MLA balakrishna
-
అభిమానిపై చెయ్యి చేసుకున్న బాలకృష్ణ
-
బాలకృష్ణ ముంచేశాడు!
అనంతపురం (హిందూపురం): ‘‘హిందూపురంలో తాగునీటి సమస్య తీరుస్తామని గొప్పలు చెప్పిన ఎమ్మెల్యే బాలకృష్ణ మున్సిపాలిటీపై అప్పుల కుప్ప పెట్టాడు. ‘అమృత్’ పథకం కింద గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురం వరకు నూతన పైప్‌లైన్‌కు రూ.194 కోట్లు ఖర్చుకాగా, కేంద్రం వాటాగా రూ.56.83 కోట్లు ఇచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.22 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. మున్సిపాలిటీ వాటా కింద మిగతా మొత్తం రూ.114.67 కోట్లు చెల్లించారు. అప్పుడు చేసిన అప్పులకు ఇప్పటి మున్సిపాలిటీ ఆదాయంతో పాటు 14, 15 ఫైనాన్స్ నిధులూ వడ్డీలకే సరిపోతున్నాయి. అయినా మీరు మూడు దశాబ్దాల్లో చేయలేని పనులు మేము మూడేళ్లలోనే చేసి చూపించాం.’’ అని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్లకు సమాధానం ఇచ్చారు. 1983 నుంచి టీడీపీ నాయకులే హిందూపురం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నా.. కనీసం డ్రైనేజీ కూడా వేయించలేకపోయారని, ఇప్పుడు అధికార పార్టీ ఏం చేసిందో చెప్పాలని అడిగేందుకు టీడీపీ కౌన్సిలర్లకు సిగ్గుండాలన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా హిందూపురం అభివృద్ధికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తొలుత వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, కౌన్సిలర్ శివ మాట్లాడుతూ... సచివాలయాల పరిధిలో జరిగే అభివృద్ధి పనుల విషయాలు వార్డు సభ్యులకూ తెలియజేయాలని కోరారు. అప్పుడే వివిధ సమస్యలతో తమ వద్దకు వచ్చే ప్రజలకు తాము సమాధానం చెప్పగలమన్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న ఓపెన్ షెడ్లు ఎన్ని..?, నిర్మాణ నిబంధనలు, వాటి నుంచి వస్తున్న ఆదాయ వివరాలు సభ్యులకు తెలపాలని కోరారు. అలాగే పన్నుల విషయంలో ప్రజలు అహుడా, మున్సిపాలిటీలకు చెల్లిస్తూ రెండు విధాలుగా నష్టపోతున్నారని, దీనిపై వార్డు అడ్మిన్ సెక్రటరీలతో మీటింగ్ ఏర్పాటు చేసి వార్డుల వారీగా ఏ నిర్మాణాలు అహుడా పరిధిలోకి వస్తాయి...ఏవి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ► కమిషనర్ వెంకటేశ్వరరావు సమాధానమిస్తూ... సచివాలయాల పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, నీటి సమస్యలు..పరిష్కారానికి తీసుకున్న చర్యలతో పాటు ఇతర వివరాలన్నీ సభ్యులకు వివరిస్తామన్నారు. ► అనంతరం కౌన్సిలర్ గిరి మాట్లాడుతూ... తన వార్డులో ఇప్పటికే రూ.2.50 కోట్ల అభివృద్ధి పనులు చేస్తే... కొందరు యాత్రలపేరుతో వార్డులో ఏం జరగలేదని నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారు కనీసం మున్సిపాల్టీకి వచ్చి లెక్కలు చూసి మాట్లాడాలన్నారు. ► కౌన్సిలర్ ఆసీఫుల్లా మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో కొందరు అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, ఇటీవల ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారని కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. పారదర్శకత కోసం మున్సిపాలిటీకి ఒక యాప్ తయారుచేసి అందులో మొత్తం వివరాలు పెడితే, అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఇటీవల విద్యానగర్‌లోని ఒక ఇంటి యజమానికి ప్రాపర్టీ టాక్సు విషయంలో రీవోక్ చేయాలని నోటీస్ పంపారని, అధికారులు మారితే పన్నులు మారతాయా..అని ప్రశ్నించారు. ప్రతినెలా ప్రాపర్టీ ట్యాక్సుల నోటీæసులు ఇచ్చినవాటి వివరాలు కౌన్సిల్‌కు తెలపాలన్నారు. ► పలువురు సభ్యులు మాట్లాడుతూ.. మార్కెట్ వల్ల ఎంజీఎం మైదానం అధ్వానంగా మారుతోందని, వ్యాపారులకు ఇబ్బందులు కలగకూడదంటే వారిని మరోచోటకు పంపి...మైదానాన్ని క్రీడాకారులకు అందుబాటులో ఉంచాలని కమిషనర్‌ను కోరారు. అనంతరం 57 అంశాలతోపాటు టేబుల్ అజెండా అంశాలను తీర్మానిస్తూ ఆమోదం తెలిపారు. టీడీపీ కౌన్సిలర్ల రభస అంతకుముందు ‘పురం’ అభివృద్ధికి మూడేళ్లలో ఏం చేశారో చెప్పాలంటూ టీడీపీ కౌన్సిలర్లు సభలో రభస చేశారు. ఇందుకు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగేంద్రబాబు మాట్లాడుతూ...వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ‘పురం’ దాహార్తి తీర్చడానికి పీఏబీఆర్ పైప్‌లైన్ ఏర్పాటు చేస్తే రాజకీయం చేసి సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. నాసిరకం పైపులని నానా యాగీ చేసిన టీడీపీ వారి హయాంలో చేసిందేమిటో చెప్పాలన్నారు. గత మూడేళ్లుగా అదే పీఏబీఆర్ పైపుల నుంచే తాగునీరు పల్లెలు, ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయని, అవి నాసిరకమైతే ఎందుకు పగలడం లేదో చెప్పాలన్నారు. టీడీపీ నేతలు స్వార్థం, స్వలాభం కోసం ఏపీబీఆర్ నీటి పథకాన్ని నిరీ్వర్యం చేసి, గొల్లపల్లి పైప్‌లైన్ తెరపైకి తెచ్చారన్నారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్లు అభ్యతరం తెలపగా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు దీటైన సమాధానం ఇచ్చారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగి అరుపులతో అడ్డుకోవడానికి ప్రయతి్నంచగా వైస్ చైర్మన్ జబివుల్లా సర్దిచెప్పారు. -
బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు?
-
చంద్రబాబుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఝలక్
-
ఇదేం సినిమా అనుకున్నావా? బాలకృష్ణ రాజీనామా ఇంకెప్పుడు?
హిందూపురం టౌన్(అనంతపురం జిల్లా): హిందూపురం జిల్లా కేంద్రం అంశాన్ని మూడు గంటల సినిమా అనుకున్నావా అంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై రాజకీయ పార్టీల ఐక్యవేదిక నాయకులు మండిపడ్డారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం రాజకీయ పార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు శ్యామ్, శ్రీరాములు, శ్రీనివాసులు, మున్నా, రవి మాట్లాడుతూ 1983 నుంచి ఏకధాటిగా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఇలా నందమూరి వంశాన్నే హిందూపురం ప్రజలు గెలుపిస్తున్నా హిందూపురం ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు మెమో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం హిందూపురం జిల్లా కోసం అవసరమైతే రాజీనామా చేస్తానన్న బాలకృష్ణ ఇంకెప్పుడు చేస్తారని, ఇంకెప్పుడు పోరాడతారని విమర్శించారు. బాలకృష్ణకు సినిమా షూటింగులు తప్ప ఏ మాత్రం హిందూపురం అభివృద్ధి పట్టలేదన్నారు. చుట్టపు చూపుగా తెలంగాణ నుంచి వచ్చి పోయే బాలకృష్ణకు హిందూపురం ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీఆర్, చంద్రబాబులు ఎందుకు హిందూపురాన్ని జిల్లా చేయలేకపోయారో చెప్పాలన్నారు. టీడీపీ పార్టీతో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురానికి ద్రోహం చేసి ప్రజలను మోసగించారని విమర్శించారు. హిందూపురంలోని ప్రభుత్వ జిల్లా కార్యాలయాలను పుట్టపర్తికి తరలిస్తున్నారని, ఈ చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు నాగార్జున, మల్లికార్జున, నారాయణ, నాజీమ్ బాషా, హరికుమార్, కలీం, నూర్ మహమ్మద్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడయ్యా.... బుల్ బుల్ బాలయ్యా ?
-
మరోసారి అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య
సాక్షి, హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ ఎప్పుడు ఎలా ఉంటాడోనని అభిమానులు, నాయకులు బెంబేలెత్తుతున్నారు. ఆయన పక్కన నిల్చోవాలన్నా వణికిపోతున్నారు. ఇప్పటికే ఆయన చేతిదెబ్బ రుచి చూసిన, బూతులు తిట్టించుకున్న వాళ్లు కోకొల్లలు. తాజాగా ఓ అభిమాన ఫొటోగ్రాఫర్ ఉత్సాహంతో ఫొటో తీయడంతో బాలయ్య అతని చెంప ఛెళ్లుమనిపించాడు. ఈ ఘటన శనివారం హిందూపురంలోని 9వ వార్డు లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణ అభ్యర్థి ఇంట్లోకి వెళ్లగా.. స్థానికులు ఫొటోలు తీసుకుంటున్నారు. ఎండ వేడిమికి తోడు, ప్రచారంలో జనం కూడా పెద్దగా లేకపోవడంతో చిర్రెత్తిన బాలయ్య.. ఓ అభిమాని ఫొటో క్లిక్‌మనిపించడంతో సహనం కోల్పోయాడు. ఫొటోలు తీయవద్దు అన్నానా.. అంటూ చెంప మీద కొట్టారు. అభ్యర్థి కుటుంబసభ్యులు అందరినీ బయటకు పంపుతుండగా.. ‘ఏయ్ ఫొటో ఎరేజ్ చెయ్..’అంటూ మరోసారి అతనిపై చేయి చేసుకున్నాడు. ఎన్నికల సమయంలో వ్యతిరేకత వస్తుందని గ్రహించిన టీడీపీ నేతలు అతడిని సముదాయించి తిరిగి బాలకృష్ణతో ఫొటో తీయించి పంపడం కొసమెరుపు. చదవండి: కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య -
కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు
హిందూపురం(అనంతపురం జిల్లా): ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారానికి స్పందన కరువైంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులుగా ఆయన హిందూపురంలోనే మకాం వేసి వీధుల వెంట తిరిగి ప్రచారం చేస్తున్నా జనం కన్నెత్తి చూడటం లేదు. శుక్రవారం బాలకృష్ణ పలు వీధుల్లో ప్రచార రథం ఎక్కి కలియతిరిగినా జనం లేకపోవడంతో రూట్‌మ్యాప్ సరిగా లేదని స్థానిక నేతలపై చిర్రుబుర్రులాడారు. బాలయ్య మానసిక స్థితి తెలిసిన సీనియర్ నాయకులు మనకెందుకులే అన్నట్లు దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. చదవండి: ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య చంద్రబాబుకు భారీ షాక్.. గో బ్యాక్ అంటూ నిరసన -
ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య
-
ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య
హిందూపురం: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ సారి టీడీపీ నాయకులపైనే తన దుడుకుతనాన్ని ప్రదర్శించారు. గురువారం సుగూరు ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా... ఆయన హావభావాలు చూసిన టీడీపీ నేతలతో పాటు ప్రజలు ఫక్కున నవ్వారు. దీనిపై బాలయ్య సీరియస్ అయ్యారు. బాలయ్య ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘యువత చెడిపోతున్నారు. చాలా పొద్దెక్కే వరకు పడుకోవడం.. రాత్రయితే బండ్లేసుకుని అదో రకంగా రోడ్లలో స్ట్రీట్ లైట్లు చూసుకుంటూ.. ఆ.. చుక్కలు లెక్కెడుతూ.. వీళ్లలా పోవడం ఏదో ఢీ కొట్టడం.. (ఈ సమయంలో ఆకాశంలో చూస్తూ చేతులు గాలిలో ఊపుతూ ఊగుతూ మాట్లాడడం చూసిన హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి, స్థానిక నేతలు, ప్రజలు ఫక్కున నవ్వారు). ఏయ్.. నవ్వకండి.. (బీకే పార్థసారథి వైపు వేలు చూపిస్తూ) ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్(సీరియస్ అంటూ టీడీసీ నేతలు కోరస్ పలికారు). నాకు తెలుసు.. చాలా మంది అలా తయారవుతున్నారు. సో.. జాగ్రత్తగా ఉండు(వేలు చూపిస్తూ) మనుషులు... మనుషులుగా చూస్తే.. లేదా విప్లవమే. నేనూ చాలా చదివాను. రిమ్యాగ్జన్స్, ఫ్రెంచ్ రెవల్యూషన్స్.. ఆ... ఇవన్నీ కూడా. అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. ఏం జరిగిందో అప్పుడు రొట్టె చేతిలో పట్టుకుని వెళ్లి.. ప్యాలెస్.. హూ ఇజ్ ద సిక్సిటిన్త్.. ఆ... మహరాజునే బయటకు లాక్కొచ్చి.. తీసుకొచ్చి.. (తల నిలువుగా ఆడిస్తూ.. ) జాగ్రత్తగా ఉండండి. ఆ పరిస్థితి తీసుకురావద్దు. హెచ్చరిస్తున్నా.’’ చదవండి: ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు బిగుస్తోన్న ఉచ్చు -
ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. బాలకృష్ణ చేపట్టిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనం లేక రోడ్ షో వెలవెలబోయింది. రోడ్ షోలకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో బాలయ్య అసహనానికి గురయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘోర పరాభవం ఎదురైంది. హిందూపురం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: మున్సిపాలిటీల్లోనూ పంచాయతీ ఫలితాలే.. టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు ఎదురుదెబ్బ -
ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘోర పరాభవం ఎదురైంది. హిందూపురం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించారు. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధికి షాక్ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో టీడీపీ ఓటమి పాలైంది. బీకే పార్థసారధి సొంత వార్డు మరువపల్లిలోనూ టీడీపీకి పరాభవం ఎదురైంది. పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయకేతనం ఎగరవేశారు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు చేదు అనుభవం ఎదురైంది. నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టీడీపీ ఓటమి చెందింది. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు పరాభవం ఎదురైంది. సొంత పంచాయతీ మద్దనకుంటలో టీడీపీ ఓటమి పాలైంది. చదవండి: పులివెందుల ‘పంచ్’ అదిరింది మాజీ మంత్రి ‘బండారు’కు ఘోర పరాభవం -
బాలయ్యా.. రోగుల గోడు వినవయ్యా !
సాక్షి, హిందూపురం: ‘ప్రభుత్వాస్పత్రిని కార్పొరేట్ స్థాయిగా తీర్చిదిద్దుతాం. ఆస్పత్రిలో సకల సౌకర్యాలు కల్పిస్తాం. వైద్యులను పూర్తిస్థాయిలో నియమించడం ద్వారా రోగులకు సకాలంలో సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం.’ ఇదీ ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా ఇచ్చిన హామీ. అయితే ఆస్పత్రి ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా సౌకర్యాల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక ఆస్పత్రి స్థాయి పెరిగినా అందుకు అనుగుణంగా వైద్య సిబ్బందిని నియమించలేదు. దీంతో రోగులు అసౌకర్యాల నడుమ అరొకర సేవలతో అల్లాడాల్సిన దుస్థితి నెలకొంది. దీనిపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఏరోజూ అసెంబ్లీలో తన వాణిని వినిపించిన దాఖలాలు లేవు. రెండోసారి ఎమ్మెల్యే అయినా ప్రభుత్వాస్పత్రి సమస్య గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ అయినా ప్రభుత్వాసుపత్రిలో ఇంకా పూర్తి స్థాయిలో వైద్యులు లేరు. వాస్తవంగా 250 పడకల ఆసుపత్రికి 146 వైద్యులు ఉండాలి. ప్రస్తుతం 31 మంది రెగ్యులర్ వైద్యులకు గాను కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. స్టాఫ్ నర్సులు 48 పోస్టులకు 9 మంది రెగ్యులర్‌గా ఉంటే 39 మంది కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్నారు. హెడ్‌నర్సులు 8 మందికిగాను నలుగురు మాత్రమే ఉన్నారు. ఇక ఆసుపత్రి వైద్య సేవల్లో కీలకంగా వ్యవహరించే క్లాస్ ఫ్లోర్ సిబ్బంది ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు 15 కావాల్సి ఉండగా ముగ్గురు రెగ్యులర్, ముగ్గురు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. రోగులతో ప్రభుత్వాస్పత్రి కిటకిట ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలతో అధికంగా ఆసుపత్రికి తరలివస్తున్నారు. వైరల్ ఫీవర్స్, డెంగీ లక్షణాలతో రోజూ వందల సంఖ్యలో చిన్నారులూ చికిత్స పొందుతున్నారు. దీంతో జనరల్ వార్డుల్లో మంచాలు దొరకని పరిస్థితి నెలకొంది. కొందరు మంచాలు లేక నెలపైనే పడుకుని చికిత్స చేయించుకుంటున్నారు. ఆస్పత్రిలో స్థలంలో లేక రోగులతోపాటు వారి వెంటవచ్చిన పర్యవేక్షులు వరండాల్లో పడుకుంటున్నారు. ఆసుపత్రి ఉదయం, సాయంత్రం రోగులతో కిక్కిరిసిపోతోంది. ఇక ఆస్పత్రిలో సౌకర్యాలు కొరవడడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. కిటకిటలాడుతున్న ప్రయివేట్ ఆసుపత్రులు.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం మంచాలు కూడా దొరకని పరిస్థితి నెలకోనడంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో ప్రయివేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రయివేట్ ఆసుపత్రులు కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. రూ.వందలు ఇచ్చి టోకన్లు చేతపట్టుకుని ఆసుపత్రుల బయట రోగులు గంటల తరబడి వేచి ఉంటున్నారు. చిన్నపాటి జర్వానికైనా ప్రయివేట్ వైద్యులు రక్త, మూత్ర పరీక్షలు దీనికి తోడు రూ.వందల మందులు, సిరప్లు ఇచ్చి ప్రజలు దోచుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. జ్వరమొచ్చిందా రూ.వేయి ఖర్చు కావాల్సిందనే పరిస్థితి నెలకొన్నట్లు రోగులు వాపోతున్నారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి : హిందూపురం రోజు వారీ ఓపీ సంఖ్య :1200 ఇన్‌పేషెంట్స్ : 300 పడకలు : 250 మంచం లేదన్నారు రాత్రి నుంచి కడుపునొప్పితో అల్లాడిపోయాను. ఉదయానే ఆసుపత్రికి వస్తే డాక్టర్ వచ్చే వరకూ వేచి ఉండాలన్నారు. డాక్టర్ వచ్చి పరీక్షలు చేసి ఆడ్మిట్ కావాలని రాసి ఇచ్చారు. కేస్ షీట్ ఇచ్చిన అడ్మిషన్ చేర్చుకోవాలంటే మంచాలు లేవు కిందపడుకోవాలన్నారు. ఇప్పటికే కడుపునొప్పి తట్టుకోలేకపోతున్నా. కిందపడుకుంటే భరించలేనని ప్రయివేట్ ఆసుపత్రికి వెళ్లడానికి బయటకు వచ్చేశాను. – రామకృష్ణ, చీపులేటి ఆసుపత్రిలో సరైన వైద్యం లేదు జ్వరం, వాంతులతో ఆసుపత్రిలో చేరాను. రెండురోజులైంది. వాం తులు తగ్గాయి. జ్వరం ఇంకా పూర్తిగా తగ్గలేదు. మంచంపై పరుచుకోడానికి దుప్పట్లు కాని బెడ్షీట్లు కానీ లేవు. ఆసుపత్రిలో సిబ్బంది తక్కువగా ఉండటంతో ఉన్న వారు రోగులపై చిర్రుబుర్రులాడుతున్నారు. –మమత, పరిగి సీజనల్ వ్యాధులు ప్రబలడంతో సమస్య సీజనల్ వ్యాధులు అధికం అవుతుండటంతో మంచాల కొరత వస్తోంది. సాధారణ సమయంలో ఈ సమస్య ఉండదు. అయినా వచ్చిన వారికి వైద్యం అందిస్తున్నాం. వైద్యసిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం. వైద్యచికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదు. – డాక్టర్ కేశవులు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ -
అభివృద్ధికి పాటుపడింది టీడీపీయే
సాక్షిప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ ప్రాంత అభివృద్ధికి పాటుపడింది తెలుగుదేశం పార్టీయేనని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బాలకృష్ణ విస్తృతంగా పర్యటించి ఒకవైపు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించడం.. మరోవైపు తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన మధిర మండలం రాయపట్నంకు చేరుకున్న బాలకృష్ణ రాత్రి వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూనే ఉన్నారు. దెందుకూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన బాలకృష్ణ ఈ సందర్భంగా జరిగిన సభలో ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల అండతోనే టీడీపీ ఆవిర్భవించిందని, అదే తోడ్పాటుతో ఇంతింతై ఈ స్థాయికి ఎదిగిందన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న లక్ష్యంతోనే ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రూ.2కు కిలోబియ్యం పథకాన్ని అమలు చేసి.. ప్రతి ఇంటికి ఆత్మీయుడిగా మారారని గుర్తు చేశారు. పేదల సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగించే శక్తి, ప్రజలపై మమకారం కేవలం టీడీపీకే ఉందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను, తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నాటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, పేదలకు ఇళ్ల నిర్మాణంతోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు వారి హయాంలోనే పేదల చెంతకు చేరాయన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పేర్కొన్న బాలకృష్ణ.. తెలంగాణలోని ప్రతి గ్రామం టీడీపీకి ఆత్మీయ గ్రామమని, అందరి అండదండలు తమకుంటాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో కలిసి మహాకూటమి రాష్ట్రంలో ఏర్పడిన తరుణంలో బాలకృష్ణ జిల్లా పర్యటనలో కాంగ్రెస్ కార్యకర్తలు సైతం సందడి చేశారు. మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క అనుచరులు బాలకృష్ణ పర్యటనలో కాంగ్రెస్ జెండాలతో సహా పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో జరిగిన ప్రదర్శనల్లోనూ కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు కలిసి పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కల్పించింది. మధిరలో జరిగిన బాలకృష్ణ పర్యటనలో మధిర కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య కాంగ్రెస్ కార్యకర్తలతో సహా వెళ్లి పాల్గొన్నారు. బాలకృష్ణ పర్యటన అనుకున్న సమయానికన్నా చాలా ఆలస్యంగా కొనసాగింది. మధిర మండలం దెందుకూరు నుంచి ప్రారంభమైన బాలకృష్ణ పర్యటన మధిర, నారాయణపురం, ఆళ్లపాడు, సోమవరం, గొల్లపూడి తదితర ప్రాంతాల మీదుగా వైరాకు చేరుకుంది. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించి.. ప్రసంగించారు. వైరా నుంచి తల్లాడ మీదుగా మధ్యాహ్నం భోజనం కోసం మిట్టపల్లిలో ఆగిన బాలకృష్ణ టీడీపీ నేత రాయల శేషగిరిరావు నివాసంలో భోజనం చేశారు. అక్కడి నుంచి సత్తుపల్లి సభకు బయలుదేరుతున్న సమయంలో తనను చూడటం కోసం కాన్వాయ్‌ని ఆపడానికి ప్రయత్నించిన అభిమానులను కాలుతో తన్నడంతో అభిమానులు ఆగ్రహం చెంది.. పార్టీకి చెందిన ఫ్లెక్సీలు, బాలకృష్ణ ఫ్లెక్సీలను దహనం చేశారు. అనంతరం బాలకృష్ణ కల్లూరు, పెనుబల్లి, మండాలపాడు, లంకపల్లి మీదుగా సత్తుపల్లి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. టీడీపీ ప్రజల పార్టీ అని, వెంకటవీరయ్యను గెలిపించడం ద్వారా టీడీపీ ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటవీరయ్య ప్రజాసేవలో అందరివాడు అనిపించుకున్నారని ప్రశంసించారు. సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, వాసిరెడ్డి రామనాథం తదితరులు పాల్గొన్నారు. -
బాలకృష్ణ ఇంటి ముందు మహిళల నిరసన
-
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్- బాలకృష్ణ
-
నేతల చేతివాటం.. పట్టించుకోని బాలయ్య!
సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో టీడీపీ నేతల అగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్నామని ఇష్టా రీతిగా ప్రవర్తిస్తున్నారు. జిల్లాలోని చిలమత్తూరు మండలం టేకులోడు ఐటీ సెజ్‌లో టీడీపీ నేతలు చేతివాటం ప్రదర్శించారు. తమ ఎమ్మెల్యేకు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని బాధితులు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసి తమకు జరిగిన అన్యాయం చెప్పుకున్నారు. ఐనా లాభం లేకుండా పోయింది. ఆ విషయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ పట్టించుకోలేదని తెలుస్తోంది. వివరాలివి.. రైతు వెంకటప్ప దంపతులు మరణించటంతో పరిహారం సొమ్మును టీడీపీ నేతలు డ్రా చేసుకున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి రూ. 30 లక్షల పరిహారాన్ని టీడీపీ నేత రంగారెడ్డి స్వాహా చేశాడు. టీడీపీ నేతలతో రెవెన్యూ, పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారు. ఈ విషయంపై మృతుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బాలకృష్ణకు చెప్పి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కానీ, బాలకృష్ణ దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. -
ఆలకించయ్యా.. బాలయ్య
చిలమత్తూరు : మండలంలో సాగిన ఎమ్మెల్యే బాలకృష్ణ రెండో రోజు పర్యటనలో కూడా ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. మొరంపల్లి, కో డూరు, శెట్టిపల్లి, మరవకొత్తపల్లి, వీరాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. పింఛన్ రాలేద ని, కొందరు, రేషన్ సక్రమంగా అందలేదని కొందరు, ఇంటి స్థలాలు మంజూరు కాలేదని కొందరు ఇలాసమస్యలను పరిష్కారించాలంటూ వందలాది మంది ప్రజలు వినతులు అందజేశారు. ఆశా కార్యకర్తలకు న్యాయం చేయాలి : ప్రభుత్వాసుపత్రిలో, ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలో పనిచే సే ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కార్యకర్తలు బాలకృష్ణ వద్ద శెట్టిపల్లిలో మొరపెట్టుకున్నారు. సరైన గౌరవ వేతనం లేక నానా ఇబ్బందులు పడుతున్నామని వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. యువకులకు ఉద్యోగాలు కల్పించాలి యువకులకు ఉద్యోగాలు కల్పించాలంటూ నిరుద్యోగ యువత కోరారు. కియో పరిశ్రమం ఏర్పాటు జ రుగుతోందని అధికారులు, ప్రజాప్రతినిధులు తె లియజేస్తున్నారని స్థానికులకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. శెట్టిపల్లి ఎస్సీ కాలనీ వా సులకు గత కొన్ని నెలలుగా నీటి సమస్యతో పాటు ఇంటి పట్టాలు, నిర్మాణాల సమస్య ఉందని వాటిని పరిష్కరించాలన్నారు. కోడూరు పంచాయతీ లోని కనిశెట్టిపల్లిలో చౌకధాన్యపు డిపో సమస్యలను డీలర్ స్వయంగా బాలకృష్ణకు వివరించారు. అనంతరం వీరాపురంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. స్పెషల్ పార్టీ పోలీసుల అత్యుత్సాహం ఎమ్మెల్యే బాలకృష్ణకు సెక్యురిటీగా వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శించారు. అర్జీలు ఇచ్చుకోవడం కోసం వెళ్లిన ప్రజలను అడ్డుకున్నారు. సెక్యూరిటీ సమస్యలు వస్తాయనే సాకుతో చాలామంది ప్రజలు నేరుగా సమస్యలను తెలియజేసే అవకాశం ఇవ్వలేదు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అధికారులతో పాటు, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఎక్స్ట్రా చేస్తే తాట తీస్తా: బాలకృష్ణ
‘‘సార్.. మేము దళితులం. మీకు పూలదండ వేసేందుకు కూడా పనికిరామా.. వచ్చిన ప్రతిసారీ మమ్మల్ని పక్కకు లాగేస్తున్నారు. ఏళ్లుగా పార్టీ జెండా మోసినందుకు మాకిచ్చే గౌరవం ఇదేనా.’’ ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నాం. పనులు మాత్రం పర్సెంటేజీలు ఇచ్చిన వారికే కట్టబెడుతున్నారు. ఇదేం న్యాయం. మనోడైనా.. ప్రశ్నిస్తే పగోడే! అసలే బాలయ్య. కోపమొస్తే ఎవరి చెంప చెల్లుమంటుందో తెలియదు. రాకరాక ఊరికొస్తే.. ఆయనను ప్రశ్నిస్తే ఇంకేమైనా ఉందా! తనకు అంతా తెలుసనీ, ఎక్స్ట్రా చేస్తే తాట తీస్తానని తనదైన శైలిలో సినిమా డైలాగ్ చెప్పేశారు. సాక్షి, హిందూపురం అర్బన్: చుట్టపుచూపుగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయే ఎమ్మెల్యే బాలకృష్ణ... నాలుగేళ్ల తర్వాత... క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవాలని భావించారు. ఈక్రమంలోనే గురువారం ఆయన స్థానిక సాయిరాం ఫంక్షన్ హాలులో చిలమత్తూరు మండలంలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం కాగా కార్యకర్తలు, నేతలు బాహాబాహీకి దిగడంతో బాలయ్య దిమ్మదిరిగింది. బయటపడ్డ విభేదాలు చిలమత్తూరు మండలంలోని పంచాయతీల వారీగా సమస్యలపై చర్చిస్తుండగా నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కోడూరు పంచాయతీ గురించి ప్రస్తావన రాగానే.. నాయకుల మధ్య విభేదాలతో పార్టీ నాశనం అయిపోతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేశారు. పనులన్నీ పర్సంటేజిలు ఇచ్చినవారికే ఇచ్చుకుంటున్నారనీ.. కార్యకర్తలకు న్యాయం చేయడంలేదన్నారు. పాపన్న అన్నింటికీ అడ్డుపడుతూ వర్గాలు సృష్టిస్తున్నాడని ముద్దçపల్లి వెంకటసుబ్బయ్య ఆరోపించారు. దీంతో పాపన్న స్పందిస్తూ... పార్టీ అభివృద్ధికోసం పనిచేస్తున్న తనపై ఆరోపణలు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే ఇరువురూ వాగ్వాదానికి దిగారు. వారికి బాలకృష్ణ పీఏ వీరయ్య, శివప్పలు నచ్చచెప్పి కుర్చోబెట్టారు. ఇంతలో మరో కార్యకర్త స్పందిస్తూ..నేతలుæకార్యకర్తల రక్తం తాగుతున్నారనీ, కనీసం విలువ కూడా ఇవ్వడం లేదన్నారు. దళితులంటే చులకన అనంతరం గంగాధర్ అనే కార్యకర్త మాట్లాడుతూ, దళితులందరూ పార్టీ అభివృద్ధికి పనిచేస్తూ ప్రతిసారి గెలిపించుకుంటూ వస్తున్నామన్నారు. అయితే తమకు గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు. కనీసం మీకు పూలదండ వేయడానికి వచ్చినా పక్కకు లాగేస్తున్నారని బాలకృష్ణ ఎదుట వాపోయారు. ఎస్సీ కాలనీలో అనేక సమస్యలున్నా.. తీర్చేవారు లేరన్నారు. అనంతరం పాతసామర్లపల్లికి చెందిన మంజు మాట్లాడుతూ, చాలాకాలంగా తాను స్టోరు డీలరుగా ఉన్నాననీ, అయితే జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ తన స్టోరుపై అధికారులతో దాడిచేయించి స్టోరును లాగేసుకున్నాడన్నారు. ఇక అధికారులే తనపై లేనిపోనివి చెప్పి జనంతో ధర్నాలు చేయిస్తున్నారని చిలమత్తూరు సర్పంచ్ శ్రీకళ వాపోయారు. వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు కూడా ఇలా చేయలేదనీ, టీడీపీలోకి వచ్చాక ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఎక్స్ట్రా చేస్తే తాటతీస్తా... అన్నీ విన్న ఎమ్మెల్యే బాలకృష్ణ... ఏ పంచాయతీలో ఏం జరుగుతుందో అన్నీ తనకు తెలుసనీ...ఎక్స్ట్రా చేస్తే తాట తీస్తా నంటూ అక్కడున్న వారందరినీ హెచ్చరించారు. 20తేదీ నుంచి పంచాయతీల్లో పర్యటిస్తాననీ...అన్నీ చూచి ఒక్కొక్కరికి ఏంచేయాలో అది చేస్తానన్నారు. సమావేశంలో టీడీపీ ఎంపీపీ నౌజియాభాను, జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణ, సర్పంచి శ్రీకళ, టీడీపీ బీసీసెల్ జిల్లా అ«ధ్యక్షుడు శివప్ప, మండల కన్వీనర్ బాబురెడ్డి పాల్గొన్నారు. రోడ్డులేదని చెప్పడానికొస్తే ఈడ్చిపడేశారు చిలమత్తూరు మండలం మరుసనపల్లి పంచాయతీ ఎస్.ముద్దిరెడ్డిపల్లి గ్రామంలో రోడ్డు లేదు. వర్షం వస్తే మట్టిరోడ్డు బురదమయం అవుతోంది. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్దామని ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టా. బాలయ్య వచ్చాడు కదా అని చెప్పేందుకు వెళ్తే చుట్టూ చేరిన వారి మాటలు విని నాకు వ్యతిరేకంగా పోస్టులు పెడతావా అంటూ నానా దుర్భాషలాడాడు. బయటికిపో అంటూ గద్దించాడు. పోలీసులు బలవంతంగా బయటకు ఈడ్చేశారు. – బత్తుల బాలాజి, ముద్దిరెడ్డిపల్లి టీడీపీ కార్యకర్త -
మరోసారి వివాదాస్పదమైన ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వాకం
-
ఎన్టీఆర్ పేరు చెడగొట్టను: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : సరైన అవగాహన కల్పిస్తే క్యాన్సర్‌ను జయించవచ్చని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పటల్లో ఏర్పాటు చేసిన అడ్వాన్సు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్‌ను ఆయన గురువారం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బసవతారకం హాస్పటల్ ఆవరణలో నైట్ షెల్టర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ‘క్యాన్సర్ అవగాహన కల్పించేందుకు బాలకృష్ణకన్నా పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఎవరూ లేరు. నేను ఆయన అభిమానిని. ఎన్టీఆర్ పేరు నిలబెడతా, ఆయన పేరును చెడగొట్టే పనులు ఎప్పటికీ చెయ్యను’ అని కేటీఆర్ పేర్కొన్నారు. (ఎన్టీఆర్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎనలేని అభిమానం. ఆయనపై ఉన్న అభిమానంతోనే తన కుమారుడు కేటీఆర్‌కు తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు). బసవతారకం ఆస్పత్రి అందిస్తున్న సేవల గురించి తన తల్లి ఎప్పుడూ చెబుతుండేవారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, అవసరం అయినవారు దీన్ని ఉపయోగించుకోవాలని కేటీఆర్ సూచించారు. కార్యక్రమంలోని ఓ దృశ్యం ఆస్తి పన్ను రద్దు సంతోషకరం.. బసవతారకం ట్రస్ట్‌కు రూ.6కోట్ల ఆస్తిపన్నును జీహెచ్ఎంసీ రద్దు చేయడం సంతోషకరమని హాస్పటల్ చైర్మన్ బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో క్యాన్సర్ హాస్పటల్ గురించి కూడా ఉంటుందని తెలిపారు. నాన్నగారి పేరునే కేటీఆర్‌కు పెట్టారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా అన్ని ట్రస్ట్‌లకు ఆస్తిపన్ను మినహాయింపు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. -
బాలకృష్ణపై సుమోటో కేసు నమోదు చేయాలి
అనంతపురం కల్చరల్ : ప్రధాని న రేంద్రమోదీని నీచమైన భాషతో తిట్టిపోసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సుమోటో కేసు నమో దు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక టవర్‌క్లాక్ వద్ద బా లకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయ న దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అంకాళ్ రెడ్డి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వేంకటేశ్వరరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు లలిత్‌కుమార్, నగర అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యల వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలుగుతుందని, సాక్షాత్తు ప్రధానిపై చౌకబారు మాట లు మాట్లాడి నవతరానికి ఏం సందే శం ఇవ్వదలచుకున్నారని వారు ప్ర శ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వ తం కాదని వ్యక్తిగత విమర్శలు మా నుకోవాలని సూచించారు. హంగులు, ఆర్భాటాలతో ప్రజాధనాన్ని వృథా చేసే దొంగ దీక్షలను సీఎం చంద్రబాబు మానుకోవాలని హిత వు పలికారు. -
సీఎం దీక్షలో ఎలాంటి బూతులు మాట్లడలేదు
-
బాలకృష్ణపై ఫైర్.. వ్యక్తిగత వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు తప్పుబట్టారు. గతంలోనూ బాలకృష్ణ అదుపుతప్పి మాట్లాడారని గుర్తుచేశారు. బాలకృష్ణ ప్రధానిని విమర్శిస్తుంటే సీఎం ముసిముసి నవ్వులు నవ్వారని విమర్శించారు. చంద్రబాబు ఒకరోజు దీక్ష వల్ల ఏపీలో పాలన స్తంభించిపోయిందని అన్నారు. చంద్రబాబు అట్టహాసంగా దీక్ష చేశారని, దీక్ష వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవడమే కాకుండా రాష్ట్ర ఖజానాకు రూ. 200 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. టీడీపీని వ్యతిరేకించే వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ తాజాగా చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నా దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దగ్గర సరైన కార్యాచరణ లేదని విమర్శించారు. బాలకృష్ణ ఉండాల్సింది అసెంబ్లీలో కాదు.. తిరుపతి: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారు. బాలకృష్ణ పెద్ద తాగుబోతు అని, బాలకృష్ణ ఉండవలసింది అసెంబ్లీలో కాదు ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణపై తిరుపతి అర్బన్ ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు. -
ప్రధానికి బాలకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే కేసులు
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు)/నెల్లూరు(బారకాసు)/ సాక్షి, అమరావతి: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాటలకు ఆయన తండ్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తుందని శాసనసభలో బీజేపీ సభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పకపోతే, కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి సీఎం చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. బాలకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే బాలకృష్ణపై మహిళల ఆగ్రహం
సాక్షి, అనంతపురం : హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యవహార శైలిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేకు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన డ్వాక్రా మహిళలకు నిరాశే మిగిలింది. ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం వారిని చూసీ కూడా చూడనట్లుగా కారులో వెళ్లిపోయారు. అంతేకాకుండా వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన ప్రజల పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించి పక్కకు నెట్టేశారు. దీంతో బాలకృష్ణతో పాటు పోలీసులు తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సమస్యలు వినేందుకు కూడా ఎమ్మెల్యేకు తీరిక లేదా అని ప్రశ్నిస్తున్నారు. -
లేపాక్షిలో భారీ వర్షం..
సాక్షి, లేపాక్షి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హిందూపూర్ ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న లేపాక్షి ఉత్సవాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఉదయం నుంచి ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులు, వర్షం బీభత్సం సృష్టిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేపాక్షి ఉత్సవాలను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇంతలోనే లేపాక్షిలో వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. ఆకాశం నిండా మేఘాలు కమ్ముకొని భీకరంగా మారిపోయింది. దీంతో భారీ ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తోంది. దీంతో నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది. అయితే వర్షం తగ్గుముఖం పడితే ఆలస్యంగానైనా ఉత్సవాలను ప్రారంభించే అవకాశం ఉంది. -
బావను మించిన బాలయ్య
హిందూపురం అర్బన్ : హడావుడి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు మారుపేరుగా నిలిచిన చంద్రబాబును హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మించిపోయారు. కృష్ణా జలాలతో చెరువులన్నీ నింపి లేపాక్షి ఉత్సవాల్లో జలహారతిని ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన బాలయ్య.. తన మాట నిలబెట్టుకునేందుకు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. ఎందుకంటే హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు ఇంకా లేపాక్షికి చేరకపోవడమే ఇందుకు కారణం. దీంతో పరువు కాపాడుకునే ప్రయత్నాలకు కొత్త మార్గాలు అన్వేశించారు. సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చే ఘాట్‌ను ఆ పక్కనే ఉన్న చెరువులో నిల్వ ఉన్న వర్షం నీటితో నింపే ప్రయత్నం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన వారు ‘ఔరా! బాలయ్య.. మోసాల్లో బావను మించి పోయావయ్యా’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. -
దేశం మాకు ఏం ఇచ్చిందని అడిగే ముందు..
హిందూపురం అర్బన్: డిగ్రీలు చేతపట్టి పొట్టకూటి కోసం కాళ్లరిగేలా ఉద్యోగాల కోసం తిరుగుతున్న నేటి యువతరానికి ఉద్యోగ కల్పనే తమ ధ్యేయమని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్‌డీజిఎస్ కళాశాలలో ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాజాబ్‌మేళాను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దేశం మాకు ఏం ఇచ్చిందని అడిగే ముందు దేశానికి తామేమి చేశామని యువత ప్రశ్నించుకోవాలన్నారు. విదేశాల్లో సైతం అన్నిరంగాల్లో రాణిస్తున్న తెలుగువారిని స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలన్నారు. అలాగే ఏపీఎస్ఎస్డీసీ సీఇవో సాంబశివరావు మాట్లాడుతూ జాబ్‌మేళాలో 80 కంపెనీలు, ఐదు ప్లేస్మెంట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని, రెండురోజుల పాటు ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. -
బాలయ్య హామీ.. ఎండమావి!
హిందూపురం అర్బన్: పట్టణ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు రూ.194కోట్ల కేంద్ర నిధులతో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైప్‌లైన్ నిర్మాణానికి గత ఏడాది డిసెంబర్లో ఎమ్మెల్యే బాలకృష్ణ భూమి పూజ చేశారు. ఆ సందర్భంగా కొట్నూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసి వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వెనువెంటనే టీడీపీ నాయకులు బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తారు. గొల్లపల్లి నుంచి నీటిని తీసుకొస్తున్న అపర భగీరథుడనే ప్రచారం చేశారు. ఇదంతా మాటలకే పరిమితం అనే విషయం ప్రజలు తెలుసుకునేందుకు ఎంతో కాలం పట్టలేదు. రోడ్డు పక్కన ఎక్కడపడితే అక్క ఉండిపోయిన పైపులను చూస్తే ఈ ఏడాది పనులు పూర్తయ్యే పరిస్థితి లేదని అర్థమైపోయింది. పెనుకొండ హైవే పక్కన దాదాపు 60 కిలోమీటర్ల పొడవున చేపట్టాల్సిన పైపులైన్ పనులు ఇప్పటికీ 20 కిలోమీటర్లు దాటని పరిస్థితి. రాచేపల్లి, చకర్లపల్లి, సోమిందపల్లి వద్ద పనులు కొనసాగుతున్నాయి. పునాదులు కూడా పూర్తికాని ఫిల్టర్‌బెడ్, పంపింగ్ స్టేషన్ పనులు ప్రాజెక్టుకు అతి ముఖ్యమైన నీటి ఫిల్టర్, పంపింగ్ స్టేషన్ పనులు ప్రారంభ దశలోనే ఉండిపోయాయి. కొట్నూరు వద్ద 3.5 ఎకరాల్లో ఈ ఫిల్టర్ పాయింట్ పనులు చేస్తున్నారు. పంపింగ్‌స్టేషన్, ఫిల్టర్పాయింట్స్ ప్రసుత్తం డిజైన్ దశలోనే ఉన్నాయి. కేవలం ఫిల్టర్ బెడ్ నిర్మాణానికి ఇనుప కడ్డీలు ఏర్పాటు చేయగా.. వాటర్ వెల్, పక్కనే పిల్లర్ పాయింట్, నీటి అవుట్ పైప్‌లైన్ నిర్మాణాలు ఇప్పటికీ ప్రారంభం కాని పరిస్థితి. 2017 అక్టోబర్‌లోనే పనులు ప్రారంభించారు. ఐదు నెలలుగా పైప్లైన్ల ఏర్పాటు పనులు సాగుతున్నాయి. హైవే, రైల్వే క్రాసింగ్ అడ్డంకులు పెనుకొండ శివారులోని రైల్వే క్రాసింగ్.. చకర్లపల్లి, మలుగూరు రైల్వే క్రాసింగ్‌లు పైపులైన్ల ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన అనుమతుల వ్యవహారం రైల్వే అధికారుల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వెంకటాపురం వద్ద ఆటవీ ప్రాంతంలోనూ పైప్‌లైన్ పనులు చేపట్టాడానికి భూములు సేకరించాల్సి ఉంది. ఇకపోతే ఈ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు కూడా మంజూరు కాకపోవడం గమనార్హం. ఇటీవల అమృత్ పథకం కింద రూ.5కోట్లు మంజూరైతే మున్సిపల్ అధికారులు ఈ ప్రాజెక్టుకు మళ్లించారు. పూర్తిస్థాయిలో నిధులు మంజూరు కాకపోవడం కూడా పనులు మందకొడిగా సాగేందుకు కారణమవుతోంది. వేసవిలో చుక్కలు చూడాల్సిందే.. పట్టణంలో 1.62 లక్షల జనాభాకు ప్రతిరోజు సుమారు 10ఎంఎల్డీ నీరు అవసరం అవుతోంది. మున్సిపాల్టీకి ప్రధాన నీటి సరఫరా పథకంమైనా పీఏబీఆర్ నుంచి ఇప్పటి వరకు రోజుకు సగటున 3.5 ఎంఎల్డీ మించి నీరు సరఫరా కావడం లేదు. మున్సిపాల్టీ పరిధిలోని 150 బోర్లు ఉండగా.. ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు 2 ఎంఎల్డీ నీరు అందిస్తున్నారు. ఇందులో కూడా ఇప్పటికే దాదాపు 20 బోర్లు ఎండిపోయి నీటిలభ్యత తగ్గిపోయింది. కుళాయిలకు 10 నుంచి 15 రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. పనుల్లో వేగం పెంచుతాం : ప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఈఈపైపులైన్ పనులను కొనసాగుతున్నాయి. కేంద్రం నిధులు విడతల వారీగా మంజూరవుతాయి. ఈ వేసవి లోపు పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. అయితే పనుల్లో వేగం పెంచేందుకు చర్యలు చేపడతాం. నీళ్లు ఎలా తెస్తారు గొల్లపల్లి రిజర్వాయర్‌కే పూర్తిస్థాయిలో అధికారంగా నీటి కేటాయింపులు లేవు. బ్యాక్‌వాటర్ వస్తే హంద్రీనీవా నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ నింపుకొవాలి. అక్కడి నుంచి హిందూపురం పైప్‌లైన్‌కు పంపింగ్ చేయాలి. అలా కాకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంజూరు చేసిన శ్రీరామిరెడ్డి తాగునీటి పైప్‌లైన్‌ను పటిష్టపర్చి దెబ్బతిన్న పైపులను మార్చి పంపింగ్ చేస్తే ప్రతిరోజు పట్టణానికి 10 ఎంఎల్డి నీటిని తీసుకోవచ్చు. రోజూ కుళాయిలకు నీరు వదలవచ్చు. – ప్రశాంత్‌గౌడ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజనప్రధాన కార్యదర్శి. హిందూపురం 15 రోజులుగా మంచినీరు రాలేదు మోడల్‌కాలనీ ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటోంది. మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ట్యాంకర్లను పంపుతామంటారే కానీ రావు. ఒకటి రెండు పంపినా ప్రజలకు ఏమాత్రం సరిపోవు. ప్రస్తుతం 15 రోజులుగా నీరు రావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వేసవిని తల్చుకుంటే భయమేస్తోంది. – చంద్రకళ, మోడల్‌కాలనీ, హిందూపురం ఎమ్మెల్యే మాట నీటి మీద బుడగ ఎమ్మెల్యే బాలకృష్ణ మాటలు నీటిమీద బుడగలు. నిధులు పూర్తిస్థాయిలో రాకపోయినా ఈ వేసవికి నీళ్లు ఇస్తామన్నారు. నిధుల లేమితో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒకవేళ గొల్లపల్లి నుంచి పైప్‌లైన్ పనులు పూర్తి చేసినా కియా ఫ్యాక్టరీకి నీరు ఇవ్వడమే తప్ప హిందూపురం ప్రజల కోసం కాదని అనిపిస్తోంది. శ్రీరామి రెడ్డి తాగునీటి పథకం పైప్‌లైన్‌ను మరమ్మతు చేస్తే ఉపయోగకరం. -
సీఎం చంద్రబాబు కుర్చీలో బాలకృష్ణ
-
సీఎం కుర్చీలో బాలయ్య
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కుర్చీలో ఆయన బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ కూర్చుని సమీక్షా సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బాలకృష్ణ బుధవారం లేపాక్షి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించే మందిరంలో ఆయన కూర్చునే కుర్చీలో బాలకృష్ణ కూర్చున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు ఐఏఎస్‌లు బాలకృష్ణకు ఎదురుగా కూర్చోవడం విశేషం. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఉండగా ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఆయన బావమరిది.. ఆయన కుర్చీలో కూర్చుని సమీక్ష నిర్వహించడంపై అధికారులే విస్తుపోయారు. కానీ సీఎంకు బావమరిది కావడంతో ఏం మాట్లాడలేక మిన్నకుండిపోయారు. అదే సమయంలో మంత్రి హోదాలో ఉన్న దేవినేని బాలయ్య ఎదుట కూర్చుని ఆయనడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం గమనార్హం. దీనిపై మీడియాలో వార్తలు రావడం, ఏ హోదాలో సీఎం కుర్చీలో కూర్చుంటారని విమర్శలు రావడంతో బుధవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో బాలకృష్ణ సీఎం కుర్చీలో కాకుండా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని సమీక్ష నిర్వహించారు -
సీఎం బావ అయితే కుర్చీ మనదేనా..?
-
సీఎం చంద్రబాబు కుర్చీలో బాలకృష్ణ
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చొని ఆయన సమీక్ష నిర్వహించడం సర్వత్రా చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళితే... ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో లేపాక్షి ఉత్సవాల అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కుర్చీలో కూర్చొని మంత్రి దేవినేని ఉమ, ఐఏఎస్ అధికారులతో సమీక్ష చేశారు. అయితే సమావేశానికి వచ్చిన ఐఏఎస్ అధికారులు... ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం కుర్చీలో కూర్చోవడం చూసి విస్తుపోయారు. ముఖ్యమంత్రి పోస్ట్‌పై ఆసక్తి లేదని చెప్పే...ఆయన సాక్షాత్తూ.. సీఎం కుర్చీలో కూర్చొని సమీక్ష జరపడంపై విమర్శలు వెల్లువెత్తుతుంటే...ఈ వ్యవహారంపై మంత్రి దేవినేని ఉమ నోరు మెదపడం లేదు. కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రొటోకాల్‌పై టీడీపీ రసవత్తరంగా చర్చ జరుగుతోంది. -
బాలకృష్ణకూ టిక్కెట్టు లేదంట!?
విద్యార్థులు రాసిన పరీక్షల ఆధారంగా మార్కులు వేయడం మనందరికీ తెలిసిందే. ఇదే కోవలో టీడీపీ అధిష్టానం గత మూడున్నరేళ్లుగా ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా మార్కులు వేస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మార్కులు వేసి, ఎమ్మెల్యేలకు గ్రేడింగ్‌లు ఇవ్వడంపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా ఎమ్మెల్యేల పనితీరుపై ఇంటెలిజెన్స్ అధికారులతో ప్రత్యేకంగా ఓ నివేదిక తెప్పించుకున్న అధిష్టానం.. ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ అంశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షి, అనంతపురం: ఐదుగురు సిట్టింగ్లతో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కూడా టిక్కెట్టు లేనట్లేనని తెలుస్తోంది. ఏ రాజకీయ పార్టీలోనైనా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల పనితీరును పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు తెలుసుకుని అందుకు అనుగుణంగా ముందుకెళ్లడం సహజం. టీడీపీలో కూడా 2014 వరకూ అదే జరిగింది. అయితే గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొత్త పంథాకు తెరతీశారు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా మార్కులు కేటాయించి గ్రేడింగ్‌లు ఇచ్చారు. ఇది మొదట్నుంచి ఆ పార్టీలో తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఎమ్మెల్యేల పనితీరును అధిష్టానం పరిగణనలోకి తీసుకోవడం తప్పు కాదని, అయితే గ్రేడింగ్‌లు ఇచ్చి ‘ఫలానా ఎమ్మెల్యే ఫస్ట్.. మరొకరు లాస్ట్’ అంటూ కాపీలు విడుదల చేయడం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ అధిష్టానం మాత్రం తామనుకున్న దారిలోనే వెళ్తోంది. మూడున్నరేళ్లుగా ఇచ్చిన గ్రేడింగ్‌లను మదింపు చేసి పనితీరును బేరీజు వేసి ఒక నివేదికను అధిష్టానం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇది కాకుండా ఇటీవల ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ అధికారులతో ప్రత్యేకంగా ఓ నివేదికను తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ రెండింటి ఆధారంగా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐదుగురు సిట్టింగ్‌లు ఔట్ పనితీరు ఆధారంగా టీడీపీలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వకూడదని అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీలోని ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఐదుగురికి కూడా ఇప్పటికే భవిష్యత్తుపై స్పష్టత వచ్చిందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఐదుగురిలో నలుగురు ఎమ్మెల్యేలు అనంతపురం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుంటే, మరో ఎమ్మెల్యే హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నారు. వీరిలో నలుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వ్యక్తులే కావడం గమనార్హం. ఒక్కరు మాత్రమే సీనియర్ నాయకుడు. ఎలాగూ టిక్కెట్టు ఇవ్వరనే నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలను కూడా పూర్తిగా గాలికొదిలేశారు. ‘దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలి’ అనే చందంగా అధికారం ఉన్నప్పుడే వీలైనంత దండుకోవాలనే రీతిలో ప్రతి అంశాన్ని ఈ ఐదుగురు నేతలు ఆర్థిక కోణంలోనే చూస్తుండటం గమనార్హం. బాలకృష్ణకూ టిక్కెట్టు లేదంట! ఐదుగురు సిట్టింగ్లతో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కూడా టిక్కెట్టు లేనట్లేనని తెలుస్తోంది. హిందూపురం నుంచి సీఎం తనయుడు నారా లోకేశ్‌ను పోటీ చేయించాలని చంద్రబాబు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బాలకృష్ణను రాజ్యసభకు పంపించి రాష్ట్ర రాజకీయాలకు దూరంగా పెట్టాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో బాలకృష్ణకు కూడా స్పష్టత ఉందని, అందుకే నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని చెబుతున్నారు. బాలకృష్ణపై ఉన్న వ్యతిరేకతతో ఈ సారి పోటీ చేసినా ఓడిపోవడం తథ్యమని ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో లోకేశ్‌ను బరిలోకి దించి, ఓడిపోతే మొదటికే మోసం వస్తుందని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. హిందూపురం నుంచి స్థానికేతరులు పోటీ చేస్తే పండుగకు కొత్త అల్లుళ్లు వచ్చినట్లు చుట్టపుచూపుగా రావడం మినహా నియోజకవర్గాన్ని పట్టించుకోరని అభిప్రాయానికి ‘పురం’ వాసులు వచ్చారు. గతంతో పోలిస్తే ప్రజల్లో కూడా చైతన్యం పెరగడంతో స్థానికేతరులు ఎవరు పోటీ చేసినా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఏదేమైనా టీడీపీలో సిట్టింగ్‌లకు టిక్కెట్లు దక్కవనే ప్రచారం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. -
కర్ణాటక ఎమ్మెల్యే బాలకృష్ణ కారుపై చెప్పులు
సాక్షి, దొడ్డబళ్లాపురం: ఇచ్చిన మాట తప్పాడని ఎమ్మెల్యే కారుపై చెప్పులు విసిరిన సంఘటన శనివారం మధ్యాహ్నం కర్ణాటకలోని మాగడి పట్టణంలో చోటుచేసుకుంది. శనివారం మాగడి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ గతంలో దళిత నేత రంగహనుమయ్య భార్యను మున్సిపల్ అధ్యక్షురాలిగా చేస్తానని మాటిచ్చారు. అనుకున్నట్టుగానే అధ్యక్ష స్థానం దక్కుతుందని దళిత నేత మద్దతుదారులతో తరలివచ్చాడు. తీరా ఎన్నికల సమయానికి చక్రం తిప్పిన ఎమ్మెల్యే బాలకృష్ణ కురుబ సామాజిక వర్గానికి చెందిన మంజునాథ్‌కు అధ్యక్ష స్థానం దక్కేలా చేశారు. దీంతో ఆగ్రహించిన దళితులు ఎమ్మెల్యే బయటకు వచ్చి బయలుదేరే సమయంలో కారుకు వేసిన పెద్ద పూల హారాలు లాగివేయడంతోపాటు చెప్పులు విసిరారు. కారుకు అడ్డంపడి నినాదాలు చేశారు. ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపుచేశారు. ఇదే సందర్భంగా దళితులు స్థానిక ఎంపీ డీకే సురేశ్‌తోపాటు మంత్రి రేవణ్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఈ బాలయ్యకు ఏమైంది ?
-
అభిమానిపై మళ్లీ చేయిచేసుకున్న బాలకృష్ణ
-
నంద్యాలలో బాలకృష్ణ ప్రచారం.
-
నంద్యాలలో బాలకృష్ణ ప్రచారం.. అపశ్రుతి
నంద్యాల: ‘మరి నాన్న గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించారో, ఆయన అభిమానులంతా ముందుకొచ్చి పార్టీని నడిపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలపర్చాలి..’ అంటూ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం నుంచి నంద్యాలలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కానీ రోడ్డు షో మొదలైన కొద్ది సేపటికే అపశ్రుతి చోటుచేసుకుంది. బాలయ్య ప్రయాణిస్తున్న కాన్వాయ్.. ఒక బాలుడిని ఢీ కొట్టింది. గాయపడ్డ ఆ బాలుణ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడు స్వల్పంగా గాయపడ్డాడని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. ఇక ప్రచారంలో.. తెలుగువారైన పీవీ నర్సింహారావు నాడు నంద్యాల నుంచి పోటీచేస్తే ఆయన గెలుపు కోసం భూమా కుటుంబం సహకరించిందని, సినిమా షూటింగ్స్ కోసం ఎప్పుడొచ్చినా.. భూమా కుటుంబం ఇల్లు ఇచ్చేవారని, వాళ్ల కూతురు అఖిలప్రియ పర్యాటక మంత్రి కావడం సంతోషకరమని బాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ‘ఒక్క మగాడు’ సినిమాలో కులాలపై రాసిన డైలాగును బాలయ్య చెప్పగా.. అభిమానులు ఈలలువేసి గోల చేశారు. ఎస్సీలు, ఎస్టీలు, కాపులు, బలిజలకు టీడీపీ ప్రభుత్వం ఏమేమి చేస్తున్నదో వివరించే ప్రయత్నం చేశారు బాలయ్య. -
బాలయ్యా.. మా ఇళ్లులయ్యా..!
► ఇంటిపట్టాల విషయమై పట్టుబట్టిన బాధిత మహిళలు ► తహసీల్దార్ చూస్తారంటూ తప్పించుకెళ్లిన ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అర్భన్ : ‘అయినవారికి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో.. అదే ఏ ఆడపిల్లకు కష్టం వచ్చినా అరక్షణం కూడా ఆగను. ఐ విల్ సో ద హెల్(నరకం చూపిస్తా)’ అంటూ లెజెండ్ సినిమాలో వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా డైలాగులు చెప్పిన బాలయ్య నిజ జీవితంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తమ ఇంటి పట్టాలు రద్దు చేశారయ్యా అంటూ బాధిత మహిళలు ఆయన ఇంటిముందు గగ్గోలు పెట్టినా వారి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపకుండా వెళ్లిపోయారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటిపట్టాలు రద్దు చేసి ఇతరులకు ఇచ్చేస్తున్నామని, ఆ స్థలాలు ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు చెబుతున్నరంటూ ఇందిరమ్మకాలనీ మహిళలు ఆదివారం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిముందు గగ్గోలు పెట్టారు. గతంలో వారికి ఇచ్చిన ఇంటిపట్టాలు చేతపట్టుకుని ఉదయం 7గంటల నుంచే పడిగాపులు కాచారు. వారిని లోపలకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. వేరే కార్యక్రమంలో పాల్గొనడానికి 11గంటల సమయంలో బాలకృష్ణ బయటకు వచ్చారు. బాధిత మహిళలు ఆయనను చుట్టుముట్టి ‘ఇంటిపట్టాలు రద్దు చేసి వెళ్లిపొమ్మంటున్నారు. ఎక్కడికి పోవాలయ్యా... మా ఇంటిపట్టాలు రద్దుచేసి టీడీపీ నాయకుల అనుచరులకు ఇస్తారంట..! ఇదేమి న్యాయమయ్యా!’ అని ప్రశ్నించారు. ‘ఎన్నికల సమయంలో అందరికీ స్థలాలు,ఇల్లు ఇస్తామన్నారు. ఇప్పుడు ఇచ్చినవి కూడా లాగేస్తారా’ అని వాపోయారు. తమకు న్యాయం చేసేవరకు కదిలేది లేదంటూ భీష్మించారు. దీంతో బాలకృష్ణ తహసీల్దార్ విశ్వనాథ్‌ను పిలిపించి సమస్యను పరిష్కరించాలని చెప్పి ఇంటి లోపలకు వెళ్లిపోయారు.ఇంటి పట్టాలు ఇవ్వడంతో తాము పునాదులు కూడా వేసుకున్నామని, ఇప్పుడు కాదని పొమ్మనడం ఎక్కడి న్యాయమని మహిళలు తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. మీకు కావాల్సిన వారికోసం పేదలైన మాకు అన్యాయం చేస్తున్నారని శాపనార్థాలు పెట్టారు. తమను బలవంతంగా ఖాళీ చేయిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఇంతలో వచ్చిన వారిలో ఒకరు చార్టులో ‘ఎమ్మెల్యే సార్.. మేము ఆత్మహత్య చేసుకుంటాం’ అని రాసి చూపుతుండగా పోలీసులు ఆ పోస్టరు లాగేసి చించిపడేశారు. తాము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని మహిళలు తెగేసి చెప్పారు. అంతలో ఇంటి నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ ‘తహసీల్దార్ చూస్తారులేమ్మా’ అంటూ పోలీసు బందోబస్తుతో వాహనంలో ఎక్కి వెళ్లిపోయారు. -
2019లో పోటీపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య
హిందూపురం: సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. 2019 ఎన్నికల్లో పోటీ విషయమై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను కృష్ణా జిల్లా గుడివాడ, మైలవరం స్థానాల నుంచి తాను పోటీ చేస్తాననే ప్రచారం నిజం కాదని పేర్కొన్నారు. ఆదివారం హిందూపురంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. 2019లోనూ హిందూపురం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. స్థానికంగా పార్టీ నేతల్లో ఎలాంటి విభేదాలు లేవనీ, ఒకవేళ ఉన్నా వాటికి భయపడటం తన రక్తంలోనే లేదన్నారు. ఇకపై పారిశ్రామికాభివృద్ధి వైపు దృష్టి సారిస్తానని, అనంతపురం ‘హిందూపురం అర్బన్ అధారిటి ద్వారా పరిశ్రమలు నెలకొల్పడానికి కార్యాచరణ జరుగుతోందన్నారు. కృష్ణదేవరాయల కాలం నాటి చెరువులను త్వరలోనే హంద్రీనీవా నీటితో నింపుతామని అన్నారు. అలాగే రూ. 194 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురానికి ప్రత్యేక పైప్ లైన్ వేసే ప్రక్రియకు త్వరలోనే టెండర్లు పిలిచి ఐదునెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. పట్టణంలో రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టం ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసుస్టేషన్ నెలకొల్పాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి సరిగాలేకున్నా, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకువస్తున్నామని చెప్పారు. శ్రావణ మాసంలో రూ.23 కోట్లతో నిర్మించనున్న కూరగాయల మార్కెట్‌కు భూమిపూజ చేయడంతో పాటు ఆర్టీఓ కార్యాలయం, పశువు ఆసుపత్రి భవనాలు కూడా ప్రారంభిస్తామని బాలయ్య అన్నారు. ఇక విలేకరులకు ఇంటిపట్టాల మంజూరులో ఉన్న సమస్యను పరిష్కరించి పట్టాలు అందించడానికి కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో పార్టీ పరిశీలకులు కృష్ణమూర్తి, పీఏ వీరయ్యలు ఉన్నారు. -
మాతా శిశుసంరక్షణ భవనం ప్రారంభం
హిందూపురం అర్బన్ : ‘పురం’లో రూ.20.15 కోట్లతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి భవనాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తల్లీబిడ్డలను రక్షించుకోవడం అందరి బాధ్యతన్నారు. తాను మూడు నెలలుగా షూటింగ్లో ఉన్నప్పటికీ ఫోన్లో నియోజకవర్గ సమస్యలు తెలుసుకుంటున్నానన్నారు. మంత్రి కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్పొరేట్‌కు దీటుగా ఏర్పాటైన ఈ ఆసుపత్రికి వైద్యసిబ్బందిని త్వరలోనే నియమిస్తామన్నారు. ఎమ్మెల్యే, తాను హిందూపురం ఆసుపత్రిలో ఒకరోజు రాత్రి బస చేస్తామన్నారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ హిందూపురంలో వైద్యపరంగా ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో జేసీ ఖాజామొహిద్దీన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీసీహెచ్ రమేష్‌నాథ్, సూపరింటెండెంట్ కేశవులు, ఆర్ఓఎం రుక్మిణమ్మ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ పిల్లలకు పుస్తకాలు, బొమ్మలు పంపిణీ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో స్థానిక మోడల్‌కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రీ క్వానెంట్‌ను ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి సునీత ప్రారంభించారు. చిన్నారులకు పుస్తకాలు, బొమ్మలు పంపిణీ చేశారు. -
బాలకృష్ణ ఇలాకాలో ఉద్రిక్తత
-
‘సాయిచరణ్ మృతికి యాజమాన్యమే కారణం’
చిత్తూరు: కాలూరు నారాయణ మెడికల్ అకాడమి స్కూల్లో చదువుతున్న సాయిచరణ్ నాయక్ మృతి ఘటనతో తోటి విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. సాయిచరణ్‌ను విద్యా సంస్థే పొట్టనపెట్టుకుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంజిరెడ్డి అనే టీచర్ బూటు కాలుతో తన్నడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. ఇందుకు నిరసనగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టల్ గదుల అద్దాలు ధ్వంసం చేసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యా సంస్థ సిబ్బందిపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మంత్రి నారాయణను బర్త్‌రఫ్ చేయాలని కోరుతున్నారు. -
బాలకృష్ణ గన్‌మెన్ కుమారుడి ఆత్మహత్య
తిరుపతి : ఓ ప్రయివేట్ విద్యా సంస్థలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలూరులో విద్యాసంస్థ హాస్టల్ భవనంపై నుంచి దూకి పదో తరగతి విద్యార్థి సాయిచరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా టీచర్ మందలించడం వల్లే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. కాగా మృతుడు సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గన్‌మెన్ మోహన్ కృష్ణ నాయక్ కుమారుడు. మృతదేహాన్ని స్విమ్స్ ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మరోవైపు తమ కుమారుడిని విద్యాసంస్థే పొట్టన పెట్టుకుందని సాయిచరణ్ తల్లిదండ్రులు ఆరోపించారు. మంత్రి నారాయణ అధికార బలంతో పేట్రేగిపోతున్నారని, సాయిచరణ్ మృతి విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచిందన్నారు. తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. స్కూల్ వద్దకు వెళ్లినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ విద్యాసంస్థ యాజమాన్యానికి శిక్ష పడేవరకూ పోరాటం చేస్తామని సాయిచరణ్ కుటుంబసభ్యులు తెలిపారు. -
ఎంపీపీ మార్పుపై ఎమ్మెల్యేతో చర్చిస్తాం
చిలమత్తూరు : ఎమ్మెల్యే పీఏ శేఖర్ వర్గీయులైన ఎంపీపీ మార్పుపై ఎమ్మెల్యే బాలకృష్ణతో త్వరలో చర్చిస్తామని జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం మరకొత్తపల్లి కాలనీ సమీపంలోని ఓ తోటలో వారు సమావేశమయ్యారు. ముందుగా అనుకున్న ప్రకారం రెండున్నరేళ్లకు ఎంపీపీ మార్పు చేయాలన్నారు. దీనిపై బాలకృష్ణతో చర్చిస్తామన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన పీఏ శేఖర్‌ను తొలగించడం బాలకృష్ణ నిజాయితీకి నిదర్శనమన్నారు. సర్పంచ్ లక్ష్మీనరసింహప్ప, మాజీ ఎంపీపీ శివప్ప, మాజీ కన్వీనర్ రంగారెడ్డి, డైరెక్టర్ రజనీకాంత్, నాయకులు లక్ష్మీనారాయణ యాదవ్, సోమశేఖర్, శివ, అశ్వర్థప్ప, టి.నాగభూషణం, ఆదిమూర్తి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పంచాయితీ నేడే!
– హిందూపురం విభేదాల నేపథ్యంలో నేడు బాలయ్య రాక! – పీఏ శేఖర్‌తో పాటు అసమ్మతి వర్గంతో చర్చలు..ఏకతాటిపైకి తెచ్చే యత్నం – శేఖర్ తొలగింపు మినహా మరో చర్చకు ఒప్పుకోబోమంటున్న వ్యతిరేకవర్గం – వ్యతిరేక వర్గం వెనుక ఎవరున్నారని జిల్లాపార్టీతో పాటు రాష్ట్ర పార్టీలోనూ తీవ్ర చర్చ – నేను జోక్యం చేసుకోను.. బాలయ్యతోనే తేల్చుకోండన్న సీఎం (సాక్షిప్రతినిధి, అనంతపురం) హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్‌ను తొలగించాలని కొద్దిరోజులుగా నడుస్తోన్న పోరు ‘అనంత’తో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై టీడీపీలో కూడా పలు రకాలుగా ఊహాగానాలు రేకెత్తుతున్నాయి. టీడీపీలో చంద్రబాబు తర్వాత అంతటి ‘పవర్‌సెంటర్’ బాలయ్య. మరి ఆయన పీఏనే తొలగించాలని ఉద్యమిస్తున్నారంటే వీరి వెనుక అంతకంటే పెద్ద ‘పవర్’ ఉండి కథ నడిపిస్తోందా? వ్యతిరేకవర్గం టార్గెట్ పీఏనా? లేదంటే బాలయ్యపై అవినీతి మరక అంటించి నియోజకవర్గంలో బలహీనపరిచి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. పురంపై బాలయ్య నిర్లక్ష్యమే ప్రధాన కారణం బాలకృష్ణ పీఏ శేఖర్‌పై ఆదినుంచి ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జన్మభూమి ఇప్పటి వరకూ నాలుగు దఫాలు జరిగితే, ఒక్కరోజూ హాజరుకాని ఏకైక ఎమ్మెల్యే రాష్ట్రంలో బాలకృష్ణ ఒక్కరే! ఈ ఒక్క ఉదాహరణ చాలు నియోజకవర్గాన్ని బాలయ్య ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో! ప్రజా సమస్యలపైనా ఎంత చులకన భావం ఉందో ఇట్టే తెలుస్తోంది. పైగా జన్మభూమిలో ఆయన పీఏ శేఖర్ అధికారులతో ప్రభుత్వ వేదికను పంచుకున్నారు. అధికారులు కూడా శేఖర్‌ను ఎమ్మెల్యేలా భావించి కార్యక్రమాన్ని నడిపించారు. జన్మభూమితో పాటు చాలా అధికారిక కార్యక్రమాల్లో శేఖర్ పాల్గొన్నారు. దీనిపై అప్పట్లో ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. బాలకృష్ణ కూడా శేఖర్‌ను మందలించకుండా మద్దతుగా నిలుస్తూ ప్రజాస్వామ్యాన్ని, ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా వ్యవహరించారని పార్టీనేతలు చెబుతున్నారు. అధికారుల బదిలీలు, ఇతరత్రా వ్యవహారాలను కూడా శేఖరే చూస్తున్నారనేది బహిరంగ సత్యం. ఒక్కమాటలో చెప్పాలంటే హిందూపురానికి అనధికారిక ఎమ్మెల్యేగా శేఖర్ ఇన్నిరోజులూ వ్యవహరించారు. ఇది బాలకృష్ణకూ తెలుసు. హిందూపురం నియోజకవర్గంలో ప్రధాన ఆదాయవనరులైన కొడికొండ చెక్‌పోస్టు, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, ఆర్టీఏతో పాటు పలు కీలకశాఖల నుంచి ప్రతినెలా రూ.70 లక్షలు వసూలు చేసి బాలకృష్ణకు పంపుతారనే భావన హిందూపురం అధికారులతో పాటు ప్రజల్లోనూ ఉంది. నెలవారీ మామూళ్లు తక్కువగా ఇచ్చిన వారితో ‘నేనేం ఇంటికి తీసుకెళుతున్నానా? తక్కువైతే వసుంధర మేడం వాయించేస్తుంది’ అని బాలయ్య సతీమణి పేరు చెప్పేవాడని కొందరు అధికారులు అంటున్నారు. రీచ్‌లు ఉన్నప్పుడు ఇసుక మాఫియానే ప్రతినెలా రూ.50 లక్షలు ఇచ్చేదని తెలుస్తోంది. ఈ లెక్కన 32 నెలల్లో ఎంత వసూలైంటుందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ డబ్బు బాలకృష్ణ భార్యకు ఇచ్చారా? లేదంటే వారి పేరుతో శేఖర్ స్వాహా చేశాడా? అనే అనుమానాలు ‘పురం’ టీడీపీ నేతలతో పాటు అందరిలోనూ ఉన్నాయి. ఇకపోతే ఇన్నిరోజులై మౌనంగా ఉండి, ఇప్పుడు శేఖర్ అవినీతికి పాల్పడుతున్నారు, తొలగించాల్సిందేనంటూ పార్టీనేతలు సీసీ వెంకట్రాముడు, అంబికా లక్ష్మీనారాయణ ఉద్యమించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. వ్యతిరేక వర్గం వెనుక ఎవరున్నట్లు! బాలకృష్ణ పీఏపై ఉద్యమించడమంటే ఒకరకంగా బాలయ్యపై ఉద్యమించడమే! ఎప్పుడు, ఎలా ఉంటారో తెలీని బాలయ్య ‘నా పీఏను తొలగించాలని ఉద్యమిస్తారా?’అని వ్యతిరేకవర్గాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయించేందుకూ వెనుకాడరు. ఇవన్నీ తెలిసి, వీటికి తెగించి శేఖర్‌పై పోరాటం చేస్తున్నారంటే వీరి వెనుక ఎవరున్నారనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. చంద్రబాబుకు తెలిసే ఈ తంతు నడుస్తోందనే అనుమానాలు ఉన్నాయని, ఇది ఎందుకు చేస్తున్నారనే దానిపై పూర్తి స్పష్టత రాలేదని టీడీపీ నేత ఒకరు ‘సాక్షి’తో అన్నారు. ఇదిలావుండగా, శేఖర్ కాంట్రాక్టర్‌ను బెదిరించిన ఆడియో తీవ్ర కలకలం రేపింది. ఇతన్ని తప్పనిసరిగా తొలగించే పరిస్థితిని కల్పించింది. ఆడియో విషయాన్ని వ్యతిరేకవర్గం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బాలయ్యకు సంబంధించిన అంశం కావడంతో ఆయనతోనే తేల్చుకోవాలంటూ సీఎం బంతిని బాలయ్య కోర్టులోనే వేసినట్లు తెలిసింది. బాలయ్య మంగళవారం ఉదయం సీఎంను కలిసిన సందర్భంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. విభేదాలు లేకుండా చూడాలని బాలయ్యకు సీఎం సూచించారు. ఈ విషయాన్ని బాలయ్యే స్వయంగా మీడియాతో చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా నేడు హిందుపురానికి వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పీఏను తొలగిస్తే ఇన్నిరోజులూ చేసిన వసూళ్లకు బాలయ్యే కారణమని శేఖర్ కుండబద్దలు కొట్టే అవకాశముంది. తొలగించకపోతే అవినీతిని, అరాచకాన్ని బాలయ్య వెనుకేసుకొచ్చినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో బాలయ్య ఏ నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇరువర్గాలను కూర్చోబెట్టి సర్దుబాటు చేయాలని బాలయ్య ఉన్నారు. అయితే అతన్ని తొలగింపు మినహా మరే సర్దుబాటుకూ ఒప్పుకునేది లేదని అసమ్మతి నేత అంబికా లక్ష్మీనారాయణ ‘సాక్షి’తో స్పష్టం చేశారు. అన్నింటికీ తెగించే ఉద్యమిస్తున్నామని, పార్టీ పరువు నిలవాలంటే శేఖర్‌ను తప్పించాలని, ఈ విషయంలో ఎంత వరకైనా ముందడుగు వేస్తామని అన్నారు. ఈక్రమంలో నేటి పంచాయితీలో బాలయ్య తీర్పు ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే! -
బాలకృష్ణ పీఏ శేఖర్ తొలగింపు: సీఎం ఆదేశం
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో తలెత్తిన రాజీనామా రాజకీయాలపై సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం ఆరాతీశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఇద్దరూ మంగళవారం సీఎంతో భేటీ అయ్యారు. హిందూపురం పార్టీలో వివాదాలకు కారణమైన బాలకృష్ణ పీఏ శేఖర్‌ను వెంటనే తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించరాదని, అందరూ ఏకతాటిపై నడవాలని, గ్రూపు రాజకీయాలకు కారణమైన ఎవరినీ పార్టీ క్షమించదని చంద్రబాబు హెచ్చరించారు. హిందూపురం టీడీపీలో కొద్దిరోజులుగా రగులుతున్న అసమ్మతి సెగ ఆ పార్టీ అధిష్ఠానాన్ని తాకింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ తన పీఏ శేఖర్‌ను తొలగిస్తూ హిందూపురం వదిలి వెళ్లిపోవాలని సోమవారం రాత్రే ఆదేశించారు. దీంతో సోమవారం అర్ధరాత్రి హిందూపురం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బాలకృష్ణ పీఏ శేఖర్ రెండున్నర ఏళ్లుగా నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతూ పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తూ అక్రమార్జనకు తెర లేపారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలను సమావేశపరచి శేఖర్ వ్యతిరేకులను ఏకంచేశారు. అతన్ని తొలగించకపోతే తాము రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు. అన్నట్లుగానే లేపాక్షి, చిలమత్తూరు మండల జడ్పీటీసీ సభ్యులతో రాజీనామాలు కూడా చేయించారు. ఆపై వారం రోజులు సమయమిచ్చి తాడోపేడో తేల్చుకోవాలని, లేకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, అలాగే హిందూపురం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరహార దీక్షలు చేస్తామని పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చారు. దీంతో బాలకృష్ణతో పాటు పార్టీ అధిష్ఠానం దిగి రావాల్సి వచ్చింది. ''పార్టీలో ఎవరు తప్పుచేసినా క్రమశిక్షణ చర్యలు తప్పవు.. అది నేనైనా, బంధువైనా, పార్టీనాయకులైనా'' అని బాలకృష్ణ ఇటీవల నిమ్మకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం బాలకృష్ణ, నారా లోకేష్ ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని వివరించారు. పీఏని వెంటనే తొలగిస్తూ వెంటనే ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. -
పీఏ కావాలో.. పార్టీ నేతలు కావాలో తేల్చుకో!
-
పీఏ కావాలో.. పార్టీ నేతలు కావాలో తేల్చుకో!
► వారం రోజులే డెడ్‌లైన్ ► బాలకృష్ణకు తేల్చిచెప్పిన హిందూపురం టీడీపీ నేతలు చిలమత్తూరు: ‘‘వారం రోజులే డెడ్‌లైన్.. ఆలో పు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన వ్యక్తి గత కార్యదర్శి చంద్రశేఖర్‌ను ఇక్కడి నుంచి పంపకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేయ డంతో పాటు హిందూపురంలోని ఎన్టీఆర్ విగ్ర హం ఎదుటే నిరాహార దీక్ష చేస్తాం.. పీఏ కావాలో పార్టీ నేతలు కావాలో బాలకృష్ణనే నిర్ణయించుకోవాలి’’ అని అనంతపురం జిల్లాల హిందూపురం టీడీపీ అసమ్మతి నేతలు తేల్చి చెప్పారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఎమ్మె ల్యే పీఏ, ఆయన వర్గీయులకు వ్యతిరేకంగా అసమ్మతి నాయకులు సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, నాయకులు అంబికా లక్ష్మీ నారా యణ తదితర నేతలు చిలమత్తూరులో భారీ సమావేశం, ర్యాలీ నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే బాలకృష్ణ పీఏ శేఖర్ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి పోలీసులతో 144 సెక్షన్, 30 యాక్టు అమలు చేయించారు. దీంతో మండలంలోని 11 పంచాయతీల వారీగా 40 మంది పోలీసు అధికారుల పర్యవేక్షణలో సుమారు 450 పోలీసులు మోహరించారు. వెనక్కు తగ్గని అసమ్మతి నాయకులు చిలమత్తూరులో పోలీసులు మోహరింపు నేపథ్యంలో అసమ్మతి నాయకులు మండలానికి సరిహద్దు ప్రాంతమైన బాగేపల్లి షాదీమహల్ వద్ద సమావేశం నిర్వహించా లనుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అక్కడి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారంతా సమీపంలోని సుంకులమ్మ ఆలయం వద్ద సమావేశమయ్యారు. అయినప్పటికీ బాగేపల్లి ఎస్ఐ వెంకటేశులు, సిబ్బంది అడ్డు చెప్పడంలో ఆలయ సమీపం లోని బాబురెడ్డి తోటలో సమావేశం నిర్వహించారు. అవినీతి శేఖర్‌ను తరుముదాం.. నియంత పాలన చేస్తున్న ఎమ్మెల్యే పీఏ శేఖర్, ఆయన వర్గీయులను పంపేవరకు పోరాటం ఆగదని మాజీ ఎమ్మె ల్యే వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ తేల్చిచె ప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించే సమావేశాలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. శేఖర్‌ను ఇక్కడి నుంచి పంపిస్తేనే టీడీపీ బతుకు తుందని స్పష్టం చేశారు. అవినీతి శేఖర్‌ను తరుముదాం.. పార్టీని బలోపేతం చేద్దామని నినదించారు. కార్యక్రమంలో మాజీ సర్పం చ్‌లు, మాజీ ఎంపీపీలు, కన్వీనర్లు, సుమారు 1,500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. -
బాలకృష్ణకు టీడీపీ నేతల అల్టిమేటం
-
బాలకృష్ణకు టీడీపీ నేతల అల్టిమేటం
అనంతపురం: సినీ హీరో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీలో వర్గపోరు తీవ్రమైంది. వారం రోజుల్లోగా ఎమ్మెల్యే బాలకృష్ణ తన పీఏ శేఖర్‌ను తొలగించాలని అసంతృప్త టీడీపీ నాయకులు అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వెంకట్రాముడు, అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. శేఖర్‌ను తొలగించకపోతే హిందూపురంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరాహారదీక్షలు చేస్తామని చెప్పారు. ఆదివారం హిందూపురం నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరులో టీడీపీ అసంతృప్త నాయకులు సమావేశం కావాలని నిర్ణయించారు. కాగా పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు చిలమత్తూరులో 144 సెక్షన్ విధించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పొరుగునే ఉన్న కర్ణాటకలోని బాగేపల్లిలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. శేఖర్ భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఆయన ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణ రాజీనామా చేశారు. అసంతృప్త నేతలు, శేఖర్ వర్గీయులు నియోజకవర్గంలో పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి. -
బాలయ్య ఇలాకాలోలో టెన్షన్..టెన్షన్
► హిందూపురంలో మిన్నంటిన ‘అసమ్మతి’ రాగం ► ఎమ్మెల్యే పీఏను సాగనంపేందుకు ప్రత్యర్థి వర్గం తీవ్ర ప్రయత్నాలు ► ఉనికిని కాపాడుకునేందుకు పీఏ శేఖర్ పాట్లు హిందూపురం : టీడీపీకి బలమైన నియోజకవర్గంగా ఉంటున్న హిందూపురంలో ‘తమ్ముళ్ల’ మధ్య వర్గపోరు పతాకస్థాయికి చేరింది. ఒకవైపు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్ వర్గీయులు, మరోవైపు అసమ్మతిని లేవనెత్తిన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ వర్గీయులు పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు, బలనిరూపణలతో ‘పురం’ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. వీరి కుమ్ములాటలతో పార్టీ కంచుకోటకు బీటలు కూడా వారాయి. ‘చూడు ఒక వైపే చూడు.. రెండో వైపు చూడొద్దు.. తట్టుకోలేవు’ అని సినిమా డైలాగులతో హూంకరించే ఎమ్మెల్యే బాలకృష్ణ ఏ వైపు చూస్తారోనన్న ఆసక్తి నెలకొంది. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చే ఎమ్మెల్యే బాలకృష్ణ ఇక్కడి పెత్తనమంతా పీఏ శేఖర్‌కు అప్పగించారు. దీన్ని ఆసరాగా తీసుకుని ఆయన అవినీతికి తెరలేపారని, భారీఎత్తున వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారని అసమ్మతి నాయకులు మండిపడుతున్నారు. పీఏను ఇక్కడి నుంచి పంపించకపోతే తాము రాజీనామా చేస్తామని అల్టివేటం ఇచ్చారు. అందులో భాగంగానే చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణ శనివారం రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా అసమ్మతినేతలు చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం మండలాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి నాయకులను కూడగడుతున్నారు. పోటాపోటీగా బలప్రదర్శన ర్యాలీలు.. అసమ్మతి నాయకులు నాలుగురోజులుగా చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో ర్యాలీలు చేపట్టారు. ర్యాలీలు, సమావేశాలు చేస్తే పార్టీ చూస్తూ ఊరుకోదని, సస్పెండ్ చేస్తుందని హెచ్చరిస్తూ వచ్చిన పీఏశేఖర్ వర్గీయులు కూడా తమకు బలం ఉందని నిరూపించుకోవడానికి శుక్రవారం లేపాక్షి మండలకేంద్రంలో ర్యాలీ చేపట్టారు. అయితే.. వందమంది కూడా లేక అభాసుపాలయ్యారు. కొన్ని గ్రామాలకు వాహనాలు పంపినా కార్యకర్తలు రాలేదని సమాచారం. లేపాక్షి నంది విగ్రహం నుంచి మొదలైన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పీఏ శేఖర్, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరుకు చెందిన కొందరు నాయకులు మాత్రమే పాల్గొన్నారు. చిలమత్తూరులో హైటెన్షన్.. చిలమత్తూరులో ఆదివారం భారీ ర్యాలీతో పాటు సమావేశం నిర్వహించి తీరుతామని అసమ్మతి నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, సీసీవెంకటరాముడు తదితరులు చెబుతున్నారు. అవసరమైతే కర్ణాటక సరిహద్దులో చేస్తామంటున్నారు. పోలీసులతో అడ్డుకుంటే నిరాహారదీక్షలు చేస్తామని, అరెస్టులు చేస్తే జైలులో కూడా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే.. సమావేశం ఎలా జరుగుతుందో చూస్తామని ఎమ్మెల్యే పీఏ శేఖర్ వర్గీయులు సవాల్ చేస్తున్నారు. కాగా.. చిలమత్తూరులో భారీ పోలీసుబందోబస్తు ఏర్పాటు చేశారు. 144సెక్షన్‌తో పాటు 30యాక్ట్ అమలు చేశారు. సభలు, సమావేశాలు చేయరాదని నిషేధాజ్ఞలు జారీ చేశారు. అసమ్మతి నేతలతో బీకే, కాలవ చర్చలు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్‌కు వ్యతిరేకంగా అసమ్మతి లేవనెత్తిన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ తదితరులతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు చర్చలు జరిపారు. పరిగి జెడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణ కుమారుడి వివాహం శనివారం రాత్రి సోమందేపల్లిలో జరిగింది. ఈ వేడుకకు హాజరైన బీకే, కాలవ స్థానిక వెంకటేశ్వర కల్యాణ మంటపంలో అసమ్మతి నేతలతో అరగంట పాటు చర్చించారు. అయితే.. పీఏ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. -
బాలయ్య ఇలాకాలోలో టెన్షన్..టెన్షన్
-
బాలకృష్ణ పీఏ తిట్లపురాణం
♦ హిందూపురం నియోజకవర్గంలో శేఖర్ ఇష్టారాజ్యం ♦ సభ్యసమాజం తలదించుకునే రీతిలో కాంట్రాక్టర్‌కు తిట్లు ♦ వాట్సప్‌లో హల్చల్ చేస్తుతున్న ఆడియో సంభాషణలు ♦ బాలకృష్ణ దన్నుతోనే శేఖర్ అరాచకాలంటున్న టీడీపీ నేతలు సాక్షి, అమరావతి/ సాక్షిప్రతినిధి, అనంతపురం/ హిందూపురం అర్బన్: సినీ నటుడు, సీఎం చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురం నియోజకవర్గంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు శేఖర్ హల్చల్ చేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో టెండర్లలో షెడ్యూలు దాఖలు చేసిన అనంతపురం నగరానికి ఓ కాంట్రాక్టర్‌ను ‘ఫోన్’లో తీవ్ర స్థాయిలో బెదిరించారు. పత్రికలో రాయడానికి వీలులేని భాషలో.. సభ్య సమాజం తలదించుకునే రీతిలో బూతు పురాణం అందుకున్నారు. పీఏ శేఖర్ ఫోన్ బెదిరింపుల వ్యవహారం వాట్సప్‌లో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. రెండున్నరేళ్ల నుంచి పీఏ శేఖర్ ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారని.. బాలకృష్ణ దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి. శేఖర్ దోపిడీ, అరాచకాలకు బాలకృష్ణ అండదండలు ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో ఏ పనులకు టెండర్లు నిర్వహించినా.. పీఏ శేఖర్ అక్కడికి వాలిపోయి తనకు కమీషన్లు ఇచ్చేవారికే పనులు అప్పగించేలా అధికారులపై ఒత్తిడి తెస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. తనను కాదని టెండర్లలో ఎవరైనా పాల్గొంటే.. తీవ్ర స్థాయిలో బెదిరించి, పోలీసులను ఉసిగొలిపి పారిపోయేలా చేస్తారనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ హిందూపురం మున్సిపాల్టీ పరిధిలో ఒక టెండర్లో షెడ్యూలు దాఖలు చేశారు. తనను కాదని షెడ్యూలు దాఖలు చేసిన వ్యక్తిని ఆదిలోనే బెదిరించిన పీఏ శేఖర్.. తన కార్యాలయానికి వచ్చి కలవాలని హుకుం జారీ చేశారు. దాంతో కాంట్రాక్టర్ పీఏ శేఖర్ కార్యాలయానికి వెళ్లారు. కానీ.. కార్యాలయంలో అప్పటికే చాలామంది ఉండటంతో ఏమీ మాట్లాడకుండానే కాంట్రాక్టర్‌ను పంపేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్‌కు పీఏ శేఖర్ ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో బెదిరించిన ఆడియో వాట్సప్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ బెదిరింపు ఘటన తర్వాత కాంట్రాక్టర్.. శేఖర్‌ను కలిసి చర్చించి గుడ్‌విల్ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. విభేదాలతో వెలుగులోకి ఆడియో హిందూపురం నియోజకవర్గ నాయకుల్లో నెలకొన్న ముసలంతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. శేఖర్‌కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు, టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ బాహాటంగానే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణ.. శేఖర్ తీరుకు నిరసనగా రాజీనామా కూడా చేశారు. ఇదే క్రమంలో శేఖర్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టేందుకు కాంట్రాక్టర్ బెదిరింపు ఆడియోను వాట్సాప్‌లో పోస్టు చేశారు. మరోవైపు బల ప్రదర్శన కోసం శేఖర్ శనివారం లేపాక్షి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అయితే ర్యాలీకి అనుకున్నస్థాయిలో కార్యకర్తలు హాజరు కాలేదు. మొత్తం 10 వేల మందితో చేయాలని నిర్ణయించినా.. కేవలం 100 మంది మాత్రమే హాజరయ్యారు. బాలకృష్ణ పీఏ శేఖర్ ఆడియో సారాంశం.. పీఏ శేఖర్: ఏమిటి విశేషాలు? కాంట్రాక్టర్: ఏమీ లేవన్నా. మీరే చెప్పాలన్నా. పీఏ శేఖర్: ఏమీ..? కాంట్రాక్టర్: విశేషాలు ఏమీ లేవన్నా.. మీరే చెప్పాలన్నా. పీఏ శేఖర్: ఏమేమీ..? కాంట్రాక్టర్: పొద్దున మీ దగ్గరికి వచ్చాను. చాలామంది ఉంటే మాట్లాడలేదు. మున్సిపాల్టీలో లెస్(తక్కువ ధర)కు టెండర్లు వేశాను. పీఏ శేఖర్: (రాయడానికి వీలు లేని భాషలో బూతుపురాణం.. ఆ తర్వాత మాట్లాడుతూ) నిన్నెవడ్రా నా కొడకా హిందూపురంలో టెండర్ వేయమన్నది? చెప్పుతో కొడతా నాకొడకా.. హిందూపురంలో కన్పిస్తే తాట తీస్తా నా కొడకా. కాంట్రాక్టర్: అన్నా.. మీతో ఇప్పటికే మాట్లాడాను. బాలాజీ కూడా ఉన్నారు. మీతో మాట్లాడే టెండర్లు వేశా. పీఏ శేఖర్: బాలాజీ ఎవడ్రా నాకొడకా.. వాణ్నీ నిన్నూ ఇద్దర్నీ చెప్పుతో కొడతా. వానితో ఏమాట్లాడినావ్ రా నాకొడకా. కాంట్రాక్టర్:అన్నా.. నేను ఏమీ దొంగను కాదు. మేం పనులు చేసుకుంటేనే బతికేది. పూలకుంటలో ఇప్పటికే పనులు చేస్తున్నా. అందుకే టెండర్లు వేశా. తప్పు ఏమీ చేయలేదు. పీఏ శేఖర్: చెప్పుతో కొడతా నాకొడకా.. అనంతపురానికి నా మనుషులను పంపి స్తా. పనులు ఇప్పించరా నాకొడకా. కాంట్రాక్టర్: అన్నా.. నేను కాంట్రాక్టర్‌ను.. ఎక్కడైనా టెండర్లు వేసుకుంటా.. పనులు చేసుకుంటా. పీఏ శేఖర్: చెప్పుతో కొడతా నాకొడకా.. ధైర్యం ఉంటే హిందూపురం రారా నా కొడకా.. నువ్ రారా హిందూపురం. (బూతుపురాణం) కాంట్రాక్టర్: అన్నా.. పనులు చేసుకుంటేనే కదా మేం బతికేది. పీఏ శేఖర్: నీకొకడికేనేమిరా తెలివి నా కొడకా.. హిందూపురం రారా నాకొడకా నీ తాట తీస్తా. -
బాలయ్యకు షాకిచ్చిన తమ్ముళ్లు
-
బాలయ్యకు షాకిచ్చిన తమ్ముళ్లు
అనంతపురం: ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో అసమ్మతి పోరు తీవ్రమైంది. బాలకృష్ణ పీఏ శేఖర్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆరోపిస్తూ నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీలు రాజీనామా చేశారు. అలాగే ఆదివారం హిందూపురంలో టీడీపీ అసంతృప్త నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. కాగా ఈ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. బాలకృష్ణకు వ్యక్తిగత సహాయకుడి(పీఏ)గా ఉన్న చంద్రశేఖర్ (శేఖర్) నియోజకవర్గంలోని ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సైతం లంచాలు తీసుకుని అవినీతిలో కూరుకుపోయాడని ఆరోపిస్తూ, లంచగొండి పీఏను తరిమికొట్టాలని స్థానిక టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు.. శేఖర్ మితిమీరిన జోక్యానికి చెక్‌పెట్టేలా చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం రూరల్ ప్రాంతాల్లో అసమ్మతి సమావేశాలు జోరుగా నిర్వహిస్తున్నారు. తాజా పరిణామాలపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారోనని స్థానిక నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంబంధిత వార్తలు చదవండి బాలయ్య పీఏ vs టీడీపీ నేతలు బాలకృష్ణ పీఏను తరిమేద్దాం -
బాలయ్య పీఏ vs టీడీపీ నేతలు
హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్ మద్దతుదారులు ఒక వర్గంగా, అసమ్మతి నాయకులైన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ, వారి అనుచరులు మరో వర్గంగా ఏర్పడి సై అంటే సై అంటూ కాలు దువ్వుతున్నారు. పరస్పరం ప్రదర్శనలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. హిందూపురం : కొన్ని రోజులుగా ఎమ్మెల్యే పీఏ శేఖర్‌పై మండిపడుతున్న మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు ఆయన మితిమీరిన జోక్యానికి చెక్‌పెట్టేలా చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం రూరల్ ప్రాంతాల్లో అసమ్మతి సమావేశాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ విషయం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో ఆత్మరక్షణలో పడిన శేఖర్ వర్గీయులు బలప్రదర్శన ర్యాలీలు, బహిరంగ సభలకు దిగారు. (చదవండి : బాలకృష్ణ పీఏను తరిమేద్దాం ) ఇందులో భాగంగా గురువారం చిలమత్తూరు ఎంపీపీ నౌజియాబాను వర్గీయులు బలప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. బీసీ కాలనీలోని షాదీమహల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ పార్టీలో గ్రూపులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వారు చిలమత్తూరులో 5వ తేదీ సమావేశం ఎలా నిర్వహిస్తారో చూస్తామని, వారిని ఇక్కడ అడుగుపెట్టనివ్వబోమని ఎంపీపీ భర్త మన్సూర్, నాయకులు అన్సార్, అంజినప్ప సవాల్ చేశారు. ర్యాలీకి లబ్ధిదారులు.. సభకు సంఘాల మహిళలు చిలమత్తూరు మండలంలో కొత్తగా పింఛన్లు మంజూరైన 502 మందినీ పింఛన్లు ఇస్తామని చెప్పి మండల కార్యాలయానికి పిలిపించారు. తమతో వస్తేనే పింఛన్ ఇస్తామని చెప్పి శేఖర్ అనుకూల వర్గీయులు వారిని గురువారం ర్యాలీకి తీసుకెళ్లారు. అలాగే దేమకేతేపల్లి, గాడ్రాళ్లపల్లి, బ్రహ్మేశ్వరంపల్లి, తదితర గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులకు సమావేశం ఉందని చెప్పి పిలిపించి ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు పాల్గొనేలా చూశారు. మూకుమ్మడి రాజీనామాలకు సై విభేదాలు ముదిరిన నేపథ్యంలో ఇప్పటికే మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ముఖ్యనాయకులు అసమ్మతివాదుల వైపు చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తాము కూడా మూక్ముడిగా రాజీనామాలు చేస్తామని మున్సిపల్ వైస్‌చైర్మన్ రాము, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు ఆర్ఎంఎస్ షఫీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సీసీ వెంకటరాముడు ఇంట్లో సమావేశం ఏర్పాటు చేయగా నాయకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. చైర్పర్సన్ లక్ష్మీ అనుకూలురైన కౌన్సిలర్లు కూడా అసమ్మతివాదులతో చేరిపోయారు. శేఖర్‌ను హిందూపురం నుంచి సాగనంపడానికి ఒక పథకం ప్రకారం ఇదంతా జరుగుతోందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని నాయకులందరూ మూకుమ్మడిగా వ్యతిరేకించడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ తన ముఖ్య అనుచరుడి వైపు మొగ్గుచూపుతారా? నాయకుల ఒత్తిడికి తలవంచుతారా? అనేది వేచి చూడాల్సిందే. -
బాలకృష్ణ పీఏను తరిమేద్దాం
► పీఏకు ఏజెంట్‌గా లేపాక్షి ఎంపీపీ ► ఆత్మీయ సమావేశంలో ‘తమ్ముళ్ల’ ఫైర్ ► అసమ్మతివాదులపై వేటుకు రంగం సిద్ధం! లేపాక్షి : ‘హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యక్తిగత సహాయకుడి(పీఏ)గా ఉన్న చంద్రశేఖర్ (శేఖర్) నియోజకవర్గంలోని ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సైతం లంచాలు తీసుకుని అవినీతిలో కూరుకుపోయాడు. ఇలాంటి లంచగొండి పీఏను ఐకమత్యంతో తరిమికొడదామ’ని మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ తదితరులు అన్నారు. మంగళవారం సాయంత్రం లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలోని ఓ తోటలో టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ( చదవండి : బాలయ్య ఇలాకాలో ముసలం ) ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచ్‌లను విస్మరించి వారికి ఇష్టమొచ్చిన వారితో డబ్బు తీసుకుని పనులు చేస్తున్నారన్నారు. లేపాక్షి ఎంపీపీ హనోక్‌ను పీఏ శేఖర్ తన ఏజెంటుగా పెట్టుకుని ఇళ్ల మంజూరుకు రూ.25 వేలు, పింఛన్‌కు రూ.2 వేలు, సబ్సిడీ రుణాలు ఇవ్వాలంటే రూ.20 వేల చొప్పున ప్రజలతో వసూలు చేశారని విమర్శించారు. గ్రామాల్లోకి టీడీపీ నాయకులు వెళ్తే ప్రజలు ఉమ్మి వేస్తున్నారని, పార్టీ పరువును, నాయకుల ప్రతిష్టను దెబ్బతీశారని వారు అన్నారు. పార్టీ అధిష్టానం పీఏ శేఖర్‌ను అలాగే కొనసాగిస్తే 20 వేల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలతో వెళ్లి నిలదీస్తామని హెచ్చరించారు. సిద్ధు అనే కార్యకర్త మాట్లాడుతూ పీఏకు అనుకూలంగా లేని వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఓ మాజీ సర్పంచ్‌పై చేయి చేసుకున్నారని, ఓ మాజీ మండల అధ్యక్షుణ్ని ఏ కారణం లేకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పారు. శేఖర్ ఓ లోఫర్ అని మండిపడ్డాడు. తనకు ఎలాంటి అధికారిక పదవి లేకపోయినా పోలీస్ కాన్వాయ్ పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల సీట్లలో ఆశీనులు కావడం వంటివి చేస్తున్నాడని పలువురు ధ్వజమెత్తారు. జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, మాజీ మండల కన్వీనర్ మారుతీప్రసాద్, మాజీ ఎంపీపీలు మల్లికార్జున, ఆనంద్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నా తమపై లేనిపోని కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వైస్ ఎంపీపీ నరసింహప్ప, పార్టీ నాయకులు పాపిరెడ్డి, తిమ్మిరెడ్డి, నారాయణప్ప, ఆవులరెడ్డి, నాగలింగారెడ్డి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధం! హిందూపురం అర్బన్ : అసమ్మతివాదులను పార్టీ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఇటీవల చిలమత్తూరులోని మాజీ సర్పంచ్ ఇంట్లో అసమ్మతివాదులు నిర్వహించిన రహస్య సమావేశం, అప్పలకుంటలో సమావేశంతో పాటు మంగళవారం లేపాక్షి మండలంలో జరిగిన సమావేశాల విషయాన్ని పీఏ శేఖర్ ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ‘ఆపరేషన్ పీఏ’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్నీ ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తీవ్రంగా స్పందించి అసమ్మతివాదులను పార్టీ నుంచి బహిష్కరించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని ఫోన్లో కోరినట్టు విశ్వనీయ సమాచారం. ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు కావడం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు స్వయాన మామ కావడంతో ఆయన ఆదేశాలను పాటించాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని టీడీపీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో అసమ్మతివాదులను పార్టీ నుంచి సస్పెండ్ చేసే సూచనలు కన్పిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే హిందూపురంలో టీడీపీ బలహీనపడే పరిస్థితి ఏర్పడుతుంది.ఇదిలావుండగా, నియోజకవర్గంలోని పీఏ అనుకూలవర్గీయులు అసమ్మతివర్గంపై వేటు వేయాలని ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులతో సంతకాలు సేకరించి అధిష్టానానికి పంపినట్లు సమాచారం. ఇందులో చిలమత్తూరు మండలంలోని వారిపేర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. -
బాలయ్య ఇలాకాలో ముసలం
► ఆపరేషన్ పీఏ ► వివాదాస్పదమవుతున్న ఎమ్మెల్యే పీఏ తీరు ► సొంత పార్టీలోనే అసంతృప్తి ► హిందూపురం నుంచి సాగనంపేందుకు సీసీ, అంబికా యత్నాలు ► మండలాల్లో రహస్య సమావేశాలు హిందూపురం అర్బన్ : సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ‘తమ్ముళ్ల’ మధ్య తగువులాట మొదలైంది. మరీముఖ్యంగా నియోజకవర్గంలో అన్నీతానై వ్యవహరిస్తున్న బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్ తీరు వివాదాస్పదంగా మారింది. బాలకృష్ణ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చిపోతుండడంతో ఇక్కడ పీఏ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి పనులు మొదలుకుని పార్టీ వ్యవహారాల దాకా అన్నింట్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. ఈయన మితిమీరిన జోక్యాన్ని సొంత పార్టీ నాయకులే జీర్ణించుకోలేకపోతున్నారు. శేఖర్‌ను హిందూపురం నుంచి ఎలాగైనా సాగనంపాలన్న ఉద్దేశంతో నియోజకవర్గంలోని హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల అసంతృప్తులందరూ ఏకమవుతున్నారు. ఈ నెల 25న చిలమత్తూరు మండలం కోడూరులో జరిగిన జాతర సందర్భంగా వీరంతా కలసి మాజీ సర్పంచ్ సోమశేఖర్ ఇంట్లో సమావేశమై ‘ఆపరేషన్ పీఏ’ కార్యక్రమానికి బీజం వేశారు. దీనికి మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ నాయకత్వం వహిస్తున్నారు. తర్వాత పట్టణంలో కొందరు సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపారు. అలాగే 29వ తేదీన రాత్రి హిందూపురం మండలం అప్పలకుంటలోని డీసీ ఆంజనేయులు తోటలో రెండో రహస్య సమావేశం నిర్వహించారు. సోమవారం రాత్రి హిందూపురంలోని మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు నివాసంలో నాయకులు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.అలాగే సోమవారం లేపాక్షి మండల కేంద్రంలోని సత్తార్తోటలో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.ఈ సమావేశాల్లో ప్రధానంగా పీఏ శేఖర్ వల్ల తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక్కొక్కరు ఏకరువు పెడుతున్నారు. ప్రజాప్రతినిధులు సైతం పీఏ ముందు నిలబడాల్సి వస్తోందని, ఏపనికైనా పైకం ఇవ్వాల్సివస్తోందని వారు అంటున్నారు. ‘గంట’కట్టేదెవరు? పీఏ శేఖర్‌ను హిందూపురం నుంచి సాగనంపడం కోసం సీనియర్ నాయకులందరూ కంకణం కట్టుకున్నా.. ఆయనపై బాలకృష్ణకు ఫిర్యాదు చేసేదెవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పీఏ ఏది చెబితే అది చేయడం బాలకృష్ణకు అలవాటు. ఇలాంటి పరిస్థితుల్లో పీఏపై ఫిర్యాదు చేయడమంటే సులవైన పనికాదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. అయితే.. ఈ బాధ్యతను ఓ సీనియర్ నాయకుడిపై పెడుతున్నట్లు తెలుస్తోంది. వారు అనుకున్నట్లు ‘ఆపరేషన్ పీఏ’ కార్యక్రమం విఫలమైతే మరో రాజకీయ ఎత్తుగడకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. -
కోర్టులో లొంగిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణ
బెంగళూరు : మాగడి తాలూకాలోని కూదూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ, సీఐలను అసభ్యపదజాలాలతో దూషించిన కేసులో మాగడి ఎంఎల్ఏ బాలకృష్ణ శుక్రవారం మాగడిలోని ఒకటవ జేఎంఎఫ్‌సీ కోర్టులో లొంగిపోయారు. వివరాలు..తాలూకాలోని అయ్యండనహళ్లిలో ఇటీవల జరిగిన జాతరలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనలో తమ పార్టీకి చెందిన వారిపై దాడులకు పాల్పడ్డ వ్యక్తులను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సదరు ఎమ్మెల్యే ఎస్ఐ, సీఐలను బుధవారం అసభ్యపదజాలాలతో దూషించినట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు కూదురు సీఐ నందీశ్ జిల్లా ఎస్పీ రమేశ్‌కు ఫిర్యాదు చేశాడు. దీనికితోడు ఎంఎల్ఏ బాలకృష్ణ పోలీసు అధికారులను దూషిస్తున్న దృశ్యాలు ప్రసారమాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. దీంతో ఎస్పీరమేశ్ ఎమ్మెల్యే బాలకృష్ణపై కూదురు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారన్న విషయం తెలుసుకున్న బాలకృష్ణ తన లాయర్‌తో కలసి శుక్రవారం మాగడిలోని జేఎంఎఫ్‌సీ కోర్టులో లొంగిపోయారు. -
‘నవోదయ’ విద్యార్థులు దేశానికే ఆదర్శం కావాలి
లేపాక్షి : లేపాక్షి జవహర్ నవోదయ పాఠశాల విద్యార్థులు దేశానికే ఆదర్శం కావాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకాంక్షించారు. ఆ పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన డార్మెటరీని బుధవారం రాత్రి ఆయన ప్రారంభించారు. నవోదయ పాఠశాల కీర్తిని చాటేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన ఈ పాఠశాలను తమ తండ్రి ఎన్టీఆర్ తన హయాంలో లేపాక్షిలో సుమారు 20 ఎకరాల్లో ఏర్పాటు చేయించారని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో లేపాక్షి విద్యాలయం అన్ని రంగాల్లో జాతీయ అవార్డులు సాధించడంపై ప్రిన్సిపల్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్, వైస్ ప్రిన్సిపఽల్ మల్లికార్జున, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, మార్కెట్‌యార్డు చైర్మన్ కిష్టప్ప, ఎంపీపీ హనోక్, జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, తహశీల్దార్ ఆనందకుమార్, ఎంఈఓ నాగరాజు, సర్పంచ్ జయప్ప, ఎంపీటీసీ సభ్యుడు చిన్నఓబన్న పాల్గొన్నారు. -
మహిళలు అవగాహన పెంచుకోవాలి: బాలకృష్ణ
-
బ్రెస్ట్ క్యాన్సర్‌పై పింక్ వాక్
హైదరాబాద్ : రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కోసం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పింక్ రిబ్బన్ వాక్ జరిగింది. కేబీఆర్ పార్కు నుంచి బసవతారకం ఆసుపత్రి వరకు వాకింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత, సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, సినీ నటి మంచు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్ వల్ల చాలామంది మహిళలు చనిపోతున్నారని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం మంచి కార్యక్రమం అన్నారు. చాలామంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన లేక ఆరోగ్యపరంగా నష్టపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. -
ప్రపంచ బ్యాంకు నిధులతో ఆస్పత్రుల అభివృద్ధి
హిందూపురం అర్బన్ : ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రభుత్వాస్పత్రుల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించడానికి కేబినెట్ ఆమోదించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు అన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. అలాగే ఆసుపత్రిలో ఆవరణలో అన్న క్యాంటిన్, మినరల్ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వారితోపాటు పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ఎంపీ నిమ్మల కిష్టప్ప, కలెక్టర్ కోన శశిధర్, వైద్య విధాన పరిషత్ చైర్మన్ బీకేనాయక్ హాజరయ్యారు. ఈసందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి కామినేని శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రసుత్తం హిందూపురంలో ప్రారంభించామన్నారు. అలాగే ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచామన్నారు. తద్వారా మాతా శిశు మరణాలు నివారించామన్నారు. ఓపీ కూడా 28 శాతం పెరిగిందన్నారు. హిందూపురం ఆసుపత్రికి శనివారం అనస్థీషియన్‌ను నియమిస్తున్నామని చెప్పారు. అనంతరం మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ బాలకృష్ణ వచ్చిన తర్వాతే హిందూపురం అభివృద్ధి జరుగుతోందన్నారు. శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహించాలని బాలకృష్ణను కోరారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ బెంగళూరు రాయయ్య ఆసుపత్రిలో ఆరోగ్యసేవ సదుపాయం అందించడానికి చర్చిస్తున్నామన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ లక్ష్మి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, ఆసుపత్రి కమిటీ చైర్మన్ వెంకటస్వామి పాల్గొన్నారు. -
బాలకృష్ణ పీఏ హల్చల్
హిందూపురం అర్బన్ : హిందూపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ శనివారం హల్చల్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే స్థాయిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందిస్థాయి ఉద్యోగులపై హెచ్చరికలు జారీ చేస్తూ ఇలాగే ఉండాలంటూ హుకుం వేశారు. కొత్తగా చిత్తూరు నుంచి పదోన్నతిపై ఇక్కడి వచ్చిన సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లుకు అందరూ సహకరించాలన్నారు. ఏదైనా ఇబ్బంది కల్గించిన సహించేది లేదని హెచ్చరించారు. కండసారా ఫ్యాక్టరీ భూములు రిజిస్ట్రేషన్‌కు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరిస్తూ బెదిరిస్తుండటంతో కార్యాలయ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. -
ఆయనే హిజ్రా !
ఎమ్మెల్యే వాఖ్యలపై మండిపడిన మృతుడి తండ్రి బసప్ప బెంగళూరు: ‘ఒత్తిడికి తలొగ్గి బలవన్మరణానికి పాల్పడిన నా కుమారుడిని మాగడి నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ హిజ్రాగా పేర్కొనడం సరికాదు. నా కుమారుడిని అలా పేర్కొన్న ఆ బాలకృష్ణనే హిజ్రా’ అని ఆత్మహత్యకు పాల్పడిన కల్లప్పహండిబాగ్ తండ్రి బసప్ప ఆగ్రహం వ్యక్తి చేశారు. భార్య బసవ్వతో కలిసి ఎమ్మెల్యే భైరతి బసవరాజ్‌తో పాటు మరికొంతమంది ప్రజాప్రతినిధులు అందజేసిన రూ.7 లక్షలను చెక్కు రూపంలో బెంగళూరులోని శాసనకర భవనలో బసప్ప అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజాప్రతినిధి అయిన బాలకృష్ణ తన కుమారుడిని హిజ్రాతో సంభోదించడం సరికాదన్నారు. ఆయన రాజకీయ నడవడికను గమనిస్తే ఆయనే హిజ్రా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బాలకృష్ణ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనవసరంగా ఆత్మహత్యకు పాల్పడిన వారిని హిజ్రాలుగా పేర్కొంటారన్నారు. అందువల్ల తాను ఆ పదాన్ని వాడానన్నారు. -
ప్రోటోకాల్ ఉల్లంఘించిన బాలకృష్ణ
పుష్కరాల సందర్భంగా విజయవాడకు వచ్చిన సినీహీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారు. దుర్గగుడి మీదకు వెళ్లడానికి టికెట్ కొనాల్సి ఉన్నా కొనకుండా.. సొంత వాహనాలతో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో కలిసి ఆయన కొండ మీదకు వెళ్లిపోయారు. ఇలా ఎమ్మెల్యే నిబంధనలను ఉల్లంఘిస్తున్నా, దుర్గగుడి అధికారులు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. -
బాలకృష్ణ ఉత్తుత్తి హీరోనే
► హంద్రీనీవా జలసాధన కోసం బస్సు యాత్ర ► సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ హిందూపురం: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాల్లో అవినీతిని అంతమొందించే పాత్రలు పోషిస్తారు.. నిజజీవితంలో నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోతున్నా పట్టించుకోరని, ఆయన ఉత్తుత్తి హీరోనేనని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ఆరోపించారు. మంగళవారం పట్టణంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుబావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో అవినీతి పేరుకుపోయిందన్నారు. అనంతకు ప్రాణప్రదమైన హంద్రీ-నీవాను పూర్తి చే యడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, హంద్రీనీవా జల సాధ న కోసం జిల్లా కార్యవర్గంలో కార్యచరణను రూపొందించి హిందూపురం నుంచి గుంతకల్లు వరకు బస్సు యాత్ర చేపడతామన్నారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో సీపీఐ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంగా కొద్దో, గొప్పో నీళ్లు లభిస్తున్నాయన్నారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలకు 13 టీఎంసీల నీళ్లు అందించాల్సి ఉన్నప్పటికీ, చుక్కనీరు అందించలేదన్నా రు. లేపాక్షి భూములను అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు వెనక్కిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా రైతులకు భూములను వెనక్కి ఇవ్వకపోగా.. ఆ భూముల్లో ఒక్క పరిశ్రమను సైతం తీసుకురాలేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, జిల్లా నాయకుడు రాజారెడ్డి, స్థానిక నాయకులు దాదాపీర్, సురేష్‌బాబు, కేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. -
రెట్టింపు చేయండయ్యా..!
► అధికారంలో లేనప్పుడూ ఒకటే.. ఉన్నప్పుడూ ఒకటేనా ► మామూళ్లు పెంచకపోతే కుదరదంతే.. ► సీఎం పర్యటనకు భారీ ఖర్చవుతోంది ► మీరు సాయం చేయకుంటే ఎలా..? ► కొడికొండ చెక్‌పోస్టులో టీడీపీ నేతల హల్చల్ హిందూపురం అర్బన్:‘ మీకు ఎంత ఆదాయం ఉందో మాకు తెలుసు. మాకు ఇస్తున్న మామూళ్లు రెట్టింపు చేయండి’ అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చెక్‌పోస్టు అధికారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. విశ్వనీయ సమాచారం మేరకు... ఈ నెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వస్తున్నారు. పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్, చిలమత్తూరు టీడీపీ నాయకులు అన్సర్, మాజీ చైర్మన్ అనిల్‌కుమార్ మరికొందరు సోమవారం రాత్రి 11.45 గంటల సమయంలో కొడికొండ చెక్‌పోస్టు వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న డ్రైవర్లతో చెక్‌పోస్టులో ఎంత మమాళ్లు ఇస్తున్నారని విచారించారు. అనంతరం కార్యాలయంలోకి వెళ్లి ప్రతినెలా పంపించే మొత్తాన్ని (ముడుపులు) రెండింతలు చేయాలని రువాబు చేశారు. అధికారంలో లేనప్పుడూ ఒక్కటే ఉన్నప్పుడు ఒకటేనా.. ఇకపై అదేం కుదరదన్నారు. ముఖ్యంగా సీఎం పర్యటనకు వాహనాలు, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, వాటికోసం కొంత ఆర్థిక సాయం అందించాలని దబాయించారు. డ్యూటీలోని అధికారులు తమకు అంత ఆదాయం లేదని చెప్పడంతో ‘మాకు అన్నీ తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాలా? ఇక నుంచి మాములు పెంచకపోతే అంతే..’ అని హెచ్చరించారు. ఇదంతా చెక్‌పోస్టులోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీనిని అక్కడ డ్యూటీలో ఉన్న అధికారులు ఉన్నతాధికారులకు పంపించినట్లు విశ్వనీయసమాచారం. ఈ వ్యవహారంపై డీసీటీవో నరసింహులును వివరణ కోరగా.. ‘ఎమ్మెల్యే పీఏ, ఇతర నాయకులు వచ్చింది నిజమే..వారు బయట డ్రైవర్లతో మాట్లాడారు. తర్వాత ఆఫీసులో కొంతసేపు ఉండి వెళ్లిపోయారు. అది నేను సీసీ ఫుటేజిలో చూశాన’ని చెప్పారు. మామూళ్ల గురించి ఎటువంటి ప్రస్తావనా రాలేదని వివరణ ఇచ్చారు. అలాగే ఏఓ రాజును అడుగగా నాయకులు వచ్చారని, అయితే తాను ఆ సమయంలో డ్యూటీలో లేనన్నారు. -
సినిమాలు చూసి జబ్బులు రాకూడదు
‘రాజా చెయ్యి వేస్తే’ ఆడియో వేడుకలో చంద్రబాబు సాక్షి, విజయవాడ: మీరు తీసే సినిమాలను చూసి ప్రజల ఆరోగ్యం బాగుపడాలి కాని, లేనిపోని జబ్బులు రాకూడదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్మాతలకు సూచించారు. సినిమా వినోదం కోసమని, అయితే కొన్ని సినిమాలు చూస్తే భయం వేస్తుందన్నారు. నందమూరి బాలకృష్ణ సినిమాలు వేరేగా ఉంటాయని, మరికొందరి సినిమాలు చూస్తే రాత్రి నిద్ర పట్టదన్నారు. నారా రోహిత్, తారకరత్న, ఈషా తల్వార్ నటించిన ‘రాజా చెయ్యి వేస్తే’ చిత్రం పాటలను విజయవాడ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆవరణలో చంద్రబాబు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీలో షూటింగ్‌లకు ప్రపంచంలోనే ఎక్కడా లేని బీచ్‌లు, సుందరమైన ప్రదేశాలు ఉన్నాయన్నారు. సినీ పరిశ్రమ ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తమ కుటుంబం నుంచి వచ్చిన నారా రోహిత్ ‘బాణం’లా దూసుకుపోతున్నాడన్నారు. అమరావతిలో నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్లినప్పుడు అక్కడ కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ఒక స్థూపం వద్దకు తీసుకువెళ్లారని, అక్కడ 755 ఏళ్లకు ముందు ఇదే రోజున రాణి రుద్రమదేవి పట్టాభిషేకం చేయడం, ఆవిడ పుట్టినరోజు కావడం విశేషమన్నారు. అదేరోజు ఆడియో రిలీజ్ జరుపుకుంటున్న ‘రాజా చెయ్యి వస్తే’ విజయం సాధిస్తుందన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ... ఇటీవలే ఇద్దరు తాతలు కలసి మనమడి పుట్టినరోజు చేసుకున్నామని, ఇప్పుడు నందమూరి, నారా కుటుంబాలు కలసిన చిత్రం వేడుక చేసుకోవడం ఆనందం గా ఉందన్నారు. మంత్రులు ప్రత్తిపాటి, దేవినేని ఉమా, యాంకర్ ఝాన్సీ పాల్గొన్నారు. -
బాలయ్యపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
హైదరాబాద్: మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు. హిందూపురం ఎమ్మెల్యే హోదాలో ఉండటమే కాకుండా సినీ నటుడిగా ఉండి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కమిషన్‌ను కోరారు. సావిత్రి మూవీ ఆడియో ఫంక్షన్లో మహిళలపై బాలకృష్ణ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదైయ్యాయి. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో బాలకృష్ణ క్షమాపణ కోరారు. -
బాలయ్య వ్యాఖ్యలతో ఇరకాటంలో టీడీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఇటీవల ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో మహిళల పట్ల అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ప్రాంగణంలో టీడీపీ ఎంపీలను మంగళవారం ఇరకాటంలో పడేశాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళలపై చర్చ జరుగుతున్న సమయంలోనే కొన్ని జాతీయ ఛానళ్లలో బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చ జరిగింది. దీంతో పలువురు ఇతర పార్టీ ఎంపీలు బాలకృష్ణ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీలతో ఆసక్తిగా వాకబు చేసారు. బాలకృష్ణ ఆ వ్యాఖ్యలపై ఇప్పటికే వివరణ ఇచ్చారని, విచారం వ్యక్తం చేసారని టీడీపీ ఎంపీలు ఇబ్బందిగానే జవాబివ్వాల్సివచ్చింది. బాలకృష్ణ అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసారనే విషయంపై టీడీపీ ఎంపీల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. -
పర్యాటకంతోనే అధిక ఆదాయం
‘అనంత’లో టూరిజం సర్క్యూట్ కు రూ.25 కోట్లు లేపాక్షి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘‘వ్యవసాయం, పరిశ్రమల కంటే ఎక్కువ ఆదాయం పర్యాటక రంగం ద్వారా వస్తుంది. అందుకే రాష్ట్రంలో పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షిలో శనివారం ‘లేపాక్షి ఉత్సవాలు’ ప్రారంభమయ్యాయి. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజలకు మానసిక ఆనందం, ఆహ్లాదం అవసరం కాబట్టి ఇకపై పర్యాటకంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తీసుకుంటామన్నారు. హంద్రీ-నీవాను ఏడాదిలో పూర్తి చేస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని వెల్లడించారు. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. లేపాక్షి ఉత్సవాలను ప్రతిఏటా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. లేపాక్షిని ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేస్తామన్నారు. లేపాక్షితో పాటు హిందూపురం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాన్నారు. టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో కూచిపూడి నాట్యారామం ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయించామని చంద్రబాబు పేర్కొన్నారు. లేపాక్షి, పెనుకొండ, పుట్టపర్తి, తిమ్మమ్మ మర్రిమాను. నిమ్మలకుంట, ధర్మవరంలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ‘‘ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నా, ఎన్నో విజయోత్సవ సభల్లో పాల్గొన్నా... కానీ లేపాక్షి ఉత్సవాల్లో కలిగిన సంతోషం ఎప్పుడూ లేదు’’ అని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కొడెల శివప్రసాదరావు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, సినీనటులు జయసుధ, కన్నడ సినీ నటుడు శివరాజ్‌కుమార్, చలపతిరావు, జయప్రకాశ్‌రెడ్డి, అశోక్‌కుమార్, మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణతోపాటు మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు. -
రన్ బాలయ్య..ఉత్సవాల సందడయ్యా
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరి దృష్టి ఈ నెల 27, 28న లేపాక్షిలో నిర్వహించనున్న నంది ఉత్సవాలపైనే ఉందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం హిందూపురంలో చేపట్టిన 5కేరన్‌లో విద్యార్థులతో కలసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లేపాక్షి ఉత్సవాలను అందరూ అబ్బురపోయేలా నిర్వహిస్తామన్నారు. ఆలయ చరిత్ర, శిల్పకళ, చిత్రలేఖనం గురించి ప్రపంచానికి చాటిచెబుతామని పేర్కొన్నారు. ఉత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించామని, రావడానికి ఆయన సుముఖం వ్యక్తం చేశారని చెప్పారు. శుక్రవారం లేపాక్షిలో హెరిటేజ్ వాక్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. - హిందూపురం -
బాలకృష్ణను అనర్హుడిగా ప్రకటించాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా కొనసాగుతూ తెలంగాణలో తనకు సంబంధం లేని జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సినీనటుడు బాలకృష్ణ ఎలా ఓటు వేస్తారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బాలకృష్ణ ఓటు వేయడం పూర్తిగా చట్ట విరుద్ధం, ఎన్నికల నియమావళి ప్రకారం శాసనసభ్యుడిగా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనంతపూర్ జిల్లాకు చెందిన హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జూబ్లీహిల్స్ డివిజన్లో ఓటు వేశారు. సాధారణంగా ఏ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉంటే ఆ రాష్ట్రంలోని శాసనసభకు పోటీ చేయొచ్చు. ఒక రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. అలాంటి నిబంధన ఉన్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే గా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తారని పొన్నం ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం చెల్లుబాటు కాదని, అందువల్ల ఆయనను తక్షణం ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం లోక్ సభకు పోటీ చేయడానికి దేశంలోని ఏ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉన్నా సరిపోతుందని, కానీ అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. అలాగే ఒక జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే సంబంధిత జిల్లాలో ఓటరై ఉండాలి. ఎన్నికల నిబంధనలు ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ బాలకృష్ణ మరో రాష్ట్రంలో ఓటు వేయడం చట్ట వ్యతిరేక చర్య అవుతుందని, తక్షణం అనర్హుడిగా ప్రకటించాలని ప్రభాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తన ఫిర్యాదును అందించారు. -
‘బాలకృష్ణకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నాం’
హిందూపురం: హిందూపురం ఎమ్యెల్యే బాలకృష్ణ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ఆయనకు ఓటేసినందుకు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉందంటూ కార్మిక, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. శనివారం అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో తూముకుంట పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడారు. తూముకుంట పారిశ్రామిక వాడలో 93 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడి యాజమాన్యాలు కార్మికులపై అక్రమ కేసులు పెడుతున్నాయని వారు మండిపడ్డారు. వేతనాల పెంపు కోసం శాంతియుతంగా పోరాడుతుంటే... యాజమన్యాలు పోలీసులను ఉసిగొల్పి 11 మంది కార్మికులపై అక్రమ కేసులు పెట్టాయని ఆరోపించారు. అయినా ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తమ సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో ఓపీడీఆర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, విప్రో కార్మిక సంఘం స్థానిక అధ్యక్షుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సొంత నివాసానికి సీఎం కేసీఆర్
క్యాన్సర్ రోగులతో మాటామంతి హైదరాబాద్: హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముచ్చటించారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న తన సొంత నివాస భవనానికి వెళ్లారు. అదే సమయంలో పక్కనే ఉన్న బసవతారకం ఆసుపత్రిలో ఉన్న క్యాన్సర్ రోగులు, వారి సహాయకులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకోవటంతో పాటు రోగుల సహాయకులకు వసతి సదుపాయాలు, నైట్ షెల్టర్ల ఏర్పాటు అవసరాలను ఆరా తీశారు. ఇటీవల సినీ నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. సిటీలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులన్నింటా రోగుల సహాయకులు ఉండేందుకు వీలుగా షెల్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించటం తెలిసిందే. -
బాలయ్య ఇలాకాలో టీడీపీకి ఎదురుదెబ్బ