
హైదరాబాద్: తెలుగువారికి పద్మ అవార్డులు ప్రకటించడంపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు తేజం డాక్టరు డాక్టర్ నాగేశ్వరరెడ్డి, నందమూరి బాలకృష్ణకు అవార్డులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.
డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డి వైద్యరంగంలో, కళారంగంలో నందమూరి బాలకృష్ణ సేవలకు తగిన గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిభను గుర్తించి ఈ పురస్కారాలు ఇవ్వడం సంతోషమని ఓ ప్రకటనలో కేతిరెడ్డి అభినందనలు తెలిపారు.