
సాక్షి, ఢిల్లీ: నేటి నుంచి రెండు రోజుల పాటు కృష్ణ ట్రిబ్యునల్‌లో నీటి పంపకాలపై వాదనలు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో బలమైన వాదనలు వినిపించాలన్న సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఇటీవల నీటి పారుదల శాఖ సమీక్షలో రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు.
ఢిల్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు కృష్ణ ట్రిబ్యునల్‌లో నీటి పంపకాలపై వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. తెలంగాణకు నీటి కేటాయింపులు విషయంలో బలమైన వాదనలు వినిపించాలన్నారు. అలాగే, ఐఎస్ఆర్‌డబ్ల్యూడీఏ-1956 సెక్షన్-3ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గోదావరి-బనకచర్లపై అభ్యంతరాలతో జల్‌శక్తి మంత్రి, ఏపీ ముఖ్యమంత్రికి లేఖలు రాయాలని తెలిపారు. ఇదే సమయంలో పోలవరం ముంపుపై నిర్దేశిత సమయంలో ఐఐటీతో అధ్యయనం చేయాలని సూచనలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేటాయించిన 811 టీఎంసీలలో మెజారిటీ వాటాను తెలంగాణ కావాలంటున్నది.
ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. ఈరోజు సాయంత్రం కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. అలాగే, సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కూడా రేవంత్ రెడ్డి కలవనున్నారు.