eunuch
-
నపుంసకుడా.. క్రూరత్వంతో సమానం
న్యూఢిల్లీ : జీవిత భాగస్వామి నపుంసకుడంటూ భార్య తప్పుడు ఆరోపణ చేయడం క్రూరత్వమేనని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ చర్య అతని ఆత్మ విశ్వాసంతోపాటు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న వాదనతో ఏకీభవించింది. ఆ దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఢిల్లీకి చెందిన ఈ దంపతులకు 2012లో వివాహమైంది. ఆమెకు అది మొదటి వివాహం కాగా, అతనికి రెండో పెళ్లి. పెళ్లికి ముందునుంచే ఆమె మానసిక సమస్యలతో బాధపడుతోందనీ ఆ విషయం దాచి పెట్టారని భర్త ఆరోపిస్తూ విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో భార్య..అతడు నపుంసకుడనీ, సంసారిక జీవితానికి పనికిరాడంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. (వామ్మో.. మళ్లీ లాక్‌డౌనా?) ఆ ఆరోపణపై న్యాయస్థానం వైద్య నిపుణుడితో పరీక్షలు చేయించి అసత్యమని గుర్తించింది. భర్త వినతి మేరకు హిందూ వివాహ చట్టం కింద విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే, అతనితో కలిసే ఉంటానని, విడాకుల తీర్పును రద్దు చేసి, వైవాహిక హక్కులను పునరుద్ధరించాలంటూ సదరు మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. శనివారం విచారణ జరిపిన జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంజీవ్ నరూలాల ధర్మాసనం..దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో ఎటువంటి లోపం లేదని పేర్కొంటూ ఆ మహిళ అప్పీల్‌ను కొట్టివేసింది. ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేసి తీవ్ర వేదనను, బాధను కలుగజేసిన మహిళతో కలిసి ఉండటం ప్రమాదకరమని ఆ వ్యక్తి భావించడం సహేతుకమేనని తెలిపింది. వీరి వైవాహిక బంధం పునరుద్ధరించడానికి వీలులేనంతగా దెబ్బతిందని వ్యాఖ్యానించింది. (విడాకులు కోరిన ఐఏఎస్ దంపతులు) -
ఆయనే హిజ్రా !
ఎమ్మెల్యే వాఖ్యలపై మండిపడిన మృతుడి తండ్రి బసప్ప బెంగళూరు: ‘ఒత్తిడికి తలొగ్గి బలవన్మరణానికి పాల్పడిన నా కుమారుడిని మాగడి నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ హిజ్రాగా పేర్కొనడం సరికాదు. నా కుమారుడిని అలా పేర్కొన్న ఆ బాలకృష్ణనే హిజ్రా’ అని ఆత్మహత్యకు పాల్పడిన కల్లప్పహండిబాగ్ తండ్రి బసప్ప ఆగ్రహం వ్యక్తి చేశారు. భార్య బసవ్వతో కలిసి ఎమ్మెల్యే భైరతి బసవరాజ్‌తో పాటు మరికొంతమంది ప్రజాప్రతినిధులు అందజేసిన రూ.7 లక్షలను చెక్కు రూపంలో బెంగళూరులోని శాసనకర భవనలో బసప్ప అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజాప్రతినిధి అయిన బాలకృష్ణ తన కుమారుడిని హిజ్రాతో సంభోదించడం సరికాదన్నారు. ఆయన రాజకీయ నడవడికను గమనిస్తే ఆయనే హిజ్రా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బాలకృష్ణ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనవసరంగా ఆత్మహత్యకు పాల్పడిన వారిని హిజ్రాలుగా పేర్కొంటారన్నారు. అందువల్ల తాను ఆ పదాన్ని వాడానన్నారు. -
వాళ్లుగాని... ‘వీల’గాని వేశారంటే!
స్వచ్ఛ భారత్... మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పే ఉద్యమం. అయితే ఏళ్లుగా ఆరుబయటే కానిచ్చేందుకు అలవాటై పోయిన పల్లెజనాలు అంత తొందరగా వింటారా. బహిరంగ మలమూత్ర విసర్జన ఆపేస్తారా? మరెలా? మధ్యప్రదేశ్ అధికారులకో బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. తట్టడమే ఆలస్యం... రంగంలోకి దిగి సెహోర్, సాగర్, విదిషా జిల్లాల్లో 300 పైచిలుకు హిజ్రాలను పోగేశారు. వీరికి విజిళ్లు అందించారు. గౌరవ వేతనమూ ఇస్తున్నారు. విజిల్స్‌తో వీరేం చేస్తారనేగా మీ డౌటు? ఎవరైనా, ఎక్కడైనా బహిరంగంగా పనికానిచ్చేస్తూ వీరి కంట పడ్డారనుకోండి... వెంటనే గట్టిగా ఈల వేస్తారు. దాంతో జనం దృష్టి అటువైపు మళ్లుతుంది. ఇంకేముంది బహిరంగ రాయుళ్లు సిగ్గుతో పరుగు లంకించుకోవాల్సిందే. ఎవరైనా మొండిఘటాలుంటే దగ్గరికి వెళ్లి మరీ... ఇలాంటి అనారోగ్యకరమైన పనులు చేయొద్దని నచ్చజెపుతారు. మీకెందుకని ఎవరైనా హిజ్రాలకు ఎదురుతిరిగే ధైర్యం చేయగలరా? అందుకే... ఈల మంత్రం బాగా పనిచేసి... పై మూడు జిల్లాల్లో బహిరంగంగా మలమూత్ర విసర్జన చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందట. -
మళ్లీ హిజ్రాగా ...
హైదరాబాద్ : హిజ్రాగా మళ్లీ తెర మీద కనిపించబోతున్నట్లు ప్రముఖ నటుడు మురళీ శర్మ ఆదివారం హైదరాబాద్‌లో వెల్లడించారు. మస్తీ చిత్రంలో హిజ్రా పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 15 ఏళ్ల క్రితం దీపక్ తిజోరీ దర్శకత్వంలో వచ్చిన ఓ సీరియల్లో ఇలాంటి పాత్ర చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ పాత్ర మంచి హిట్ అయిందని... అలాంటి పాత్రలో నటించేందుకు చాలా అవకాశాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కానీ ఆ తరహా పాత్రలో నటించ కూడదని అప్పుడు అనుకున్నానని మురళి చెప్పారు. కానీ మస్తీలో మళ్లీ అలాంటి పాత్రలో నటించే అవకాశం తనకు వచ్చిందన్నారు. హిజ్రాల కట్టుబోట్టు... వాళ్ల నడవడికతో కొన్ని సీన్లు ఇప్పటికే పూర్తయినవని మురళీ చెప్పారు. ఆసక్తి కలిగిన పాత్రలు చేయడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని మురళీ స్పష్టం చేశారు. మహేశ్ బాబు హీరోగా నటించిన అతిథి.... రానా హీరోగా నటించిన కృష్ణం వందే జగద్గురు చిత్రాలతోపాటు పలు చిత్రాలలో మురళీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
ఇద్దరివి కోసేసిన హిజ్రా
ఉత్తరప్రదేశ్‌లోని మీటర్ నగరంలో ఓ హిజ్రా.. ఇద్దరు యువకుల అంగాలను కోసిపారేసింది. ఓ పౌల్ట్రీ ఫాం వద్ద ఆ యువకులిద్దరూ స్పృహలేని పరిస్థితిలో పడి ఉండగా అటుగా వెళ్తున్నవారు గమనించి పోలీసులకు తెలిపారు. దాంతో ఈ విషయం బయటపడింది. వారిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ యువకులను సివల్ఖాస్ ప్రాంతానికి చెందిన సబీర్, జాని ప్రాంతానికి చెందిన ప్రదీప్‌గా గుర్తించారు. రైల్వేరోడ్డు వద్ద తమకు నీలమ్ అనే హిజ్రా టీ ఇచ్చిందని, అది తాగిన తర్వాత తాము స్పృహ కోల్పోయామని సబీర్ చెప్పాడు. నీలమ్ బృందంలో సబీర్ డోలు వాయించేవాడు, ప్రదీప్ వంటవాడిగా పనిచేసేవాడని పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలింపు జరుపుతున్నామన్నారు. -
'ములాయం సింగ్ యాదవ్ హిజ్రా'
ములాయం సింగ్ యాదవ్ నమ్మిన బంటు, సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజంఖాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఏకంగా తమ అధినాయకుడు ములాయంపై గతంలో ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యలు వెలుగు చూడడంతో ఖాన్ కంగుతిన్నారు. ఇప్పటికే చుట్టుముట్టిన సమస్యలకు తోడు పాత వీడియో కొత్తగా బయటకు రావడంతో ఆజంఖాన్ వ్యవహారం అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. అనధికారికంగా యూపీ కేబినెట్లో నెంబర్ 2గా కొనసాగుతున్న ఆజంఖాన్ కొంతకాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వక్ఫ్‌బోర్డు నియామకాల్లో అక్రమాలు జరిగాయని, దీనికి ఆజంఖానే కారణమంటూ షియా పెద్దలు సీఎం అఖిలేష్ కు ఫిర్యాదు చేశారు. వక్ఫ్ శాఖను ఆజంఖాన్ నియంత్రణ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇక నాలుగేళ్ల క్రితం పార్టీని వదిలి బయటకు వెళ్లిన అమర్ సింగ్ ను మళ్లీ ములాయం చేరదీయడం ఆజంఖాన్ కు కంటగింపుగా మారింది. ఈ నేపథ్యంలో 2009లో తన సొంత నియోజకవర్గం రాంపూర్ లో బహిరంగ సభలో ఆజంఖాన్ చేసిన ప్రసంగం వీడియో మంగళవారం ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. తన ప్రసంగంలో ములాయంను హిజ్రా(నపుంసకుడు)గా సంబోధించారు. ఒక్కసారి కాదు... పలుమార్లు ఈ వ్యాఖ్య చేశారు. తన నియోజకవర్గలంలోని సౌర్ తండా, మిలాక్, బిలాస్పూర్ ప్రాంతాలకు కొత్త రాష్ట్రాలకు తరలిపోకుండా ఆపడంలో ములాయం విఫలమయ్యారని, ఆయన హిజ్రాగా వ్యవహరించారని మండిపడ్డారు. అయితే ఐదేళ్ల తర్వాత ఈ వీడియో విడుదల చేయడం వెనుకున్న ఉద్దేశమేమిటో తెలియడం లేదు. ఇన్నాళ్లు దాచిపెట్టి ఇప్పుడు విడుదల చేయడం ప్రశ్నార్థకంగా మారింది. ములాయం, ఆజంఖాన్ మధ్య దూరంగా పెరుగుతున్న దశలో ఈ వీడియో విడుదల కావడం గమనార్హం. అధినేతపై చేసిన 'హిజ్రా' వ్యాఖ్యలను వివాదస్పద నేతగా ముద్రపడిన ఆజంఖాన్ ఎలా సమర్థించుకుంటారో చూడాలి. -
హిజ్రాగా పరిచయం చేసుకుని అత్యాచారం
న్యూఢిల్లీ: ఓ యువకుడు తనను హిజ్రాగా పరిచయం చేసుకుని ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. ఆమెను తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీ మధ్య ప్రాంత్రంలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన 23 ఏళ్ల సోనూ.. ఒడిశా నుంచి వచ్చిన ఓ యువతిని రైల్వే స్టేషన్లో పరిచయం చేసుకున్నాడు. తనో హిజ్రానంటూ నమ్మపలికాడు. ఉద్యోగం ఇప్పిస్తానని తన అద్దెగదికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతను నేరం ఒప్పుకోవడంతో పాటు హిజ్రాగా వేషం వేసుకుని మోసాలకు పాల్పడుతుంటానని పోలీసుల విచారణలో వెల్లడించాడు.