padma bhushan award
-
నందమూరి బాలకృష్ణకు అల్లు అర్జున్ అభినందనలు
నందమూరి బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పద్మభూషణ్ అవార్డుకు పూర్తిగా అర్హులంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. తెలుగు సినిమాకు అందించిన సేవలకు సరైన గుర్తింపు లభించిందన్నారు. అజిత్ కుమార్ సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా పద్మ అవార్డులకు ఎంపికైన శోభన, శేఖర్ కపూర్, అనంత్ నాగ్‌లకు అభినందనలు తెలిపారు. పద్మ అవార్డులు సాధించిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. కళల విభాగంలో గుర్తింపు దక్కడం నా హృదయాన్ని సంతోషంతో నింపిందని అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. Heartfelt congratulations to #NandamuriBalakrishna garu on receiving the prestigious #PadmaBhushan award, this recognition is well-deserved for your contributions in telugu cinema. My dear #AjithKumar garu, your achievement is equally inspiring and commendable.Also…— Allu Arjun (@alluarjun) January 27, 2025 -
మా నాన్న బతికుంటే ఇంకా సంతోషంగా ఉండేది: అజిత్ కుమార్
తనకు పద్మభూషణ్ అవార్డ్(padma Bhushan Award) ప్రకటించడంపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కుమార్ (Ajith Kumar) స్పందించారు. ఈ అవార్డ్ ప్రకటించినందుకు ముందుగా భారత ప్రభుత్వం, సినిమా రంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు చూడటానికి మా నాన్న పి సుబ్రమణ్యం బతికుంటే ఇంకా సంతోషపడే వాడినని అన్నారు. అలాగే నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన తల్లి మోహిని, భార్య షాలిని, పిల్లలు అనౌష్క, ఆద్విక్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.కాగా.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ రంగానికి చెందిన వారిలో అజిత్‌కుమార్, నందమూరి బాలకృష్ణ, శోభనతో పాటు మరికొందరికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు."భారత రాష్ట్రపతి నుంచి గౌరవ పద్మ అవార్డును స్వీకరిస్తున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి ఎంపిక చేసిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంత స్థాయిలో గుర్తింపు పొందడం, అలాగే దేశానికి నా కృషిని గుర్తించినందుకు కృతజ్ఞుడను. ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు. చాలా మంది సమిష్టి కృషి, మద్దతు వల్లే ఇది సాధ్యమైంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేరణ, సహకారం, మద్దతు నా ప్రయాణంలో కీలక పాత్ర పోషించాయి " అని అజిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా.. ప్రస్తుతం అజిత్ కుమార్ (Ajith Kumar) విదాముయార్చి (Vidaamuyarchi Movie) మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌తో నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు. ట్రైలర్ చూస్తుంటే మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికే విదాముయార్చి విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
హైదరాబాద్: తెలుగువారికి పద్మ అవార్డులు ప్రకటించడంపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు తేజం డాక్టరు డాక్టర్ నాగేశ్వరరెడ్డి, నందమూరి బాలకృష్ణకు అవార్డులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డి వైద్యరంగంలో, కళారంగంలో నందమూరి బాలకృష్ణ సేవలకు తగిన గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిభను గుర్తించి ఈ పురస్కారాలు ఇవ్వడం సంతోషమని ఓ ప్రకటనలో కేతిరెడ్డి అభినందనలు తెలిపారు. -
బాబాయికి అభినందనలు తెలిపిన యంగ్ టైగర్
నందమూరి బాలకృష్ణకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డ్‌కు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. మీరు అటు సినిమా.. ఇటు ప్రజలకు అందించిన సేవలకు దక్కిన గుర్తింపు అంటూ ట్వీట్ చేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్, అనంత్, నాగ్, నటి శోభన, దర్శకుడు శేఖర్ కపూర్లకు పద్మభూషణ్ పురస్కారాలను అనౌన్స్ చేసింది. నటసింహంగా గుర్తింపు..నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయస్సు 14 ఏళ్లు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.బాలకృష్ణ హీరోగా తొలి చిత్రం..1984 జూన్ 1న రిలీజైన ‘సాహసమే జీవితం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత ‘డిస్కో రాజా, జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబరు 7న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో సోలో హీరోగా స్థిరపడ్డారాయన. ఆ తర్వాత ‘కథానాయకుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, సమర సింహారెడ్డి, నరసింహæనాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, లయన్, పైసా వసూల్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. 50 ఏళ్ల నట ప్రస్థానం..‘భైరవ ద్వీపం, శ్రీకష్ణార్జున విజయం,పాండురంగడు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగానూ నిరూపించుకున్నారు బాలకృష్ణ. నటుడిగా పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారాయన. ఇప్పటివరకు 110 సినిమాల్లో నటించారు. వాటిలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణకి భార్య వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.— Jr NTR (@tarak9999) January 25, 2025 -
Padma awards 2025: పారిశ్రామిక పద్మాలు
ముంబై: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma awards 2025) ప్రకటించింది. వీరిలో వాణిజ్యం, పరిశ్రమల విభాగం నుంచి 10 మంది ఉన్నారు. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, దివంగత ఒసాము సుజుకీని (మరణానంతరం) పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. తమిళనాడుకు చెందిన టెక్స్టైల్ పారిశ్రామికవేత్త నల్లి కుప్పుస్వామి చెట్టి, జైడస్ లైఫ్‌సైన్సెస్ చైర్మన్ పంకజ్ పటేల్ పద్మ భూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇక ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్యతోపాటు ఓంకార్ సింగ్ పాహ్వా (అవాన్ సైకిల్స్), పవన్ గోయెంకా (మహీంద్రా), ప్రశాంత్ ప్రకాశ్ (యాక్సెల్ పార్ట్ న ర్స్), ఆర్జీ చంద్రమోగన్ (హట్సన్ ఆగ్రో ప్రొడెక్ట్స్), సజ్జన్ భజంకా (సెంచురీ ప్లైబోర్డ్స్), సాలీ హోల్క ర్కు (రేష్వా సొసైటీ) పద్మశ్రీ అవార్డు వరించింది.ఒసాము సుజుకీ1930 జనవరి 30న జపాన్‌లోని గేరోలో జన్మించారు. సుజుకీ మోటార్ కార్పొరేషన్ 1981లో భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. తర్వాతి కాలంలో మారుతీ సుజుకీ ఇండియాగా కంపెనీ అవతరించింది. దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి విదేశీ కంపెనీ కూడా ఇదే. భారత ప్రభుత్వం ఒసాము సేవలు గుర్తించి 2007లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2024 డిసెంబర్ 25న మరణించారు.నల్లి కుప్పుస్వామి చెట్టితమిళనాడుకు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త. కాంచీపురంలో 1940 నవంబర్ 9న జన్మించారు. రామకృష్ణ మిషన్ స్కూల్ విద్యాభ్యాసం చేశారు. వాషింగ్టన్ వర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో పట్టా అందుకున్నారు. వారసత్వ వ్యాపారమైన నల్లీ సిల్క్ పగ్గాలను 1958లో చేపట్టారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి 2000లో కలైమమణి అవార్డు, భారత ప్రభుత్వం నుంచి 2003లో పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. పంకజ్ పటేల్1953లో జన్మించారు. తండ్రి స్థాపించిన క్యాడిలా హెల్త్‌కేర్‌లో (ప్రస్తుతం జైడస్ లైఫ్‌సైన్సెస్) 1976లో చేరారు. క్యాడిలా ఫ్యాక్టరీకి ఎనమిదేళ్ల వయసు నుంచే తండ్రితో కలిసి వెళ్లే వారు. కంపెనీ తయారీ షుగర్‌ఫ్రీ, ఎవర్‌యూత్ బ్రాండ్లు ప్రాచుర్యం పొందాయి. 70కిపైగా దేశా లకు కంపెనీ విస్తరించింది. భారత్‌లో అయిదవ అతిపెద్ద ఫార్మా సంస్థగా ఎదగడంలో కీలకపాత్ర పోషించారు. 2024 అక్టోబర్‌లో ఫోర్బ్స్‘భారత 100 మంది సంపన్నుల’ జాబితాలో 10.2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో 24 ర్యాంకులో నిలిచారు.అరుంధతీ భట్టాచార్య సేల్స్‌ఫోర్స్ ఇండియా చైర్పర్సన్, సీఈవోగా ఉన్నా రు. 1977లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. 2013లో ఎస్బీఐ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్య తలు చేపట్టారు. 200 ఏళ్ల ఎస్బీఐ చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా వినుతికెక్కారు. బ్యాంకు మహిళా ఉద్యోగులకు ప్రసూతి లేదా పెద్దల సంరక్షణ కోసం రెండేళ్ల విశ్రాంతి సెలవు విధానాన్ని ప్రవేశపెట్టారు. భారత ఆర్థిక రంగంలో 40 ఏళ్లకుపైగా అనుభవం ఆమె సొంతం. ఫోర్బ్స్ ప్రకటించిన ‘ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల’ జాబితాలో చోటు సంపాదించారు. -
ప్రతిభా భూషణాలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్, అనంత్,నాగ్, నటి శోభన, దర్శకుడు శేఖర్ కపూర్లకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.పట్టుదలే పద్మభూషణ్ వరకూ...అజిత్ తండ్రి సుబ్రమణి తమిళనాడులో పుట్టారు. అయితే కేరళ మూలాలు ఉన్న కుటుంబం. తల్లి మోహినిదిపాకిస్థాన్ లోని కరాచీ. కోల్‌కతాలో స్థిరపడ్డ సింధీ కుటుంబం. కాగా కోల్‌కతాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో మోహినితో ప్రేమలో పడ్డారు సుబ్రమణి. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సికిందరాబాద్‌లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఇక్కడ ఐదేళ్లు ఉంది ఆ కుటుంబం. వీరికి ముగ్గురు కుమారులు. అజిత్ రెండో కొడుకు. అజిత్‌కి ఏడాదిన్నర వచ్చాక చెన్నైలో స్థిరపడ్డారు. చదువులో లాస్ట్... అజిత్‌కి పెద్దగా చదువు అబ్బలేదు. అయితే క్రికెట్లో బెస్ట్. ఎన్ సీసీలోనూ మంచి ర్యాంకు సంపాదించాడు. కానీ సరిగ్గా చదవకపోవడంతో స్కూలు యాజమాన్యం అజిత్‌ని పదో తరగతి పరీక్షలు రాయడానికి అనుమతించకపోవడంతోపాటు స్కూలు నుంచి పంపించేసింది. ఆ తర్వాత రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు షోరూమ్‌లో మెకానిక్ అప్రెంటిస్‌గా చేరడం, తల్లిదండ్రుల ్రపోద్భలంతో గార్మెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్‌లో చేరడం, అవి చేస్తూనే రేసుల్లోపాల్గొనడం, ఇలా సాగింది. ఇక ఎవరో ఇచ్చిన సలహాతో సినిమాల్లో ప్రయత్నించాలనుకున్నారు అజిత్. ప్రముఖ నటుడు–రచయిత–దర్శకుడు గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘ప్రేమ పుస్తకం’ సినిమా ఆరంభమైంది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పడంతో నిర్మాత పూర్ణచంద్రరావు అజిత్‌ని హీరోగా తీసుకున్నారు. అయితే శ్రీనివాస్ మృతి చెందడంతో షూటింగ్ ఆగింది. ఆ తర్వాత ఆ చిత్రాన్ని మారుతీరావు పూర్తి చేశారు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు.‘ఆశై’తో హిట్ ట్రాక్: ఎస్పీబీయే తమిళ దర్శకుడు సెల్వకి చెప్పి, అజిత్‌కి ‘అమరావతి’లో హీరోగా నటించే చాన్స్ ఇప్పించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతోపాటు లుక్స్, నటన పరంగా అజిత్‌కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఓ రేసుకి సంబంధించిన ట్రయల్కి వెళుతుండగా జరిగిన ప్రమాదంలో వెన్నెముకకి సర్జరీ జరిగింది. ఆ తర్వాత ‘ఆశై’ (1995)తో అజిత్ కెరీర్ హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత చేసిన ‘కాదల్ కోటై్ట’ (ప్రేమ లేఖ), ‘వాలి’ వంటివి సూపర్ హిట్. సినిమాలు చేస్తూనే బైక్, కారు రేస్లకూ వెళుతుంటారు. ఇటీవల కారు రేసులో అజిత్ టీమ్ విజయం సాధించింది. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రాల్లో ‘విడాముయర్చి’ తెలుగులో ‘పట్టుదల’గా విడుదల కానుంది. జీవితంలోనూ అజిత్‌కి పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదలే నేడు ‘పద్మభూషణ్’ వరకూ తీసుకొచ్చింది. ఇక ‘అమర్కలమ్’ (1999) సినిమాలో నటించినప్పుడు అజిత్, హీరోయిన్ షాలిని ప్రేమలో పడ్డారు. 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.యాక్టివ్‌గా యాక్టింగ్ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ (76) గురించి నేటి తరానికి చెప్పాలంటే ‘కేజీఎఫ్’ సినిమా చాలు. ‘ప్రేమ లేఖలు’ (1977), ఆ తర్వాత ‘శాంతి క్రాంతి’, ‘శంఖారావం’ వంటి చిత్రాలతో నాటి తరం తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు బాగా గుర్తింపు ఉంది. ఇక నేటితరం తెలుగు ప్రేక్షకులకు ‘కేజీఎఫ్’ (2018) ద్వారా దగ్గరయ్యారు అనంత్ నాగ్. ఈ సినిమాలో ఆయన రచయితపాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘సంకల్ప’ (1973) చిత్రంతో కన్నడంలో నటుడిగా పరిచయం అయ్యారు అనంత్ నాగ్. ఆ చిత్రం పలు అవార్డులు సాధించడంతోపాటు నటుడిగానూ గుర్తింపు తెచ్చిపెట్టింది. 50 ఏళ్ల నట జీవితంలో దాదాపు రెండువందల కన్నడ చిత్రాల్లోనూ, హిందీ, మరాఠీ, తెలుగు, మలయాళం, ఆంగ్లంలో దాదాపు వంద చిత్రాలు... మొత్తంగా మూడ వందల చిత్రాల్లో నటించారు అనంత్ నాగ్. కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. పలు టీవీ షోల్లోనూ నటించారు. 76 ఏళ్ల వయసులోనూ యాక్టివ్‌గా ఉంటూ... సినిమాలు చేస్తున్నారు.కొత్త పంథాకి భూషణంశేఖర్ కపూర్ భారతీయ సినిమా రంగానికి, ముఖ్యంగా బాలీవుడ్‌కి మ్యాజికల్ టచ్ ఇచ్చిన నిన్నటి తరం దర్శక–నిర్మాత. చేసినవి కొన్ని సినిమాలే అయినా, సంపాదించిన కీర్తి, భారతీయ సినిమాకి తెచ్చిపెట్టిన గౌరవం గొప్పవి. ఇప్పటిపాకిస్థాన్లోని లాహోర్‌లో జన్మించారు. సినిమాల మీద మక్కువతో ముంబయి చేరుకున్నారు. మొదట నటుడుగా ప్రయత్నాలు చేశారు. దేవానంద్ ‘ఇష్క్ ఇష్క్ ఇష్క్’లో నటించారు. దూరదర్శన్ తొలిదశలో వచ్చిన ‘ఖాన్ దాన్’ మొదలైన టీవీ సీరియల్స్‌లో ప్రేక్షకులకి గుర్తుండిపోయే కొన్నిపాత్రలు చేశారు. ‘మాసూమ్’తో డైరెక్టర్‌గా...‘మాసూమ్’ సినిమాతో డైరెక్టర్‌గా తన కెరీర్‌ని కొత్త దారి పట్టించారు. ‘ది మేన్, విమెన్ అండ్ చైల్డ్’ అనే ఇంగ్లిష్ నవల ఆధారంగా శేఖర్ కపూర్ తీసిన సినిమా అది. భారతీయ సినిమాకి తెలియని కొత్త కథేమీ కాదు. కానీ సెన్సిబుల్‌గా కథని చెప్పారు. దాంతో శేఖర్ కపూర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.స్టయిల్ మార్చేశారుఇండియాలో అన్ని వర్గాల ఆడియన్స్‌కి శేఖర్ కపూర్‌ని ఓ బ్రాండ్‌గా మార్చిన సినిమా ‘మిస్టర్ ఇండియా’. ‘ది ఇన్విజిబుల్ మేన్’ అనే కామిక్స్ స్ఫూర్తితో ‘మిస్టర్ ఇండియా’ కథ రూపొందింది. హిందీలో అదృశ్య వ్యక్తి హీరోగా అంతకు మునుపు కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఈ ఐడియానిపాపులర్ పల్ప్ ఫిక్షన్ చేసిన ఘనత శేఖర్ కపూర్‌దే. కమర్షియల్ కథలను కొత్తగా చెప్పే డైరెక్టర్ వచ్చాడని బాలీవుడ్ మురిసిపోయినంత సేపు పట్టలేదు – శేఖర్ కపూర్ తన స్టయిల్ మార్చేశారు.బాండిట్ క్వీన్‌కి అడ్డంకులు... అవార్డులుచంబల్ లోయకి చెందిన బందిపోటు పూలన్ దేవి జీవిత గాథ ఆధారంగా ‘బాండిట్ క్వీన్’ సినిమా తీశారు శేఖర్. సెన్సేషనల్ హిట్ అయిన ఆ సినిమా పలు సెన్సార్ సమస్యలు ఎదుర్కొంది. రిలీజ్ అయ్యాక చాలా అవార్డులు గెలుచుకుంది. శేఖర్ కపూర్ దృక్పథాన్ని మార్చింది. బ్రిటన్ మహారాణి జీవితం ఆధారంగా ‘ఎలిజిబెత్’ సినిమా తీశారు. అంతర్జాతీయంగా శేఖర్ కపూర్ పేరు మారుమోగిపోయింది. ఆ చిత్రం ఆస్కార్ అవార్డ్స్‌లో ఏడు నామినేషన్లు దక్కించుకుంది. ఆ తర్వాత ఆయన ‘ది ఫోర్ ఫెదర్స్’ (2002), ‘ఎలిజెబెత్’కి సీక్వెల్‌గా ‘ఎలిజెబెత్: ది గోల్డెన్ ఏజ్’ (2007)ని తెరకెక్కించారు. ఎన్నో ఏళ్ళ క్రితమే భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన శేఖర్ కపూర్ పద్మ భూషణుడు కావడం చిత్రసీమకు లభించిన గిఫ్ట్.– తోట ప్రసాద్, ప్రముఖ సినీ రచయితఆమె కెరీర్ శోభాయమానంకేరళలోని త్రివేండ్రంలో (ప్రస్తుతం తిరువనంతపురం) 1970 మార్చి 21న జన్మించారు శోభన. ఆమె పూర్తి పేరు శోభనా చంద్రకుమార్ పిళ్లై. నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభనకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా అక్కినేని నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్’ (1986) సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు శోభన. ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్‌బాబు, రజనీకాంత్, మోహన్ లాల్, రాజేంద్ర ప్రసాద్, శరత్ బాబు, కార్తీక్ వంటి హీరోల సరసన నటించారు.మాతృభాష మలయాళంతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సినిమాలు చేసిన శోభన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ‘రుద్రవీణ, అభినందన, అల్లుడుగారు, అప్పుల అప్పారావ్, రౌడీగారి పెళ్లాం, రౌడీ అల్లుడు’ వంటి పలు తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. నటనలోనే కాకుండా నాట్యంలో కూడా అద్భుతంగా రాణించారు. చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ పొందిన ఆమె క్లాసికల్ డ్యాన్సర్‌గానూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఆమె దగ్గర నటనలోనూ, నాట్యంలోను శిక్షణ తీసుకుంటుండటం విశేషం. 1994లో ‘కళార్పణ’ అనే సంస్థను నెలకొల్పారు శోభన. ప్రస్తుతం ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని కళకు అంకితం చేశారు. ఓ వైపు దేశ విదేశాల్లో క్లాసికల్ డ్యాన్స్ షోలు చేస్తూ.. మరోవైపు డ్యాన్స్ స్కూల్ నడిపిస్తున్నారామె.నటసింహ కీర్తి కిరీటంలో...నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయస్సు 14 ఏళ్లు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.‘సాహసమే జీవితం’తో హీరోగా1984 జూన్ 1న రిలీజైన ‘సాహసమే జీవితం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత ‘డిస్కో రాజా, జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబరు 7న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో సోలో హీరోగా స్థిరపడ్డారాయన. ఆ తర్వాత ‘కథానాయకుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, సమర సింహారెడ్డి, నరసింహæనాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, లయన్, పైసా వసూల్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. 50 ఏళ్ల నట ప్రస్థానంలో...‘భైరవ ద్వీపం, శ్రీకష్ణార్జున విజయం,పాండురంగడు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగానూ నిరూపించుకున్నారు బాలకృష్ణ. నటుడిగా పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారాయన. ఇప్పటివరకు 110 సినిమాల్లో నటించారు. వాటిలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణకి భార్య వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. -
పద్మ భూషన్ పతకం విక్రయానికి యత్నం.. ఐదుగురు అరెస్ట్!
దేశంలోనే మూడవ అత్యున్నత పౌర గౌరవ పురస్కార పతకం పద్మభూషణ్ చోరీకి గురైన ఉదంతం ఢిల్లీలో వెలుగు చూసింది. సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకం చోరీకి గురైంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ చోరీ విషయం మెడల్ అందుకున్న వ్యక్తికి కూడా తెలియలేదు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకాన్ని అతని సహాయకుడు దొంగిలించాడు. ఈ పద్మభూషణ్ పతకాన్ని ఒక దుకాణంలో విక్రయించేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నిస్తుండగా ఈ చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మెడల్‌పై పద్మభూషణ్ అని రాసి ఉన్నందున, ఈ పతకాన్ని కొనుగోలు చేసేందుకు స్వర్ణకారుడు దిలీప్ నిరాకరించాడు. దీంతో ఆ ముగ్గురూ మరో స్వర్ణకారుని సంప్రదించారు. ఆగ్నేయ జిల్లా పోలీసు డిప్యూటీ కమిషనర్ రాజేష్ దేవ్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ హరిసింగ్, రింకీ వేద్ ప్రకాష్ అనే ముగ్గురు స్నేహితులు పద్మభూషణ్ పతకాన్ని విక్రయించేందుకు కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో నగల దుకాణం నడుపుతున్న దిలీప్‌ను సంప్రదించారని తెలిపారు. అయితే దిలీప్ ఈ విషయాన్ని కల్కాజీ పోలీసులకు తెలియజేశాడు. పోలీసు బృందం అక్కడకి చేరుకునేలోపే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కేసు తీవ్రతను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారుల అప్రమత్తమై ఆ ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. నిందితులంతా మదన్‌పూర్ ఖాదర్‌కు చెందినవారని దిలీప్ తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మదన్‌పూర్ ఖాదర్ నివాసి శ్రవణ్ కుమార్ (33), హరి సింగ్ (45), రింకీ దేవి (40), వేద్ ప్రకాష్ (39), ప్రశాంత్ బిస్వాస్ (49)గా గుర్తించారు. నిందితుడు శ్రవణ్ కుమార్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత జిసి ఛటర్జీ ఇంట్లో మెడికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. -
సుధామూర్తికి పద్మభూషణ్.. అత్తపై బ్రిటన్ ప్రధాని ప్రశంసలు
సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయిత్రి, విద్యావేత్త సామాజిక వేత్తగా అందరికీ సుపరిచితురాలే. తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఆలోచించే వారు అతి తక్కువమంది కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సుధామూర్తి ముందువరుసలో ఉంటారు. వేల కోట్లకు అధినేత అయినా.. సింప్లీ సిటీకి మారుపేరులా ఉంటారు. కంప్యూటర్ ఇంజనీర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్,. గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే పలు అనాథాశ్రయాలను ప్రారంభించిన ఆమె.. గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో సేవలందింస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడుతున్నారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తల్లికి దక్కిన గౌరవంపై మురిసిపోతూ ఆమె కూతురు, యూకే ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత మూర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. రాష్ట్రపతి నుంచి మా అమ్మ పద్మభూషన్ను అందుకుంటున్న క్షణాలను చూసి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యానని అన్నారు. సమాజం కోసం చేసిన సేవకు ఆమెకీ అవార్డు దక్కిందని చెప్పుకొచ్చారు ‘25 సంవత్సరాలుగా స్వచ్చంద సంస్థలను ఏర్పాటు చేసి అక్షరాస్యతను పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలలు నిర్వహిస్తుంది. ఆమె జీవితం నాకొక ఉదాహరణ. ఎలా జీవించాలో తనను చూసి నేర్చకున్నాను. గుర్తింపుకోసం అమ్మ ఎప్పుడూ ఎదురు చూడలేదు. కానీ నిన్న దక్కిన గుర్తింపు ప్రత్యేకం. మా తల్లిదండ్రులు మాకు(తమ్ముడు, నాకు) కష్టపడి పనిచేయడం, మానవత్వం చూపడం, నిస్వార్థంగా జీవించడం వంటి ఎన్నో విలువలు నేర్పించారు’ అంటూ తల్లిపై ప్రేమను చాటుకున్నారు. అక్షతమూర్తి పోస్టుపై అల్లుడు రిషి సునాక్ స్పందించారు. సుధామూర్తి ఘనతను కొనియాడుతూ.. ‘గర్వించదగ్గ రోజు’ అంటూ క్లాప్ ఎమోజీని షేర్ చేశారు. కాగా ఇప్పటికే సుధామూర్తి అందించిన సామాజిక కార్యక్రమాలకుగానూ 2006లో ఆమెను పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Akshata Murty (@akshatamurty_official) -
పద్మభూషణ్ స్వీకరించిన కుమార మంగళం బిర్లా
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా బుధవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. దీనితో బిర్లా కుటుంబంలో దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న నాల్గవ వ్యక్తిగా నిలిచారు. ఆయన ముత్తాత జీడీ బిర్లా 1957లో పద్మవిభూషణ్ గ్రహీత. తల్లి రాజశ్రీ బిర్లా 2011లో పద్మభూషణ్ పురస్కారం పొందారు. కుమార మంగళం బిర్లా తాత బీకే బిర్లా బంధువు జీపీ బిర్లా 2006లో పద్మభూషణ్‌ను అందుకున్నారు. ఆయన 28 ఏళ్ల సుదీర్ఘ వాణిజ్య అనుభవంలో గ్రూప్ టర్నోవర్ 30 రెట్లు పెరిగి 60 బిలియన్ డాలర్లకు చేరింది. ‘‘ఉన్నత లక్ష్యానికి వ్యాపారం దోహదపడుతూ, జీవితాలను సుసంపన్నం చేయాలన్న ఆదిత్య బిర్లా గ్రూప్ సంకల్పానికి ఈ అవార్డు ఒక గుర్తింపు’’ అని కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. ఈ ఏడాది మరణానంతర పద్మశ్రీ అవార్డులు లభించిన వారిలో ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ రస్నా వ్యవస్థాపకుడు, దివంగత అరీజ్ ఖంబట్టా, దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఉన్నారు. -
పద్మభూషణులు.. హైదరాబాద్ నుంచి ఇద్దరికి పురస్కారాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా సిగలో పద్మాలు వికసించాయి. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా తొమ్మిది మందికి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించగా.. వీరిలో ఇద్దరు ప్రముఖులు జిల్లాకు చెందిన వారే ఉండటం విశేషం. వీరిలో ఒకరు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీత్రిదండి చినజీయర్‌స్వామి కాగా.. మరొకరు ధ్యాన గురువు కమలేష్ డి. పటేల్(దాజీ). ఆధ్యాత్మిక, సేవాతత్పరుడు ఆధ్యాత్మిక రంగంతో పాటు విద్య, వైద్య, సామాజిక రంగాల్లోనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చినజీయర్‌స్వామిని పద్మభూషణ్ వరించింది. ఏపీకి చెందిన ఆయన ఇరవై ఏళ్ల క్రితం శంషాబాద్ సమీపంలో శ్రీరామనగరం పేరుతో ఆశ్రమం ఏర్పాటు చేశారు. జీవా గురుకులం, నేత్ర విద్యాలయం, దివ్యసాకేతం వంటి సంస్థలను నెలకొల్పి ఆయా రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారు. సమతా స్ఫూర్తి కేంద్రంలో 216 అడుగుల ఎత్తైన భారీ సమతా మూర్తి విగ్రహాన్ని నెలకొల్పారు. ఇందులో 108 దివ్య క్షేత్రాలను ఏర్పాటు చేశారు. వికాస తరంగిణి పేరుతో విపత్తుల సమయంలో బాధితులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేత్ర విద్యాలయంలో అంధ విద్యార్థులకు వసతి, చదువు, ఉపాధి అవకాశాలు కల్ఫిస్తున్నారు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లక్షలాది మంది భక్తులు, అభిమానులు ఉన్నారు. చినజీయర్‌కు అవార్డు రావడంపై ఆయన శిష్యులు హర్షం వ్యక్తం చేశారు. ధ్యానగురువు.. ప్రకృతి ప్రేమికుడు గుజరాత్‌కు చెందిన ప్రముఖ ధ్యాన గురువు కమలేశ్ డి. పటేల్‌ను పద్మభూషణ్ అవార్డు వరించింది. ధ్యానం ద్వారా ఆరోగ్యం, ఏకాగ్రతను సాధించాలనే సంకల్పంతో పదేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలానికి చేరుకున్నారు. సుమారు 1,400 ఎకరాల్లో కన్హా శాంతి వనం పేరుతో ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్‌ను నెలకొల్పారు. ఒకేసారి లక్ష మంది కూర్చుని ఏకాంతంగా ధ్యానం చేసే అవకాశం కల్పించారు. ఇక్కడ 160 దేశాలకు చెందిన సుమారు ఐదువేల మంది అభ్యాసికులు ఉన్నారు. ఒకప్పుడు ఎడారిలా ఉన్న ప్రాంతంలో లక్షలాది మొక్కలు నాటి.. పచ్చదనం పరిఢవిల్లేలా చేశారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న అనేక మందికి ధ్యానంతో నయం చేస్తున్నారు. 2025 నాటికి ఇక్కడ 30 బిలియన్ల మొక్కల నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా ఇక్కడ ఏటా వేలాది మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు. ధ్యాన గురువుగా ఆయన చేస్తున్న సేవలకు ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్నారు. ఈ క్రమంలో పద్మభూషణ్ రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 1978 గుజరాత్ వర్సిటీలో ఫార్మసీ కోర్సులో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో అమెరికాలోని న్యూయార్క్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. కమలేశ్ పటేల్‌కు ఇద్దరు కుమారులు, ముగ్గురు మనవలు ఉన్నారు. చదవండి: ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మొత్తం 106 మందికి -
‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మొత్తం 106 మందికి
సాక్షి, న్యూఢిల్లీ: 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి ఆరుగురికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ దక్కింది. 9 మందికి పద్మభూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఈసారి ఎవరికీ ప్రకటించలేదు. ఇటీవల మరణించిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ దివంగత నేత ములాయంసింగ్ యాదవ్‌తో పాటు ప్రముఖ తబల వాయిద్య కళాకారుడు జాకీర్ హుస్సేన్, మాజీ విదేశాంగ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ పద్మ విభూషణ్ గ్రహీతల్లో ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామితో పాటు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా, సుధామూర్తి, గాయకురాలు వాణీ జయరాం తదితరులు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన వారిలో ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 10 మందికి పద్మశ్రీ పురస్కారం లభించింది. వీరిలో ఏపీ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సామాజిక సేవకుడు సంకురాత్రి చంద్రశేఖర్ సహా ఏడుగురు, తెలంగాణ నుంచి సాహితీవేత్త బి.రామకృష్ణారెడ్డితో పాటు మొత్తం ముగ్గురున్నారు. అలాగే ఆధ్యాత్మిక రంగంలో కమలేశ్ డి.పటేల్‌కు కూడా తెలంగాణ కోటాలో పద్మభూషణ్ దక్కడం విశేషం. మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా దూదేకుల ఖాదర్ వలీకి కర్నాటక కోటాలో పద్మశ్రీ లభించింది. పద్మ అవార్డుల విజేతల్లో 19 మంది మహిళలు, ఇద్దరు విదేశీ/ఎన్ఆర్ఐ కేటగిరీకి చెందినవారున్నారు. పద్మ పురస్కారాల విజేతలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. తమ తమ రంగాల్లో వారు చేసిన కృషి సాటిలేనిదంటూ ప్రశంసించారు. ప్మద అవార్డుల గ్రహీతలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి భవన్లో ఏటా మార్చి లేదా ఏప్రిల్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్ ములాయంసింగ్ యాదవ్ (మరణానంతరం), జాకీర్ హుస్సేన్, ఎస్ఎం కృష్ణ, ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషీ (మరణానంతరం), ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ మహాలనబిస్ (మరణానంతరం), ఇండో–అమెరికన్ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ వర్ధన్ పద్మభూషణ్ చినజీయర్ స్వామి (ఆధ్యాత్మిక రంగం), కుమారమంగళం బిర్లా (వాణిజ్యం, పరిశ్రమలు), వాణీ జయరాం (కళ), సుధామూర్తి (సామాజిక సేవ), కమలేష్ డి.పటేల్ (ఆధ్యాత్మిక రంగం), ఎస్ఎల్ భైరప్ప (కళ), దీపక్‌ధర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), సుమన్ కల్యాణ్‌పుర్ (కళ), కపిల్ కపూర్ (సాహిత్యం–విద్య) పద్మశ్రీ ఏపీ నుంచి: సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (కళ), సంకురాత్రి చంద్రశేఖర్ (సామాజిక సేవ), గణేశ్ నాగప్పకృష్ణరాజనగర (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), సీవీ రాజు (కళ), అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), కోట సచ్చిదానంద శాస్త్రి (కళ), ప్రకాశ్ చంద్రసూద్ (సాహిత్యం–విద్య). తెలంగాణ నుంచి: మోదడుగు విజయ్ గుప్తా (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), హనుమంతరావు పసుపులేటి (వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం–విద్య). పద్మశ్రీ దక్కిన ప్రముఖుల్లో మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఖాదర్ వలీతో పాటు స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా (మరణానంతరం), సినీ నటి రవీనా టాండన్ తదితరులున్నారు. -
Swapna Sundari: నాట్యభూషణం
‘వాగ్గేయకార’ గుర్తింపు పొందిన ఏకైక మహిళ. పద్మభూషణ్ అందుకున్న నాట్యవిలాసిని. ఆమ్రపాలి రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వ పురస్కారగ్రహీత. ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్లో ప్రదర్శనకారిణి. యంగ్ కల్చరల్ అంబాసిడర్‌గా భారత ప్రతినిధి. మూడు నాట్యరీతుల సాధన కర్త... నాట్యానికి స్వీయ గాత్ర సహకార ప్రత్యేకత. ఇన్నిటి సమ్మేళనం వక్కలంక స్వప్న సుందరి. ‘‘నా కళాప్రస్థానం గురించి చెప్పే ముందు మా అమ్మ గురించి చెప్పాలి. అమ్మమ్మ తరం వరకు మా గాత్రప్రతిభ ఇంటికే పరిమితం. అమ్మ వక్కలంక సరళ నేపథ్య గాయని. తెర ముందుకు రావడం మాత్రం నాతోనే మొదలు. అమ్మకు యామినీ కృష్ణమూర్తి నాట్యం ఇష్టం. నేను కడుపులో ఉండగానే అమ్మాయి పుడితే కళాకారిణిని చేయాలనుకుంది. తన మిత్రురాలైన బెంగాలీ గాయని గీతాదత్తో ‘బెంగాలీలో మంచి పేరు సూచించ’మని కూడా కోరిందట. గీతాదత్ సూచించిన పేర్లలో మా అమ్మమ్మ సుందరమ్మ పేరు అమరేటట్లున్న పేరు స్వప్న. అలా స్వప్నసుందరినయ్యాను. మా నాన్న ఆర్మీలో డాక్టర్. ఆ బదిలీల ప్రభావం నా మీద ఎలా పడిందంటే... మేము వెళ్లినచోట భరతనాట్యం గురువు ఉంటే భరతనాట్యం, కూచిపూడి గురువు ఉంటే కూచిపూడి... అలా సాగింది నాట్యసాధన. పదమూడేళ్లకు చెన్నైలో తొలి భరతనాట్య ప్రదర్శన, పద్నాలుగేళ్లకు ఢిల్లీలో కూచిపూడి ప్రదర్శన ఇచ్చాను. మూడవది నేను ఇష్టంగా సాధన చేసిన విలాసిని నాట్యం. రాజమండ్రి సమీపంలోని కోరుకొండ నరసింహస్వామి ఆలయంలో మా గురువు మద్దుల లక్ష్మీనారాయణమ్మ స్వయంగా తన గజ్జెలను నాకు కట్టి ఆరంగేట్రం చేయించారు. నేను మా సొంత ప్రదేశం కోనసీమను చూసింది కూడా అప్పుడే. మా ఇంటిపేరు, ఊరిపేరు ఒకటే. గోదావరి లంకల్లోని వక్కలంక. విలాసిని నాట్య తొలి ప్రదర్శన తర్వాత అనేక ప్రయోగాలు చేశాను. అంతరించి పోతున్న నాట్యరీతిని తర్వాతి తరాలకు అందుబాటులోకి తీసుకురావడానికి, ఆ నాట్యరీతి ప్రాచుర్యానికి నేను చేసిన ప్రయత్నాలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. బీఏ ఆగిపోయింది! నేను స్కూల్ ఫైనల్లో ఉన్నప్పుడు మా అమ్మానాన్నలు నన్ను యామినీ కృష్ణమూర్తిగారి ప్రదర్శనకు తీసుకెళ్లారు. ఆమెను చూసిన తర్వాత నాట్యమే జీవితం అని నిర్ణయించుకున్నాను. ఇంట్లో మాత్రం ఎంతటి కళాకారిణివి అయినా చదువులేకపోతే ఎలాగ అన్నారు. రోజూ కాలేజ్కెళ్లాలంటే డాన్సు అవకాశాలు ఒకదాని మీద మరొకటి వస్తున్నాయి. టీనేజ్లోనే లండన్‌లోని క్వీన్ ఎలిజిబెత్ హాల్లో ప్రదర్శన ఇచ్చాను. ప్రైవేట్‌గా బీఏలో చేరాను, కానీ సెకండియర్‌లో మూడు నెలల యూరప్ టూర్‌తో నా బీఏ ఆగిపోయింది. నాట్యం నేర్చుకున్నాను, నాట్యమే చదువుకున్నాను. నాట్యంలో పీహెచ్డీ స్కాలర్స్‌కి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌గా వెళ్తుంటాను. చిన్న వయసులో నాట్యంలో స్థిరపడితే ప్రొఫెషన్లో కనీసం 30 ఏళ్లయినా రాణించవచ్చని ఇంట్లో వాదించాను. నేను అనుకున్నట్లే నలభై ఐదేళ్లుగా నాట్యంలో రాణిస్తున్నాను. పాటల విషయానికి వస్తే... నాట్యంలో నేపథ్యంగా వినిపించే ట్రాక్ నేనే పాడుతాను. బాలమురళి అంకుల్‌తో ఆల్బమ్ చేశాను, తమిళ్ గజల్స్ పాడాను. అమ్మతో కలిసి పాడడం, అమ్మ పాడిన పాటలను ఆమెకు నివాళిగా పాడడం గొప్ప అనుభూతి. నాట్యజ్ఞానకేంద్రం దిల్లీలో స్థాపించిన డాన్స్ సెంటర్ ద్వారా నాట్యానికి సంబంధించిన జ్ఞానాన్ని పంచడంతోపాటు ప్రచారంలోకి తెస్తున్నాను. నాట్యం, సంగీతం, ఆధ్యాత్మికం ఒకదానితో ఒకటి మమేకమై ఉంటాయి. అన్నీ కలిపితేనే సంస్కృతి. అలా నేను సాంస్కృతిక వేత్తగా ఆవిష్కారమయ్యాను. నేడు హైదరాబాద్‌లో జరుగుతున్న ‘నైమిశం’ జిడ్డు కృష్ణమూర్తి ‘సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్’ కోసం సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పన ప్రారంభించాను. కళాసాధనకు, కళాసేవకు... శిఖరాన్ని చేరడం, ప్రయాణం పూర్తవడం అనేది ఉండదు. పరిపూర్ణతను, కొత్త రూపునూ సంతరించుకుంటూ... కళాకారులకు, కళాభిమానులకు సాంత్వననిస్తూ కొత్త పుంతలు తొక్కుతూ సాగుతూనే ఉంటుంది’’ అన్నారు స్వప్నసుందరి. ప్రభుత్వం ఆమె నాట్యప్రతిభను పద్మభూషణ్‌తో గౌరవించింది. నిజానికి ఆమె నాట్యానికే భూషణం. కళల కలయిక ‘కూచిపూడి’ భాగవతం, యక్షగానం, నాటకం, పగటివేషం వంటి ప్రాచీన కళారూపాల నుంచి ఒక్కో ప్రత్యేకతను మమేకం చేస్తూ రూపొందిన నాట్యప్రక్రియనే మనం కూచిపూడి అని పిలుస్తున్నాం. నిజానికి కూచిపూడి అనే పేరు రావడానికి కారకులు గోల్కొండ పాలకుడు తానీషా. ఆ నాట్యకళాకారుల స్థిరనివాసం కోసం కూచిపూడి అగ్రహారాన్ని ఇచ్చారాయన. కూచిపూడి గ్రామంలోని నాట్యకారుల నాట్యరీతి కూడా ఆ ఊరిపేరుతోనే వ్యవహారంలోకి వచ్చింది. సిద్ధేంద్రయోగికంటే ముందు రెండు వందల సంవత్సరాల నుంచి వచ్చిన పరిణామక్రమాన్ని నేను నా తొలి రచన ‘ద వరల్డ్ ఆఫ్ కూచిపూడి డాన్స్’లో రాశాను. తెలుగు విలాసిని... విలాసిని నాట్యం మన తెలుగు వారి భారతం. భారతం అంటే మహాభారతం కాదు. భారతం– భాగవతం అని మన ప్రాచీన కళారూపాలు ఈ రెండూ. భారతం శాస్త్రీయంగా ఉంటే భాగవతం సామాన్యులకు అర్థమయ్యేటట్లు సరళంగా ఉండేది. భారతం సోలో డాన్స్, భాగవతం బృంద ప్రదర్శన. లాలిత్యం, సొగసుతో కూడిన ఈ తెలుగు నాట్యరీతిని రాజాస్థానాల్లో రాజదాసీలు, ఆలయాల్లో దేవదాసీలు ప్రదర్శించేవారు. రాజాస్థానాలు పోవడం, కొన్ని సామాజిక దురన్యాయాలను అడ్డుకునే క్రమంలో ఆలయాల్లో నాట్యాలను నిషేధిస్తూ చట్టం వచ్చిన తర్వాత ఆ నాట్యసాధన దాదాపుగా అంతరించి పోయే దశకు చేరుకుంది. ఆ సమయంలో నేను ఈ నాట్యం నేర్చుకుని, అందులో ప్రయోగాలు, విస్తరణ కోసం పని చేస్తున్నాను. నేను విలాసిని మీద పుస్తకం రాసే నాటికి ఆ నాట్యరీతికి తెలుగుభారతం అనే ప్రాచీన నామమే ఉంది. నిష్ణాతులైన కవులు, కళాకారులు, చరిత్రకారులు సంయుక్తంగా చర్చించిన తర్వాత ‘విలాసిని’ అనే పేరు ఖరారు చేశాం. – వక్కలంక స్వప్న సుందరి, సాంస్కృతికవేత్త – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
స్వరాల పుస్తకం
అది బెంగళూరు నగరం జయనగర్... నిత్యం సప్తస్వరాలు పలికే ఓ రాగాలయం... ఆ గాననిలయం గాయని శైలజాపంతులు నివాసం. కిత్తూరు రాణి చెన్నమ్మ పురస్కారం... ప్రసిద్ధగాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు... లెక్కకు మించిన సత్కారాలు... కన్నడనాట తెలుగు గాయనికి అందుతున్న గౌరవం. గాత్రసేవలో తరిస్తున్న స్వరాల పుస్తకం ఆమె. ఆమె సంగీత ప్రస్థానం... ఆమె మాటల్లోనే... ‘‘మా ఇంటికి వచ్చిన వాళ్లు ‘ఇంట్లో సప్తస్వరాలతోపాటు త్రిమూర్తులు కూడా వెలిశారు’ అనీ, ‘ఇల్లు దశావతారాలకు ప్రతిబింబంగా ఉంది’ అనీ జోకులేసేవారు. ముగ్గురు అబ్బాయిలు. ఏడుగురు అమ్మాయిల్లో నేను చిన్నదాన్ని. నాకు మా మేనత్త పోలికలతోపాటు ఆమె స్వరం కూడా వచ్చిందని గుర్తు చేసుకునే వారు నాన్న. స్కూల్లో ప్రార్థనాగీతాలు, బృందగానాలు ఇష్టంగా పాడేదాన్ని. నా ఆసక్తిని గమనించిన నాన్న నాకు, చిన్నక్క రమాదేవికి సంగీతంలో శిక్షణ ఇప్పించడానికి తనవంతుగా మంచి ప్రయత్నమే చేశారు. మా ఊరు చిత్తూరు జిల్లా బీరంగి కొత్తకోట. బెంగళూరు నుంచి మాస్టారు వారాంతాల్లో మా ఊరికి వచ్చి సంగీతం నేర్పించే ఏర్పాటు చేశారు. వెంకటేశ్ భాగవతార్ మాస్టారు ప్రతివారం రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి పాఠాలు చెప్పేవారు. కానీ ఎక్కువ కాలం కొనసాగడం కష్టమైంది. తొలుత ఏకలవ్య శిష్యరికం నేను ప్రఖ్యాత గాయని ఎమ్ ఎల్ వసంతకుమారి శిష్యురాలిని, ఏడేళ్లు ఆమె దగ్గరే ఉండి శుశ్రూష చేసి చదువుకుంటూ సంగీతం నేర్చుకున్నాను. ఆడపిల్లలు ఇంటి ఆవరణ దాటడానికి కూడా ఇష్టపడని సంప్రదాయ కుటుంబం మాది. అలాంటి రోజుల్లో అన్నయ్య నరేంద్రరావు చొరవ తీసుకుని నాన్నని ఒప్పిస్తూ ఒక్కో అడుగూ ముందుకు వేయించాడు. అక్క, నేను ఎమ్ఎల్ వసంతకుమారి గారికి ఏకలవ్య శిష్యులం. ఇంట్లో రోజూ ఆమె పాటల క్యాసెట్ పెట్టుకుని సంగీత సాధన చేసేవాళ్లం. అలాంటిది ఆ గాయని ఓ రోజు రిషివ్యాలీ స్కూల్‌కి వస్తున్నట్లు సమాచారం తెలిసి అన్నయ్య మమ్మల్ని తీసుకువెళ్లి ఆమెను చూపించాడు. అప్పుడు ఆమె దగ్గర సంగీతం నేర్చుకోగలననే ఆలోచన నా ఊహకు కూడా అందలేదు. దేవుడు సంకల్పించినట్లుగా ఆమె ఓ రోజు వైద్యం కోసం మా మేనమామ క్లినిక్‌కి వచ్చారు. అప్పుడు మా మామ ఆమెను రిక్వెస్ట్ చేయడం, ఆమె వెంటనే రిషి వ్యాలీ స్కూల్లో చేర్పించమని చెప్పడం జరిగిపోయాయి. చేరడం వరకు సులువుగానే జరిగింది. కానీ అక్కడికి వెళ్లి రావడం చాలా కష్టమయ్యేది. వారాంతాల్లో క్లాసులు. మా ఊరి నుంచి ‘అంగళ్లు’ అనే ఊరి వరకు బస్‌లో వెళ్లి, అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు నడిచి రిషివ్యాలీ చేరేవాళ్లం. ఆ స్కూల్లో తెలుగు మాస్టారు రామచంద్రరావు గారు మా దూరపుబంధువు. వారింట్లో ఉండి సంగీతం నేర్చుకోవడం, సోమవారం ఉదయాన్నే బయలుదేరి మా ఊరికి రావడం. ధర్మవరం కాలేజ్‌లో ఇంటర్ చదువు... ఈ దశలో చదువు సరిగ్గా సాగలేదు. ఇదిలా ఉండగా అక్కకు పెళ్లయి బెంగుళూరుకు వెళ్లిపోయింది. ఇక నాది ఒంటరి పోరాటమే అయింది. ఇంట్లో వాళ్లు చదువు లేదా సంగీతం ఏదో ఒకటి మానిపించాలనే ఆలోచనలోకి వచ్చేశారు. అప్పుడు నేను ‘ప్రైవేట్‌గా చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటాను’ అని మొండిగా పట్టుపట్టాను. అలా మా గురువుగారు వసంతకుమారి గారింటికి చేరాను. ఏడేళ్లు అక్కడే ఉండి గురు శుశ్రూష చేశాను. ఆమె శిష్యరికంలో సంగీత సాధన చేస్తూ ఆమె జతతో కచేరీల్లో పాల్గొంటూ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో పీజీ చేశాను. వరుడి కోసం వేట మా అన్న మద్దతు అక్కడితో ఆగిపోలేదు. నాకు వరుడిని వెతికే పనిని ఒక యజ్ఞంలా చేశాడు. నా పెళ్లి నాటికి నాన్న లేరు, బాధ్యతంతా అన్నయ్య దే. సంగీతం విలువ తెలిసిన కుటుంబం అయితేనే నా సాధన కొనసాగుతుందనే ఉద్దేశ్యంతో సంగీతం వచ్చిన వరుడి కోసం గాలించాడు. అలా... బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో మృదంగవాద్యకారుడికిచ్చి పెళ్లి చేశారు. మా వారు రఘుపంతులుకి సొంత వ్యాపారం ఉంది. కానీ సంగీతం పట్ల ఆయనకు అపారమైన ఇష్టం, గౌరవం. అలా పెద్ద సంగీత కుటుంబంలోకి కోడలిగా వెళ్లాను. అన్నిరకాల సౌకర్యాలూ ఉన్నప్పటికీ ముగ్గురు పిల్లల పెంపకంతో నాకు సంగీత కచేరీలకు పదేళ్లు విరామం వచ్చేసింది. అప్పుడు మావారు పిల్లల పనులకు సహాయకులను నియమించుకుని సంగీత సాధనకు వెసులుబాటు చేసుకోమని సూచించారు. రాగాల పరిశోధన సంగీతం ఆహ్లాదకారకం మాత్రమే కాదు, దివ్యమైన ఔషధం కూడా. ఇది నిరూపణ అయిన వాస్తవమే, కానీ ఏ రాగంతో ఏ అనారోగ్యం నుంచి సాంత్వన కలుగుతుందోనని స్వయంగా శోధించి తెలుసుకున్నాను. బీపీ, డయాబెటిస్, ఒత్తిడి, ఊపిరితిత్తుల సమస్యల నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. నేచర్ క్యాంపులు పెట్టి ప్రకృతి ఒడిలో రాగాలాపన చేస్తాం. మెంటల్ హెల్త్ విభాగానికి మానసిక సమస్యలకు సాంత్వన కలిగించే మ్యూజిక్ థెరపీ ప్రాజెక్టు సిద్ధం చేసిచ్చాను. ప్రఖ్యాత వాగ్గేయకారుడు పురందరదాసు చెప్పినట్లు సంగీతజ్ఞానం ప్రతి ఇంట్లో ఉండాలనేదే నా ఆకాంక్ష. సంగీతం అనే ఔషధసేవనం చేసే వాళ్లకు అనేక అనారోగ్యాలు దూరంగా ఉంటాయి. లెక్కకు మించిన అవార్డులు అందుకున్నప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు అందుకోవడంతో నా జన్మధన్యం అయింది. సంగీతం కోసం ఇంకా ఇంకా సేవ చేయాల్సిన బాధ్యత కూడా పెరిగింది. గురుకులాన్ని ప్రారంభించాలనేది తదుపరి లక్ష్యం. నేను మొదలుపెడితే మరొకరు అందిపుచ్చుకుని కొనసాగిస్తారు’’ అన్నారు శైలజాపంతులు. సరిగమల గ్రాఫ్ సంగీతంలో జూనియర్, సీనియర్ విద్వత్తు కోర్సు చేశాను. సంగీత సాధన కోసమే ఇంట్లో ఒక గదిని కేటాయించుకుని చాలా తీవ్రంగా సాధన చేసి గ్రాఫో టెక్నాలజీకి రూపకల్పన చేశాను. నాకు డాక్టరేట్ వచ్చింది ఈ సర్వీస్‌కే. సంగీతం నేర్చుకునే వారికి సులువుగా ఉండే విధానం అది. నా మనుమరాలు నాలుగేళ్ల ‘పూర్వి’ కూడా గ్రాఫ్ చూస్తూ పాడేస్తుంది. గ్రాఫో టెక్నాలజీతో సంగీత పాఠాల పుస్తకాలు రాయడం మొదలుపెట్టాను. సంగీతం కోసం తీవ్రంగా పనిచేయాలనే నిర్ణయానికి వచ్చి 2001లో ... అత్తమామల పేర్లు, తిరుమల బాలాజీ పేరు వచ్చేటట్లు శ్రీవెంకట్ మ్యూజిక్ అకాడమీ స్థాపించాను. ఒక్క స్టూడెంట్‌తో మొదలైన అకాడమీలో ఇప్పుడు మూడు వందలకు పైగా విద్యార్థులు సంగీత సాధన చేస్తున్నారు. వాళ్లకు నేర్పించడం కోసం రోజుకు ఐదారు గంటల సేపు నేను కూడా పాడతాను. – డాక్టర్ శైలజాపంతులు, ప్రసిద్ధగాయని, బెంగళూరు – వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
టెక్ దిగ్గజాలకు పద్మభూషణ్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. సీడీఎస్ బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాటా గ్రూప్ చైర్ పర్సన్ నటరాజన్ చంద్రశేఖర్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండి సైరస్ పూనావాలాలకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. అలాగే, కొవాగ్జిన్ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, సహ వ్యవస్థాపకులు సుచిత్ర ఎల్లాకు పద్మభూషణ్ పురస్కారం అనౌన్స్ చేసింది. ట్రేడ్ & ఇండస్ట్రీ రంగానికి చెందిన ఐదుగురికి పద్మభూషణ్ అవార్డ్స్ లభించడంతో పాటు ఇద్దరికీ పద్మశ్రీ పురస్కారం లభించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో ప్రదానం చేస్తున్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవని కనబరిచిన వారికి పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. The President of India has approved conferment of 128 Padma Awards this year.#PadmaAwards#RepublicDay2022 The list is as below - pic.twitter.com/4xf9UHOZ2H — DD News (@DDNewslive) January 25, 2022 (చదవండి: Padma Awards 2022: బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్!) -
దీపావళి వేడకలో స్టెప్పులేసిన పీవీ సింధు.. వీడియో వైరల్
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సింధు ఎంతో సంతోషంగా పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఉత్సాహంగా డ్యాన్స్ కూడా చేశారు. నిత్యం ఆటలతో బిజీగా ఉండే సింధు ఇలా డ్యాన్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘లవ్ న్వాంటిటి’ పాటకు నృత్యం చేసిన హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్.. గ్రీన్ లెహంగాలో తనదైన స్టెప్పులతో అదరగొట్టారు. ఈ వీడియోను సింధు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఒకే రోజులో మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. చదవండి: పద్మభూషణ్ అవార్డు అందుకున్న పీవి సింధు.. కాగా సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పీవీ సింధు 2020 సంవత్సరానికి గాను పద్మభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధు.. అంతకు ముందు 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ పతకం గెలుచుకుంది. ఇక 2019లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈ స్టార్ అంతకుముందు వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీల్లో రెండు కాంస్యాలు, రెండు రజతాలు సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఎక్కువ పతకాలు సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 2015లో సింధుకు పద్మశ్రీ అవార్డు దక్కింది. View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) -
PV Sindhu: తెలుగు తేజం పీవీ సింధుకు పద్మభూషణ్
-
పద్మభూషణ్ అవార్డు అందుకున్న పీవి సింధు..
PV Sindhu conferred with Padma Bhushan: భారత్ దేశంలో ఉన్నత పౌరసత్కారాలుగా భావించే పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్లో ఆట్టహాసంగా జరిగింది. 2020లో మొత్తంలో 119మందికి ఈ అవార్డలును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ కార్య క్రమంలో తెలుగుతేజం బ్యాడ్మంటిన్ స్టార్ షట్లర్ పీవి సింధు రాష్ట్రపతి చేతుల మీదగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గోన్నారు. చదవండి: Gautam Gambhir: త్వరలో భారత్‌కు టీ20 ప్రపంచకప్ తీసుకువస్తాడు -
త్యాగం నాది కాదు.. నా కుటుంబానిది!
భక్తికి పాట... ఆనందానికి పాట... బాధను దిగమింగుకోవడానికి పాట... చిత్ర జీవితం మొత్తం పాటలే. ఇంట్లో జరిగే వేడుకలకు వెళ్లే తీరిక లేదు. పాట వేదికే ఆమెకు వేడుక! ఆమె పాటలు ప్రేక్షకులకు ఓ వేడుక!! కృష్ణన్‌నాయర్ శాంతకుమారి చిత్రను ‘పద్మభూషణ్’ వరించినవేళ పాటకు వేడుక!!! పాట రూపంలో అందరి ఇళ్లల్లోకి వచ్చిన చిత్రతో ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ... ► పద్మభూషణ్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నా అన్ని విషయాలకూ నా కన్నా ఎక్కువగా ఆనందపడేది ఆయనే (భర్త విజయ్ శంకర్). మేం ఇద్దరం చాలా సింపుల్. ‘షో ఆఫ్’ అనేది తెలియదు. ఆయన ‘కంగ్రాట్స్’ అన్నారు. స్నేహితులు, బంధువులు శుభాకాంక్షలు తెలిపారు. అంతే. సెలబ్రేషన్స్ లాంటివి ఏమీ చేసుకోలేదు. ► ఇంత పేరు, డబ్బు వచ్చాక కూడా అలానే సింపుల్‌గా ఉన్నారు. ఎవరు ఇన్స్పిరేషన్? మాది రిచ్ ఫ్యామిలీ కాదు. మా నాన్నగారు హెడ్మాస్టర్, అమ్మ హెడ్ మిస్ట్రెస్. ఇద్దరూ సింపుల్‌గా ఉంటారు. కట్టుబాట్ల మధ్య మమ్మల్ని (అక్క, తమ్ముడు) పెంచారు. ఎక్కువగా వెజిటెరియనే తినేవాళ్లం. ఎప్పుడో ఒకసారి నాన్‌వెజ్. అంతే. ఆడంబరమైన జీవితం కాదు. అమ్మానాన్న చెప్పిన విలువలనే ఇప్పటికీ పాటిస్తున్నాను. మారాలనుకున్నా మారలేను (నవ్వుతూ). ► మీకు సంగీతం పట్ల ఆసక్తి ఎలా మొదలైంది? మా నాన్నగారు రేడియాలో పాడేవారు. నాన్నగారి పెద్దక్కయ్య వీణ వాయించేవారు. మాకు హాలిడేస్ అంటే మేనత్త ఇంటికి వెళ్లేవాళ్లం. ఆవిడ చాలామందికి మ్యూజిక్ నేర్పించేవారు. ఇంట్లో అందరికీ సంగీతం అంటే ఇష్టం ఉండటం వల్లనే చిన్నప్పుడే నాకూ ఆసక్తి ఏర్పడి ఉంటుంది. మా మేనత్త దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్‌కి సంబంధించిన బేసిక్స్ అన్నీ నేర్చుకున్నాను. మా అమ్మకు వీణ తెలుసు. మా ఇంట్లో సాయంత్రం కాగానే దేవుడికి దీపం పెట్టేటప్పుడు అక్క, తమ్ముడు, నేను పాడాలి. ఏ కారణంతోనూ పాడటం మాత్రం మానకూడదు. తమ్ముడు మృదంగం వాయించేవాడు. నేను, అక్క పాడేవాళ్లం. రోజూ పూజకి, మ్యూజిక్ ప్రాక్టీస్‌కి గంటకు పైనే కేటాయించేవాళ్లం. ఆ తర్వాతే హోమ్‌వర్క్. ► మీ ఇష్టదైవం కృష్ణుడని... అవును. కృష్ణుడికి నేను పరమ భక్తురాల్ని. ఎక్కువగా ‘కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్..’ పాడుతుంటా. ► కృష్ణుడి గురించి మీ జీవితంలో జరిగిన ప్రత్యేకమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య జరిగినదే చెబుతాను. నాకు ‘పద్మభూషణ్’ ప్రకటించే రోజు ఉదయం ప్రముఖ మలయాళ డైరెక్టర్ సేతు గురువాయూర్ టెంపుల్‌కి వెళ్లారు. గుడిలోంచి వీడియో కాల్ చేసి, ‘నీ ఇష్టదైవం కృష్ణుడు’ అంటూ విగ్రహాన్ని చూపించారు. కోవిడ్ వల్ల ఈ మధ్య గురువాయూర్ వెళ్లలేదు. కృష్ణుణ్ణి అలా చూస్తూ ఉండిపోయా. ఆ సాయంత్రం పద్మభూషణ్ ప్రకటించారు. ► తెలుగులో మీరు పాడిన ఫస్ట్ పాట ‘పాడలేను పల్లవైనా’ (‘సింధు భైరవి’ చిత్రం). ఆ తర్వాత ఎన్నో పల్లవులు, చరణాలు పాడారు. ఆ పాట పాడినప్పుడు అర్థం తెలుసా? అప్పుడు నాకు తెలుగు తెలియదు. మలయాళం, తమిళం కొంచెం దగ్గరగా ఉంటాయి. కన్నడ, తెలుగు నాకు విదేశీ భాషల్లాంటివే. కాలేజీలో త్యాగరాజ కీర్తనలవీ నేర్చుకునేటప్పుడు అర్థం తెలియకుండా పాడాను. ఇప్పుడు భాష అర్థం అయ్యాక ‘అయ్యయ్యో.. అప్పుడు ఈ పదాన్ని తప్పుగా పలికానే’ అనుకుంటాను. బాలు (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం) సార్ చాలా హెల్ప్ చేశారు. పదాలు తప్పుగా పలికినప్పుడు ఆయన అక్కడికక్కడే సరిదిద్దేవారు. అలాగే కీరవాణి, కోటి, మణిశర్మ వంటి సంగీతదర్శకులు ఎవరి ట్రాక్‌ని వారితో విడిగా పాడించకుండా, బాలు సార్, నా కాంబినేషన్లోనే అన్ని పాటల రికార్డింగ్నీ ప్లాన్ చేసేవారు. దాదాపు పది, పదిహేనేళ్లు అలా ఆయనతో కలిసే పాడాను. ► నలభై రెండేళ్లుగా పాడుతున్నారు. వాయిస్‌ని కాపాడుకోవడానికి చాలా శ్రద్ధ తీసుకుంటారా? ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. నేను చేసేవి వేరేవాళ్లకు నప్పకపోవచ్చు. ఉదాహరణకు బాలూగారు ఐస్‌క్రీములు అవీ తినేవారు. రికార్డింగ్ అప్పుడు నేను ఫ్లాస్క్‌లో వేడినీళ్లు తీసుకెళతాను. కానీ సార్ బాటిల్లో చల్లని నీళ్లే ఉండేవి. ఆయనకు అది సరిపడింది. నేను ఫ్లయిట్లో, కారులో వెళ్లేటప్పుడు చెవులకు దూది పెట్టుకుంటాను. చల్లగాలి తగలకూడదని ముక్కు కూడా కవర్ చేసుకుంటాను. ‘ఇంత అతి జాగ్రత్త ఎందుకు? వర్షంలో కూడా తడవాలి. అన్నింటికీ అలవాటుపడాలి. లేకపోతే త్వరగా ఇమ్యూనిటీ పోతుంది’ అని బాలూ సార్ అనేవారు. నిజానికి నాకిలా జాగ్రత్త అలవాటైంది (కేజే ఏసు) దాసన్న వల్లే! కారులో వెళ్లేటప్పుడు తలకి గట్టిగా గుడ్డ కట్టుకుంటారాయన. చెవులు కవర్ చేసుకుంటారు. ఆయనతో ఎక్కువగా ట్రావెల్ చేశాను కాబట్టి నాకు అలవాటైంది. దానికి భిన్నంగా వెళదామంటే ఏమైనా అవుతుందని భయం. పైగా, నాకు పరిశుభ్రత పిచ్చి. ► ఓసీడీ కాదు కదా? అలాంటిదే (నవ్వుతూ). నేను ఉండే పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉండాలని కోరుకుంటాను. రికార్డింగ్‌కి, కచ్చేరీలకు వెళ్లినప్పుడు అందరం ఒకే మైక్ వాడతాం. అది నాకు ఇబ్బందిగా ఉంటుంది. అప్పటివరకూ ఆ మైక్ దగ్గరగా నిలబడి ఎవరో ఒకరు పాడి ఉంటారు కదా! ఆ ఫీలింగ్ రాగానే ఏదోలా ఉంటుంది. ఇప్పుడు కరోనా అని అందరూ బ్యాగుల్లో శానిటైజర్లు పెట్టుకుంటున్నారు. కానీ కొన్నేళ్లుగా నా బ్యాగులో శానిటైజర్ పెట్టుకుంటున్నాను. నేను పాడే ముందు మైక్‌ని శుభ్రంగా శానిటైజర్‌తో తుడిచి, ఆ తర్వాతే పాడతా. హైదరాబాద్‌లో ఒక షోలో ఎవరికో మైక్ కావాల్సి వస్తే, నా దగ్గరున్నది అడిగారు. ‘క్లీన్ చేశాను.. ఎలా ఇవ్వాలా?’ అని ఆలోచిస్తుంటే ‘ఆవిడ ఇవ్వదుగాక ఇవ్వదు. ఇప్పుడే మైక్‌కి స్నానం చేయించింది’ అని బాలూ సార్ సరదాగా అన్నారు. నాతో పాటు మా అమ్మాయిని కూడా తీసుకెళ్లేదాన్ని. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లయిట్ దగ్గరకు బస్సులో తీసుకెళతారు. ఆ బస్సు కడ్డీలు పట్టుకుంటుందని, ఎస్కలేటర్ అవీ ఎక్కేటప్పుడు పట్టుకుంటుందని తన కోసం సెపరేట్‌గా శానిటైజర్ పెట్టుకునేదాన్ని. ► చివరిగా బాలూగారిని ఎప్పుడు కలిశారు? ఆయన ఆస్పత్రిలో చేరాక మాట్లాడారా? 2019 డిసెంబర్లో మలేసియాలో ఒక కాన్సర్ట్ చేశాం. చివరిగా ఆయన్ను నేను కలిసింది అదే. ఆ తర్వాత కరోనా టైమ్‌లో బాలూగారు ఇంట్లో ఖాళీగా లేని విషయం మీ అందరికీ తెలిసిందే. కరోనా నేపథ్యంలో పాటలవీ చేశారు. కరోనాకు సంబంధించి తెలుగులో ఉన్న ఒక పాటను ‘కొంచెం మలయాళంలో ట్రాన్స్‌లేట్ చేసి పెడతావా’ అని ఫోన్ చేశారు. ‘చేసి పెడతావా కాదు.. నాకిది చేసి పెట్టు అని అడగాలి మీరు’ అని, చేసిచ్చాను. అలాగే కోవిడ్ టైమ్‌లో ఆయన మ్యూజిక్‌లో మా ఇంట్లో ఉండి నేను కూడా ఒక పాట రికార్డ్ చేసి, పంపాను. ఆ తర్వాత బర్త్‌డే సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పినవాళ్లందరికీ సార్ మెసేజ్ పెట్టాలనుకున్నారు. తెలుగులో ఆయన మాట్లాడిన మాటలను మలయాళంలో ట్రాన్స్‌లేట్ చేసి, వాయిస్ పెట్టమంటే, చేసిచ్చాను. అదే చివరిగా నేను ఆయనతో మాట్లాడింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫేస్బుక్లో కరోనా పాజిటివ్ అని బాలూ సార్ పెట్టిన వీడియో చూసి, ‘ఎలా ఉన్నారు?’ అని మెసేజ్ పెట్టాను. ‘ఏం ఫరవాలేదు... మైల్డ్‌గా ఉంది’ అని మెసేజ్ పెట్టారు. యాక్చువల్‌గా బాలూ సార్ వెళ్లిన ప్రోగ్రామ్‌కు నన్నూ రమ్మన్నారు. అయితే ఈ కరోనా టైమ్‌లో జర్నీ వద్దని మా ఆయన అనడంతో నేను వెళ్లలేదు. ‘యువర్ డెసిషన్ వజ్ రైట్’ అని సార్ మెసేజ్ పెట్టారు. ఇక ఆ తర్వాత ఆయనతో మాట్లాడలేదు. ఇలా జరుగుతుందని నేనస్సలు ఊహించలేదు. ఇప్పటికీ ఏదో ఒక ఊళ్లో సుఖంగా పాటలు పాడుతూ ఉన్నారనే భావిస్తూ ఉంటాను. ► మీ ప్రయాణం మొత్తం ఇల్లు, రికార్డింగ్ స్టూడియో చుట్టూనే తిరుగుతోంది. ఏదైనా త్యాగం చేసిన ఫీలింగ్? పశ్చాత్తాపం ఏమైనా? పశ్చాత్తాపం ఏమీ లేదు కానీ ఫ్యామిలీలో జరిగే ముఖ్యమైన వేడుకలకు వెళ్లడానికి కుదిరేది కాదు. ఇంట్లోవాళ్లకు, బంధువులకు బాధ అనిపించడం సహజం. నాకూ బాధగానే ఉండేది. అయితే పోను పోను నా బిజీ అందరికీ అర్థం అయింది. నాకు నచ్చిన వృత్తి ఇది. అందుకని ఈ బిజీని ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి కెరీర్ ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతగా ఉంటాను. లైఫ్‌లో చిన్న, పెద్ద కష్టాలుంటాయి. వీటిని దాటేలా చేసింది ఈ సంగీతమే. ఇక త్యాగం గురించి చెప్పాలంటే.. త్యాగం నాది కాదు. నా కుటుంబానిది. నేను ఒంటరిగా ఎక్కడికీ వెళ్లను. మా నాన్నగారు ఓరల్ కేన్సర్‌తో చనిపోయారు. కేన్సర్‌తో బాధపడుతున్న సమయంలోనూ నొప్పి బయటకు కనపడనివ్వకుండా, మందులు వేసుకుని నాకు తోడుగా రికార్డింగ్ స్టూడియోకి వచ్చారు. ఆయనది త్యాగం. నా జీవిత భాగస్వామి నేనే వండి పెట్టాలని, వడ్డించాలని ఎదురుచూడలేదు. ఒక దశ తర్వాత నా కెరీర్ కోసం తన కెరీర్‌ని మానుకున్నారు. త్యాగం ఆయనది. నా కూతురి (కీ.శే. నందన)తో నేనెక్కువ టైమ్ గడపడానికి కుదిరేది కాదు. రికార్డింగ్ ముగించుకుని ఇంటికి లేట్‌గా వెళ్లినప్పుడు నాన్నతో నిద్రపోయేది. నందనని మా అక్క కూడా చూసుకునేది. అమ్మని మిస్సయిన నా కూతురిది కూడా త్యాగమే. అందరూ త్యాగం చేయడంవల్లే నేను ఇంత ఎదగగలిగాను. ► మీరు వచ్చేనాటికే సుశీల, జానకిగార్లు ఉన్నారు. ఏదైనా అభద్రతాభావం ఉండేదా? సింగర్ అవ్వాలన్నది నా లక్ష్యం కాదు. మ్యూజిక్ నేర్చుకుని ఏదైనా స్కూల్లోనో, కాలేజీలోనో మ్యూజిక్ టీచర్ అవ్వాలని ఉండేది. సినిమాలకు అవకాశం రావడంతో వచ్చాను. ఒక్కోటిగా వరుసగా అవకాశాలు రావడంవల్ల గాయనిగా స్థిరపడ్డా. అప్పటికి నేను ఎంఏ ఫస్ట్ ఇయర్. ఎక్కడికీ ఒంటరిగా వెళ్లింది లేదు. అమ్మానాన్న జాబ్ చేస్తున్నారు. నాన్న అనారోగ్యం బారినపడిన తర్వాత ఇంట్లో ఒకొక్కరుగా వంతులు వేసుకుని నాతో పాటు వచ్చేవారు. నా సంపాదనంతా మా ఫ్లయిట్ టికెట్లకే సరిపోయేది. డబ్బు మీద కూడా నాకంత ధ్యాస లేదు. ‘అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఇచ్చింది కాదనకూడదు’ అని నాన్న ఎంకరేజ్ చేశారు. ► పెళ్లయ్యాక మీకు తోడుగా మీ భర్త వస్తున్నారు.. మీ పెళ్లి విశేషాలు చెప్పండి? మాది ఎరేంజ్డ్ మ్యారేజ్. ఆయన ఇద్దరు చెల్లెళ్లు బాగా డ్యాన్స్ చేస్తారు. ఒక చెల్లెలు, నేను స్కూల్మేట్లం. తను డ్యాన్స్ చేస్తే నేను పాడేదాన్ని. వాళ్లింటికి కూడా వెళ్లింది లేదు. అయితే రెండు కుటుంబాలకు పరిచయం ఉంది. పెద్దవాళ్లే మాట్లాడి మా పెళ్లి చేశారు. నా హజ్బెండ్ ఆర్ట్ లవర్. మా అత్తగారు వీణ బాగా వాయిస్తారు. ► ఇంత సింపుల్‌గా ఉంటారు, ఇంత బాగా పాడతారు కాబట్టి ‘చిత్ర మనింటి అమ్మాయి’ అని ఇతర భాషలవాళ్లతోనూ అనిపించుకున్నారు... థ్యాంక్యూ. యాక్చువల్లీ ఈ మాట నాతో చాలామంది అన్నారు. నాకూ ‘మీ అందరి ఇంటి అమ్మాయి’ అనిపించుకోవడమే ఇష్టం. నన్ను ప్రత్యేకంగా చూడటం నాకిష్టం ఉండదు. ► మీ ఏకైక కుమార్తె నందనను జాగ్రత్తగా చూసుకున్నారు. దురదృష్టవశాత్తూ తను దూరమైంది. ఆ బాధను అధిగమించడానికి సంగీతం హెల్ప్ అయిందా? వేరే బాధను అధిగమించవచ్చు కానీ ఈ బాధను అధిగమించలేకపోయాను. అది లోలోపల అలా ఉండిపోయింది. అంతే. అయితే సంగీతం ఒక ఊరటనిస్తుంది. నా పరిస్థితుల్లో ఇంకో అమ్మాయి ఒకవేళ వేరే వృత్తిలో ఉండి ఉంటే తేరుకుని నిలబడగలిగేది కాదేమో! నాకు ఇష్టం ఉన్నా, లేకపోయినా మిగతావాళ్ల కోసం నేను బతికి తీరాలి. ఎందరో త్యాగం చేస్తే నేనీ స్థాయికి వచ్చాను. ఆ దుర్ఘటన జరిగాక నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఒక ఐదు నెలలు వేరే ప్రపంచంలో ఉన్నట్లుగా అయిపోయాను. ఇక మ్యూజిక్ వద్దనుకున్నాను. ఆ టైమ్‌లో నాకు వేరేవాళ్ల జీవితంలో జరిగిన విషయాలను చెప్పి, మా వాళ్లు కౌన్సిలింగ్ చేశారు. నేను ఒంటరిగా వెళ్లను అనే కారణంతో నా కోసం నా కుటుంబ సభ్యులందరూ త్యాగం చేశారు. మా ఆయన్నే తీసుకోండి... ఆయనది చక్కని కెరీర్. అయితే నాకు తోడుగా రావాల్సి వచ్చినందువల్ల తన కెరీర్‌ని త్యాగం చేశారు. కానీ షాక్‌లో ఉన్న నాకు ఇవేం పట్టలేదు. ‘నిన్ను నమ్మి రికార్డింగ్ స్టూడియోలో స్టాఫ్ ఉన్నారు. వాళ్ల కోసం పాటలు పాడాలి’ అంటూ మావాళ్లు నాకు ఎన్నో రకాలుగా చెప్పారు. మా అక్క, మరదలు మా ఇంట్లోనే ఐదారు నెలలు ఉన్నారు. నన్ను రికార్డింగ్ స్టూడియోకి దగ్గరుండి తీసుకెళ్లి, నేను కొద్దిగా తేరుకున్నాకే వాళ్లందరూ వాళ్ల వాళ్ల ఇళ్లకి వెళ్లారు. నా చుట్టూ ఇంతమంది ఉండేలా చేసినందుకు, అలాగే నా మానసిక వేదనకు కొంత ఉపశమనం కలిగించే వృత్తిలో నన్ను ఉంచినందుకు నా ఆరాధ్య దైవం కృష్ణుడికి కృతజ్ఞతలు. బాలూ గారు రాగానే... భయపడిపోయా! కమల్‌హాసన్ సార్ ‘పున్నగై మన్నన్’ (తెలుగులో ‘డ్యాన్స్ మాస్టర్’) అనే తమిళ సినిమాలో ‘కాలకాలమాగ వాళుమ్ కాదలుక్కు’ అనే పాట బాలూ సార్‌తో నేను పాడిన మొదటి పాట. అప్పటికి ఆడియో క్యాసెట్ల మీద బాలూ సార్ ఫొటోలవీ చూశాను. పాటలు విన్నాను. అయితే ఆ సినిమా సంగీత దర్శకుడు ఇళయరాజా సార్ రికార్డింగ్‌కి పిలిచినప్పుడు నేను బాలూ సార్‌తోనే పాడబోతున్నానని తెలియదు. నేను రికార్డింగ్ స్టూడియోలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఆయన వచ్చారు. చాలా భయపడిపోయాను. నాకు అప్పుడు తమిళం కూడా రాదు. అయితే బాలూ సార్ ఎంత గ్రేట్ అంటే.. తనకే అన్నీ వచ్చని, తను సీనియర్ అనీ వేరేవాళ్లను తక్కువ చేయరు. దాస్ (కేజే ఏసుదాస్) అన్నతో నాకు పరిచయం ఉంది. ఆయనతో ఎన్నో కచేరీలు చేశాను. కానీ బాలూ గారితో పరిచయం లేకపోవడంతో టెన్షన్ పడ్డాను. మిగతా అందరితో ఆయన ఫ్రెండ్లీగా మూవ్ అయిన విధానం చూడగానే నా టెన్షన్ మొత్తం పోయింది. నాతో చాలా కూల్‌గా మాట్లాడారు. మర్యాద పెరిగిపోయింది. తప్పులు పాడినా సరిదిద్దుతారనే నమ్మకం ఏర్పడింది. ఎస్పీబీతో... జానకమ్మ వచ్చి... ‘ఏం నవ్వలేదు’ అన్నారు! నేను బిడియస్తురాలిని. కొన్ని పాటల్లో నవ్వాల్సి వస్తుంది కదా. ఆ పాటలను స్టేజీ మీద పాడుతున్నప్పుడు నవ్వు వచ్చే చోట ఆపేసేదాన్ని. అలా ఒక వేదిక మీద పాడుతున్నప్పుడు నవ్వలేదు. ఆ తర్వాత బ్యాక్ స్టేజీకి వెళ్లినప్పుడు (గాయని) జానకమ్మ ‘అదేంటీ.. అక్కడ నవ్వాలి కదా.. ఎందుకు నవ్వలేదు’ అంటే, ‘అమ్మా.. నవ్వాలంటే నాకు సిగ్గనిపించింది’ అంటే ఆమె ఒక సలహా ఇచ్చారు. ‘నీకు అంతగా బిడియంగా ఉంటే నీ ముందూ వెనకాల ఎవరూ లేరనుకో. నువ్వూ, మైక్ మాత్రమే ఉన్నట్లుగా భావించుకో’ అన్నారు. అప్పటి నుంచి అలాగే చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికీ కొంచెం సిగ్గుపడతాను కానీ ముందు ఉన్నంత కాదు. ఇళయరాజా సార్ కంపోజిషన్‌లో ‘వనజ – గిరిజ’లో ‘ఒత్తయిలే నిన్నదెన్న ఎన్ మన్న వనే’ అనే పాట, ‘సతీ లీలావతి’లో ‘మారుగో మారుగో మారూగయీ’ పాటలు పాడినప్పుడు ‘ఇవి నీ టైప్ పాటలు కాదు. నేనిక్కడుంటే నువ్వు పాడవు’ అని వెళ్లిపోయారు. ‘మారుగో..’లో కోవై సరళలా డైలాగ్ చెప్పాలి. ఆ పాటలో ఆవిడ ఉంటారు. ఆ వాయిస్‌ని మ్యాచ్ చేయాలని చెప్పి రాజా సార్ వెళ్లిపోయారు. ఆ పాటలు బాగా పాడాను. జానకమ్మతో... – డి.జి. భవాని -
మసాలా మహాశయ్ ఇక లేరు..
న్యూఢిల్లీ: మసాలా ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఎండీహెచ్ అధినేత, స్పైస్ కింగ్‌గా పేరొందిన మహాశయ్ ధరమ్‌పాల్ గులాటీ (97) గురువారం కన్నుమూశారు. మాతా చనన్ దేవీ హాస్పిటల్లో కోవిడ్ సంబంధ చికిత్స పొందుతుండగా, గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాదే ఆయన ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. గులాటీ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు వెల్లువెత్తాయి. ‘మహాశయన్ ది హట్టి (ఎండీహెచ్) అధినేత శ్రీ ధరమ్‌పాల్ గులాటీ కన్నుమూయడం విషాదకరం. భారతీయ పరిశ్రమలో ఆయన ఎంతో పేరొందారు. ఆయన చేపట్టిన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ .. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. శరణార్థిగా వచ్చి.. స్పైస్ కింగ్‌గా ఎదిగి.. పాకిస్తాన్ నుంచి శరణార్థిగా వచ్చి రూ. 1,500 కోట్ల వ్యాపార సామ్రాజ్యాధినేతగా, మసాలా మహారాజాగా ఎదిగిన గులాటీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిల్చారు. గులాటీ 1923 మార్చి 27న సియాల్కోట్లో (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) జన్మించారు. అక్కడ గులాటీ తండ్రికి ఎండీహెచ్ పేరిట మసాలా ఉత్పత్తుల దుకాణం ఉండేది. అయితే, దేశ విభజన తర్వాత సియాల్కోట్లోని ఆస్తులు అన్నీ వదిలేసి వారి కుటుంబం భారత్ వచ్చేసింది. ఢిల్లీలో స్థిరపడింది. అంతకుముందు 1933లోనే అయిదో క్లాస్ తర్వాత చదువును పక్కన పెట్టిన గులాటీ పలు ఉద్యోగాలు చేశారు. సబ్బుల ఫ్యాక్టరీలో, ఫ్యాబ్రిక్ ఫ్యాక్టరీలో, మిల్లుల్లో పనిచేశారు. ఎండీహెచ్ పోర్టల్‌లోని సమాచారం, ఒకానొక ఇంటర్వ్యూలో గులాటీ స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం .. దేశ విభజన అనంతరం 1947 సెప్టెంబర్‌లో చేతి లో రూ. 1,500తో ఆయన ఢిల్లీ వచ్చారు. అందులో రూ. 650 వెచ్చించి ఒక గుర్రపు బగ్గీని కొని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, కుతుబ్ రోడ్, కరోల్ బాగ్ తదితర మార్గాల్లో నడిపిస్తూ జీవనం సాగించారు. 1948లో కొత్త మలుపు.. గుర్రపు బగ్గీతో వచ్చే ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉండటం, మెల్లమెల్లగా తరలివస్తున్న కుటుంబసభ్యుల పోషణాభారం పెరిగిపోతుండటంతో చెరకు రసం బండి వంటి ఇతర వ్యాపారాలూ గులాటీ ప్రయత్నించారు. కానీ అవేవీ సానుకూలంగా కనిపించకపోవడంతో చివరికి తమ కుటుంబం గతంలో వదిలేసిన మసాలా ఉత్పత్తుల వ్యాపారం వైపు మళ్లీ దృష్టి సారించారు. 1948 అక్టోబర్‌లో గుర్రపు బగ్గీని అమ్మేసి ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో ఒక చిన్న మసాలా ఉత్పత్తుల షాపు తెరిచారు. అక్కణ్నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించారు. ఈ క్రమంలో ప్రకటనల్లో ప్రచారకర్తగా కూడా ఆయన కనిపించి .. ఇంటింటికీ సుపరిచితమయ్యారు. ప్రత్యేకంగా తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా 1959 నుంచి అధికారికంగా ఆయన ఎండీహెచ్ కంపెనీని నెలకొల్పారు. ఎండీహెచ్ ప్రస్తుతం కోట్ల రూపాయల విలువ చేసే 50కు పైగా మసాలా ఉత్పత్తులను దేశ, విదేశాల్లో విక్రయిస్తోంది. బ్రిటన్, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తోంది. 1,000 మందికి పైగా స్టాకిస్టులు, 4 లక్షల మందికి పైగా రిటైల్ డీలర్లు ఉన్నారు. రోజుకు 30 టన్నుల మసాలాలను ప్రాసెస్ చేసే మెషీన్లు ఉన్నాయి. 2017లో రూ. 21 కోట్ల వార్షిక వేతనంతో ఎఫ్ఎంసీజీ రంగంలోనే అత్యధికంగా ప్యాకేజీ పొందిన అధినేతగా గులాటీ నిల్చారు. తన వేతనంలో 90 శాతం భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన మహాశయ్ చున్నీలాల్ చారిటబుల్ ట్రస్ట్‌కు ఆయన విరాళంగా ఇచ్చేవారు. 250 పడకల ఆస్పత్రి, 20కి పైగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2019లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. -
తొలి తరం నటుడు సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు
ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ (85) ఇక లేరు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 6న ఛటర్జీ కరోనా బారిన పడి, కోల్‌కత్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అక్టోబర్ 14న ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. అయితే ఉన్నట్టుండి మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. ‘గత రెండు రోజులుగా ఛటర్జీ ఆరోగ్యం మరింత విషమించింది.. ఆయన్ను కాపాడటానికి మేం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు’ అని వైద్యులు పేర్కొన్నారు. 1935 జనవరి 19న పశ్చిమబెంగాల్లోని కృష్ణానగర్‌లో జన్మించిన సౌమిత్ర ఛటర్జీ థియేటర్ ఆర్టిస్ట్‌గా అహింత్ర చౌదరి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. స్వయంకృషితో బెంగాలీ చిత్ర సీమలో నంబర్‌వన్ స్థాయికి చేరుకున్నారు. బెంగాలీ తొలి తరం నటుల్లో అగ్రగణ్యుడైన సౌమిత్ర ఛటర్జీ.. సుప్రసిద్ధ దర్శకుడు సత్యజిత్ రే ‘అపుర్ సంసార్’తో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి, పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సత్యజిత్ రే దర్శకత్వం వహించిన 14 సినిమాల్లో ఆయన నటించడం విశేషం. ‘దేవి, అరణ్యేర్ దిన్ రాత్రి, చారులత, ఆషానీ సంకేత్, సోనార్ ఖెల్లా’ తదితర చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. భారత సినిమా రంగంలో అగ్రనటుడిగా గుర్తింపు పొందిన ఛటర్జీ బెంగాలీ చిత్రసీమకు ఎంతో వన్నె తెచ్చారు. సోనార్ ఖెల్లా, జోయ్ బాబా ఫెలునాథ్, ఘరె బైరె వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. విలక్షణ నటనతో తనదైన ముద్ర వేసుకున్న ఛటర్జీ ‘అంతర్థాన్ (1991), దేఖా (2000), పోడోఖేప్ (2006)’ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా, రచయితగా, నటుడిగా సుమారు ఏడు దశాబ్దాల పాటు కొనసాగారాయన. బెంగాలీ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2012లో ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్నారాయన. అంతేకాదు.. ఉత్తమ నటుడిగా ‘బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్’ అవార్డును ఎనిమిదిసార్లు అందుకున్నారు ఛటర్జీ. వీటితో పాటు పలు అవార్డులను సొంతం చేసుకున్నారాయన. కాగా సౌమిత్ర ఛటర్జీ మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎంపీ రాహుల్‌గాంధీతో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. యస్–యస్–సక్సెస్ సౌమిత్ ఛటర్జీ అనగానే సత్యజిత్ రేతో ఆయనకున్న అనుబంధం గుర్తురాక మానదు. ప్రపంచ సినిమాల్లో సక్సెస్ఫుల్ యాక్టర్–డైరెక్టర్ కాంబినేషన్లలో ఈ ఇద్దరి పేర్లు తప్పక ప్రస్తావించాల్సిందే. సౌమిత్ర ఛటర్జీను ప్రపంచ సినిమాకు పరిచయం చేసింది సత్యజిత్ రేయే. రే తీస్తున్న ‘జల్సాగర్’ సినిమా చిత్రీకరణ చూడటానికి వెళ్లారట సౌమిత్ర. అప్పటికి ఆయనకు తెలియదు రే ఇచ్చే పెద్ద హిట్లలో హీరో వేషం తనే వేస్తానని, రే ఫ్యావరెట్ హీరో అవుతానని. ఆ చిత్రీకరణ చూడటానికి వెళ్లే సమయానికే సౌమిత్రను ‘అపుర్ సంసార్’ (1959) చిత్రానికి హీరోగా ఫిక్స్ అయ్యారు రే. ‘అపుర్..’ షూటింగ్ స్టార్ట్ అయ్యి, మొదటి సన్నివేశం తీసే వరకూ కూడా సౌమిత్రకు తన మీద తనకు నమ్మకం అంతగా లేదట. మొదటి షాట్ సింగిల్ టేక్‌లో ఓకే అయ్యాక నమ్మకం వచ్చింది. తన జన్మకారణం ఇదే (నటన) అని అర్థం అయిపోయింది. సౌమిత్ర ఛటర్జీ – సత్యజిత్ రే ఇద్దరూ కలసి సుమారు 14 సినిమాలు చేశారు. సౌమిత్రలోని నటుడిలో ఉన్న అన్ని కోణాలను సత్యజిత్ కథలు ఆవిష్కరించాయి. కొన్ని కథలు రాసే సమయంలో సౌమిత్రను మనసులో పెట్టుకొని రాశారట సత్యజిత్ రే. ‘ఫెలుదా’లోని బెంగాలీ డిటెక్టివ్ ఫెలుదా పాత్ర సౌమిత్రకు బాగా పేరు తెచ్చింది. ఆ తర్వాత ఫెలుదా పాత్రకు సంబంధించిన నవలల్లో సౌమిత్ర ఛటర్జీ రూపురేఖల ఆధారంగా బొమ్మలు వేయించారట రే. సౌమిత్ర, నిర్మల్యా ఆచార్య స్థాపించిన మేగజీన్‌కి పేరు పెట్టమని రేని కోరితే ‘ఎక్కోన్’ అని పేరు పెట్టారు. ‘ఎక్కోన్’ అంటే ‘ఇప్పుడు’ అని అర్థం. పేరుతో పాటు కవర్ పేజీ డిజైన్ కూడా చేసి పెట్టారట. వీరి కాంబినేషన్లో ‘దేవి, అరణ్యేర్ దిన్ రాత్రి, చారులత, ఆషానీ సంకేత్, సోనార్ ఖెల్లా’ వంటి సినిమాలు పాపులారిటీ పొందాయి. ‘‘మా కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయాను. మా నాన్నగారిది, ఆయన (సౌమిత్ర)ది అద్భుతమైన కెమిస్ట్రీ. నాన్న సృష్టించిన పాత్రను తనదైన ఆలోచనతో చేశారాయన. ‘ఆషానీ సంకేత్’లోని గంగాచరణ్ పాత్ర సౌమిత్రగారికి ఎంతో ఇష్టం. ఆయన సినిమాలో ఎంతగా లీనమయ్యేవారంటే ఒకసారి ట్రాలీ తోసే మనుషులు తక్కువైతే ఆయనే తోశారు. అంతటి గొప్ప వ్యక్తి. – దర్శకుడు సందీప్ రే, సత్యజిత్ రే తనయుడు -
'పద్మ' అవార్డుల నామినేషన్లకు ఆహ్వానం
న్యూఢిల్లీ : భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మభూషన్, పద్మశ్రీ నామినేష్లన స్వీకరణకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వచ్చే ఏడాది (2021) గణతంత్ర దినోత్సవం రోజు ప్రకటించనున్న పద్మ పురస్కారాలకు ఆన్లైన్ నామినేషన్లు లేదా సిఫారసులకు ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు గడువు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. నామినేషన్లు లేదా సిఫారసులను కేవలం ఆన్లైన్ ద్వారా, పద్మ పురస్కారాల పోర్టల్ ద్వారా స్వీకరిస్తారు. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పేర్లతో ఇచ్చే పద్మ పురస్కారాలు, పౌరులకు ఇచ్చే అత్యున్నత గౌరవాలు. పద్మ పోర్టల్ అందుబాటులో ఉన్న నిర్ణీత నమూనా ప్రకారం నామినేషన్లు లేదా సిఫారసులు ఉండాలి. నామినేట్ లేదా సిఫారసు చేస్తున్న వ్యక్తి, సంబంధింత రంగంలో సాధించిన విజయాలు లేదా సేవల గురించి 800 పదాలకు మించకుండా స్పష్టంగా రాయాలి. సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న అర్హులైన మహిళలు, బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు వంటి ప్రతిభావంతులను గుర్తించడానికి ప్రయత్నాలు చేయమని అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, భారతరత్న, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు, అత్యున్నత సంస్థలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. నామినేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 15న ముగుస్తుందని ఈలోగా దరఖాస్తులు పంపాల్సిందిగా పేర్కొంది. 1954 నుంచి మొదలైన ఈ అవార్డుల పర్వం ప్రతి సంవత్సరం దిగ్విజయంగా కొనసాగుతోంది. జాతి, వృత్తి, స్థానం, లింగ భేదం లేకుండా కళ,సాహిత్యం, విద్య,క్రీడలు, సామాజికం, సైన్స్ అండ్ టెక్నాటజీ సహా వివిధ రంగాల్లో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు సాధించినవారు పద్మ అవార్డులకు అర్హులు. అంతేకాకుండా సమాజంలోని బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్నవారిని గుర్తించి వారి వివరాలను నమోదు చేయాల్సిందిగా ఇప్పటికే కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలు, పద్మ అవార్డుల గ్రహీతలకు కేంద్ర హోంశాఖ కోరింది. అంతేకాకుండా పౌరులు కూడా స్వతహాగా నామినేషన్లు దాఖలు చేయొచ్చని పేర్కొంది. గరిష్టంగా 800 పదాలకు మించకుండా సిఫారసులో సూచించిన ఫార్మాట్ తరహాలో పద్మ అవార్డుల పోర్టల్‌లో సంబంధిత వివరాలను నమోదు చేయాలని తెలిపింది. (కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం ) -
సింధుకు పద్మభూషణ్
న్యూఢిల్లీ: తెలుగుతేజం పీవీ సింధు కీర్తి కిరీటంలో మరో పురస్కారం దర్జాగా చేరింది. భారత ప్రభుత్వం ప్రపంచ చాంపియన్ సింధును మూడో అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మభూషణ్’ అవార్డుకు ఎంపిక చేసింది. మహిళా స్టార్ బాక్సర్ మేరీకోమ్‌కు రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ అందుకోనుంది. 71వ గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా పలురంగాల్లో విశేష కృషి చేసిన భారతీయులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. కేంద్రం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల జాబితాలో మొత్తం ఎనిమిది మంది క్రీడాకారులకు చోటుదక్కింది. మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, భారత మహిళల హాకీ కెపె్టన్ రాణి రాంపాల్, పురుషుల హాకీ మాజీ కెప్టెన్ ఎం.పి.గణేష్, స్టార్ షూటర్ జీతు రాయ్, మహిళల ఫుట్‌బాల్ మాజీ సారథి ఒయినమ్ బెంబెం దేవి, ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్‌లు ‘పద్మశ్రీ’ పురస్కారాలకు ఎంపికయ్యారు. అప్పుడు ‘పద్మ’... ఇప్పుడు భూషణ్ మన సింధుకిది రెండో పద్మ పురస్కారం. ఐదేళ్ల క్రితం 2015లో ఆమెకు పద్మశ్రీ దక్కింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో రన్నరప్‌గా నిలిచిన తెలుగుతేజం ఖాతాలో ఇప్పటికే 5 ప్రపంచ చాంపియన్íÙప్ పతకాలున్నాయి. గతేడాది జరిగిన ఈవెంట్లో బంగారు పతకం నెగ్గిన 24 ఏళ్ల సింధు కెరీర్లో రెండేసి చొప్పున రజత, కాంస్య పతకాలున్నాయి. ఇది వరకే పద్మశ్రీ (2006), పద్మభూషణ్ (2013)లు అందుకున్న మణిపూర్ బాక్సర్, రాజ్యసభ ఎంపీ మేరీకోమ్ తాజాగా ‘పద్మవిభూషణ్’గా ఎదిగింది. స్పోర్ట్స్‌లో ఈ అవార్డుకు ఎంపికైన నాలుగో వ్యక్తి మేరీ. మాజీ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, దివంగత పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరి (న్యూజిలాండ్), క్రికెట్ ఎవరెస్ట్ సచిన్ టెండూల్కర్లు మాత్రమే పద్మవిభూషణ్ అందుకున్నారు. సచిన్ అనంతరం అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ కూడా అందుకున్న సంగతి తెలిసిందే. 41 ఏళ్ల జహీర్‌ఖాన్ 2011 వన్డే ప్రపంచకప్ సాధించిన టీమిండియా సభ్యుడు. 92 టెస్టుల్లో 311, 200 వన్డేల్లో 282 వికెట్లు తీశాడు. 25 ఏళ్ల భారత కెప్టెన్ రాణి రాంపాల్ 241 మ్యాచ్‌లలో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. క్వాలిఫికేషన్ మ్యాచ్‌ల్లో అమెరికాపై గెలిచి టోక్యో ఒలింపిక్స్ బెర్తు సాధించడంలో రాణి కీలకపాత్ర పోషించింది. -
ఓ ఖాళీ ఉంచా
న్యూఢిల్లీ: తాజా ప్రపంచ చాంపియన్‌షిప్ విజయంతో తనపై ఉన్న సిల్వర్ స్టార్ (రజత విజేత) ఇమేజ్ను చెరిపేసుకున్న తెలుగుతేజం పీవీ సింధు ఇపుడు ఒలింపిక్ స్వర్ణంపై కన్నేసింది. తన పతకాల అల్మారాలో ఓ ఖాళీ ఉంచానని... దాన్ని ఒలింపిక్స్ బంగారంతోనే భర్తీ చేస్తానని ధీమాగా చెబుతోంది. 24 ఏళ్ల బ్యాడ్మింటన్ స్టార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఈ ప్రపంచకప్ స్వర్ణంతో ఫైనల్ పరాజయాలకు ముగింపు పలికాను. ఇప్పటివరకు క్రీడాభిమానులంతా నా ఫైనల్ ఫోబియా గురించే చర్చించుకునేవారు. ఇప్పుడు వారందరికి నా రాకెట్‌తోనే సమాధానమిచ్చా. ఫైనల్ ఒత్తిడిని ఎలా అధిగమిస్తానో ప్రపంచ చాంపియన్‌షిప్ విజయంతో నిరూపించా. ఇవన్నీ సాధించినప్పటికీ ఒలింపిక్స్ అనేది పూర్తిగా భిన్నమైన అనుభూతినిచ్చేది. రియో, ప్రపంచ చాంపియన్‌షిప్ ఈవెంట్లు నాకు విభిన్నమైన మధుర జ్ఞాపకాలిచ్చాయి. అయితే ఇప్పటికీ ఓ స్వర్ణం వెలితి ఉంది. దీన్ని టోక్యో ఒలింపిక్స్‌లో సాకారం చేసుకుంటా. దీనికోసం కఠోరంగా శ్రమిస్తా’ అని తెలిపింది. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకు వస్తే మంచిదేనని... దాంతో టోర్నీ డ్రాలకు మేలవుతుందని చెప్పింది. అయితే టాప్ ర్యాంకుమీదే ఎక్కువగా ఆలోచించనని, ప్రస్తుతానికి ఒలింపిక్స్ స్వర్ణమే తన లక్ష్యమని తెలిపింది. ఒకదాని తర్వాత ఒకటి సాధించేందుకు, సాకారం చేసుకునేందుకు శ్రమిస్తానని వివరించింది. ‘ఇప్పుడు నేను చైనా ఓపెన్‌పైనే దృష్టి పెట్టాను. ఆ తర్వాత కొరియా ఓపెన్‌లో ఆడతాను’ అని పేర్కొంది. చైనీస్ ఈవెంట్ ఈ నెల 17 నుంచి మొదలవుతుంది. ఆ వెంటనే 24 నుంచి కొరియా ఓపెన్ జరుగుతుంది. సైనా, తన తర్వాత ఈ స్థాయి క్రీడాకారిణి వెలుగులోకి వచ్చేందుకు చాలా సమయం పడుతుందని ఆమె విశ్లేషించింది. జూనియర్లు బాగానే ఆడుతున్నప్పటికీ తమలా రాటుదేలడం అంత సులభం కాదని తెలిపింది. పద్మ భూషణ్’కు సింధు! అంతర్జాతీయ క్రీడల్లో అతివల సత్తాకు ‘పద్మ’లతో పట్టం కట్టేందుకు క్రీడాశాఖ సిద్ధమైంది. పౌరపురస్కారాల కోసం తొమ్మిది మంది క్రీడాకారిణుల పేర్లను కేంద్ర క్రీడాశాఖ ప్రతిపాదించింది. ఈ జాబితాలో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్, తెలుగుతేజం పూసర్ల వెంకట సింధు కూడా ఉంది. మెగా ఈవెంట్లలో విశేషంగా రాణిస్తున్న స్టార్ షట్లర్‌ను భారత మూడో అత్యున్నత పౌరపురస్కారమైన ‘పద్మ భూషణ్’కు సిఫారసు చేసింది. రెండేళ్ల క్రితమే సింధు పేరును ఆ అవార్డు కోసం ప్రతిపాదించినా అప్పుడు దక్కలేదు. ఈసారి ఆ పుర స్కారం అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో ఆమె ‘పద్మశ్రీ’ (2015) అందుకుంది. మణిపూర్ మాణిక్యం, ఆరుసార్లు ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ అయిన ఎమ్.సి. మేరీకోమ్ కీర్తికిరీటంలో మరో అత్యున్నత పురస్కారం చేరే అవకాశాలున్నాయి. రెండో అత్యున్నత పురస్కారమైన ‘పద్మ విభూషణ్’కు మేరీ పేరును క్రీడాశాఖ ప్రతిపాదించింది. ఇదివరకే ఆమె 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ అవార్డుల్ని అందుకుంది. ఆమె ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలు కూడా. మిగతా ఏడుగురు క్రీడాకారిణులను ‘పద్మశ్రీ’ కోసం సిఫార్సు చేసింది. వీరిలో యువ రెజ్లర్ వినేశ్ ఫొగాట్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనిక బాత్రా, క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్, హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, మాజీ షూటర్ సుమా శిరూర్, పర్వతారోహకులైన కవల సోదరిలు తషి, నుంగ్షి మలిక్ ఉన్నారు. అనంతరం ఈ జాబితాలో ఇద్దరు పురుషులు ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్‌తో పాటు అలనాటి హాకీ ఆటగాడు గణేశ్‌లను ‘పద్మశ్రీ’ కోసం సిఫార్సు చేశారు. అయితే వీరిద్దరి పేర్లకు క్రీడా శాఖ మంత్రి కిరిణ్ రిజిజు ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. -
నాతో ప్రయాణించినవాళ్లకు ప్రేమతో...
మలయాళ సూపర్ స్టార్, ఫ్యాన్స్ అభిమానంగా పిలుచుకునే ‘కంప్లీట్ యాక్టర్’ మోహన్‌లాల్‌కు శుక్రవారం కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గౌరవాన్ని తనతో ప్రయాణం చేసినవాళ్లందరకు పంచారాయన. ‘‘నాది 40 ఏళ్ళ సుదీర్ఘ సినిమా ప్రయాణం. ఈ ప్రయాణంలో కొన్నివేల మంది శ్రేయోభిలాషులను నా దారిలో కలిశాను. సెట్లో లైట్‌బాయ్ కావచ్చు, మా పక్కనే యాక్ట్ చేసిన ధృవతారలు కావచ్చు. మమ్మల్ని తెర మీద చూసి అభిమానించిన ప్రేక్షకులు కావచ్చు. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి కృషి చేసే ప్రయత్నంలో వాళ్ల ప్రేమాభిమానాలే మాకు ఉత్సాహాన్నిచ్చే మంత్రాలయ్యాయి. ఈ పురస్కారాన్ని నాకు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇదో ఆశీర్వాదంలా భావిస్తున్నా. నాతో ప్రయాణం చేసిన వాళ్లందరికీ ప్రేమతో ఈ అభినందనను అంకితమిస్తున్నాను. ఈ గౌరవం, గుర్తింపునకు చాలా సంతోషిస్తున్నాను. ఈ ప్రయాణంలో నాతో భాగమైన వారందరికీ కృతజ్ఞుడిని’’ అని పేర్కొన్నారు మోహన్‌లాల్. -
'పద్మభూషణ్'కు సింధు
-
'పద్మభూషణ్'కు సింధు
న్యూఢిల్లీ: దేశ మూడో అత్యున్నత పురస్కారం 'పద్మభూషణ్' కోసం భారత స్టార్ షట్లర్ పివి సింధు పేరును కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సిఫారుసు చేసింది. ఈ మేరకు సోమవారం ఆమెను పద్మభూషణ్ అవార్డు కోసం నామినేట్ చేసింది.ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో రజత పతకం సాధించిన సింధు.. ఆపై కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ ను కూడా కైవసం చేసుకున్నారు. అంతకుముందు రియో ఒలింపిక్స్ లో పివి సింధు రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి పద్మ పురస్కారాల్లో భాగంగా పద్మభూషణ్ కు సింధు పేరును క్రీడా శాఖ ప్రతిపాదించింది. -
ఈసారి కూడా ధోనికి నిరాశేనా?
న్యూఢిల్లీ: భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన మహేంద్ర సింగ్ ధోని పేరును దేశ మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుకు బీసీసీఐ సిఫారుసు చేసిన సంగతి తెలిసిందే. అయితే ధోనికి పద్మభూషణ్ పురస్కారం లభించే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఈ అవార్డుకు ధోని పేరును మాత్రమే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సిఫారుసు చేసినా ఉపయోగంలేనట్లే కనబడుతోంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ధోని పేరును ప్రభుత్వం మరోసారి తిరస్కరించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ అవార్డుకు 2013, 16ల్లోనూ ధోని పేరును బీసీసీఐ నామినేట్ చేసినా అప్పట్లో కేంద్రం తిరస్కరించింది. 2013 ఐపీఎల్లో భాగంగా స్పాట్ ఫిక్సింగ్ కేసులో ధోని పేరు పదే పదే సుప్రీంకోర్టులో ప్రస్తావనకు రావడం వల్ల ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు అతని పేరును తిరస్కరించారు. అప్పట్లో పెద్ద దుమారం రేపిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్ పై నిషేధం పడినప్పటికీ, ఫిక్పింగ్ తో ధోనికి సంబంధాలున్నట్లు రుజువు కాలేదు. అయినప్పటికీ ఆ స్పాట్ ఫిక్సింగ్ ను సాకుగా చూపే అప్పట్లో ధోనికి పద్మభూషణ్ ను ఇవ్వడానికి కేంద్రం మొగ్గు చూపలేదు. ఈసారి కూడా అదే రిపీట్ అయ్యేటట్లు కనబడుతోంది. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు(2007 ట్వంటీ 20 వరల్డ్ కప్,2011 వన్డే ప్రపంచకప్) సాధించిన ఘనత ధోనిది. మరొకవైపు దాదాపు పదివేల వన్డే పరుగులకు కూడా ధోని చేరువయ్యాడు. ఇటీవల మూడొందల వన్డేను పూర్తి చేసుకున్న ధోని..ఈ ఘనత సాధించిన అరుదైన క్రికెటర్ల జాబితాలో కూడా చేరిపోయాడు. అదే క్రమంలో వన్డేల్లో వంద స్టంపింగ్‌లతో సరికొత్త రికార్డును ధోని లిఖించాడు. భారత క్రికెట్ లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ధోని.. పద్మభూషణ్ అందుకోవడానికి అన్నివిధాలుగా అర్హుడిగానే చెప్పాలి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ధోని పేరును బీసీసీఐ ఏకగ్రీవంగా సిఫారుసు చేసింది. మరి ప్రభుత్వం మాత్రం ధోనికి పద్మభూషణ్ ఇవ్వడానికి వెనుకడుగు వేసినట్లు సమాచారం. -
మహేంద్రుడికి మరో గౌరవం!
-
మహేంద్రుడికి మరో గౌరవం!
పద్మభూషణ్ పురస్కారానికి ధోని పేరు సిఫారసు చేసిన బీసీసీఐ న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి బీసీసీఐ సిఫారసు చేసింది. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలకు గుర్తింపుగా దేశంలో మూడో అత్యున్నత పురస్కారానికి ‘మిస్టర్ కూల్’ పేరును ప్రతిపాదించింది. పద్మ అవార్డులకు ఈ ఏడాది ధోని పేరు మాత్రమే సిఫారసు చేసినట్టు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ధోని పేరును ఏకగ్రీవంగా బోర్డు సభ్యులు నామినేట్ చేశారని తెలిపారు. ‘మహేంద్ర సింగ్ ధోని పేరును పద్మభూషణ్ అవార్డుకు బీసీసీఐ సిఫారసు చేసింది. బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సమకాలిన క్రికెట్లో గొప్ప ఆటగాళ్లలో ధోని ఒకడు. అతడి పేరును దేశ ప్రతిష్టాత్మక పురస్కారానికి ప్రతిపాదించడం సముచితమని భారత క్రికెట్ బోర్డు భావించింద’ని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా బుధవారం తెలిపారు. ‘మన దేశానికి చెందిన గొప్ప క్రికెటర్లలో ధోని ఒకడని.. వన్డేల్లో దాదాపు 10 వేల పరుగులు చేశాడు. 90 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అవార్డుకు నామినేట్ చేయడానికి ఇంతకంటే ఏం కావాల’ని ఖన్నా వ్యాఖ్యానించారు. కెప్టెన్‌గా టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోని 302 వన్డేలు ఆడి 9737 పరుగులు సాధించాడు. 90 టెస్టుల్లో 4876 పరుగులు.. 78 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో1212 పరుగులు చేశాడు. 36 ఏళ్ల ధోని ఇప్పటికే అర్జున, రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ అవార్డులు అందుకున్నాడు. -
గడ్కరీ మాటలు నన్ను బాధించాయి: నటి
ముంబయి: పద్మభూషణ్ అవార్డు కోసం తన వెంటపడ్డానంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి నష్టం లేదని ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ అన్నారు. అయితే, ఆయన అన్న మాటలు మాత్రం తనను తీవ్రంగ బాధించాయని చెప్పారు. గత ఏడాది ఓసారి అవార్డుల విషయంలోమాట్లాడిన నితిన్ గడ్కరీ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డుకు తన పేరును సిఫారసు చేయాలని ఆశా పరేఖ్ తనను కోరినట్లు గడ్కరీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను మీడియా ఆమెకు తాజాగా గుర్తు చేయగా స్పందిస్తూ ‘ఆయన మాటలు నన్ను బాధించాయి. ఆయన అలా చేయడం భావ్యం కాదు. అయితే, అది నాకు పెద్ద విషయమేం కాదు. చిత్ర పరిశ్రమలో వివాదాలు ఒక భాగంగానే ఉంటాయి’ అని అన్నారు. పరేఖ్ 1992లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2014లో జీవితకాల సాఫల్య అవార్డును అందుకున్నారు. హిందీ చిత్రాల్లో 1959న ఉంచి 1973 వరకు ఆమె అగ్రశ్రేణినటిగా ఒక వెలుగు వెలిగారు. పరేక్ ఆశా జీవిత చరిత్రను ‘ది హిట్ గర్ల్’ అనే పేరిట ప్రముఖ క్రిటిక్ ఖలీద్ మహ్మద్ రాస్తున్నారు. ఈ పుస్తకం ఏప్రిల్ 10న విడుదల కానుంది. -
పద్మభూషణులతో కాసేపు..
ఈసారి ‘పద్మ’ అవార్డుల్లో తెలుగువారి కీర్తి శిఖరం రెపరెపలాడింది. దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో చాటిన హైదరాబాదీ క్రీడాకారిణులు సానియామీర్జా, సైనా నెహ్వాల్‌తోపాటు ఆరోగ్య రంగంలో ఎంతో కృషి చేసిన శాస్త్రవేత్త ఆళ్ల వెంకట రామారావు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, తెలుగు భాషను సుసంపన్నం చేసేందుకు కృషి చేస్తున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్లను పద్మభూషణ్ పురస్కారం వరించింది. రామోజీరావు, యామినీ కృష్ణమూర్తిలకు పద్మ విభూషణ్ అవార్డు.. రాజమౌళి, కె.లక్ష్మాగౌడ్, ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, మన్నం గోపీచంద్, డాక్టర్ నాయుడమ్మ, సునీతా కృష్ణన్, టి.వి.నారాయణ తదితరులకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం తెలిసిందే. ఈ సందర్భంగా పద్మభూషణులను ‘సాక్షి’ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలు ఈ వారం ‘ఫోకస్’లో... దేశ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తా.. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తా: సైనా నెహ్వాల్ హైదరాబాద్ నుంచి ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్ ఒకరు. దేశంలో బ్యాడ్మింటన్ క్రీడకు గుర్తింపు, ప్రచారం తీసుకువచ్చింది ఆమేనంటే అతిశయోక్తికాదు. ఈ సేవలను గుర్తించే ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్‌కి ఎంపిక చేసింది. ఈ పురస్కారం ప్రపంచ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని.. దేశ ప్రతిష్టను పెంచేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని సైనా నెహ్వాల్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ విశేషాలు.. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. దీనిపై మీ స్పందన? సంతోషంగా ఉంది. 2010లోనే పద్మశ్రీ పొందాను. ఇప్పుడు పద్మభూషణ్.. ఓరకంగా చిన్న వయసులోనే గొప్ప గౌరవాన్ని పొందనుండడం గర్వంగా అనిపిస్తోంది. ఆటతో పాటు చాలా మందికి ఆదర్శంగా నిలవడం వల్లే ఈ ఖ్యాతి దక్కిందని భావిస్తున్నాను. వాస్తవానికి ఈ అవార్డును నేనేమాత్రం ఊహించలేదు. క్రీడాకారిణి అయిన మీకు పౌర పురస్కారం రావడాన్ని ఎలా భావిస్తారు? ఆటపరంగా గత ఏడాది అత్యున్నత స్థాయిలో రాణించాను. సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రితో పాటు ఇండియా ఓపెన్ సూపర్‌సిరీస్ టైటిల్ సాధించా. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్, చైనా ఓపెన్‌ల్లో ఫైనల్స్‌కు వెళ్లాను. దీనికి తోడు తొలిసారిగా భారత్ నుంచి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్‌గా పేరు తెచ్చుకున్నాను. ఓవరాల్‌గా దేశంలో ఈ ఆట పాపులర్ అయ్యేందుకు నా వంతు సహకారం ఉందని చెప్పగలను. సామాజిక పరంగా నా పరిధి మేర వీలైనంత కృషి చేస్తూనే ఉన్నాను. అస్సాం వరదలతోపాటు నేపాల్ భూకంప బాధితులకు విరాళాలందించాను. ఇటీవలి చెన్నై వరదల నేపథ్యంలో క్రీడాకారుల నుంచి తొలిసారిగా నేను స్పందించి ఆర్థిక సహాయం చేశాను. ఇతర పద్మభూషణ్ విజేతల గురించి మీ అభిప్రాయం? నాతో పాటు ఈ అవార్డును అందుకోనున్న మిగతా వారి గురించి నేనేమీ చెప్పలేను. కానీ సానియా మీర్జాకు పద్మభూషణ్ రావడం ఆనందాన్నిచ్చింది. ఇద్దరం ఒకేసారి ఆటల్లో ప్రస్థానం ప్రారంభించాం. ఒకేసారి నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి పేరు తెచ్చుకున్నాం. అలాగే ఒకే సమయంలో ప్రపంచ నంబర్‌వన్ కాగలిగాం. ఇప్పుడు ఈ అవార్డు కూడా.. ఇది నిజంగా హైదరాబాదీ స్పెషల్‌గా భావిస్తున్నాను. ఈ అత్యున్నత పురస్కారం భవిష్యత్‌లో మీకు ఎలాంటి ప్రోత్సాహాన్నిస్తుంది? ప్రపంచ బ్యాడ్మింటన్‌లో మరిన్ని విజయాలు సాధించేందుకు ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. గతేడాదికన్నా మెరుగైన ప్రదర్శనతో ఈసారి ముందుకెళతాను. అలాగే రియోడిజనీరోలో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి దేశ ప్రతిష్టను మరింత పెంచేందుకు నా శాయశక్తులా కృషిచేస్తాను. డయాబెటిస్‌నూ నయం చేయవచ్చు పద్మభూషణ్ గ్రహీత, గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఎంతో అభివృద్ధి చెందిన దేశాల నిపుణులు కూడా... గ్యాస్ట్రో ఎంటరాలజీలో శిక్షణ కోసం భారత్‌కు వస్తుంటారు. ఎందుకంటే ఆ రంగంలో మన దేశం సాధించిన పురోగతి ఎంతో అద్భుతం. ఈ పురోగతికి గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి వంటి నిపుణులే కారణం. ఆరోగ్య సేవల రంగంలో ఆయన కృషిని గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఇప్పుడు ఎంతో మందికి సమస్యగా మారిన మధుమేహం (డయాబెటిస్)ను కూడా పూర్తిస్థాయిలో నయం చేయవచ్చని చెబుతున్న నాగేశ్వరరెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు.. పద్మభూషణ్ పురస్కారం రావడంపై మీ స్పందన.. సంతోషంగా ఉంది. ఈ విభాగంలో పద్మభూషణ్ దక్కిన వారు చాలా తక్కువ. ఇది నాకు వ్యక్తిగతంగా లభించినట్లుగా కాకుండా మా సంస్థకూ, మా గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి దక్కిన పురస్కారంలా భావిస్తున్నాను. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సరైన సేవలు అందుతున్నాయా? ఆ దిశగా మీ కృషిని గురించి చెప్పండి.. మన జనాభాలో 30% మంది ఆసిడిటీ, అల్సర్స్, గ్యాస్ట్రిక్ కేన్సర్లు, పాంక్రియాస్, పెద్దపేగు టీబీ వంటి గ్యాస్ట్రో ఎం టరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు. నిజానికి డయాబెటిస్, హైబీపీతో బాధపడుతున్నవారికంటే గ్యా స్ట్రో సమస్యతో బాధపడేవారు ఎక్కువ. ఇక్కడివారిలో జన్యుపరంగానే ఈ సమస్యతో బాధపడేందుకు అవకాశాలెక్కువ. ఏపీ, తెలంగాణల జనాభా 8 కోట్లు అనుకుంటే గరిష్టంగా కోటి మందికి మాత్రమే ఇప్పుడు గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుల సేవలు అందుతున్నాయి. బాధితులందరికీ సేవలు అందాలంటే ఇప్పుడున్న సంఖ్యకు పదిరెట్లు ఎక్కువ మంది నిపుణులు అవసరం. ఇప్పుడున్న పరిస్థితిలో అందరికీ సేవలు అందాలంటే పదేళ్లు పడుతుంది. అందుకే కొన్ని మొబైల్ సెంటర్స్ పెడుతున్నాం. ఇటీవల కొన్ని శస్త్రచికిత్స ప్రక్రియల ద్వారా డయాబెటిస్‌కు మంచి చికిత్స అందనున్నట్లు తెలిపారు. ఆ పరిశోధనల్లో పురోగతి గురించి చెప్పండి.. డయాబెటిస్‌లో టైప్-3కి ఐలెట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రి య ద్వారా చికిత్స అందించడానికి ప్రభుత్వ అనుమతి లభించింది. అలాగే టైప్-2కు ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా చికిత్స అందించే ప్రక్రియ విజయవంతమైంది. త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఎన్నో దేశాల నుంచి గ్యాస్ట్రో ఎంటరాలజీ చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర మాత్రమే లభ్యమయ్యే కొత్త చికిత్సా విధానాలేమిటి? నేను ‘ఎండోస్కోపీ ఫెడరేషన్’కు అధ్యక్షుడిని. ఇందులో 160 దేశాలు ఉన్నాయి. ఆధునిక సాంకేతికత ఉన్న అమెరికా, జపాన్, జర్మనీల కం టే మన దగ్గర ఉన్న పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు అనేక దేశాల నిపుణులు వస్తున్నారు. అంతేకాదు మెడికల్ టూరిజంలో భాగంగా ఎంతో మంది రోగులు చికిత్స కోసం హైదరాబాద్‌కే వస్తున్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీలో అడ్వాన్స్డ్ విధానాల ద్వారా డయాబెటిస్‌ను రాకుండా అరికట్టే విధానంగానీ, వచ్చినా నయం చేసే చికిత్సగానీ ఏదైనా ఉందా? సమీప భవిష్యత్తులో డయాబెటిస్ రోగులకు అందే శుభవార్త ఏదైనా ఉందా? గ్యాస్ట్రో ఎంటరాలజీ, గ్యాస్ట్రిక్ కేన్సర్‌కు సంబంధించి రెండు అంశాలున్నాయి. మొదటిది కరెక్టబుల్ ఫ్యాక్టర్స్. అంటే మనం తీసుకునే జాగ్రత్తల ద్వారా నివారించగలిగేవి. రెండోది నాన్కరెక్టబుల్ ఫ్యాక్టర్స్. మనం జాగ్రత్తలు తీసుకున్నా పెద్దగా నివారించలేనివి. అంటే జన్యుపరంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం, ఇన్సులిన్ ఉత్పత్తయినా దానికి శరీరం నుంచి రెసిస్టెన్స్ రావడం వంటివి. కేన్సర్‌లో లాగే గ్యాస్ట్రో ఎంటరాలజీలోనూ స్టేజ్‌లు ఉంటాయి. ఐదేళ్లలోపే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తగ్గించుకోగలిగేవి స్టేజ్-1. పదేళ్లలోపు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నివారించగలిగేవి స్టేజ్-2. పదేళ్లకు మించి కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యగా పరిణమించేవి స్టేజ్-3 అనుకోవచ్చు. స్టేజ్-3 వచ్చే వరకూ జాగ్రత్తలు తీసుకోకపోతే అది మనకు శాశ్వత నష్టం చేకూర్చవచ్చు. అందుకే ముందుగానే జీవనశైలిలో ఆరోగ్యవంతమైన మార్పులతో ఐదేళ్లలోపే జాగ్రత్తపడితే గ్యాస్ట్రో ఎంటరాలజీ సంబంధిత సమస్యలతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. ఇక కరెక్టబుల్ ఫ్యాక్టర్స్‌ను అనుసరిస్తూ, నాన్ కరెక్టబుల్ ఫ్యాక్టర్స్నూ బాగు చేసుకోగలిగితే డయాబెటిస్‌ను కూడా పూర్తిగా నయం చేయవచ్చు. ఇటీవల అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి ప్రభావం గ్యాస్ట్రో ఎంటరాలజీ వ్యవస్థపై పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఒత్తిడి వల్ల పొట్ట, దానికి సంబంధించిన పేగులు వంటి గ్యాస్ట్రో ఎంటరాలజీ వ్యవస్థకు సంబంధించిన అవయవాలే గాక... అన్ని శరీర భాగాలపై దుష్ర్పభావం పడుతుంది. దాంతో ఒకపక్క యాసిడ్ స్రావాలు పెరుగుతుండగా... మరోవైపు కాలేయం, పాంక్రియాస్ నుంచి జీర్ణవ్యవస్థకు అవసరమైన స్రావాలు తగ్గుతుంటాయి. దీనివల్ల పేగుల కదలికలు తగ్గి మలబద్ధకం రావచ్చు. కొందరిలో నీళ్లవిరేచనాలు వంటి సమస్యకూ దారితీయవచ్చు. ఇలాంటి మానసిక ఒత్తిడి వల్ల కొందరిలో ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వంటి సమస్య కూడా రావచ్చు. ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడటంతో పాటు అన్ని రకాల ఆరోగ్య సమస్యలూ దూరమవుతాయి. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో మన దేశం అందిస్తున్న సేవల గురించి చెప్పండి? కొన్ని అంశాల్లో అత్యాధునిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న దేశాల కంటే... మన దేశంలో శిక్షణ పొందడానికి ఆయా విభాగాల నిపుణులు వస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు కాలేయ మార్పిడి చికిత్స కోసం మన దేశ నిపుణులపైనే ప్రపంచ దేశాలు ఆధారపడుతున్నాయి. ఒత్తిడి నివారణకు మీరు అనుసరించే మార్గమేమిటి? నేను అందించే సేవలను నా బాధ్యతగా పని అనుకోవడం కంటే.. దాన్నే నేను ఎంజాయ్ చేసే ప్రక్రియగా భావిస్తుంటాను. దాన్ని ఆస్వాదిస్తూ చేస్తుంటాను. దాంతో ఏ మాత్రం ఒత్తిడి ఉండదు. మీరు ఉన్నత స్థానానికి రావడానికి మీ కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం, మీరు ఎదుర్కొన్న సమస్యలు..? తప్పకుండా నా కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉంది. నేను నా పనిలో నిమగ్నమైనా.. కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఇది మనకు దొరికే ప్రోత్సాహమే కదా. ఇక వ్యక్తిగతంగా నేను కష్టకాలం, సంక్లిష్టమైన సమయం అని భావించిన ఉదంతాలు లేవు. చావుబతుకుల మధ్య ఉన్న ఎవరైనా చిన్నారిగానీ, యువకులనుగానీ కొన్నేళ్లు బతికించగలిగే అవకాశం లేనప్పుడు బాధ కలుగుతుంది. ఎందుకంటే వారిని కొన్నేళ్లు బతికించగలిగితే... భవిష్యత్తులో మరింత మెరుగైన చికిత్స అంది దీర్ఘకాలం జీవించగలరుకదా అనిపిస్తుంది. సామాజిక సేవ చేస్తున్నా.. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా దేశ క్రీడారంగంలో ఇటీవల సంచలనం సృష్టించిన క్రీడాకారిణి సానియా మీర్జా. స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలసి టెన్నిస్ డబుల్స్‌లో వరుసగా 36 విజయాలు సాధించి రికార్డు సృష్టించిన ఆమెను ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. తాను ఇప్పటికే సామాజిక సేవ చేస్తున్నానని చెప్పిన సానియా మీర్జా... ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని ‘సాక్షి’ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు.. పద్మభూషణ్ అవార్డుపై మీ స్పందన ఒక క్రీడాకారిణిగా అర్జున, రాజీవ్ ఖేల్త్న్రలాంటి అవార్డులు సహజంగానే ఆశిస్తాం. అయితే పౌర పురస్కారం లభించడం ఏ రకంగా చూసినా చాలా గర్వకారణం. పద్మభూషణ్‌కు నన్ను ఎంపిక చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఎంతో మంది గొప్పవారితో కలసి అవార్డుకు ఎంపిక కావడం ఎప్పటికీ మరచిపోలేను. గతంలోనే మీకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది కదా.. పదేళ్ల క్రితం పద్మశ్రీ అవార్డును స్వీకరించాను. ఇప్పు డు పద్మభూషణ్‌తో మరో మెట్టు ఎక్కినట్లు అనిపిస్తోంది. అప్పుడైనా, ఇప్పుడైనా నేను వాటిని ఆశించలేదు. నా పని టెన్నిస్ ఆడటాన్నే చేసుకుంటూ పోయాను తప్ప ఇతరత్రా ఆలోచించలేదు. పద్మభూషణ్ ఇవ్వడమంటే నా విజయాలకే కాదు ఆటను, దేశం తరఫున ప్రదర్శనను ప్రభుత్వం గుర్తిస్తున్నట్లే. టెన్నిస్‌కు దక్కిన గుర్తింపుగా కూడా దీనిని చెప్పగలను. పురస్కార గ్రహీతలు సమాజ సేవలో భాగం కావడంపై మీ స్పందన నిజమే, ఈ అవార్డు గౌరవంతో పాటు బాధ్యతను కూడా పెంచింది. నేను కూడా చాలా కాలంగా నా పరిధిలో సామాజిక సేవ చేస్తున్నా. ఈ విషయం చాలా మందికి తెలీదు. దీనిని వ్యక్తిగతంగా నా వరకే పరిమితం చేసుకున్నాను తప్ప మీడియాతో ఎప్పుడూ పంచుకోవాలని భావించలేదు. ఇకపైనా సామాజిక సేవను కొనసాగిస్తాను. అవసరమైతే మున్ముందు వివరంగా వెల్లడిస్తా. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటున్నా.. హింగిస్‌తో వరుస విజయాలపై.. ఏడాదిన్నర క్రితం దుబాయ్‌లో అనూహ్యంగా మా జోడీ కలిసింది. తను బ్యాక్‌హ్యాండ్ బాగా ఆడుతుంది. నేను ఫోర్‌హ్యాండ్ బాగా ఆడతాను. ఆ సమయానికి గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మా ప్రదర్శన గొప్పగా లేదు. ముందుగా బిజినెస్ పార్ట్నర్షిప్లాగా మైదానం వరకే పరిచయం కొనసాగింది. రానురానూ ఇద్దరి అభిరుచులు కలవడంతో కలసి ప్రయాణిద్దామని నిర్ణయించుకున్నాం. అది అద్భుత ఫలితాలు ఇచ్చింది. మా విజయపరంపర వరుసగా 36 మ్యాచ్‌ల వరకు కొనసాగడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది అరుదుగా మాత్రమే జరుగుతుంది. 1990 తర్వాత ఇలా ఎవరూ ఆడలేదంటే మేం చాలా బాగా ఆడుతున్నట్లే లెక్క. ఈ అంకెలు మీడియాలో రాసినప్పుడు తెలుస్తుంది. కానీ మేం బరిలోకి దిగేటప్పుడు ఆ ఒక్క మ్యాచ్ గురించే ఆలోచిస్తాం. గత ఆరు నెలలుగా మేం ఓడిపోలేదనేది వాస్తవం. అయితే మేం మెజీషియన్లం కాదు. ఎప్పుడో ఒకచోట, ఏదో రోజు ఓటమితో దీనికి ముగింపు వస్తుందేమో. ‘సాన్‌టినా’గా మారడానికి కారణం? గతంలో కొన్ని విజయవంతమైన డబుల్స్ జోడీలు ఇద్దరూ కలసి ఒకే పేరుతో టీమ్‌గా బరిలోకి దిగిన సందర్భాలున్నాయి. అదే స్ఫూర్తితో మాకూ ఓ పేరు పెట్టుకుంటే బాగుంటుందనిపించింది. దాంతో ట్వీటర్లో అభిమానుల అభిప్రాయం కోరాం. ఇండో-స్విస్ ఎక్స్‌ప్రెస్ మొదలు మార్టినా-మీర్జా వరకు ఎన్నో పేర్లు వచ్చాయి. చివరకు ఇద్దరి పేర్లు వచ్చే సాన్‌టినా నచ్చడంతో దానినే ఎంపిక చేసుకున్నాం. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాను కాబట్టి మంచి ప్రణాళికతో జాగ్రత్తలు తీసుకుంటూ వరుస టోర్నీలు ఆడుతున్నాను. సామాజిక ప్రాజెక్టులు చేపట్టాలి ఆర్గానిక్ రసాయన శాస్త్రవేత్త వెంకట రామారావు ఎనభై ఏళ్ల వయసులో ఎవరైనా హడావుడేమీ లేకుండా మనవలు, మనవరాళ్లతో గడపాలనుకోవడం సహజం. కానీ రసాయన శాస్త్రవేత్త ఆళ్ల వెంకట రామారావు దీనికి భిన్నం. రిటైర్మెంట్ తరువాత ఓ కొత్త కంపెనీని నెలకొల్పడమే కాకుండా... ఇతరులకు కష్టసాధ్యమైన పనులను మాత్రమే చేపట్టాలని నిర్ణయించుకుని, అదే తీరును కొనసాగిస్తున్నారు. 1935 ఏప్రిల్ 2న గుంటూరులో జన్మించిన వెంకటరామారావు... అంచెలంచెలుగా ఎదిగి దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఎదిగారు. 1991లో పద్మశ్రీ అవార్డు అందుకున్న ఈయన తాజాగా పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన పంచుకున్న విషయాలివీ.. ఫార్మా రంగంలో భారత్‌ను ఇప్పటికీ జెనరిక్ మందుల తయారీ కేంద్రంగా, కాపీ మాస్టర్‌గానే పరిగణిస్తారు. సొంతంగా ఆవిష్కరణలు చేసేదెప్పుడు? టెన్త్, ఇంటర్లు చదవకుండా గ్రాడ్యుయేషన్ చేయగలరా? జెనరిక్ మందుల తయారీ కూడా అంతే. దాదాపు అన్ని మందులపై పేటెంట్లు ఉన్న 1970 ప్రాంతంలో దేశ అవసరాలను తీర్చేందుకు మనం జెనరిక్ మందుల తయారీకి సిద్ధమయ్యాం. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేటెంట్ల చట్టాన్ని సవరించినప్పుడు ఏ బహుళజాతి కంపెనీ కూడా దాన్ని వ్యతిరేకించలేదు. అయితే వారి అంచనాలను తారుమారు చేస్తూ మనం అద్భుతాలు సృష్టించగలిగాం. అతితక్కువ ఖర్చుతో నాణ్యమైన మందులను అందించగలిగాం. ఈ క్రమంలో మనం డ్రగ్ డిస్కవరీకి సంబంధించి ఎంతో నేర్చుకున్నాం కూడా. ఫలితంగా ఇప్పుడు భారత్ డ్రగ్ డిస్కవరీకి సంబంధించిన అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేయగలిగింది. భవిష్యత్తులో మనం కూడా అగ్రరాజ్యాలకు దీటుగా కొత్త మందులను ఆవిష్కరించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. మన విద్యావ్యవస్థ బాగుపడేదెలా? దేశంలోని అనేక విద్యాసంస్థలు పీహెచ్‌డీలు అందించేందుకే పనిచేస్తున్నాయి. సమస్యలను గుర్తించి తదనుగుణంగా పరిశోధనలు చేపట్టడం తగ్గిపోయింది. సీఎస్ఐఆర్ పరిశోధనశాలల్లో కూడా పరిస్థితులు అంతబాగా లేవు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డెరైక్టర్లు... తమకంటే ముందు పనిచేసిన వారి ప్రాజెక్టులను అర్ధంతరంగా ఆపేస్తున్నారు. ఐఐసీటీ డెరైక్టర్‌గా ఉండగా ఎరువులు, క్రిమిసంహారక మందుల తయారీకి సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టడం వల్ల ఆయా రంగాల్లో స్వావలంబన సాధించడానికి వీలైంది. విద్యావ్యవస్థ మెరుగుపడాలంటే సామాజిక అవసరాలను తీర్చగల ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరముంది. ఆవ్రా ల్యాబ్స్, రీసెర్చ్ ఫౌండేషన్ గురించి..? 1985-1995 వరకూ ఐఐసీటీ డెరైక్టర్‌గా పనిచేసిన తరువాత రిటైర్మెంట్ వయసు వచ్చేసింది. సీఎస్ఐఆర్లో ఉన్నతస్థాయి పదవి ఇస్తామని కొందరు హామీ ఇచ్చారు. అయితే నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అందరూ చేసే పనిని మనమూ చేయడం కంటే.. ఇతరులకు సాధ్యం కాని పనులను చేసి చూపాలని నిర్ణయించుకున్నా. అయితే రిటైర్మెంట్, పెన్షన్ సొమ్ములను ముట్టుకోనని మా ఆవిడకు మాటిచ్చా కాబట్టి చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. ఆ సమయంలో అమెరికాలోని గార్డన్ రీసెర్చ్ కాన్ఫరెన్స్‌కు వెళ్లడం నాకు కలసివచ్చింది. అక్కడ నా ప్రసంగాన్ని విన్న సైటోమెడ్ కంపెనీ సీఈవో తమకు అసాధ్యమైన ఓ ప్రాజెక్టు చేపట్టగలరా అని కోరారు. అలాగే మరో అమెరికన్ ఫార్మా కంపెనీ ఇంకో సవాలును నా ముందుంచింది. ఆ రెండు ప్రాజెక్టులూ చేపట్టా. అదే సమయంలో డైచీ కర్కారియా లిమిటెడ్ యజమాని డీఎం నటర్వాలా ఓ షెడ్‌ను పరిశోధనశాలగా మార్చి ఇచ్చారు. అంతే అమెరికన్ కంపెనీలు ఇచ్చిన అడ్వాన్స్ మొత్తంతో ఆవ్రా ల్యాబ్స్ ప్రారంభమైంది. భాషా చైతన్యం రావాలి ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగు భాషను సుసంపన్నం చేసేందుకు కృషి చేస్తున్న ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ‘పద్మభూషణ్’ వచ్చిన తర్వాత తొలిసారి విజయవాడ వచ్చిన సందర్భంలో సాక్షితో స్పెషల్ ఇంటర్వ్యూ. ముందుగా మీకు శుభాభినందనలు. చైతన్య యాత్రలు, అవగాహన సదస్సులు, మేలుకొలుపు దీక్షలు అంటూ వినూత్న రీతిలో మీరు పోరాటం చేస్తున్నారు. ఇందులోని అంతరార్థం ఏమిటి? ముందుగా మీ ద్వారా ప్రేక్షకులకు, పాఠకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మూగ ప్రజలు, బధిర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లచేయలేవు అని రాజాజీ అన్నారు. నేను చేస్తున్న తె లుగుభాషా చైతన్య యాత్రలు, అవగాహన సద స్సులు, మేలుకొలుపు దీక్షలు... ప్రజలను, ప్రభుత్వాన్ని చైతన్యవంతుల్ని చేయడం కోసమే. మీరు ప్రారంభించిన మేలుకొలుపు యాత్రలతో ప్రభుత్వంలో ఏపాటి మేలుకొలుపు కలిగిందనుకుంటున్నారు? ప్రభుత్వాలకు వారి ప్రాముఖ్యాలు, ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయి. కాని ఈ రోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ... తెలుగు భాషాసంస్కృతుల పరిరక్షణ, తెలుగువారి ఆత్మగౌరవ నినాదం అనే పునాదుల మీద జన్మించింది. కాబట్టి మిగతా పార్టీల కంటే ఈ పార్టీకి ఎక్కువ బాధ్యత ఉంది. తెలుగును పరిరక్షించుకునే పరిస్థితి ఎందుకొచ్చిందంటారు? తెలుగువారి ఆహార వ్యవహారాల్లో, ఆలోచనా ధోరణిలో, కార్యకుశలతలో విలక్షణత, విశిష్టత ఉంది. అవధాన ప్రక్రియ, పద్యనాటకాలు, పద్యాలు... ప్రపంచంలో మరే ఇతర సాహిత్యంలోనూ లేవు. అలాంటి తెలుగు అంతరించబోతోందని యునెస్కో వారు 15 సంవత్సరాల క్రితం మనల్ని హెచ్చరించారు. కాబట్టి మనం మేల్కోవాల్సి వచ్చింది. భాషా ప్రేమికులు చేస్తున్న ఆందోళనకు మీరు గొంతుగా మారాల్సిన అవసరం ఉందా? భాషా సాహిత్యాల ద్వారానే నేను సమాజంలో ఈ స్థాయికి చేరాను. సమాజానికి తిరిగి ఇవ్వాలనే సంకల్పంతోనే నేను ఈ పని చేస్తున్నాను. ఇంగ్లిషు మీడియం పాఠశాలలు తెరిచి, తెలుగు మీడియం పాఠశాలలను మూసివేయడం దురదృష్టం. కృష్ణానదీ తీరాన మన అమరావతి శంకుస్థాపన శిలాఫలకం ఇంగ్లిషులో ఉంటే, సిగ్గుతో తల వాలిపోయింది. రూ.2 వేలు ఖర్చు పెడితే పక్కనే మళ్లీ తెలుగులో మరొక రాయి వేయవచ్చు. ప్రభుత్వ యంత్రాంగంలో తెలుగు భాష, సంస్కృతుల పట్ల మమకారం లేకపోవడం వల్ల జరిగింది. కాబట్టి మమకారాన్ని వారికి కలిగించే విధంగా తెలియచెప్పాలి. ప్రభుత్వ వ్యవహారాల్లో తెలుగును అధికార భాషగా వినియోగించాలి. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను అమలు చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలైనప్పటికీ ఇందుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మీకేమనిపిస్తోంది? ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తెలుగుని ఒక సబ్జెక్ట్‌గా పెడితే... పిల్లలు ప్రతి క్లాసులో తెలుగు చదువుకుంటారు. కానీ అ ఆ అనే రెండక్షరాలు నేర్చుకోకుండా ఉన్నతవిద్య పూర్తి చేసే సౌకర్యం మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో వారి మాతృభాష తప్పక అధ్యయనం చేయాలి. భూసేకరణ, దేశవిదేశాల్లో పర్యటించి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ... వంటి విషయాల్లో ఎంత శ్రద్ధ, ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారో, తెలుగు భాష సంస్కృతుల విషయంలో అలాగే వ్యవహరించమని సీఎంకి విజ్ఞప్తి చేస్తున్నా. ‘ఈ రాష్ట్రంలో లలిత కళలకి, ప్రాచీన నృత్యరీతులకి ఒక పీఠం పెట్టి, వాటిని ఆదరిస్తామ’ని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి రోజున సీఎం స్వయంగా చెప్పారు. అయితే ఇప్పటివరకూ మొదలైన దాఖలాలు లేవు. ఏ పనీ ప్రణాళికాబద్ధంగా చేయట్లేదు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ, ప్రెస్ అకాడమీ 10వ షెడ్యూల్లో ఉన్నాయి. వాటికి ఇబ్బందులొస్తే వెంటనే ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ మూడింటికీ లేని 10వ షెడ్యూల్ అనే అడ్డంకి తెలుగు వర్సిటీకి ఎందుకు వచ్చింది? అధికారులు సీఎంను తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద భాష పేరు మీద ఏర్పడిన రెండవ విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ మానస పుత్రిక. రాజమండ్రిలో తెలుగు వర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. దానిని వెంటనే ప్రారంభించి తెలుగు భాషాసంస్కృతులపై ఆయన చిత్తశుద్ధి అందరికీ అర్థమయ్యేలా చేయాలి. తెలుగు భాషా పీఠం ఏర్పాటు గురించి... వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రాచీన హోదా సాధించుకున్నాం. ‘నాకివి పెద్దగా తెలియవు. మీరు పర్యవేక్షించి పని పూర్తిచేయండి’ అని ఆయన చెప్పారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే స్పందించేవారు. ఎవరికైనా లేఖ రాయమంటే.. రాయడమే తప్ప, ఎందుకు అని అడగలేదు. అలా ప్రాచీన హోదా సాధించుకున్నాం. ఈ ప్రాచీన భాషల కేంద్రం మైసూరులో ఉంది. ప్రాచీన భాష హోదా ఇచ్చిన తర్వాత తమిళనాడు వారు మా సంస్థ మాకివ్వండి, మా మీద మీరు పరిశోధన చేసేదేంటని కరుణానిధిగారు మద్రాసు పట్టుకెళ్లిపోయారు. అదే ప్రక్రియలో మా పీఠం మాకిచ్చేయండని నేను, లగడపాటి, సబ్బం హరి, కావూరి, రాయపాటి వంటి ఎంపీలనందరితో కపిల్ సిబాల్గారిని కలిసి, మన ఆంధ్రపీఠం మనం తెచ్చుకున్నాం. ఇప్పటికి ఐదేళ్లు దాటినా ఆ పీఠాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయాం. దానికి కేటాయించిన నిధులు ప్రతి సంవత్సరం వస్తున్నాయి, తిరిగి వెళ్లిపోతున్నాయి. ప్రస్తుత కార్యాచరణ ఏమిటి? జిల్లాలవారీ సమావేశాలు నిర్వహించి, అందరి అభిప్రాయాలు సేకరించి, తెలుగు భాషకు సంబంధించి కనీస ఉమ్మడి కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఏప్రిల్ మొదటి వారం నుంచి నేను మేలుకొలుపు యాత్రలు ప్రారంభిస్తాను. ఆ తర్వాత సీఎంని కలసి విజ్ఞప్తి చేస్తాం. తమిళనాడులో తెలుగు విద్యార్థులు పరీక్షలు తెలుగులో రాయకూడదని చేసిన ఉత్తర్వు గురించి... దీనిపై సుప్రీం తలుపు తడదామనుకుంటున్నాను. ఏ రాష్ట్రంలో భాషా అల్ప సంఖ్యాకులు ఉంటారో వారి హక్కులు పరిరక్షించాలని ఆర్టికల్ 29, 30, 351 (ఎ)లో పేర్కొన్నారు. మన రాష్ట్రంలో తెలుగుభాషను మనం కాపాడుకుంటే, మనం ఏ రాష్ట్రం వారినైనా అడగగలుగుతాం. సంగీత సాహిత్యాల ఆదరణ గురించి వివరించండి... ప్రాచీన కాలం నుంచి తెలుగు సాహిత్యాన్ని చూస్తే... రాజాశ్రయం కంటె, జనాశ్రయమే ఫలించింది, పుష్పించింది. అందువల్ల ప్రభుత్వాల కర్తవ్యం గుర్తు చేస్తున్నాను. ఏ ప్రభుత్వమైతే కళల్ని, సాహిత్యాన్ని ఆదరిస్తుందో ఆ ప్రభుత్వం శాశ్వతంగా చరిత్రలో మిగిలిపోతుంది. నేటికీ కృష్ణదేవరాయల పేరు మనం మాట్లాడుకుంటున్నామంటే, అందుకు కారణం ఆయన సాధించిన యుద్ధవిజయాలు కాదు. ఆయన చేసిన భాషా సేవ. అటువంటి పెద్దల్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడుస్తున్నాను. -
'ఎస్' ఫర్ సక్సెస్!
ఆ ఇద్దరూ తమ తమ క్రీడలో ప్రతిభా వంతులే. వారి కెరీర్ లో ఎన్నో అద్భుత విజయాలు.. మరెన్నో మధురానుభూతులు. అంతర్జాతీయ యవనికపై ఎస్ ఫర్ సక్సెస్ అన్న చందంగా రాణిస్తున్నక్రీడాకారిణులు. ఒకరు భారత టెన్నిస్ కు వన్నె తెచ్చిన క్రీడాకారిణి సానియా మీర్జా అయితే మరొకరు బ్యాడ్మింటన్ లో సంచలనాలతో దూసుకుపోతున్న సైనా నెహ్వాల్. తమ ఆటలో ఎన్నో ఎత్తుపల్లాలను చూడటంతో పాటు, అనేక మైలురాళ్లను అందుకుని శభాష్ అనిపించుకున్నారు. కెరీర్ లో పడిపోయిన మరుక్షణమే అంతే వేగంగా పైకి ఎగసి తమకు సాటి లేదని నిరూపించుకున్నారు.. నిరూపించుకుంటూనే ఉన్నారు. తాజాగా ఆ ఇద్దరూ క్రీడాకారిణులు 'పద్మ' అవార్డు పురస్కారానికి ఎంపికయ్యారు. భారత ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో సానియా, సైనాలు పద్మ భూషణ్ అవార్డును అందుకోనున్నారు. ఈ ఏడాది మొత్తం 118 మందికి పద్మఅవార్డులను ప్రకటించగా, 10 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు. గతంలో పద్మ శ్రీ పురస్కారాన్ని ఈ ఇద్దరూ క్రీడాకారిణులు అందుకున్నా.. ఈసారి వారిని పద్మ భూషణ్ వరించింది. తొలిసారి 2004లో అర్జున అవార్డును అందుకున్న సానియా మీర్జా.. 2006లో పద్మ శ్రీ అవార్డును అందుకుంది. ఆ తరువాత 2015లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్నా పురస్కారం సానియాకు లభించింది. మరోవైపు సైనా నెహ్వాల్.. అర్జున అవార్డును 2009లో అందుకోగా, రాజీవ్ గాంధీ ఖేల్ రత్నాను 2009-10 సంవత్సరానికి గాను, అలాగే పద్మశ్రీని అవార్డును 2010 వ సంవత్సరంలో అందుకుంది. -
'పద్మభూషణ్' కోసం రచ్చకెక్కిన మరో ఆటగాడు!
న్యూఢిల్లీ:' పద్మ' అవార్డుల అంశం కేంద్రానికి మరింత తలనొప్పిగా మారింది. భారత నంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఉదంతానికి ముగింపు పలికి కొన్ని గంటలు అయ్యిందో లేదో తన పేరును కూడా పద్మ భూషణ్ అవార్డు కోసం సిఫార్సు చేయాలంటూ బాక్సర్ విజేందర్ రచ్చకెక్కాడు. తనకు పద్మభూషణ్ ఇవ్వాలంటూ ఈ అథ్లెటిక్ పట్టుబడుతున్నాడు. ఈ మేరకు కేంద్ క్రీడా మంత్రిత్వ శాఖకు లేఖ పంపాడు. విజేందర్ సింగ్ 2008 జరిగిన ఒలింపిక్స్ లో కాంస్యం సాధించాడు. అంతకుముందు సైనా నెహ్వాల్ తన పేరును ఖరారు చేయకపోవడంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అటు తరువాత కేంద్ర క్రీడల శాఖ స్వయంగా కల్పించుకుని ఆమె పేరును పద్మ భూషణ్ అవార్డుకు ప్రతిపాదించింది. -
గోపీచంద్‌కు సత్కారం
తణుకు టౌన్, న్యూస్‌లైన్ : దేశంలో బ్యాడ్మింటన్ క్రీడకు అమిత ఆదరణ తెచ్చిన ఘనత పుల్లెల గోపీచంద్‌కే దక్కుతుందని జాతీయ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి కొనియాడారు. పద్మభూషణ్ పురస్కారం అందుకోనున్న సందర్భంగా పుల్లెల గోపీచంద్‌ను స్థానిక ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల యాజమాన్యం సత్కరించింది. క్రీడారంగంలో అర్జున, రాజీవ్ ఖేల్త్న్ర, ద్రోణాచార్య, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి విశిష్ట పురస్కారాలు పొందిన ఏకైక క్రీడాకారుడు గోపీచంద్ ఒక్కరేనన్నారు. -
నా భర్తకు పద్మభూషణ్ వద్దు... వెనక్కి తీసుకోండి
తన భర్త, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి స్వర్గీయ జస్టిస్ జే.ఎస్.వర్మకి కేంద్రం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్లు ఆయన భార్య పుష్పా వర్మ శుక్రవారం స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి శుక్రవారం పుష్ప వర్మ లేఖ రాశారు. తన భర్త వర్మ పురస్కారాలు అందుకోవాలని ఏ రోజు కోరుకోలేదన్నారు. అందుకోసం ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని ఆ లేఖలో గుర్తు చేశారు. వర్మ జీవితంలో అచరించిన ఆశయాలకు పురస్కారాలు విరుద్దమని పేర్కొన్నారు. వర్మ భార్యగా కాకుండా ఆయన మనసెరిగిన మనిషిగా తెలుపుతున్నట్లు ఆమె ఆ లేఖలో వివరించారు. దేశ ప్రజల గుండెలలో ఆయన స్థానం ఎంత పదిలంగా ఉందో తనకు తెలుసునన్నారు. అయితే వర్మకు పద్మ పురస్కారం అందజేయనున్నట్లు ప్రభుత్వం కనీసం తమకు లేఖ ద్వారా కానీ సమాచారం ఇవ్వలేదని పుష్పరాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వర్మకు పద్మభూషణ్ పురస్కారం ఇస్తున్నట్లు మీడియా ద్వారా మాత్రమే తమ కుటుంబానికి తెలిసిందన్నారు. అయితే జనవరి మొదట్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు జె.ఎస్.వర్మ స్వగ్రామం మధ్యప్రదేశ్‌లోని సంతా గ్రామాన్ని సందర్శించి, ఆయన గురించి వాకబు చేశారని ఆయన కుమార్తె సుభ్ర వర్మ వెల్లడించారు. అయిన తన తండ్రి గురించి అంతగా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించింది. అనంతరం తమ నివాసానికి వచ్చి వర్మకు పద్మ పురస్కారాన్ని ఇవ్వదలచుకున్నట్లు చెప్పారని తెలిపారు. 2012 డిసెంబర్ 16న న్యూఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ జె.ఎస్. వర్మ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం మహిళలపై లైంగిక దాడులు నిరోధించేందుకు వర్మ పలు సూచనలు చేశారు. ఆయన సూచనలు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్భయ చట్టం రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది ఏప్రిల్ 22న తీవ్ర అనారోగ్యంతో జస్టిస్ వర్మ మరణించారు. న్యాయరంగానికి జస్టిస్ జె.ఎస్.వర్మ చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్రం ఆయన మరణాంతరం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.