
నరసరావుపేట: తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. కృష్ణా జలాలను కిందకు వదలడం వల్ల ఏపీలోని రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే ఆ చర్యను నివారించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాశారు.
తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రతిరోజూ శ్రీశైలం నుంచి నాలుగు టీఎంసీలు, సాగర్ నుంచి మూడు టీఎంసీలు, పులిచింతల నుంచి 1.8 టీఎంసీలు వినియోగించుకుంటూ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. దీంతో ఏపీలో రాబోయే రోజుల్లో తాగు, సాగునీటికి కొరత ఏర్పడనుందని పేర్కొన్నారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతుల మనుగడకు తీవ్ర విఘాతం ఏర్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎస్‌ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని కేంద్రమంత్రిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment