ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాలను ఏపీ, తెలంగాణకు పంపిణీ చేసేందుకు 2015 జూన్ 18, 19 తేదీల్లో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించగా, ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులను అంగీకరిస్తూ సంతకాలు చేశారని ఆయన గత బీఆర్ఎస్ పాలకులపై మండిపడ్డారు. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సైతం ఈ అన్యాయానికి సమ్మతి తెలిపారని ఆరోపించారు. కేంద్ర జలశక్తి శాఖ, అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు 2020 వరకు నిర్వహించిన అన్ని సమావేశాల్లో గత ప్రభుత్వం ఈ కేటాయింపులను అంగీకరించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలసి గురువారం జలసౌధలో విలేకరుల సమావేశం నిర్వహించి కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఉత్తమ్ తిప్పికొట్టారు. బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో జరిగిన వరుస అన్యాయాల క్రమాన్ని తేదీలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2019–22 మధ్యలో ఏపీ ఏటా వరుసగా 653 టీఎంసీలు, 629 టీఎంసీలు, 621 టీఎంసీలను తరలించుకుపోయినా, గత పాలకులు చూస్తుండిపోయారన్నారు. ఏపీని అడ్డుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది.. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోవడంపై తాను ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి ఫిర్యాదు చేయగా, ఏపీని అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకి ఇప్పటికే తాము 67 టీఎంసీల కేటాయింపులను సాధించామని, నెలాఖరులోగా ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులిస్తామని కేంద్ర మంత్రి మరో హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జీరో వడ్డీ, 50 ఏళ్ల కాలపరిమితితో రుణాలు ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపారని వివరించారు. సాగర్‌ను ఏపీకి అప్పగించారు.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ఏపీ ప్రభుత్వం 2023లో 44 వేల క్యూసెక్కుల నుంచి 92,600 క్యూసెక్కులకు పెంచుకోగా, బీఆర్ఎస్ పాలకులు దానికి సహకరించారని ఉత్తమ్ ఆరోపించారు. అలాగే వెలిగొండ, ఇతర ప్రాజెక్టులను ఏపీ పూర్తిచేసుకునేందుకు కూడా సహకరించారన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాత్రి 2023 నవంబర్ 29న ఏపీ ప్రభుత్వం 400–500 మంది సాయుధ పోలీసులతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు సగభాగాన్ని ఆక్రమించుకోగా, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా 5,000 క్యూసెక్కులను విడుదల చేసుకున్నారని, అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు దీనిని చేష్టలుడిగి చూశారని ధ్వజమెత్తారు. అన్యాయం చేసింది వారే.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది హరీశ్‌రావు, కేసీఆర్, మాజీ ఈఎన్సీ మురళీధర్రావే అని, వారికి ఉరేసినా తప్పులేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. వారిది దొంగల తెలివి అని, ప్రశ్నించిన వారిని హత్యలు చేశారని ఆరోపించారు. -
నీటి వాటాల్లో అన్యాయం.. బీఆర్ఎస్ వైఫల్యమే!
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే పదేళ్లుగా కృష్ణా జలాల పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సాగునీటి శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. న్యాయమైన నీటి వాటా దక్కించుకోవడంలో బీఆర్ఎస్ సర్కారు ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తాజా తీర్పుపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం ఆయన సుదీర్ఘ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణలో ఉన్న పరీవాహక ప్రాంతం, ఆయకట్టు ఆధారంగా వాటాలు పెరగాలని తొలినుంచి కాంగ్రెస్ పార్టీనే పోరాటం చేస్తోందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొద్ది నెలలకే 2015 జూన్‌లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందని గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల నీటిని వాడుకునేలా ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. ఆ చీక టి ఒప్పందంతోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కృష్ణా జలాల్లో ఏపీకి 70 శాతం, తెలంగాణకు 30 శాతం వాటా మేరకు ఒప్పుకుని బీఆర్ఎస్ అన్యాయం చేస్తే.. తెలంగాణకు 70 శాతం వాటా రావాలనే వాదనను లేవనెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వమని తెలిపారు.బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నిలదీసినందుకే సెక్షన్ 3 అంశం తెరపైకి వచ్చిందని చెప్పారు. గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)కు ఓకే చెప్పింది తప్ప.. ఇందులో బీఆర్ఎస్ గొప్పతనమేమీ లేదని అన్నారు. నదీ జలాల వాటాలను తేల్చకుండా జాప్యం జరగడంలో బీఆర్ఎస్ ప్రధాన దోషి అని నిందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే బ్రిజేశ్ ట్రిబ్యునల్ ద్వారా నీటి కేటాయింపులు చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచామని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఉత్తమ్ సంధించిన ప్రశ్నలివే.. ⇒ పోతిరెడ్డిపాడు నుంచి అదనంగా నీళ్లు తరలిస్తుంటే అప్పుడు అధికారంలో ఉన్న హరీశ్‌రావు ఎందుకు మౌనంగా ఉన్నారు? ⇒ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కాకుండానే ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడి కాల్వ విస్తరణ పనులు చేపడితే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ⇒ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అపెక్స్ మీటింగ్‌కు అప్పటి సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టింది నిజం కాదా? ⇒ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు వీలుగా ఏర్పాటైన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును కేంద్రం పలుమార్లు పొడిగించింది. నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ కేటాయింపులు జరిగేలా గడిచిన పదేళ్లలో ఎందుకు ఒత్తిడి చేయలేదు? ⇒ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతులు నష్టపోతుంటే కళ్లప్పగించి ప్రేక్షక పాత్ర పోషించింది ఎవరు? ⇒ గోదావరి జలాలను రాయలసీమ దాకా తీసుకెళ్లి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పింది కేసీఆర్ కాదా? ⇒పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే గోదావరి నుంచి కృష్ణాకు తరలించే నీటిలో నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని 1978లో గోదావరి రివర్ బోర్డు అవార్డు చెబుతోంది. ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున 45 టీఎంసీల నీటి వాటా తెలంగాణకు దక్కాలి. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఏపీకి తరలిస్తున్న 80 టీఎంసీల్లో 45 టీఎంసీలు రావాలి కదా? అప్పుడు బీఆర్ఎస్ పట్టుబడితే, నిజంగా పోరాడితే తెలంగాణ నీటి వాటా 90 టీఎంసీలకు పెరిగేది కదా? ఆ నీటి వాటాలు ఎందుకు తెచ్చుకోలేదు? ఇది ఎవరి వైఫల్యం? -
Andhra Pradesh: కృష్ణా జలాల 'హక్కులు హుళక్కే'!
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకునేలా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ) 2లో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థ వాదనలు వినిపించడం లేదని నీటిపారుదల రంగ నిపుణులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ) 1956 సెక్షన్ 3 ప్రకారం కేంద్రం జారీ చేసిన తాజా విధి విధానాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలంటే.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను సవరించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఆ చట్టానికి సవరణ చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విభజన చట్టాన్ని సవరించకుండా సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన విధి విధానాలను అనుసరించి విచారణ చేయడానికి వీల్లేదనే కోణంలో వాదనలు వినిపించకుండా కూటమి ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని నిపుణులు తప్పుబడుతున్నారు. చంద్రబాబు సర్కారు సమర్థంగా వాదనలు వినిపించకపోవడం వల్లే సెక్షన్ 3 ప్రకారమే కృష్ణా జలాల పంపిణీపై వాదనలు వింటామని కేడబ్ల్యూడీటీ 2 గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని.. అంతిమంగా ఇది రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలుత రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయ ప్రయోజనాల కోసం.. ఆ తరువాత ఓటుకు కోట్లు కేసుతో వ్యక్తిగత లబ్ధి కోసం 2014–19 మధ్య కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణకు తాకట్టు పెట్టిన తరహాలోనే ఇప్పుడు కూడా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.బాబు సర్కారు నిర్వాకంతో...కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అప్పటికే పూర్తయిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులకు 811 టీఎంసీలను కేటాయిస్తూ 1976 మే 27న కేడబ్ల్యూడీటీ–1 తీర్పు ఇచ్చింది. అయితే కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమలులోకి రాని నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 తీర్పే ప్రస్తుతం అమల్లో ఉంది. ఈ క్రమంలో విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్ 89 ద్వారా కేడబ్ల్యూడీటీ–2కే కేంద్రం అప్పగించింది. రెండు రాష్ట్రాలకు నీటి లెక్కలను ట్రిబ్యునల్ తేల్చే వరకూ.. కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులను ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయిస్తూ 2015 జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. అదే విధానంలోనే 2023–24 వరకూ కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తోంది. అయితే ఐఎస్ఆర్డబ్యూడీఏ 1956 సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ జల్ శక్తి శాఖకు లేఖ రాసింది. దీనిపై ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ 2023 అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ కేడబ్ల్యూడీటీ–2కు అదనపు విధి విధానాలను జారీ చేసింది. వాటిని సవాల్ చేస్తూ 2023 అక్టోబర్ 31న సుప్రీంకోర్టులో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. అయితే సుప్రీంకోర్టులో ఆ రిట్ పిటిషన్‌పై సమర్థంగా వాదనలు వినిపించడంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. విభజన చట్టానికి విరుద్ధంగా కేంద్రం సెక్షన్ 3 కింద జారీ చేసిన అదనపు విధి విధానాలు చెల్లుబాటు కావనే కోణంలో సుప్రీం కోర్టులో వాదనలు వినిపించి ఉంటే.. కేడబ్ల్యూడీటీ–2లో ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొంటున్నారు.నాటి తరహాలోనే నేడూ..విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇటు ఏపీ, అటు తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం రెండు కళ్లు, కొబ్బరి చిప్పల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ.. నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. అయితే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం, పులిచింతల విద్యుత్ కేంద్రం తమ భూభాగంలో ఉన్నాయంటూ తెలంగాణ సర్కార్ వాటిని తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే నాగార్జునసాగర్ స్పిల్ వేలో సగభాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ రాష్ట్ర భూభాగంలో ఉన్నా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఆధీనంలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్ చేతికి చంద్రబాబు సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. దీంతో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస తదితర ప్రాజెక్టులను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టినా నాడు చంద్రబాబు నోరు మెదపలేదు. ఫలితంగా తెలంగాణ సర్కార్ ఏపీ హక్కులను కాలరాస్తూ శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు తరలిస్తూనే ఉంది. తెలంగాణ సర్కార్ జల దోపిడీపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసిన ఫలితంగానే 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగ భాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించిందని ప్రస్తావిస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ 2014–19 తరహాలోనే వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. కృష్ణా జలాలను అక్రమంగా తరలించేలా కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ చేపట్టినా చంద్రబాబు కనీసం నోరెత్తడం లేదని.. కేడబ్ల్యూడీటీ–2లోనూ సమర్థంగా వాదనలు వినిపించడం లేదని నిపుణులు ఆక్షేపిస్తున్నారు. -
బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో ఏపీకి చుక్కెదురు
ఢిల్లీ : రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ అంశానికి సంబంధించి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ మేరకు ఏపీ వాదను బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర వినతి మేరకు తొలుత రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీపై విచారణ చేస్తామని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ. దానిని బ్రిజేశ్ ట్రిబ్యునల్ పట్టించుకోలేదు. జలాల పంపిణీ అంశానికి సంబంధించి ట్రిబ్యునల్‌ను ఒప్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైనట్లు అయ్యింది. 811 టీఎంసీలలో ఏపీ, తెలంగాణలకు ఎంత కేటాయించాలనే అంశంపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ జరపనుంది. రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీకి సంబంధించిన అంశం తొలుత వినడం సముచితమన్న ట్రిబ్యునల్.. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులకు ముందే ఈ విషయంపై నిర్ణయం అవసరమని పేర్కొంది. సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాల అంశాన్ని విచారిస్తామని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.సెక్షన్ 89, సెక్షన్-3 రెండింటి ప్రకారం విచారించాలని తెలంగాణ కోరగా, ఏపీ ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు సెక్షన్లు వేర్వేరుని, సెక్షన్-3పై సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున సెక్షన్ 89పై విచారించాలని కోరింది.దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెక్షన్-3 ప్రకారమే తొలుత వాదనలు వినాలని స్పష్టం చేసింది. తెలంగాణ వినతిని సమ్మతిస్తూ సెక్షన్-3 ప్రకారం తొలుత వాదనలు వింటామని ట్రిబ్యునల్ పేర్కొంది. ఉమ్మడి ఏపీలో కేటాయించిన 811 టీఎంసీలలో మెజారిటీ వాటా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నీటి పంపిణీ ఒప్పందాన్ని ఒప్పుకోమని తెలంగాణ ప్రభుత్వం అంటోంది, దాంతో విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా పడింది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 21 వరకూ తిరిగి ఇరు రాష్ట్రాల వాదనలు తిరిగి విననుంది ట్రిబ్యునల్. కాగా, కృష్ణ నీటి పంపకాలపై ఈరోజు వాదనలు జరిగాయి. రెండు రోజుల పాటు వాదనలు జరగాల్సి ఉన్నప్పటికీ అనూ హ్యంగా ఫిబ్రవరి 19కి వాయిదా పడింది. తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో బలమైన వాదనలు వినిపించాలన్న సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఇటీవల నీటి పారుదల శాఖ సమీక్షలో రేవంత్ రెడ్డి అధికారులతో సైతం చర్చించారు కూడా. కృష్ణా జల వివాదాలు, పరిణామాలు ఇలా.. ♦ 1969 ఏప్రిల్ 10న మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ ప్రభుత్వాల ప్రతిపాదన మేరకు జస్టిస్ బచావత్ నేతృత్వంలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 ఏర్పాటైంది. ♦ 1976 మే 27న: కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను కేటాయిస్తూ బచావత్ ట్రిబ్యునల్ తుది నివేదిక (ఫైనల్ అవార్డు) ఇచ్చింది. ♦1976 మే 31: బచావత్ అవార్డును అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 25 ఏళ్ల వరకూ అవార్డును పునః సమీక్షించాలంటూ కోరవద్దని షరతు పెట్టింది. ♦ 2004 ఏప్రిల్ 2: బచావత్ అవార్డు కాల పరిధి ముగియడంతో కృష్ణా జలాలను సెక్షన్–3 కింద పునఃపంపిణీ చేయాలని మూడు రాష్ట్రాలు కోరడంతో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ అధ్యక్షతన కేడబ్ల్యూడీటీ–2ను ఏర్పాటు చేసిన కేంద్రం ♦ 2010 డిసెంబర్ 30: మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీలకు కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ బ్రిజేశ్ ట్రిబ్యునల్ కేంద్రానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ♦ 2013 నవంబర్ 29: మూడు రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ సెక్షన్–5(3) కింద బ్రిజేశ్ ట్రిబ్యునల్ తుది నివేదికను కేంద్రానికి ఇచ్చింది. (ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో దాన్ని కేంద్రం అమల్లోకి తేలేదు) ♦ 2014 మార్చి 1: ఉమ్మడి ఏపీని విభజిస్తూ చట్టాన్ని ఆమోదించిన కేంద్రం. ఆ చట్టంలో సెక్షన్–89 ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటినే తెలంగాణ, ఏపీల మధ్య పంపిణీ చేసే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని నిర్ణయం. ♦ 2014 మే 15: బ్రిజేశ్ ట్రిబ్యుల్ తుది నివేదికలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలను.. తెలంగాణ, ఏపీలకు పంపిణీ చేసే బాధ్యతను అదే ట్రిబ్యునల్‌కు అప్పగించిన కేంద్రం. ♦ 2016 అక్టోబర్ 19: మొత్తం కృష్ణా పరీవాహక ప్రాంతం పరిధిలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని ఏపీ, తెలంగాణ ట్రిబ్యునల్‌ను కోరాయి. దీనిపై వాదనలు విన్న ట్రిబ్యునల్ ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపిణీకే పరిమితం అవుతామంటూ ఉత్తర్వులిచ్చింది. ♦ 2020 అక్టోబర్ 6: అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. దీనితో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్సెల్పిని ఉపసంహరించుకుని ప్రతిపాదన పంపాలని.. న్యాయ సలహా తీసుకుని, తుది నిర్ణయానికి వస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి స్పష్టం చేశారు. ♦ 2021, అక్టోబర్ 6: కృష్ణా జలాలను సెక్షన్–3 కింద పునఃపంపిణీ చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్సెల్పిని తెలంగాణ సర్కారు వెనక్కి తీసుకుంది. ♦ 2023, అక్టోబర్ 4: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీకి కొత్త విధి విధానాలను రూపొందిస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. -
నేటి నుంచి కృష్ణ ట్రిబ్యునల్‌లో నీటి పంపకాలపై వాదనలు
సాక్షి, ఢిల్లీ: నేటి నుంచి రెండు రోజుల పాటు కృష్ణ ట్రిబ్యునల్‌లో నీటి పంపకాలపై వాదనలు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో బలమైన వాదనలు వినిపించాలన్న సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఇటీవల నీటి పారుదల శాఖ సమీక్షలో రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు.ఢిల్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు కృష్ణ ట్రిబ్యునల్‌లో నీటి పంపకాలపై వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. తెలంగాణకు నీటి కేటాయింపులు విషయంలో బలమైన వాదనలు వినిపించాలన్నారు. అలాగే, ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ-1956 సెక్షన్-3ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గోదావరి-బనకచర్లపై అభ్యంతరాలతో జల్‌శక్తి మంత్రి, ఏపీ ముఖ్యమంత్రికి లేఖలు రాయాలని తెలిపారు. ఇదే సమయంలో పోలవరం ముంపుపై నిర్దేశిత సమయంలో ఐఐటీతో అధ్యయనం చేయాలని సూచనలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేటాయించిన 811 టీఎంసీలలో మెజారిటీ వాటాను తెలంగాణ కావాలంటున్నది.ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. ఈరోజు సాయంత్రం కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. అలాగే, సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కూడా రేవంత్ రెడ్డి కలవనున్నారు. -
కడలి వైపు కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: కడలి వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి బుధవారం సా.6 గంటలకు 1లక్షా 51వేల క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 13,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు.. మిగులుగా ఉన్న 1,37,450 క్యూసెక్కులను 50 గేట్లను మూడు అడుగులు, 20 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్‌లోకి గురువారం కూడా ఇదే రీతిలో వరద కొనసాగనుంది.మరోవైపు.. నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3.74 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ఇక్కడ 37.10 టీఎంసీలను నిల్వచేస్తూ దిగువకు 1.06 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అలాగే, శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.32 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 882.8 అడుగుల్లో 203.42 టీఎంసీలు నిల్వచేస్తూ పది గేట్లు ఎత్తి, విద్యుదుత్పత్తి చేస్తూ 4.03 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 3.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 584.6 అడుగుల్లో 296.28 టీఎంసీలు నిల్వచేస్తూ గేట్లు ఎత్తి, ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 2.70 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆ రెండింటి నుంచి దిగువకు రెండు లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 59 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 103.74 టీఎంసీలు నిల్వచేస్తూ 60 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ఈ నేపథ్యంలో.. గురువారం కూడా శ్రీశైలంలోకి వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగనుంది. మరోవైపు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పత్తి, పెసర, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. స్వల్పంగా పెరుగుతున్న గోదావరి..ఇదిలా ఉంటే.. గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాలతో ఉప నదుల నీరు, కొండవాగుల నీరు క్రమేపీ నదిలోకి చేరుతుండటంతో వరద ఉధృతి పెరుగుతోంది. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 30.800 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి 6.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద కూడా గోదావరి వరద పెరుగుతూ 35.3 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వరద మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాగులు పొంగి ప్రవహిస్తున్నందున చింతూరు మండలంలో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీఆర్‌పురం మండలంలో అన్నవరం వాగు పొంగి వరదనీరు రహదారి పైనుండి ఉధృతంగా ప్రవహించింది. వరినాట్లు నిమిత్తం అవతలి పక్కకు వెళ్లిన వ్యవసాయ కూలీలు తిరుగుమార్గంలో ప్రాణాలకు తెగించి వాగును దాటారు. -
కరవు నేల మురిసేలా
బి.కొత్తకోట : ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతం, ప్రస్తుత అన్నమయ్య జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుల అనుసంధాన ప నులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పథకం ద్వారా జిల్లాకు 20 టీఎంసీల కృష్ణా నీరు సద్వినియోగం చేసుకోవాలన్నదే లక్ష్యం.2021 జూలై, 4న ములకలచెరువు మండ లం నాయనచెరువుపల్లె వద్ద పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.5,030 కోట్లు మంజూరు చేయగా, రూ.4,373.23 కోట్లకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. ఈ అనుసంధాన పనులు పూర్తయితే హంద్రీనీవా ప్రాజెక్టు ఉప కాలువలు, ప్రధాన కాలువ, ప్రధాన రిజర్వాయర్లకు కృష్ణా జలాలు పుష్కలంగా చేరుతాయి. జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతల పథకంగా పిలవబడే ఈ పథకం ద్వారా గండికోట రిజర్వాయర్ నుంచి 13 టీఎంసీలు ప్రస్తుత అన్నమయ్య జిల్లాకు వినియోగించుకుంటారు.రూ.1,100 కోట్లతో పనులు పూర్తి20 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునే లక్ష్యంతో రూపొందిన ఈ పథకం ద్వారా రెండు ప్రాజెక్టుల అనుసంధానం జరుగుతోంది. పది చోట్ల ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి గాలేరు–నగరి ప్రాజెక్టు ప్రధాన కాలువ కిలోమీటర్ 56.000 వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి 2 వేల క్యూసెక్కుల నీటిని కాలేటి వాగు రిజర్వాయర్‌కు తరలిస్తారు. ఇక్కడ నుంచి కల్లూరుపల్లె రిజర్వాయర్‌కు, ఇక్కడి నుంచి 1,550 క్యూసెక్కుల నీటిని వెలిగల్లు రిజర్వాయర్‌కు తరలిస్తారు. తర్వాత తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలంలోని హంద్రీనీవా ప్రధాన కాలువ కిలోమీటర్ 483.750లోకి 750 క్యూసెక్కులు తరలిస్తారు. వెలిగల్లు రిజర్వాయర్ నుంచి తంబళ్లపల్లె సమీపంలోని పెద్దేరు ప్రాజెక్టులోకి 800 క్యూసెక్కులు, అక్కడి నుంచి నాయునిచెరువుకు 800 క్యూసెక్కులు, నాయనిచెరువుపల్లె ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవా పుంగనూరు ఉపకాలువ కిలోమీటర్ 79.600 వద్ద నీటిని మళ్లిస్తారు. మొత్తం 10చోట్ల ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తారు.55 కిమీ పైప్‌లైన్ పూర్తిఅనుసంధాన పనుల్లో భాగంగా 153 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు జరగాల్సి ఉండగా 55 కిలోమీటర్ల పనులు పూర్తి చేశారు. కాలువ పనులు 5.313 కిలోమీటర్లు పూర్తయ్యింది. 10 చోట్ల ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టగా అందులో ఒక పథకం పూర్తి కావొస్తోంది. చక్రాయపేట మండలం గండి వద్ద 5 కిలోమీటర్ల సొరంగం పనులు చేయాల్సి ఉంది. వెలిగల్లు ప్రాజెక్టులోకి నీటిని తరలించే కాలేటివాగు రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయి. కొత్తగా నిర్మించిన కల్లూరివారిపల్లె రిజర్వాయర్ పూర్తయ్యింది.120 రోజులూ నీటి తరలింపు పథకం ద్వారా మొత్తం 20 టీఎంసీల నీటిని 120 రోజుల్లో తరలించుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో 13 టీఎంసీలు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు దక్కుతాయి. పుంగనూరు ఉప కాలువకు 800 క్యూసెక్కులు తరలిస్తే 120 రోజుల్లో 13 టీఎంసీల నీరు తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు చేరుతుంది. 750 క్యూసెక్కులతో ప్రధాన కాలువకు 5 టీఎంసీల నీరు చేరుతుంది. ఈ పథకంతో పశ్చిమ మండలాల్లో 2,48,150 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రజలకు తాగునీటి కష్టాలు తీరుతాయి, భూగర్బజలాలు వృద్ది చెందుతాయి.కృష్ణా జలాలతో చెరువులు నింపుతాంప్రాజెక్టుల అనుసంధాన పనులు పూర్తవగానే తంబళ్లపల్లె నియోజకవర్గంలోని చెరువులకు కృష్ణా జలాలను తర లిస్తాం. ముదివేడు రిజర్వాయర్ నుంచి కురబలకోట, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం మండలాల్లోని చెరువులకు నీటిని అందించే ప్రణాళిక ఉంది. మిగతా మండలాలకు ఉపకాలువ ద్వారా నీటి తరలింపుపై అధ్యయనం చేయాల్సి ఉంది. కరువు రైతులకు శాశ్వతంగా సాగునీటి కష్టాలు తీరుతాయి.– పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యేప్రాజెక్టు పూర్తికి సీఎం సహకారంప్రాజెక్టుల అనుసంధా నం పనులు సత్వరమే పూర్తయ్యేలా కృషి చేస్తున్నాం. ఎంపీలు అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలతో సమీక్షిస్తున్నాం.వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రాజెక్టుకు నిధుల ఇబ్బంది లేకుండా సహకారం అందిస్తున్నారు. పనులు పూర్తయ్యాక రాయచోటి నియోజకవర్గానికి తాగునీటి సమస్య పూర్తిగా తీరుతుంది. సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టుతో అన్నమయ్యజిల్లా మొత్తం సస్యశ్యామలం ఆవుతుంది.– గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే -
కొత్త ట్రిబ్యునల్‌పై నిర్ణయాధికారం కేంద్రానిదే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య గోదావరి నదీ జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ వేయాలనే ఏపీ విజ్ఞప్తిని గోదావరి బోర్డు సమావేశం ఎజెండాలో పెట్టడంపై తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం ప్రకారం ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం కేంద్రానికే ఉందని స్పష్టం చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్–85 కింద అప్పగించిన అధికారాలకే గోదావరి బోర్డు పరిమితం కావాలని చెప్పింది. బోర్డు పరిధిలోకి రాని అంశాలను ఎజెండాలో ఎలా చేర్చుతారని ప్రశ్నించింది. దీంతో ఈ అంశంపై గోదావరి బోర్డు సమావేశంలో చర్చించబోమని బోర్డు చైర్మన్ ముకేశ్ కుమార్ సిన్హా ప్రకటించారు. శుక్రవారం జలసౌధలో గోదావరి బోర్డు సమావేశం వాడీవేడిగా జరిగింది. తెలంగాణ నుంచి ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శి భీంప్రసాద్, అంతర్రాష్ట్ర ఎస్ఈలు కోటేశ్వరరావు, శ్రీధర్‌రావు దేశ్‌పాండే, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్య ప్రసాద్, ఏపీ నుంచి నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శితో పాటు సీఈ (హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర) కుమార్, ఈఈ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. సరిహద్దుల వద్దే టెలిమెట్రీలు పెట్టాలి గోదావరి బోర్డు సమావేశం ఎజెండాలో కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం జారీ చేసిన టీవోఆర్ (టర్మ్ అండ్ రిఫరెన్స్)ను చేర్చగా... ట్రిబ్యునల్ పరిధిలో ఉన్న అంశాన్ని చర్చించడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా టెలిమెట్రీ కేంద్రాలు పెట్టాలనే ప్రతిపాదనలను తెలంగాణ వ్యతిరేకించింది. అంత్రరాష్ట్ర సరిహద్దుల్లోనే టెలిమెట్రీ కేంద్రాలు పెట్టాలని, జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్హెచ్పీ) కిందఏర్పాటు చేయాలని కోరింది. కాగా తెలంగాణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లోకె నాల్, ఎస్సారెస్పీ–2 విస్తరణ, శ్రీపాద ఎల్లంపల్లి, కాళేశ్వరం అదనపు టీఎంసీ, కుప్తీ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ డిమాండ్ చేసింది. పై 4 ప్రాజెక్టుల్లో మూడింటికి టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం లభించిందని, కుప్తీ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే అందిస్తామ ని తెలంగాణ తెలిపింది. గోదావరిలో న్యాయమైన వాటా ప్రకారమే ప్రాజెక్టులు కడుతున్నామని స్పష్టం చేసింది. అదనపు సిబ్బంది అవసరం లేదు గోదావరి బోర్డుకు అదనంగా సిబ్బందిని సమకూర్చాలని చేసిన ప్రతిపాదనలను రెండు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ప్రాజెక్టులు అప్పగించనప్పుడు అదనంగా సిబ్బంది అవసరమే లేదని స్పష్టం చేశాయి. 2024–25లో బోర్డుకు రూ.16 కోట్ల బడ్జెట్ కేటాయింపునకు ఆమోదం తెలపాలని ప్రతిపాదించగా.. 2023–24లో వ్యయం రూ.8 కోట్లకు మించదని, రూ.10 కోట్లు కేటాయిస్తే సరిపోతుందని పేర్కొన్నాయి. గోదావరి జలాల వినియోగంతో పాటు పంటల సాగు వివరాలను ఉపగ్రహ చిత్రాల సహకారంతో సేకరించాలని బోర్డు చేసిన ప్రతిపాదనలను తెలుగు రాష్ట్రాలు తోసిపుచ్చాయి. సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి అజగేషన్, సభ్యులు పాల్గొన్నారు. -
కృష్ణా నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది: ఉత్తమ్
-
పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు: కేసీఆర్
KCR Nalgonda Public Meeting Updates నల్గొండ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం జై తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన మాజీ సీఎం కేసీఆర్ ఇది ఉద్యమ సభ, పోరాట సభ ఇది రాజకీయ సభ కాదు నీళ్లు లేకపోతే మనకు బతుకులేదు పక్షిలా తీరుక్కుంటూ రాష్ట్ర మొత్తానికి చెబుతూనే ఉన్నా నీరు లేకపోతే తెలంగాణ లేదు ఫ్లోరైడ్ సమస్యను ఎవరూ పట్టించుకోలేదు ఫ్లోరైడ్‌ను శాశ్వతంగా పరిష్కరించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే మనం ఉద్యమించకపోతే మనల్ని రక్షించేందుకు ఎవరూ రారు నల్లగొండ సభ తెలంగాణ వ్యతిరేకులకు ఓ హెచ్చరిక నిమిషం కూడా కరెంట్ పోకుండా మనం సప్లయ్ చేశాం పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు ఉమ్మడి రాష్ట్రమే బాగుండే అని ఇప్పటి పాలకులు అంటున్నారు ఉమ్మడి రాష్ట్రమే బాగుంటే అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది శ్రీకాంతాచారి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు తెలంగాణకు అన్యాయం జరిగితే నా కట్టేకాలే వరకు పులిలా కొట్లాడుతా పిల్లిలాగా సైలెంట్‌గా ఉండను అవసరమైతే పిడికిలి బిగించాలి కేసీఆర్ సర్కారు పోగానే కరెంటు ఎటు పోయింది చేతగాని చవటలు, దద్దమ్మల రాజ్యం ఉంటే ఇలాగే ఉంటుంది అదనపు కరెంట్ ఉన్నా 24 గంటలు ఎందుకు ఇవ్వడంలేదు మీకు తెలివిలేక, నడపరాక, చేతకాక కరెంట్ పోతోంది 3 కోట్ల టన్నుల వడ్డు పండించిన తెలంగాణకు ఏం బీమారి వచ్చింది రైతుబంధు ఇవ్వడానికి ఏం రోగం వచ్చింది రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారు పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటాయి రైతుల చెప్పులు బందోబస్తుగా ఉంటాయ కేసీఆర్‌ను తెలంగాణలో తిరగనీయమనేంత మొనగాళ్లా? కేసీఆర్‌ను బద్నాం చేయాలనే దుష్టబుద్ధితో రైతులను ఎండబెడతారా? కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదు మేడిగడ్డ, బొందల గడ్డ పోతారట మేడిగడ్డ పోయి ఏం పీకుతారు దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయాలి మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోతే బాగు చేయించి నీళ్లు ఇవ్వాలి నాగార్జున సాగర్కుంగలేదా? కడెం ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టులకు ఇబ్బందులు రాలేదా? అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో న్యాయమైన వాటా తేలేవరకూ కొట్లాడాలి నేను వచ్చింది రాజకీయాల కోసం కాదు..హక్కుల మీద పోరాటానికి సిద్ధంగా లేకపోతే నష్టపోతాం కరెంట్ ఇప్పుడే లేకపోతే ముందు ముందు ఇంకా ఇస్తరా రైతు బంధు బ్యాంకుల్లో పడటం లేదు.. ఫోన్లు మోగడంలేదు అధికారం కోసం నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు దొంగ, నంగనాచి మాటలతో తప్పించుకుంటే నడవదు మీరేం బాధపడకండి, మళ్లీ మనమే వస్తాం కృష్ణా, గోదావరి జలాల్లో సంపూర్ణమైన వాటావచ్చే వరకూ పోరాడుతాం నల్గొండలో బీఆర్ బహిరంగ సభ సభా ప్రాంగణానికి చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ► నల్గొండ జిల్లా వీటీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. సభకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సుపై దాడి జరిగింది. బస్సుపైకి కోడిగుడ్లు విసిరి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నల్లచొక్కాలు ధరించి ‘గోబ్యాక్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. బస్సులో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఉన్నారు. ఎన్ఎస్యూఐ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాక్షి, నల్గొండ: కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్ బయల్దేరారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ఈ బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. నల్లగొండ పట్టణ శివారులో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్‌లో విశాలమైన స్థలంలో నిర్వహించే బీఆర్ఎస్ సభకు ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, శ్రేణులు భారీగా చేరుకున్నారు. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు తరలివస్తున్నారు. నల్లగొండతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలిరానుండటంతో సభా ప్రాంగణానికి నలువైపులా జనం చేరుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనాల పార్కింగ్ కోసం అన్ని వైపులా ప్రత్యేక స్థలాలను సిద్ధం చేశారు. మరోవైపు సభకు పోలీసు శాఖ 500 మంది సిబ్బందితో బందోబస్తు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి జనంలోకి అడుగుపెడుతుండటంతో ఈ సభపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించనుంది. అయితే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభు త్వం సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్ నల్లగొండ సభలో తన ప్రసంగ శైలిని మార్చే అవకాశముంది. 6 నెలల్లోగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నల్లగొండ సభావేదికగా కేసీఆర్ అల్టిమేటం జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. -
నీళ్ల ‘మంటలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య నీళ్ల మంటలు మొదలయ్యాయి. కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణాజలాలు, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల అంశంపై తీవ్ర చర్చ జరుగుతుండగా.. సోమ, మంగళవారాల్లో జరగనున్న పరిణామాలు మరింత వేడిని పెంచుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, పలు ప్రాజెక్టుల నిర్మాణంపై నిర్లక్ష్యమంటూ బీఆర్ఎస్ను, ఆ పార్టీ ముఖ్యులను కాంగ్రెస్ సర్కారు టార్గెట్ చేసింది. మరోవైపు కాంగ్రెస్ సర్కారు వచ్చిన రెండు నెలల్లోనే రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్రానికి, కృష్ణాబోర్డుకు అప్పజెప్పి, ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తోందంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. ఈ అంశాలపై అసెంబ్లీలో, బయటా ఇరుపార్టీల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మొత్తమ్మీద లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఇరు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. నేడు అసెంబ్లీలో చర్చ? ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చించేందుకు అసెంబ్లీ సోమవారం సమావేశం కానుంది. ఈ క్రమంలోనే సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే దిశగా జరిగిన పరిణామాలు, గత పదేళ్లలో సాగునీటి వైఫల్యాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ప్రజా భవన్లో ‘ప్రజెంటేషన్’ మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సాగునీటి ప్రాజెక్టులు, జలాల అంశంపై ఆదివారం ప్రజాభవన్‌లో అవగాహన కల్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్»ొజ్జా, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా.. కృష్ణా, గోదావరి బేసిన్లలో నీటి లభ్యత, తెలంగాణ వినియోగం, చేపట్టిన ప్రాజెక్టులు, వాటి పురోగతిని వివరించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం జరిగిందని వివరించారు. ఈ సమావేశం తర్వాత ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. కృష్ణాజలాలపై సోమవారం అసెంబ్లీలో స్పష్టత ఇస్తామని, నల్లగొండలో బీఆర్ఎస్ సభ మొదలయ్యే లోపే తెలంగాణ ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని చెప్పారు. కేసీఆర్ చేసిన అన్యాయంతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం నెలకొందని ఆరోపించారు. మేడిగడ్డ సందర్శనకు తీసుకెళ్తామంటూ.. బీఆర్ఎస్ నల్లగొండ సభకు కౌంటర్‌గా కాంగ్రెస్ సర్కారు ఎమ్మెల్యేల మేడిగడ్డ సందర్శన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. కాళేశ్వరం అవినీతిపై చర్చను పక్కదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ కృష్ణా ప్రాజెక్టుల అంశాన్ని లేవనెత్తుతోందని ఆరోపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. కాళేశ్వరం అవినీతి అంశంపై క్షేత్రస్థాయిలో చర్చజరిగేలా చూడాలని ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మేడిగడ్డ పర్యటన ఏర్పాటుచేసి.. బ్యారేజీ సందర్శనకు రావాల్సిందిగా అసెంబ్లీలోని అన్ని రాజకీయ పార్టీలను ఆహా్వనించారు. మంగళవారం (13న) ఉదయం అసెంబ్లీ నుంచే ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేలను మేడిగడ్డకు తీసుకెళతామని చెప్పారు. ఈ సందర్శనకు వచ్చే విషయంలో కాంగ్రెస్, సీపీఐ మినహా ఇతర పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం తమ నిర్ణయాన్ని వెల్లడించలేదు. తప్పు కప్పిపుచ్చుకునే డ్రామాలు తెలంగాణకు అన్యాయం చేసిన మాజీ సీఎం కేసీఆర్.. తన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు సభలంటూ డ్రామాలు ఆడుతున్నారని టీపీసీసీ కిసాన్‌సెల్ మండిపడింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది. నల్లగొండ బీఆర్ఎస్ సభకు చురుగ్గా ఏర్పాట్లు కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ.. మంగళవారం నల్లగొండ పట్టణ శివార్లలోని మర్రిగూడ బైపాస్‌రోడ్డు వద్ద సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సభకు హాజరవుతుండటంతో పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం గులాబీదళం ప్రయత్నిస్తోంది. నల్లగొండతోపాటు మహబూబ్‌నగర్, ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తొలిసారి సభలో ప్రసంగించనుండటంతో.. ఆయన ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది. కేసీఆర్ క్షమాపణలు చెప్పాకే నల్లగొండకు రావాలి గత పదేళ్లలో జిల్లాలోని ప్రాజెక్టులేవీ పూర్తిచేయలేదు: కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండ/ చండూరు: కేసీఆర్ పదేళ్ల పాలనలో నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయకుండా మోసం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. మొదట కేసీఆర్ నల్లగొండ జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాకే నల్లగొండకు రావాలని వ్యాఖ్యానించారు. నల్లగొండలోకి క్యాంపు కార్యాలయంలో వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడా రు. కుర్చీ వేసుకుని కూర్చుని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని.. అది పూర్తయి ఉంటే నల్లగొండ జిల్లాకు ఇలాంటి కరు వు పరిస్థితులు వచ్చేవి కావని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ నిర్వహించే రో జే నల్లగొండ పట్టణంలోని గడి యారం సెంటర్లో కుర్చీ వేసి, దానిమీద గులాబీ కండువా కప్పి, కేసీఆర్ చిత్రం పెట్టి నిరసన తెలుపుతామన్నారు. బీఆర్ఎస్ సభను బహిష్కరించండి: రాజగోపాల్‌రెడ్డి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే కేసీఆర్ నల్లగొండలో సభ పెడుతున్నారని.. ఆ సభను పార్టీలకు అతీతంగా బహిష్కరించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా చండూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు నైతిక విలువలేమైనా ఉంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు. కాగా.. కాంగ్రెస్ ముఖ్యుల పిలుపు మేరకు బీఆర్ఎస్ సభకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. -
కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కులను పోరాడి పరిరక్షించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ విజయం సాధించారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు నాలుగున్నరేళ్లుగా ఆయన చేసిన పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గతనెల 17న ఢిల్లీలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమలుకు గురువారం హైదరాబాద్‌లోని కృష్ణాబోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ రెండు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. అందుకు సంబంధించిన విధివిధానాలను ఈ సమావేశంలో రూపొందించారు. వాటిని కృష్ణాబోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలపై రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి సమీక్షించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగించనున్నారు. కృష్ణానదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచు విభేదాలు తలెత్తడానికి కారణమైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే గతనెల 17న రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులతో ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు ఆ సమావేశంలో అంగీకరించాయి. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలను వారంలో ఖరారు చేయాలని త్రిసభ్య కమిటీని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. కానీ.. హైదరాబాద్‌కు వచ్చాక తెలంగాణ సర్కార్ అడ్డం తిరిగింది. కృష్ణాజలాల వాటాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై బుధవారం కేంద్రానికి లేఖ కూడా రాసింది. అడ్డంతిరిగి.. దారికొచ్చిన తెలంగాణ కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆదేశాల మేరకు కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే నేతృత్వంలో గురువారం త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ హాజరయ్యారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను ట్రిబ్యునల్ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని తెలంగాణ ఈఎన్సీ పాతపాట పాడటంతో ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి వాటాలు తేల్చేది ట్రిబ్యునల్ మాత్రమేనని.. త్రిసభ్య కమిటీ, కృష్ణాబోర్డు, అపెక్స్ కౌన్సిల్‌కు ఆ అధికారం లేదని గుర్తుచేశారు. ప్రాజెక్టుల అప్పగింతకే త్రిసభ్య కమిటీ పరిమితం కావాలని సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో తమ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీచేశామని, తెలంగాణ తన భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్ల అప్పగింతపై ఇప్పటికీ తేల్చలేదని ఎత్తిచూపారు. దీంతో తమ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించడానికి తెలంగాణ ఈఎన్సీ అంగీకరించారు. బోర్డు, ఏపీ, తెలంగాణ ప్రతినిధుల నేతృత్వంలో.. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూనే.. ఒక్కో అవుట్లెట్ వద్ద బోర్డు, ఏపీ, తెలంగాణ అధికారులు ఒక్కొక్కరిని నియమించి, నీటి విడుదలను పర్యవేక్షించాలని ఇద్దరు ఈఎన్సీలు చేసిన సూచనకు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అంగీకరించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు సిబ్బందిని సమకూర్చాలని సభ్య కార్యదర్శి చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ప్రతి నీటి సంవత్సరంలో ఎప్పటికప్పుడు త్రిసభ్య కమిటీ సమావేశమై.. రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించి, నీటివిడుదలకు చేసే సిఫార్సు మేరకు బోర్డు ఉత్తర్వులు జారీచేయాలనే ప్రతిపాదనపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. తాగునీటి అవసరాల కోసం తక్షణమే సాగర్ ఎడమకాలువ కింద ఏపీకి రెండు టీఎంసీల విడుదలకు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. కుడికాలువకు మార్చిలో 3, ఏప్రిల్‌లో 5 టీఎంసీల విడుదలకు ఆమోదం తెలిపింది. హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్ రాజీలేని పోరాటం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడం కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలించింది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడిచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కృష్ణాబోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా.. తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణాబోర్డు రాష్ట్రానికి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కార్ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాలువ ద్వారా విడుదల చేయాలన్న రాష్ట్ర అధికారుల విజ్ఞ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీంతో నవంబర్ 30న తెల్లవారుజామున సీఈ మురళీనాథ్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు, జలవనరులశాఖ అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడికాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఏకాభిప్రాయంతో ప్రాజెక్టుల అప్పగింత త్రిసభ్య కమిటీ సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు ఏకాభిప్రాయం కుదిరింది. ఏపీ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగింతకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశాం. తెలంగాణ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించడానికి ఆ రాష్ట్రం అంగీకరించింది. త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు బోర్డు నీటి కేటాయింపులు చేస్తుంది. వాటిని బోర్డే విడుదల చేస్తుంది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, ఏపీ జలవనరులశాఖ త్రిసభ్య కమిటీ సిఫార్సులే కీలకం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏటా నీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ చర్చించి.. కేటాయింపులపై బోర్డుకు సిఫార్సు చేస్తుంది. ఆ ప్రకారమే బోర్డు నీటిని విడుదల చేస్తుంది. మా భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగిస్తాం. కృష్ణాజలాల్లో 50 శాతం వాటా కోసం కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాశాం. – మురళీధర్, ఈఎన్సీ, తెలంగాణ నీటిపారుదలశాఖ -
కృష్ణా జలాల వివాదం.. కీలక సమావేశం వాయిదా
సాక్షి, ఢిల్లీ: కృష్ణా జలాల వివాదంపై ఈ నెల 6న నిర్వహించనున్న కీలక సమావేశాన్ని కేంద్ర జల్‌శక్తి వాయిదా వేసింది. మిచౌంగ్ తీవ్ర తుపాను కారణంగానే ఈ భేటీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఏపీ సీఎస్‌లతో పాటు కృష్ణా నదీయాజమాన్యం బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో ఈ సమావేశం ఉంటుందని తొలుత ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాలను మిచౌంగ్ తుపాను కుదిపేస్తుండడంతో అధికార యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో తలమునకలైంది. ఈ పరిస్థితుల్లో సమావేశం నిర్వహించడం సబబు కాదని భావించిన కేంద్ర జల్‌శక్తి వాయిదా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8వ తేదీన సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి.. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని.. అప్పటి వరకు పూర్తిగా సంయమనం పాటించాలని కార్యదర్శి ముఖర్జీ ఇదివరకే తెలుగు రాష్ట్రాలకు సూచించారు. కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తగు న్యాయం చేసేందుకు వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. -
నీటి పంపకాల విషయంలో రాజీపడేది లేదు: మంత్రి అంబటి
సాక్షి, పల్నాడు: నీటి పంపకాల విషయంలో రాజీపడేది లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఎల్లోమీడియా ఇష్టానుసారంగా కథనాలు ప్రచురిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు రైతులపాలిట ద్రోహిగా నిలిచిపోయారు. కృష్ణా జలాల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. పచ్చ పత్రికలు రాతలు రోతలుగా రాస్తున్నాయి. కొన్ని పత్రికలు మాత్రం విషం చిమ్ముతున్నాయి. మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.. ఇలాంటి తప్పుడు కథనాలు వద్దు. మన నీటిని సద్వినియోగం చేసుకోలేకపోవడానికి చంద్రబాబే కారణం. ఏపీకి రావాల్సిన నీటి వాటా గురించి సీఎం జగన్ పోరాడారు. తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంటోంది. నీటి పంపకాల విషయంలో రాజీపడేది లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కృష్ణా జలాలపై తప్ప మిగిలిన విషయాలు మాట్లాడారు. నీకు బ్యానర్ కట్టిన వ్యక్తిని కూడా నువ్వు పార్టీలో నిలుపుకోలేకపోయావు. ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న వారు కూడా తర్వాత ఉండరు. చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారు అని ఘాటు విమర్శలు’ చేశారు. -
కృష్ణా జలాల వివాదం: డిసెంబర్ 6న కీలక భేటీ
సాక్షి, విజయవాడ: కృష్ణా జలాల వివాదంపై పరిష్కారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ తదితర అంశాలపై ఈనెల 6న ఎపీ , తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జల వనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ వీడియో సమావేశం నిర్వహించనుంది. ఈ అంశాలపై ఢిల్లీ నుండి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వీడియో శనివారం సమావేశం నిర్వహించారు. కానీ తెలంగాణా సీఎస్ ఈరోజు సమావేశానికి హాజరు కాలేనని 5వ తేదీకి సమావేశాన్ని మార్చాలని కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులతో ఈనెల 6వ తేదీన వీడియో సమావేశం నిర్వహించనున్నట్లు దేబశ్రీ ప్రకటించారు. అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి ఈసమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అప్పటి వరకూ ఇరు రాష్ట్రాలు పూర్తి సంయవనం పాటించాలని సూచించారు. నీటి విడుదలకు సంబంధించి ఎపీ ఇచ్చిన ఇండెంటుపై కృష్ణా నది యాజమాన్య బోర్డు ఈనెల 4వ తేదీన సమావేశం నిర్వహించాలని జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ.. కేఆర్ఎంబి చైర్మన్ శివనందన్ కు సూచించారు. నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని అప్పటి వరకూ నాగార్జున సాగర్ కుడి కాలువ నుండి నీటి విడుదలను ఆపాలని కోరారు. కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఎపీ, తెలంగాణా రాష్ట్రాలకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీటి విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. 6వతేదీన జరిగే సమావేశంలో ఇందుకు సంబంధించి అన్ని అంశాలను సమావేశం దృష్టికి తీసుకు వస్తామని సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: నాగార్జున సాగర్ దగ్గర టెన్షన్.. టెన్షన్.. మోహరించిన సీఆర్పీఎఫ్ బలగాలు -
కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, ఢిల్లీ: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంచాయితీపై కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబాశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఉద్రిక్తతల తగ్గింపు అజెండాగా నాగార్జునసాగర్ డ్యాం, శ్రీశైలం డ్యాం నిర్వహణ బదిలీ అంశం, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. సుమారు గంట పాటు సమావేశం కొనసాగింది. త్వరలోనే మీటింగ్ మినిట్స్ విడుదల చేస్తామని డబ్ల్యూసీ ఛైర్మన్ వెల్లడించారు. చదవండి: ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఎంత? -
కృష్ణాజలాల పంపిణీపై న్యాయ పోరాటం
-
కృష్ణాజలాల పంపిణీపై న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీ కోసం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2)కు కేంద్ర జల్ శక్తి శాఖ ఈనెల 6న జారీ చేసిన కొత్త విధి విధానాలపై న్యాయపోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ విధి విధానాల అమలును నిలిపేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఎప్పుడు విచారించాలన్నది సుప్రీం కోర్టు నిర్ణయించనుంది. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల లభ్యత ఉందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ 1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. ఈ ట్రిబ్యునల్ అవార్డు గడువు ముగియడంతో 2004లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ఈ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పంపిణీపై 2010 డిసెంబర్ 30న ఓ నివేదికను, 2013 నవంబర్ 29న తదుపరి నివేదికను అందజేసింది. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యత ఆధారంగా చేసిన కేటాయింపుల జోలికి వెళ్లని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్.. 65 శాతం సగటు లభ్యత ఆధారంగా 194 టీఎంసీల మిగులు జలాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. ఈ నివేదికలను సవాల్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బేసిన్‌లోని రాష్ట్రాలు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెల్పీ)లను దాఖలు చేశాయి. దీంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి రాలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే కేంద్రం అప్పగించింది. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయని ప్రాజెక్టులకు నీటిని కేటాయించి, నీటి లభ్యత తక్కువ ఉన్న సంవత్సరాల్లో ప్రాజెక్టులవారీగా జలాల విడుదలకు నిర్వహణ నియమావళి (ఆపరేషన్ ప్రోటోకాల్)ని రూపొందించాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు విభజన చట్టం నిర్దేశించింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని కూడా ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది. దీని ప్రకారం 2016 అక్టోబర్ నుంచి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోంది. విభజన చట్టం ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాల పునఃపంపిణీ కుదరని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇప్పటికే తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలను సెక్షన్–3 ప్రకారం పంపిణీ చేయాలని తెలంగాణ చేసిన ఫిర్యాదు ఆధారంగా.. కృష్ణా జలాల పంపిణీకి కొత్త విధి విధానాలను ఈనెల 4న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆ మేరకు కొత్త విధి విధానాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ఈనెల 6న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసింది. ఈ విధి విధానాల ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలతోపాటు అదనంగా కేటాయించిన జలాలను ప్రాజెక్టులవారీగా పంపిణీ చేసి, రెండు రాష్ట్రాల వాటాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చాలి. విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకూ విస్తృతార్థం ఇస్తూ.. పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులుగా కూడా వర్గీకరించింది. ఈ విధివిధానాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. -
AP: కృష్ణాజలాలపై హైలెవల్ మీటింగ్
సాక్షి, గుంటూరు: కృష్ణాజలాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జలాలపై కేంద్రం తాజా విధివిధానాల జారీ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఈ సమావేశం నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. నదీజలాల పంపిణీపై గతంలో ఇచ్చిన కేటాయింపులపై ఈ సందర్భంగా సమగ్రంగా చర్చించారు సీఎం జగన్. అంతేకాదు.. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలనే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. KWDT-2 తీర్పుద్వారా.. మిగులు జలాల కేటాయింపుల్లోనూ నష్టం జరిగిన అంశంపైనా ఈ భేటీలో చర్చించారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమని, రాష్ట్ర విభజన చట్టాన్ని మీరి ఈ మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని, ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్ ఉండగా కూడా గెజిట్ విడుదలచేశారని అధికారులు ప్రస్తావించారు. 2002కు ముందు చేసిన ట్రైబ్యునల్ కేటాయింపులను, పంపకాలను పునఃపరిశీలించరాదని చట్టం చెప్తున్నా.. దీనికి విరుద్ధంగా కేంద్రం విధివిధానాలు చేసిందని అధికారులు వివరించారు. దీంతో.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని.. ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ భేటీలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు, పలువురు న్యాయ నిపుణులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: కృష్ణా జలాలపై ప్రధానికి సీఎం జగన్ లేఖ -
కృష్ణాజలాలపై న్యాయ పోరాటం చేస్తాం: అంబటి రాంబాబు
-
‘బ్రిజేష్’ విధానాలు సరికాదు.. కృష్ణా జలాలపై న్యాయ పోరాటం: మంత్రి అంబటి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కృష్ణా జలాల పునఃపంపిణీని ఆపేయాలని కోరామని, ఈ మేరకు ప్రధానికి సీఎం జగన్ లేఖ రాశారన్నారు. ‘‘రాష్ట్రానికి నష్టం జరిగే విధానాన్ని మేం ఒప్పుకోం. కృష్ణా జలాలపై న్యాయ పోరాటం చేస్తాం. కృష్ణా జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. కొత్తగా విధి విధానాలు రూపొందించడానికి ఒప్పుకోం. ఏపీకి రావాల్సిన ప్రతి నీటిబొట్టును తీసుకుంటాం. అన్యాయంగా తీసుకెళ్తామంటే ఒక్క నీటిబొట్టును కూడా వదులుకోం. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే అసత్య కథనాలకు మేం భయపడం. సీఎం జగన్‌పై బురదచల్లడమే లక్ష్యంగా రామోజీ, రాధాకృష్ణ పనిచేస్తున్నారు’’ అంటూ మంత్రి అంబటి మండిపడ్డారు. చదవండి: కృష్ణా జలాలపై ఏపీ హక్కులను పరిరక్షించండి -
కృష్ణా జలాలపై న్యాయ పోరాటం చేస్తాం
-
కృష్ణా జలాలపై ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ
-
ఆ 811 టీఎంసీలు.. ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా ట్రిబ్యునల్–1 (బచావత్ ట్రిబ్యునల్) గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలను.. తిరిగి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అంతర్రాష్ట నదీ వివాదాల చట్టం (ఐఎస్ఆర్డీఏ)–1956లోని సెక్షన్ 3, సెక్షన్ 5(1), 12ల కింద జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2కు మరిన్ని విధి విధానాలను జారీ చేస్తూ శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తే, దానికి ప్రతిగా నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవడానికి గతంలో బచావత్ ట్రిబ్యునల్ వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఈ నీటిని సైతం రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని కేంద్రం తాజా విధివిధానాల్లో స్పష్టం చేసింది. ఈ క్రమంలో 80 టీఎంసీల్లో ఏ రాష్ట్రం వాడుకోని 45 టీఎంసీలను కృష్ణా ట్రిబ్యునల్–2 కొత్తగా రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. దీంతో మొత్తంగా 856 టీఎంసీల కృష్ణా జలాలు ఉభయ రాష్ట్రాల మధ్య పంపిణీ కానున్నాయి. రెండు రాష్ట్రాలకు నీటి పంపకాలపై తుది నివేదిక సమర్పించడానికి గతంలో కృష్ణా ట్రిబ్యునల్–2కు ఉన్న గడువును 2024 మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది. ఇప్పుడు అదనపు విధివిధానాలను ప్రకటించినా.. గడువు పొడిగింపు ఏదీ వెల్లడించలేదు. దీనితో వచ్చే ఏడాది మార్చి 31లోగా ట్రిబ్యునల్ తుది నివేదిక ఇవ్వాల్సి ఉండనుంది. ఇక ప్రాజెక్టులన్నింటికీ కేటాయింపులు తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణం పూర్తైన ప్రాజెక్టులతోపాటు నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టులకు సైతం ప్రాజెక్టుల వారీగా కృష్ణా జలాలను పంపిణీ చేయాలని తాజాగా కృష్ణా ట్రిబ్యునల్–2కు కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89లోని క్లాజులు 89(ఏ), 89(బీ)లోని ‘ప్రాజెక్టుల వారీగా’ అనే పదానికి ఈ మేరకు విస్తృత అర్థాన్నిస్తూ తాజా గెజిట్ నోటిఫికేషన్లో నిబంధన చేర్చింది. దీంతో తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులకు సైతం ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరిపే అవకాశం ఉంది. -
Fact Check: గురివింద కలగన్నారు..!
రాష్ట్రంలో ఏం జరిగినా, రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ ఏ అంశం చర్చకు వచి్చనా.. వెంటనే అందులో లోపాలంటూ దుష్ప్రచారం చేయడం, వాటిని సీఎం జగన్‌కు అంటగట్టడం ఈనాడు రామోజీకి నిత్యకృత్యమైపోయింది. తమ ఇషు్టడైన చంద్రబాబు అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోవడంతో సదరు రామోజీకి ఈ ప్రభుత్వంపై మరింత అక్కసు పెరిగిపోయింది. ఇది ప్రతిరోజూ ఈనాడులో కనిపిస్తూనే ఉంది. ఎలాగైనా సరే ప్రజలను తప్పుదోవ పట్టించి, ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నదే ధ్యేయంగా రామోజీ ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని భుజానికెత్తుకున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించిన అంశాలను తానే దగ్గరుండి స్వయంగా చూసినట్లు కలగని ఓ తప్పుడు కథనాన్ని అచ్చేశారు. సాక్షి, అమరావతి: ఎద్దు ఈనిందంటే దూడను గాటికి కట్టేయమన్నట్లుగా ఉన్నాయి రామోజీరావు తెలివితేటలు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఒకటైతే.. మరొకటిగా ఊహించుకుని.. అభూత కల్పనలతో సీఎం వైఎస్ జగన్‌పై బురదజల్లుతూ నీతి మాలిన రోత రాతలను యథావిధిగా అచ్చేశారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించిన మరిన్ని విధి విధానాలను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ఆ విధి విధానాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునః సమీక్షించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లుగా కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ కూడా బుధవారం వెల్లడించలేదు. కానీ.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃసమీక్షించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని.. దీని వల్ల దశాబ్దాల తరబడి రాష్ట్రానికి ఉన్న హక్కులను మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. దీనిపై ఏ వేదికపై కూడా సీఎం జగన్ నోరు మెదపక పోవడం వల్ల రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతోందంటూ ‘కృష్ణా జలాలపై పునఃసమీక్ష’ శీర్షికతో ‘ఈనాడు’లో కథనాన్ని అచ్చేశారు. ఆ కథనంలో సీఎం జగన్‌పై రామోజీరావు అక్కసు తప్ప.. వీసమెత్తు నిజం లేదు. అసలు నిజం ఏమిటంటే.. ► విభజన తర్వాత 2014 జూలై 14న అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూఏ)–1956లో సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ 545/2015ను దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విని్పంచడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించిన తెలంగాణ సర్కార్ ఆ రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ► తెలంగాణ కోరిన విధంగా సెక్షన్–3 కింద కృష్ణా జలాలను పంపిణీ చేస్తే.. అది చట్టవిరుద్ధమని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తేల్చిచెబుతూ 2021 ఆగస్టు 17న.. 2022 జూన్ 25న సీఎం వైఎస్ జగన్ లేఖలు రాశారు. ► ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌లతో సీఎం వైఎస్ జగన్ సమావేశమైన ప్రతి సందర్భంలోనూ.. తెలంగాణ సర్కార్ కోరిన విధంగా సెక్షన్–3 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన కృష్ణా జలాలను పునఃసమీక్షించడానికి అవకాశమే లేదని స్పష్టం చేస్తూ వస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని గుర్తు చేస్తూ.. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని తేల్చిచెబుతూ వస్తున్నారు. ► రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి కేడబ్ల్యూడీటీ–2కు కేంద్ర మంత్రివర్గం ప్రతిపాదించిన మరిన్ని విధి విధానాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. వాటిపై స్పష్టత వచ్చాక.. రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ► కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రిని కోరేందుకు సీఎం వైఎస్ జగన్ గురువారం ఢిల్లీకి వెళ్లారు. -
ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీ, టీఎస్ మధ్య..
సాక్షి, ఢిల్లీ: దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక, బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి మీడియాకు కేటినెట్ నిర్ణయాలకు వెల్లడించారు. కేబినెట్ నిర్ణయాలు ఇవే.. ►ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని KWDT-2ట్రిబ్యునల్ కు కేంద్రం ఆదేశం. ప్రాజెక్ట్‌ల వారీగా నీటిని కేటాయించాలని ఆదేశం. ► ఉజ్వల గ్యాస్ సిలిండర్లపై మరో రూ.100 సబ్సిడీకి ఆమోదం. ► సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం. రూ.889 కోట్లో వర్సిటీ ఏర్పాటు. ► తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆమోదం. The government has raised subsidy amount for Pradhan Mantri Ujjwala Yojana beneficiaries from Rs 200 to Rs 300 per LPG cylinder: Union minister Anurag Thakur during a briefing on Cabinet decisions pic.twitter.com/Dvf7wXtXQT — ANI (@ANI) October 4, 2023 ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన మూడు అంశాలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పసుపు బోర్డు, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు జరుగుతుంది. పసుపు బోర్డు కోసం రైతులు ఎన్నో ఏళ్లుగా ఆందోళన చేస్తున్నారు. జాతీయ పసుపు బోర్డు కోసం రైతులు చాలా రోజులుగా పోరాటం చేశారు. ఈరోజు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 12 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి మన దేశంలో జరుగుతోంది అని అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలపై పరిష్కారం చేశాం. విభజన చట్టం సెక్షన్-89కి లోబడే ఈ నిర్ణయం తీసుకున్నాం. ట్రిబ్యునల్ ప్రాజెక్ట్‌లవారీగా నీటి కేటాయింపులను చేస్తుంది. సొలిసిటర్ జనరల్ సూచనలతో కేంద్రం చర్యలు తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రానికి గతంలో 800 టీఎంసీలు కేటాయించారు. 2013లో ట్రిబ్యునల్ రిపోర్టు వచ్చినా, గెజిట్ కాలేదు. 2015లో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసింది. తాజాగా నదీ జలాల అంశం పరిష్కారం కానుంది అని అన్నారు. దాదాపు 900 కోట్ల రూపాయలతో ములుగులో సమ్మక్క సారక్క సెంట్రల్ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం చేస్తాం. తెలంగాణ గిరిజనుల్లో 40 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. గిరిజనుల బాగు కోసమే ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలపై పరిశోధన జరుగుతుంది. Government of India has notified the establishment of the National Turmeric Board. This Board will help increase awareness and consumption of turmeric and develop new markets internationally to increase exports. — ANI (@ANI) October 4, 2023 -
కొత్త ట్రిబ్యునల్‌పై మాట నిలబెట్టుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య పునఃపంపకాలకు సంబంధించి గత అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇచ్చిన హామీ మేరకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. కృష్ణా జలాల్లో ప్రస్తుతం ఉన్న వాటాలను సవరించి రెండు తెలుగు రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిన తాత్కాలిక కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన మంత్రి హరీశ్‌రావు మంగళవారం రాత్రి కేంద్రమంత్రి షెకావత్‌ను కలిశారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ కూడా పాల్గొన్నారు. కేంద్రమంత్రికి విన్నవించిన అంశాలు ఇలా.... 1) తెలంగాణలో గోదావరి బేసిన్‌లోని సీతారామ ఎత్తిపోతల పథకం, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, కాళేశ్వరం అదనపు టీఎంసీ, డా.బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్‌లకు ఆమోదముద్ర వేయాలి. 2) 2021 గెజిట్ నోటిఫికేషన్ అనంతరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి 2022లో తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌ను అందించింది. సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌ను వేగవంతం చేయాలని వినతి. 3) గోదావరి వరద జలాలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా పోలవరం ప్రాజెక్టులో భాగమైన కుడి, ఎడమ మెయిన్ కాలువలను అనుమతించిన దాని కంటే ఎక్కవగా విస్తరిస్తోంది. కుడి, ఎడమ మెయిన్ కెనాల్ విస్తరణ ద్వారా 493 టీఎంసీల కేటాయింపులకు వ్యతిరేకంగా ఏపీ దాదాపు 1500 టీఎంసీల సామర్థ్యాన్ని సృష్టిస్తోంది. ఇది గోదావరి మిగులు జలాల్లో తెలంగాణ వాటాపై ప్రభావం చూపుతుంది. అంతేగాక ఆమోదం లేని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెంకటనగరం ప్రాజెక్టులను ఎడమ కాలువపై, చింతలపూడి ఎత్తిపోతల పథకం (మొదటి దశ – రెండవ దశ), గోదావరి–పెన్నార్ లింక్ వంటి అనేక ప్రాజెక్టులను కుడి కాలువపై నిర్మిస్తోంది. కుడి, ఎడమ కాలువ అక్రమ విస్తరణను, ఈ అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో జోక్యం చేసుకొని నిర్మాణం చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలి. 4) కృష్ణా జలాల్లో సమానమైన కేటాయింపుల కోసం కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ అనేకసార్లు అభ్యర్థించింది. ట్రిబ్యునల్ నిర్ణయం పెండింగ్‌లో ఉన్నందున తెలంగాణ, ఏపీ మధ్య ప్రస్తుత నీటి సంవత్సరం నుంచి ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకునే వరకు నీటి భాగస్వామ్య నిష్పత్తిని 50:50కి సవరించాలి. ట్రిబ్యునల్‌పై త్వరలోనే నిర్ణయం చేస్తామన్నారు : మంత్రి హరీశ్‌రావు కేంద్రమంత్రి షెకావత్‌తో భేటీ అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఇచ్చిన మాట వాస్తవమేనని కేంద్రమంత్రి వెల్లడించారన్నారు. ఈ అంశంపై అధికారులతో సంప్రదించి నిర్ణయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వీటితో పాటు ఏపీ చేపట్టిన పోలవరం కుడి, ఎడమ కాలువల అక్రమ విస్తరణ, డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తీసుకొనేలా చేపట్టిన పనులతో గోదావరి జలాల్లో రాష్ట్రానికి ఉన్న హక్కులను తెలంగాణ కోల్పోతున్న అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. -
వివాదాల ముగింపునకు సిద్ధం.. నేడు కృష్ణాబోర్డు సర్వసభ్య సమావేశం
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు ముగింపు పలికేందుకు కృష్ణా బోర్డు సిద్ధమైంది. అనుమతి లేని ప్రాజెక్టులే ప్రధాన అజెండాగా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ అధ్యక్షతన 17వ సర్వ సభ్య సమావేశాన్ని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలతోపాటు బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు, బడ్జెట్, 2023–24 నీటి సంవత్సరంలో జలాల పంపిణీతో సహా 21 అంశాలతో అజెండాను ఖరారు చేసింది. కృష్ణా తాగు నీటి సరఫరా పథకం ఒకటి, రెండు, మూడు దశల ద్వారా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాలువ కింద ప్రస్తుతం తెలంగాణ సర్కారు ఆయకట్టుకు నీటిని అందిస్తోంది. ఇందుకోసం నాగార్జున సాగర్ జల విస్తరణ ప్రాంతంలో రూ.1,450 కోట్లతో సుంకిశాల ఇన్‌టేక్ వెల్ ప్రాజెక్టును తెలంగాణ చేపట్టింది. దీనిపై ఏపీ ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో అభ్యంతరం తెలిపింది. సుంకిశాల ఇన్‌టేక్ వెల్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను నిలిపివేయాలని బోర్డును కోరింది. నీటి కేటాయింపులు లేనందున పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతిని కూడా సీడబ్ల్యూసీ తిరస్కరించింది. కృష్ణా ట్రిబ్యునల్–2 కేటాయించిన 4 టీఎంసీలను వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి కాలువను చేపట్టడంపై తెలంగాణ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయ్యాకే పనులు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆర్డీఎస్ను మరోసారి ప్రస్తావించేందకు తెలంగాణ సిద్ధమైంది. గెజిట్ నోటిఫికేషన్ అమలయ్యేనా? బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్నెళ్లలోగా దాన్ని అమలు చేయాలని పేర్కొంది. మరో ఆర్నెల్లు పొడిగించినా నోటిఫికేషన్ అమలుపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. దీనిపై రెండు రాష్ట్రాలను ఒప్పించేందుకు బోర్డు సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రానికి ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల జలాల్లో 66 శాతం (512 టీఎంసీలు) ఏపీ, 34 శాతం (299 టీఎంసీలు) తెలంగాణ వాడుకునేలా 2015 జూన్ 19న తాత్కాలిక ఒప్పందం కుదిరింది. కానీ.. సగ భాగం వాటా కావాలని తెలంగాణ డిమాండ్ చేయడంతో నీటి పంపిణీపై కూడా బోర్డు చర్చించనుంది. హిందీలో కార్యకలాపాలా? కేంద్రంతో బోర్డు ఉత్తర ప్రత్యుత్తరాలు, కార్యకలాపాలు హిందీ భాషలోనే జరగాలని కేంద్ర జల్ శక్తి శాఖ కోరుతోంది. కానీ.. రెండు రాష్ట్రాల అధికారులకు హిందీ భాషలో ప్రావీణ్యం లేదు. దీనిపై బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర జల్ శక్తిశాఖ అనుమతి లేకుండా బోర్డులో పనిచేస్తున్న సిబ్బందికి మూలవేతనంలో 25శాతం ప్రోత్సాహకంగా ఇచ్చిన నిధులు రికవరీ చేయాలన్న కేంద్రం ఆదేశాలపైనా చర్చించనున్నారు. -
పునఃపంపిణీ కుదరదు.. తేల్చిచెప్పిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పునఃపంపిణీ చేయడం కుదరదని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–2) తేల్చి చెప్పింది. నిర్దిష్టమైన కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీటి కేటాయింపుపై మాత్రమే విచారణ చేస్తామని స్పష్టం చేసింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలను కేటాయిస్తూ తెలంగాణ జారీ చేసిన జీవో రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్(ఐఏ)పై విచారణను వచ్చే నెల 13, 14న మరోసారి చేపడతామని పేర్కొంది. ఈ ఐఏపై ట్రిబ్యునల్ శుక్రవారం విచారణ జరిపింది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం(ఐఎస్‌ఆర్‌డబ్ల్యూఏ)–1956 సెక్షన్–3, 5ల ప్రకారం ఇప్పటికే నీటిని పంపిణీ చేశామని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం కృష్ణా జలాల కేటాయింపులో తమ పరిధి పరిమితంగా ఉందని గుర్తు చేసింది. నిర్దిష్టంగా నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయడమే తమ బాధ్యతని స్పష్టం చేసింది. నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల జోలికి వెళ్లబోమని సంకేతాలిచ్చింది. తెలంగాణ సగం వాటా కోరడం చట్టవిరుద్ధం బచావత్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీం కోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షిస్తే న్యాయ ఉల్లంఘనకు పాల్పడినట్లే. అందుకే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కూడా ఆ తీర్పు జోలికి వెళ్లలేదని న్యాయ, సాగునీటి రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల్లో సగ భాగం కావాలని తెలంగాణ కోరడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు యధాతథంగా కొనసాగుతాయని, అదనంగా కేటాయించిన 194 టీఎంసీలపైనే విచారణ చేస్తుందని వివరిస్తున్నారు. 194 టీఎంసీల కేటాయింపుపైనే విచారణ కృష్ణా జలాల పంపిణీకి 1969లో జస్టిస్ బచావత్ అధ్యక్షతన కేంద్రం ట్రిబ్యునల్ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–1)ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు పంపిణీ చేస్తూ 1976 మే 27న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లో 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. కృష్ణా జలాల పునఃపంపిణీకి 2004 ఏప్రిల్ 2న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ఈ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30న ప్రాథమిక నివేదిక, 2013 నవంబర్ 29న తుది నివేదికను కేంద్రానికి ఇచ్చింది. ఈ నివేదికలను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో సవాల్ చేయడంతో వాటిని కేంద్రం అమల్లోకి తేలేదు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు 811 టీఎంసీలను యధాతథంగా కొనసాగించింది. అదనంగా 65 శాతం లభ్యత ఆధారంగా 194 టీఎంసీలను కేటాయించింది. అంటే మొత్తం 1,005 టీఎంసీలను కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 1,005 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంచే బాధ్యతను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే కేంద్రం అప్పగించింది. యధాతథంగా కొనసాగిస్తున్న 811 టీఎంసీలు పోను, ఇప్పుడు 194 టీఎంసీల పైనే విచారణ జరుపుతోంది. -
ఇక నీటి కేటాయింపుల్లేవ్
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులను జరపమని, ప్రాజెక్టుల వారీగా ఇప్పటికే నిర్దిష్ట కేటాయింపులు జరగని పక్షంలో ఆ మేరకు కేటాయింపులు మాత్రమే చేస్తామని బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 మరోసారి స్పష్టం చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూ) 1956లోని సెక్షన్ –3, 5 కింద కృష్ణా జలాల కేటాయింపులను ట్రిబ్యునల్ ఇప్పటికే ముగించిందని తెలిపింది. ఏపీ పున ర్విభజన చట్టంలోని సెక్షన్ 89 కింద ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిపేందుకు పరిమిత అవకాశాలు మాత్రమే ఉన్నాయని ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేష్‌కుమార్ వెల్లడించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు జరుపుతూ 2022లో తెలంగాణ జారీ చేసిన జీవో నెం.246ను సవాలు చేస్తూ ఏపీ దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్‌పై శుక్రవారం ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యునల్–2 విచారణ నిర్వహించింది. మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలు, కాళేశ్వరం ద్వారా గోదావరి జలాల తరలింపులకు బదులుగా మరో 45 టీఎంసీలను కలిపి మొత్తం 90 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి పథకానికి తెలంగాణ కేటాయించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం ట్రిబ్యునల్‌కు ఉందని ఏపీ న్యాయవాది జయదీప్ గుప్తా వాదనలు వినిపించగా, నీటి కేటాయింపులపై నిర్ణయాధికారం తమకు లేదని బ్రిజేష్ కుమార్ ఆయన వాదనలను తోసిపుచ్చారు. అపెక్స్ కౌన్సిల్‌కు నిర్ణయాధికారం లేదని, కేవలం మధ్యవర్తి పాత్రపోషించాల్సి ఉంటుందని పున ర్విభజన చట్టంలోని సెక్షన్ 89ను ఉటంకిస్తూ ఏపీ న్యాయవాది పేర్కొనగా, అపెక్స్ కౌన్సిల్ విషయాన్ని ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయవచ్చు అని బ్రిజేష్ తెలిపారు. ప్రాజెక్టుల వారీ గా కేటాయింపులు జరపనిపక్షంలో ఆపరేషనల్ ప్రొ టోకాల్స్‌పై నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదంటూ తెలంగాణ తరఫున సాక్షిగా ఉన్న చేతన్ పండిత్ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఏపీ ఆరోపణను తోసిపుచ్చిన తెలంగాణ న్యాయవాది మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ 89.15 టీఎంసీలను వినియోగిస్తున్నట్టు జీవోలో పేర్కొందని, వాస్తవానికి 175 టీఎంసీలను వాడుతోందని ఏపీ న్యాయవాది పేర్కొన్నారు. అయితే, 44టీఎంసీలను మాత్రమే మైనర్ ఇరిగేషన్ ద్వారా వాడుతున్నామని, మిగిలిన 45టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పునః కేటాయింపులు జరిపినట్టు తెలంగాణ కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది. కేఆర్ఎంబీ, కృష్ణా బోర్డుకు ఈ ప్రాజెక్టు డీపీఆర్‌లను తె లంగాణ సమర్పించలేదని ఏపీ చేసిన ఆరోపణను తెలంగాణ న్యాయవాది తోసిపుచ్చారు. ఇప్పటికే డీపీఆర్‌ను సమర్పించామని, పరిశీలన దశలో ఉందని అన్నారు. కాగా, పాలమూరు ఎత్తిపోతల పనులను కొనసాగిం చేందుకు ఇటీవల సుప్రీం కోర్టు అనుమతించిన నేపథ్యంలో.. ప్రాజెక్టు తాజా పురోగతిపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేఆర్ఎంబీ ఆదేశించింది. -
పాత పద్ధతిలోనే కృష్ణా జలాల పంపిణీ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను 2022–23 సంవత్సరంలోనూ ఏపీ, తెలంగాణకు పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో పాత విధానంలోనే నీటి పంపిణీకి అంగీకరించిన తెలంగాణ సర్కారు.. ఆ తర్వాత అడ్డం తిరిగి సగం వాటా కావాలని డిమాండ్ చేయడంతో కేంద్ర జల్ శక్తి శాఖ ఈ స్పష్టతనిచ్చింది. 2015 జూన్ 19న రెండు రాష్ట్రాల అంగీకారంతో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు పంపిణీ చేసేలా తాత్కాలిక సర్దుబాటు చేశామని పేర్కొంది. 2016–17లో ఇదే విధానానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపింది. 2017 నుంచి 2022 వరకు ఇదే విధానంలో నీటిని వినియోగించుకున్నాయని గుర్తు చేసింది. ఈ నీటి సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసే వరకూ ఈ విధానంలోనే రెండు రాష్ట్రాలకు జలాలను పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసినట్లు బోర్డు అధికారవర్గాలు తెలిపాయి. -
కృష్ణా నీటికి తెలంగాణ కాకి లెక్కలు
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో లేని వాటాను ఉన్నట్లు చూపించి, వాటినే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయించి, ఆ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి కోరుతూ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి తెలంగాణ దరఖాస్తు చేసింది. తెలంగాణ తీరుపై ఏపీ అభ్యంతరం తెలిపింది. నీళ్లే లేని ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని సీడబ్ల్యూసీని డిమాండ్ చేసింది. శ్రీశైలం జలాశయం నుంచి 60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించి.. 12.30 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను తెలంగాణ ప్రభుత్వం 2015లో చేపట్టింది. అనుమతి లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అపెక్స్ కౌన్సిల్లో ఆమోదం పొందకపోతే ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోనివ్వబోమని తెలంగాణకు కృష్ణా బోర్డు తేల్చిచెప్పింది. మరోపక్క ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందన్న ఏపీ ప్రభుత్వం, రైతుల వాదనతో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఏకీభవించి, తక్షణమే ఆ ప్రాజెక్టు పనులు ఆపేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేసిన తెలంగాణ సర్కార్‌కు గత డిసెంబర్ 12న రూ.920.85 కోట్ల జరిమానా విధించింది. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకున్నాకే పనులు చేపట్టాలని నిర్దేశించింది. నీళ్లే లేవు.. కేటాయింపులెలా..? సీడబ్ల్యూసీకి చేసిన దరఖాస్తులో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులపై తెలంగాణ అధికారులు కాకిలెక్కలు వేశారు.– పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగాను.. సాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 45 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వాడుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ నీటిలో రెండు రాష్ట్రాల వాటా తేల్చే అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోంది. ఇప్పుడు ఈ 45 టీఎంసీలూ తెలంగాణకే దక్కుతాయని వాదిస్తోంది. చిన్న నీటి పారదుల విభాగంలో తెలంగాణకు 89.15 టీఎంసీల కేటాయింపు ఉండగా.. ఆ రాష్ట్రం 175.54 టీఎంసీలను వాడుకుంటోంది. అయినా చిన్న నీటి పారుదల విభాగంలో తమ వాటాలో ఇంకా 45.6 టీఎంసీల మిగులు ఉందంటోంది. ఈ రెండూ కలిపి 90.6 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డికి కేటాయిస్తూ గత ఆగస్టు 18న తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ట్రిబ్యునల్‌ను అపహాస్యం చేయడమేనని న్యాయ నిపుణులు అంటున్నారు. తీవ్ర అభ్యంతరం తెలిపిన ఏపీ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు తెలంగాణ సర్కారు లేని నీటిని కేటాయించిందంటూ సీడ బ్ల్యూసీకి ఏపీ జల వనరుల శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సాగర్‌కు ఎగువన 45 టీఎంసీల కృష్ణా జలాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునే అంశం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పరిధిలో ఉందని వివరించారు. చిన్న నీటిపారుదల విభాగంలో కేటాయింపులకంటే ఇప్పటికే 86.39 టీఎంసీలను అధికంగా వాడుకుంటున్న తెలంగాణ.. వారికి కేటాయించిన నీటిలో 45 టీఎంసీల మిగులు ఉందని ఎలా వాదిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశాన్ని సీడబ్ల్యూసీకి వివరిస్తూ.. నీళ్లే లేని ఆ ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితు ల్లోనూ అనుమతి ఇవ్వొద్దని గట్టిగా కోరారు. హక్కులు తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు నీరే లేకుండా 2015లో తెలంగాణ అక్రమంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను అడ్డుకోవడంలో నాటి టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కారుకు దొరికిపోయిన చంద్రబాబు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రజల హక్కులను ఆ రాష్ట్రానికి తాకట్టు పెట్టారు. దీన్ని నిరసిస్తూ.. అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులో జలదీక్ష చేశారు. అయినా టీడీపీ సర్కారు స్పందించకపోవడంతో రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2016 సెప్టెంబరు 21న కేంద్రం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపేయాలని కనీసం డిమాండ్ చేసే సాహసం కూడా చంద్రబాబు చేయలేకపోయారు. హక్కుల పరిరక్షణ కోసం సీఎం వైఎస్ జగన్ పోరాటం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం పోరాటం ప్రారంభించారు. అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలోనూ ఇదే వాణిని విన్పించారు. దాంతో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస, కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), నెట్టెంపాడు (సామర్థ్యం పెంపు), మిషన్ భగీరథను నిలిపివేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు తెలంగాణ సర్కారును ఆదేశించాయి. అనుమతి తీసుకున్నాకే ఈ ప్రాజెక్టుల పనులు చేపట్టాలని తెలంగాణ సర్కారుకు నిర్దేశించాయి. -
ఏకాభిప్రాయంపై చివరి ప్రయత్నం
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చివరి ప్రయత్నంగా ఈనెల 3న గోదావరి బోర్డు, 11న కృష్ణా బోర్డు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకుంటే కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తెచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలని బోర్డులు నిర్ణయించాయి. కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు చరమగీతం పాడేందుకు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని 2020 అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో సీఎం జగన్ కోరారు. తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేయడం వల్ల ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా జలాలు వృథాగా కడలిపాలయ్యాయి. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కారు హరిస్తుండటంపై సుప్రీం కోర్టును ఆంధ్రప్రదేశ్ ఆశ్రయించడంతో కేంద్రంలో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తెలంగాణ సహాయ నిరాకరణ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను ఆర్నెళ్లలోగా కృష్ణా, గోదావరి బోర్డులకు రెండు రాష్ట్రాలు అప్పగించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు నోటిఫికేషన్ జారీ రోజు నుంచి ఆర్నెళ్లలోగా అనుమతి పొందాలి. లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగానికి అనుమతించరు. బోర్డుల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి 60 రోజుల్లోగా ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీగా బోర్డుల ఖాతాల్లో జమ చేయాలి. అయితే ఒకేసారి కాకుండా ఎప్పటికప్పుడు నిధులను సమకూర్చుతామని రెండు రాష్ట్రాలు బోర్డులకు స్పష్టం చేశాయి. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. ఈ క్రమంలో తన భూభాగంలో శ్రీశైలం, సాగర్ విభాగాలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా తెలంగాణ సర్కార్ మాత్రం తన భూభాగంలోని విభాగాలను అప్పగించబోమని స్పష్టం చేసింది. ఏకాభిప్రాయం సాధ్యమేనా..? బోర్డుల నోటిఫికేషన్ అమలుకు తొలుత కేంద్రం నిర్దేశించిన గడువు గతేడాది జనవరి 15తో పూర్తయింది. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గడువును మరో ఆర్నెళ్లు పొడిగిస్తూ జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో విభజన చట్టం 11వ షెడ్యూల్లో పేర్కొన్న హంద్రీ–నీవా, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కల్వకుర్తి(పాతది), నెట్టెంపాడు(పాతది) ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోవాలని ఆదేశించింది. కేంద్రం పొడిగించిన గడువు కూడా గత జూలై 15తోనే పూర్తయింది. తెలంగాణ సర్కార్ కృష్ణా బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి, భక్తరామదాస, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోలేదు. గోదావరి బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని రెండు రాష్ట్రాలు కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) డీపీఆర్‌లు సమర్పించాయి. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు సంబంధించి ఆర్ఎంసీ(రిజర్వాయర్ల మేనేజ్మెంట్ కమిటీ) రూపొందించిన విధి విధానాలను ఆంధ్రప్రదేశ్ ఆమోదించగా తెలంగాణ సర్కార్ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చివరి ప్రయత్నంగా సర్వ సభ్య సమావేశాలను నిర్వహించేందుకు బోర్డులు సిద్ధమయ్యాయి. -
కృష్ణా జలాలపై తెలంగాణ సర్కారు తొండాట
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం తొండాటకు దిగుతోంది. జలాల్లో వాటా నుంచి క్యారీ ఓవర్ జలాల వినియోగం వరకు అన్ని వివాదాల పరిష్కారానికి కృష్ణా బోర్డు సమావేశాల్లో పలు మార్లు అంగీకరించి.. ఇప్పుడు అడ్డం తిరిగింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాల్లో సగం వాటా కేటాయించాలని, క్యారీ ఓవర్ జలాలను వాడుకోవడానికి అనుమతించాలని కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు తెలంగాణ ఈఎన్సీ సి.మురళీధర్ లేఖ రాశారు. ఏడు అంశాలను వచ్చే నెల 11న నిర్వహించే కృష్ణా బోర్డు 17వ సర్వ సభ్య సమావేశం అజెండాలో చేర్చాలని కోరారు. ఇప్పటికే పరిష్కారమైన ఈ వివాదాలను తెలంగాణ సర్కార్ తిరగదోడటంచర్చనీయాంశంగా మారింది. కేంద్రం నేతృత్వంలో వాటాలపై ఒప్పందం బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా ఏపీకి 512.04 (66 శాతం), టీఎంసీలు, తెలంగాణకు 298.96 (34 శాతం) టీఎంసీల పంపిణీ జరిగింది. ఈమేరకు జరిగిన తాత్కాలిక ఒప్పందంపై 2015 జూలై 19న ఏపీతోపాటు తెలంగాణ కూడా సంతకం చేసింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ ఇదే ఒప్పందం అమల్లో ఉంటుందని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చెప్పింది. ఈ ఏడాది మే 10న జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలోనూ ప్రస్తుత నీటి సంవత్సరంలో 66 : 34 నిష్పత్తిలో పంపిణీకి ఏపీ, తెలంగాణ ఆమోదించాయి. కానీ, ఇప్పుడు దానికి తాము అంగీకరించబోమని, జలాల్లో 50 శాతం వాటా కావాలని తెలంగాణ కోరుతోంది. ఎప్పటి లెక్కలు అప్పటికే ఒక నీటి సంవత్సరంలో వాడుకోని వాటా జలాలను (క్యారీ ఓవర్) మరుసటి ఏడాది వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ కోరింది. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం.. ఒక ఏడాదిలో నీటి లెక్కలు ఆ ఏడాదితోనే ముగుస్తాయని, మరుసటి ఏడాది వాడుకోవడానికి అవకాశం ఇస్తే ఏపీ హక్కులను హరించినట్లవుతుందని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీంతో క్యారీ ఓవర్ జలాలను వాడుకోవడానికి అనుమతించే ప్రశ్నే లేదని కృష్ణా బోర్డు తేల్చి చెప్పింది. వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ ఆ వివాదాన్ని తెలంగాణ తెరపైకి తెస్తోంది. ఊ అని.. ఊహూ అంటే ఎలా? హైదరాబాద్ తాగునీటికి వినియోగిస్తున్న నీటిలో 20 శాతాన్ని లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ కృష్ణా బోర్డును కోరుతోంది. తాగు నీటిలో 20 శాతం వాడుకోగా మిగిలిన 80 శాతం మురుగు నీటి కాలువల ద్వారా మళ్లీ తెలంగాణలో ఆయకట్టుకే చేరుతోందని ఏపీ చెబుతోంది. హైదరాబాద్ తాగునీటికి వాడుతున్న జలాలను వంద శాతం లెక్కించాలని పేర్కొంది. దీనికి కృష్ణా బోర్డు కూడా ఏకీభవించింది. ఇప్పుడు తెలంగాణ మళ్లీ పాత పల్లవే అందుకుంది. రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) డిజైన్ లోపాలను సరిదిద్దుకోకుండా ఆధునికీకరణ కోసం మంకుపట్టు పడుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువన టెలీమీటర్లను ఏర్పాటు చేసి ఏపీ వాడుతున్న ప్రతి నీటి బొట్టూను కృష్ణా బోర్డు లెక్కిస్తున్నప్పటికీ, ఇంకా టెలీమీటర్లు ఏర్పాటు చేయలేదని తెలంగాణ ఆరోపిస్తోంది. ఒక వైపు అనుమతి లేకుండానే పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్త రామదాస, మిషన్ భగీరథ, కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), నెట్టెంపాడు (సామర్థ్యం పెంపు) తదితర ప్రాజెక్టులు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం.. మరో వైపు నీటి కేటాయింపులు ఉన్న ఆర్డీఎస్ కుడి కాలువ పనులను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ ఏపీ చేపట్టకూడదని డిమాండ్ చేస్తోంది. -
కృష్ణా జలాల విడుదల ఆపండి
సాక్షి, చెన్నై: తమకు తెలుగుగంగ జలాల విడుదలను ఆపాలని తమిళనాడు ప్రభుత్వం మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. జూలై 1వ తేదీ నుంచి నీటి సరఫరా నిలుపుదల చేసి సెప్టెంబర్‌లో విడుదల చేయాలని కోరింది. తమిళనాడు రాజధాని నగరం చెన్నైకి తాగునీటి కోసం గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆంధ్రా నుంచి కృష్ణా జలాలు పంపిణీ అవుతున్నాయి. ఈనేపథ్యంలో వారం రోజుల కిందట చెన్నై, శివారు జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలకు అన్ని రిజర్వాయర్లలోకి సమృద్ధిగా నీరు చేరింది. చెన్నైకి తాగునీరు అందించే పూండి, చోళవరం, పుళల్, సెంబరంబాక్కం, తేర్వాయ్ కండ్రిగ రిజర్వాయర్లు నిండాయి. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చెన్నైకి తెలుగుగంగ కాలువ ద్వారా కృష్ణా జలాలను సమృద్ధిగా పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది మే 8వ తేదీ నుంచి ఇప్పటివరకు 2.4 టీఎంసీల నీటిని చెన్నైకి విడుదల చేశారు. సోమ, మంగళవారాల్లో కూడా తెలుగుగంగ కాలువ ద్వారా సెకనుకు 610 ఘనపుటడుగుల నీరు చెన్నైకు చేరుతోంది. ఈ నీటిని పూండీ రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి సెంబరంబాక్కం, పుళల్ రిజర్వాయర్లకు తరలిస్తున్నారు. ప్రసుత్తం అన్ని రిజర్వాయర్లు నిండుకుండలుగా మారడంతో కృష్ణా జలాల అవసరం తగ్గింది. దీంతో జూలై 1వ తేదీ నుంచి నీటి సరఫరా నిలిపేసి సెప్టెంబర్‌లో విడుదల చేయాలని తమిళనాడు నీటిపారుదలశాఖ అధికారులు ఏపీ అధికారులకు లేఖ రాశారు. గతంలో ఎప్పుడూ నీటివిడుదల కోసం లేఖలు రాసే అధికారులు.. తొలిసారిగా నీటివిడుదలను ఆపాలని కోరుతూ లేఖ రాయడం విశేషం. -
శ్రీశైలం నీటిని తోడేస్తున్న తెలంగాణ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ సర్కార్ ఉల్లంఘనలకు అంతులేకుండా పోతోంది. నిబంధనలను మళ్లీ యథేచ్ఛగా బేఖాతరు చేస్తూ ఏపీ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. గతేడాది అవసరం లేకున్నా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలలో నీటినిల్వ కనీస మట్టం కంటే దిగువన ఉన్నప్పుడే ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేసి.. రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన కృష్ణా జలాలను ప్రకాశం బ్యారేజీ ద్వారా వృథాగా కడలిపాలు చేసింది. ఈ ఏడాది కూడా అదే రీతిలో నీటి దోపిడీ చేస్తోంది. కృష్ణా బోర్డు నుంచి అనుమతి తీసుకోకుండానే శ్రీశైలంలోకి వచ్చిన ప్రవాహాన్ని వచ్చింది వచ్చినట్లుగా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తరలిస్తోంది. రాష్ట్రంలో ప్రకాశం, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపేసిన తెలంగాణ సర్కార్.. ఏఎమ్మార్పీ ద్వారా యథేచ్ఛగా నీటిని తరలిస్తోంది. ఈ వ్యవహారంపై కృష్ణా బోర్డుకు కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి.. ప్రకాశం జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ శ్రీనివాసరెడ్డిలు ఫిర్యాదు చేశారు. వరద వస్తున్నా పెరగని నీటిమట్టం శ్రీశైలంలో సాగు, విద్యుదుత్పత్తికి కనీస నీటిమట్టం 854 అడుగులుగా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) నిర్ణయించింది. కృష్ణా బోర్డు రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ దాన్ని ఆమోదించింది. నీటి సంవత్సరం ప్రారంభమైన రోజునే అంటే ఈనెల 1న స్థానికంగా కురిసిన వర్షాలవల్ల శ్రీశైలంలోకి 862 క్యూసెక్కుల ప్రవాహం చేరింది. నీటి నిల్వ 816.8 అడుగుల్లో 38.63 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ► కృష్ణా బోర్డు నుంచి కనీసం అనుమతి తీసుకోకుండా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ ఈనెల 1న 800 క్యూసెక్కులను తరలించింది. ► ఈనెల 2న 561 క్యూసెక్కులు శ్రీశైలంలోకి చేరితే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 483 క్యూసెక్కులను తరలించింది. ► ఈనెల 9న శ్రీశైలంలోకి 4,618 క్యూసెక్కులు చేరితే.. 339 క్యూసెక్కులను.. ► ఈ నెల 10న 2,798 క్యూసెక్కులు చేరితే 1,300 క్యూసెక్కులను.. 11న 4,157 క్యూసెక్కులు చేరితే.. 1,266 క్యూసెక్కులను తెలంగాణ తరలించింది. ► తెలంగాణ దోపిడీతో శ్రీశైలంలోకి వరద ప్రవాహం చేరుతున్నా నీటి మట్టం పెరగడంలేదు. సాగర్ కుడి కాలువ నీరు నిలిపివేత ఇక నాగార్జునసాగర్‌లో సాగునీటికి కనీస నీటిమట్టం 510 అడుగులు. ప్రస్తుతం 534.9 అడుగుల్లో 177.87 టీఎంసీల నీరు ఉంది. రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువపైనే అవి ఆధారపడతాయి. ఈ హెడ్ రెగ్యులేటర్ తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉంది. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకాశం జిల్లా సీఈ శ్రీనివాసరెడ్డి కృష్ణా బోర్డుకు, సాగర్ సీఈకి లేఖ రాశారు. కానీ.. ఈనెల 1 నుంచి కుడి కాలువకు నీటి విడుదలను తెలంగాణ ప్రభుత్వం ఆపేసింది. మరోవైపు.. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే ఈనెల 1న 2,000, 2న 2,000, 3న 218, 6న 218, 7న 500, 8న 500, 9న 854, 10న 1,000, 11న 1,000 క్యూసెక్కుల చొప్పున ఏఎమ్మార్పీ నుంచి తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా తరలిస్తోంది. ఈ అంశంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామని కర్నూల్ జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరామని తెలిపారు. -
మళ్లించిన వరద నీటినీ కోటాలో కలిపేస్తారా?
సాక్షి, అమరావతి: విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో మళ్లించిన వరద జలాలనూ రాష్ట్ర కోటా (నికర జలాలు)లో కృష్ణా బోర్డు కలపడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక కమిటీ కూడా వరద నీటిని ఏ రాష్ట్రం మళ్లించినా.. వాటిని ఆ రాష్ట్ర కోటాలో కలపకూడదని స్పష్టంచేసిన విషయాన్ని గుర్తుచేసింది. వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిందని, ఈ నేపథ్యంలో.. మళ్లించిన వరద నీటిని రాష్ట్ర కోటాలో కలపడమంటే బచావత్ ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించడమేనని స్పష్టంచేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూలు, ఆరో పేరా ప్రకారం.. కృష్ణా, గోదావరి వరదలను నియంత్రించడం, విపత్తు నివారణ చర్యలు చేపట్టడం రెండు రాష్ట్రాలపై ఉందని లేఖలో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో.. కృష్ణా నదికి వరద వచ్చే రోజుల్లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా కడలిలో వరద జలాలు కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎవరు వరద నీటిని మళ్లించినా.. దాన్ని విపత్తు నివారణ చర్య కింద పరిగణించాలేగానీ కోటా కింద లెక్కించకూడదని పునరుద్ఘాటించారు. దుర్భిక్ష ప్రాంతాలకు వరద జలాల మళ్లింపు నిజానికి.. వరద జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే స్వేచ్ఛను కృష్ణా బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. అలాగే, విభజన నేపథ్యంలో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్ధారించింది. దీంతో.. బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ఇప్పటికీ అమల్లో ఉన్నందున వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ ఉద్దేశ్యంతోనే 2019లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండిపోవడంతో కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి కలిసే సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్ఆర్) ద్వారా ఏపీ సర్కార్ వరద నీటిని దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు మళ్లించింది. కోటా కింద లెక్కించొద్దు : సీడబ్ల్యూసీ కమిటీ వరద జలాలు వృథాగా కడలిలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని కోటా కింద పరిగణించకూడదని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును గతంలోనే కోరింది. దీన్ని తెలంగాణ సర్కార్ వ్యతిరేకించింది. ఈ వ్యవహారంపై అధ్యయనం చేసి 2020, జూన్‌లోగా నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని 2019లో కృష్ణా బోర్డు కోరింది. దాంతో ఈ అంశంపై అధ్యయనం చేయడానికి 2020, మార్చి 3న సీడబ్ల్యూసీ సాంకేతిక కమిటీ ఏర్పాటుచేసింది. 2020 మేలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో ఒకసారి మాత్రమే సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించింది. ఆ కమిటీ అడిగిన వివరాలన్నీ ఏపీ ఇచ్చినప్పటికీ తెలంగాణ మాత్రం ఇవ్వలేదు. దీంతో.. మళ్లించిన వరద నీటిని కోటా కింద పరిగణించాలా? వద్దా? అని 2020, అక్టోబర్ 7న కృష్ణా బోర్డు కోరింది. దీనిపై సాంకేతిక కమిటీ 2020, అక్టోబర్ 20న స్పందిస్తూ.. మళ్లించిన వరద నీటిని కోటా కింద పరిగణించకూడదని స్పష్టంచేసింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించినట్లే.. ఇక ప్రకాశం బ్యారేజీ నుంచి 2019–20లో 798.29 టీఎంసీలు, 2020–21లో 1,289, 2021–22లో 501.36 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయి. మూడేళ్లలోనూ సగటున 72 రోజులపాటు వరద ప్రవాహం సముద్రంలో కలిసింది. సీడబ్ల్యూసీ సాంకేతిక కమిటీ నివేదిక వచ్చేవరకూ ఏపీ మళ్లించిన వరద జలాల్లో 50 శాతాన్ని కోటా కింద పరిగణించాలని తెలంగాణ ప్రతిపాదనను కృష్ణా బోర్డు అంగీకరించింది. దీనిపై ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తంచేసినా.. వాటిని తోసిపుచ్చింది. 2020–21లో 22 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 11, 2021–22లో 40 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 20 టీఎంసీలను ఏపీ కోటాలో బోర్డు కలిపింది. ఇక 2021–22లో కృష్ణాలో 953 టీఎంసీల లభ్యత ఉంటే ఇందులో 66 శాతం అంటే 629 టీఎంసీలు ఏపీకి, 34 శాతం అంటే 324 టీఎంసీలు తెలంగాణకు రావాలి. ఏపీ వాడుకున్న వరద జలాల్లో 20 టీఎంసీలను నికర జలాల కోటాలో కలిపింది. లేదంటే.. ఏపీకి అదనంగా 20 టీఎంసీల జలాలు వచ్చేవే. ఇది బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించడమేనని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. -
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే గెజిట్ ప్రకటన రాలేదు
సాక్షి, న్యూఢిల్లీ: జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కృష్ణాజల వివాదాల ట్రిబ్యునల్ చేసిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారిక గెజిట్‌లో నోటిఫై చేయలేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు చెప్పారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం కింద కేంద్ర ప్రభుత్వం 2004లో జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబుగా తెలిపారు. 2010లో ఈ ట్రిబ్యునల్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా 2011లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిం దని, దీనిపై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయని వివరించారు. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించేవరకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ సిఫార్సులను అధికారిక గెజిట్‌లో ప్రకటించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ట్రిబ్యునల్ సిఫార్సులను ప్రభుత్వం అధికారికంగా గెజిట్‌లో ప్రకటించలేదన్నారు. 1.15 కోట్ల గృహాలు మంజూరు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన్–అర్బన్ (పీఎంఏవై–యూ)లో 1.15 కోట్ల గృహాలు మంజూరయ్యాయని, వాటిలో 56.2 లక్షలు పూర్తయ్యాయని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. మిగిలినవి వివిధ దశలో ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆర్థిక మద్దతుపై ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి ఏపీకి ఆర్థిక మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి వైఎ స్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం మరో ఐదేళ్లపాటు పొడిగించాలన్నారు. రాజ్యసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై మాట్లాడారు. ‘దేశంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ పరిహారాన్ని ఐదేళ్ల పాటు పొడిగించాలి. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను కేంద్రం వేగవంతం చేయాలి. రాష్ట్రానికి ఆర్థిక మద్దతు అందించడానికి ఓ వ్యవస్థ రూపొందించాలి..’ అని ఆయన పేర్కొన్నారు. -
మా నీరు మిగిలే ఉంది
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాలో మిగిలిన 171.163 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అనుతించాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల్లో 350.585 టీఎంసీలు వాడుకున్నామని పేర్కొంది. అదేవిధంగా తెలంగాణ వాటాలో 108.235 టీఎంసీలు వాడుకోగా ఇంకా 160.545 టీఎంసీలు మిగిలాయని తెలిపింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ కూడా ఇదే విధమైన ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనలు కృష్ణా బోర్డు నుంచి త్రిసభ్య కమిటీకి వచ్చాయి. గురువారం డీఎం రాయ్‌పురే అధ్యక్షతన ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సమావేశమవుతుంది. ఇప్పటిదాకా రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటి లెక్కలు తేల్చి, వాటాలో మిగిలిన నీటి కేటాయింపులుపై నిర్ణయం తీసుకోనుంది. ఈ కేటాయింపుల ఆధారంగా రబీలో ఆయకట్టుకు నీటి విడుదలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోనున్నాయి. మూడో ఏడాదీ కృష్ణాలో నీటి లభ్యత పుష్కలం కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో 2019–20, 2020–21 తరహాలోనే ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దీంతో సాగు, తాగునీటి కోసం అవసరమైన జలాలు వాడుకోవాలని, డిసెంబర్లో లెక్కలు తేల్చి.. వాటాలో మిగిలిన జలాలపై నిర్ణయం తీసుకుంటామని రెండు రాష్ట్రాలకు ఆదిలోనే కృష్ణా బోర్డు చెప్పింది. ఈ ఏడాది ప్రాజెక్టుల్లో 790.528 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు లెక్కతేలింది. ఏపీ, తెలంగాణకు 66 : 34 నిష్పత్తిలో పంపిణీ చేస్తామని బోర్డు ఆదిలోనే చెప్పింది. ఈ విధంగా ఏపీకి 521.75 టీఎంసీలు, తెలంగాణకు 260.78 టీఎంసీలు కేటాయింపు జరిగింది. ఇందులో జూన్ 1 నుంచి ఇప్పటివరకూ ఏపీ 350.585 టీఎంసీలు, తెలంగాణ 108.235 టీఎంసీలు.. మొత్తం 458.82 టీఎంసీలను వాడుకున్నాయి. ఇంకా 331.708 టీఎంసీల లభ్యత కృష్ణాలో నీటి లభ్యత ఇప్పటికీ పుష్కలంగా ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో కనీస నీటి మట్టాలకు ఎగువన 253.311 టీఎంసీలు ఉంది. జూరాలలో 5.853, పులిచింతల ప్రాజెక్టులో 38.17 టీఎంసీలు ఉంది. తుంగభద్ర డ్యామ్‌లో ఏపీ, తెలంగాణ కోటా కింద ఇంకా 24.474 టీఎంసీలు మిగిలి ఉన్నాయి. ఉభయ రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్లో మధ్య తరహా ప్రాజెక్టుల్లో 9.90 టీఎంసీలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే డిసెంబర్ రెండో వారానికి కృష్ణా బేసిన్లో 331.708 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. అంటే ఏపీ వాటా నీటిలో ఇంకా 171.163 టీఎంసీలు, తెలంగాణకు 160.545 టీఎంసీలు ఉంటాయి. ఇలా మిగిలిన నీటిని ఇప్పుడు వాడుకుంటామని రాష్ట్రాలు కోరుతున్నాయి. 49.72 టీఎంసీల మిగులు జలాలు మళ్లింపు శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా వరద జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు మళ్లించిన వరద నీటిని లెక్కలోకి తీసుకోకూడదని ఏపీ సర్కార్ చేసిన ప్రతిపాదనకు కృష్ణా బోర్డు అంగీకరించింది. వృథాగా సము ద్రంలో కలిసే నీటిని ఎవరు వాడుకున్నా నష్టం లేదని పేర్కొంది. ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీ నుంచి 17.96, పోతిరెడ్డిపాడు 21.24, హంద్రీ–నీవా 2.73, సాగర్ కుడి కాలువ 7.28, ఎడమ కాలువ 0.91 వెరసి 49.72 టీఎంసీల మిగులు జలాలను ఏపీ సర్కార్ మళ్లించింది. ఇదే విధంగా తెలంగాణ సర్కారు ఏఎమ్మార్పీ, ఎఫ్ఎఫ్సీ, కల్వకుర్తి, ఎడమ కాలువ ద్వారా 11.94 టీఎంసీలను వాడుకుంది. -
సాగర్‌ను పరిశీలించిన కృష్ణాబోర్డు సబ్ కమిటీ
సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్ నుంచి నేరుగా నీటిని వాడుకునేలా ప్రాజెక్టుల నిర్వహణపై అధ్యయనం కోసం ఆర్కే పిళ్లై నేతృత్వంలోని కృష్ణాబోర్డు సబ్ కమిటీ సోమవారం సాగర్‌ను పరిశీలించింది. కుడికాలువ హెడ్ రెగ్యులేటర్, విద్యుత్ కేంద్రం, సాగర్ స్పిల్‌వే, ప్రధాన విద్యుత్ కేంద్రాలను చూసింది. మంగళవారం సాగర్ ఎడమకాలువ హెడ్ రెగ్యులేటర్, విద్యుత్ కేంద్రం, ఏఎమ్మార్పీ, హైదరాబాద్ తాగునీటి పథకం, సాగర్ వరద కాలువలను పరిశీలించి.. రెండు రాష్ట్రాల జలవనరులశాఖ అధికారులతో సమావేశమవుతుంది. సాగర్ ఆపరేషనల్ ప్రొటోకాల్ (నిర్వహణ నియమావళి) ముసాయిదా నివేదికను రూపొందించి బోర్డుకు అందజేయనుంది. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను బోర్డు తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణ భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు ఆ రాష్ట్ర సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకున్నప్పుడే తమ రాష్ట్రంలోని ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని షరతు విధిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రాజెక్టులను బోర్డు ఆధీనంలోకి తీసుకోలేకపోయింది. ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకునేలోగా శ్రీశైలం, సాగర్ ఆపరేషనల్ ప్రొటోకాల్ రూపొందించేందుకు బోర్డు సబ్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే గతనెల 25, 26 తేదీల్లో శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నేరుగా నీటిని వాడుకునే ఎడమ విద్యుత్ కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల సందర్శనకు సబ్ కమిటీని తెలంగాణ సర్కార్ అనుమతించలేదు. -
కృష్ణా జలాల పునఃపంపిణీ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య సెక్షన్ –3 ప్రకారం కృష్ణా జలాల పునఃపంపిణీకి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలంటూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నూతన ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశం సందర్భంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సూచనల మేరకు పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకరించడం తెలిసిందే. న్యాయస్థానం వెలుపల సమస్యను పరిష్కరించుకునేందుకు వీలుగా వీలైనంత త్వరగా నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని గతంలో కేసీఆర్ కోరారు. కేంద్రానికి ఎలాంటి ఆదేశాలూ ఇవ్వం కాగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు చాంబర్లో పలుసార్లు విచారణ జరిగినప్పటికీ షరతులు లేని ఉపసంహరణకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఎదుట బుధవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. రిట్ పిటిషన్ ఉపసంహరణకు అంగీకరిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే పిటిషన్‌లోని తమ అభ్యర్థనను పరిశీలించాలని తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాదులు సీఎస్ వైద్యనాధన్, వి.గిరి, ముకుల్ రోహత్గిలు ధర్మాసనాన్ని కోరగా మహారాష్ట్ర తరఫు సీనియర్ న్యాయవాది నార్‌గోల్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా ఆ పిటిషన్ ఉపసంహరణకు అభ్యంతరం లేదని ఏపీ తరఫు అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ మెహ్‌ఫజ్ నజ్కీ నివేదించారు. దీంతో దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని ధర్మాసనం ప్రకటించింది. నదీ జలాల అంశం చాలా సున్నితమైనదని, ఇప్పటికే కృష్ణా జలాలపై మూడు అవార్డులు ఇవ్వగా నాలుగు రాష్ట్రాలు వేర్వేరు పిటిషన్లతో సుప్రీంకోర్టును ఆశ్రయించాయని ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే నివేదించారు. పరిశీలిస్తామని మాత్రమే చెప్పాం.. తమ అభ్యర్థన పిటిషన్లో స్పష్టంగా ఉందని, దీనిపై ధర్మాసనానిదే నిర్ణయమని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాధన్ తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినిట్స్‌లో పొందుపరిచిన అంశాలను సీనియర్ న్యాయవాది వి.గిరి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే నూతన ట్రిబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తామని మినిట్స్‌లో ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తాము కేవలం పరిశీలిస్తామని మాత్రమే చెప్పామని కేంద్ర జలశక్తి శాఖ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. అనంతరం ఎలాంటి షరతులు లేని ఉపసంహరణకు అనుమతిస్తామని, ఏవైనా అంశాలు ఉంటే కేంద్రాన్ని కోరాలని సూచిస్తూ ధర్మాసనం విచారణను ముగించింది. -
కేంద్రం దృష్టికి కొత్త ట్రిబ్యునల్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పునఃపంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేలా చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనుంది. కృష్ణా జలాల విషయంలో సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున వేసిన రిట్ పిటిషన్ ఉపసంహరించుకునే ప్రక్రియ పూర్తయిన నేపథ్యం లో కొత్త ట్రిబ్యునల్‌ను త్వరితగతిన ఏర్పాటు చేసి, రాష్ట్రానికి న్యాయమైన నీటి హక్కులు దక్కేలా చూడాలని విన్నవించనుంది. ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అందులో మరోమారు ప్రస్తావించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తొలిసారిగా 2014లోనే లేఖ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే 2014 జూలై 14న కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఒక లేఖ రాసింది. కృష్ణా జలాల కేటాయింపుల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, పంపకాల్లో అసమానతలను వివరిం చింది. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో కేవలం 35 శాతం మేర మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో ఉన్న ఆయకట్టు 62.5 శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుత కేటా యింపులు ఏమాత్రం సరిపోవు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లో పరివాహకం 31.5 శాతం, ఆయకట్టు 37.5 శాతం మాత్రమే ఉన్నా మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపారు. మొత్తం జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512.04 టీఎం సీలు, తెలంగాణకు కేవలం 298.96 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారు. పరివాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా రాష్ట్రానికి కేటాయింపులు పెరగాలని ఆ లేఖలో పేర్కొంది. స్పందించని కేంద్రం రాష్ట్రం చేసిన అభ్యర్థనపై చట్ట ప్రకారం కేంద్రం ఏడాదిలోగా స్పందించాల్సి ఉన్నా ఉలుకూపలుకూ లేకపోవడంతో 2015లో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలావుండగా గత ఏడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ భేటీ సందర్భంగా ఈ అంశాన్ని మరోమారు లేవనెత్తిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా జలాల పునఃపంపిణీపై కొత్త ట్రిబ్యునల్‌చే విచారణ చేయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలంగాణ డిమాండ్‌ను అంగీకరిస్తామంటూనే... సుప్రీం కోర్టులో తెలంగాణ పిటిషన్ వేసిఉన్న కారణంగా తాము ఎటువంటి చర్య తీసుకోలేక పోతున్నామన్నారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం.. కేంద్రం గనుక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్టే పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామన్నారు. ఆ మేరకు రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు నాలుగు నెలల కిందట ప్రభుత్వం పిటిషన్ పెట్టుకుంది. సుప్రీం ఓకే చెప్పడంతో.. సుప్రీంకోర్టు బుధవారం ఉపసంహరణకు ఓకే చెప్పడంతో ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్రం నిర్ణయించింది. కొత్త ట్రిబ్యునల్‌ను త్వరగా ఏర్పాటు చేయడంతో పాటు నిర్దిష్ట కాలపరిమితితో తుదితీర్పు వెలువడేలా చూడాలని లేఖలో కోరే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి కేటాయింపులు 500 టీఎంసీలకు పెరగాల్సి ఉందన్న విషయాన్ని మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలున్నాయని పేర్కొంటున్నాయి. చదవండి: బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై -
Krishna River Water Dispute: ఈ ఏడాది పాత వాటాలే
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఈ ఏడాది కూడా పాత పద్ధతి ప్రకారమే పంచుకోవాలని ఇరు తెలుగు రాష్ట్రాలు నిర్ణయానికి వచ్చాయి. ఈసారి ప్రాజెక్టుల్లో చేరే నీటిని 34ః66 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీ పంచుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఒప్పందానికి వచ్చాయి. కృష్ణా జలాల్లో వాటా పెంపు అంశాన్ని ట్రిబ్యునళ్లు మాత్రమే తేల్చగలవని.. తాము నిర్ణయం తీసుకోలేమన్న బోర్డు సూచన మేరకు దీనికి తెలంగాణ అంగీకరించింది. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి విషయంలో మాత్రం ఏకాభిప్రాయం రాలేదు. విద్యుత్ ఉత్పత్తి చేస్తామని తెలంగాణ స్పష్టం చేయగా.. సాగు, తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ వాదించింది. కాగా ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు రజత్‌కుమార్‌కు ఫోన్ చేసి.. కృష్ణాబోర్డు సమావేశంలో జరుగుతున్న వాదనలపై ఆరా తీశారు. ఏపీ ఏయే అంశాలను లేవనెత్తుతోందన్నది తెలుసుకుని, పలు సూచనలు చేశారు. వాడివేడిగా వాదనలు కృష్ణాజలాల్లో వాటాలు, వినియోగం, విద్యుదుత్పత్తి సహా పలు కీలక అంశాలపై హైదరాబాద్‌లోని జలసౌధలో బుధవారం కృష్ణాబోర్డు సమావేశాలు జరిగాయి. మొదటి సమావేశం బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మొదలైంది. తెలంగాణ, ఏపీ జలవనరుల శాఖల కార్యదర్శులు రజత్‌కుమార్, శ్యామలారావు, ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డితోపాటు తెలంగాణ అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు తదితరులు హాజరయ్యారు. సుమారు 7 గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. తర్వాత బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అంశాల అమలుపై మరో నాలుగు గంటల పాటు సమావేశం జరిగింది. మొత్తంగా 11 గంటల పాటు సమావేశాలు జరిగాయి. వాటాలపై తెలంగాణ పట్టు సమావేశంలో వాటాల పెంపు అంశాన్ని తెలంగాణ ప్రధానంగా ప్రస్తావించింది. ‘‘కృష్ణాబోర్డు 12వ భేటీలో తెలంగాణ, ఏపీ మధ్య 34ః66 నిష్పత్తిలో ఒక ఏడాదికి నీటి పంపకాలు చేయడానికి అంగీకరించాం. మైనర్ ఇరిగేషన్ వినియోగం, పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టాకు మళ్లించే గోదావరి నీళ్లు, ఆవిరి నష్టాలను ఈ నిష్పత్తిలో లెక్కించకూడదని నిర్ణయం తీసుకున్నాం. పరీవాహకం, సాగుయోగ్య భూమి, కరువు పీడిత ప్రాంతాలు, జనాభా ఆధారంగా చూస్తే కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీల వాటా 70.8ః 29.2 శాతంగా ఉండాలి. కనీసం బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకు కృష్ణా జలాల్లో లభ్యత నీటిని 50ః50 నిష్పత్తిన పంచాలి’’ అని తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ వాదించారు. పోలవరం మళ్లింపు వాటాల ప్రకారం సైతం తమకు 45 టీఎంసీలు అదనంగా దక్కుతాయని, వాటిని ఈ ఏడాది నుంచి వినియోగిస్తామని తెలిపారు. అయితే దీనిని ఏపీ వ్యతిరేకించింది. కృష్ణాడెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకు సంబంధించి.. నాగార్జునసాగర్ ఎగువన నీటిని పంపిణీ చేసే అధికారం బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కే ఉందని ఏపీ సెక్రటరీ శ్యామలారావు వాదించారు. నిజానికి ప్రస్తుత వాటాలను సవరిస్తే ఏపీకే 70 శాతం నీటిని ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై కల్పించుకున్న బోర్డు.. నీటి వాటాల అంశం బోర్డులు తేల్చే పనికాదని, ట్రిబ్యునల్‌లో విషయం తేలేవరకు పాత పద్ధతి ప్రకారమే నీటిని వాడుకోవాలని కోరింది. దీనికి తెలంగాణ అంగీకరించింది. విద్యుదుత్పత్తిపై గరంగరం శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. శ్రీశైలంలో ఇష్టారీతిగా విద్యుదుత్పత్తి చేస్తున్నారని, దానిని తక్షణమే నిలిపేయాలని ఏపీ డిమాండ్ చేయగా.. అనుమతుల్లేని ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణాజలాలను తరలించడం ఆపాలని తెలంగాణ వాదించింది. ‘‘కృష్ణా బేసిన్ అవతల ఎలాంటి అనుమతుల్లేని ఆయకట్టుకు పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటిని తరలిస్తోంది. 1976, 1977లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందాలు, 1981లో ప్రణాళికా సంఘం అనుమతుల మేరకు ఏపీ కేవలం 15 టీఎంసీల నీటిని చెన్నై తాగునీటి అవసరాలకు, మరో 19 టీఎంసీల నీటిని ఎస్ఆర్బీసీకి జూలై–అక్టోబర్ నెలల మధ్య తరలించుకోవచ్చు. కానీ ఏపీ అధికంగా నీటిని వాడుతోంది. ఇలా ఓవైపు అక్రమంగా నీటిని తరలిస్తూ.. మరోవైపు శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఆపాలని కోరడం సరికాదు. నిజానికి శ్రీశైలం పూర్తిగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టు..’’ అని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. అయితే ప్రాజెక్టు ప్రొటోకాల్ ప్రకారం తాగు, సాగు అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ అవసరాలు లేనప్పుడే శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేయాలని ఏపీ వాదించింది. కేవలం విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయడం ఏమిటని ప్రశ్నించింది. ఈ ఏడాది ఏకంగా 100 టీఎంసీలను వృధాగా సముద్రంలోకి వదిలేశారని పేర్కొంది. ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ స్పందిస్తూ.. తాగు, సాగు అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరం ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. అయినా తమ సూచనలు పాటించాలని బోర్డు కోరడంతో.. తెలంగాణ అధికారులు రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ తదితరులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. క్యారీ ఓవర్ కుదరదు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఒక ఏడాది వాడుకోలేకపోయిన నీటిని తర్వాతి ఏడాదిలో వాడుకునేలా (క్యారీఓవర్) తమకు అనుమతి ఇవ్వాలన్న తెలంగాణ ప్రతిపాదనను కృష్ణాబోర్డు తోసిపుచ్చింది. ఈ విషయంలో ఏపీ వాదనలతో ఏకీభవించింది. బచావత్ ట్రిబ్యునల్ క్లాజ్–8 ప్రకారం ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే పూర్తవుతాయని పేర్కొంది. ‘వరద’ లెక్కలు వద్దు బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండి నీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు వరద జలాలను ఎవరు వాడుకున్నా వాటాల్లో పరిగణించకూడదని ఏపీ కోరగా.. బోర్డు అంగీకరించింది. అయితే తెలంగాణ విజ్ఞప్తి మేరకు.. ఎవరెవరు ఎంతమేర వరద జలాలను వాడుతున్నారో లెక్కలు చెప్పాలని సూచించింది. బోర్డుకు మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లు గెజిట్ అంశాల అమలుపై జరిగిన చర్చ సందర్భంగా.. కాళేశ్వరం అదనపు టీఎంసీ, సీతారామ, తుపాకులగూడెం ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను తెలంగాణ గోదావరి బోర్డుకు సమర్పించింది. చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు, చనాఖా–కొరట డీపీఆర్‌లను మరో వారంలో సమర్పిస్తామని తెలిపింది. గెజిట్‌లో కొన్ని అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉందని.. ఏవైనా ప్రాజెక్టులకు సంబంధించి ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులుగానీ, వినతులుగానీ వస్తే ఎవరు పరిష్కరిస్తారని తెలంగాణ సందేహం వ్యక్తం చేసింది. ఏపీ మాత్రం గెజిట్ అమలుకు సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపింది. ఇక గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశాల పరిశీలన కోసం రెండు బోర్డులకు సంబంధించి ఉప కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపం బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు. దీనిద్వారా విద్యుదుత్పత్తి ఆపం. తాగు, సాగు అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న సూత్రం శ్రీశైలానికి వర్తించదు. తెలంగాణకు విద్యుత్ వినియోగం ఎక్కువ. కాబట్టి ఉత్పత్తి కొనసాగిస్తాం. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతున్నా కృష్ణాబోర్డు నిలువరించడం లేదు. ఎన్ని లేఖలు రాసినా అడ్డుకోలేకపోయింది. టెలీమెట్రీ వ్యవస్థలోనే విఫలమైంది’’ రజత్‌కుమార్, తెలంగాణ స్పెషల్ సీఎస్ -
కృష్ణా జలాల్ని 80:20 నిష్పత్తిలో కేటాయించండి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 79.88:20.12 నిష్పత్తిలో పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ప్రతిపాదించింది. చిన్న నీటి వనరుల విభాగంలో తెలంగాణ సర్కారు 89.15 టీఎంసీల వినియోగానికే పరిమితమైతే అప్పుడు ఏపీ, తెలంగాణలకు 70:30 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2) తీర్పు నోటిఫై అయ్యే వరకూ బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) తీర్పే అమల్లో ఉంటుందని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేయడాన్ని ఎత్తిచూపిందని తెలిపింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకు 512.04, 298.96 టీఎంసీల చొప్పున పంపిణీ చేసుకునేలా రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం కొనసాగుతుందని తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాలను చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ ప్రతిపాదించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) విచారణ చేస్తోందని గుర్తు చేసింది. నీటి పంపిణీ బోర్డు పరిధిలోకి రాదని.. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ చేసిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేస్తూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ జల వనరుల శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ (ఈఎన్సీ) సి.నారాయణరెడ్డి బుధవారం లేఖ రాశారు. లేఖలోని ప్రధానాంశాలివీ.. ► 2020 జూన్ 4న జరిగిన కృష్ణా బోర్డు 12వ సమావేశంలో చిన్న నీటి వనరుల విభాగంలో కేటాయించిన 89.15 టీఎంసీలకుగానూ 45 టీఎంసీలను మాత్రమే వాడుకుంటున్నాం. వీటిని పరిగణనలోకి తీసుకుని నీటిని పంపిణీ చేయాలి. ► అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల జోలికి వెళ్లడం చట్టవిరుద్ధం. చిన్న నీటి వనరుల విభాగంలో 89.15 టీఎంసీల వినియోగానికే తెలంగాణ సర్కార్ పరిమితమైతే 70:30 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణకు కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కోరాం. దీనిపై కృష్ణా బోర్డు చైర్మన్ జోక్యం చేసుకుని 66:34 నిష్పత్తిలో పంచుకోవాలని చేసిన సూచనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ► చిన్న నీటి వనరుల విభాగంలో తెలంగాణకు 89.15 టీఎంసీల కేటాయింపులు ఉంటే 175 టీఎంసీలను వాడుకుంటోంది. ఈ విషయాన్ని జూలై 6, 9 తేదీల్లో బోర్డు దృష్టికి తీసుకొచ్చాం. ఈ దృష్ట్యా మధ్య, భారీతరహా ప్రాజెక్టుల్లో 79.88: 20:12 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు నీటిని పంపిణీ చేయాలి. ► ఒకే తరహా నీటి లభ్యత సూత్రాన్ని అన్ని నదులకు అమలు చేయలేం. ఒక్కో నది స్వరూపాన్ని బట్టి నీటి లభ్యత సూత్రం ఆధారపడి ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 70.8: 29.2 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీలో కృష్ణా పరీవాహక ప్రాంతం ఉంది. దాన్ని ప్రామాణికంగా తీసుకుని నీటిని పంపిణీ చేయాలన్న తెలంగాణ వాదన అసంబద్ధం. ► విభజన చట్టంలో 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టుల అవసరాలతో కలుపుకుని 1,059 టీఎంసీలను కేటాయించాలనే డిమాండ్లను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ ప్రభుత్వం పెట్టింది. ఇతర బేసిన్లకు మళ్లిండం, ఇతర బేసిన్ల నుంచి కృష్ణా బేసిన్‌కు మళ్లించడం, బేసిన్లను ప్రామాణికంగా తీసుకుని ఎక్కువ నీటి వాటా కోసం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ డిమాండ్లు పెట్టగా బోర్డు విచారిస్తోంది. చెరి సగం నీటిని పంపిణీ చేయాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరడం సహేతుకం కాదు. -
కృష్ణా జలాల పంపకాలపై కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ
-
Krishna Water Dispute: న్యాయస్థానమే పరిష్కరించాలి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జల వివాదాలకు సంబంధించి న్యాయపరంగానే పరిష్కారం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కృష్ణా జలాలను తెలంగాణ అక్రమంగా వినియోగించుకుంటూ తమకు తాగు, సాగు నీటిని నిరాకరిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉమాపతి వాదనలు వినిపిస్తూ తాము కోర్టు ద్వారానే పరిష్కారం కోరుకుంటున్నామని తెలిపారు. ‘‘మీరు మధ్యవర్తిత్వం కోరుకోకపోతే మేమేమీ బలవంతం చేయం. ఈ కేసును మరో ధర్మాసనం జాబితాలో చేర్చుతాం’’ అని ధర్మాసనం పేర్కొంది. కాగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టేందుకు అభ్యంతరం లేదని కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నివేదించారు. ‘‘కుదరదు.. నేనెలా విచారిస్తా..? మరో ధర్మాసనం జాబితాలో చేర్చుతాం’’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాలు అంగీకరిస్తే మధ్యవర్తిత్వానికి సహకరిస్తానని గత విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్న విషయం విదితమే. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ హాజరయ్యారు. -
కృష్ణ జలాల వివాదం కేసుపైసుప్రీం లో విచారణ
-
మధ్యవర్తిత్వానికి సహకరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదానికి సంబంధించి మధ్యవర్తిత్వానికి సహకరిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. 2015 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కృష్ణా జలాలను విద్యుత్ అవసరాలకు తెలంగాణ వాడుకుంటోందని, 2021, జూన్ 28న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో అన్యాయమంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. వాదనల ప్రారంభ సమయంలో జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను ఉద్దేశించి.. ‘నేను ఇరు రాష్ట్రాలకు చెందినవాడిని. ఈ అంశంపై గతంలో వాదనలకు హాజరయ్యా. పిటిషన్లో న్యాయపరమైన అంశాలపై విచారించాలని భావించడంలేదు. ఈ కేసులో మూడో వ్యక్తి జోక్యం అనవసరం. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటామంటే ఈ ధర్మాసనం సహకరిస్తుంది. ఒకవేళ న్యాయపరంగా, కేంద్రం జోక్యం కావాలని భావిస్తే కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేస్తాం’అని తెలిపారు. ఈ సూచనపై ప్రభుత్వ ఆదేశాలు తెలుసుకోవడానికి సమయం కావాలని దవే అడిగారు. కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో పిటిషన్‌పై విచారణ అనవసరమని తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ తెలిపారు. నోటిఫికేషన్ అప్పుడే అమలులోకి రాదని, అమలులోకి వచ్చేలోగా చాలా నీటిని నష్టపోతామని దవే వెల్లడించారు. నీటి బోర్డులు ఇంకా ఆపరేషనల్ కాలేదని, ఈశాన్యంలో ఏం జరుగుతోందో చూస్తున్నామని చెప్పారు. ఆ తరహా ఘటనలు జరగాలని కోరుకోకూడదని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. మంగళవారానికి విచారణ వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం, వారం రోజులు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరాయి. ప్రభుత్వాలను సంప్రదించి నిర్ణయానికి రావాలని పేర్కొన్న ధర్మాసనం విచారణ బుధవారానికి వాయిదా వేసింది. -
దాదాగిరీ ఎవరు చేస్తున్నారో.. ప్రజలు గమనిస్తున్నారు: సజ్జల
నెల్లూరు: ఏపీలోని నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించినట్లు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘‘పేదలందరికీ ఇళ్లు’’ పథకం అమలుపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై బేరీజు వేసుకున్నామని సజ్జల అన్నారు. అంతే కాకుండా ‘‘కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు. దాదాగిరీ ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను కూడా పొరుగు రాష్ట్రం పెడచెవిన పెట్టింది. జలవిద్యుత్ పేరుతో 30 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారు. ఎగువ ప్రాంతంలో ఉన్నామన్న భావనతో జల వివాదానికి దిగారు. ఆంధ్రా వాటా నీటిని కాపాడుకునేందుకు సీఎం జగన్ ప్రయత్నించారు.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
కృష్ణా జలాల వివాదం: సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం అంశంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జలవివాదంపై తాను తీర్పు చెప్పలేనని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. మధ్యవర్తిత్వానికి అంగీకరిస్తే చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ అంశంలో సహాయపడుతుందని వెల్లడించారు. మధ్యవర్తిత్వం కాకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలనుకుంటే.. వేరే ధర్మాసనం ముందు వాదనలు వినిపించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తరఫున హాజరైన న్యాయవాదులకు సూచించారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు తమ నిర్ణయం తెలియజేయాలని ఆదేశించిన సీజేఐ రమణ.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. కాగా ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, తెలంగాణ తరపున సిఎస్ వైద్యనాధన్ వాదనలు నేటి విచారణలో తమ వాదనలు వినిపించారు. కాగా కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. -
తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారు..
సాక్షి, నల్లగొండ రూరల్: తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తకెళ్లపల్లి రవీందర్రావు ఆరోపించారు. అందులో భాగంగానే నదీ జలాలపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.శనివారం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి , మిర్యాలగూడ ఎమ్మెల్యే బాస్కర్‌రావు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి , వైస్ చైర్మన్ అబ్బగోనిరమేష్‌గౌడ్‌లతో కలిసి ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉందని, వ్యవసాయ ఆధారంగా జీవనం సాగుతున్న నల్లగొండకు కేంద్రం జారీ చేసిన కృష్ణా నీటి గెజిట్‌తో తీరని నష్టం జరుగుతుందన్నారు. వృథాగా పోయే గోదావరి నీటిలో కాళేశ్వరం ప్రాజెక్టు , లిప్టులు , బ్యారేజిలను నిర్మించారన్నారు. ఆంధ్రాపాలకులు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక పోతున్నాయని ఆరోపించారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు పంకజ్ యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, బోనగిరి దేవేందర్, అభిమన్యు శ్రీనివాస్, సహదేవ్‌రెడ్డి, దొటి శ్రీనివాస్, ఖరీంపాష, దేప వెంకట్‌రెడ్డి, నాగార్జున, మధుసూదన్‌రెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, పబ్బు సందీప్‌గౌడ్, సత్తయ్య గౌడ్, మల్లేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మా హక్కులకు భంగం వాటిల్లితే న్యాయ పోరాటమే!
సాక్షి, హైదరాబాద్: ‘‘కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు, హక్కులకు ఏమాత్రం భంగం కలిగినా ఉపేక్షించేది లేదు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డుల అధీనంలోకి తీసుకునేలా కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఇంజనీర్లు అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రం హక్కులు, దక్కాల్సిన వాటాల్లో ఎలాంటి అన్యాయం జరిగినా న్యాయ పోరాటం చేస్తాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేసినట్టు తెలిసింది. రాజ్యాంగ స్ఫూర్తికి, విభజన చట్టానికి భిన్నంగా కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేసి ఉంటే.. అన్ని వేదికలపై నిలదీయాల్సిందేనని పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. శుక్రవారం ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ కూడా హాజరైన ఈ సమావేశంలో.. కృష్ణా జలాలు, బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్, పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయంపై పార్లమెంట్లో గట్టిగా తమ వాణిని వినిపించాలని ఎంపీలను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిపే వరకు కొట్లాడాలని సూచించారు. చుక్క నీటి దుర్వినియోగం లేదు కృష్ణా జలాల్లో తెలంగాణకు తొలి నుంచీ అన్యాయం జరిగిందని.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గొంతును వినిపించే అవకాశం లేక న్యాయం జరగలేదని, ఇప్పుడు న్యాయం చేయాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. జల వివాదాలు తలెత్తినప్పుడు కేంద్రం ఇరు రాష్ట్రాలను కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం చేయాల్సిందిపోయి చోద్యం చూస్తూ కూర్చుందని, అందుకే సమస్యలు జటిలం అవుతున్నాయని వ్యాఖ్యానించినట్టు సమాచారం. కృష్ణా నీళ్లను వాడుకునేలా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ చేస్తున్న ఆరోపణలు, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి విషయంగా తెలంగాణపై చేసిన ఫిర్యాదులపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ‘‘రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన వాటాల్లోంచే నీటిని వినియోగించుకుంటున్నాం. అదనంగా ఒక్క చుక్క నీటిని వాడుకోవడం లేదు. దుర్వినియోగం చేయడం లేదు. తెలంగాణ అక్రమంగా నీటిని వినియోగిస్తోందన్న వాదన అబద్ధం. సాగునీటి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్ కోసమే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తున్నాం. ఎత్తిపోతల పథకాలు నడపాలన్నా, సాగుకు నీరు అందించాలన్నా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నుంచి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయడం తప్ప మార్గం లేదు. కానీ ఈ అంశాన్ని వక్రీకరించి తెలంగాణను బద్నాం చేస్తున్నారు..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు వెల్లడించాయి. అదనంగా నీటిని వాడుకునేలా కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారనే అభిప్రాయం తప్పు అని.. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోల ఆధారంగానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్న అంశాన్ని తెలియజెప్పాలని ఎంపీలకు కేసీఆర్ సూచించినట్టు సమాచారం. ఇక కేంద్రం పేర్కొన్న కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం ప్రస్తావనకు రాగా.. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాలు, రాష్ట్రం హక్కులపై పార్లమెంట్లో గట్టిగా గొంతు వినిపించాలని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాక మూడు, నాలుగు రోజుల్లో ఢిల్లీకి వస్తానని.. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తానని ఎంపీలకు చెప్పినట్టు సమాచారం. -
నదీ జలాల విషయాన్ని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్/దుబ్బాక: నదీ జలాల విషయాన్ని కేసీఆర్ రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ మండిపడ్డారు. కృష్ణా జలాల వివాదంపై రఘునందన్ మాట్లాడుతూ.. విభజన చట్ట ప్రకారమే గెజిట్ తయారు చేశారు. గెజిట్ ప్రకారం ఏపీకి 66%, తెలంగాణకు 34% నీటి వాటాను మంత్రి హరీష్‌రావు ఒప్పుకున్నారు. ఇదే విషయమై ఇప్పుడు కేంద్రాన్ని అడగడానికి మొహం చెల్లట్లేదని పేర్కొన్నారు. -
నీళ్ల దోపిడీపై టీడీపీ వైఖరేంటి?
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను తెలంగాణ అడ్డగోలుగా దోచేస్తున్న తీరుపై టీడీపీ తన వైఖరిని స్పష్టం చేయాలని పౌర సంబంధాలు, సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) డిమాండ్ చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చి దిగజారుడు విమర్శలు ఏమిటని ప్రశ్నించారు. ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి చంద్రబాబు వెళ్లింది పరామర్శకా? లేక హెరిటేజ్‌కు పాలు పంపిన పాత లెక్కలు తేల్చుకోవటానికా? అని నిలదీశారు. ‘నదులపై పర్యవేక్షణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలన్న ప్రతిపాదనపై మీ స్టాండ్ ఏమిటి? ఇష్టానుసారంగా తోడటం, జలవిద్యుదుత్పత్తి, శ్రీశైలంలో 800 అడుగుల మట్టం వద్దే తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తరలించడంపై ఎలా స్పందిస్తారు? తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి నోరు తెరవనందుకు మీకు ఏ శిక్ష వేయాలి?’ అని చంద్రబాబును ప్రశ్నించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నాని మీడియాతో మాట్లాడారు. భయపడి హైదరాబాద్‌లో దాక్కున్నారు కరోనా నియంత్రణలో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించాయి. కరోనా పరీక్ష కేంద్రాలు, ఆక్సిజన్ బెడ్స్, వైరాలజీ ల్యాబ్‌లను ప్రభుత్వం శరవేగంగా సమకూర్చుకుంది. ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మిన్నగా ఉందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు అబద్దాలు వల్లిస్తున్నారు. తాను అధికారంలో ఉంటే కరోనాను కంట్రోల్ చేస్తానని చెప్పే వ్యక్తి భయపడి హైదరాబాద్‌లో ఎందుకు దాక్కున్నారు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల్లో 97 శాతాన్ని కేవలం 20 నెలల్లోనే అమలు చేశారు. వచ్చే మూడేళ్లలో మిగతావి పూర్తవుతాయి. 600 హామీలిచ్చిన చంద్రబాబు వాటిని తుంగలో తొక్కారు. రుణమాఫీ చేస్తానని అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. రజకులు, మత్స్యకారులు, కాపులను దగా చేశారు. తన పాలనలో చంద్రబాబు గిరిజనులకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదు. నీళ్లిస్తే ఎందుకు తరిమేశారు? కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు. అదే నిజమైతే ఆయన్ను ఎందుకు ఓడించారు? ప్రజలను విశ్వాస ఘాతకులని ఆయన దూషించడం న్యాయమేనా? చంద్రబాబు పాపాలకు ప్రజలు రెండేళ్ల క్రితమే శిక్ష విధించినా ఆయనకు ఇంకా జ్ఞానోదయం కాలేదు. కృష్ణా డెల్టాలో 2014 దాకా రెండు పంటలూ పండేవి. ఆయనొచ్చాక ఒక పంటకే నీళ్లొచ్చాయి. ఐదేళ్లలో దాళ్వాకు నీళ్లిచ్చిన పాపాన పోలేదు. వైకుంఠపురం బ్యారేజీకి కనీసం ఒక్క ఇటుకైనా వేశారా? ఓడిపోయాక ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. మాట ఇచ్చి వెన్నుపోటు పొడవడం బాబు నైజం.. మాట ఇస్తే మడమ తిప్పని చరిత్ర వైఎస్సార్ కుటుంబానిది. యువతకు 2.60 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా 1.37 లక్షల మందికి ఉద్యోగాలిచ్చారు. వచ్చే మూడేళ్లలో జాబ్ క్యాలెండర్లతో మరిన్ని ఉద్యోగాలొస్తాయి. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలిచ్చారు? ఎన్నికలకు ముందు బందర్ పోర్టుకు శంకుస్థాపన చేయడం మోసం కాదా? చంద్రబాబు పచ్చి మోసకారి చంద్రబాబు 2014 ఎన్నికల ముందు బీజేపీతో కలవబోనని చెప్పి ఆ తర్వాత వాళ్లతో అంటకాగాడు. దిగిపోయే ఆర్నెల్ల ముందు ప్రధాని మోదీని నోటికొచ్చినట్టు తిట్టారు. ఇప్పుడు మళ్లీ బీజేపీకి అంశాలవారీగా మద్దతిస్తానంటున్నారు. ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఉంటుందా? బెల్ట్ షాపుల సృష్టికర్త అయిన చంద్రబాబు బ్రాందీ షాపుల గురించి వ్యాఖ్యానించడం దారుణం. దొంగలు, వెన్నుపోటుదారులకు మినహా చంద్రబాబు ఎవరికి ఆదర్శం? మద్యపాన నియంత్రణకు సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. అడ్డగోలుగా కడుతున్నా అడ్డుకోలేదు.. ఓటుకు కోట్లు కేసు భయంతో చంద్రబాబు రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పారిపోయి కృష్ణా కరకట్టకు వచ్చారు. తెలంగాణ అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నా అడ్డుకోలేదు. కేంద్రంలో బీజేపీతో అంటకాగి నోరు మెదపలేదు. సోనియాగాంధీతో చేతులు కలిపి వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించిందెవరు? టీఆర్ఎస్తో కలిసి ఓట్లు అడుక్కుందెవరు? వావి వరసలు లేని రాజకీయాలు చంద్రబాబుకే సొంతం. చంద్రబాబు మతి భ్రమించి చేసే వ్యాఖ్యలను ప్రజలు అర్థం చేసుకుంటారు. పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో మేం సఖ్యత కోరుకుంటున్నాం. -
జల వివాదం: ‘సుప్రీం’ను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
-
నీళ్లపై న్యాయపోరాటం.. సుప్రీం కోర్టుకు ఏపీ!
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ సర్కారు అక్రమాల పర్వాన్ని నిలువరించేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్లలో నీటిని తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా తోడేస్తూ.. విద్యుదుత్పత్తి చేస్తూ.. దిగువకు వదిలేస్తూ విలువైన జలాలను వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితులను సృష్టించి.. సాగు, తాగునీరు దక్కనివ్వకుండా మానవ హక్కులను కాలరాస్తోందంటూ రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. విచారణ సందర్భంగా ప్రస్తావించనున్న అంశాలపై సాగునీటి శాఖ అధికారులు విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రిట్ పిటిషన్లో పేర్కొనే అంశాలు ఇవీ... ► దేశంలో రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు సర్వసాధారణమైపోయాయి. ఈ జల వివాదాలకు అడ్డుకట్ట వేయాలంటే అంతర్రాష్ట్ర నదులపై ఉన్న రిజర్వాయర్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణ, భద్రతలను ఆయా నదీ యాజమాన్య బోర్డులకే అప్పగించాలి. భద్రత కోసం కేంద్ర బలగాల పహారా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ► నదీ జలాల్లో నీటి వాటాలపై వివిధ ట్రిబ్యునళ్లు, కోర్టులు తమ తీర్పుల ద్వారా ఇప్పటికే ఖరారు చేశాయి. వాటిని కచ్చితంగా అమలు చేయడానికి ఇది అవసరమని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ► నిర్దేశించిన వాటాల కంటే అధికంగా నీటిని అక్రమంగా వాడుకోవడం, ఆ ఒప్పందాలను ఉల్లంఘించేలా కొత్త ప్రాజెక్టులు కట్టడం, లేదా ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని విస్తరించడం తదితర అక్రమ చర్యలను ఆపాలంటే ఒక శాశ్వత పరిష్కారం అవసరమని కోర్టుకు నివేదించనున్నట్టుగా అధికారవర్గాలు వెల్లడించాయి. ► నదీ జలాల వివాదాలను ఎవరు పరిష్కరించాలన్న విషయాన్ని రాజ్యాంగంలోనే స్పష్టంగా పొందుపరిచారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రమే వాటిని పరిష్కరించాలి. కాబట్టి అంతర్రాష్ట్ర నదీ జలాలపై ఉన్న రిజర్వాయర్లు, విద్యుత్ కేంద్రాలన్నీ కూడా బోర్డు పరిధిలోనే ఉండాలంటూ పిటిషన్ ద్వారా ఏపీ ప్రభుత్వం కోరనున్నట్టు తెలుస్తోంది. అది మానవహక్కుల ఉల్లంఘనే..: ► బచావత్ అవార్డు ప్రకారం తాగునీరు, సాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సాగు అవసరాల కోసం నీటిని విడుదల చేసినప్పుడు మాత్రమే విద్యుదుత్పత్తి చేయాలి. కేవలం ఒక్క విద్యుత్ ఉత్పత్తి కోసమే నీటిని విడుదల చేయరాదన్న విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ► నదికి దిగువన ఉన్న రాష్ట్రానికి లేదా ప్రాంతానికి ఉన్న తాగునీటి, సాగునీటి అవసరాల నిమిత్తం పైప్రాంతంలో ఉన్న రాష్ట్రం విద్యుదుత్పత్తి చేస్తూ ఆ నీటిని విడుదల చేయాలి. కానీ.. దిగువ ప్రాంతంలో ఉన్న అవసరాలతో నిమిత్తం లేకుండా, వాటిని పరిగణలోకి తీసుకోకుండా, పై ప్రాంతంలో కూడా సాగునీటి, తాగునీటి అవసరాలు లేకుండానే కేవలం విద్యుదుత్పత్తి కోసం నీళ్లని కిందకు వదిలేసి తద్వారా విలువైన జలాలను సముద్రంలోకి వృథాగా వదిలేసే పరిస్థితులు తీసుకురావడం మానవ హక్కుల ఉల్లంఘనే అన్న వాదనను వినిపించనున్నట్లు తెలుస్తోంది. ► బచావత్ అవార్డు వెలువడిన నాటి నుంచి ఈ ప్రోటోకాల్‌ను దేశంలోని అన్ని రాష్ట్రాలు తప్పకుండా అనుసరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ విధానానికి చట్టబద్ధత కూడా ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ► కాలక్రమేణా అనేక వివాదాలపై ట్రిబ్యునళ్లు, కోర్టులు ఇచ్చిన తీర్పుల ద్వారా ఈ విధానానికి చట్టబద్ధత వచ్చిందని, మరింత ధృఢంగా ఈ విధానం మారిందన్న విషయాన్ని వాదనల్లో పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది. ► ఈ చట్టబద్ధ విధానానికి విరుద్ధంగా ఎగువ ప్రాంతంలో ఉన్న ఒక రాష్ట్రం ఎప్పుడూ జరగని విధంగా, ఒప్పందాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అనూహ్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఎలాంటి చట్టాలు తమకు వర్తించవు అన్నట్టుగా వ్యవహరిస్తున్నప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే గత్యంతరం లేదన్న విషయాన్ని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ► తమ హక్కుగా కేటాయించిన జలాలను తమకు దక్కనివ్వకుండా, విద్యుదుత్పత్తి పేరుతో దిగువకు విడిచిపెట్టడం, అవి సముద్రంలో కలవడం... ఈ చర్యల వల్ల లక్షలాది మంది రైతులు, వారి జీవనాధారమైన వ్యవసాయానికి విఘాతం కలుగుతోందని, దేశ ఆహార భద్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని పిటిషన్లో పొందుపరచనున్నారని సమచారం. ► నీరు, ఆహారం.. దేశ ప్రజల ప్రాథమిక హక్కులు. వాటికి భంగం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విషయాన్ని పిటిషన్ ద్వారా సుప్రీం కోర్టుకు వివరించనున్నట్లు జలవనరుల శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ► రిజర్వాయర్లు, వాటిపై ఉన్న విద్యుత్ కేంద్రాలను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటే తరతమ భేదం లేకుండా వ్యవహరించే అవకాశం ఉంటుందనే వాదనను పొందుపరుస్తున్నట్టుగా సమాచారం. ► రెండు రాష్ట్రాలకు చెందిన సాగునీటి సిబ్బంది, పోలీసులు పరస్పరం ఘర్షణలకు దిగే వాతావరణానికి దారితీసిన పరిస్థితులన్నీ తెలంగాణ సర్కార్ సృష్టించినవేనని, వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా పిటిషన్లో పేర్కొననున్నట్లు సమాచారం. కృష్ణా బోర్డు ఉత్తర్వులు బేఖాతర్.. తెలంగాణ సర్కారు నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నీటిని తోడేస్తుండటంపై ఇప్పటికే సంబంధిత ఆధీకృత సంస్థలకు, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామనే అంశాన్ని రిట్ పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొననుంది. విద్యుదుత్పత్తిని నిలిపేయాలని ఆ సంస్థలు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తెలంగాణ సర్కారు పాటించలేదన్న విషయాన్ని ప్రస్తావించనుందని సమాచారం. కృష్ణా బోర్డు విధివిధానాల ఖరారు ప్రక్రియ విషయంలో ఆదిలోనే తెలంగాణ రాష్ట్రం మోకాలొడ్డుతూ, ముందుకు సాగనివ్వకుండా చేస్తున్న అంశాన్ని రిట్ పిటిషన్లో ప్రస్తావించనుంది. కృష్ణా బోర్డు పరిధి, విధివిధానాల ఖరారు లాంటి అంశాల్లో కేంద్రం గట్టిగా చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం నివేదించనుందని సమాచారం. తెలంగాణ జీవోను సస్పెండ్ చేయండి.. లక్షలాదిమంది రైతులు, ప్రజల కనీస అవసరాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని.. అందులో భాగంగానే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తోందన్న విషయాన్ని ఆంధప్రదేశ్ ప్రభుత్వం నివేదించనుందని అధికారవర్గాలు తెలిపాయి. పూర్తి సామర్థ్యం మేరకు జలవిద్యుదుత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవోను వెంటనే సస్పెండ్ చేసి కృష్ణా బోర్డు విధివిధానాలను ఖరారు చేయాలని ఈ పిటిషన్ ద్వారా కోరనున్నట్లు సమాచారం. రిజర్వాయర్లు, విద్యుత్తు ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని, గతంలో నిర్ణయించుకున్న వాటాల ప్రకారం నీళ్లు అందేలా చూడాలని పిటిషన్ ద్వారా ఏపీ ప్రభుత్వం కోరనున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
కృష్ణా జలాలపై సుప్రీంకు వెళ్లే యోచనలో ఏపీ సర్కార్
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల విషయంలో తెలంగాణ అక్రమాలపై దేశపు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అంతర్రాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని, వాటి నిర్వహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొనే అవకాశం ఉంది. ఈ విషయమై తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన అక్రమ జీవోను తక్షణమే సస్పెండ్ చేయాలని, కేఆర్ఎంబీ విధివిధానాల ఖరారుకు కేంద్రానికి ఆదేశాలివ్వాలని సుప్రీం కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. రైతులు, ప్రజల హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోందని, విలువైన జలాలు సముద్రంలోకి కలిసేలా పరిస్థితులను సృష్టించి, మానవ హక్కులను ఉల్లంఘినలకు పాల్పడుతుందని ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది. -
కృష్ణ జలాల అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతాం : గొడ్డేటి మాధవి
-
Krishna River: 'కృష్ణా' తులాభారం
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో పుట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా పారే కృష్ణమ్మ తనతో పాటే అనేక వివాదాలను మోసుకొస్తోంది. ఎడతెగని పంచాయతీలకు కారణమవుతోంది. వీటిని పరిష్కరించేలా ట్రిబ్యునళ్లు తీర్పులిచ్చినా..అంతరాష్ట్ర ఒప్పందాలు జరిగినా.. కేంద్రం మధ్యవర్తిత్వం చేసినా.. వివాదాలు షరా మామూలవుతున్నాయి. కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలు తమ వాటాలకు మించి నీటి వినియోగం చేసేలా ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటే... ఉన్న వాటాల్లో నీటి వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య తరచూ వివాదాలు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తమ వాదనలకు అవకాశం లేక పరీవాహకానికి, ఆయకట్టుకు తగ్గట్లుగా వాటాలు దక్కలేదని తెలంగాణ అంటుంటే.. తమకున్న నీటి వాటాల్లోంచే వినియోగిస్తున్నామని, అంతకుమించి ఒక్క చుక్క నీటిని అదనంగా వినియోగించబోమని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేస్తోంది. విభజన తరువాతైనా నీటి వాటాలను సవరించి కృష్ణా జలాల పునఃపంపిణీ చేయాలని తెలంగాణ కోరుతుంటే.. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ నీటి వాడకంతో తమ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఏపీ అంటోంది. దీనిపై అటు కేంద్రానికి, ఇటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు ఇరు రాష్ట్రాలు లేఖలు రాస్తున్నా పరిష్కారం మాత్రం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల విషయంలో ఇరు పక్షాల వాదనలు, వాస్తవాలు ఎలా ఉన్నాయో ‘సాక్షి’ తెలిపే ప్రయత్నం చేస్తోంది. – సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి, ఆలమూరు రామగోపాల్ రెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధులు శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తి తెలంగాణ శ్రీశైలం పూర్తిగా విద్యుత్ అవసరాల కోసం నిర్మించినదే. 1959లో శ్రీశైలం ప్రాజెక్టును హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుగా చేపట్టగా 1963లో ప్లానింగ్ కమిషన్ దానిని ఆమోదించింది. ► బచావత్ అవార్డు పేజీ నంబర్ 104 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. ► విభజన చట్టం 12వ షెడ్యూల్, సెక్షన్ (1) ఏపీ జెన్కో పవర్ ప్లాంట్లను భౌగోళిక ప్రాంతం ఆధారంగా విభజించింది. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను 50 శాతం చొప్పున పంచుకోవాలని విభజన చట్టంలో ఎక్కడా లేదు. ► 1990–91 నీటి సంవత్సరం నుంచి 2019 – 20 వరకు ఏప్రిల్, మే నెలల్లో శ్రీశైలం కనీస మట్టం 834 అడుగుల్లో ఏపీ నీటిని నిల్వ ఉంచడం లేదు. పెన్నా బేసిన్ ప్రాజెక్టులకు తరలించేందుకు 854 అడుగుల మట్టాన్ని నిర్వహించాలని ఏపీ కోరడం సమంజసం కాదు. ► 2015 జూన్‌లో నిర్వహించిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ, బోర్డు భేటీల్లో శ్రీశైలం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును 50 శాతం చొప్పున తాత్కాలిక పద్ధతిలో పంచుకున్నది కేవలం ఆ వాటర్ ఇయర్‌కు మాత్రమే వర్తిస్తుంది. దీనిని క్లెయిమ్ చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. ► 2020–21 వాటర్ ఇయర్లో ఏపీ 629.06 టీఎంసీలను కృష్ణా బేసిన్లో వాడింది. ఇంత భారీ ఎత్తున నీటిని తరలిస్తూ తెలంగాణ కరెంట్ ఉత్పత్తి చేయడం ద్వారా తమ తాగునీటి అవసరాలకు నష్టం వాటిల్లుతుందని వాదిస్తుండటం అసంబధ్దం. ► తెలంగాణ సముద్ర మట్టానికి ఎగువన ఉంది. చుట్టూ నదులు ప్రవహిస్తున్నా గ్రావిటీ ద్వారా సాగునీటిని తీసుకునే పరిస్థితి లేదు. లిఫ్టులతో ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల ద్వారా కృష్ణా, గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసి రెండు పంటలకూ నీరందాలంటే జల విద్యుత్ ఉత్పత్తి కీలకం. అందుకే అన్ని ప్రాజెక్టుల్లోని జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 100 శాతం సామర్థ్యంతో కరెంట్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ► కేంద్ర ప్రణాళిక సంఘం 1963లో శ్రీశైలం ప్రాజెక్టును జలవిద్యుత్ ప్రాజెక్టుగా అనుమతి ఇచ్చింది. కానీ ఆ తర్వాత బహుళార్ధకసాధక ప్రాజెక్టుగా ప్రణాళిక సంఘమే గుర్తించింది. శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ) ద్వారా 19 టీఎంసీలు వాడుకోవడానికి జూలై 4, 1994లో సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. విభజన చట్టం ద్వారా గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. శ్రీశైలం జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు అని తెలంగాణ సర్కార్ పేర్కొనడంలో అర్థం లేదు. ► జూలై 10, 2014న కృష్ణా బోర్డు మొదటి సమావేశంలోనే శ్రీశైలంలో 834 అడుగుల కంటే ఎగువన నీటి నిల్వ ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ తెలంగాణ సర్కార్ శ్రీశైలం ప్రాజెక్టులో జూన్ 1న 808.4 అడుగుల్లో కేవలం 33.39 టీఎంసీలే నిల్వ ఉన్నప్పటికీ బోర్డుకు కనీసం సమాచారం ఇవ్వకుండానే ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకూ శ్రీశైలంలోకి 28.87 టీఎంసీల ప్రవాహం వస్తే విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 26.05 టీఎంసీలను వదిలేసింది. ► కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలు లేకున్నా, బోర్డు æ కేటాయింపులు చేయకున్నా అక్రమంగా నీటిని వాడుకుంటూ నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే 5.55 టీఎంసీలు సముద్రంలో వృథాగా కలిశాయి. ► ఉత్పత్తయ్యే విద్యుత్ చెరి సగం పంచుకునేలా 2015–16 సంవత్సరానికి మాత్రమే ఒప్పుకున్నాం. ఇకపై అంగీకరించం. ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 512.04, తెలంగాణ వాటా 298.96 టీఎంసీలు. ఇదే నిష్ఫత్తిలో జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో వాటా ఇవ్వాలి. ఈ ప్రాజెక్టుల్లో ఉత్పత్తయ్యే జలవిద్యుత్‌లో 66 శాతం వాటా మాకే దక్కుతుంది. జాతీయ జలవిధానం ప్రకారం తొలి ప్రాధాన్యం తాగునీటికే. తరువాత సాగునీటికి ప్రాధాన్యం. చివరి ప్రాధాన్యం జలవిద్యుదుత్పత్తికి అది కూడా సాగునీటి అవసరాలున్నప్పుడే చేపట్టాలి. కనీస నీటిమట్టం దాటకుండానే డెడ్‌స్టోరేజీలోనే తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోంది. పెరిగిన జల విద్యుత్తు థర్మల్ విద్యుదుత్పత్తి, సరఫరాను తెలంగాణ ఇటీవల గణనీయంగా తగ్గించింది. ప్రత్యామ్నాయంగా జలవిద్యుత్ ఉత్పత్తి, సరఫరాను భారీగా పెంచింది. తెలంగాణ 9357.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని కలిగి ఉండగా కేవలం 6274 మెగావాట్ల థర్మల్ విద్యుత్ మాత్రమే జూలై 6న రాష్ట్రానికి సరఫరా అయింది. శ్రీశైలం ఎడమగట్టు, నాగార్జునసాగర్, ఎగువ, దిగువ జూరాల, పులిచింతల తదితర జల విద్యుత్ కేంద్రాలు కలిపి తెలంగాణ జెన్కో మొత్తం 2441.8 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండగా జూలై 9న 751.1 మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపిత సామర్థ్యంతో పోల్చితే 80 – 85 శాతం విద్యుత్‌ను రాష్ట్రాల డిస్కంలు కొనుగోలు చేయాలని విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు పేర్కొంటాయి. అంతకు మించి తక్కువగా విద్యుత్‌ను కొనుగోలు చేస్తే విద్యుదుత్పత్తి కంపెనీలకు ఫిక్స్డ్ చార్జీలను పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. వదులుకున్న విద్యుత్‌కు యూనిట్‌కు రూపాయి వరకు పెనాల్టీలు ఉంటాయి. ఉదాహరణకు ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం ఉండగా, కనీసం 80 శాతం అంటే 800 మెగావాట్లను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంది. గత మంగళవారం కేవలం 97 మెగావాట్లను కొనుగోలు చేసింది. వదులుకున్న 703 మెగావాట్ల(16.8 మిలియన్ యూనిట్లు) విద్యుత్‌కు పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో యూనిట్‌కు రూ.2.75 ఫిక్స్డ్ చార్జీ చొప్పున 16.8 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు పెనాల్టీలు చెల్లించాల్సి రానుంది. బచావత్ కేటాయింపులు కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేయడానికి 1969 ఏప్రిల్ 10న జస్టిస్ బచావత్ నేతృత్వంలో కేంద్రం కేడబ్ల్యూడీటీ–1 ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 1976 మే 27న తుది తీర్పు ఇచ్చింది. కృష్ణా జలాల పంపిణీకి బచావత్ ‘ఫస్ట్ ఇన్ యూజ్.. ఫస్ట్ ఇన్ రైట్(మొదటి నీటిని వాడుకున్న ప్రాజెక్టులకే ప్రథమ హక్కు)ను మూలసూత్రంగా పాటించింది. కృష్ణా డెల్టాకు 1854 నుంచి ప్రకాశం బ్యారేజీ ద్వారా నీళ్లందిస్తున్నారు. బేసిన్ పరిధిలోని మూడు రాష్ట్రాల్లో 1969 నాటికి పూర్తయిన ప్రాజెక్టుల్లో అత్యంత పురాతనమైనది. దాంతో.. కృష్ణా డెల్టా నుంచే నీటి పంపిణీని ప్రారంభించిన కేడబ్ల్యూడీటీ–1 ప్రతిపాదన దశలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు చివరగా కేటాయింపులు చేసింది. ► కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు.. పునరుత్పత్తి కింద 70 టీఎంసీలు వెరసి 2,130 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని లెక్కగట్టిన కేడబ్ల్యూడీటీ–1 మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించింది. ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1969 నాటికి పూర్తయిన, 1976 నాటికి నిర్మాణంలోనూ, ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసింది. పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 749.16 టీఎంసీలు, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలంలో ఆవిరి నష్టాలకు 33 టీఎంసీలను కేటాయించింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. పునఃపంపిణీ చేసిన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం.. కృష్ణా డెల్టా ఆధునికీకరణతో మిగిలిన 30 టీఎంసీల్లో బీమా ఎత్తిపోతల పథకానికి 20, పులిచింతలకు 9 టీఎంసీలను కేటాయిస్తూ ఏప్రిల్ 16, 1996న ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేడబ్ల్యూడీటీ–1 పునరుత్పత్తి కింద కేటాయించిన 11 టీఎంసీలకు, కేసీ కెనాల్ ఆధునికీకరణతో మిగిలిన ఎనిమిది టీఎంసీలను కలిపి మొత్తం 19 టీఎంసీలను ఎస్సార్బీసీకి కేటాయిస్తూ జూలై 4, 1994లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని పరిగణలోకి తీసుకుంటే కేడబ్ల్యూడీటీ–1 ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం పునఃపంపిణీ ద్వారా రాయలసీమకు 144.7, కోస్తాకు 367.34, తెలంగాణకు 298.96 టీఎంసీలు దక్కాయి. ఆ మేరకు మూడు ప్రాంతాలు కృష్ణా జలాలను వినియోగించుకున్నాయి. బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇలా... కృష్ణా జలాల పునఃపంపిణీకి ఏప్రిల్, 2004లో ఏర్పాటైన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్.. బచావత్ ట్రిబ్యునల్ తుది తీర్పునే ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు చేస్తూ 2016 అక్టోబర్ 19న కేంద్రానికి తుది నివేదిక ఇచ్చింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కొనసాగించింది. 75 శాతం, 65 శాతం లభ్యత మధ్య అందుబాటులో ఉన్న 163 టీఎంసీల్లో మహారాష్ట్రకు 46, కర్ణాటకకు 68, ఆంధ్రప్రదేశ్‌కు 49 టీఎంసీలను కేటాయించింది. 65 శాతం లభ్యత ఎగువన 285 టీఎంసీల మిగులు జలాల్లో మహారాష్ట్రకు 35, కర్ణాటకకు 105, ఆంధ్రపద్రేశ్‌కు 145 టీఎంసీలను కేటాయించింది. వీటిని పరిగణలోకి తీసుకుంటే మహారాష్ట్రకు 81, కర్ణాటకకు 173, ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీలను అదనంగా కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 75 – 65 శాతం మధ్య లభ్యతగా ఉన్న జలాల్లో కేటాయించిన 49 టీఎంసీల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో క్యారీ ఓవర్ కింద 30 టీఎంసీలు, జూరాల ప్రాజెక్టు(కే–7) ప్రాంతంలో 9, ఆర్డీఎస్ కుడి కాలువకు 4, సహజ ప్రవాహాలు కింద 6 టీఎంసీలు కేటాయించింది. 145 టీఎంసీల మిగులు జలాల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో క్యారీ ఓవర్ కింద 120, తెలుగుగంగకు 25 టీఎంసీలను కేటాయించింది. అయితే ఈ తుది నివేదికను సవాల్ చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు నుంచి ఉపసంహరించుకుంది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారిస్తుండటంతో బ్రిజేశ్ తీర్పును కేంద్రం ఇప్పటిదాకా నోటిఫై చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ బచావత్ తీర్పే అమల్లో ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు వీలుగా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును పొడిగించడంతో గత ఐదేళ్లుగా కసరత్తు చేస్తోంది. కేంద్రం తాత్కాలిక సర్దుబాటు.. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయని నేపథ్యంలో ప్రాజెక్టుల వారీగా బచావత్ చేసిన కేటాయింపులను పరిగణలోకి తీసుకుని జూన్ 19, 2015న ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. ఈ ఒప్పందంపై కేంద్ర జలవనరుల శాఖ నాటి అదనపు కార్యదర్శి అమర్జీత్సింగ్ సమక్షంలో ఏపీ జలవనరుల శాఖ నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, తెలంగాణ నీటిపారుదల శాఖ నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సంతకాలు చేశారు. తాత్కాలిక సర్దుబాటును కృష్ణా బోర్డు తీర్మానం మేరకు ఏటా పొడిగిస్తున్నారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ అదనంగా కేటాయించిన జలాలు కేడబ్ల్యూడీటీ–1 చేసిన కేటాయింపులు 811 టీఎంసీలకు అదనంగా 194 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించింది. ఇందులో తెలుగుగంగకు 25, జూరాలకు 9, ఆర్డీఎస్ కుడి కాలువకు నాలుగు.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో క్యారీ ఓవర్ స్టోరేజీ కింద 150 టీఎంసీలు, పర్యావరణ ప్రవాహాలు కింద 6 టీఎంసీలు కేటాయించింది. విభజన చట్టం 11వ షెడ్యూల్లో కేంద్రం ప్రకటించిన ఆరు ప్రాజెక్టులకు అవసరమైన జలాలు టీఎంసీల్లో కృష్ణా జలాల్లో వాటా తెలంగాణ కృష్ణా జలాల్లో మాకున్న 299 టీఎంసీల వాటా మరింత పెరగాలి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సరిదిద్దాలి. ఇందులో భాగంగానే కృష్ణా జలాల పునఃపంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ట్రిబ్యునల్‌ను త్వరితగతిన ఏర్పాటు చేసి తెలంగాణకు నీటి హక్కులు దక్కేలా చూడాలి. ►కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో కేవలం 35 శాతం మేర మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరీవాహకం 31.5 శాతం, ఆయకట్టు 37.5 శాతం ఉన్నా మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపారు. ►పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా తెలంగాణకు కేటాయింపులు 299 టీఎంసీల నుంచి 500 టీఎంసీలకు పెరగాలి. ►ట్రిబ్యునల్ తీర్పు వచ్చేలోగా ఇప్పటివరకు అమలు చేస్తున్న విధానాన్ని పక్కనపెట్టి ఇకపై ఉమ్మడి రాష్ట్రానికి చేసిన వాటాల్లోంచి సగం వాటా నీటిని వినియోగించుకుంటాం. ►ఏపీ, తెలంగాణ మధ్య ఇప్పటివరకు తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో కొనసాగుతూ వస్తున్న కృష్ణా జలాల వినియోగాన్ని తిరస్కరిస్తున్నాం. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో మాత్రమే నీటి పంపకాలు జరగాలి. ఆంధ్రప్రదేశ్ అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం(ఐఎస్ఆర్డబ్ల్యూడీ) 1956 సెక్షన్ 6(2) ప్రకారం నదీ జలాలను పంపిణీ చేస్తూ ఒక ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు సుప్రీం కోర్టు ఉత్తర్వులతో సమానం. దాన్ని పునఃసమీక్షించడానికి అవకాశం లేదని చట్టం చెబుతోంది. కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కేడబ్ల్యూడీటీ–1 మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసిన 2,130 టీఎంసీల జోలికి కేడబ్ల్యూడీటీ–2 వెళ్లకపోవడానికి ఇదే కారణం. మొత్తంగా 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని లెక్క కట్టిన బచావత్ మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను కొనసాగిస్తూనే బ్రిజేశ్ ట్రిబ్యునల్ అదనంగా 448 టీఎంసీలను మూడు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేసింది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ కేటాయించిన 194 టీఎంసీలను మాత్రమే రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. బ్రిజే‹శ్ ట్రిబ్యునలే తెలుగుగంగకు 25, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలు కేటాయించింది. మిగిలిన 165 టీఎంసీల్లో.. విభజన చట్టం ప్రకారం ఏపీకి చెందిన హంద్రీ–నీవాకు 40, గాలేరు–నగరికి 38, వెలిగొండకు 43.5 టీఎంసీలు దక్కుతాయి. తెలంగాణకు చెందిన నెట్టెంపాడుకు 22, కల్వకుర్తికి 25 టీఎంసీలు వచ్చే అవకాశం ఉంది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం నోటిఫై చేసినా ఆంధ్రప్రదేశ్ వాటా 512.04 టీఎంసీల నుంచి 662.54 టీఎంసీలకు పెరుగుతుందే తప్ప తగ్గదు. పోతిరెడ్డిపాడుపై.. తెలంగాణ పోతిరెడ్డిపాడును ఏమాత్రం గుర్తించం. చెన్నైకి తాగునీటినందించేందుకు బచావత్ అవార్డులో 15 టీఎంసీలను కేటాయించగా ఏనాడూ అంతమేరకు అందించలేదు. శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ)కు 19 టీఎంసీలను ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పునఃకేటాయింపులు చేసింది. వీటిని కూడా జూలై–అక్టోబర్ వరకే తరలించాల్సి ఉంది. రెండింటికి కలిపి 34 టీఎంసీలను తరలించాల్సి ఉండగా వందల టీఎంసీలను తరలిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పోతిరెడ్డిపాడు ద్వారా 11,150 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో లైనింగ్ చేయని కాలువను నిర్మించి రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు కృష్ణాజలాల్ని తరలించారు. దీనిపై ట్రిబ్యునల్‌లో విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఉమ్మడి ఏపీ పాలకులు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. దీనికి అదనంగా కరెంటు ఉత్పత్తి ద్వారా దిగువకు 5 వేల క్యూసెక్కుల జలాలను విడుదలచేసే పవర్ ఛానెల్ కూడా చేపట్టారు. అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు 1500 క్యూసెక్కుల లైనింగ్ కాలువను నిర్మించాల్సి ఉండగా.. 60,500 క్యూసెక్కులు (11,500+44,000+5000) లైనింగ్ చేయని కాలువను నిర్మించారు. ఇది అక్రమం. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో 881 అడుగుల కంటే ఎగువన నీటి మట్టం ఉంటేనే ప్రస్తుత డిజైన్ మేరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు 44 వేల క్యూసెక్కులు తరలించవచ్చు. కృష్ణా బేసిన్లో అతివృష్టి, అనావృష్టి వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు బాగా తగ్గాయి. దీనివల్ల శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. వరద వచ్చినప్పుడు ఒకేసారి భారీ స్థాయిలో వస్తోంది. వరదను ఒడిసి పట్టేలా కాలువల సామర్థ్యం లేకపోవడంలో వందలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. వరద నీటిని ఒడిసి పట్టి చట్టబద్ధంగా నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులను 35 నుంచి 40 రోజుల్లో నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కాలువలను విస్తరించే పనులు చేపట్టాం. సముద్రంలో కలిసే వరద జలాలను మళ్లించి కరువు ప్రాంతాన్ని సుభిక్షం చేయడం తప్పుకాదు. శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడానికి, తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేయడానికి ఏర్పాటు చేసిందే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. ఎస్సార్బీసీకి, తెలుగుగంగకు కేంద్ర జలసంఘం అనుమతి ఉంది. ఎస్సార్బీసీకి బచావత్, తెలుగుగంగకు బ్రిజేశ్ ట్రిబ్యునల్ కింద నీటి కేటాయింపులు ఉన్నాయి. గాలేరు–నగరిని విభజన చట్టం ద్వారా కేంద్రం అధికారికంగా గుర్తించింది. ఈ ప్రాజెక్టుల ఆయకట్టుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నుంచి నీటిని సరఫరా చేస్తాం. అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు నీటిని అందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను గుర్తించబోమని తెలంగాణ సర్కార్ ప్రకటించడంలో అర్థం లేదు. బేసిన్లలో నీటి వినియోగం తెలంగాణ సహజ న్యాయ సూత్రాల ప్రకారం బేసిన్ తాగు, సాగు అవసరాలు తీరాకే నీటిని ఇతర బేసిన్‌కు తరలించాలని స్పష్టంగా ఉన్నా ఏపీ మాత్రం కృష్ణా నుంచి ఇతర బేసిన్లకు తరలిస్తోంది. 367 టీఎంసీలను పెన్నా, ఇతర బేసిన్లకు తరలిస్తున్నారు. ►శ్రీశైలం నుంచి తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలిగొండ ద్వారా ఇతర బేసిన్లకు నీటిని తరలిస్తున్నారు. ►1977 అక్టోబర్ 28న కుదిరిన ఒప్పందం ప్రకారం చెన్నై తాగునీటి సరఫరాకుగాను 15 టీఎంసీలను తరలించేందుకు 1,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉన్న లైనింగ్ కాలువ నిర్మించాలి. ఈ కాల్వ ద్వారా కేవలం చెన్నై తాగునీటికే నీటిని సరఫరాచేయాలి. కానీ ఒప్పందానికి విరుద్ధంగా 11,150 క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను నిర్మించారు. అనంతరం 55,150 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచారు. ఈ విషయాన్ని బ్రిజేశ్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లలేదు. ►ఒప్పందం ప్రకారం 1,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం మాత్రమే ఉండాల్సిన ఈ కాల్వ ద్వారా ఏకంగా రోజుకు ఎనిమిది టీఎంసీల నీళ్లు ఇతర బేసిన్లకు తరలిపోతాయి. ఇక పెన్నా బేసిన్లో నిల్వ కోసం 185 టీఎంసీలతో రిజర్వాయర్లు కట్టారు. ఇందులో వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 16.950 టీఎంసీలు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయర్ సామర్థ్యం 17.735 టీఎంసీలు, సోమశిల ప్రాజెక్టు సామర్థ్యం 77.988 టీఎంసీలు, కండలేరు సామర్థ్యం 68 టీఎంసీలు, కడపజిల్లా కోసమని మైదుకూరు, దువ్వూరు మండలాల్లో 4.577 టీఎంసీల సామర్థ్యంతో ఉప రిజర్వాయర్లు (ఎస్ఆర్–1, 2)నిర్మించారు. ఇందులో కండలేరు మినహా మిగిలిన రిజర్వాయర్లన్నీ పెన్నా బేసిన్‌లోనివే. ఆంధ్రప్రదేశ్ తుంగభద్ర–పెన్నా నదులను అనుసంధానం చేస్తూ 1863లో జలరవాణా కోసం డచ్ సంస్థ కేసీ(కర్నూల్–కడప) కెనాల్‌ను తవ్వింది. సర్ ఆర్ధర్ కాటన్ నివేదిక ఆధారంగా కేసీ కెనాల్‌ను 1933లో నీటిపారుదల ప్రాజెక్టుగా బ్రిటీష్ సర్కార్ మార్చింది. ఈ కెనాల్ కింద 2,65,628 ఎకరాలకు నీళ్లందించడానికి బచావత్ 39.90 టీఎంసీలను కేటాయించింది. ఫిబ్రవరి 15, 1976న జరిగిన ఒప్పందం మేరకు తెలుగుగంగ చేపట్టాం. బ్రిజేశ్ ట్రిబ్యునల్ 25 టీఎంసీలు కేటాయించింది. విభజన చట్టం ద్వారా గాలేరు–నగరిని కేంద్రం అధికారిక ప్రాజెక్టుగా గుర్తించింది. కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు మళ్లించడం అక్రమమని తెలంగాణ సర్కార్ ఆరోపించడంలో అర్థం లేదు. ►తెలంగాణ సీఎం కేసీఆరే ‘బేసిన్లు లేవు.. భేషజాలు లేవు.. నదీ జలాలను మళ్లించి రెండు రాష్ట్రాల్లోనూ ప్రతి ఎకరాకూ నీళ్లందిస్తాం.. దుర్భిక్ష రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి సహకరిస్తాం’ అని ప్రకటించారు. ►నదుల అనుసంధానంతో సముద్రం పాలవుతోన్న జలాలను మళ్లించి దుర్భిక్షాన్ని తరిమికొట్టాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 27, 2012న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు కేంద్రం అనుసంధానాన్ని చేపట్టింది. ఈ అనుసంధానానికి ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్రానికి పూర్వమే చేపట్టిన కేసీ కెనాల్.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేపట్టిన తెలుగగంగే స్ఫూర్తి అని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) పేర్కొంది. ప్రాజెక్టులపై.. తెలంగాణ కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీలను ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల, 80 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు రూ.6,829.15 కోట్లతో పాలనా అనుమతులు జారీ చేయడం అసమంజసం. ఈ ప్రాజెక్టును ఒప్పుకోం. ఈ ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు లేవు, కేంద్ర జల సంఘం అనుమతులు సైతం లేవు. గతంలో కేంద్ర జల సంఘం ద్వారా నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులకు ఈఏసీ పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. కాబట్టి దీనికి పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదు. ►గ్రీన్ ట్రిబ్యునల్ సైతం నిర్మాణ పనులు కొనసాగించవద్దని చెప్పినా వినడం లేదు. ఇది కోర్టు ధిక్కరణే. ►బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కాకుండానే ఆర్డీఎస్ కుడి కాల్వ విస్తరణ పనులను ఏపీ చేపడుతోంది. ఇది విభజన చట్టానికి విరుధ్దం. ►పాలమూరు ఎత్తిపోతలపై సమగ్ర అధ్యయన నివేదిక కోసం 2013 ఆగస్టు 8న జీవో 72 ఇచ్చారు. 2014 ఏప్రిల్ 22న అప్పటి ప్రధాని సైతం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదించిన ప్రాజెక్టును రీ డిజైన్ చేశాం. ఇది పాత ప్రాజెక్టే. ►డిండి ప్రాజెక్టు చేపట్టేందుకు 2007 జూలై 7న జీవో 159 ఇచ్చారు. 2010 డిసెంబర్ 10న ప్రధాని కార్యాలయం సైతం డిండిని జాతీయ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకొనేందుకు ప్రతిపాదన కోరింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వీటిని రీ డిజైన్ చేశాం. ►తుమ్మిళ్ల ఎత్తిపోతలను సైతం తుంగభద్రలో మా వాటాను వినియోగించుకునేలా చేపట్టాం. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి కాలువలను అక్రమ ప్రాజెక్టులగా అభివర్ణించడం, పనులను ఆపాలని తెలంగాణ సర్కార్ కోరడం అర్థరహితం. ►తెలుగుగంగ, ఎస్సార్బీసీ, తెలుగగంగ, కేసీ కెనాల్ శ్రీశైలం కుడి గట్టు కాలువలకు 111 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. మాకు దక్కిన 512 టీఎంసీలను సమర్థంగా వినియోగించుకుని ఆయకట్టును స్థిరీకరణకే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టాం. ►శ్రీశైలంలో 796 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 4 టీఎంసీలు.. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే అక్రమంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, సామర్థ్యం పెంచిన కల్వకుర్తి ద్వారా 2.4 టీఎంసీలు, 825 అడుగుల నుంచి సామర్థ్యం పెంచిన ఎస్సెల్బీసీ ద్వారా 0.5 చొప్పున 2.9 వెరసి.. 6.9 టీఎంసీలను తరలించడం వల్ల నీటి మట్టం తగ్గిపోతోంది. శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కులు తరలించడానికి అవకాశం ఉంటుంది. 854 అడుగులోల నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కాలువల నుంచి 7 వేలు క్యూసెక్కులు తీసుకెళ్లవచ్చు. 848 అడుగులకు నీటి మట్టం తగ్గితే పోతిరెడ్డిపాడు ద్వారా కాలువలకు నీళ్లు చేరవు. ►శ్రీశైలం నుంచి తెలంగాణ సర్కార్ ఎడాపెడా తోడేస్తుండటం వల్ల నీటి మట్టం తగ్గిపోతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీళ్లందడం లేదు. నీటి కేటాయింపులు ఉన్న ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లందించడానికి, చెన్నైకి తాగునీటిని అందించడానికే సీమ ఎత్తిపోతల చేపట్టాం. ఆర్డీఎస్ కుడి కాలువకు కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన 4 టీఎంసీలను వాడుకోవడానికే కుడి కాలువ పనులు చేపట్టాం. ►కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, మిషన్ భగీరథ, భక్తరామదాస ఎత్తిపోతల, సామర్థ్యం పెంచిన కల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్సెల్బీసీసహా 24 ప్రాజెక్టులను తక్షణమే నిలిపేయాలి. నీటి కేటాయింపులపై తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా బేసిన్లో 68.5 శాతం పరీవాహకం ఉండగా కేటాయింపులు మాత్రం 36.9 శాతమే ఉన్నాయి. అదే ఏపీకి 31.5శాతం పరీవాహకం ఉండగా కేటాయింపులు మాత్రం 63.1శాతం ఉన్నాయి. ఇందులోనూ ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 367 టీఎంసీలు ఏపీ బేసిన్ బయటే వాడుకుంటోంది. కృష్ణా పరీవాహకంలో సాగు యోగ్య భూమి తెలంగాణకు 37.11 లక్షల హెక్టార్లు ఉండగా ఏపీకి కేవలం 16.03 లక్షల హెక్టార్లు మాత్రమే ఉంది. అయినా ఏపీకి కేటాయింపులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. జనాభా పరంగా చూసినా కృష్ణా బేసిన్లో తెలంగాణలో 2 కోట్ల మంది (71.9శాతం) మంది ఉండగా, ఏపీలో కేవలం 78.29 లక్షలు(28.1శాతం) మంది మాత్రమే ఉన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకున్నా తెలంగాణకు కేటాయింపులు పెరగాలి. ఆంధ్రప్రదేశ్ పరీవాహక ప్రాంతం ఆధారంగా నదీ జలాలను ట్రిబ్యునల్ పంపిణీ చేయదు. ఒప్పందాలు, వినియోగం ఆధారంగా నీటి కేటాయింపులు చేస్తుంది. ట్రిబ్యునల్ ఏర్పాటయ్యేనాటికి పూర్తయిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటిని కేటాయించడంలో ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టులకు లభ్యత ఆధారంగా కేటాయింపులు చేస్తుంది. బచావత్ ఏర్పాటయ్యేనాటికి అంటే 1969 నాటికే ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా బేసిన్లో పూర్తయిన ప్రాజెక్టులకు 749.16 టీఎంసీలవినియోగం ఉండేది. దాంతో ఆ ప్రాజెక్టులకు బచావత్ నీటి కేటాయింపులు చేసింది. ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టు ఆవిరి నష్టాల కింద 33 టీఎంసీలు కేటాయించింది. ఎక్కడా పరీవాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఒకవేళ పరీవాహక ప్రాంతాన్నే పరిగణనలోకి తీసుకుంటే అత్యధిక పరీవాహక ప్రాంతం ఉన్న కర్ణాటకకు 734 కేటాయించి.. తక్కువ పరీవాహక ప్రాంతం ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను కేటాయించేది కాదు. మళ్లింపు జలాల్లో వాటా తెలంగాణ 1976 గోదావరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు కృష్ణాలో నీటి హక్కులు సంక్రమిస్తాయి. కృష్ణా నీటిలో దక్కే 80 టీఎంసీలకుగానూ 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఈ నీటి వాటా హక్కు తెలంగాణదే. బచావత్ అవార్డు ప్రకారం పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుంది. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదని లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అంటే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించి పట్టిసీమ ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలి. ఈ లెక్కన మొత్తంగా తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచాలి. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించిన 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో మహారాష్ట్రకు 14, కర్ణాటకకు 21, నాగార్జునసాగర్‌కు ఎగువన ఆంధ్రప్రదేశ్‌కు 45 టీఎంసీలను అదనంగా వినియోగించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ అవకాశం కల్పించింది. ఇందులో 45 టీఎంసీలు తమకే దక్కుతాయని తెలంగాణ సర్కార్ వాదిస్తుండటం అన్యాయం. నాగార్జునసాగర్‌కు ఎగువన ఆంధ్రపదేశ్‌కు కూడా ఆ జలాలు దక్కుతాయన్న వాస్తవం తెలుసుకోవాలి. తెలంగాణ సర్కార్ కృష్ణా బేసిన్‌లోని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 6.43, ఎస్సారెస్పీ ద్వారా మున్నేరు, మూసీ సబ్ బేసిన్లకు 68.40, దేవాదుల ద్వారా 24.650, కాళేశ్వరం ద్వారా 83.190, వరద కాలువ ద్వారా 28.395 వెరసి 211.45 టీఎంసీల గోదావరి జలాలను తరలిస్తోంది. ఈ జలాలకుగానూ కృష్ణా జలాల్లో 211.45 టీఎంసీలను ఏపీకి అదనపు వాటాగా ఇవ్వాలి. తాగునీటిలో 20 శాతం మాత్రమే లెక్క తెలంగాణ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వాడుకుంటున్న నీటిలో 20 శాతాన్నే వినియోగ కోటా కింద పరిగణించాలని 2016లో కృష్ణా బోర్డును కోరాం. కృష్ణా బేసిన్‌లోని హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం వివిధ రూపాల్లో మూసీ ద్వారా కృష్ణాలో కలుస్తోంది. తాగునీటి కోసం కేటాయించిన మొత్తం జలాల్లో 80 శాతం తిరిగి నదిలోకే వస్తాయి. తాగునీటి కేటాయింపులను కేవలం 20 శాతంగానే పరిగణనలోకి తీసుకోవాలని బచావత్ ట్రిబ్యునల్ సైతం తేల్చిచెప్పింది. దీని ప్రకారం కృష్ణా జలాల్లో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కేటాయించిన 16 టీఎంసీల్లో కేవలం 20 శాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. తాగునీటి కోసం తరలించే జలాల్లో 20 శాతం తాగునీటికి వెళ్తాయి. మిగిలిన 80 శాతం నీరు మురుగునీటి కాలువల ద్వారా తెలంగాణలోని చెరువులు, చిన్నతరహా ప్రాజెక్టులకే చేరుతాయి. ఆ నీటితో తెలంగాణలో పంటలు కూడా పండించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు తాగునీటి కోసం తరలించే కృష్ణా జలాల్లో 20 శాతాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలన్న తెలంగాణ సర్కార్ ప్రతిపాదన ఏమాత్రం సబబు కాదు. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తెలంగాణ కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చే ప్రయత్నాలకు మేం వ్యతిరేకం. ఇప్పటికి జరిగిన రెండు అపెక్స్ కౌన్సిల్ భేటీల్లోనూ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్¯ 85(1) ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేశాక ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక... కేవలం బోర్డు వీటి నిర్వహణను మాత్రమే చూడాలి. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిగాకే నియంత్రణపై ముందుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ బ్రిజేశ్ తీర్పును కేంద్రం నోటిఫై చేసేదాకా కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ వాదించడం అసంబద్ధం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా జలాలను బచావత్ కేటాయించింది. కేంద్రం తక్షణమే బోర్డు పరిధిని నోటిఫై చేయాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డు పరిధిలోకి తెచ్చి వాటిపై ఆధారపడిన సాగు, తాగునీటి ప్రాజెక్టులతోపాటూ విద్యుత్కేంద్రాలను బోర్డు నియంత్రణలోకి తెచ్చి రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించాలి. ఇతర బేసిన్లకు కుదరదు.. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ప్రాజెక్టేనని బచావత్ చెప్పింది. విద్యుత్ అవసరాలకు మినహా వేరే అవసరాలకు ఒక్క బొట్టు కూడా వాడొద్దు అని చెప్పింది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ కూడా ఇదే చెప్పింది. విద్యుదుత్పత్తిని ప్రాజెక్టుల్లోని ఏ మట్టం నుంచైనా చేపట్టవచ్చు. తెలంగాణ అవసరాలు పట్టించుకోకుండా పక్క బేసిన్లకు నీటిని తరలిస్తామంటే కుదరదు. – రంగారెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కొత్తగా కోరడం లేదు కృష్ణా జలాల్లో నీటి వాటాలు పెంచాలని కొత్తగా అడగడం లేదు. బేసిన్ అవసరాలు తీరాక వరద జలాలు తరలించుకుంటే ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. పోలవరానికి సీడబ్ల్యూసీ అధికారిక అనుమతి వచ్చిన వెంటనే సాగర్ ఎగువన ఉన్న తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలి’ – శ్యాం ప్రసాద్‌రెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కేటాయింపులు పెరగాల్సిందే కృష్ణా జలాల్లో తెలంగాణకు మొదటినుంచీ అన్యాయం జరిగింది. కేవలం 13శాతం పరీవాహకం ఉన్న ఆంధ్రా ప్రాంతం 45శాతం నీటిని అంటే 367 టీఎంసీలను వినియోగిస్తోంది. నిజానికి ఆంధ్రా ప్రాంతానికి ఉన్న అర్హత 106 టీఎంసీలు మాత్రమే. గతం నుంచి నీటిని అనుభవిస్తున్నామని సాకుగా చెబుతూ దానిని హక్కుగా చూపరాదు. – దొంతు లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం కన్వీనర్ పునఃపంపిణీ చట్టవిరుద్ధం ట్రిబ్యునల్ ఒక్క సారి నదీ జలాలను పంపిణీ చేస్తూ తీర్పు ఇచ్చిన తర్వాత పునఃసమీక్షించడానికి వీల్లేదు. కృష్ణాలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ కేటాయించిన 2130 టీఎంసీలను బ్రిజేశ్ ట్రిబ్యునల్ పునఃపంపిణీ చేయకపోవడానికి కారణమదే. సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని తెలంగాణ కోరడం చట్టవిరుద్ధం. – డి.రామకృష్ణ, రిటైర్డు సీఈ సాగునీటి అవసరాలకే.. ఉమ్మడి రాష్ట్రంలోనే శ్రీశైలం, సాగర్, పులిచింతల నిర్వహణ ప్రోటోకాల్స్ రూపొందించారు. శ్రీశైలంలో మట్టం 834 అడుగులు దాటాకే సాగర్, కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలు ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేయాలి. 2014 నుంచి నీటి మట్టం కనీస స్థాయి కంటే దిగువన ఉన్నప్పటి నుంచే కృష్ణా బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ఖాళీ చేస్తోంది. – ఎం.వెంకటేశ్వరరావు, రిటైర్డు ఈఎన్సీ రాయలసీమ ఎత్తిపోతలే శరణ్యం శ్రీశైలంలో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలు, అక్రమంగా చేపట్టిన పాలమూరు, డిండి, కల్వకుర్తి, ఎస్సెల్బీసీ ద్వారా 800 అడుగుల నుంచే రోజుకు 2.9 టీఎంసీల చొప్పున మొత్తం 6.9 టీఎంసీలు తరలిస్తుండటం వల్ల నీటి మట్టం తగ్గిపోతోంది. దీన్ని అధిగమించాలంటే 800 అడుగుల నుంచే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువకు ఎత్తిపోయడం మినహా మార్గం లేదు. – నారాయణరెడ్డి, ఈఎన్సీ -
తెలంగాణ తీరును ప్రజల్లోకి తీసుకెళ్దాం
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడమే పరమావధిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పని చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య 2015లో కుదిరిన ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వ వాదన, ఆ నీటిపై ఆంధ్రప్రదేశ్ హక్కు, వాడుకుంటున్న నీటిపై వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలకు అవగాహన కల్పించేందుకు శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు 109 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణా మంత్రులు, ఎమ్మెల్యేలు లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని.. వాస్తవ విరుద్ధమైన వారి వాదననను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. మనకు రావాల్సిన నీటి వాటా కోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని, దానిపై తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. కేసీఆర్ తన పార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే జల దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఈ వ్యవహారంలో పచ్చమీడియా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందన్నారు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం నదీ జలాల ఒప్పందాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటే.. మరోవైపు సందట్లో సడేమియాలా చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతూ ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల వివాదానికి మూల కారకుడు, అసలు నేరస్తుడు చంద్రబాబేనని స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న ఆయన.. అప్పట్లో తెలంగాణ సర్కార్ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడదాం తెలంగాణ అబద్ధపు ప్రచారానికి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని అందరికి చాటి చెప్పేలా కార్యక్రమాలు చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. అందరూ బాగుండాలన్నదే సీఎం అభిమతం అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల దూకుడును అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తెలంగాణ అడ్డగోలు వాదనకు గట్టిగా సమాధానం చెప్పాలని ఉన్నా, సంయమనం పాటిస్తున్నామని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కేంద్రం పరిష్కారం చూపడం లేదని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మనం రెచ్చిపోకుండా రైతులకు న్యాయం జరిగేలా వ్యవహరించాలని విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దిగువన ఉన్న వారు ఎలా దోపిడీ చేస్తారని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. వాస్తవ విషయాన్ని ప్రజలందరికి వివరించి, అవగాహన కల్పించాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులందరూ అభిప్రాయపడ్డారు. మా కోటా నీటినే వాడుకుంటాం కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి గతంలో పలు ఒప్పందాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన తర్వాత 2015లో కుదిరిన ఒప్పందాన్ని తెలంగాణ ఉల్లంఘిస్తోంది. మేము చేపట్టింది ప్రాజెక్టు కాదు. కేవలం ఎత్తిపోతల పథకం మాత్రమే. అందువల్ల దాన్ని ఆపాలని చెప్పడం సరికాదు. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగులకు పైగా నీరుంటేనే.. పోతిరెడ్డిపాడు ద్వారా మనకు రావాల్సిన 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకోవడం సా«ధ్యమవుతుంది. మాకు కేటాయించిన నీటి కంటే ఒక్క చుక్క కూడా ఎక్కువ తీసుకోం. ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నీరు ఉన్నప్పటికీ తెలంగాణా ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటి దాకా 30, 40 టీఎంసీలు డ్రా చేశారు. అటు పులిచింతల నుంచి కూడా 14 వేల క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రజలకు వివరించాలి. –అనిల్ కుమార్ యాదవ్, జల వనరుల శాఖ మంత్రి -
దేవుడితోనైనా కొట్లాడుతాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్తోనే కాదు.. అవసరమైతే దేవుడితోనైనా పోరాడుతామని, పాలమూరుకు నీటినందించే విషయంలో ఎలాంటి రాజీలేదని రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో శనివారం ఆయన పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి తీరుతామన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నారాయణపేట జిల్లాకు నీరందించే కెనాల్ కోసం వచ్చే నెల 10న ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నట్లు తెలిపారు. దీనిపై ఈ ప్రాంతానికి చెందిన వారే అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులందరూ రైతులను అధిక సంఖ్యలో తీసుకొచ్చి కరివెన నుంచి నారాయణపేట వరకు చేపట్టే కెనాల్‌కు అవసరమైన భూసేకరణకు మద్దతు తెలపాలని కోరారు. నేతన్నలను అన్ని విధాలా ఆదుకుంటాం.. రూ.5 లక్షల బీమా వర్తింపజేసే పథకాన్ని రాష్ట్రంలోని నేత కార్మికులకు త్వరలో వర్తించేలా చూస్తామని కేటీఆర్ అన్నారు. 70 ఏళ్లలో ఎవరూ ఆలోచించని విధంగా ముఖ్యమంత్రి పల్లెలు, పట్టణాలను ప్రగతి బాటలో నడిపిస్తున్నారన్నారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేసి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని చెప్పారు. అయినా ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో వెనుకడుగు వేయకుండా కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరిని పండించామని.. రైతులకు ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, వాణిదేవి, ప్రభుత్వ విప్‌లు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ సభ ప్రారంభానికి ముందు మంత్రి కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి.. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోపాటు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తుండగా పీడీఎస్ విద్యార్థులు నిరసన తెలిపారు. పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వీరిని కూడా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. -
కృష్ణా జలాలపై వాస్తవంగా ఎలాంటి వివాదం లేదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: కృష్ణా జలాలపై వాస్తవంగా ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం రాజకీయ కోణంలో వివాదం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. కృష్ణా జలాలు, రెండు రాష్ట్రాల వినియోగం సహా.. ఏపీ హక్కులు అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం వర్చువల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అనిల్‌కుమార్, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. అసలు అక్రమంగా పాలమూరు రంగారెడ్డి కట్టింది తెలంగాణ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్ కూడా రాయలసీమకు నీళ్ళందించాల్సిన అవసరం ఉంది, సహకరిస్తాం అన్నారని సజ్జల గుర్తు చేశారు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అడ్డు తగులుతున్నారని దుయ్యబట్టారు. రాయలసీమ లిఫ్ట్ ద్వారా కొత్తగా ఆయకట్టుకి నీళ్లివ్వడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలోనే తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కట్టిందని, ఆ రోజు వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షలు చేసినా చంద్రబాబు మేల్కొనలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కుల కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని, చంద్రబాబు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళతామని స్పష్టం చేశారు. కృష్ణా నీటి కేటాయింపులు ప్రాజెక్టుల వారిగా జరిగాయన్న సజ్జల.. ఇద్దరు ముఖ్యమంత్రులు సంతకాలు చేశారని ప్రస్తావించారు. కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, నాగార్జున సాగర్ విద్యుత్ ఉత్పత్తి వలన తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ అంశాలపై అన్ని వేదికల ద్వారా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. -
పొరుగు రాష్ట్రాలతో సఖ్యతనే కోరుకుంటున్నాం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఒప్పందం మేరకే మా రాష్ట్రానికి కేటాయించిన నీటిని మేం తీసుకోవడంలో తప్పేముందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో గురువారం రైతు దినోత్సవ సభలో ఆయన కృష్ణా జలాల అంశంపై మాట్లాడుతూ.. నీటి విషయంలో జరుగుతున్న గొడవలు చూస్తున్నామని, ఇటీవల కాలంలో తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు మొదట్లో మౌనంగా ఉన్నా.. తర్వాత మాట్లాడటం మొదలుపెట్టారన్నారు. ‘గతంలో ఏపీ అంటే కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణాల కలయిక. దశాబ్దాల తరబడి మూడు ప్రాంతాల మధ్య నీటి కేటాయింపులు జరుగుతున్నాయి. రాష్ట్రం విడిపోయాక తెలంగాణకు 298 టీఎంసీలు, ఏపీకి 144 టీఎంసీలు, కోస్తాకు 369 టీఎంసీలు కేటాయించగా.. కేంద్ర ప్రభుత్వంతో కలసి నీటి కేటాయింపులపై 2015, జూన్ 19న సంతకాలు చేశాం. పోతిరెడ్డిపాడు నుంచి కిందకు పూర్తిస్థాయిలో నీరు రావాలంటే శ్రీశైలంలో 881 అడుగులు నీళ్లు ఉండాలి. ఈ రెండేళ్లు మినహాయిస్తే శ్రీశైలంలో పూర్తి నీటి మట్టం 885 అడుగుల నీళ్లు ఉన్న రోజులు గత 20 ఏళ్లలో ఏడాదిలో 20 నుంచి 25 రోజులు కూడా లేవు. ఇలాంటి సమయంలో పోతిరెడ్డిపాడుకు పూర్తిస్థాయిలో నీటిని తీసుకెళ్లలేని పరిస్థితి. మరోవైపు పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి సామర్థ్యం పెంచి 800 అడుగులలోపే నీటిని తీసుకునే వెసులుబాటు తెలంగాణకు ఉంది. 796 అడుగుల వద్దే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 800 అడుగుల్లోపు లోనే మీకు కేటాయించిన నీటిని వాడుకుంటే తప్పులేనప్పుడు.. 881 అడుగులు ఉంటే తప్ప నీళ్లు వాడుకోలేని పరిస్థితి మాకున్నప్పుడు.. మేం 800 అడుగుల వద్దే మాకు కేటాయించిన నీటిని తీసుకోవడంలో తప్పేముంది?. ఈ రోజు చంద్రబాబు నీళ్ల గురించి మాట్లాడుతున్నారు.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి, డిండి లాంటి ప్రాజెక్టులు కడుతుంటే ఆ సమయంలో గాడిదలు కాశారా’అని జగన్ ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతనే కోరుకుంటున్నాం 369 టీఎంసీలు కేటాయించగా.. కేంద్రంతో కలసి నీటి కేటాయింపులపై 2015, జూన్ 19న సంతకాలు చేశాం. పోతిరెడ్డిపాడు నుంచి కిం దకు పూర్తిస్థాయిలో నీరు రావాలంటే శ్రీశైల ంలో 881 అడుగులు నీళ్లు ఉండాలి. ఈ రెం డేళ్లు మినహాయిస్తే శ్రీశైలంలో పూర్తి నీటి మట్టం 885 అడుగుల నీళ్లు ఉన్న రోజులు గత 20 ఏళ్లలో ఏడాదిలో 20–25 రోజులు కూడా లేవు. ఇలాంటి సమయంలో పోతిరెడ్డిపాడుకు పూర్తిస్థాయిలో నీటిని తీసుకెళ్లలేని పరిస్థితి. మరోవైపు పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి సామర్థ్యం పెంచి 800అడుగుల లోపే నీటిని తీసు కునే వెసులుబాటు తెలంగాణకు ఉంది. 796 అడుగుల వద్దే తెలం గాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 800 అడుగు ల్లోపు లోనే మీకు కేటాయించిన నీటిని వాడుకుంటే తప్పులేనప్పుడు.. 881 అడు గులు ఉంటే తప్ప నీళ్లు వాడుకోలేని పరిస్థితి మాకు న్నప్పుడు.. మేం 800 అడుగుల వద్దే మాకు కేటాయించిన నీటిని తీసుకోవడంలో తప్పేముంది?. ఈ రోజు చంద్రబాబు నీళ్ల గురించి మాట్లాడుతున్నారు.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి, డిండి లాంటి ప్రాజెక్టులు కడుతుంటే గాడిదలు కాశారా’అని జగన్ ప్రశ్నించారు. సఖ్యతతోనే పరిష్కారం: జగన్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టలేదు.రాబోయే రోజుల్లోనూ వేలు పెట్టను. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి. సఖ్యతతోనే పరిష్కారాలు వెతుక్కోవాలి. -
నాడు ద్రోహం.. నేడు మోసం
సాక్షి, అమరావతి: ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టి రైతులకు ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు సాగు, తాగునీళ్లు దక్కకుండా ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు దాఖలు చేయించి అఖిలపక్షం డిమాండ్‌తో మరో నాటకానికి సిద్ధమయ్యారు. నాడూ నేడూ రైతులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కృష్ణా జలాల వివాదంపై ప్రధాని మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేయడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. ఈ వివాదం ఏర్పడటానికి మూలకారకుడు చంద్రబాబేనని గుర్తు చేస్తున్నారు. ఈ పాపం ఎవరిది బాబూ? విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కృష్ణా బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం బోర్డు పరిధి, వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఖరారు చేయలేదు. ప్రాజెక్టుల నిర్వహణకు మధ్యంతర ఏర్పాట్లు చేసింది. ఎవరి భూ భాగంలో ఉన్నవాటిని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకునేలా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్ నిర్వహించేలా 2014లో ఏర్పాటు చేసింది. దీని ప్రకారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. ఏపీ భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. మరోవైపు శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తన భూభాగంలో ఉందంటూ దాన్ని కూడా తెలంగాణ సర్కార్ తన నియంత్రణలోకి తీసుకుంది. ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో జలవిద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందనే సాకుచూపి దాన్ని కూడా తెలంగాణ సర్కార్ స్వాధీనం చేసుకుంది. కొబ్బరి చిప్పల సిద్ధాంతంతో.. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు రెండు కళ్లు, కొబ్బరిచిప్పల సిద్ధాంతంతో ఈ అక్రమంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదపలేదు. దీంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా కృష్ణా బోర్డు ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం బేఖాతర్ చేస్తూ యథేచ్ఛగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం దిగువకు నీటిని వదిలేస్తోంది. ఫలితంగా శ్రీశైలంలో నీటి మట్టం అడుగంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించలేని దుస్థితి నెలకొంది. బలగాలను వెనక్కి రప్పించిన బాబు.. నాగార్జునసాగర్ కుడి కాలువకు కృష్ణా బోర్డు కేటాయించిన జలాలు పూర్తి స్థాయిలో విడుదల కాకున్నా 2015 ఫిబ్రవరి 12న తెలంగాణ సర్కార్ అర్థాంతరంగా ఆపేసింది. ఈ క్రమంలో ఆంధప్రదేశ్ భూ భాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు నాటి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, అధికారులు పోలీసు బలగాలతో మరుసటి రోజు నాగార్జునసాగర్ వద్దకు చేరుకున్నారు. తెలంగాణ సర్కార్‌ను అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన నాటి సీఎం చంబ్రాబుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓటుకు నోటు కేసు నమోదు చేసింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వా«ధీనం చేసుకోవడానికి వెళ్లిన రాష్ట్ర అధికారులను చంద్రబాబు వెనక్కి రప్పించారు. దీంతో సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ తెలంగాణ సర్కార్ అధీనంలోనే ఉండిపోయింది. కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా తెలంగాణ సర్కార్ సాగర్ కుడి కాలువకు నీటిని సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో విఫలం.. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 90, రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. వీటితోపాటు కేసీ కెనాల్‌కు నీళ్లందించే సుంకేశుల బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి 5.44 టీఎంసీలు తరలించేలా తుమ్మిళ్లను, పాలేరు రిజర్వాయలోకి 5.54 టీఎంసీల ఎత్తిపోతలకు భక్త రామదాస, మిషన్ భగీరథ ప్రాజెక్టులను అక్రమంగా తెలంగాణ చేపట్టింది. నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంచింది. ఈ ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా 178.93 టీఎంసీలను అక్రమంగా తరలించేలా 2015లోనే పనులు ప్రారంభించింది. ఈ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 2016లో మే 16 నుంచి 18 వరకూ కర్నూలులో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి జలదీక్ష చేశారు. నాటి సీఎం చంద్రబాబు దీనిపై స్పందించలేదు. చివరకు తెలంగాణ అక్రమంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను అడ్డుకోవాలని కృష్ణా డెల్టా రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో 2016 సెప్టెంబరు 21న నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశాన్ని నిర్వహించారు. కేటాయింపులకు మించి ఒక్క చుక్క నీటిని కూడా అదనంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి ద్వారా వాడుకోబోమని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ సమావేశంలో చెప్పారు. కానీ తెలంగాణ అప్పటికే కేటాయించిన నీటి కంటే ఎక్కువగా వాడుకుంటోందని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా చేపట్టిన ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేయడంలో నాటి సీఎం చంద్రబాబు విఫలమయ్యారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికే అపెక్స్ కౌన్సిల్లో రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సర్కార్‌కు చంద్రబాబు తాకట్టు పెట్టారని స్పష్టమవుతోంది. ఫలితంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి తదితర అక్రమ ప్రాజెక్టులను తెలంగాణ నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. తుమ్మిళ్ల, భక్తరామదాస, కల్వకుర్తి, నెట్టెంపాడు, మిషన్ భగీరథలను ఇప్పటికే పూర్తి చేసింది. సొంత జిల్లా ప్రజలకు వెన్నుపోటు.. కండలేరు జలాలను తరలించి చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాన్ని, గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను అనుసంధానం చేసి పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల పనులను చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలంటూ టీడీపీ నేత, చిత్తూరు జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు జి.గుణశేఖర్‌నాయుడుతోపాటు మరో 13 మంది పార్టీ నేతలతో ఎన్జీటీలో చంద్రబాబు కేసు వేయించి తన నైజాన్ని చాటుకున్నారు. హక్కుల పరిరక్షణకు నిర్మాణాత్మక చర్యలు.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్మాణాత్మక చర్యలు చేపట్టారని నీటిపారుదలరంగ నిపుణులు పేర్కొంటున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులను వినియోగించుకునేందుకే ఆర్డీఎస్ కుడి కాలువ పనులను చేపట్టారని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదాన్ని పరిష్కరించేందుకు గతేడాది అక్టోబర్ 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా తెలంగాణ చేపట్టిన 8 ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని అపెక్స్ కౌన్సిల్లో సీఎం వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని స్పష్టం చేశారు. తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేసి అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. శ్రీశైలంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తితో కృష్ణా జలాలు వృథాగా కడలిలో కలిసేలా చేస్తూ తెలంగాణ సర్కార్ సాగిస్తోన్న అక్రమాన్ని అడ్డుకోవాలని ఇప్పటికే రెండు సార్లు ప్రధాని మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌లకు లేఖ రాశారు. -
రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెట్టారు
సాక్షి, హైదరాబాద్: కృష్టా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను సీఎం కేసీఆర్ ఆంధ్రాకు తాకట్టు పెట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. గురువారం టీజేయూ, తెలంగాణ జల సాధన సమితి ఆధ్వర్యం లో ‘కృష్టా జలాల సాధన కోసం మర్లబడుదాం రండి’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లా డారు. తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల కృష్టా జలాలను వినియోగించుకోవటంలో సీఎం విఫలమయ్యారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 4 ప్రాజెక్టుల నిర్మాణ పనులు 90 శాతం పూర్తి కాగా, మిగిలిన అరకొర పనులు ఏడేళ్లు గడిచినా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలతో కేంద్రం సమావేశం నిర్వహించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సూచించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. -
నీటిని రాజకీయాలకు వాడుకోవద్దు
-
అక్రమాన్ని అడ్డుకోండి
జూన్ 1 నుంచి ఇప్పటి వరకు శ్రీశైలంలోకి 26 టీఎంసీలు వస్తే.. తెలంగాణ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా 19 టీఎంసీలను వాడుకుని, దిగువకు వదిలేసింది. అందువల్ల శ్రీశైలంలో నీటి మట్టం పెరగడం లేదు. దీంతో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడికి దారితీస్తోంది. విభజన చట్టంలో నిబంధనల మేరకు కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే నోటిఫై చేయాలి. ఉమ్మడి రిజర్వాయర్లలో సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు, విద్యుత్కేంద్రాలను బోర్డు నియంత్రణలోకి తేవాలి. వాటికి సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించాలి. ఆ ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా.. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించాలి. సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు వాటా దక్కకుండా చేయాలనే ఉద్దేశంతోనే.. సాగునీటి అవసరాలు లేకున్నా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ సర్కార్ దుందుడుకు చర్యల వల్ల కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని వివరించారు. ఈ అంశాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డుల దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా వివాదం పరిష్కారం కాలేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రం ద్వారా రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణ సర్కార్‌కు ఉందని పేర్కొన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి.. సామర్థ్యం పెంచిన కల్వకుర్తి, ఎస్సెల్బీసీ పూర్తయితే శ్రీశైలంలో చుక్క నీరు కూడా ఏపీకి మిగలదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని అక్రమంగా నీటిని వాడుకోకుండా తెలంగాణ సర్కార్‌ను కట్టడి చేసేలా కేంద్ర జల్ శక్తి శాఖకు దిశానిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి బుధవారం సీఎం వైఎస్ జగన్ రెండోసారి లేఖ రాశారు. లేఖలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్న తెలంగాణ ► విభజన చట్టం ద్వారా ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు.. రెండు రాష్ట్రాలకు నీటి వాటాల పంపిణీ, నీటి విడుదలపై రూపొందించిన తాత్కాలిక సర్దుబాట్లు, ఒప్పందాలను తెలంగాణ సర్కార్ తుంగలో తొక్కుతూ ఉమ్మడి ప్రాజెక్టుల్లో ఆపరేషనల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తుండటాన్ని ఈనెల 1న రాసిన లేఖలో మీ దృష్టికి తెచ్చాం. ► శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా డిజైన్ చేసిన మేరకు 44 వేల క్యూసెక్కులు కాలువల ద్వారా తరలించవచ్చు. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులకు చేరితే అత్యవసరాల కోసం కేవలం 6వేల క్యూసెక్కులనే తరలించొచ్చు. తద్వారా తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు అవకాశముంటుంది. చెన్నైకీ తాగునీరు సరఫరా చేయవచ్చు. ► ప్రస్తుత నీటి సంవత్సరంలో మొదటి రోజే.. అంటే జూన్ 1న శ్రీశైలంలో కనీస నీటి మట్టం(విద్యుదుత్పత్తికి) 834 అడుగుల దిగువన నీటి నిల్వ ఉన్నా.. కృష్ణా బోర్డుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టులో ఎలాంటి సాగునీటి అవసరాలు లేకున్నా తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. ఈ క్రమంలో పూర్తి స్థాపిత సామర్థ్యంతో నిరంతరాయంగా జల విద్యుదుత్పత్తి చేయాలని తెలంగాణ సర్కార్ జూన్ 28న ఉత్తర్వులిచ్చింది. ఆ మేరకు శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తోంది. ఆ నీళ్లన్నీ తెలంగాణ కోటా కింద లెక్కించాలి ► నాగార్జునసాగర్‌లోనూ అక్రమంగా నీటిని తోడేస్తూ విద్యుదుత్పత్తి చేస్తోంది. కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉపయోగపడే పులిచింతల ప్రాజెక్టులోనూ.. అధీకృత అధికారి, విజయవాడ ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ నీటిని విడుదల చేయాలని ఎలాంటి ప్రతిపాదనలు పంపకున్నా.. కృష్ణా బోర్డుకు కనీసం సమాచారం ఇవ్వకుండా తెలంగాణ సర్కార్ అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది. ► ఆ నీళ్లన్నీ వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. ఏపీకి వాటాగా దక్కిన జలాలను దక్కనివ్వకుండా చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ అక్రమంగా తోడేస్తున్న నీటిని.. ఆ రాష్ట్ర వాటా అయిన 299 టీఎంసీల కోటా కింద లెక్కించాలి. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో కృష్ణా బోర్డు విఫలం ► ఏపీకి వాటాగా దక్కాల్సిన జలాలను దక్కనివ్వకుండా చేసి, తెలంగాణ సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తుండటాన్ని పలుమార్లు కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాం. పర్యావరణ అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్ అక్రమంగా ప్రాజెక్టులు చేపట్టిందని కూడా వివరించాం. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో కృష్ణా బోర్డు సమర్థంగా వ్యవహరించడం లేదు. ► శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచే రోజుకు 1.5 టీఎంసీ చొప్పున 90 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 30 టీఎంసీలు తరలించేలా డిండి, రోజుకు 0.4 టీఎంసీల చొప్పున తరలించేలా కల్వకుర్తి సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచడం, 825 అడుగుల నుంచి రోజుకు 0.5 టీఎంసీ చొప్పున తరలించేలా ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచే పనులను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. ఇదికాక 796 అడుగుల నుంచే ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 4 టీఎంసీల చొప్పున తరలించే సామర్థ్యం తెలంగాణ సర్కార్‌కు ఉంది. రాయలసీమ ఎత్తిపోతలే శరణ్యం ► తెలంగాణ సర్కార్ దుందుడుకు చర్యలకు తోడు అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టులో ఏపీకి చక్క మిగలదు. కేడబ్ల్యూడీటీ–1, విభజన చట్టం 11వ షెడ్యూలు ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌కు నీటి కేటాయింపులున్నాయి. తెలంగాణ చర్యలతో ఈ ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గ్రావిటీపై నీళ్లందించలేని దుస్థితి. ► ఈ దుస్థితిని అధిగమించి.. సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు, చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చాలంటే.. శ్రీశైలంలో 800అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం ఒక్కటే శరణ్యం. అదనంగా చుక్క నీటినీ వాడుకోం ► రాయలసీమ ఎత్తిపోతల ద్వారా కొత్తగా ఆయకట్టుకు నీళ్లందించడం లేదు. కొత్తగా కాలువలు తవ్వడం లేదు. నీటి నిల్వ చేసే రిజర్వాయర్లు నిర్మించడం లేదు. ఇప్పటికే ఉన్న కాలువల ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికే ఈ ఎత్తిపోతల చేపట్టాం. రాష్ట్రానికి దక్కిన 512 టీఎంసీల కోటాలోనే నీటిని వాడుకుంటాం. అదనంగా ఒక్క చుక్క వాడుకోం. -
నీటి తరలింపును ఆపండి
నరసరావుపేట: తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. కృష్ణా జలాలను కిందకు వదలడం వల్ల ఏపీలోని రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే ఆ చర్యను నివారించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రతిరోజూ శ్రీశైలం నుంచి నాలుగు టీఎంసీలు, సాగర్ నుంచి మూడు టీఎంసీలు, పులిచింతల నుంచి 1.8 టీఎంసీలు వినియోగించుకుంటూ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. దీంతో ఏపీలో రాబోయే రోజుల్లో తాగు, సాగునీటికి కొరత ఏర్పడనుందని పేర్కొన్నారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతుల మనుగడకు తీవ్ర విఘాతం ఏర్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని కేంద్రమంత్రిని కోరారు. -
కృష్ణా జలాల హక్కులను కాపాడుకుంటాం
రైల్వేకోడూరు అర్బన్: కృష్ణా జలాలపై మన రాష్ట్రానికి ఉన్న హక్కులను కాపాడుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమకు అన్యాయం జరిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం దుందుడుకుగా కృష్ణా జలాలపై అక్రమ ప్రాజెక్టులు కడుతూ కృష్ణా బోర్డు ఆదేశాలు, ఇరు రాష్ట్రాల ఒప్పందాలను బేఖాతరు చేస్తోందన్నారు. కృష్ణా బోర్డు నిష్పక్షపాతంగా తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ నీటి వాడకం వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. తాగు, సాగు నీటి అవసరాలు లేకున్నా తెలంగాణ ప్రభుత్వం నీరు తోడేస్తుండడం దారుణమన్నారు. శ్రీశైలంలో 850 అడుగుల నీరు ఉంటేనే నెల్లూరు, ప్రకాశం, రాయలసీమకు నీరు ఇవ్వచ్చని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీరు రావాలంటే శ్రీశైలంలో నీరు నిల్వ ఉండాలన్నారు. తెలంగాణలో పులిచింతల, సాగర్‌లలో అవసరం లేకున్నా నీరు వాడుకోవడం వల్ల సీమకు నష్టం జరుగుతోందన్నారు. అక్కడ నిర్మిస్తున్న రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టులను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు సహకరించకుండా రాజకీయ పబ్బం కోసం తెలంగాణకు సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా ఇరు రాష్ట్ర ప్రయోజనాలకు సహకరించాలని కోరారు. -
కృష్ణా జలాలపై తెలంగాణ వైఖరి సరికాదు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల్లోని కృష్ణాజలాల వినియోగంలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించటం సరికాదని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ 35వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం ఆయన గుంటూరులో జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బచావత్ తీర్పులకు వ్యతిరేకంగా, కేంద్ర జలశక్తి సంఘం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాలను లెక్కచేయకుండా శ్రీశైలంలో డెడ్‌స్టోరేజి నీటిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారం విద్యుదుత్పత్తికి వినియోగించటం తెలంగాణ ప్రభుత్వ దుందుడుకు చర్య అని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని, ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డిని తెలంగాణ మంత్రులు ఇష్టం వచ్చినట్లు పరుష పదజాలంతో దూషించటం చూసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. శ్రీశైలం జలాలను ముందుగా తాగు, సాగు అవసరాలకే వినియోగించాలని చట్టాలు స్పష్టంగా చెబుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం మొండితనంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయటం దుర్మార్గమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం రెండు రాష్ట్రాల్లో తమ రాజకీయ ప్రయోజనాల కోసమే చూస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ మొండివైఖరిని విడనాడాలని, చర్చల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు కాకుమాను పున్నారావు, దాసరి జాన్‌బాబు, కొరిటపాటి ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా జలాల వివాదంపై విచారణ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంపై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. కాగా సెక్షన్ 11 ప్రకారం పిటిషన్ అర్హతపై పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో 2008లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలని పిటిషనర్లకు హైకోర్టు తెలిపింది. గతంలో నూరుశాతం విద్యుత్ ప్రాజెక్టులు పనిచేయాలంటూ తెలంగాణ జీవో విడుదల చేయగా, విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని విడుదల చేయడం వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందంటూ తెలంగాణ హైకోర్టులో కృష్ణా జిల్లా రైతు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
జంతర్‌మంతర్ దగ్గర కేసీఆర్ దీక్ష చేయాలి : రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లేని వివాదాన్ని సృష్టిస్తున్నారని, తద్వారా రాజకీయ, ఆర్థిక లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మహాజాదూ అని, ఆయన నీళ్ల నుంచి కూడా ఓట్లు సృష్టించగలరని వ్యాఖ్యానించారు. నిజంగా కృష్ణా జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయాలని, ఆ దీక్షకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తుందని రేవంత్ చెప్పారు. ఆదివారమిక్కడ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలపై తాము ఫిర్యాదు చేసినప్పుడు స్పందించని కేసీఆర్ ఇప్పుడు ఏదో చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. కేసీ ఆర్ అనుమతి తీసుకున్న తర్వాతే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. ఈనెల 9న జరగాల్సిన కృష్ణా రివర్‌బోర్డు అపెక్స్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరడం సరైంది కాదన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, టీపీసీసీ నేతలు హర్కర వేణుగోపాల్, సిరిసిల్ల రాజయ్య, మెట్టు సాయికుమార్, చరణ్‌కౌశిక్ యాదవ్ పాల్గొన్నారు. రోశయ్యను కలిసిన రేవంత్ తాను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నేతలను రేవంత్ రెడ్డి కలుస్తూనే ఉన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ గవర్నర్ రోశయ్య ఇంటికి వెళ్లారు. ఆయనతో మాట్లాడి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే, పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మె ల్యే విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం వినోద్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, మాజీ ఎంపీ ఎం.ఎ. ఖాన్ , ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి తదితరులను వారి నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ పలు చోట్ల మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి తాను మాట్లాడితే చెప్పుతో కొడతామని కొందరు అంటున్నారని, వాళ్లకు చెప్పుల దండలు వేసి ఊరేగిస్తామని వ్యాఖ్యానించారు. సీఎల్పీ ఎవరబ్బ సొత్త ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తారని ప్రశ్నించిన రేవంత్ ఈనెల 7 తర్వాత అందరి సంగతి చెపుతా మని, కార్యకర్తలతో ఉరికిచ్చి కొడతామన్నారు. -
కృష్ణా నదీ జలాల్లో అర్ధభాగం అసంబద్ధం
ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెరిసగం వాటా దక్కాలని తెలంగాణ సర్కార్ కొత్త పల్లవి అందుకోవడంపై న్యాయ, నీటిపారుదలరంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలు పంపిణీ చేస్తూ జూన్ 19, 2015న కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటుచేసిన తాత్కాలిక సర్దుబాటును ఆమోదిస్తూ.. ఒప్పందంపై సంతకం చేసిన తెలంగాణ సర్కార్, ఇప్పుడు ఆ ఒప్పందం నుంచి బయటకొస్తున్నట్లు ప్రకటించడాన్ని తప్పుపడుతున్నారు. ఇది విభజన చట్టాన్ని, ట్రిబ్యునళ్లను అపహాస్యం చేయడమేనని చెబుతున్నారు. చెరిసగం కానేకాదు.. బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) చేసిన కేటాయింపులను కొనసాగిస్తూనే.. 75 శాతం, 65 శాతం లభ్యతకు మధ్యన అందుబాటులో ఉన్న 448 టీఎంసీలను ప్లాన్–బి కింద మూడు రాష్ట్రాలకు అదనంగా పంపిణీ చేసిందని గుర్తుచేస్తున్నారు. ఇందులో ఉమ్మడి ఏపీకి 194 టీఎంసీల వాటా దక్కిందని గుర్తుచేస్తున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూల్లో ఏపీలోని తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులను కేంద్రం అధికారికంగా గుర్తించింది. అలాగే, తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలనూ గుర్తించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ప్లాన్–బి కింద అదనంగా కేటాయించిన జలాల్లోనూ కేంద్రం అధికారికంగా గుర్తించిన ప్రాజెక్టులకు 150.5 టీఎంసీలు ఏపీకి, 44 టీఎంసీలు తెలంగాణకు దక్కే అవకాశముందని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 512.04 టీఎంసీల నుంచి 662.54 టీఎంసీలకు పెరుగుతుందని.. తెలంగాణ వాటా 342.96 టీఎంసీలకు చేరుతుందే తప్ప.. చెరిసగం కానేకాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది తెలిసి కూడా తెలంగాణ సర్కార్ తద్భిన్నంగా వ్యవహరించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయంగానే పంపిణీ కృష్ణా జలాలను పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేయడానికి ఏప్రిల్ 10, 1969న జస్టిస్ బచావత్ నేతృత్వంలో కేంద్రం కేడబ్ల్యూడీటీ–1ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ మే 27, 1976న తుది తీర్పు ఇచ్చింది. అందులో ప్రధానాంశాలివీ.. ►కృష్ణా జలాల పంపిణీకి బచావత్ ట్రిబ్యునల్ ఫస్ట్ ఇన్ యూజ్.. ఫస్ట్ ఇన్ రైట్(మొదటి నీటిని వాడుకున్న ప్రాజెక్టులకే ప్రథమ హక్కు)ను మూలసూత్రంగా పాటించింది. ►కృష్ణా డెల్టాకు 1854 నుంచి ప్రకాశం బ్యారేజీ ద్వారా నీళ్లందిస్తున్నారు. కేసీ(కర్నూల్–కడప) కెనాల్ ఆయకట్టుకు 1933 నుంచి నీళ్లందిస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌ను 1945లో చేపట్టి 1953 నాటికి పూర్తిచేసి.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ద్వారా రాయలసీమకు నీళ్లందిస్తున్నారు. తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ మినహా ఏపీలోని ప్రాజెక్టులన్నీ 1976కు ముందు చేపట్టినవే. ►1976కు ముందు పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీటి వినియోగాన్ని పరిగణనలోకి తీసుకున్న బచావత్ ట్రిబ్యునల్.. నీటి కేటాయింపులో వాటికే తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ►కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,060.. పునరుత్పత్తి 70తో కలిపి 2,130 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఏపీకి 811 టీఎంసీలను కేటాయించింది. మిగులు జలాలను హక్కుగా కాకుండా వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి ఇచ్చింది. ►ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో.. 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16 టీఎంసీల వాటా ఇచ్చింది. నిర్మాణం, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలంలో ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికం కృష్ణా నదీ జలాలను పునఃపంపిణీ చేయడానికి ఏప్రిల్, 2004లో కేంద్రం ఏర్పాటు చేసిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్.. బచావత్ ట్రిబ్యునల్ తుది తీర్పునే ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు చేస్తూ అక్టోబర్ 19, 2016న కేంద్రానికి తుది నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ప్రధానాంశాలివీ.. ►కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కొనసాగించింది. ►75 శాతం, 65 శాతం లభ్యత మధ్య అందుబాటులో ఉన్న 448 టీఎంసీల్లో ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలు, తెలుగుగంగకు 25 టీఎంసీలతో సహా 194 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి అదనంగా కేటాయించింది. దాంతో ఏపీకి 1,005 టీఎంసీల వాటా దక్కింది. కర్ణాటకకు అదనంగా 173, మహారాష్ట్రకు 81 టీఎంసీలు అదనంగా దక్కాయి. ►బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును పరిగణనలోకి తీసుకుంటే.. ఏపీకి 512.04 టీఎంసీలతో పాటూ అదనంగా 150.5 టీఎంసీలు వెరసి 662.54 టీఎంసీల వాటా దక్కుతుంది. తెలంగాణకు 342.96 టీఎంసీలు దక్కుతాయి. ►బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తరహాలోనే తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ఇటీవల వెనక్కి తీసుకుంది. ►ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేస్తున్న నేపథ్యంలో.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం నోటిఫై చేయలేదు. విభజన చట్టాన్ని అపహాస్యం చేస్తారా? ఉమ్మడి రాష్ట్రానికి చేసిన నీటి కేటాయింపులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే విభజన చట్టం అప్పగించింది. ఈ నేపథ్యంలో.. రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయడంపై ఐదేళ్లుగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల జోలికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వెళ్లే అవకాశం లేదని.. అదనంగా కేటాయించిన 194 టీఎంసీలను విభజన చట్టంలో 11వ షెడ్యూలులో కేంద్రం అధికారికంగా గుర్తించిన ప్రాజెక్టులకు పంపిణీ చేయడంపైనే కసరత్తు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేసే దాకా.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా ఇరు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ జూన్ 19, 2015న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగా ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ చేసిన ఒడంబడికపై ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే దాకా ఇదే ఒప్పందం ప్రకారం నీటిని పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. వాస్తవాలిలా ఉంటే.. కృష్ణా జలాల్లో చెరి సగం వాటా దక్కాలని తెలంగాణ సర్కార్ తీర్మానం చేయడం, 2015లో ఆమోదించిన ఒప్పందం నుంచి బయటకొస్తామని ప్రకటించడాన్ని న్యాయ నిపుణులు తప్పుపడుతున్నారు. ఇది విభజన చట్టాన్ని, ట్రిబ్యునళ్లను అపహాస్యం చేయడమేనని స్పష్టంచేస్తున్నారు. -
టీ సర్కార్ ఉల్లంఘనలపై తెలంగాణ హైకోర్టుకు ఏపీ రైతులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో టీ సర్కారు ఉల్లంఘనలపై ఏపీ రైతులు తెలంగాణ హైకోర్టుకు ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టులో కృష్ణా జిల్లా రైతు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 28న తెలంగాణ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేయాలంటూ పిటిషన్ వేశారు. నూరుశాతం విద్యుత్ ప్రాజెక్టులు పనిచేయాలంటూ జూన్ 28న తెలంగాణ జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని విడుదల చేయడం వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందంటూ పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ చర్యల వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతింటారంటూ పిటిషన్లో తెలిపారు. -
9న కేఆర్ఎంబీ భేటీ వద్దు
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహించబోయే త్రిసభ్య కమిటీ సమావేశాన్ని రద్దు చేయాలని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేశారు. జూలై 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ఎజెండాలో తెలంగాణ రాష్ట్ర అంశాలను కూడా చేర్చాలని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ పథకం, సాగునీటి ప్రాజెక్టులలో నీటి ఎత్తిపోతలు, జల విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. విద్యుత్ ఉత్పత్తి ఆపాలని చెప్పే హక్కు కృష్ణా బోర్డుకు లేదని, జల విద్యుత్‌కు సంబంధించి ఇరు రాష్ట్రాల నడుమ ఎలాంటి ఒప్పందాల నిబంధనలు లేవని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి అంశంలో బోర్డు జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ద్వారా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నదని, ఈ నేపథ్యంలో 51 శాతం ‘క్లీన్ ఎనర్జీ’ ఉత్పత్తి చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్న కేంద్రం మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇకపై కూడా వీటిని కొనసాగించాలని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో అయినా కొట్లాడుతామన్నారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఏర్పాటై 17 ఏళ్లు కావస్తున్నా, తెలంగాణకు కృష్ణా జలాల్లో నీటి వాటాను నిర్ధారించకపోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు 66ః34 నిష్పత్తిలో కొనసాగుతూ వస్తున్న కృష్ణా జలాల వినియోగం ఈ ఏడాది నుంచి 50ః50 నిష్పత్తిలో కొనసాగాలన్నారు. -
తేలని లెక్కలు..వీడని వివాదాలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారంలో కృష్ణా బోర్డు పూర్తిగా విఫలమవుతోంది. దీంతో ఏళ్ల తరబడి సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. జూన్ నుంచి ఆరంభమైన కొత్త నీటి సంవత్సరంలో అయినా, కొన్నింటికైనా పరిష్కారం లభిస్తుందని ఆశించినా అడియాశే అవుతోంది. ఒకరు రాసిన లేఖలను మరొకరికి పంపడం, రెండు రాష్ట్రాలు స్పందించకుంటే కేంద్రానికి లేఖలు రాయడం తప్ప, పరిష్కారాలు చూపకపోవడంతో జల జగడాలు తీవ్రమవుతూనే ఉన్నాయి. వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో ఈ నెల 9న హైదరాబాద్‌లో త్రిసభ్య కమిటీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యమైన సమస్యలివీ.. ♦హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వాడుకుంటున్న నీటిలో 20 శాతాన్నే వినియోగ కోటా కింద పరిగణించాలని రాష్ట్ర సర్కార్ 2016లో కృష్ణా బోర్డును కోరింది. కృష్ణా బేసి¯Œ నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న నీటిలో 80% వివిధ రూపాల్లో మూసీ ద్వారా కృష్ణాలో కలుస్తోందని పేర్కొంది. అయితే దీన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని కృష్ణా బోర్డు కోరింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం రాలేదు. ♦ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో క్యారీ ఓవర్ జలాలను ఎప్పుడైనా వినియోగించుకునే స్వేచ్ఛ తమకు ఉందని తెలంగాణ అంటోంది. 2019–20 నీటి సంవత్సరంలో కేటాయించిన నీటిలో 50.851 టీఎంసీలను వాడుకోలేకపోయామని, వాటిని 2020–21లో వినియోగించుకుంటామని గతేడాది తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. దీన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 తీర్పులో క్లాజ్–8 ప్రకారం.. ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే పూర్తవుతాయని, వాడుకోకుండా మిగిలిపోయిన జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీనిపై కేంద్రం ఇదే వైఖరిని స్పష్టం చేసినా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కూడా బోర్డు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ♦నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ప్రవాహ నష్టాలు 40 శాతం మేర ఉన్నాయని తెలంగాణ తొలినుంచీ చెబుతోంది. ప్రవాహ నష్టాలను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేయాలని కోరుతోంది. అయితే ఈ ప్రవాహ నష్టాలు 27 శాతానికి మించవని ఏపీ అంటోంది. ప్రవాహ నష్టాలను తేల్చేందుకు జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆర్నెల్లలోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని బోర్డు చెప్పి రెండేళ్లవుతున్నా దీనిపై ఏమీ తేల్చలేదు. ♦కృష్ణా బేసిన్ లో చిన్న నీటి వనరుల కింద తెలంగాణకు 90 టీఎంసీల మేర కేటాయింపులున్నా, కేవలం 30 నుంచి 40 టీఎంసీల మేర మాత్రమే వినియోగం ఉంటోందని రాష్ట్రం చెబుతోంది. అయితే ఏపీ మాత్రం మిషన్ కాకతీయ కార్యక్రమం అనంతరం తెలంగాణ పూర్తి స్థాయిలో నీటి వినియోగం చేస్తోందని, ఆ నీటి పరిమాణాన్ని సైతం తెలంగాణ నీటి వినియోగం కోటాలో కలపాలని అంటోంది. దీనిపై బోర్డు గతంలోనే జాయింట్ కమిటీని నియమించినా నాలుగేళ్లుగా ఈ లెక్కలు తేలలేదు. ♦బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ నిండి నీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు వరద జలాలను ఎవరు వాడుకున్నా వాటిని కోటా కింద పరిగణించకూడదని ఏపీ కోరుతోంది. 2019–20లో కృష్ణా నదికి భారీ వరద వచ్చి నీరంతా సముద్రంలో కలుస్తున్న సమయంలో ఏపీ 44 టీఎంసీలను మళ్లించింది. ఈ నీటిని రాష్ట్రాల కోటా కింద లెక్కించకూడదని బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. దీన్ని తెలంగాణ వ్యతిరేకించింది. దీనిపై ఇంతవరకు ఎటూ తేలలేదు. ♦కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి అందులో ఏయే ప్రాజెక్టులను చేర్చాలన్న దానిపై తర్జనభర్జన కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను గుర్తించినా, న్యాయపరంగా కొన్ని చిక్కులు తప్పవన్న ఉద్దేశంతో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ♦నాగార్జునసాగర్ కుడి కాలువ కింద అనవసరంగా విడుదల చేసిన 13.47 టీఎంసీలను తమ వాటా వినియోగంలో చూపరాదని ఆంధ్రప్రదేశ్ అంటోంది. ఈ విషయం ఏపీ గతంలో కూడా ప్రస్తావించినా, ఈ వివాదంపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ♦ఇక ఇరు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలపై పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నా.. బోర్డు వాటికి ఎలాంటి పరిష్కారం తీసుకురాలేకపోతోంది. ఈ విషయాలపై కేంద్రానికి నివేదించడం తప్ప పరిష్కారాలు కనుగొనడం లేదు. -
చంద్రబాబు పాపాలు: నీళ్లపై నిర్లక్ష్యంతోనే నిప్పు
సాక్షి, అమరావతి: కృష్ణా ఆయకట్టు రైతులకు చంద్రబాబు చేసిన పాపాలు శాపాల్లా పరిణమించాయి. వ్యక్తిగత ప్రయోజనాలతోపాటు ఓటుకు కోట్లు కేసుల భయంతో కృష్ణా జలాలపై హక్కులను చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు తాకట్టు పెట్టారని నీటిపారుదల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్ తన చేతుల్లోకి తీసుకున్న తరహాలోనే మరో ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలాన్ని నాడు పూర్తి స్థాయిలో ఏపీ అధీనంలోకి తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి ఉత్పన్నమయ్యేది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎడమ గట్టు కేంద్రాన్ని తన నియంత్రణలోకి తీసుకున్న తెలంగాణ సర్కార్ శ్రీశైలంలోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా వాడేస్తూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది. దీనివల్ల శ్రీశైలంలో నీటి మట్టం పెరగక పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టుకు సకాలంలో నీళ్లందించలేని పరిస్థితి నెలకొంది. సాగర్ కుడి, ఎడమ కాలువల ఆయకట్టు.. కృష్ణా డెల్టాదీ అదే దుస్థితి. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేందుకు రాజీలేని పోరాటం చేస్తున్నారని నిపుణులు, పరిశీలకులు పేర్కొంటున్నారు. రెండు కళ్లు.. కొబ్బరి చిప్పల సిద్ధాంతం విభజన నేపథ్యంలో నీటి వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. కృష్ణా బోర్డు పరిధి, వర్కింగ్ మాన్యువల్‌ను ఖరారు చేయని కేంద్రం ప్రాజెక్టుల నిర్వహణకు మధ్యంతర ఏర్పాట్లు చేసింది. ఏ రాష్ట్ర భూభాగంలో ఉన్న ఆ ప్రాజెక్టులను ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించుకునేలా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఏపీ ప్రభుత్వం, నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్ నిర్వహించేలా 2014లో ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. రాష్ట్ర భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. మరోవైపు శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందనే సాకుతో తెలంగాణ సర్కార్ అది కూడా తన అధీనంలోకి తీసుకుంది. రెండు కళ్లు, కొబ్బరి చిప్పల సిద్ధాంతంతో రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడ్డ చంద్రబాబు దీనిపై నోరు మెదపలేదు. అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డు ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ యథేచ్ఛగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. దీనివల్ల శ్రీశైలంలో నీటి మట్టం అడుగంటి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించలేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కేసుల భయంతో సాగర్, డెల్టా హక్కులు తాకట్టు.. సాగర్ కుడి కాలువకు కేటాయించిన నీరు పూర్తి స్థాయిలో విడుదల కాకుండానే 2015 ఫిబ్రవరి 12న తెలంగాణ సర్కార్ తన నియంత్రణలో ఉండటంతో అర్థాంతరంగా నిలిపివేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు నాడు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్, అధికారులు పోలీసు బలగాలతో మరుసటి రోజు నాగార్జునసాగర్ వద్దకు చేరుకున్నారు. అయితే ఓటుకు కోట్లు కేసులో సాక్షాధారాలతో దొరికిపోయిన నాటి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడి వారిని వెనక్కి రప్పించారు. ఫలితంగా సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ తెలంగాణ అధీనంలోనే ఉండిపోయింది. కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా తెలంగాణ సర్కార్ సాగర్ కుడి కాలువకు నీటిని సక్రమంగా విడుదల చేయకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. హక్కుల పరిరక్షణకు రాజీలేని పోరాటం.. పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటూనే కృష్ణా జలాలపై ఏపీ ప్రయోజనాలను పరిరక్షించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజీలేని పోరాటం చేస్తున్నారని నీటిపారుదల నిపుణులు పే ర్కొంటున్నారు. రాష్ట్రానికి వాటాగా దక్కిన 512 టీఎంసీలను పూర్తి స్థాయిలో వినియో గించుకునేందుకు గత 25 నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయని, 20 19–20,20–21 నీటి సంవత్సరాల్లో అధికం గా జలాలను వాడుకోవడమే అందుకు నిదర్శ నమని గుర్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేం దుకు గతేడాది అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహిం చిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ముఖ్యమంత్రి జగన్ బలమైన వాదనలను వినిపించారని ప్రస్తావిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్‌ను నియంత్రించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ లేఖలు రాయడాన్ని స్వాగతిస్తున్నారు. -
జల జగడంపై కదిలిన కృష్ణా బోర్డు
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పరిష్కరించేందుకు కృష్ణా బోర్డు కదిలింది. ఎలాంటి అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేయడంపై చర్చించేందుకు ఈ నెల 9న త్రిసభ్య కమిటీ భేటీని ఏర్పాటు చేస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలం కనీస నీటిమట్టం స్థాయికి నీటి నిల్వ దాటకుండానే.. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేస్తుండటంపై గత నెల 10న, 23న కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. వాటిపై స్పందించిన కృష్ణా బోర్డు తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. కానీ.. ఆ ఆదేశాలను తెలంగాణ బేఖాతరు చేస్తూ విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. దీనిపై గత నెల 29న మరోసారి కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణా డెల్టా ఎస్ఈ నీటిని విడుదల చేయాలని ఎలాంటి ప్రతిపాదనలు పంపకున్నప్పటికీ.. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా పులిచింతల ప్రాజెక్టులోనూ తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని ప్రారంభించడంపై గత నెల 30న బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. మూడు ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టులను ఖాళీ చేయడం వల్ల తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని.. వాటిని పరిరక్షించాలని కృష్ణా బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై చర్చించేందుకు 9న త్రిసభ్య కమిటీ భేటీని ఏర్పాటు చేసినట్లు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తెలిపారు. -
అక్రమాన్ని ఆపండి: సీఎం జగన్
‘‘జల విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడుకోవద్దని కృష్ణా బోర్డు జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్ బుట్టదాఖలు చేసింది. ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్), ఒప్పందాలను తుంగలో తొక్కి ఏకపక్షంగా, అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తోంది. ఇది అంతరాష్ట్ర సంబంధాలను దెబ్బ తీస్తోంది. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులకు విఘాతం కల్పిస్తోంది. తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరగక తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీరు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది’’ – ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణ సర్కార్‌ను నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సర్కార్ అక్రమంగా వినియోగించిన నీటిని ఆ రాష్ట్ర కోటా కింద పరిగణించాలని కోరారు. కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించి ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి సీఎం వైఎస్ జగన్ గురువారం లేఖ రాశారు. ఇవే అంశాలను వివరిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు కూడా లేఖ రాశారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. తాత్కాలిక ఏర్పాట్లు.. కృష్ణా జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా విభజన చట్టం సెక్షన్–85 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటిదాకా బోర్డు పరిధి, నిర్వహణ నియమావళిని ఖరారు చేయలేదు. ప్రాజెక్టుల నిర్వహణకు తాత్కాలిక ఏర్పాట్లు చేసింది. శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలను ఆంధ్రప్రదేశ్.. జూరాల, నాగార్జునసాగర్‌లను తెలంగాణ ప్రభుత్వాలు నిర్వహించేలా ఏ రాష్ట్ర భూభాగంలో ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలను ఆ రాష్ట్రం నిర్వహించుకునేలా తాత్కాలిక ఏర్పాట్లు చేసింది. బోర్డు ఆదేశాలను లెక్క చేయకుండా.. నీటి వాటాల పంపిణీపై 2015 జూలై 18, 19న కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి అధ్యక్షతన రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తూ తాత్కాలిక సర్దుబాటు చేసింది. తాత్కాలిక సర్దుబాటు మేరకు జలాలను పంపిణీ చేయడానికి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా త్రిసభ్య కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. నీటి లభ్యత, రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని త్రిసభ్య కమిటీ సిఫార్సుల ఆధారంగా నీటి కేటాయింపులు చేస్తూ కృష్ణా బోర్డు ఉత్వర్వులు జారీ చేసింది. సంబంధిత రాష్ట్రాల ప్రాజెక్టుల అధికారులు వీటిని అమలు చేయాలి. ప్రాజెక్టులోకి వచ్చే ప్రవాహాలు, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ లభ్యతగా ఉన్న నీటిని దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. కానీ తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కి అక్రమంగా నీటిని వాడుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కనీస మట్టం లేకున్నా విద్యుదుత్పత్తి.. శ్రీశైలం ప్రాజెక్టు తొలుత హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టే. కానీ కాలక్రమంలో ఉమ్మడి రాష్ట్రంలోనే తాగు, పారిశ్రామిక, సాగునీటి అవసరాలు తీర్చే బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలు. విద్యుదుత్పత్తికి కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా సాగునీటి విడుదలకు కనీస మట్టం 854 అడుగులు ఉండాలి. జూన్ 1 నాటికి శ్రీశైలంలో 808.4 అడుగుల్లో 33.39 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. కనీస నీటి మట్టానికి దిగువన నీటి నిల్వ ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేయకూడదు. కానీ కృష్ణా బోర్డుకు ఎలాంటి ప్రతిపాదనలు పంపకుండానే తెలంగాణ సర్కార్ అదే రోజు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించి దిగువకు నీటిని విడుదల చేసింది. నాగార్జునసాగర్‌లో 173.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్ ఆయకట్టుకు నీటి అవసరాలు లేకపోయినా శ్రీశైలం ప్రాజెక్టులో అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేసింది. పెరగని నీటిమట్టం.. జూన్ 30 వరకూ శ్రీశైలం ప్రాజెక్టులోకి 17.36 టీఎంసీల ప్రవాహం వస్తే విద్యుదుత్పత్తి కోసం 6.9 టీఎంసీలు (40 శాతం) నీటిని తెలంగాణ సర్కార్ అక్రమంగా వాడుకుంది. రోజూ రెండు టీఎంసీలను వాడుకుంటూ తెలంగాణ సర్కార్ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్‌ను ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల స్థాయికి చేరితేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తాగు, సాగునీటి కోసం నీటిని తీసుకోవచ్చు. ఈ రెగ్యులేటర్ ద్వారానే తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేస్తాం. చెన్నైకి తాగునీటిని సరఫరా చేస్తాం. బోర్డు ఆదేశించినా... తెలంగాణ సర్కార్ అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తుండటంపై జూన్ 10న కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై స్పందించిన కృష్ణా బోర్డు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలని జూన్ 17న తెలంగాణ సర్కార్‌ను ఆదేశిస్తూ లేఖ రాసింది. గ్రిడ్ అత్యవసర పరిస్థితి ఉంటే మినహా మిగిలిన సందర్భాల్లో కృష్ణా బోర్డు ఉత్తర్వులను తెలంగాణ సర్కార్ అమలు చేయాలి. కానీ.. తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయలేదు. ఇదే అంశాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లి జూన్ 23, 29న లేఖలు రాశాం. ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ.. ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు. పూర్తి నీటి నిల్వ 312 టీఎంసీలు. కనీస నీటి మట్టం 510 అడుగులు. జూన్ 30 నాటికి 534.2 అడుగుల్లో సాగర్‌లో 176.46 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డుకు ఎలాంటి ప్రతిపాదనలు పంపకుండా, ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్ నుంచి 30,400 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తోంది. ఈ రోజు వరకూ దిగువన సాగునీటి అవసరాలు లేకున్నా సాగర్ నుంచి తెలంగాణ సర్కార్ అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వదిలేస్తోంది. అనుమతి తీసుకోకుండా.. కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించడానికే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా 45.77 టీఎంసీల సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టును నిర్మించాం. విజయవాడ ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ నీటిని విడుదల చేయాలని ఎలాంటి ప్రతిపాదనలు పంపకున్నా, కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే జూన్ 29న ఉదయం 8 గంటలకు తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తూ 4 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేసింది. ఈ అంశాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్తూ పులిచింతలలో తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని జూన్ 30న కృష్ణా బోర్డుకు లేఖ రాశాం. బ్యారేజీ నుంచి వృథాగా బంగాళాఖాతంలోకి.. ప్రకాశం బ్యారేజీలో ఇప్పటికే గరిష్ట స్థాయిలో 3.07 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తెలంగాణ సర్కార్ అక్రమంగా నీటిని వాడుకుని విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తుండటం వల్ల బ్యారేజీ నుంచి వాటిని వృథాగా బంగాళాఖాతంలోకి వదిలేయాల్సి వస్తోంది. దిగువ రాష్ట్రం హక్కులను కాపాడండి.. విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు జారీ చేసిన ఆదేశాలను బుట్టదాఖలు చేస్తూ స్థాపిత సామర్థ్యం మేరకు వంద శాతం జలవిద్యుదుత్పత్తి చేసేలా తెలంగాణ సర్కార్ జూన్ 28న జీవో 34 జారీ చేసింది. అంటే దీని అర్ధం తెలంగాణ సర్కార్ రోజూ శ్రీశైలం నుంచి నాలుగు, సాగర్ నుంచి మూడు, పులిచింతల నుంచి 1.8 టీఎంసీలను జల విద్యుత్తు కోసం విడుదల చేస్తున్నట్లే. విద్యుదుత్పత్తి కోసం నీటిని విడుదల చేయవద్దని కృష్ణా బోర్డు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందువల్ల దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించడానికి తక్షణమే మీరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నా. అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్‌ను కట్టడి చేయండి. -
నీటి పంపకాల వివాదంపై స్పష్టమైన వైఖరితో ఉన్నాం: బొత్స
సాక్షి, తాడేపల్లి: రాజకీయ లబ్ధికోసం తెలంగాణ నేతలు వ్యాఖ్యానించడం సరికాదని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారయణ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలే బుద్దిచెబుతారని అన్నారు. తాము తెలంగాణ మంత్రుల్లా అసభ్య పదజాలం వాడాల్సిన అవసరం లేదని, నీటి పంపకాల అంశంపై తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని స్పష్టం చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోలేదని, ఫెడరల్ వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయని పేర్కొన్నారు. చట్ట పరిధి దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయని మంత్రి బొత్స సత్యనారయణ అన్నారు. మూడు రాజధానుల అభివృద్ధిలో భాగంగానే కరకట్ట విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే త్వరలోనే రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. చదవండి: కృష్ణానది కరకట్ట పనులకు సీఎం జగన్ శంకుస్థాపన -
భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్దేశం మాకు లేదు: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: రాజకీయ అవసరాల కోసమే తెలంగాణ నేతల విమర్శలు చేస్తూ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని మంత్రి పేర్ని నాని విమర్శించారు. తెలంగాణ కోసం వైఎస్ఆర్ ఏం చేశారో అందరికీ తెలుసు అన్నారు. కృష్ణా నది నుంచి గ్లాసు నీరు కూడా మేం అదనంగా తీసుకోవడం లేదు. శ్రీశైలం, సాగర్‌లో కేటాయించిన నీటినే వాడుకుంటున్నాం అని స్పష్టం చేశారు. కృష్ణా జలాల వినియోగంపై సందేహాలుంటే చర్చించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని.. నీటి వివాదంపై తెలంగాణ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని సూచించారు పేర్ని నాని. భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని పేర్ని నాని తెలిపారు. కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలనేదే సీఎం విధానం అన్నారు. సుప్రీం ఆదేశాలతోనే పరీక్షలు రద్దు చేశామని తెలిపారు. పరీక్షలు రద్దయితే చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారు.. పిల్లల భవిష్యత్‌ను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు అంటూ పేర్ని విమర్శించారు. చదవండి: పోలవరం పులకింత -
కృష్ణమ్మ కట్టడికి కర్ణాటక కాకి లెక్కలు!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సింహభాగం ప్రజలకు జీవనాధారమైన కృష్ణమ్మను కట్టడి చేసేందుకు కర్ణాటక సర్కారు కాకి లెక్కలతో మాస్టర్ ప్లాన్ వేసింది! సుప్రీం కోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కడంతోపాటు కేడబ్ల్యూడీటీ–2(కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్) తీర్పును కేంద్రం ఇంతవరకూ నోటిఫై చేయకున్నా ఆ తీర్పు ఆధారంగా దక్కిన 183 టీఎంసీల మిగులు జలాల్లో 174 టీఎంసీలను వినియోగించుకునేలా అప్పర్ కృష్ణా మూడో దశ పనులకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంపు పనులను చేపట్టింది. అక్కడితో ఆగలేదు సరికదా లేని హక్కులను ఉన్నట్లుగా చిత్రీకరించి అదనంగా నీటిని వాడుకోవడానికి ఎత్తులు వేస్తోంది. తనకు తానే వాటాలు.. కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అప్పటి పరిస్థితులను బట్టి కర్ణాటకకు 21 టీఎంసీలు అదనంగా కేటాయించే అంశాన్ని పరిశీలించాలని గోదావరి ట్రిబ్యునల్ పేర్కొంది. దీని ప్రకారం కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో తమకు 23 టీఎంసీలు (21 టీఎంసీలు + రెండు టీఎంసీలు పునరుత్పత్తి ద్వారా వచ్చే నీరు) వాటా వస్తుందని కర్ణాటక సర్కార్ లెక్కలు వేసింది. మరోవైపు ద్వీపకల్ప నదులైన మహానది, కృష్ణా, గోదావరి, కావేరి, పెన్నాను అనుసంధానం చేయడం ద్వారా ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు తరలించే నీటికిగాను కృష్ణా జలాల్లో తమకు అదనంగా 216 టీఎంసీలు వాటా వస్తుందని తేలి్చంది. వెరసి 1,156 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునేలా ప్రాజెక్టులను చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కర్ణాటక సర్కారు ఇటీవల ఆ రాష్ట్ర జలవనరులశాఖను ఆదేశించడంపై నీటిపారుదలరంగ నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేడబ్ల్యూడీటీ–2 తీర్పును కేంద్రం ఇప్పటిదాకా నోటిఫై చేయకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. అసలు ద్వీపకల్ప నదుల అనుసంధానం కార్యరూపం దాల్చేది ఎన్నడని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక సర్కార్ వాస్తవాలను విస్మరించి తనకు తానుగా వాటాలు కేటాయించుకుని ఆ మేరకు నీటిని వినియోగించుకోవడానికి ఏకపక్షంగా ప్రాజెక్టులను చేపడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి రాకుండానే.. కేడబ్ల్యూడీటీ–2 తీర్పును సవాల్ చేస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెలీ్ప)ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కేడబ్ల్యూడీటీ–2 తీర్పుపై స్టే ఇచ్చింది. దీంతో ఆ తీర్పును అమలు చేస్తూ కేంద్రం ఇప్పటిదాకా ఉత్తర్వులు (నోటిఫై) జారీ చేయలేదు. కృష్ణాలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కర్ణాటకకు 734 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. వాటిని కేడబ్ల్యూడీటీ–2 కొనసాగిస్తూనే 65 శాతం నీటి లభ్యతకూ.. 75 శాతం నీటి లభ్యతకు మధ్యన ఉన్న 448 టీఎంసీల మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు(కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)కు కేటాయించింది. ఇందులో తమకు 183 టీఎంసీల వాటా వస్తుందని తేలి్చన కర్ణాటక అందులో 174 టీఎంసీలను వినియోగించుకోవడానికి అప్పర్ కృష్ణా ప్రాజెక్టు మూడో దశ పనులను చేపట్టడానికి అనుమతి కోరుతూ సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం)కు ఇటీవలే డీపీఆర్ అందజేసింది. సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వకుండానే ఇప్పటికే పనులను కూడా ప్రారంభించడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. అనుసంధానం వద్దంటూనే వాటాలు.. నదుల అనుసంధానం ద్వారా దుర్భిక్షాన్ని తరిమికొట్టాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు దిశానిర్దేశం చేసి రెండు దశాబ్దాలు పూర్తవుతున్నా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) 16 రకాల ప్రతిపాదనలు చేసింది. ఇందులో ఆల్మట్టి(కృష్ణా)–కాలువపల్లి(పెన్నా) అనుసంధానాన్ని కర్ణాటక ప్రభుత్వమే వ్యతిరేకిస్తోంది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు. దీంతో నదుల అనుసంధానం కేవలం కాగితాలకే పరిమితమైంది. ఒకవైపు నదుల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్న కర్ణాటక సర్కార్ మరోవైపు ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడం ద్వారా ఒక బేసిన్ నుంచి మరొక బేసిన్‌కు మళ్లించే జలాలకుగానూ కృష్ణా జలాల్లో తమకు అదనంగా 216 టీఎంసీల వాటా వస్తుందని తనకు తానుగానే కేటాయించుకుని ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించడాన్ని నీటిపారుదల రంగ నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. -
కృష్ణవేణితో దుర్భిక్ష ప్రాంతాలు సుభిక్షం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరవు ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన పశ్చిమ మండలాలకు కృష్ణా వరద జలాలను తరలించి.. తాగు, సాగు నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి సిద్ధమైంది. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) నుంచి 8 టీఎంసీలను తరలించి.. కురుబలకోట మండలం ముదివేడులో 1.5, పుంగనూరు మండలం నేతిగుంటపల్లిలో 1, సోమల మండలం ఆవులపల్లిలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా నిర్మించే రిజర్వాయర్లలో నిల్వ చేయనుంది. తద్వారా కొత్తగా 70 వేల ఎకరాలు, చెరువుల కింద 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించింది. మిగిలిన 2 టీఎంసీలను పీలేరు, కుప్పం, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల పరిధిలోని 33 మండలాల ప్రజలకు తాగు నీరు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ పనులకు రూ.2,144.50 కోట్లతో గతేడాది సెపె్టంబర్ 2న ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇందులో రూ.1,554.21 కోట్ల వ్యయంతో (మిగతాది భూ సేకరణకు) 36 నెలల్లో ఈ పనులు పూర్తి చేసేలా టెండర్ షెడ్యూళ్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపింది. ఆమోదం రాగానే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి.. గడువులోగా పనులను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. మూడు రిజర్వాయర్లకు నీటి తరలింపు ఇలా.. – వైఎస్సార్ కడప జిల్లాలో గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువలో 56 కి.మీ. నుంచి రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి ఎత్తిపోస్తారు. దీన్ని చక్రాయిపేట ఎత్తిపోతలగా పిలుస్తారు. ఇందులో 450 క్యూసెక్కులను రాయచోటి నియోజకవర్గం సాగు, తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తారు. – మిగతా 1550 క్యూసెక్కుల్లో 800 క్యూసెక్కులను హంద్రీ–నీవా రెండో దశలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు, 750 క్యూసెక్కులను అడవిపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. – అడవిపల్లి రిజర్వాయర్ నుంచి రోజుకు 800 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 8 టీఎంసీలను పీబీసీకి తరలిస్తారు. పీబీసీలో 125.4 కి.మీ వద్ద నుంచి గ్రావిటీ ద్వారా కొత్తగా 1.5 టీఎంసీల సామర్థ్యంతో చిత్తూరు జిల్లా పశ్చిమాన కురుబలకోట మండలం ముదివేడు వద్ద నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ జలాశయం కింద 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 15 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు. – పీబీసీలో 180.4 కి.మీ నుంచి నీటిని ఎత్తిపోసి.. పుంగనూరు మండలం నేతిగుంటపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ రిజర్వాయర్ కింద కొత్తగా పది వేల ఎకరాలకు నీళ్లందిస్తారు. ఐదు వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు. – పీబీసీలో 210 కి.మీ నుంచి గ్రావిటీపై నీటిని తరలించి.. సోమల మండలం ఆవులపల్లి వద్ద 3.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ రిజర్వాయర్ పనులకు రూ.667.20 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీని ద్వారా కొత్తగా 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 20 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. -
బషీరాబాద్‌కు ‘భగీరథ’
బషీరాబాద్(తాండూరు) : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కృష్ణమ్మ రానే వచ్చింది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ అందించనున్న రక్షిత తాగునీరు ఇప్పటికే శ్రీశైలం నుంచి పరిగిలోని జాఫర్‌పల్లి డబ్ల్యూపీటీకి చేరింది. యాలాల మండలం పగిడ్యాల్ ఓహెచ్‌బీర్ ట్యాంకు నుంచి బషీరాబాద్ మండలం నవల్గ సంపు వరకు సుమారు 32 కి.మీ మేర నిర్వహించిన ట్రయల్‌రన్ విజయవంతమైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ రక్షితè తాగునీరు కర్ణాటక సరిహద్దులోని బషీరాబాద్ మండలానికి చేరుకుంది. ఎక్కడ కూడా మోటార్లు ఉపయోగించకుండా కేవలం గ్రావిటీ మెథడ్తోనే (గురుత్వాకర్షణ పద్ధతి) పరిగిలోని జాఫర్‌పల్లి నుంచి బషీరాబాద్ మండలం నవల్గకు కృష్ణమ్మ నీరు పైపుల్లో పరుగులు పెట్టింది. పగిడ్యాల్ నుంచి నవల్గ వరకు నిర్వహించిన తొలి ట్రయల్‌రన్ విజయవంతమైనట్లు మిషన్ భగీరథ సివిల్ ఇంజినీరు రాములు ప్రకటించారు. అయితే నీటి ఒత్తిడి కారణంగా యాలాల మండలంలోని హాజీపూర్ గేటు వద్ద పైపులైన్ జయింట్లో స్వల్ప లీకేజీ కావడంతో వరి పొలాల్లోకి నీళ్లు చేరాయి. తాండూరు మండలంలోని గోనూరు గేటు సమీపంలో ఎయిర్ వాల్వ్ ద్వారా నీళ్లు బయటకు చిమ్మాయి. అటు నుంచి నేరుగా నవల్గ చెరువు కట్ట సమీపానికి నీళ్లు చేరాయి. అయితే పైపులైన్లో ఉన్న మట్టితో ఒండ్రు నీళ్లు రావడంతో నవల్గ చెరువు కట్టకింద ఉన్న ఎయిర్ షవర్ వద్ద ఆ నీటిని వదిలేశారు. నవల్గ సమీపంలోని ప్రధాన సంపునకు కి.మీ దూరంలోకి రాగానే అధికారులు ట్రయల్ రన్‌ను నిలిపేశారు. తుదిదశకు ట్యాంకుల నిర్మాణం బషీరాబాద్ మండలంలోని రెండు ప్రధాన ఓహెచ్‌బీర్ ట్యాంకుల నిర్మాణాలు పూర్తిచేసుకున్నాయి. మర్పల్లి దగ్గర 40వేల లీటర్ల ట్యాంకు ఇప్పటికే పూర్తికాగా, మాసన్పల్లి దగ్గర గల 60వేల లీటర్ల ట్యాంకు నిర్మాణం తుదిదశకు చేరుకుంది. దీంతో పాటు నవల్గ సమీపంలో గల 1.5 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన సంపు, వాటర్‌ట్యాంకు నిర్మాణం కూడా పూర్తయ్యింది. తాండూరు నియోజక వర్గంలో రెండు ట్యాంకులకు మాత్రమే పంపుల ద్వారా నీటిని ఎక్కిస్తారు. వీటిలో మర్పల్లి దగ్గర ఉన్న 40 వేల లీటర్ల ట్యాంకుకు నవల్గ సంపు నుంచి 3 మోటర్ల ద్వారా నీటిని పంపిస్తారు. సెప్టెంబర్ 15వరకు గ్రామాలకు.. ఓట్లు కురిపిస్తాయని భావిస్తున్న మిషన్ భగీరథ పథకం నీళ్లు ఈ నెలాఖరు వరకు గ్రామాలకు చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. బషీరాబాద్ మండలంలో 39 గ్రామాల్లో రూ.24.51కోట్లతో చేపట్టిన ఇంట్రావిలేజ్ పనుల్లో జరుగుతున్న జాప్యం వల్ల పక్షం రోజులు ఆలస్యం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 15వరకు గ్రామాల్లోని ట్యాంకులకు నీళ్లను చేర్చాలని యంత్రాంగం పనుల్లో వేగాన్ని పెంచింది. ఇదిలా ఉండగా కృష్ణ వాటర్ బషీరాబాద్ మండలంలోని నవల్గకు చేరడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. -
‘కృష్ణా’ జలాలు మళ్లీ పంచాలి
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో కృష్ణా జలాలను నదీ పరీవాహక రాష్ట్రాల మధ్య తిరిగి పంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై గతంలో తాము చేసిన ఫిర్యాదును పునఃపరిశీలించాలని, ఈ అంశాన్ని కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ముందుం చాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం కేంద్ర జలవనరులు, రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీలో ఎనిమిది అంశాలపై గడ్కరీకి సీఎం వినతిపత్రాలు అందజేశారు. సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు. ట్రిబ్యునల్‌కు రెఫర్ చేసే అంశంపై మినహా మిగిలిన అన్ని అంశాలపై గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బ్రిజేష్ ట్రిబ్యునల్‌తో తెలంగాణకు న్యాయం జరగదు... కృష్ణా నదీ పరీవాహకప్రాంత రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఉండేవని, విభ జన చట్టం ద్వారా కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ టంతో నదీ జలాల పంపిణీని నాలుగు రాష్ట్రాల మధ్య తిరిగి చేపట్టాలని గడ్కరీని కేసీఆర్ కోరారు. ఇందుకు కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ అంతర్రాష్ట నదీ జలాల వివాద చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూ–1956)లోనిసెక్షన్–3 కింద తాము 2014 జూలై 7న కేంద్ర జలవనరులశాఖకు ఫిర్యాదు చేసిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఈ ఫిర్యాదుపై విచారణకు కేంద్ర జలవనరులశాఖ కొత్త ట్రిబ్యు నల్‌ను ఏర్పాటు చేయడమో లేదా ఉనికిలో ఉన్న ట్రిబ్యునల్‌ను విచారించాల్సిందిగా ఆదేశించడమో చేయాల్సి ఉన్నా వాటిని పట్టించు కోలేద న్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీ కరణ చట్టంలోని సెక్షన్ 89 అమలు అంశాల కోసం మాత్రమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును జల వనరులశాఖ పొడిగించిందని వివరించారు. సెక్షన్ 89 పరిధి చాలా పరిమితమని, ఇది తెలంగాణ హక్కులను కాపాడ టంలో ఎంత మాత్రం న్యాయం చేయదని నివేదిం చారు. అందువల్ల తెలంగాణ ఫిర్యా దును పునఃపరి శీలించి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 5(1) కింద కేడబ్ల్యూ డీటీ–2కు రెఫర్ చేయాలని కోరారు. అప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుందని గడ్కరీకి వివరించారు. సీతారామసాగర్ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టే... ‘గోదావరిపై నిర్మిస్తున్న సీతారామ సాగర్ ప్రాజెక్టును కొత్త ప్రాజెక్టుగా కాకుండా నిర్మాణంలో ఉన్న ప్రాజె క్టుగా గుర్తించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005 డిసెంబర్లో అప్పటి ప్రభుత్వం పాములపల్లి వద్ద రూ. 1,681 కోట్ల అంచనా వ్యయంతో రాజీవ్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం–1 మంజూరు చేసింది. అలాగే రుద్రంకోట వద్ద రూ. 1,824 కోట్ల అంచనాతో ఇందిరాసాగర్ రుద్రంకోట ఎత్తిపోతల పథకం మంజూరు చేసింది. ఆ ప్రకారంగా టెండర్ల ప్రక్రియ పూరై్త 2007లో ఈ ప్రాజెక్టులపై పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజన నాటికి రాజీవ్ దుమ్ముగూడెం ప్రాజెక్టుపై రూ. 871.8 కోట్లు, ఇందిరాసాగర్ ప్రాజెక్టుపై రూ. 899.36 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఇందిరాసాగర్ హెడ్‌వర్క్స్ ఆంధ్ర ప్రదేశ్ పరిధిలోకి వెళ్లడం, అలైన్మెంట్ అభయార ణ్యం మీదుగా వెళ్లడంతో రీ ఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది. అంతర్రాష్ట్ర వివాదాన్ని తప్పించేందుకు వీలుగా హెడ్‌వర్క్స్‌ను తెలంగాణ పరిధిలోకి మార్చాల్సి వచ్చింది. అలాగే అభయారణ్యం నుంచి అలైన్ మెంట్‌ను తప్పించాం. ప్రాజెక్టు మరింత అను కూలంగా ఉండేందుకు వీలుగా ఈ రెండు ప్రాజెక్టు లను కలిపి సీతారామ ఎత్తిపోతల పథకంగా మార్చాం. ఈ ప్రతిపాదనను కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) పంపితే వారు దీన్ని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు పంపినట్టు మాకు సమాచారం ఉంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జీఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ పాత్ర కేవలం కొత్త ప్రాజెక్టులకే పరిమితం. సీతారామ సాగర్ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు అయినందున దీన్ని కొత్త ప్రాజెక్టుగా పరిగణించరాదు. ఈ దిశగా సీడబ్ల్యూసీని ఆదేశించాలి’అని సీఎం కేసీఆర్ గడ్కరీని కోరారు. ఆర్ఆర్ఆర్కు సహకారం అందించండి... ‘154 కి.మీ. పొడవున్న సంగారెడ్డి–నర్సాపూర్– తూప్రాన్–గజ్వేల్–జగ్దేవ్పూర్–భువనగిరి–చౌటుప్పల్ రాష్ట్ర రహదారితోపాటు 180 కి.మీ. పొడవున్న చౌటుప్పల్–యాచారం–షాద్‌నగర్–చేవెళ్ల–శంకర్పల్లి–కంది రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా విస్త రించేందుకు అంగీకరించినందుకు ధన్య వాదాలు. ఈ రెండు రహదారులు హైదరాబాద్ చుట్టూ 50 కి.మీ. దూరంలో ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ ఆర్)గా రూపాంతరం చెందుతాయి. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అభివృద్ధిలో ఈ రోడ్లు కీలకం కానున్నాయి. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ రోడ్డును జాతీయ రహదారి 161 ఏఏగా ప్రకటించి దీని అభివృద్ధిని ఎన్హెచ్ఏఐకి అప్పగించారు. అయితే రెండో రోడ్డు అయిన చౌటుప్పల్ నుంచి కంది వరకు రోడ్డు మార్గాన్ని కేంద్ర రహదారులశాఖ ఆమోదించినా ఇంకా జాతీయ రహదారిగా గుర్తించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. తెలంగా ణలో ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పశ్చిమానికి ప్రస్తుతం జాతీయ రహదారులపై వచ్చే ట్రాఫిక్ హైదరాబాద్‌ను దాటేందుకు రాష్ట్రం అభివృద్ధి చేసిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను వినియోగిస్తోంది. భారీగా నెలకొన్న ఐటీ రంగం కారణంగా దేశంలోనే అత్యంత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్పై ఐదేళ్లలో తీవ్ర రద్దీ ఏర్పడుతుంది. అందువల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జాతీయ రహదారుల నెట్ వర్క్ విస్తరణకు వీలుగా పైరెండు రోడ్లను ఆరు లేన్ల రహదారులుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు అవసరాలకుగాను 8 లేన్ల రహదారులుగా విస్తరించేందుకు అవసరమైన భూసేకరణనూ చేపట్టడం అవసరం. రాష్ట్ర ప్రజాపనుల విభాగం ఈ దిశగా 150 మీటర్ల (500 ఫీట్ల) వెడల్పుతో రైట్ ఆఫ్ వే (ఆర్వోడబ్ల్యూ) ఉండేలా ఫీజిబిలిటీ నివేదకలను ప్రతిపాదించింది. ఇందుకు 4,900 హెక్టార్ల భూసేకరణ అవసరం అవుతోంది. ఈ ప్రాజెక్టులకు మొత్తంగా రూ. 11 వేల కోట్లు ఖర్చవుతుంది. హైదరాబాద్ పర్యటనలో మీరు మే 5న ఈ రెండు రహదారులను నాలుగు లేన్ల రహదారిగా మార్చేందుకు వీలుగా మంజూరు చేస్తున్నట్లు లాంఛనప్రాయంగా చెప్పారు. అందువల్ల రెండో రహదారిని కూడా జాతీయ రహదారిగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీచేయడంతో పాటు ఈ రెండు రోడ్డు ప్రాజెక్టులను ఆరు లేన్ల ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలి’అని సీఎం నివేదించారు మరమ్మతులకు నిధులు అవసరం... జడ్చర్ల–మహబూబ్‌నగర్ మధ్య ఎన్‌హెచ్–167పై 15 కి.మీ. మేర రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని చాలా కాలంగా కోరుతున్నామని, దీన్ని త్వరితగతిన మంజూరు చేసి పనులు ప్రారంభించాలని గడ్కరీకి సీఎం కేసీఆర్ మరో వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలో 2 వేల కి.మీ. మేర జాతీయ రహదారులను నాలుగు లేన్ల రహదారులుగా మార్చే పనిని ఎన్హెచ్ఏఐకి అప్పగించారని, ఇందులో వెయ్యి కి.మీ. అభివృద్ధి చేశారని, మరో 400 కి.మీ. పొడవున పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. అయితే మిగిలిన 600 కి.మీ. పనులు టెండర్ దశలోనే ఉన్నాయని, ఈ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నందున మరమ్మతుల కోసం నిధులు ఇవ్వాలని కోరారు. హైవేల నిర్వహణకు పీడబ్ల్యూడీకి నిధులివ్వండి.. రాష్ట్రంలో 5,600 కి.మీ. మేర జాతీయ రహదారులు ఉండగా వాటిలో 2 వేల కి.మీ. మేర ఎన్హెచ్ఏఐ నిర్వహణ, అభివృద్ధి పనులు చూస్తోందని, మిగిలిన 3,600 కి.మీ. రహదారులను రాష్ట్ర పీడబ్ల్యూడీ విభాగం చూస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. అయితే దీనికి కేంద్రం గత రెండేళ్లలో వరుసగా రూ. 2,635 కోట్లు, రూ. 3,030 కోట్లు విడుదల చేయగా ఈ ఏడాదికి కేవలం రూ. 353 కోట్లే ఇచ్చిందన్నారు. అందువల్ల కనీసం రూ. 3 వేల కోట్లు ఇవ్వాలని గడ్కరీని కోరారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ పొందుపరిచినందున ఇందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. ఆ ఏడు రోడ్లను జాతీయ హైవేలుగా గుర్తించండి.. తెలంగాణలో పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తిస్తూ ఆమోదం తెలపడంలో, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందని సీఎం కేసీఆర్ గడ్కరీకి వరించారు. సూత్రప్రాయ అంగీకారం తెలిపిన ఏడు ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. చౌటుప్పల్–కంది రహదారికి అలైన్మెంట్ ఆమోదం, గెజిట్ నోటిఫికేషన్ రావాల్సి ఉందని, మెదక్–సిద్దిపేట–ఎల్క తుర్తికి నోటిఫికేషన్ రావాల్సి ఉందని వివరించారు. అలాగే కరీంనగర్–సిరిసిల్ల–పిట్లం రహదారికి అలైన్మెంట్ ఆమోదం, నోటిఫికేషన్ రావాలని వివరించారు. గౌరెల్లి–వలిగొండ–కొత్తగూడెం రోడ్డుకు, మెదక్–ఎల్లారెడ్డి– రుద్రూరు రోడ్డుకు, బోధన్–బాసర–భైంసా రహదారికి నోటిఫికేషన్ రావాల్సి ఉందని నివేదించారు. దుద్దెడ–సిద్దిపేట–సిరిసిల్ల రహదారికి అలైన్మెంట్ అనుమతి రావాల్సి ఉందన్నారు. ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి సాక్షి, న్యూఢిల్లీ : సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్య టన ముగిసింది. సోమవారం రాత్రి ప్రత్యేక విమా నంలో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. రాజ కీయ, పాలనాపరమైన అంశాలపై కేంద్రంతో చర్చల కోసం శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం శనివారం ప్రధాని మోదీని, ఆదివారం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. సోమవారం మధ్యాహ్నం నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. -
నీళ్లేవి కృష్ణా..?
-
కృష్ణా కాలువల్లో పడిపోయిన నీటిమట్టం
-
కృష్ణా జలాల వాడకంపై తెలుగు రాష్ట్రాల మధ్య పెరిగిన వేడి
-
ఆల్మట్టి గేట్లు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: ఎగువన కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి నిండుకుండగా మారడంతో మంగళవారం ఉదయం గేట్లెత్తారు. ఈ నీరంతా దిగువన ఉన్న నారాయణపూర్‌కు వస్తోంది. బుధవారం అక్కడ కూడా గేట్లు ఎత్తే అవకాశాలు ఉండటంతో.. తెలంగాణ వైపు మరో రెండు మూడ్రోజుల్లో కృష్ణమ్మ పరవళ్లు మొదలు కానున్నాయి. మరోవైపు తుంగభద్ర కూడా నిండేందుకు సిద్ధమైంది. వర్షాలు స్థిరంగా కొనసాగుతుండటం, ప్రాజెక్టుల్లోకి భారీ ప్రవాహాలు ఉండటంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల కింద ఆయకట్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. జూరాలలోకి వచ్చే నీటితో 4.50 లక్షల ఎకరాలకు, శ్రీశైలానికి వచ్చే నీటితో మరో 3.50 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా నీటిపారుదల శాఖ పంపులు, మోటార్లు సిద్ధం చేసింది. జూరాలలో ప్రస్తుతం నిల్వ ఉన్న 5.6 టీఎంసీల నుంచి 2.5 టీఎంసీల నీటిని భీమా, నెట్టెంపాడు ఆయకట్టుకు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. దీంతో మంగళవారం రాత్రి భీమా, నెట్టెంపాడులో ఒక్కో పంపును ప్రారంభించి నీటిని విడుదల చేస్తున్నారు. 10 రోజుల్లోనే 95 టీఎంసీలు ఆల్మట్టి ప్రాజెక్టులోకి గత పదిరోజుల్లోనే సుమారు 95 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మంగళవారం సాయంత్రం సైతం 1.55 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 1,705 అడుగులు కాగా ప్రస్తుతం 1701.87 అడుగులకు నీరు చేరింది. 129.7 టీఎంసీలకుగానూ 113.07 టీఎంసీల నీటి లభ్యత ఉంది. మంగళవారం రాత్రికి నీటిమట్టం మరో నాలుగైదు టీఎంసీలకు పెరిగినట్లు కర్ణాటక నీటి పారుదల వర్గాలు తెలంగాణ అధికారులకు సమాచారం ఇచ్చాయి. ప్రస్తుతం 18 గేట్లు ఎత్తి ఆల్మట్టి నుంచి దిగువన నారాయణపూర్‌కు స్పిల్‌వే, పవర్‌హౌజ్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణపూర్‌కు 37,906 క్యూసెక్కుల నీరు వస్తోంది. నారాయణపూర్ 37.64 టీఎంసీల సామర్థ్యానికి గానూ 29.80 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఎగువ నుంచి ప్రవాహాలు వస్తున్నందున బుధవారం సాయంత్రం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అదే జరిగితే జూరాలకు శుక్రవారం ఉదయానికి కృష్ణా ప్రవాహాలు నమోదవుతాయని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జూరాలలో 9.6 టీఎంసీల సామర్థ్యానికిగానూ 5.76 టీఎంసీల నిల్వ ఉంది. మరోవైపు తుంగభద్ర కూడా నిండేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టులో 100 టీఎంసీలకు గానూ ఇప్పటికే 86.45 టీఎంసీల నిల్వలున్నాయి. 82 వేల క్యూసెక్కుల ప్రవాహాలు కొనసాగుతున్నాయి. బుధవారం తుంగభద్ర గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. గేట్లు ఎత్తితే దిగువ శ్రీశైలానికి శుక్రవారం నాటికి ప్రవాహాలు రానున్నాయి. 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి రెండుమూడ్రోజుల్లో దిగువకు నీరు వచ్చే అవకాశం ఉన్నందున ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల, శ్రీశైలంపై ఆధారపడిన ఆయకట్టుకు నీటిని అందించేందుకు నీటి పారుదల శాఖ సిద్ధమవుతోంది. జూరాల కింద లక్ష ఎకరాలకు నీటిని అందించడంతోపాటు భీమాలో రెండు ఫేజ్ల్లోని 6 మోటార్ల ద్వారా 1.70 లక్షల ఎకరాలు, నెట్టెంపాడులో రెండు స్టేజీల్లో 6 మోటార్ల ద్వారా 1.5 లక్షలు, కోయిల్‌సాగర్‌లో రెండు మోటార్ల ద్వారా 50 వేల ఎకరాలకు నీరివ్వడంతోపాటు 250 చెరువులను నింపాలని మంత్రి హరీశ్‌రావు ఇటీవల అధికారులను ఆదేశించారు. ఇక శ్రీశైలంపై ఆధారపడ్డ కల్వకుర్తిలో 5 మోటార్ల ద్వారా 3.50 లక్షల ఎకరాలకు నీరిచ్చి 400 చెరువులు నింపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తుంగభద్ర జలాలతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పూర్తయితే ఈ ఖరీఫ్‌లోనే ఆర్డీఎస్ కింద 86 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. జూలై నుంచే ఎగువ నుంచి దిగువకు ప్రవాహాలు మొదలవుతున్నందున ఖరీఫ్ ఆయకట్టుకు నీటి విడుదలలో ఢోకా ఉండదని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. -
రావమ్మా కృష్ణమ్మా
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. రోజురోజుకూ వరద ఉధృతి పెరుగుతోంది. కర్ణాటక నుంచి నాలుగైదు రోజుల్లో బిరబిరమంటూ రాష్ట్రంలోకి అడుగుపెట్టనుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టికి వరద పోటెత్తుతోంది. ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 103.13 టీఎంసీలకు చేరింది. ప్రస్తుత వరద మరో రెండ్రోజులు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన నారాయణపూర్‌కు నీటిని వదలనున్నారు. ఆల్మట్టి వద్ద ఆదివారం ఉదయం లక్ష క్యూసెక్కులతో మొదలైన ప్రవాహం సోమవారం ఉదయానికి 1.11 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. గడచిన 24 గంటల్లో మహాబలేశ్వరం సహా పశ్చిమ కనుమల్లో 30 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, కృష్ణా నదికి వరద మరింత పెరుగుతుందని కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ నెల 22 దాకా కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. నారాయణపూర్ నిండగానే దిగువకు.. వాస్తవానికి కృష్ణా నదికి వరద ప్రవాహం మొదలై 15 రోజులు దాటింది. కానీ ప్రాజెక్టులకు వచ్చి చేరుతున్న నీటిని కర్ణాటక ప్రభుత్వం.. చిన్న, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులకు తరలించింది. దాదాపుగా ఆల్మట్టి పరిధిలోని అన్ని చెరువులను నింపింది. దీంతో ప్రస్తుతం వస్తున్న నీటిని దిగువకు వదలాలని నిర్ణయించింది. ప్రాజెక్టు 115 టీఎంసీలకు చేరగానే, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని నారాయణపూర్‌కు నీటిని వదలాలని కేంద్ర జలసంఘం కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం వస్తున్న వరద ప్రవాహం కొనసాగితే బుధవారం మధ్యాహ్నానికి ఆల్మట్టిలో నీరు దాదాపు 120 టీఎంసీలకు చేరుతుంది. వాతావరణ విభాగం చెపుతున్నట్లు భారీ వర్షాలు కొనసాగితే వరద దాదాపు 15 రోజుల పాటు ఉంటుందని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే వరద ప్రవాహం 1.50 క్యూసెక్కుల నుంచి 2 లక్షల క్యూసెక్కుల దాకా ఉండొచ్చని పేర్కొంటున్నారు. అదే నిజమైతే నారాయణపూర్ నుంచి నాలుగు రోజుల్లోనే జూరాలకు నీటి ప్రవాహం మొదలవుతుంది. ప్రస్తుతం నారాయణపూర్‌లో 37.64 టీఎంసీల గరిష్ట నిల్వకు గాను 23.85 టీఎంసీల నీరు ఉంది. భారీగా వరద వస్తే రెండ్రోజుల్లోనే నారాయణపూర్ నిండుతుంది. తుంగభద్రకూ భారీగానే.. తుంగభద్రలోకి కూడా భారీగా వరద వస్తోంది. ఈ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 77.99 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఆల్మట్టి మాదిరే కర్ణాటక తుంగభద్ర నుంచి ఎత్తిపోతల పథకాలకు నీటిని అక్రమంగా తరలించింది. దీంతో ఎప్పుడో గరిష్ట నీటిమట్టానికి చేరుకోనున్న తుంగభద్ర ఇంకా 78 టీఎంసీల వద్దే ఉంది. ప్రస్తుతం వస్తున్న 69 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగితే ఐదు రోజుల్లో గరిష్ట నీటిమట్టానికి చేరుకుంటుంది. ఈ లోగా వరద ప్రవాహం పెరిగితే శ్రీశైలానికి ఐదారు రోజుల్లో వరద మొదలవుతుందని సాగునీటి శాఖ నిపుణులు ఆంచనా వేస్తున్నారు. జూన్ నుంచే వర్షాలు కురుస్తున్నా.. మహాబళేశ్వర్ ప్రాంతంలో జూన్ మొదటి వారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 15 నాటికి ఆల్మట్టికి వరద ప్రవాహం మొదలైంది. ప్రారంభంలో తక్కువ వచ్చినా ప్రతి చుక్కను కర్ణాటక దారి మళ్లించింది. దిగువన తెలంగాణ, ఏపీలోని ప్రాజెక్టుల్లో నిల్వలు అడుగంటినా పట్టించుకోకుండా ఆ నీటితో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నింపింది. అయినా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కిమ్మనకపోవడం గమనార్హం. -
నీటిని తోడేస్తున్న కర్ణాటక
సాక్షి, హైదరాబాద్: నీటి వినియోగంలో కర్ణాటక ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఇప్పటికే కృష్ణా జలాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ విచ్చలవిడి వినియోగంతో నీటిని వదలని ఆ రాష్ట్రం ప్రస్తుతం వచ్చిన నీటిని వచ్చినట్లుగా వాడేస్తోంది. దిగువ రాష్ట్రాల హక్కులను తుంగలో తొక్కేస్తూ ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రల ఎగువనే నీటినంతా దోచేస్తోంది. ప్రధాన ప్రాజెక్టుల నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తూ చెరువులు, చిన్నతరహా జలాశయాలను నింపుతోంది. దీంతో వర్షాకాలం మొదలై నెలన్నర దాటిపోయినా ఇప్పటికీ శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రాజెక్టులు ఖాళీ కుండలను తలపిస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోనే ఏకంగా 365 టీఎంసీల లోటు ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే సాగర్ పరిధిలోని ఆయకట్టుకు అక్టోబర్, నవంబర్‌నాటికి నీరందడం గగనంగానే కనిపిస్తోంది. నీటిపారుదల రంగ నిపుణులు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడం కానీ, కేంద్ర జలవనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లడం కానీ చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జూన్, జూలైలో కురిసే సాధారణ వర్షాలకే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర రిజర్వాయర్లకు ప్రవాహాలు మొదలయ్యాయి. తుంగభద్రకు ఈ వాటర్ ఇయర్లో జూన్ నుంచి గరిష్టంగా రోజుకు 30 వేల క్యూసెక్కులకు మించి వరద కొనసాగుతోంది. అయినా ఇప్పటిదాకా ప్రాజెక్టుల్లో చేరిన కొత్త నీరు 43 టీఎంసీలే కావడం గమనార్హం. బుధవారం కూడా ఈ ప్రాజెక్టులోకి 38 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 50.07 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. కాగా, కర్ణాటక నెలన్నర వ్యవధిలో తుంగభద్ర ఎగువన కనిష్టంగా 10 టీఎంసీలు, గరిష్టంగా 20 టీఎంసీలు వినియోగించినట్లు తెలుస్తోంది. ఆల్మట్టి పరిధిలో ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని వినియోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టులోకి ఇప్పటివరకు 38 టీఎంసీల కొత్తనీరు వచ్చింది. అప్పటికే ఉన్న నిల్వతో కలిపితే 58 టీఎంసీల నీరు ఉండాలి. కానీ గత 15 రోజులుగా దాదాపు 8 నుంచి 10 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. చెరువులు, చెక్‌డ్యామ్‌ల నిండా నీరు నింపేందుకు కర్ణాటక ఈ అక్రమాలకు పాల్పడుతోంది. వినియోగం ఇదే రీతిలో ఉంటే శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండటం కష్టమే అవుతుంది. ఇప్పుడిప్పుడే అక్కడ ఖరీఫ్ ఊపందుకుండటంతో నీటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే దిగువన శ్రీశైలం, సాగర్‌కు అక్టోబర్ వరకు నీటి రాక గగనమే కానుంది. ఖాళీగా శ్రీశైలం, సాగర్ శ్రీశైలానికి గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా నెలన్నర వ్యవధిలో కేవలం 0.34 టీఎంసీల కొత్త నీరే వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.06 టీఎంసీల నిల్వే ఉంది. 186.75 టీఎంసీల లోటు కనిపిస్తోంది. సాగర్‌లోనూ అదే పరిస్థితి. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. 133.37 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. ఇప్పటివరకు సాగర్‌లోకి కొత్తగా 3.20 టీఎంసీల నీరు వచ్చినట్టు కనిపిస్తున్నా.. అందులో శ్రీశైలం లీకేజీల ద్వారా వచ్చిన నీరే 2 టీఎంసీల దాకా ఉంటుంది. ఇక్కడ ఇంకా 178.68 టీఎంసీల లోటు ఉంది. -
జూరాల నుంచే ‘గట్టు’కు ఎత్తిపోతలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఆధారం చేసుకొని గద్వాల జిల్లాలో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం స్వరూపం మారే అవకాశం కనిపిస్తోంది. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నీటిని తీసుకుంటూ ఈ పథకాన్ని చేపట్టాలని మొదట నిర్ణయించారు. అయితే ప్రస్తుతం నేరుగా జూరాల ఫోర్‌షోర్ నుంచే నీటిని తీసుకునేందుకు యోచిస్తున్నారు. సీఎం కేసీఆర్ సూచనల నేపథ్యంలో జూరాల నుంచి నేరుగా తీసుకునే సాధ్యాసాధ్యాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. గద్వాల జిల్లాలోని గట్టు, ధరూర్ మండలాల పరిధిలోని 33వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టుకు గత నెల 29న శంకుస్థాపన చేశారు. దీన్ని రెండు విడతలుగా చేపట్టనుండగా, తొలి విడతను రూ.459.05కోట్లు, రెండో విడతను రూ.94.93కోట్లతో చేపట్టనున్నారు. అయితే గట్టుకు అవసరమయ్యే 4 టీఎంసీల నీటిని రేలంపాడు రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని భావించారు. అక్కడినుంచి నీటిని తీసుకుంటూ 0.7 టీఎంసీ సామర్థ్యం ఉన్న పెంచకలపాడు చెరువును నింపాలని, దీనికోసం అవసరమైతే దాన్ని సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. అయితే 4 టీఎంసీల మేర నీటిని రేలంపాడుకు బదులుగా నేరుగా జూరాల ఫోర్‌షోర్ నుంచి తీసుకుంటేనే ప్రయోజనం ఎక్కువని ఇటీవల సీఎం అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. పెరగనున్న వ్యయం! జూరాల ఫోర్‌షోర్, గట్టుకు మధ్య ఉన్న దూరం, మధ్యలో ఉన్న ఆటంకాలు, పెరిగే వ్యయ అంచనాలపై అధికారులు అధ్యయనం మొదలు పెట్టారు. జూరాల నుంచి గట్టుకు నీటి తరలించాలంటే మధ్యలో పెద్ద పెద్ద గుట్టలను దాటాల్సి ఉంటుందని, దానికోసం టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉంటుందని అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేశారు. దీంతో వ్యయం పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే పూర్తి అధ్యయనం తర్వాతే స్పష్టత వస్తుందని వెల్లడిస్తున్నారు. -
కదిలిన కృష్ణా బోర్డు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై వాటర్ ఇయర్ దగ్గర పడుతున్నా ఇంకా కేంద్రం, బోర్డు దృష్టి సారించలేదంటూ ఈ నెల 9న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘వాటా’ర్ వార్! కథనంపై కృష్ణా బోర్డు స్పందించింది. వాటర్ ఇయర్ ఆరంభానికి ముందే సమస్యలు పరిష్కరించుకోకుంటే మళ్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నీటి వివాదాలు తప్పవన్న కథనం నేపథ్యంలో ఈ నెలాఖరులోగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ నెల 29 నుంచి 31 వరకు బోర్డు సమావేశాన్ని నిర్వహించే తేదీని ఖరారు చేసి తమకు తెలియజేయాలంటూ బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం శుక్రవారం ఇరు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లకు లేఖలు రాశారు. మొత్తంగా 13 అంశాలను సమావేశపు ఎజెండాలో చర్చించాలని పేర్కొన్న ఆయన ఇతర అంశాలు ఏవైనా సూచిస్తే వాటిని ఈ నెల 18లోగా తమకు పంపాలని రెండు రాష్ట్రాలకు సూచించారు. వాటా.. నియంత్రణ.. టెలిమెట్రీలే కీలకం ఎజెండాలో 13 అంశాలను పేర్కొన్న బోర్డు ఇందులో ప్రధానంగా వర్కింగ్ మాన్యువల్, 2017–18 ఏడాదిలో నీటి వినియోగం, వచ్చే ఏడాది నీటి వాటాల వినియోగం, టెలిమెట్రీ అంశాలను చేర్చింది. ఇందులో వాటాల అంశం చాలా కీలకంగా ఉండనుంది. గతేడాది కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో నీటి వాటాలను ఏపీ, తెలంగాణలు 66:34 నిష్పత్తిలో పంచుకున్నాయి. అయితే ఈ నిష్పత్తిని మార్చా లని తెలంగాణ కోరుతోంది. పట్టిసీమ, పోలవరంతో దక్కే వాటాలను దృష్టిలో పెట్టుకొని 61:39 నిష్పత్తి లో పెంచాలని కోరే అవకాశముంది. దీంతో పాటే కృష్ణాలో తమ వాటా 299 టీఎంసీలకు పట్టిసీమతో దక్కే వాటా 45 టీఎంసీలను కలపాలని ఎప్పటినుంచో పట్టుబడుతోంది. ఈ అంశమే బోర్డు సమావేశంలో అత్యంత కీలకంగా ఉండనుంది. బోర్డు వర్కింగ్ మాన్యువల్‌పైనా భిన్నాభిప్రాయం వ్యక్తమైంది. ప్రాజెక్టులన్నింటినీ తామే నియంత్రిస్తామని ఇప్పటికే బోర్డు కేంద్ర జలవనరుల శాఖ ముసాయిదాను పంపింది. దీన్ని తెలంగాణ తప్పుపడుతోంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేకుండా నియంత్రణ అక్కర్లేదని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. అయితే ఏపీ.. నియంత్రణ అవసరమంటూ పట్టుదలగా ఉండటంతో బోర్డు ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సిందే. మరోవైపు ఇప్పటికీ టెలీమెట్రీ మొదటి విడత ఏర్పాటుపై స్పష్టత లేదు. దీన్ని కూడా ఎజెండా అంశాల్లో బోర్డు చేర్చింది. -
‘వాటా’ర్ వార్!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల నీటి లెక్కలపై ఇంకా స్పష్టత రావడం లేదు. జూన్ నుంచి వాటర్ ఇయర్ మొదలయ్యేందుకు మరో 20 రోజుల గడువే ఉన్నా కృష్ణా జలాల పంపిణీపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కృష్ణాలో ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న తాత్కాలిక ఒప్పందాలను సవరించాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కృష్ణా జలాల నీటి వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎడతెగని వివాదాల నేపథ్యంలో.. 2015లో జూన్ 21, 22న ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమైన కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ తాత్కాలిక కేటాయింపు చేశారు. దీనికి మొదట ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరినా మరుసటి ఏడాది నుంచే ఇరు రాష్ట్రాలు దీనిపై అభ్యంతరాలు తెలిపాయి. తెలంగాణకు మళ్లీ అన్యాయం.. పట్టిసీమ ద్వారా తరలిస్తున్న నీటి వాటాలో తమకు న్యాయంగా దక్కే 45 టీఎంసీలు పెంచి తమ కోటా 299 టీఎంసీలకు జత చేయాలని తెలంగాణ కోరుతోంది. అయితే దీనిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. దీనికి తోడు పోలవరం ద్వారా ఎగువన రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలను ఇప్పటికే కర్ణాటక వినియోగిస్తున్నందున తమకు వాటా పెంచాలని కోరుతున్నా అదీ పెండింగ్‌లోనే ఉంది. దీంతో కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు మళ్లీ అన్యాయం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై తెలంగాణ ఏ మేరకు ఒత్తిడి తెస్తుందన్నది కీలకంగా మారింది. తేలని టెలీమెట్రీ ఏర్పాటు.. ఇక నీటి లెక్కలు పక్కాగా ఉండేందుకు సాగర్, శ్రీశైలం పరిధిలో గుర్తించిన ప్రాంతాల్లో టెలీమెట్రీ వ్యవస్థ ఏర్పాటు ఇంత వరకు జరగలేదు. తొలి విడతలో 18 చోట్ల ఏర్పాటుకు రెండేళ్ల కింద స్పష్టత వచ్చినా వాటిని అమల్లోకి తేలేదు. ఇక రెండో విడతలో మరో 29 చోట్ల కృష్ణా బోర్డు ప్రతిపాదించగా, ఇరు రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలున్నాయి. దీంతో వీటి ఏర్పాటు 20 రోజుల వ్యవధిలో పూర్తయ్యేలా కనిపించడం లేదు. కృష్ణాబోర్డు చైర్మన్‌గా ఉన్న వైకే శర్మ 4 రోజుల కిందటే బదిలీ కావడంతో ఆయన స్థానంలో కొత్త చైర్మన్ వచ్చే వరకు టెలిమెట్రీ ఏర్పాటుపై స్పష్టత తేవడం సాధ్యమ్యేది కాదని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
కొత్తగా నాలుగు ‘ఎత్తిపోతలు’!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొత్తగా పలు ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సాగునీటి వసతి కల్పించాలన్న డిమాండ్లు, కల్పించేందుకు అవకాశాలు ఉన్న నాలుగు ప్రాంతాలను గుర్తించింది. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో గట్టు, మంజీరా, సాగర్ టెయిల్‌పాండ్‌లోని హాలియా, తుంగపాడు బంధం ఎత్తిపోతలను చేపట్టేందుకు.. సుమారు రూ.1,400 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. వీటికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు సిద్ధమవగా.. త్వరలోనే మంత్రివర్గ ఆమోదం తీసుకుని, శంకుస్థాపనలు చేయాలని భావిస్తోంది. కొత్తగా నాలుగు.. గద్వాల నియోజకవర్గం పరిధిలో కృష్ణా జలాల ఆధారంగా మరో ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నీటిని తీసుకుంటూ.. కొత్తగా గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. రూ.550 కోట్లతో గద్వాల జిల్లాలోని గట్టు, ధరూర్ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా దీనిని నిర్మించనున్నారు. దీని పనులను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇటీవలే అధికారులను ఆదేశించారు. ఇక నిజాంసాగర్ కింద మంజీరా నదిపై పిట్లం, బిచ్కుంద మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 30,646 ఎకరాలకు నీరిచ్చేలా.. నిజాంసాగర్ మండలం మల్లూర్ సమీపంలో రూ.456 కోట్లతో మంజీరా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.90 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టే ఈ పథకానికి నాలుగైదు రోజుల్లో అధికారిక అనుమతులు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్‌లో కొత్తగా హాలియా ఎత్తిపోతలను రూ.191 కోట్లతో చేపట్టేలా ప్రణాళిక సిద్ధమైంది. 1.32 టీఎంసీల నీటిని తీసుకుని 12,400 ఎకరాలకు నీరిచ్చేలా దీన్ని రూపొందించారు. ఇదే టెయిల్‌పాండ్ కింద తుంగపాడు బంధం వద్ద 0.95 టీఎంసీల సామర్థ్యంతో 8 వేల ఎకరాలకు నీరిచ్చేలా రూ.191 కోట్లతో మరో ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ నాలుగు ఎత్తిపోతల పథకాలకు కూడా దుమ్ముగూడెంలో వృథాగా ఉన్న మోటార్లను వినియోగించనున్నారు. వీటన్నింటికీ వచ్చే నెల రెండో వారానికల్లా అధికారిక అనుమతులు పూర్తి చేసి.. జూన్, జూలై నాటికి పనులు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గరిష్ట ఆయకట్టుకు నీరే లక్ష్యం రాష్ట్రంలో లభ్యతగా ఉన్న ప్రతి నీటిచుక్కను వినియోగంలోకి తేవడం, నీటి నిల్వలను పెంచడం ద్వారా గరిష్ట ఆయకట్టుకు నీరు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులను చేపడుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు ప్రాజెక్టులను మొదలుపెట్టగా.. ఇంకా డిమాండ్ ఉన్న చోట్ల మరిన్ని కొత్త పథకాలకు ప్రణాళికలు వేస్తోంది. ఈ మేరకు కడెం ప్రాజెక్టు కింది ఆయకట్టు స్థిరీకరణతో పాటు అవసరమైనపుడు కుంటాల జలపాతానికి నీరు విడుదల చేసేలా కుఫ్టి ఎత్తిపోతలకు ఇటీవలే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 5.32 టీఎంసీల సామర్థ్యంతో రూ.744 కోట్లతో రిజర్వాయర్ నిర్మించేందుకు అనుమతించింది. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక దేవాదుల ప్రాజెక్టు కింద అదనపు నీటి నిల్వ కోసం 10.78 టీఎంసీల సామర్థ్యంతో జనగామ జిల్లా మల్కాపూర్ గ్రామ పరిధిలోని లింగపల్లి వద్ద రూ.3,227 కోట్లతో రిజర్వాయర్ చేపడుతోంది. ఈ రిజర్వాయర్‌తోపాటు పైప్‌లైన్ వ్యవస్థ, పంపుహౌజ్‌ల నిర్మాణాలకు అనుమతులతో పాటు టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
‘కృష్ణా’ జలాలకు బకాయిల షాక్!
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల తాగునీటి అవసరాలను తీరుస్తున్న కృష్ణా జలాలకు కరెంట్ షాక్ కొడుతోంది. తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను వినియోగించుకుంటున్న జలమండలి, నీటిని ఎత్తిపోస్తున్న మోటార్లకు అయ్యే కరెంట్ చార్జీలను చెల్లించకుండా చేతులెత్తేస్తోంది. సాగర్ నుంచి పుట్టంగండి ఎత్తిపోతల ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలించి అక్కడినుంచి గ్రావిటీ కాల్వల ద్వారా హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తంగా 2,400 క్యూసెక్కులు ఎత్తిపోస్తుండగా ఇందులో 525 క్యూసెక్కులు తాగునీటి అవసరాలకు మళ్లిస్తున్నారు. నీటిని ఎత్తి పోసేందుకు నెలకు కనిష్టం గా రూ.10 కోట్ల మేర విద్యుత్ బిల్లులు వస్తు న్నాయి. ఏటా రూ.120 కోట్ల మేర విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. పదేళ్లుగా వచ్చిన మొత్తం బిల్లు రూ.1,272 కోట్ల మేర ఉండగా ఇందులో తాగునీటి బిల్లు రూ.573 కోట్లు మేర హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు చెల్లించాల్సి ఉంది. పెండింగ్ బిల్లులపై... బిల్లు బకాయిలపై నీటి పారుదల శాఖ పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేకపోవడంతో ఆ శాఖే ట్రాన్స్‌కోకు బిల్లులు చెల్లిస్తోంది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగితే అక్కంపల్లి పరిధిలోని శాఖ కార్యాలయాలకు, సిబ్బంది క్వార్టర్లకు కరెంట్‌కట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జనవరిలో అధికారులు ప్రభుత్వ సీఎస్ జోషి తో సమావేశం నిర్వహించారు. బిల్లుల చెల్లింపునకు జలమండలి అధికారులు ఓకే చెప్పినా బకాయిలు మాత్రం చెల్లించలేదు. దీంతో మళ్లీ రెండ్రోజుల క్రితం ఇరిగేషన్ కార్యాలయాలు, క్వార్టర్లకు ట్రాన్స్‌కో కరెంట్ కట్ చేసింది. -
ఏపీ ఎక్కువ నీటిని వాడేస్తోంది
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను ఎక్కువగా వినియోగిస్తోందని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ఎక్కువ నీటిని వాడుకుంటోందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. వినియోగించుకున్న నీటి వివరాలను సైతం ఏపీ వెల్లడించడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు సంబంధించి గ్రావిటీపై 55 వేల క్యూసెక్కుల నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును అభివృద్ధి చేసిందని, కానీ కచ్చితమైన నీటి ప్రవాహాన్ని లెక్కించే విధానమేదీ పోతిరెడ్డిపాడు వద్ద లేకపోవడంతో ఏపీ నీటి వాడకం వివాదాస్పదమవుతోందని ఈ లేఖలో మంత్రి ప్రస్తావించారు. -
బావను మించిన బాలయ్య
హిందూపురం అర్బన్ : హడావుడి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు మారుపేరుగా నిలిచిన చంద్రబాబును హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మించిపోయారు. కృష్ణా జలాలతో చెరువులన్నీ నింపి లేపాక్షి ఉత్సవాల్లో జలహారతిని ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన బాలయ్య.. తన మాట నిలబెట్టుకునేందుకు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. ఎందుకంటే హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు ఇంకా లేపాక్షికి చేరకపోవడమే ఇందుకు కారణం. దీంతో పరువు కాపాడుకునే ప్రయత్నాలకు కొత్త మార్గాలు అన్వేశించారు. సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చే ఘాట్‌ను ఆ పక్కనే ఉన్న చెరువులో నిల్వ ఉన్న వర్షం నీటితో నింపే ప్రయత్నం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన వారు ‘ఔరా! బాలయ్య.. మోసాల్లో బావను మించి పోయావయ్యా’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. -
నాగార్జునసాగర్‌లో టెన్షన్
సాక్షి, హైదరాబాద్/నాగార్జునసాగర్: కృష్ణా జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బుధవారం ఉదయం మొదలైన వివాదం సాయంత్రానికి చల్లారింది. వాటాకు మించి వాడుకున్న కారణంగా నీటి విడుదల నిలిపివేయాలని ఏపీని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశించడం, దాన్ని ఏపీ ధిక్కరించడం.. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి రంగంలోకి దిగడం, తెలంగాణతో బోర్డు సంప్రదింపులు జరపడం, తెలంగాణ అంగీకరించడం అన్నీ చకాచకా జరిగిపోయాయి. దీంతో ప్రస్తుత వివాదానికి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ఇరు రాష్ట్రాల అవసరాలపై పూర్తి స్థాయి లో చర్చించేందుకు ఈ నెల రెండో తేదీన మధ్యా హ్నం 3 గంటలకు బోర్డు త్రిసభ్య కమిటీ భేటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం చేసింది. వాటా వాడేసిన ఏపీ ప్రస్తుత వాటర్ ఇయర్లో కృష్ణాలో మొత్తంగా 466.64 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్నాయి. తెలంగాణ 142.14 టీఎంసీలు, ఏపీ 324.50 టీఎంసీలు వాడుకున్నట్లుగా లెక్కలు తేలాయి. అవిగాక కృష్ణా బోర్డు జనవరిలో తెలంగాణకు 50 టీఎంసీలు, ఏపీకి 60 టీఎంసీలను పంచింది. అయితే ఏపీ కేటాయింపులకు మించి 2.32 టీఎంసీల నీటిని వాడినట్లు బోర్డు గుర్తించి శ్రీశైలం, సాగర్ కుడి కాల్వ పరిధిలో నీటి విడుదల నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో బుధవారం నుంచి కుడి కాల్వ పరిధిలో ఏపీ నీటి వినియోగాన్ని తెలంగాణ నిలిపివేసింది. దీనిపై ఏపీ అధికారులు సాగర్ డ్యామ్‌పై హడావుడి చేయడంతో వివాదం మొదలైంది. కుడి కాల్వకు నీటిని విడుదల చేసేందుకు నాగార్జున సాగర్ డ్యాం దగ్గర రెగ్యులేటర్‌ను ఆపరేట్ చేసుకోవాలని, తెలంగాణ అధికారులు అభ్యంతరం చెబితే పోలీసుల రక్షణ తీసుకోవాలంటూ ఏపీ నీటి పారుదల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వర్ రావు రాసిన లేఖతో ఆ రాష్ట్ర అధికారులు రంగంలోకి దిగారు. కృష్ణా బోర్డు కేటాయింపులతో తమకు సంబంధం లేదంటూ తెలంగాణ అధికారులతో వితండవాదానికి దిగారు. అయితే ఉన్నతాధికారుల అనుమతి లేకుండా చుక్కనీటిని కూడా విడుదల చేయలేమంటూ తెలంగాణ అధికారులు తెగేసి చెప్పారు.దీంతో డ్యామ్ వద్ద ఉద్రిక్త పరిస్తితులు తలెత్తడంతో ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎస్.సునీల్.. నల్లగొండ కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా డ్యామ్ వద్ద ఇరురాష్ట్రాల పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. రంగంలోకి ఏపీ సీఎం ఈ వివాదం జరుగుతుండగానే తమ రాష్ట్రానికి నీళ్లు విడుదల చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశానికి ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. కనీసం 2 వేల క్యూసెక్కులైనా విడుదల చేయాలని కోరారు. దీనిపై తెలంగాణ అధికారులతో చర్చిస్తానన్న పరమేశం.. వెంటనే తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌తో మాట్లాడారు. కుడి కాల్వల కింది పంటలకు నీటి అవసరాల దృష్ట్యా 5 రోజులపాటు 2 వేల క్యూసెక్కుల మేర విడుదలకు ఈఎన్సీ అంగీకరించడంతో కుడి కాల్వకు నీటి విడుదల కొనసాగించవచ్చంటూ పరమేశం ఆదేశాలు ఇచ్చారు. దీంతో వివాదం చల్లారింది. అయితే శ్రీశైలం జలాశయం ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేస్తేనే తాము కుడి కాల్వకు నీటిని విడుదల చేస్తామని డ్యామ్ చీఫ్ ఇంజనీర్ సిరివోరు సునీల్ తెలిపారు. ఈ విషయమై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు. -
రైతుల చేతుల్లో బొచ్చె..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కృష్ణాజలాలు జిల్లాకు వచ్చాయి కాబట్టే ఈ రోజు కియా కార్లపరిశ్రమ ఏర్పాటవుతోందని, గొల్లపల్లికి నీళ్లు రాకపోతే కియా వచ్చేది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కియా మోటార్స్ రూప కల్పన ప్రక్రియ వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం ఆయన పెనుకొండ సమీపంలోని కియా మోటార్స్ ప్లాంట్‌కు విచ్చేశారు. కియా ప్రెసిడెంట్ హాన్వూపార్క్తో కలిసి కియా మోటార్స్ ప్రాముఖ్యతను వివరించారు. ‘అనంత’ వెనుకబడిన ప్రాంతమని, కియా లాంటి పరిశ్రమలు మరిన్ని జిల్లాకు రావాలని కాంక్షించారు. కియా కారు ఆ దేశంలో అత్యంత పేరున్న కంపెనీ అని, భారతదేశంలో తొలిప్లాంటు ఏర్పాటు చేస్తున్నారన్నారు. బెంగళూరు–హైదరాబాద్, కృష్ణపట్నం పోర్టుకు దగ్గరలో ‘ట్రై జంక్షన్’గా ప్లాంటు ఏర్పాటవుతోందని, భారతదేశానికి మధ్యలో ఉందన్నారు. ప్లాంటు ఏర్పాటుకు కృషి చేసిన పరిశ్రమల శాఖ కార్యదర్శి సొలమన్ ఆరోగ్యరాజ్, ప్రభుత్వ సిబ్బందిని అభినందించారు. కార్ల ఉత్పత్తిలో 90శాతం దేశీయ మార్కెట్లో విక్రయించి, 10శాతం ఎగుమతి చేస్తారన్నారు. ప్లాంటుకు 675 ఎకరాలు ఇచ్చామని, కొరియన్ టౌన్‌షిప్‌కు మరో 335 ఎకరాలు ఇస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, మనం ఆర్థికంగా పురోగతి సాధించాలంటే పారిశ్రామిక ప్రగతి ముఖ్యమన్నారు. ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా మారుతుందన్నారు. టైర్ల కంపెనీ, ఇతర అనుబంధ పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ‘అనంత’ వాసులు కియాలో ఉద్యోగాలు సాధించేలా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు అవసరమైన భూమి, ఇతర వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం కియా మోటార్స్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అక్కడున్న స్తంభాలపై సంతకాలు చేశారు. వీటిని వెంటనే రూఫ్ లెవల్లో అమర్చారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పెనుకొండ రోడ్డు వెడల్పునకు రూ.1.5కోట్లు, గొల్లపల్లి రిజర్వాయర్‌కు వెళ్లే రోడ్డు విస్తరణకు రూ.5కోట్లు మంజూరు చేశారు. పెనుకొండలో అర్బన్ హౌసింగ్ కింద వెయ్యి గృహాలను మంజూరు చేశారు. అవసరమైతే 1+2 కింద ఇళ్లు నిర్మిస్తామన్నారు. కియా ప్లాంటు కోసం భూములు కోల్పోయిన 32మంది రైతుల పరిహారానికి సంబంధించి రైతులతో మాట్లాడి నివేదికను ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్ వీరపాండియన్‌ను ఆదేశించారు. సీఎం ప్రసంగిస్తుండగానే హైకోర్టును సీమలో ఏర్పాటు చేయాలని పలువురు న్యాయవాదులు నినాదాలు చేశారు. అందుకు చంద్రబాబు స్పందిస్తూ ఇది సరైన పద్ధతి కాదని, నేరుగా వచ్చి మాట్లాడాలని వారించారు. ఇంతలో పోలీసులు న్యాయవాదులను అదుపులోకి తీసుకొని బయటకు తరలించారు. కార్యక్రమంలో మంత్రులు అమరనాథరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరావు, పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, జవహర్, చీఫ్‌విప్ పయ్యావుల కేశ్, విప్ యామినీబాల ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, వరదాపురం సూరి, ప్రభాకర్‌చౌదరి, హనుమంతరాయచౌదరి, అత్తార్‌చాంద్‌బాషా, కలెక్టర్ వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచశ్రేణి ఉత్పత్తులు అందిస్తాం: హాన్వూపార్క్, కియా ప్రెసిడెంట్ ఏపీతో పాటు భారత్‌లో కియా అద్భుత మార్పులను తీసుకొస్తోంది. ఇక్కడ మంచికార్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి రాలేదు. ఆటోమోటివ్ లైఫ్స్టైల్లో నూతన ప్రమాణాలను, ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను భారతీయులకు అందిస్తాం. భారత ప్రజలతో మమేకమై, ఇక్కడి సమాజానికి తిరిగి కొంత ఇవ్వాలని కోరుకుంటున్నాం. త్వరలోనే 3వేల మంది ఉద్యోగులను నియమిస్తాం. వృతినైపుణ్యంపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. కొరియన్లపై భారతీయులు ఆదరాభిమానులు చూపాలి: కోహ్యూ షిమ్, ఎండీ, కియా. ఏపీ ప్రభుత్వంతో 10 నెలల కిందట ఎంఓయూ చేసుకున్నాం. అనంతపురం ప్రజలతో చక్కటి సంబంధ, బాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఆదరాభిమానాలు చూపుతున్నారు. కార్ల పరిశ్రమతో ఇక్కడ కియా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. భవిష్యత్తులో కూడా ఇక్కడి ప్రజలు ఇదే ఆదరాభిమానాలు చూపాలి. రైతుల చేతుల్లో బొచ్చె అనంతపురం అర్బన్: కియా పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతుల చేతిలో కంపెనీ యాజమాన్యం బొచ్చ పెట్టింది. ఫ్రేమ్ వర్క్ ఇన్స్టలేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు మెడలో ఒక ట్యాగ్ వేసి ఒక కంచం, రెండు గ్లాసులను కంపెనీ నిర్వాహకులు పంపిణీ చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులకు మాత్రం ఖరీదైన గిఫ్ట్‌బాక్సులు, చేతి గడియారాలను బహుమానంగా అందజేశారు. భూములు ఇచ్చిన రైతులకు కంచం ఇవ్వడంపై పలువురు అధికారులు పెదవి విరిచారు. -
కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో గురువారం విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంపై ఏపీ దాఖలు చేసిన అఫిడవిట్‌పై తెలంగాణ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఏపీ తరఫు సాక్షి అయిన వ్యవసాయ రంగ నిపుణుడు పీవీ సత్యనారాయణకు తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది రవీందర్రావు పలు ప్రశ్నలు సంధించారు. ఉమ్మడి ఏపీలో వాతావరణం ఆధారంగా ఏర్పాటు చేసిన అగ్రో క్లైమేట్ జోన్లపై పలు ప్రశ్నలు వేశారు. గోదావరి జోన్లో ఏడీఆర్‌గా ఉన్న తాను తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త వంగడాల తయారీకి సాయం చేశానని, ఎంటీయూ 1061, ఎంటీయూ 1075 తదితర వరి వంగడాలను తెలంగాణ కోసం తయారు చేసినట్లు సత్యనారాయణ చెప్పారు. జాతీయ వ్యవసాయ పరిశోధన ప్రాజెక్టు సిఫార్సుల మేరకు వ్యవసాయ వాతావరణ జోన్లు ఏర్పాటు చేస్తారని, ఉమ్మడి ఏపీలో మొత్తం 9 ఉన్నట్లు సమాధానాలిచ్చారు. విచారణ శుక్రవారం కూడా కొనసాగనుంది. -
వేడెక్కుతున్న ‘కృష్ణా’ జలాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ మళ్లీ వేడి పుట్టిస్తోంది. సమయానికి జరగని త్రిసభ్య కమిటీ భేటీలు, నీటి వినియోగంలో వ్యత్యాసాలు, టెలీమెట్రీ వ్యవస్థ అమల్లో జాప్యం, అవసరాలకు సరిపడాలేని లభ్యత జలాలు వెరసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలను పెద్దవి చేసేలా ఉన్నాయి. దీనికితోడు చాలా వివాదాస్పద అంశాల్లో పట్టనట్టుగా ఉన్న కృష్ణా బోర్డు వ్యవహారం రాష్ట్రాల మధ్య వివాదాన్ని పెంచుతున్నాయి. కృష్ణాబేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ప్రస్తుతం కనీస నీటి మట్టాలకు ఎగువన 163.89 టీఎంసీల లభ్యత జలాలున్నాయి. ఇరు రాష్ట్రాలు సమర్పించిన ఇండెంట్ల మేరకు జనవరి నుంచి మే చివరి వరకు మొత్తంగా 206.40 టీఎంసీల మేర అవసరాలున్నాయి. ఇందులో తెలంగాణ అవసరాలు 101.12 టీఎంసీల మేర ఉండగా, ఏపీకి 105.28 టీఎంసీల అవసరాలున్నాయి. లభ్యత జలాలకు మించి అవసరాలు ఉండటంతో వీటిని ఎలా పంచాలన్నది ప్రస్తుతం కృష్ణా బోర్డు ముందున్న పెద్ద ప్రశ్న. ఇప్పటికే బోర్డు త్రిసభ్య కమిటీ వాయిదాపడుతూ వస్తుండటంతో ఇరు రాష్ట్రాలు తమకు దక్కే 66:34 నిష్పత్తిన నీటిని వాడుకుంటూ పోతున్నాయి. అయితే ఏ రాష్ట్రం ఎంత వాడుకుంటుందన్నది త్రిసభ్య కమిటీ భేటీ జరిగితేగానీ స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. ఇక సాగర్ ఎడమ కాల్వకింద ప్రతిసారీ నీటి కేటాయింపులు, వినియోగానికి మధ్య వ్యత్యాసం ఏర్పడుతోంది. బోర్డు 5 టీఎంసీలు కేటాయిస్తే అది ఏపీ పరిధిలోని ఆయకట్టుకు చేరేసరికి 2 టీఎంసీలుగా కూడా ఉండట్లేదని ఇప్పటికే ఏపీ పలుమార్లు బోర్డు దృష్టికి తెచ్చింది. ఈ నేపథ్యంలో వాస్తవ నష్టాలు ఎలా ఉంటాయన్నది తేల్చేందుకు కృష్ణా బోర్డు గత నెలలో కమిటీ వేసినా అది ఇంతవరకు ఏమీ తేల్చలేదు. దీనికి తోడు శ్రీశైలం నుంచి సాగర్‌కు విడుదల చేసిన నీటిలో లెక్కతేలని జలాల అంశం ఇప్పటికీ వివాదంగానే ఉంది. ఇప్పటికీ అమల్లోకిరాని టెలీమెట్రీ: కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు నిర్ధారించిన ప్రాంతాల్లో రెండు విడతల్లో టెలీమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని 2016 జూన్‌లో నిర్ణయించారు. ఈ ఏడాది జూన్ నాటికే వీటిని సిద్ధం చేస్తామని బోర్డు హామీ ఇచ్చినా అది అమల్లోకి రాలేదు. దీంతో పోతిరెడ్డిపాడు కింద వినియోగంపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీనిపై ఇటీవలే బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఘాటు లేఖ రాసింది. ఇప్పటికైనా మరింత జాప్యం జరగకుండా బోర్డు తక్షణమే కార్యాచరణలోకి తీసుకోవాలని కోరినా స్పందన కరువైంది. -
‘కృష్ణా’లో మనకు 100 టీఎంసీలే!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్న కృష్ణా జలాలు పోనూ లభ్యత జలాల్లో ఇప్పటికే నిర్ణయించిన వాటా (66:34) మేరకు ఏపీకి 152 టీఎంసీలు, తెలంగాణకు 101.33 టీఎంసీలు దక్కే అవకాశం ఉంది. ఈ వంద టీఎంసీల్లోంచే వచ్చే ఆగస్టు వరకు తాగు, సాగు అవసరాలకు నీటిని వినియోగించుకోవాల్సి ఉంది. నిజానికి ఈ ఏడాది నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో కనీస నీటిమట్టాలకు ఎగువన మొత్తంగా 510.84 టీఎంసీల మేర లభ్యత జలాలు ఉండగా ఇందులో 247.94 టీఎంసీల వినియోగం జరిగింది. వినియోగపు నీటిలో తెలంగాణ 69.10 టీఎంసీలు, ఏపీ 178.84 టీఎంసీలు వినియోగించుకుంది. లభ్యతగా ఉన్న 262.90 టీఎంసీల్లో సరఫరా నష్టాలు 9.56 టీఎంసీలుపోనూ మిగతా నీటిలో ఏపీకి 152 టీఎంసీలు, తెలంగాణకు 101.33 టీఎంసీలు దక్కనున్నాయి. ఈ నీటిలో సాగర్ ఎడమ కాల్వ కింది సాగు అవసరాలకే 41 టీఎంసీలు అవసరం ఉంటుంది. బుధవారం బోర్డుకు సమర్పించిన ఇండెంట్లో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నీటిలో 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనుంది. ఇక నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, మిషన్ భగీరథ అవసరాలకు మొత్తంగా 25 టీఎంసీలు కోరింది. మరో 10 టీఎంసీలు కల్వకుర్తికి, ఏఎంఆర్పీ అవసరాలకు 10 టీఎంసీలు కావాలని అడిగింది. కల్వకుర్తిలో 25 టీఎంసీలతో 2.55 లక్షల ఎకరాలకు నీరివ్వాలని మొదట నిర్ణయించారు. అయితే ఇప్పటికే కల్వకుర్తి కింద 10.68 టీఎంసీల మేర వినియోగం జరగడంతో ప్రస్తుత లభ్యత దృష్ట్యా మరో 10 టీఎంసీలనే బోర్డు కేటాయించే అవకాశం ఉంది. ఈ లెక్కన అక్కడ నిర్ణీత ఆయకట్టు తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక జూరాల కింద 50 వేల ఎకరాలు, ఆర్డీఎస్ కింద 20 వేలు, నెట్టెంపాడు 50 వేలు, భీమా 44,450, కోయిల్‌సాగర్ 12 వేల ఎకరాలకు నీరివ్వాలని నీటిపారుదలశాఖ నేతృత్వంలోని సమీకృత నీటి నిర్వహణ, ప్రణాళిక కమిటీ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం పేర్కొన్న అవసరాల్లో వాటి వివరాలు లేవు. ఇక మధ్యతరహా ప్రాజెక్టులైన మైసీ, పాకాల, వైరా, లంకసాగర్, డిండిల కింద సైతం 30 వేల ఎకరాల మేర ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉంది. వాటికి 3 నుంచి 4 టీఎంసీల నీటి అవసరాలుంటాయి. మరోవైపు ఏపీ సైతం ఏప్రిల్ వరకు మొత్తంగా 156 టీఎంసీలు అవసరమని చెబుతుండగా ఆ రాష్ట్రానికి 152 టీఎంసీలు మాత్రమే దక్కే అవకాశం ఉంది. ఆ తర్వాత మే, జూన్, జూలై అవసరాలకు నీటిని ఎక్కడి నుంచి వినియోగిస్తారన్నది పెద్ద ప్రశ్నగానే ఉంది. -
పెత్తనంపై మెత్తన!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాజెక్టులను నియంత్రణలోకి తెచ్చుకునే అంశంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మెత్తబడింది. ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఇరు రాష్ట్రాల ఉద్యోగులు బోర్డు అధీనంలోనే పని చేసేలా గతంలో రూపొందించిన వర్కింగ్ మాన్యువల్‌పై వెనక్కి తగ్గింది. ప్రాజెక్టుల నియంత్రణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెలంగాణ పట్టుబట్టిన నేపథ్యంలో వాటిని రాష్ట్రాల పరిధిలోనే ఉంచేలా తుది వర్కింగ్ మాన్యువల్ సిద్ధం చేసింది. దానిపై అభిప్రాయాలు కోరుతూ శుక్రవారం తెలంగాణ, ఏపీకి లేఖలు రాసింది. రాష్ట్రానికి ఉపశమనం... కృష్ణా బేసిన్ పరిధిలో కొత్తగా చేపట్టిన, చేపట్టనున్న అన్ని ప్రధాన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటి నుంచో కోరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమంటూ ఏపీ కేంద్రానికి లేఖలు సైతం రాసింది. ఇందుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో కృష్ణా బోర్డు... శ్రీశైలం, సాగర్‌తోపాటు హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, భీమా, ఏఎమ్మార్పీలను తమ పరిధిలోకి తెచ్చుకుంటామంటూ గతంలో డ్రాఫ్ట్ వర్కింగ్ మాన్యువల్ రూపొందించి ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. అయితే బోర్డు ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసి ప్రాజెక్టులవారీగా నీటి లెక్కలు తేలాక... బోర్డు వాటి నిర్వహణనే చూడాలని తేల్చిచెప్పింది. దీంతో తెలంగాణ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న బోర్డు... ప్రాజెక్టులపై ప్రత్యక్షంగా తమ నియంత్రణ ఉండదంటూ తుది వర్కింగ్ మాన్యువల్ సిద్ధం చేసింది. ప్రాజెక్టులన్నీ రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని పేర్కొంది. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి పెద్ద ఉపశమనం లభించినట్లయింది. కొత్త ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్, బోర్డు అనుమతి తప్పనిసరి కృష్ణా బేసిన్ పరిధిలో కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్‌తోపాటు తమ అనుమతి తప్పనిసరని బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ ఏవైనా ధిక్కరణలకు పాల్పడితే కేంద్రం విధించే ఆర్థిక, ఇతర జరిమానాలు, ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. కృష్ణా బేసిన్లో ఇప్పటికే చేపట్టిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగు గంగ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఇరు రాష్ట్రాలు పూర్తి చేసుకోవచ్చని సూచించింది. బోర్డు పరిధిలో పరిష్కారమవని ఏ అంశంపైనైనా ఇరు రాష్ట్రాలు అపెక్స్ కౌన్సిల్‌కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని వివరణ ఇచ్చింది. వర్కింగ్ మాన్యువల్‌కు ఇరు రాష్ట్రాలు ఆమోదం తెలిపితే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
తెలంగాణకు 9, ఏపీకి 16
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులో లభ్యతగా ఉన్న నీటిలో 25 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకూ పంచుతూ కృష్ణా బోర్డు శుక్రవారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు 9 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 16 టీఎంసీలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే శ్రీశైలం నుంచి సాగర్‌కు రోజుకు ఒక టీఎంసీ చొప్పున 16 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సూచించింది. తెలంగాణకు కేటాయించిన నీటిలో హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు చెరో 2 టీఎంసీల చొప్పున 4 టీఎంసీలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి కింది తాగునీటి అవసరాలకు మరో 5 టీఎంసీలు వాడుకోవాలని పేర్కొంది. ఏపీకి కేటాయించిన నీటిలో సాగర్ కుడి కాల్వకు 6 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు అవసరాలకు 5 టీఎంసీలు, హంద్రీ–నీవా కింది అవసరాలకు మరో 5 టీఎంసీలు వాడుకునే అవకాశం ఇచ్చింది. అయితే ఏపీ ఇప్పటికే హంద్రీ–నీవా కింద 1.08 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు కింద 1.5 టీఎంసీలు వాడుకున్నందున ప్రస్తుత కేటాయింపుల్లో వాటిని లెక్కించాలని సూచించింది. అలాగే కల్వకుర్తి కింద తెలంగాణ సైతం ఇప్పటికే 1.65 టీఎంసీలు వాడినందున రాష్ట్రానికీ ఇదే సూత్రం వర్తిస్తుందని బోర్డు తెలిపింది. జూన్ వరకు నీటి కేటాయింపులపై మళ్లీ చర్చిద్దాం... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ భేటీకి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీతోపాటు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు, సాగర్ సీఈ సునీల్, అంతర్రాష్ట్ర జల వ్యవహారాల చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. తమ తాగునీటి అవసరాలకు 16 టీఎంసీలు అవసరమని ఏపీ తెలపగా... నల్లగొండ, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల తాగునీటి అవసరాలకు 40 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరింది. ఇందుకు ఏపీ అభ్యంతరం తెలిపింది. తాము కేవలం ఒక నెల అవసరాలనే ఇండెంట్‌గా సమర్పించామని, ఏడాదికి అవసరమయ్యే నీటిపై మరోమారు బోర్డు సమావే శంలో చర్చించి నిర్ణయిద్దామని సూచించింది. దీనిపై బోర్డు సానుకూలంగా స్పందించ డంతో అక్టోబర్ 15 తర్వాత బోర్డు పూర్తిస్థాయి సమావేశం నిర్వహించి వచ్చే జూన్ వరకు అవసరమయ్యే నీటి కేటాయింపులపై చర్చించాలని ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. ప్రాజెక్టుల నియంత్రణపై మాకు అధికారాల్లేవు: సమీర్ చటర్జీ ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణకు సంబంధించి తమకు అధికారాలేవీ లేవని, అందుకే తమ ఆదేశాలను ధిక్కరించి ఇరు రాష్ట్రాలు నీటిని తీసుకుంటున్నా ఏమీ చేయలేక పోతున్నామని బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ పేర్కొన్నారు. బోర్డు భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మేము కేవలం ఇరు రాష్ట్రాల నుంచి వచ్చే వినతులు, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేస్తున్నాం. వాటిని ఇరు రాష్ట్రాలు సరైన రీతిలో అమలు పరచకుంటే మేమేం చేయలేం. తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నాం. మా చేతులు కట్టేసి, అధికారాలివ్వకుండా ఇరు రాష్ట్రాలను నియంత్రించడం సాధ్యమయ్యేది కాదు’’అని అన్నారు. -
ఆనంద సాగరం
♦ మూడేళ్లుగా కోయిల్‌సాగర్‌లోకి కృష్ణా జలాలు.. ♦ పెరగనున్న ఆయకట్టు మహబూబ్‌నగర్ నుంచి గంగాపురం ప్రతాప్‌రెడ్డి : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కేవలం రూ. 85 లక్షలతోనే పూర్తయిందంటే నమ్మలేం. కానీ ఇది నిజం. నిజాం కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 1947లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించి 1955లో పూర్తి చేశారు. ప్రాజెక్టు అలుగు స్థాయి ఎత్తు 27 అడుగులు. ఎడమ కాలువల ద్వారా 12 వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టు ఆయకట్టు మరింత పెంచి 50వేల ఎకరాలకు నీరందేలా చర్యలు చేపట్టారు. అందుకు తగ్గట్టు కాల్వల లైనింగ్, కొత్త కాల్వల నిర్మాణం యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడా కూడా సిమెంట్ ఉపయోగించలేదు. కేవలం అప్పట్లో అందుబాటులో ఉన్న సున్నం, గచ్చు కలిపి రాతి కట్టడంతో ప్రాజెక్టును నిర్మించారు. దాదాపు 62 సంవత్సరాలు కావస్తున్నా ప్రాజెక్టు నేటికి చెక్కుచెదరలేదు. 1981లో క్రస్టుగేట్ల నిర్మాణం.. కోయిల్‌సాగర్ ప్రాజెక్టును ఆధునికీకరించే పనులు 1981లో చేపట్టారు. అలుగుపై క్రస్టుగేట్ల నిర్మాణంచేసి ప్రాజెక్టు కట్టను రెండు వైపులా ఆరు అడుగుల వరకు పెంచి బలోపేతం చేశారు. దీనికి రూ.92 లక్షల వ్యయం అయింది. వైఎస్సార్ వల్లే కృష్ణా జలాలు.. కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు చెప్పుకోదగిన వరద వచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రాజెక్టు బోసిపోయి ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఙంలో భాగంగా 2006లో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించడానికి ఈ పథకం కోసం రూ. 359 కోట్లతో అంచనాలు తయారు చేయించారు. అంతేకాకుండా 12 వేల ఎకరాల ఆయకట్టును 50,250 ఎకరాలకు పెంచాలని ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. ఆయన చలువ వల్లే గత మూడేళ్లుగా కోయిల్‌సాగర్‌లోకి కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి. పెరిగిన నీటి మట్టం.. ప్రాజెక్టు నిర్మాణం కన్నా క్రస్టు గేట్ల నిర్మాణానికే రూ.7 లక్షలు అధికంగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. క్రస్టుగేట్ల నిర్మాణం తర్వాత ప్రాజెక్టులో 33 అడుగుల మేర నీటి మట్టం నిల్వ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఆయకట్టు కింద 12 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి అవకాశం లభించింది. ఎత్తిపోతల ద్వారా కోయిల్‌సాగర్‌కు తరలివస్తున్న కృష్ణాజలాలు -
పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణమ్మ పరుగులు
- పోతిరెడ్డిపాడు, ఎన్సీఎల్ గేట్లు ఎత్తిన సీఈ, ఎస్ఈ - ఎన్సీఎల్ విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 1500 క్యూసెక్కులు జూపాడుబంగ్లా: శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం నిర్దేశించిన స్థాయి(859 అడుగులు)కి చేరుకోవడంతో మంగళవారం పోతిరెడ్డిపాడు ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. మంగళవారం సీఈ, ఎస్ఈ, ఈఈలు నారాయణరెడ్డి, రాఘవరెడ్డి, శ్రీనివాసరెడ్డి మంగళవారం పోతిరెడ్డిపాడు నూతన హెడ్‌రెగ్యులేటర్, నాగార్జున విద్యుదుత్పత్తికేంద్రం గేట్లను ఎత్తడంతో కృష్ణాజలాలు దిగువకు పరుగులు తీశాయి. ముందుగా పోతిరెడ్డిపాడు మూడు గేట్లను మూడు అంగుళాల మేరకు ఎత్తి నీటిని విడుదల చేశారు. అనంతరం మరో నాలుగు గేట్లను ట్రయల్‌రన్ నిర్వహించి చెక్‌చేశారు. అనంతరం పక్కన్నే ఉన్న నాగార్జున విద్యుదుత్పత్తి కేంద్రంలో ఈఈ శ్రీనివాసరెడ్డి పూజలు చేసి మూడు జనరేటర్లను ఆన్ చేశారు. కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం 1,500క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అనంతరం సీఈ నారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలో 859 అడుగుల నీటిమట్టం వద్ద 103 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి 5టీఎంసీల నీటి విడుదలకోసం కృష్ణాబోర్డుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పిన సీఈ.. ఇంకా అనుమతి లభించలేదన్నారు. అయితే రాయలసీమ ప్రాంతంలో తలెత్తిన తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. అడపా దడపా కురుస్తున్న వర్షాల వల్ల ఎస్సార్బీసీ, తెలుగుగంగ కాల్వల్లో కొద్ది మేర నీరున్న నేపథ్యంలో పోతిరెడ్డిపాడు నుంచి విడుదలచేసే నీటితో వెలుగోడు రిజర్వాయర్ నింపనున్నట్లు తెలిపారు. గత ఏడాది మొత్తంగా పోతిరెడ్డిపాడు ద్వారా 67 టీఎంసీల నీటిని డ్రా చేసుకున్నామని, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో డ్రా చేసుకునే వీలుందని సీఈ తెలిపారు. కాల్వలకు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నీటిని విడుదల చేస్తారనే విషయంపై నీటిలభ్యతను బట్టి ఐఏబీ సమావేశంలో నిర్ణయిస్తారన్నారు. కార్యక్రమంలో నంద్యాల ఈఈ పురుషోత్తంరెడ్డి, ట్రైనీ ఈఈ విశ్వనాథ్, డీఈ వెంకటరమేష్బాపూజీ, ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి, ట్రైనీ ఇంజినీర్లు, ఎన్సీఎల్ మేనేజర్ రమణ, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీశైలం జలాశయంలోకి కృష్ణమ్మ పరవళ్లు
-
ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
శ్రీశైలం జలాశయంలోకి కృష్ణమ్మ పరవళ్లు సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభమైన మూడున్నర నెలల తర్వాత కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తుంగభద్ర జలాశయం దిగువన కురిసిన వర్షాలకు తుంగభద్ర ఉప్పొంగడంతో శుక్రవారం రాత్రి సుంకేసుల బ్యారేజీ నిండింది. దీంతో శనివారం 1.20లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి వరద నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు 61,849 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర వరదకు కృష్ణా జలాలు తోడవడంతో శ్రీశైలం జలాశయంలోకి 1,88,383 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది. తొలిసారిగా భారీ వరద రావడంతో జలాశయంలో శనివారం సాయంత్రానికి నీటి నిల్వ 61.80 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయిలో నిండాలంటే మరో 154 టీఎంసీలు అవసరం. మరోవైపు నాగార్జున సాగర్‌లో 500.9 అడుగుల వద్ద ప్రస్తుతం 116.73 టీఎంసీల నీటి నిల్వ ఉండగా నాగార్జున సాగర్ నిండాలంటే 195.31 టీఎంసీలు అవసరం. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 7.22 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మరో 38.55 టీఎంసీలు వస్తే పులిచింతల ప్రాజెక్టు నిండుతుంది. వెరసి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు పూర్తిగా నిండాలంటే 387.86 టీఎంసీలు అవసరం. -
న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే
► బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం వాదనలు ప్రారంభం ► పంటల పరిస్థితికనుగుణంగా నీటి వాటాలు పెంచండి ► కృష్ణా బోర్డు పరిధిని ట్రిబ్యునల్ పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో దశా బ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సవరిం చాల్సిన బాధ్యత ట్రిబ్యునల్ మీదే ఉందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర పరీవాహకం, ఇక్కడి పంటల పరిస్థితిని దృష్టి లో పెట్టుకొని వాటాలు పెంచాలని కోరింది. కృష్ణా జలాల పంపిణీపై వాదనలు వింటున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్.. బుధవారం నుంచి తిరిగి విచారణ ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రతిపా దించిన విచారణ అంశాలపై సమర్పించిన అదనపు పత్రాలపై వాదనలు ఆరంభిం చింది. తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు ఆరంభించారు. ట్రిబ్యునల్ ఆర్డర్లో పలు అంశాలకు సంబంధించి గత జూలైలో ప్రతిపాదించిన సవరణలు పూర్తి చేయాలని కోరగా, అందుకు ట్రిబ్యునల్ అంగీకారం తెలిపింది. అలాగే కృష్ణా బోర్డు పరిధిని ట్రిబ్యునల్ పరిధిలోకి తేవాలని కోరారు. ప్రస్తుతం 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు దక్కేలా ఒప్పందం కుదరగా, దాన్ని కృష్ణా బోర్డు అమలు పరుస్తోందని, దాన్నే అమలు పరచాలని ఏపీ కోరగా తెలంగాణ అభ్యంతరం చెప్పింది. నదీ వ్యవస్థను మార్చవద్దు: ఏపీ నీటి వాటాల్లో మార్పులు చేయరాదని ట్రిబ్యు నల్‌ను ఏపీ కోరింది. ఈ మేరకు 36 పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది. ఏపీ పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతమని, 60 శాతం జనాభా దానిపై ఆధారపడి ఉందని అందులో తెలిపింది. అందుకు భిన్నంగా తెలంగాణలో ఐటీ, ఆర్థిక రంగం, ఫార్మా, తయారీ కంపెనీ లు ప్రధాన ఆదాయ, ఉపాధి వనరులుగా ఉన్నాయని పేర్కొంది. ‘పశు, కోళ్ల, మత్స్య, కోడి గుడ్ల ఉత్పత్తిలో దేశంలో 70 శాతం వాటా ఏపీ నుంచే ఉంది. వీటన్నింటికీ కృష్ణా డెల్టా వ్యవస్థే ఆధారం. ఏపీ ప్రాజెక్టులన్నీ కృష్ణా జలాలపైనే ఆధారపడి ఉన్నాయి’ అని వివరించింది. 1976లో బచావత్ అవార్డు ప్రకారం ప్రాజెక్టుల వారీగా 811 టీఎంసీలను పంచగా, ఇందులో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు దక్కాయని, మూడేళ్లుగా ఇదే విధానం కొనసాగుతోందని చెప్పింది. ఆయకట్టు, ప్రాజెక్టుల కింది నీటి వినియోగంలో ఎలాంటి మార్పులు లేవని, ఇలాంటి సమయంలో నీటి వాటాల్లో మార్పులు చేస్తే అది రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దాదాపు 150 ఏళ్లుగా ఉన్న నదీ వ్యవస్థను మార్చే పనులు చేయరాదని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు 214.14 టీఎంసీలు తరలిస్తోందని, ఇందులో హైదరాబాద్ తాగునీటికి జీ–4 బేసిన్ నుంచి మూసీ బేసిన్‌కి 6.43 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్–1, 2ల నుంచి 68.48 టీఎంసీలు, ప్రాణహిత– చేవెళ్ల ద్వారా 83.19 టీఎంసీలు, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా మరో 24.65 టీఎంసీలు కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నారని, ఇందిరమ్మ వరద కాల్వ, సీతారామ ఎత్తిపోతల, రామప్ప సరస్సు ద్వారా మరో 31.39 టీఎంసీలు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ఇందులో ఏపీ వాటా ఏమిటో తేల్చాలని కోరింది. -
క్రిష్ణా జలాల తాత్కాలిక పంపిణీపై కేంద్రం కసరత్తు
-
కృష్ణా జలాలపై విచారణ సెప్టెంబర్‌కు వాయిదా
- రెండు రాష్ట్రాల ప్రతిపాదిత అంశాలపై ముగిసిన వాదనలు - విచారణాంశాలపై ఆగస్టు 16న పత్రాలు సమర్పించాలన్న ట్రిబ్యునల్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాలపై జరుగుతున్న విచారణను జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ సెప్టెంబర్ 13, 14, 15 తేదీలకు వాయిదా వేసింది. ఆగస్టు 16లోపు ఈ కేసు విచారణకు సంబంధించి విచారణాంశాలపై అదనపు పత్రాలను ఇరు రాష్ట్రాలు సమర్పిం చాలని ఆదేశించింది. కృష్ణా జలాల పంపిణీలో ఏయే అంశాలను విచారించాలన్న దానిపై ఏపీ, తెలంగాణ సమర్పించిన ముసాయి దాలను ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంది. ఏపీ 11, తెలంగాణ 16 అంశాలను ప్రతిపా దించాయి. ఏపీ ప్రతిపాదించిన అంశాల్లో ఒకదాన్ని తిరస్కరించిన ట్రిబ్యునల్, తెలంగా ణ సూచించిన అంశాలను పలు సవరణలతో విచారణకు అమోదించింది. వీటిపై సెప్టెంబర్ 13 నుంచి వాదనలు వింటామని పేర్కొంది. ఏపీపై ఆగ్రహం.. విభజన చట్టంలోని షెడ్యూల్ 11లో పేర్కొన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరపాలని ఏపీ తరఫు న్యాయవాది ఏకే గంగూలీ కోర డంపై గురువారం విచారణ సందర్భంగా ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు నీటి కేటాయిం పులను ఎలా కోరతారని ప్రశ్నించింది. శుక్రవా రం విచారణలో కూడా ఏపీ ఈ అంశాన్ని లేవ నెత్తింది. దీనిపై తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. షెడ్యూల్ 11లో పేర్కొన్న ప్రాజెక్టులకు సెక్షన్– 89తో సంబంధం లేదని వాదించారు. కాగా విభజన చట్టం రూపకల్పనలో దురదృష్టవశా త్తు తప్పులు దొర్లాయని గంగూలీ అన్నారు. సెక్షన్–89లోనే ఈ ప్రాజెక్టుల పేర్లను కూడా పొందుపరిచి ఉండాల్సిందని అభిప్రాయప డ్డారు. ఈ ప్రాజెక్టులన్నీ మిగులు జలాల ఆధా రిత ప్రాజెక్టులని వైద్యనాథన్ పేర్కొన్నారు. మిగులు జలాలు ఉంటే అంధ్రప్రదేశ్ ప్రభు త్వం ప్రకాశం బ్యారేజీ నుంచి వినియో గించుకోవాలి.. కానీ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోవాలని ఏపీ యత్నిస్తోందని తప్పుబట్టారు. ఈ క్రమంలో ట్రిబ్యునల్ కల్పించుకొని ఇరు రాష్ట్రాలకు నీటి కేటా యింపుల సమయంలో మిగుల జలాలు ఉంటే షెడ్యూల్ 11లోని ప్రాజెక్టులకు కేటాయింపు లపై అప్పుడు ఆలోచిద్దామని అభిప్రా యపడింది. ఇక కృష్ణా నదీ జలాల యాజ మాన్య బోర్డు 2015లో నీటి నిర్వహణకు సంబంధించి రెండు రాష్ట్రాలకు చేసిన తాత్కాలిక కేటాయింపులను చట్టబద్ధం చేయాలన్న ఏపీ వాదనను ట్రిబ్యునల్ తిరస్కరించింది. అనంతరం ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన విచారణాంశాలపై ఆగస్టు 16వ తేదీలోపు అదనపు పత్రాలను సమర్పిం చాలని ఇరు రాష్ట్రాలను ట్రిబ్యునల్ ఆదేశించింది. -
రీ డిజైనింగ్‌తోనే ప్రాజెక్టులు ఆలస్యం
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం కల్వకుర్తి: ప్రభుత్వాలు ప్రాజెక్టులను అనేకసార్లు రీ డిజైనింగ్ చేయడంతోనే పనులు ఆలస్యం అవుతున్నాయని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జేఏసీ, అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఆర్టీవో కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం చేసేముందు ముంపునకు గురికాకుండా డిజైనింగ్ చేయాలన్నారు. గతంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన అనంతరం కొత్త ప్రాజెక్టులను నిర్మించాలని కోరారు. కృష్ణా జలాలు మహబూబ్‌నగర్, నల్లగొండ ప్రాంతాలకు చెందాలన్నారు. పాలమూరుకు పూర్తి స్థాయిలో నీరు అందించిన తరువాతే ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని నాలుగో లిప్టును పూర్తి చేసి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందించవచ్చని కోదండరాం పేర్కొన్నారు. నాల్గవ లిప్టు పూర్తి చేస్తే అసలు పాలమూరు ప్రాజెక్టు అవసరం లేదన్నారు. -
ఏపీకి కోత పెట్టండి
కృష్ణా బేసిన్‌కు అవతలే అధికంగా నీటిని వినియోగిస్తోంది ► రాష్ట్రానికి మరిన్ని జలాలు ఇవ్వాలని బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు రాష్ట్రం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన నికర జలాల కేటాయింపుల్లో కోత పెట్టి.. వాటిని తెలంగాణకు కేటాయించా లని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రస్తు తం ఏపీ తనకున్న 512 టీఎంసీల వాటాలో 351 టీఎంసీల మేర కృష్ణా బేసిన్ అవతలే వాడుకుంటోందని స్పష్టం చేసింది. బేసిన్ పరిధిలో ఆ రాష్ట్ర వాస్తవ అవసరాలు 150 నుంచి 200 టీఎంసీలకు మించి ఉండవని తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీల వాటాయే ఉందని... కానీ రాష్ట్ర పరిధిలో కృష్ణా పరీవాహకం, సాగు యోగ్య భూమి, జనాభా తదితరాలను దృష్టిలో పెట్టు కుంటే లభ్యతగా ఉన్న 811 టీఎంసీల నికర జలాల్లో 574.6 టీఎంసీలు రాష్ట్రానికే దక్కాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేటాయింపులు పెంచాలని మంగళవారం బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం కౌంటర్ దాఖలు చేసింది. ఏపీ ఇదివరకే సమర్పించిన అఫిడవిట్‌ను తప్పు పడుతూ కౌంటర్లో స్పష్టత నిచ్చింది. ‘కృష్ణా’ ప్రాజెక్టులకే ప్రాధాన్యమివ్వాలి ఏపీ తమకు ఇప్పటికే ఉన్న 512 టీఎంసీల తోపాటు హంద్రీనీవా, గాలేరు–నగరి, తెలుగు గంగ, వెలిగొండ, ఇతర కొత్త ప్రాజెక్టులకు కలిపి సాగునీటి అవసరాలకు 917.9 టీఎం సీలు.. రాజధాని అమరావతితో పాటు తాగు నీటి అవసరాలకు 110.13 టీఎంసీలు (మొత్తంగా 1059.03 టీఎంసీలు) కేటాయిం చాలని బ్రిజేశ్ ట్రిబ్యునల్‌ను కోరింది. దీనిని తెలంగాణ తమ కౌంటర్లో తప్పుపట్టింది. నీటి కేటాయింపులో కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని.. బేసిన్‌లోని ప్రాజెక్టులకు 75 శాతం నీటి లభ్యత పూర్తయిన తర్వాతే పక్క బేసిన్‌లోని ప్రాజె క్టులను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. 75 శాతానికి మించి వచ్చే నీటిలోనూ తొలి ప్రాధాన్యం బేసిన్‌లోని ప్రాజెక్టులకే ఇవ్వా లని కోరింది. సరాసరి నీటి లభ్యతకు మించి వచ్చే నీటిని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కింద అవసరాలకు వినియో గించుకొనే స్వేచ్ఛను తెలంగాణకు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇక తాగునీటి అవసరాలకు ఏపీ కోరుతున్న 110 టీఎంసీలు.. ఢిల్లీ అవ సరాలను మించి ఉన్నాయని స్పష్టం చేసింది. 1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని తెలంగాణ కౌంటర్లో వివరించింది. ఈ లెక్కన 80 టీఎంసీల కేటాయింపుల్లో తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలని, ఆ నీటిని ఏఎమ్మార్పీ ఎస్ఎల్బీసీ కింద వాడుకునే అవకాశం ఇవ్వా లని కోరింది. ఇక ఏపీ పట్టిసీమ ద్వారా మరో 80 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలి స్తోం దని.. ఈ మేర కృష్ణా డెల్టాలో ఏపీకి కోతలు పెట్టాలని విన్నవించింది. రాష్ట్ర అఫిడవిట్, కౌంటర్లపై ఈ నెల 4, 5 తేదీల్లో బ్రిజేశ్ ట్రిబ్యునల్ తిరిగి విచారణ చేయనుంది. -
ఇంటింటికీ నీరు.. ఇంటర్నెట్
‘భగీరథ’ పనుల సమీక్షలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా జలాలు ఈ ఏడాది చివరి నాటికి గ్రామాలకు చేరుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పైపు లైన్లతోపాటు ఫైబర్ కేబుల్ పనులూ పూర్తి చేయాలని.. ఇంటింటికి మంచినీళ్లతో పాటు ఇంటర్నెట్ సౌకర్యమూ కల్పించి రాష్ట్రాన్ని అమెరికా సరసన నిలబెట్టాలన్నారు. మిషన్ భగీరథ పనులపై ప్రగతి భవన్లో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి ప్రతిరోజూ భగీరథ పనులను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. భగీరథ పనుల్లో వేగం పెరగాలని.. వర్కింగ్ ఏజన్సీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లు సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం త్వరగా పూర్తవ్వాలన్నారు. పనుల్లో జాప్యం చేసే వర్కింగ్ ఏజన్సీలు పద్ధతి మార్చుకోవాలని, ఒప్పందం ప్రకారం వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలం వచ్చే లోగా పంట పొలాల్లో జరగాల్సిన పనులన్నీ పూర్తి చేయాలని, నిర్మాణం పూర్తయిన ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఒక్కొక్కటిగా వాడుకలోకి తేవాలని సూచించారు. భగీరథ ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావును సీఎం కోరారు. భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సలహాదారు జ్ఞానేశ్వర్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, రామకృష్ణ రావు, జయేశ్‌రంజన్ పాల్గొన్నారు. -
కృష్ణా, గోదావరి బోర్డులకు కొత్త చైర్మన్లు
- కృష్ణాకు ఎస్కే శ్రీవాత్సవ, గోదావరికి హెచ్‌కే సాహు - పూర్తి స్థాయి చైర్మన్లను నియమించిన కేంద్ర జల సంఘం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదాలు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర జలసంఘం ఆ రెండు నదీ బోర్డులకు కొత్తగా పూర్తి స్థాయి చైర్మన్లను నియమించింది. కృష్ణాబోర్డుకు ఎస్కే శ్రీవాత్సవను, గోదావరి బోర్డుకు హెచ్‌కే సాహును చైర్మన్లుగా నియమించింది. ఈ మేరకు గురువారం కేంద్ర జల సంఘం చైర్మన్ నరేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్కే శ్రీవాత్సవ ప్రస్తుతం పుణేలో నేషనల్ వాటర్ అకాడమీ చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉండగా.. తీస్తా బేసిన్ ఆర్గనైజేషన్(టీబీఓ) పశ్చిమబెంగాల్ శాఖలో హెచ్‌కే సాహు చీఫ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. వీరిద్దరు వచ్చే సోమవారం బాధ్యతలు స్వీకరిస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. -
మరో బెంచ్‌కు కృష్ణా జలాల కేసు
► ధర్మాసనంలోని ఇద్దరు సభ్యులు మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందినవారన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ► వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించిన జస్టిస్ దీపక్ మిశ్రా సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాలను మళ్లీ నాలుగు రాష్ట్రాల మధ్య కేటాయించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేయాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్.. త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ మోహన్ ఎం.శంతనగౌడర్ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన వారన్న అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఇలాంటి ప్రస్తావన తేవడాన్ని జస్టిస్ దీపక్ మిశ్రా ఆక్షేపిస్తూ.. మిగిలిన కేసుల విచారణ అనంతరం ఈ కేసును విచారిస్తామని, విచారణ నుంచి తప్పుకోబోమని స్పష్టంచేశారు. అయితే మిగిలిన కేసుల విచారణ అనంతరం ఈ పిటిషన్ విచారణకు రాగా.. పిటిషనర్ ప్రస్తావనను మన్నించారు. ఆ ఇద్దరు సభ్యులు లేని మరో ధర్మాసనానికి పిటిషన్‌ను బదిలీ చేయాలని జస్టిస్ దీపక్ మిశ్రా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కార్యాలయాన్ని ఆదేశించారు. -
120 ఏళ్లలో అమరావతికి వరద ముప్పు లేదు
ఎన్జీటీలో రాష్ట్ర ప్రభుత్వ వాదన సాక్షి, న్యూఢిల్లీ: గడిచిన 120 ఏళ్ల చరిత్రలో అమరావతి ప్రాంతం కృష్ణా జలాలతో ముంపునకు గురైన దాఖలా లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వరద ముప్పు ఉందని దాఖలైన పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్ సోమవారం చేపట్టింది. ప్రతివాది అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఎ.కె.గంగూలీ తన వాదనలు వినిపిస్తూ... .కృష్ణా నదీ జలాలతో అమరావతికి వరద ముప్పు ఉండదని పేర్కొన్నారు. తదుపరి వాదనలను మంగళవారం వింటామని చెబుతూ ధర్మాసనం విచారణను వాయిదావేసింది. -
ఆర్డినెన్స్ ద్వారానైనా కరువు సీమకు నీళ్లివ్వండి
-
ఆర్డినెన్స్ ద్వారానైనా నీళ్లివ్వండి: అవినాష్ రెడ్డి
న్యూఢిల్లీ: రాయలసీమలో నీటి ఎద్దడి ప్రమాదకర పరిస్థితులను తలపిస్తోందని, ఆర్డినెన్స్ ద్వారానైనా ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు అందేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కోరింది. ఆ పార్టీ ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో సంబంధిత అంశాన్ని లేవనెత్తారు. ‘కృష్ణా జలాల పంపిణీ విషయంలో ట్రిబ్యునళ్లు నదీ పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల మధ్య అప్పటివరకు ఉన్న ప్రాజెక్టులకు నికరజలాలను పంపిణీ చేయడంలోనే దృష్టి పెట్టాయి. అమలులో ఉన్న ప్రాజెక్టుల విషయంలో దృష్టిపెట్టలేదు. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతితక్కువ వర్షపాతం ఉంటుంది. ఇది పూర్తిగా కరువు ప్రాంతం. ఇక్కడ తాగునీరు దొరకడమే అతిపెద్ద సవాలు. ఈ విషయాన్ని పట్టించుకోనందుకు ట్రిబ్యునళ్లను తప్పుపట్టలేం. ఎందుకంటే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం రాష్ట్రాలు, ప్రాజెక్టుల మధ్య నీటి పంపకాలను మాత్రమే నిర్ధేశించింది. కానీ కరువు బారిన పడుతున్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వేలాది గ్రామాలు, పట్టణాలకు కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఇక్కడి రైతుల పరిస్థితి దయనీయం. ఇక్కడి సాగు పూర్తిగా వర్షాధారితం. వర్షపాతం అతి తక్కువ. అందువల్ల చాలా ఏళ్లుగా ఇక్కడి రైతులు జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, వెలిగొండ తదితర ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించాలని, తాగునీరు అందించాలని, రైతుల జీవనోపాధికి వీలుగా సాగునీరు అందించాలని కోరుతున్నారు. అందువల్ల కేంద్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ప్రత్యేక సూచన చేయాలని కోరుతున్నా. ఒకవేళ అది చట్టబద్ధం కానిపక్షంలో కేంద్రం ఒక ఆర్డినెన్స్ జారీచేసి కరువు ప్రాంతాలకు నీళ్లు కేటాయించి ప్రజల ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కును కాపాడాలి..’ అని కోరారు. దీనికి కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ బలియాన్ సమాధానం ఇస్తూ ‘ఏ జిల్లాకు ఎంత నీరివ్వాలన్నది ఆయా రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది..’ అని పేర్కొన్నారు. -
కృష్ణా జలాలు ఎక్కడ..!
► ఎండిన చీనీ చెట్లు ఇవిగో.. ► బతికించుకునేందుకు రూ.లక్షలు వెచ్చిస్తున్న రైతులు ► అరటి పంటను కాపాడుకోలేక చేతులెత్తేసిన వైనం ► అధికారపార్టీ నాయకులవి ఆర్భాటపు మాటలే.. కృష్ణాజలాలను పులివెందుల ప్రాంతానికి తరలించి..పంటలను కాపాడామని టీడీపీ నాయకులు రాష్ట్రమంతా గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంలో.. లింగాల మండలంలో ఎండుతున్నపంటలు వారికి కనిపించడం లేదు. ఈ మండలమే కాకుండా పులివెందుల, వేముల, వేంపల్లె మండలాలతో పాటు తొండూరు మండలంలోని చాలా గ్రామాలకు ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. అరకొర నీటిని అందించి పంటలను కాపాడామంటూ అధికార పార్టీ నాయకుల ఆర్భాటపు ప్రకటనలపై రైతులు మండిపడుతున్నారు. పులివెందుల/లింగాల : పులివెందులకు నీరు ఇచ్చిన ఘనత తమదేనంటూ ప్రతి వేదికపై ఊదరగొట్టేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. అయితే అవన్నీ ఉత్తుత్తి మాటలే అనడానికి ఇక్కడ ఎండిపోతున్న చీనీ చెట్లే నిదర్శనం. వీటిని కాపాడుకోవడానికి రైతులు నానాతంటాలు పడుతున్నారు రోజుకు రూ.4వేలు వెచ్చించి ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీటి తడులు అందిస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పైడిపాలెం ప్రాజెక్టు వద్ద బహిరంగసభ ఏర్పాటు చేసి పులివెందుల ప్రాంతంలో ఒక్క చీనీచెట్టును ఎండనీయమని శపథం చేశారు. ప్రస్తుతం ఆ శపథాలు గాలికి వదిలేశారు. జనవరిలో లింగాల కుడికాలువకు నీరు విడుదల చేస్తామని గేట్లు ఎత్తిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి లింగాల వరకు కూడా నీటిని తీసుకురాలేదు. వేముల చెరువు వరకు నీటిని తీసుకెళతామని ప్రకటనలు చేశారు. కానీ గండికోట రిజర్వాయర్ నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు కృష్ణజలాలు లిఫ్ట్‌చేసి అక్కడ నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు ఇవ్వాలి. గండికోటలో కనీసం 4.5 టీఎంసీల నీరు ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఇటీవల గండికోట నుంచి పైడిపాలెంకు 0.8 టీఎంసీల నీటిని తరలించి పక్కనే ఉన్న సింహాద్రిపురం మండలంలోని రెండు, మూడు చెరువులకు నీటిని నింపారు. కేవలం 0.8 టీఎంసీల నీరు మాత్రమే పైడిపాలెంకు చేరుకోవడంతో కొత్త ప్రాజెక్టు కాబట్టి లాస్ కిందనే సగం నీరు పోతోంది. చెరువులకు కూడా పూర్తిస్థాయిలో నీరు నింపలేదు. తాగునీటి అవసరాలు కూడా తీర్చలేక..: పులివెందులకు తాగునీటి అవసరాలను తీర్చే ఎస్ఎస్ ట్యాంకుకు అరకొర నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. కృష్ణజలాలను పులివెందులలో పారించామన్న టీడీపీ నాయకులకు వాస్తవాలు కనిపించడం లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి పీబీసీకి కేటాయించిన నీటిని కూడా సక్రమంగా విడుదల చేయించుకోలేని అసమర్థ స్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని నియోజకవర్గ ప్రజాలు మండిపడుతున్నారు. మోటార్లను బిగించలేకపోయారు: దివంగత మహానేత వైఎస్ఆర్ ఏర్పాటుచేసిన జలయజ్ఞం ఎత్తిపోతల పథకం మోటార్లను అమర్చడానికి కూడా అధికారులకు సాధ్యం కాలేదు. అప్పటి మోటార్లనే ఇప్పుడు రన్నింగ్‌లోకి తెచ్చేందుకు నెలల సమయం తీసుకుంటున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా కొందరు రైతులు ఎండిన చీనీచెట్లను నరికివేస్తే... మరికొందరు లింగాల కాలువకు నీరు వస్తాయని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం టీడీపీ నేత సతీష్‌రెడ్డి గడ్డం తీసేందుకు మాత్రమే కొద్దిపాటి నీరు ఇచ్చి ఆ తర్వాత ఆపేశారని రైతులు పేర్కొంటున్నారు. నెలకు రూ.80వేలు ఖర్చుచేస్తున్నాం: చీనీ చెట్లు కా పాడుకొనేందుకు రోజుకు ట్రాక్టర్ ఒక ట్రిప్ నకు రూ.500 ఖర్చవుతోంది. అలా రోజుకు 8 ట్రిప్పులు తోలాలి. ఒకసారి నీటి తడి అందించాలంటే 20 రోజులు పడుతుంది. ఈవిధంగా రోజుకు రూ.4వేల చొప్పున.. 20రోజులకు రూ.80వేలు ఖర్చవుతోంది. చంద్రబాబు నీరు ఇచ్చామని చెప్పి గొప్పలు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చి మా పరిస్థితి చూస్తే వారికే అర్థమవుతుంది. --తిరుపాల్‌రెడ్డి, చీనీ రైతు, లింగాల రైతులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి: ఎండిన చీనీ చెట్లను కాపాడుకోలేక పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో చీనీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ప్రాంత రైతులకు నీరు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం నీరు కాదు.. కన్నీరు మిగిల్చింది. కేవలం సింహాద్రిపురం మండలంలో కొద్దిపాటి నీరు మాత్రమే ఇచ్చి.. పులివెందుల ప్రాంతమంతా ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గు చేటు. --- నాగభూషణరెడ్డి, మాజీ సర్పంచ్, లోపట్నూతల -
కృష్ణా జలాలపై విచారణ వాయిదా
-
కృష్ణా జలాలపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించిన విచారణను ట్రిబ్యునల్ మే 4, 5 తేదీలకు వాయిదా వేసింది. తమ స్టేట్మెంట్లు దాఖలు చేసేందుకు మరింత గడువు కావాలని గురువారం విచారణ సందర్భంగా అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యర్థించాయి. దీనిపై స్పందించిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ అఫిడవిట్లు దాఖలు చేయడానికి గడువు ఎందుకని ప్రశ్నించింది. నదీ జలాలకు సంబంధించిన సాంకేతిక పరమైన గణాంకాల వివరాలను నిపుణుల నుంచి ఇంకా పొందాల్సి ఉందని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫు సీనియర్ న్యాయవాదులు ఏకే గంగూలీ, వైద్యనాథన్ నివేదించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తరఫు జూనియర్ న్యాయవాది కల్పించుకొని.. నిర్ణీత కాల వ్యవధిలో కృష్ణా జలాలకు సంబంధించిన సమస్యకు ముగింపు పలకాల్సి ఉందని, ఇప్పటికే చాలా సమయం ఇచ్చినందున అఫిడవిట్లు దాఖలు చేయడానికి మరింత సమయం ఇవ్వకుండా ఈ అంశాన్ని త్వరగా తేల్చాలని ట్రిబ్యునల్‌ను కోరారు. ఇందుకు సంబంధించి జల వనరుల శాఖ సెక్షన్ అధికారి తమ సీనియర్ న్యాయవాదికి రాసిన నోట్‌ను ఆయన ట్రిబ్యునల్‌కు సమర్పించారు. దీనిపై ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాలు తమ స్టేట్మెంట్లను దాఖలు చేయడానికి ఏప్రిల్ 12 వరకు గడువు ఇచ్చింది. ఏప్రిల్ 27లోపు కౌంటర్ దాఖలు చేయాలని, మే 2లోపు రీజాయిండర్లు అందజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా, నదీ జలాల పంపకాల విషయంలో ఏపీ, తెలంగాణ ఇచ్చే స్టేట్మెంట్లను తమకు ఇవ్వాలన్న కర్ణాటక ప్రభుత్వ తరఫు న్యాయవాది వినతిని ట్రిబ్యునల్ తిరస్కరించింది. స్టేట్మెంట్లు కావాలంటే ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. -
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ రద్దు!
► కేంద్రం తెచ్చిన కొత్త బిల్లు నేపథ్యంలో అవకాశం ► 70 ఏళ్ల వయసు నిబంధనతో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్‌కు తప్పని ఉద్వాసన ► అదే జరిగితే కొత్త ట్రిబ్యునల్ ముందుకు కృష్ణా జలాల వివాదం సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు కేంద్రం ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు–2017 పార్లమెంటు ఆమోదం లభిస్తే కృష్ణా జల వివాదాలను విచారిస్తున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య పదేళ్లుగా కొనసాగుతున్న కృష్ణా వివాదాలపై విచారణ కేంద్రం తెచ్చే కొత్త ట్రిబ్యునల్‌కు బదిలీ అవుతుంది. ఏళ్ల తరబడి విచారణ జరుగుతున్నా... దేశంలో ప్రస్తుతమున్న కృష్టా సహా ఎనిమిది ట్రిబ్యునళ్లు అంతర్రాష్ట్ర జల జగడాలపై ఏళ్ల తరబడి విచారణ జరుపుతున్నా వివాదాలకు పరిష్కారం దొరకట్లేదు. ఈ దృష్ట్యా ప్రస్తుత ట్రిబ్యునళ్లను రద్దు చేసి ఒకే శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే సవరణ బిల్లును కేంద్రం ఈ నెల 14న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రతిపాదిత శాశ్వత ట్రిబ్యునల్ మూడేళ్లలో తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. అయితే ‘ప్రతిపాదిత చట్టం అమల్లోకి రాగానే పాత ట్రిబ్యునళ్లన్నీ రద్దవుతాయి. వాటి పరిధిలోని వివాదాలన్నీ కొత్త ట్రిబ్యునల్‌కు బదిలీ అవుతాయి’ అని బిల్లులో స్పష్టంగా ఉంది. దీనికి ఎలాంటి సవరణలు లేనట్లయితే ప్రస్తుతమున్న కృష్ణా సహా కావేరీ, వంశధార, మహదాయి, రావి వంటి ట్రిబ్యునళ్లు రద్దవుతాయి. అలాగే ప్రస్తుత ట్రిబ్యునళ్ల చైర్మన్లు, సభ్యుల వయసు కొత్త చట్టం వచ్చే నాటికి 70 ఏళ్లు నిండితే వారి పదవీకాలం సైతం మూడు నెలల్లో ముగుస్తుందని బిల్లులో కేంద్రం పేర్కొంది. ఈ నిబంధన కూడా 70 ఏళ్లు పైబడిన జస్టిస్ బ్రిజేశ్‌కుమార్‌కు ఉద్వాసన పలికేలా ఉంది. అయితే ‘ఇప్పటికే అమల్లో ఉన్న ట్రిబ్యునళ్లు నీటి వివాదాలపై విచారణ పూర్తి చేసి కేటాయింపులు జరిపినట్లయితే కొత్త ట్రిబ్యునల్ ఆ వివాదాలను పునర్విచారించదు’ అని బిల్లులో కేంద్రం పొందుపరిచిన మరో నిబంధన గందరగోళానికి తావిచ్చేలా ఉంది. కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులను పూర్తి చేసినా తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించడం, ట్రిబ్యునల్ కేటాయింపులపై రాష్ట్రం అప్పీల్ చేయడంతో ఆ కేటాయింపులు అవార్డు కాలేదు. ఈ దృష్ట్యా ఇక్కడ విచారణ పూర్తయినట్లా లేదా కొనసాగుతున్నట్లా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో తమకు న్యాయం జరిగే అవకాశం లేకపోవడంతో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటును గట్టిగా సమర్థించిన తెలంగాణకు ఇది పెద్ద ఉపశమనమేనని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. -
టెలీమెట్రీపై కొత్త సందేహాలు!
పూర్తి స్థాయి నీటి విడుదల సామర్థ్యాన్ని గుర్తించలేని వ్యవస్థ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగ, విడుదల లెక్కలు పక్కాగా ఉండేలా ప్రధాన ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేస్తున్న టెలీమెట్రీ పరికరాల పనితీరుపై సందేహాలు రేకెత్తుతున్నాయి. ప్రాజెక్టు నుంచి కాల్వలకు నీటి తరలించే సమయంలో సరైన విడుదల (డిశ్చార్జి) లెక్కలను అవి నమోదు చేయడం లేదని వాదనలు వినవస్తున్నా యి. ఇందుకు బలం చేకూరుస్తూ పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలీమెట్రీ పరికరాలు పూర్తి స్థాయి డిశ్చార్జిలను చూపడం లేదంటూ లేఖ రాయడం చర్చనీయాం శంగా మారింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 47 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, అందులో తొలి విడతగా రూ.4 కోట్ల వ్యయంతో జూరాల, శ్రీశైలం, సాగర్‌లలో 18 చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఇందులో పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలీమెట్రీ వ్యవస్థ ప్రవాహాలను సరిగా నమోదు చేయడం లేదని కృష్ణాబోర్డు గుర్తించింది. దాంతో అక్కడ ప్రవాహాలను లెక్కించాలంటే ఆటోమెటిక్ సెన్సర్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఏపీలకు రాష్ట్రాలకు సూచించింది. అప్పుడే సరైన నీటి విడుదల లెక్కలు వస్తాయని పేర్కొంది. -
కొనసాగుతున్న సాగర్ నీటి విడుదల
డ్రోన్ కెమెరాలతో పహారా నాగార్జునసాగర్: సాగర్ నుంచి కుడి కాల్వకు కృష్ణా నీటి విడుదల బుధవారం కూడా కొనసాగింది. ఆవిరి నష్టాన్ని ఇరు రాష్ట్రాలు భరిం చాలని.. ఈ స్పెల్‌లో జరిగిన నష్టాన్ని మాత్ర మే లెక్కలోకి తీసుకుని 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదే శించడంతో ఆ మేరకు విడుదల చేస్తున్నారు. కాగా, నీటి విడుదల అంశంలో ఆంధ్రా, తెలంగాణ అధికారుల మధ్య మంగళవారం చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నిఘా విభాగాలు డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నాయి. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 511.80 అడుగులు కాగా.. కుడి కాల్వకు 6,536, ఎడమ కాల్వకు 3,758, కృష్ణా డెల్టాకు విద్యుదుత్పా దన కేంద్రం ద్వారా 3,206, ఏఎమ్మార్పీకి 1,453 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి దిగువకు మొత్తం 14,953 క్యూసెక్కుల నీరు విడుదల వుతుండగా.. శ్రీశైలం నుంచి కేవలం 973 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో సాగర్ జలాశయం కనీస నీటిమట్టం 510 అడు గుల కన్నా దిగువకు వెళ్లే ప్రమాదమంది. -
మీరు తేల్చండి.. మేం ఖరారు చేస్తాం!
⇒ పోలవరం, పట్టిసీమల్లో నీటి వాటాపై బజాజ్ కమిటీకి కేంద్రం స్పష్టత? ⇒ తెలంగాణ ఒత్తిడి మేరకు నిర్ణయం ⇒ మరోమారు రాష్ట్రంలో పర్యటించనున్న కమిటీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివాద పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ కమిటీ పరిధిపై స్పష్టత నిస్తూ కేంద్ర జల వనరుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం, పట్టిసీమల ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు తరలించే నీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలను తేల్చాలని కమిటీకి సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే కమిటీ తాత్కాలిక కేటాయింపులపై ప్రతిపాదన మాత్రమే చేయాలని.. వాటిని తామే ఖరారు చేస్తామని కేంద్ర జల వనరుల శాఖ పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ మేరకు.. పోలవరం, పట్టిసీమల ద్వారా కృష్ణాకు తరలిస్తున్న నీటివాటాలు తాము తేల్చలేమని, తమ పని కేవలం విధావిధానాలకే పరిమితమని ఇటీవలి రాష్ట్ర పర్యటన సందర్భంగా ఏకే బజాజ్ కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై అప్పుడే తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటాల అంశం తేల్చి, కేటాయింపులు చేసేందుకు బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు చాలా సమయం పట్టే అవకాశ మున్నందున... ఆలోగా తాత్కాలిక కేటాయింపులు చేయాల్సిన బాధ్యత కమిటీపై ఉందని స్పష్టం చేసింది. పట్టిసీమ, పోలవరం ల ద్వారా ఎగువ రాష్ట్రాలకు 98 టీఎంసీలు దక్కాల్సి ఉందని.. అందులో తెలంగాణకు పోలవరం ద్వారా 43 టీఎంసీ లు, పట్టిసీమ ద్వారా 35 టీఎంసీలు కలిపి 78 టీఎంసీలు రావాలని.. మరి కమిటీ ఏ మేరకు నీటి వాటా ఇస్తుందో నిర్దిష్టంగా చెప్పాలని డిమాండ్ చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసా గర్‌రావు కేంద్ర జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్సింగ్ను కలసి వివరించారు. ఈ అంశంలో వాటాలు తేల్చి, తాత్కాలిక కేటాయింపులు చేసేలా కమిటీకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే కమిటీ చైర్మన్ ఏకే బజాజ్, సభ్య కార్యదర్శి ఎన్ఎన్ రాయ్‌లను అమర్ జీత్‌సింగ్ పిలిపించుకుని మాట్లాడినట్లు తెలిసింది. బచావత్ అవార్డు మేరకు రెండు ప్రాజెక్టుల నిర్మాణంతో తెలుగు రాష్ట్రాలకు దక్కే వాటాలను తేల్చాలని.. దాన్ని ఖరారు చేసే బాధ్యత తాము తీసుకుంటామని ఆదేశిం చినట్లు తెలిసింది. దీంతో ఏకే బజాజ్ కమిటీ మరో పది రోజుల్లోనే రాష్ట్ర పర్యటన చేయాల ని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ పర్యటనలో వాటాల అంశంపై మరింత లోతుగా అధ్యయ నం చేయాలని, ప్రాజెక్టుల పర్యటన చేపట్టాల ని భావిస్తున్నట్లు సమాచారం. -
జల జగడం
- కృష్ణా జలాలను తరలించేందుకు వైఎస్సాఆర్ కడప జిల్లా రైతుల యత్నం - అడ్డుకున్న యల్లనూరు రైతులు యల్లనూరు : నీటి కోసం అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల రైతుల మధ్య వివాదం రాజుకుంది. గండికోట ఎత్తి పోతల పథకం నుంచి యల్లనూరు, గడ్డంవారిపల్లి చెరువుల ద్వారా గోడ్డుమర్రి ఆనకట్ట మీదుగా కృష్ణా జలాలను పార్నపల్లి రిజర్వాయర్‌కు పంపింగ్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలను యల్లనూరు, గడ్డంవారిపల్లి చెరువులకు పంపింగ్ చేస్తున్నారు. అయితే గోడ్డుమర్రి ఆనకట్ట పనులతో పాటు పంప్ హౌస్ పనులు అసంపూర్తిగా ఉండటంతో నీటిని గడ్డంవారిపల్లి చెరువు నుంచి చిత్రావతి నదికి మళ్లించారు. అయితే వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలంలోని రామిరెడ్డిపల్లి, బురుజుపల్లి, ఏటూరు గ్రామల రైతులు తమ గ్రామాలకు సమీపంలో ఉన్న చిత్రావతి నదిలోకి నీటిని మళ్లించుకునేందుకు సోమవారం రాత్రి ప్రయత్నించారు. యల్లనూరు చెరువు తూముకు అడ్డుగా ఇసుక మూటలను వేయడంపై వివాదం చెలరేగింది. నీటిని మళ్లించడం కోసం ప్రయత్నించారని తెలుసుకున్న యల్లనూరు రైతులు మంగళవారం ఉదయం ఇసుక మూటలను తొలగించారు. అధికారులు తమకు హామీ ఇచ్చారంటూ రామిరెడ్డిపల్లి, బురుజుపల్లి, ఏటూరు గ్రామాల రైతులు పోలీసుల సహకారంతో మరోమారు యల్లనూరు చెరువు వద్ద నీటిని వెళ్ళకుండా అడ్డుకట్ట వేయాలని మంగళవారం ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న యల్లనూరు మండల ప్రజలు చెరువు వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో తాడిపత్రి రూరల్ సీఐ సురేంద్రనా«ధ్‌రెడ్డి, డీఈ ఆనందరావు అక్కడి చెరుకోని యల్లనూరు మండల రైతులతో చర్చించారు. ఈ సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. -
20 ఏళ్లలో ఏడోసారి
- శివరాత్రి పూజకు సంగమేశ్వరుడు సిద్ధం ఆత్మకూరు: మరోసారి శ్రీ సంగమేశ్వర క్షేత్రం కృష్ణా జలాల దిగ్బంధం నుంచి బయటపడుతోంది. గత ఏడాది ఆగస్టు నెలలో కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి వరద నీరు వచ్చి చేరడంతో సంగమేశ్వర క్షేత్రం నీట మునిగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 839 అడుగులకు నీటి మట్టం చేరడంతో సంగమేశ్వర దేవాలయంలో బయటపడింది. ఏడాది మహాశివరాత్రి వేళ పూజలు నిర్వహించే అవకాశం ఏర్పడింది. మరో ఐదు అడుగుల నీరు తగ్గితే గర్భాలయంలో శివ లింగం కూడా బయటపడనుంది. భక్తులు నేరుగా ఆలయానికి చేరుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటి నుంచి సంగమేశ్వరం క్షేత్రం బ్యాక్‌వాటర్‌లో నీట మునుగుతోంది. దాదాపు 20 ఏళ్లలో ఇప్పటి వరకు శివరాత్రి సమయానికి ఆరు సార్లు బయటపడగా.. ఏడో సారి కూడా సంగమేశ్వరుడు పూజలకు సిద్ధమవుతున్నాడు. 2003 నుంచి ఈ క్షేత్రం మహాశివరాత్రి పర్వదినం నాటికి పూర్తిగా బయటపడడం ప్రారంభమైంది. 2004, 2005 వరుసగా శివరాత్రి వేడుకలు నిర్వహించారు. 2006 నుంచి 2010 వరకు ఽవర్షాలు సంవృద్ధిగా కురవడంతో ఐదేళ్లు పూర్తి స్థాయిలో బయటపడ లేదు. 2011లో నాలుగో సారి ఈ క్షేత్రం జలదిగ్బంధం వీడింది. 2012 నుంచి వరుసగా మరో మూడేళ్లు శ్రీశైలం జలాశయాలు తగ్గక పోవడంతో శివరాత్రి వేడుకలు జరగలేదు. అనంతరం 2015, 2016లో వరుసగా సంగమేశ్వరుడు దర్శనమచ్చారు. ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు క్షేత్రం గోపురం కూడా కనిపించలేదు. స్వామి శివరాత్రి పూజలు నిర్వహించడం సాధ్యం కాదని భక్తులు అనుకున్నారు. అయితే 20 రోజుల్లో డ్యామ్‌లో నీటిని దిగువకు విడుదల చేయడంతో అనతి కాలంలోనే క్షేత్రం జలదిగ్బంధం నుంచి బయటపడింది. శ్రీ సంగమేశ్వర కల్యాణానికి ఏర్పాట్లు: ఎట్టకేలకు కృష్ణా జలాల దిగ్బంధం నుంచి బయటపడిన సంగమేశ్వరుడు కల్యాణ మహోత్సవానికి సిద్ధమవుతున్నాడు. 24న శివరాత్రి సందర్భంగా శుక్రవారం స్వామివారికి రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, విశేషపూజలు, అర్ధరాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. 25న స్వామివార్ల కల్యాణానికి తగిన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామశర్మ పేర్కొన్నారు. -
‘కృష్ణా’లో అన్యాయాన్ని సరిదిద్దండి
-
‘కృష్ణా’లో అన్యాయాన్ని సరిదిద్దండి
ఏకే బజాజ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి జలాల కేటాయింపు, వినియోగంలో తెలంగాణకు దశాబ్దాలుగా అన్యాయం పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల కింద 78 టీఎంసీలు రావాలి పులిచింతల, సుంకేశులను ఉమ్మడి జాబితాలో చేర్చాలి కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ట్రిబ్యునల్ కేటాయింపులను మార్చలేం: ఏకే బజాజ్ హైదరాబాద్ కృష్ణా జలాల కేటాయింపులు, వినియోగంలో తెలంగాణకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దానిని సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైందని ఏకే బజాజ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తమకు నీటి కేటాయింపులు, పంపిణీ విషయంలో వివక్షే ఎదురవుతోందని పేర్కొంది. గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 98 టీఎంసీల వాటాలో.. తెలంగాణకు గరిష్టంగా 78 టీఎంసీలు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఇందులో పోలవరానికి సంబంధించి 43 టీఎంసీలు (96శాతం వాటా), పట్టిసీమకు సంబంధించి 35 టీఎంసీలు (65శాతం వాటా) ఇవ్వాలని విన్నవించింది. తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా నీటి యాజమాన్యం, నీటి వాటాలపై చర్చించేందుకు ఏకే బజాజ్ కమిటీ సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో తెలంగాణ సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించింది. ఇందులో కమిటీ చైర్మన్ ఏకే బజాజ్‌తో పాటు సభ్యులు డీకే మెహతా, ఆర్పీ పాండే, ప్రదీప్ కుమార్ శుక్లా, ఎన్ఎన్ రాయ్, కేఆర్ఎంబీ చైర్మన్ ఎస్కే హల్దర్, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్‌రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపులు, పంపిణీలో అన్యాయంపై జోషి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందున్న పరిస్థితి, సాగునీటి రంగంలో అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలు, పథకాలను వివరించారు. ఏపీ ఆవిర్భావం తర్వాత ఆయా పథకాలను తుంగలో తొక్కిన వైనాన్ని తెలిపారు. 811లో 450 టీఎంసీలైనా రావాలి హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో రూపొందించిన అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్ర ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ 174 టీఎంసీలను కోల్పోయిందని ఎస్కే జోషి వివరించారు. బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునళ్ల ముందు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఉమ్మడి ఏపీ సర్కారు సమర్థంగా వాదించలేదన్నారు. అంతర్జాతీయంగా సాగునీటి కేటాయింపులు, పంపిణీకి సంబంధించి అమల్లో ఉన్న సహజ న్యాయసూత్రాలను ఉమ్మడి ఏపీ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. క్యాచ్మెంట్, సాగుయోగ్య భూములు, పేదరికం, వెనుకబాటుతనం, జనాభా తదితర అంశాలలో ఏ ప్రాతిపదికన, ఏ ప్రమాణాలతో చూసినా.. ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణకు 450 టీఎంసీలు రావాల్సి ఉందని వివరించారు. కమిటీకి విజ్ఞప్తి చేసిన మరిన్ని అంశాలు.. ⇒ నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద తెలంగాణ వాస్తవ ఆయకట్టు 6.6 లక్షల ఎకరాలుకాగా.. ఉమ్మడి ఏపీలో దాన్ని 6 లక్షల ఎకరాలకు తగ్గించారు. అందులోనూ 5 లక్షల ఎకరాలకే నీళ్లిచ్చారు. ఏపీ ప్రాంతంలో మాత్రం ఎడమ కాల్వ కింద ఆయకట్టును 1.3 లక్షల ఎకరాల నుంచి 3.7 లక్షల ఎకరాలకు పెంచారు. కుడి కాల్వ కింద 7.9 లక్షల నుంచి 11.74 లక్షల ఎకరాలకు పెంచుకున్నారు. ⇒1956లో ఏపీలోని కేసీ కెనాల్‌కు, తెలంగాణలోని ఆర్డీఎస్కు 85 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అనంతరం ఉమ్మడి ఏపీలో కేసీ కెనాల్ కింద ఆయకట్టును 2.78 లక్షల ఎకరాలకు పెంచారు. అదే ఆర్డీఎస్ కింద మాత్రం 37 వేల ఎకరాలకు నీళ్లివ్వలేదు. ⇒ఇక ఏపీ తనకు కేటాయించిన నీటిలో 350 టీఎంసీల నికర జలాలు, 150 టీఎంసీల మిగులు జలాలు కలిపి మొత్తం 500 టీఎంసీలు బేసిన్ అవతలే వినియోగిస్తోంది. ⇒తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగి మూడేళ్లు కావస్తున్నా కృష్ణాలో తెలంగాణలో వాటా తేలలేదు. 299:512 నిష్పత్తి ప్రకారం 2015లో రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలికంగా అంగీకారం కుదిరింది. దాని ప్రకారం కృష్ణా ప్రాజెక్టుల ’ఆపరేషనల్ ప్రోటోకాల్’ను రూపొందించాలి. ఉమ్మడి ప్రాజెక్టుల జాబితాలోకి జూరాలను చేర్చడం ఆక్షేపణీయం. ⇒పులిచింతల, సుంకేశుల ప్రాజెక్టులను ఉమ్మడి జాబితాలో చేర్చాలి. ట్రిబ్యునల్ కేటాయింపులను మార్చలేం ‘‘కృష్ణా జల వివాదాలపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటాం. కృష్ణా బోర్డు నిర్వహణ, ఆపరేషనల్ ప్రొసీజర్స్, గోదావరి నుంచి పోలవరం, పట్టిసీమ ద్వారా మళ్లిస్తున్న జలాల అంశాన్ని పరిశీలించాలని మాకు కేంద్రం సూచించింది. ఇరు రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని బోర్డుకు సరైన విధివిధానాలు రూపొందించాలని తెలంగాణ కోరింది. నదీ జలాల మళ్లింపునకు సంబంధించి ఉమ్మడి ఏపీ సమయంలో ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తాం. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఉన్న 299ః512 టీఎంసీల నిష్పత్తిని ఎవరూ మార్చలేరు. మేం నివేదిక ఇచ్చేందుకు 90 రోజుల సమయం సరిపోకపోవచ్చు, గడువు పొడిగించాలని కేంద్రాన్ని కోరుతాం. తదుపరి పర్యటనలో ప్రాజెక్టులను కూడా సందర్శిస్తాం..’’ – ఏకే బజాజ్, కృష్ణా జల వివాదాలపై ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ -
అడుగంటిన సుంకేసుల!
– ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితికి చేరడం మొదటి సారి - కర్నూలు నగరానికి పొంచి ఉన్న తాగునీటి ఎద్దడి – వచ్చే నెల 15 వరకు మాత్రమే నీరు సరిపోయే అవకాశం – ముచ్చుమర్రి నుంచి నీరు ఇవ్వడం సాధ్యమయ్యేనా? – జీడీపీ నీటిపై అశలు పెట్టుకున్న నగరపాలక సంస్థ ఓ వైపు కృష్ణా జలాలు అందించి కర్నూలు నగర ప్రజల తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రకటించి ఆచరణలో పెట్టలేదు. మరోవైపు ఆధారమైన సుంకేసుల (కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బ్యారేజీ) డ్యాంలో నీరు అడుగంటింది. వేసవి ప్రారంభంకాక ముందే సుంకేసుల డెడ్‌స్టోరేజీకి చేరుకోవడం డ్యాం నిర్మించినప్పటి నుంచి ఇదే మొదటిసారి. సత్వరం అధికారులు మేల్కోని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే గతేడాది కంటే ఎక్కువగా ఈసారి దాహం కేకలు వినిపించే పరిస్థితి ఉంది. కర్నూలు సిటీ: కోడుమూరు నియోజకవర్గంతో పాటు కర్నూలు నగర వాసుల దాహం తీర్చేందుకు కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి బ్యారేజీ నీరే ఆధారం ఈ బ్యారేజీ సామర్థ్యం 1.2 టీఎంసీలు. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఫిబ్రవరి నెల రెండో వారానికే అడుగంటి పోయి రాళ్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 130 క్యూసెక్కుల నీరు తాగు నీటి కోసం వదులుతున్నారు. మరో 50 క్యూసెక్కుల నీరు తెలంగాణ వైపు ఉన్న మోటార్ల ద్వారా ద్వారా తోడేస్తున్నారు. మరో 15 రోజులు ఉంటే డ్యాంలోని నీరంతా ఖాళీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార యాంత్రంగం చెబుతుంది. ఎస్‌ఎస్‌ట్యాంకులో అరకొర నీరే నిల్వ నగరంలో సుమారు 5లక్షల జనాభా ఉంది. రోజుకు ప్రతి ఒక్కరికి 155 లీటర్ల నీటిని సరఫరా చేయాలి. కానీ ఇందులో ప్రస్తుతం సగం కూడా సరఫరా చేయడం లేదు. బ్యారేజీ నుంచి కేసీ ద్వారా నీటిని మునగలపాడు దగ్గర ఉన్న సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో నిల్వ చేస్తారు. దీని సామర్థ్యం 154.308 ఎంసీటీఎఫ్. ప్రస్తుతం ఎస్.ఎస్ ట్యాంకులో 100 ఎంసీటీఎఫ్ నీరు కూడా నిల్వ లేదు. ఇందులో కొంత నీరు ఎండ తీవ్రతకు ఆవిరి అవుతుంది. అధికారులకు ముందు చూపు లేకపోవడం, పాలకుల నిర్లక్ష్యమే తాగునీటి కష్టాలకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ చర్యలేవి? ఇటీవల ప్రారంభించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా కర్నూలు ప్రజల తాగు నీటి దాహం తీర్చవచ్చు. ఇదే విషయాన్ని పథకం ప్రారంభోత్సవ సమయంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఆర్భాటంగా ప్రకటించారు. ఈ పథకం ద్వారా నీటిని అందించాలంటే నగర మధ్యలో పోయే కేసీ కాలువను శుభ్రం చేయాలి. ఇందులోని చెత్తాచెదారాన్ని తొలగించిన తర్వాత నీటిని వదిలేందుకు అవకాశం ఉంది. అయితే, ఇంత వరకు దీనికి సంబంధించిన పని మొదలు పెట్టలేదు. ఇక నగర ప్రజల తాగు నీటి దాహాం తీర్చే మరో ప్రత్యామ్నయ మార్గం గాజులదిన్నె ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నీటిని కాలువ ద్వారా కేసీకి మళ్లీంచాలి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా నేటికీ మొదలు కాకపోవడంతో వచ్చే వేసవిలో కోడుమూరు, కర్నూలు వాసులకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. -
జల వివాదం
తొండూరు : పైడిపాళెం రిజర్వాయర్ నుంచి తొండూరు మండలం సంతకొవ్వూరు కెనాల్ ద్వారా వచ్చే నీటిని సింహాద్రిపురం మండలం లోమడ గ్రామస్తులు అడ్డుకోవడంతో జలవివాదం తలెత్తింది. గత నెల 28న పైడిపాలెం రిజర్వాయర్ నుంచి సంతకొవ్వూరు కెనాల్ ద్వారా తొండూరు మండలానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. అయితే 29వ తేదీ ఆదివారం ఉదయం కృష్ణాజలాలు తొండూరు మండలానికి చేరాయి. దీంతో ఆదివారం రాత్రి లోమడ గ్రామానికి చెందిన రైతులు తొండూరు మండలానికి కృష్ణా జలాలు రాకుండా సుంకేసుల – రావులకొలను మధ్యలో అక్రమంగా జేసీబీతో వాగు వద్ద మట్టిని తొలగించి నీటిని లోమడ చెరువుకు మళ్లించారు. దీంతో సంతకొవ్వూరు కెనాల్లో కనీసం 20క్యూసెక్కుల నీరు కూడా రాకపోవడంతో తొండూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, రైతులు సంతకొవ్వూరు కెనాల్ కాలువ గట్టు వెంబడి వెళ్లగా రావులకొలను – సుంకేసుల మధ్యలో నీటిని అక్రమంగా తరలిస్తున్నారని తెలుసుకున్నారు. తొండూరు, లోమడ గ్రామాల రైతుల వాగ్వాదం పైడిపాలెం రిజర్వాయర్ నుంచి సంతకొవ్వూరు కెనాల్ ద్వారా తొండూరుకు వస్తున్న నీటిని లోమడ రైతులు అక్రమంగా తరలిస్తుండటంతో తొండూరు, లోమడ రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. మంగళవారం తొండూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, మండల పరిశీలకుడు బండి రామమునిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అంకిరెడ్డి సురేష్‌రెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ వెంకట్రామిరెడ్డిలతోపాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు నీటిని అక్రమంగా తరలిస్తున్న సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో తొండూరు, లోమడ రైతుల మధ్య నీటి కోసం మాటా మాటా పెరిగి చివరకు ఘర్షణ పడే స్థాయికి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్, కొండాపురం సీఐ రవిబాబులతోపాటు సింహాద్రిపురం, తొండూరు ఎస్ఐలు హనుమంతు, శ్రీనివాసులు, దాదాపు 50మంది పోలీసులను సంఘటన స్థలానికి పంపారు. ఇరు గ్రామాల రైతులకు సర్ది చెప్పి ఘర్షణను నివారించారు. అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం పైడిపాలెం నుంచి సంతకొవ్వూరు కెనాల్ ద్వారా తొండూరు మండలానికి రావాల్సిన నీటి వాటాను రాకుండా లోమడ రైతులు అక్రమంగా కాలువను ధ్వంసం చేసి నీటిని తరలిస్తున్నారని మైనర్ ఇరిగేషన్ అధికారులకు తొండూరు మండల నాయకులు, రైతులు ఫిర్యాదు చేశారు. అయినా కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మైనర్ ఇరిగేషన్ డీఈలతో తొండూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, లోమడ గ్రామస్తులతో కొండాపురం సీఐ రవిబాబు చర్చలు జరిపి అక్కడ జరుగుతున్న సంఘటనలను ఉన్నతాధికారులకు వివరించారు. తాత్కాలికంగా లోమడ చెరువుకు 40 శాతం నీటిని విడుదల చేసి.. మిగతా నీటిని తొండూరు మండలానికి సంతకొవ్వూరు కెనాల్ ద్వారా వదిలేలా చర్చలు జరిపి రెండు మండలాల రైతులను అక్కడ నుంచి పంపించేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఈశ్వరరెడ్డి, తొండూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, బూచుపల్లె బాలనరసింహారెడ్డి, ద్వారకనాథరెడ్డి, రజినికాంత్‌రెడ్డి, జింకా కుమార్, అమరనాథరెడ్డి, రంగనాథరెడ్డి, రాఘవరెడ్డి, రామాంజనేయులు, రామమునిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘కృష్ణా’పై మరోసారి విచారణ
అఫిడవిట్ సమర్పణకు గడువు కోరనున్న తెలంగాణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివా దంపై మరోమారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మంగళవారం విచారణ జరుగనుంది. ఉమ్మడి రాష్ట్రా నికి చేసిన కేటాయింపుల నుంచే రెండు కొత్త రాష్ట్రాలు కృష్ణా జలాలను పంచుకోవా లంటూ అక్టోబర్‌లో తీర్పును వెలువరించిన అనంతరం తొలిసారి ట్రిబ్యునల్ మళ్లీ దీనిపై విచారణ జరుపనుంది. దీనికోసం రాష్ట్ర అధి కారులు సోమవారమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే తాను సమర్పించాల్సిన అంశంపై తెలంగాణ వాయిదా కోరే అవ కాశం ఉండగా, సుప్రీంకోర్టులో ఇప్పటికే దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అంశాన్ని ఏపీ ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చే అవకాశం ఉంది. నిజా నికి రెండు రాష్ట్రాలకే తదుపరి విచారణ పరిమితం అవుతుందని పేర్కొంటూ తీర్పు వెలువరించిన సమ యంలోనే నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల మధ్య ఆపరేషన్ ప్రొటోకాల్ తెలంగాణ, ఏపీకే పరి మితమని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. సెక్షన్ 89 పరిధిపై వివాదం పరిష్కారమైందని, నీటి కేటాయిుంపులు, ప్రాజెక్టు వారీ కేటా యింపులు తేల్చేందుకు మళ్లీ విచారణను చేపడతామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. -
జలం కోసం దీక్ష
తొండూరు : పైడిపాలెం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను సంతకొవ్వూరు కెనాల్ ద్వారా విడుదల చేయాలని కోరుతూ రెండు రోజులుగా కెనాల్ వద్ద దీక్ష కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన దీక్ష బుధవారం రాత్రి వరకు కొనసాగినా అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ తొండూరు మండలానికి నీరు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. సంతకొవ్వూరు కెనాల్ కింద దాదాపు సుంకేసుల, రావులకొలను, బోడివారిపల్లె, బూచుపల్లె, మల్లేల, కోరవానిపల్లె తదితర గ్రామాలకు చెందిన రైతులు బోరుబావుల కింద సాగు చేసిన పంటలు, పండ్ల తోటలు వాడు దశకు చేరుకున్నాయి. గత 5 రోజులుగా హిమకుంట్ల చెరువుకు కృష్ణా జలాలను వదులుతున్న అధికారులు తొండూరు మండలం సంతకొవ్వూరు కెనాల్‌కు వదలకుండా పక్షపతం చూపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోలేదని.. వందలాది మంది రైతులు రేయింబవళ్లు కెనాల్ వద్ద పడిగాపులు కాస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులు, రైతులతో చర్చించిన డీఎస్పీ, ఇరిగేషన్ ఎస్ఈ సంతకొవ్వూరు కెనాల్‌కు కృష్ణా జలాలు విడుదల చేయాలని గత రెండు రోజులుగా దీక్ష చేస్తున్న రైతులు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి అంకిరెడ్డి సురేష్‌రెడ్డి, మండల పరిశీలకుడు బండి రామమునిరెడ్డి, మండల నాయకుడు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి తదితర వైస్సార్సీపీ నాయకులతో బుధవారం మధ్యాహ్నం జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ చెంగయ్యలు చర్చించారు. 300 క్యూసెక్కుల నీటిని హిమకుంట్ల చెరువుకు తరలిస్తున్నారని.. అంతే కెపాసిటీతో సంతకొవ్వూరు కెనాల్‌కు నీటిని విడుదల చేయాల్సి ఉందన్నారు. కానీ కేవలం 50 క్యూసెక్కుల నీరు మాత్రమే సంతకొవ్వూరు కెనాల్‌కు విడుదల చేయాలని.. మిగతా 250 క్యూసెక్కుల నీటిని హిమకుంట్ల చెరువుకు విడుదల చేయాలని అధికారులను కోరినా వాటిలో ఎలాంటి మార్పు కానరాకపోవడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. దీంతో మండల కో ఆప్షన్ సభ్యుడు వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు తమ గ్రామంపై చిన్నచూపు చూస్తున్నారని.. నీటిని ఇచ్చేంతవరకు ఇక్కడినుంచి కదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. నీటిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన రైతు సంతకొవ్వూరు కెనాల్‌కు నీటిని విడుదల చేయాలంటూ కాలువ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ బూచుపల్లె గ్రామానికి చెందిన నాగ ఈశ్వరయ్య అనే చీనీ రైతు కాలువలోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్, ఎర్రగుంట్ల సీఐ శ్రీనివాసులు ఉన్నతాధికారులతో చర్చించి నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చి కాలువలో నుంచి నాగఈశ్వరయ్యను బయటకు తీశారు. పోలీసుల ప్రతాపం కృష్ణా జలాల కోసం సంతకొవ్వూరు కెనాల్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులకు న్యాయం చేసేందుకు యత్నించాల్సిన పోలీసులు రైతులపై ప్రతాపం చూపుతున్నారు. దాదాపు 5మంది సీఐలు, 12మంది ఎస్ఐలు, 100మంది పోలీసులతోపాటు ప్రత్యేక బలగాలను తెప్పించి అధికారులు రైతులతో మాట్లాడకుండా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు విడుదల చేసేంతవరకు పంపించేది లేదంటూ ఎస్ఈ చెంగయ్య వాహనాన్ని అడ్డుకున్న రైతులను పోలీసులు బలవంతంగా పక్కకు నెట్టడంతో పోలీసులు, రైతుల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు సంఘం మండల నాయకుడు పల్లేటి ఈశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శులు రమణారెడ్డి, షఫి, తాలుకా ప్రధాన కార్యదర్శి దశరథరామిరెడ్డి, ఎంపీటీసీ శివశంకర్‌రెడ్డి, సర్పంచ్‌లు గురుమోహన్‌రెడ్డి, వెంకటచలమారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బాలనరసింహారెడ్డి, భాస్కర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డి, కుమార్, రాఘవరెడ్డి, శేఖరరెడ్డి, రామమునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాత లెక్కలు తిరగదోడదాం!
-
పాత లెక్కలు తిరగదోడదాం!
కృష్ణా జలాల్లో అదనపు వాటా కోసం ప్రభుత్వ కసరత్తు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో గడిచిన రెండున్నరేళ్లుగా రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని పూడ్చు కునేందుకు వీలుగా.. ఏపీ చేసిన పాత వినియోగ లెక్కలన్నీ బయ టకు తీయాలని తెలంగాణ నిర్ణ యించింది. నీటి లోటును ఈ విధంగానైనా భర్తీ చేసుకోవచ్చనే అభిప్రాయంతో ఉంది. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో 53 టీఎంసీల మేర నీటి లభ్యతే ఉండటం, అందులోనూ 18 టీఎంసీలకు మించి వాటా దక్కకపోవచ్చన్న అంచనా నేపథ్యంలో గతంలో ఏపీ చేసిన అధిక వినియోగ లెక్కలను తీసి వాటిని ఈ ఏడాది నీటిలో కొంతైనా సర్దుబాటు చేయిం చేలా కసరత్తు చేస్తోంది. దీనిపై గురువారం ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్ రావు, నీటి పారుదలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, సాగర్ సీఈ సునీల్ ఇతర అధికారులతో చర్చలు జరిపారు. 2014–15 వాటర్ ఇయర్ లో తన వాటాలకు మించి ఏపీ 45 టీఎంసీలు వినియోగించగా, పోతిరెడ్డిపాడు కింద 11.24 టీఎంసీలు, కృష్ణా డెల్టా వ్యవస్థ (కేడీఎస్) కింద మరో 23 టీఎంసీలు అధి కంగా వాడుకుందని తేల్చారు. ఈ ఏడాది కృష్ణాలో ఏపీ 238 టీఎంసీలు వినియోగిం చాల్సి ఉన్నా, 10 టీఎంసీలు అధికంగా వాడుకుందని, పట్టి సీమ నీటిని సైతం కలుపుకొంటే అదనంగా వాడుకున్న నీరు 40 టీఎంసీలకు చేరుతుం దని అధికారులు చెప్పారు. ఇక తెలంగాణకు 138 టీఎంసీల వాటా రావాల్సి ఉన్నా 128 టీఎంసీలే వినియోగించిందన్నారు. అధి కారులు చెబుతున్న అంశాలపై బోర్డుకు లేఖ రాయాలని అధికారులు నిర్ణయించారు. -
మాకొద్దీ టెలిమెట్రీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగం, నీటి విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల పరిధిలో 18 చోట్ల టెలిమెట్రీ పరికరాలను అమర్చేందుకు అంగీకరించిన ఆంధ్రప్రదేశ్, తనపరిధిలోని ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఏపీ పరిధిలోని పులిచింతల డ్యామ్,ప్రకాశం బ్యారేజీ, తదితర ప్రాంతాల్లో టెలిమెట్రీ పరికరాలు అమర్చాలని కృష్ణా బోర్డు ప్రతిపాదించగా, ఔట్ ఫ్లో ప్రాంతాల వద్ద మాత్రమే టెలిమెట్రీ సరిపోతుందని, ఇన్‌ఫ్లో ప్రాంతాల్లో వద్దని ఏపీ చెబుతు న్నట్లుగా తెలిసింది. కాగా బోర్డు సభ్యులు బుధవారం నుంచి జూరాల, ఆర్డీఎస్, కేసీ కెనాల్, ముచ్చుమర్రి తదితరాల ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో టెలిమెట్రీ పరికరాలు అమర్చే అంశంపై సభ్యులు పరిశీలన చేయనున్నారు. -
ప్రభుత్వ అసమర్థతతో అన్యాయం
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ప్రభుత్వం అస మర్థతతో తెలంగాణకు అన్యాయం జరుగు తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి ప్రభుత్వం ట్రిబ్యునల్‌లో సమర్థవంతంగా వాదనలు వినిపించకపోవడంతో నీటిని ఏపీ, తెలంగాణల మధ్యే పంచుకోవాల్సి వస్తోందన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అవగాహనరాహిత్యంతో తెలం గాణకు తీరని నష్టం కలుగుతోందన్నారు. కృష్ణా నది నీటి పంపకాలకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిష న్ ను కొట్టివేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. -
‘పంచాయితీ’ ఇద్దరిదే
‘కృష్ణా’ జలాల పంపిణీపై రాష్ట్రానికి ఎదురుదెబ్బ నీటిని నాలుగు రాష్ట్రాల మధ్య పంచాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ♦ జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంచడమే సమంజసం.. ‘బ్రిజేశ్’ తీర్పును సమర్థించిన బెంచ్ ♦ తెలంగాణ మళ్లీ విడిపోతే ఇంకోసారి కేటాయింపులు జరుపుతారా?.. ఇలా అన్నిసార్లు తిరగదోడలేం కదా? ♦ బ్రిజేశ్ ట్రిబ్యునల్ విభజన చట్టంలోని సెక్షన్ 89 విస్తృతార్థాన్ని విస్మరించింది: తెలంగాణ న్యాయవాది ♦ మా వాదనలను ట్రిబ్యునల్ వినలేదు..కేంద్రం పట్టించుకోలేదు.. మీరు వినడం లేదు ♦ ఇక న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్న సాక్షి, న్యూఢిల్లీ కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో తెలంగాణకు ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణా జలాలను ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకతో సంబంధం లేకుండా ఏపీ, తెలంగాణ మధ్యే పంచాలంటూ జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది. ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89కు కృష్ణా నదీ జలాల కేటాయింపు విషయంలో.. కర్ణాటక, మహారాష్ట్రలతో సంబంధం లేదని, కేవలం ఏపీ, తెలంగాణ మధ్యే నీటిని పంచాలంటూ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటినే పంచితే తమకు అన్యాయం జరుగుతుందని, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాల మధ్య తిరిగి పంపకాలు చేపట్టాలని ఈ పిటిషన్లో కోరింది. సోమవారం ఈ పిటిషన్ జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ ప్రఫుల్ల సి.పంత్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఆ సెక్షన్‌లోని విస్తృతార్థాన్ని ట్రిబ్యునల్ విస్మరించింది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కారణంగా కృష్ణా ట్రిబ్యునళ్ల వద్ద తమ ప్రాంత సమస్యలు, ప్రయోజనాలను వినిపించే అవకాశం తెలంగాణకు లేకపోయిందని వైద్యనాథన్ ధర్మాసనానికి నివేదించారు. ‘‘నిధులు, నియామకాలు, నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందనే రాష్ట్రం విడిపోయింది. విభజన చట్టంలో ఈ ప్రయోజనాలను కాపాడేందుకే కేంద్రం సెక్షన్ 89ను పొందుపరిచింది. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యే నీటి పంపకానికైతే సెక్షన్ 84 సరిపోతుంది. కానీ ప్రాజెక్టుల వారీ కేటాయింపులు అన్న నిర్దిష్ట నిబంధనను పొందుపరచడం ద్వారా కృష్ణా నదీ జలాలను నదీ పరివాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాలకు పంచాలని చట్టం యోచించింది. అయితే అందులోని విస్తృతార్థాన్ని ట్రిబ్యునల్ విస్మరిస్తూ తెలంగాణ విజ్ఞప్తిని తోసిపుచ్చింది’’అని పేర్కొన్నారు. ఇందుకు జస్టిస్ మదన్ బి.లోకూర్ స్పందిస్తూ ‘‘తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఏ, తెలంగాణ బీ, తెలంగాణ సీ.. ఇలా మూడు రాష్ట్రాలుగా విడిపోయిందనుకుందాం. అప్పుడు మళ్లీ అన్ని రాష్ట్రాలకు నీటి కేటాయింపులు మొదట్నుంచీ చేస్తారా? ఇలా అన్నిసార్లు తిరగదోడలేం కదా?’’అని ప్రశ్నించారు. దీనికి వైద్యనాథన్ బదులిస్తూ... ‘‘ఇదొక ముఖ్యమైన మలుపు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం–1956 ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపని పక్షంలో ట్రిబ్యునల్ ఇప్పుడు జరపాలని విభజన చట్టంలోని సెక్షన్ 89 నిర్వచిస్తోంది. అలాగే.. నదిలో తక్కువ ప్రవాహం ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు వదలాలన్న ఆపరేషన్ ప్రోటోకాల్‌ను కూడా ట్రిబ్యునల్ నిర్దేశించాలి. అయితే ఇదివరకు పైరాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో ప్రాజెక్టు వారీగా కేటాయింపులు గానీ, ఆపరేషన్ ప్రొటోకాల్నుగానీ నిర్దేశించలేదు. అలాంటప్పుడు సెక్షన్ 89ను కేవలం కింది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు మాత్రమే వర్తింపజేస్తే నీళ్లెలా వస్తాయి? పంపకాలు కేవలం కొత్త రాష్ట్రాల మధ్యే అయినప్పుడు సెక్షన్ 89 అవసరమే లేదు. కేవలం సెక్షన్ 84 సరిపోతుంది’’అని విన్నవించారు. అయితే ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించ లేదు. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలి? ‘‘రాష్ట్రం విడిపోయిందే నీటి కోసం. రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే మేం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం–1956 కింద కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాం. కృష్ణా నదీ జలాలను తిరిగి నాలుగు రాష్ట్రాలకు పంచాలని అడిగాం’’అని వైద్యనాథన్ పేర్కొన్నారు. ఏడాదిలోపు పరిష్కరించాల్సిన తమ పిటిషన్‌ను కేంద్రం పట్టించుకోలేదని వివరించారు. ‘‘ఇదే కోర్టులో మరో ధర్మాసనం వద్ద ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. దానిపైనా కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. అవార్డుకు సంబంధించిన కేసులు ఇప్పటికే నాలుగు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రిబ్యునల్ మా వాదనలు పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు మా వాదన వినడం లేదు. ఇంకా న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలి?’’అని ప్రశ్నించారు. అంతకుముందు కర్ణాటక తరపున సీనియర్ న్యాయవాది నారీమన్ వాదనలు వినిపిస్తూ... విభజన చట్టంలోని కారణాలు, ఉద్దేశాలను విశ్లేషిస్తే నదీ జలాల పంపకానికి ప్రాతిపదిక దొరుకుతుందన్నారు. విభజన చట్టంతో కర్ణాటకకుగానీ, మహారాష్ట్రకుగానీ సంబంధమే లేదని వాదించారు. మహారాష్ట్ర తరపున సీనియర్ న్యాయవాది ఈ వాదనలకు మద్దతు పలికారు. చివరకు ధర్మాసనం తెలంగాణ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే ఈ ఉత్తర్వులు పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్లపై ప్రభావం చూపరాదన్న తెలంగాణ అభ్యర్థనను మన్నించింది. -
రబీకి కన్నీళ్లే!
శ్రీశైలం నీటి పంపకాల్లో సీమకు అన్యాయం - హంద్రీనీవాకు మాత్రమే 7 టీఎంసీలు కేటాయింపు - తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీలకు మొండిచేయి - బోర్డుకు నీరు కావాలని ప్రతిపాదించని ప్రభుత్వం - పట్టిసీమ నీరు డెల్టాకు.. డెల్టా వాటా నీరు సీమకు ఇస్తామన్న ప్రభుత్వం - ప్రకటనకే పరిమితమైన బాబు హామీ - సీమలో రబీ ఆయకట్టు లేనట్లే పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు ఎంత నీరు తరలిస్తామో అంతే మొత్తం నీటిని రాయలసీమ సాగునీటి కాల్వలకు ఇస్తాం. శ్రీశైలం జలాశయం నుంచి చుక్క నీరు కూడా దిగువకు తీసుకుపోం. - గత రెండేళ్లుగా చంద్రబాబు హామీ ఇది. కర్నూలు సిటీ: ఖరీఫ్ ఆయకట్టుకు మాత్రమే నీరిచ్చి రబీని ఎండబెట్టేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు ఆగస్టు మొదటి వారం వరకు ఎగువ నుంచి చుక్కనీరు చేరని పరిస్థితి. ఆ తర్వాత కృష్ణానది పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో రెండు వారాలకే జలాశయం కనీస నీటి మట్టానికి చేరుకుంది. ఆ సమయంలో మొదట కృష్ణా పుష్కరాల కోసమని, ఆ తర్వాత తాగునీటి కోసం అధికారం చేతిలో ఉండడంతో కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతిచ్చిన దాని కంటే అదనంగా నీటిని దిగువకు తరలించారు. ఫలితంగా నేడు రాయలసీమ రబీ సాగుకు దూరమవుతోంది. ఇటీవల కృష్ణా జలాల పంపకాలు కూడా ప్రభుత్వ కుట్రకు అద్దం పడుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 868 అడుగుల నీటి మట్టం, 135 టీఎంసీల నీరు ఉంది. వెలుగోడులో 11.5 టీఎంసీలు ఉండగా కడపకు 5 టీఎంసీలు, తెలుగుగంగ కింద స్టాండింగ్ క్రాప్‌నకు 3 టీఎంసీలు పోగా.. మిగిలిన 3 టీఎంసీలు తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. నీటి పంపకాల్లో అన్యాయం రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం నీటి పంపకాల్లో రాయలసీమకు మరోసారి అన్యాయం జరిగింది. ప్రాజెక్టులు 150 టీఎంసీల నీటిని విడతల వారీగా దిగువకు తీసుకెళ్లే కుట్ర జరుగుతోంది. ఇప్పటికే 51 టీఎంసీలను అనుమతులు లేకుండా సాగర్‌కు తరలించారు. మరో 60 టీఎంసీల నీటిని వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో తీసుకెళ్లేందుకు అధికార పార్టీ ఎత్తుగడ వేస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నీటి పంపకాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా నిర్ణయాలు తీసుకుంటుండడంతో సీమ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా టీడీపీ నేతలు ఒక్కరు కూడా స్పందించకపోవడం చూస్తే ఈ ప్రాంత ఆయకట్టుదారులపై వారికున్న ప్రేమ అర్థమవుతోంది. సీమ సాగునీటి కాల్వల కింద రబీ ఆయకట్టు లేనట్లే! శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలుగుగంగ, శ్రీశైలం కుడి కాలువ కింద కర్నూలు జిల్లాలో 1.08 లక్షలు, కడపలో 1.67 లక్షలు, నెల్లురులో 2.54 లక్షలు, చిత్తూరు జిల్లాలో 0.46 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎస్ఆర్బీసీ కింద కర్నూలులో 1.60 లక్షలు, కడపలో 30వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ప్రస్తుతం తెలుగుగంగ కింద 3లక్షలు, ఎస్ఆర్బీసీ కింద 1.14 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. రబీలో ఆరుతడి పంటలు సాగు చేసేందుకూ శ్రీశైలంలో నీరు అందుబాటులో ఉంది. అయితే ప్రభుత్వం కృష్ణాడెల్టాకు సాగు నీరు ఇచ్చేందుకు మాత్రమే కృష్ణాబోర్డుకు ప్రతిపాదించింది. సీమలోని హంద్రీనీవాకు మాత్రమే 7 టీఎంసీల నీరు ఇచ్చేందుకు అనుమతులు తీసుకున్నారు. ఈ నీరంతా అనంతపురం జిల్లాకేనని చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే 20 టీఎంసీలకు పైగా కృష్ణాజలాలు తరలించారు. కానీ కర్నూలు జిల్లాకు మాత్రం 3 టీఎంసీలు కూడా ఇవ్వకపోవడం గమనర్హం. రబీకి నీరివ్వలేం ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు మాత్రమే నీరిస్తాం. రబీకి నీరు ఇవ్వలేమని ఇప్పటికే తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ ఎస్ఈలు ఆయా గ్రామాల రైతులకు తెలిపేలా ఆదేశించాం. 6.6 టీఎంసీల నీరు అవసరమని ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించాం. ఇప్పటికే మా ఇంజినీర్లు గ్రామాల్లో డప్పు వేయిస్తున్నారు. దిగువకు నీరు వదిలితే నీటి మట్టం తగ్గుతుందని, ఆ తర్వాత సాగు చేసిన పంటలకు నీరు ఇవ్వలేమని ఈ నిర్ణయం తీసుకున్నాం. – నారాయణరెడ్డి, సీఈ -
మనకు 17.. ఏపీకి 35
- హైదరాబాద్ తాగునీటికి 4, సాగర్ ఎడమకాల్వకు 13 టీఎంసీలు - జనవరికి కృష్ణా జలాలను పంచుతూ బోర్డు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: అనేక తర్జనభర్జనల అనంతరం జనవరి 20 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంచుతూ కృష్ణా బోర్డు నిర్ణయం చేసింది. ప్రస్తుత లభ్యత నీటిలో తెలంగాణకు 17 టీఎంసీలు, ఏపీçకు 35 టీఎంసీలు పంచుతూ ఆదేశాలు జారీ చేసింది. జంట నగరాల తాగునీటి అవసరాల నిమిత్తం ఏఎంఆర్పీ కింద 4 టీఎంసీలు, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద 13 టీఎంసీలు కేటాయించింది. ఏపీకి కృష్ణా డెల్టాకింద 10 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వకు 15 టీఎంసీలు, ఎడమ కాల్వకు 3.1 టీఎంసీలు, హంద్రీనీవా కింద 7 టీఎంసీలు విడుదలకు అంగీకరించింది. ఈ మేరకు సోమవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ ఆదేశాలు జారీచేశారు. నిజానికి సాగర్ కింది సాగు అవసరాలతో పాటు హైదరాబాద్, నల్లగొండ జిల్లా అవసరాలకు కలిపి 56 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ కోరుతూ వచ్చింది. అయితే ఇటీవల పట్టిసీమ వినియోగ లెక్కలు, మైనర్ కింద వినియోగం లెక్కలను పక్కనపెడుతూ 130 టీఎంసీల లభ్యత జలాల్లో తెలంగాణకు 43, ఏపీకి 87 టీఎంసీలు కేటాయిస్తూ బోర్డు ప్రతిపాదించింది. రబీ సాగు ఆలస్యమవుతుండటం, రైతుల నుంచి నీటి విడుదలపై డిమాండ్ పెరుగుతుండటంతో దీనికి తెలంగాణ అంగీకరించింది. అయితే బోర్డు ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించే రీతిలో తనకు 106 టీఎంసీలు కావాలని కోరింది. ఈ వివాదం కొలిక్కి రాకపోవడంతో సోమవారం బోర్డు జనవరి వరకు నీటిని పంపిణీ చేస్తూ నిర్ణయం చేసింది. అపెక్స్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి శ్రీశైలం నుంచి సాగర్‌కు 30 టీఎంసీలు విడుదల చేయాలని సూచించింది. ఈ నీటి విడుదల పూర్తిగా పవర్ హౌస్ ద్వారానే జరగాలని ఆదేశించింది. చేసిన విద్యుదుత్పత్తిని ఎలా పంపిణీ చేసుకోవాలన్న దానిపై కేంద్ర విద్యుత్ శాఖతో చర్చించుకుని ఇరు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు నిర్ణయానికి రావాలని కోరింది. ప్రాజెక్టుల కింద కేటాయించిన నీటిని ఎలా వాడుతున్నారన్నది ఈఎన్సీలు గమనిస్తూ ఉండాలని, సాగర్, శ్రీశైలం నీటి విడుదలను సంయుక్త కమిటీలు పర్యవేక్షిస్తాయని స్పష్టం చేసింది. -
హంద్రీనీవా నీటి వినియోగంపై ఆంక్షలు
నీటిని పొలాలకు మళ్లించుకోరాదని హెచ్చరికలు పోలీసు బందోబస్తుతో పంట పొలాల్లో దాడులు ఉరవకొండ : హంద్రీనీవా ద్వారా నాలుగేళ్ల నుంచి కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నా ప్రతిపాదిత ఆయకట్టులో ఒక్క ఎకరాకూ నీరు ఇవ్వలేదు. పొలాల పక్కనే నీరు పోతున్నా వాటిని మళ్లించుకునే అవకాశం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. హంద్రీనీవా మొదటి దశ కింద 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.అందులో అత్యధికంగా ఉరవకొండ నియోజకవర్గంలోనే 80 వేల ఎకరాలు ఉంది. మొదటి దశలో 30 నుంచి 36 ప్యాకేజీ వరకు ఉన్నాయి. అందులో నియోజకవర్గంలో 33 ప్యాకేజీ పరిధిలో 20,900 ఎకరాలు, 34వ ప్యాకేజీ కింద 17,300 ఎకరాలు ఉన్నాయి. హంద్రీనీవా నీటివాడకంపై అధికారుల కొరడా : ఉరవకొండ నియోజవర్గంలో ఖరీఫ్‌లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుతడి పంటలైన మిర్చి, వరి,ప్రత్తి పంటలు సాగు చేశారు. తీవ్ర వర్షాభావంతో రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మోటార్లు, పైపులు కొనుగోలు చేశారు. పంటలకు కనీసం రెండు తడులైనా నీరు అందించాలని హంద్రీనీవా నీటిని వాడుకుంటున్నారు. పంట చేతికొస్తున్న సమయంలో అధికారులు ఉన్నఫలంగా మోటార్లతో నీటిని వాడుకుంటే చర్యలు తీసుకుంటామని రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల పరిధిలోని కాలువ పొడువునా దాడులు చేయడానికి చర్యలు చేపట్టారు. వజ్రకరూరు మండలంలోని కడమలకుంట, రాగులపాడు, పీసీ ప్యాపిలి, ఉరవకొండ మండలంలోని లత్తవరం, చిన్నమూస్టురు, పెద్దమూస్టురు, ఇంద్రావతి గ్రామాల్లో ఇప్పటికే రైతులను అధికారులు మోటార్లు పెట్టుకోరావని హెచ్చరించారు. అధికారుల తీరుపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హక్కుగా వాడుకోవాల్సిన హంద్రీనీవా నీటిపై ఆంక్షలు పెట్టడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంటలు పరిస్థితి ఎంటీ : నాగరాజు, రాయంపల్లి కొద్దో గొప్పో హంద్రీనీవా నీటితో పంటలకు నీరు అందుతుంది. ఇప్పడు మోటార్లు పెట్టి వాడుకోరాదు అంటే పంటలు పరిస్థితి ఎంటో అర్థం కావడం లేదు. అధికారులు రైతుల గురించి ఆలోచించాలి. మా వాటా నీరు ఇవ్వండి : లక్ష్మినారాయణ, ఆయకట్టు రైతు హంద్రీనీవా నీరు మాకు రావాల్సిన హక్కు. ఆయకట్టుకు నీరు ఇచ్చి మాకు న్యాయం చేయాల్సింది పోయి, ఇప్పుడు మోటార్లు పెట్టరాదంటూ అధికారులు చెప్పడం సరైంది కాదు. ఒక తడి ఇస్తే పంట చేతికొస్తుంది : గోవిందు, రైతు ప్రస్తుతం ఒక్క తడి నీరు అందితే మిర్చి పంట చేతికందే అవకాశం ఉంది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి, ఎంతో ఆశగా పంట చేతికొస్తుందని ఎదురుచూస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే : బ్రహ్మయ్య, తహసీల్దార్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ నిబంధన అమలు చేస్తున్నాం. రైతులు ఎవ్వరు హంద్రీనీవా నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేసుకోరాదు. రైతులు అధికారులకు సహకరించాలి. -
జనవరిలో బ్రిజేశ్ ట్రిబ్యునల్ భేటీ
► అఫిడవిట్ల దాఖలుకు తెలుగు రాష్ట్రాలకు 30 వరకు గడువు ► కృష్ణా నీటి కేటాయింపులపై నిర్ణయం వెల్లడించని బోర్డు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై వాదనలు వింటున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యు నల్ సమావేశాలు తిరిగి జనవరి 22న మొదలుకానున్నాయి. ఈ మేరకు ట్రిబ్యునల్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశముంది. నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల మధ్య ఆపరేషన్ ప్రొటోకాల్ వంటివన్నీ రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమని ట్రిబ్యునల్ పేర్కొంది. సెక్షన్ 89 పరిధి వివాదం పరిష్కారమైందని, కొత్త రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, ప్రాజె క్టుల వారీ కేటాయింపులు, ఆపరేషన్ ప్రోటో కాల్‌లను తేల్చేందుకు తదుపరి విచారణను డిసెంబర్ 14న చేపడతామంటూ అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లో అభిప్రాయాలు వెల్లడించాలని ఆదేశించింది. అయితే మరింత గడువు కావా లన్న ఇరు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు.. ఈ నెల 30లోగా అభిప్రాయాలను సమర్పించాలని సూచించింది. దీంతో ఈ నెల 14న జరగా ల్సిన సమావేశాలను వాయిదా వేసిన ట్రిబ్యు నల్... వచ్చే నెల 22, 23న సమావేశాలు నిర్వహిస్తామంటూ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తేలని పంచాయితీ..! మరోవైపు కృష్ణా జలాల కేటాయింపులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏమీ తేల్చ లేదు. లభ్యత జలాల్లో తెలంగాణకు 43 టీఎంసీలు, ఏపీకి 87 టీఎంసీలు కేటాయిస్తా మని... దీనిపై ఈ నెల 13 లోగా అభిప్రా యాలు చెప్పాలని 4 రోజుల కిందే బోర్డు తెలంగాణ, ఏపీలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆలోగా అభిప్రాయం చెప్పకుంటే తామే నిర్ణయం తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది. కానీ గడువులోగా ఇరు రాష్ట్రాలూ దీనిపై స్పందించకున్నా... కృష్ణా బోర్డు మంగళవారం ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ అందుబాటులో లేకపోవడం వల్లే నిర్ణయం వెలువడలేదని సమాచారం. -
కొత్త ట్రిబ్యునల్‌తోనే రాష్ట్రానికి న్యాయం
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాకోసం ప్రభుత్వ పోరాటం బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలుకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై విచారణ పరిధిని రెండు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును నిలిపి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న అంశాన్ని వివరిస్తూనే నదీ జలాల వివాద పరిష్కారాల చట్టం- 1956 లోని సెక్షన్ 5(3) ప్రకారం కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి మొత్తం జలాలపై పునఃసమీ క్షతో న్యాయం చేయాలని పిటిషన్లో కోర నుంది. ఈ పిటిషన్‌కు తుది రూపునిచ్చేందుకు ఆదివారం ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు అంతర్రాష్ట్ర జల విభాగం అధికారులతో భేటీ అయ్యారు. పిటిషన్లో పొందుపరచాల్సిన అంశాలపై చర్చలు జరిపారు. నిజానికి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89(ఏ), (బీ)లకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా నీటి కేటారుుంపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు నీటి కేటారుుంపులు ఎలా జరపాలన్నది ట్రిబ్యునల్ నిర్ణరుుంచాల్సి ఉంటుంది. అయితే దీనిని ట్రిబ్యునల్ తీర్పు లో ప్రస్తావిస్తూ, కేంద్రం సెక్షన్ 89ను ఎం దుకు పొందుపరిచిందో అర్థం కావడం లేదు అన్న తరహాలో స్పందించింది. ప్రస్తుతం వివాదం రెండు రాష్ట్రాలకే పరిమితం అయితే వర్షాలు సరిగ్గా లేని సమయాల్లో మన రాష్ట్రం లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండడానికి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వరకు వేచి చూడాలి. అప్పటి వరకు నీరు రాకపోతే పంటల సాగు సీజన్ కూడా ముగిసి పోతుంది. ప్రస్తుత ఏడాది అలాంటి పరిస్థితులే ఎదురై సాగర్ కింద ఆయకట్టుకు నీరివ్వలేని గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్న కాస్త నీటిని తాగు అవసరాల కోసం నిత్యం గుంజులాడుకుంటున్నాయి. సరిపోని కేటారుుంపులు.. ఈ పరిస్థితులు సుప్రీంకు అర్థమయ్యేలా వివ రించాలని వీరి భేటీలో నిర్ణయం చేసినట్లుగా సమాచారం. కృష్ణా పరివాహకం తెలం గాణలో 68.5% ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటారుుంపుల్లో 35% మేర మాత్రమే ఉన్నారుు. తెలంగాణలో ఉన్న ఆయకట్టు ప్రాంతం 62.5శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుత కేటాయింపులు ఏ మాత్రం సరిపోవని, పరివాహకం, ఆయకట్టు ను లెక్కలోకి తీసుకున్నా రాష్ట్రానికి కేటాయింపులు పెరగాలని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొనే అవకాశం ఉంది. ఈ పిటిషన్‌ను ఈ నెల 16లోగా సుప్రీంలో దాఖలు చేసే అవకాశాలున్నాయని సమాచారం. -
పట్టిసీమ వినియోగాన్ని పట్టించుకోం