
హిందూపురం అర్బన్ : హడావుడి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు మారుపేరుగా నిలిచిన చంద్రబాబును హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మించిపోయారు. కృష్ణా జలాలతో చెరువులన్నీ నింపి లేపాక్షి ఉత్సవాల్లో జలహారతిని ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన బాలయ్య.. తన మాట నిలబెట్టుకునేందుకు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. ఎందుకంటే హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు ఇంకా లేపాక్షికి చేరకపోవడమే ఇందుకు కారణం. దీంతో పరువు కాపాడుకునే ప్రయత్నాలకు కొత్త మార్గాలు అన్వేశించారు. సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చే ఘాట్‌ను ఆ పక్కనే ఉన్న చెరువులో నిల్వ ఉన్న వర్షం నీటితో నింపే ప్రయత్నం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన వారు ‘ఔరా! బాలయ్య.. మోసాల్లో బావను మించి పోయావయ్యా’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.