ఎమ్మెల్యే బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీజేపీ నాయకులు
అనంతపురం కల్చరల్ : ప్రధాని న రేంద్రమోదీని నీచమైన భాషతో తిట్టిపోసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సుమోటో కేసు నమో దు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక టవర్‌క్లాక్ వద్ద బా లకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయ న దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అంకాళ్ రెడ్డి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వేంకటేశ్వరరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు లలిత్‌కుమార్, నగర అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యల వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలుగుతుందని, సాక్షాత్తు ప్రధానిపై చౌకబారు మాట లు మాట్లాడి నవతరానికి ఏం సందే శం ఇవ్వదలచుకున్నారని వారు ప్ర శ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వ తం కాదని వ్యక్తిగత విమర్శలు మా నుకోవాలని సూచించారు. హంగులు, ఆర్భాటాలతో ప్రజాధనాన్ని వృథా చేసే దొంగ దీక్షలను సీఎం చంద్రబాబు మానుకోవాలని హిత వు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment