సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు తప్పుబట్టారు. గతంలోనూ బాలకృష్ణ అదుపుతప్పి మాట్లాడారని గుర్తుచేశారు. బాలకృష్ణ ప్రధానిని విమర్శిస్తుంటే సీఎం ముసిముసి నవ్వులు నవ్వారని విమర్శించారు. చంద్రబాబు ఒకరోజు దీక్ష వల్ల ఏపీలో పాలన స్తంభించిపోయిందని అన్నారు. చంద్రబాబు అట్టహాసంగా దీక్ష చేశారని, దీక్ష వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవడమే కాకుండా రాష్ట్ర ఖజానాకు రూ. 200 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. టీడీపీని వ్యతిరేకించే వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ తాజాగా చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నా దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దగ్గర సరైన కార్యాచరణ లేదని విమర్శించారు.
బాలకృష్ణ ఉండాల్సింది అసెంబ్లీలో కాదు..
తిరుపతి: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారు. బాలకృష్ణ పెద్ద తాగుబోతు అని, బాలకృష్ణ ఉండవలసింది అసెంబ్లీలో కాదు ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణపై తిరుపతి అర్బన్ ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment