ఎమ్మెల్యే వాఖ్యలపై మండిపడిన మృతుడి తండ్రి బసప్ప
బెంగళూరు: ‘ఒత్తిడికి తలొగ్గి బలవన్మరణానికి పాల్పడిన నా కుమారుడిని మాగడి నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ హిజ్రాగా పేర్కొనడం సరికాదు. నా కుమారుడిని అలా పేర్కొన్న ఆ బాలకృష్ణనే హిజ్రా’ అని ఆత్మహత్యకు పాల్పడిన కల్లప్పహండిబాగ్ తండ్రి బసప్ప ఆగ్రహం వ్యక్తి చేశారు. భార్య బసవ్వతో కలిసి ఎమ్మెల్యే భైరతి బసవరాజ్‌తో పాటు మరికొంతమంది ప్రజాప్రతినిధులు అందజేసిన రూ.7 లక్షలను చెక్కు రూపంలో బెంగళూరులోని శాసనకర భవనలో బసప్ప అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజాప్రతినిధి అయిన బాలకృష్ణ తన కుమారుడిని హిజ్రాతో సంభోదించడం సరికాదన్నారు.
ఆయన రాజకీయ నడవడికను గమనిస్తే ఆయనే హిజ్రా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బాలకృష్ణ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనవసరంగా ఆత్మహత్యకు పాల్పడిన వారిని హిజ్రాలుగా పేర్కొంటారన్నారు. అందువల్ల తాను ఆ పదాన్ని వాడానన్నారు.